ఆధునిక కాలంలో ఆధార్ కార్డు ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, లైసెన్స్ వంటి వాటికి అప్లై చేసుకోవడానికి ప్రధాన ఆధారం ఆధార్ కార్డే. అయితే ఇంత ముఖ్యమైన ఆధార్ కార్డులో ముఖాలు చాలా వరకు గుర్తు పట్టలేని విధంగా ఉంటాయి. అలాంటి ఫోటోలను మనకు నచ్చిన విధంగా మార్చుకోవడానికి కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి.
ఆధార్ కార్డులో ఫోటో మాత్రమే కాకుండా పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ వంటి వాటిని మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది. బయోమెట్రిక్ మార్చుకోవడానికి ఆధార్ సెంటర్‌కి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇతర వివరాలను ఆన్‌లైన్‌లోనే మార్చుకోవచ్చు.
ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోవడం ఎలా?
- ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోవడానికి ముందుగా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రానికి వెళ్ళాలి.
- https://appointments.uidai.gov.in/ వెబ్ సైట్ ద్వారా కూడా మీకు సమీపంలో ఉన్న ఆధార్ సెంటర్ గురించి తెలుసుకోవచ్చు.
- ఆధార్ సెంటర్ చేరుకున్న తరువాత అక్కడ దానికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ ఫిల్ చేసే అందించాలి. అప్పుడు వారు మీ బయోమెట్రిక్ తీసుకుంటారు.
- ఆధార్ కార్డులో మీ ఫోటో మార్చాలనుకుంటే ఆపరేటర్ ఫోటోగ్రాఫ్ తీసుకుంటాడు.
- కావలసిన అన్నీ తీసుకున్న తరువాత అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ అందిస్తారు.
- ఈ అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ అప్డేట్ రిక్వెస్ట్ గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీని కోసం రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది.
- ఆధార్ కార్డు అప్డేట్ అయిన తరువాత డిజిటల్ కాఫీని అధికారిక వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
(ఇదీ చదవండి: ఒకప్పుడు ఆసియాలో అత్యంత ధనవంతుడు! ఇప్పుడు ఆస్తులు సున్నా అంటున్నాడు..)
నిజానికి ఆధార్ కార్డు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది. ఇందులో 12 అంకెల యూనిక్ నెంబర్ ఉంటుంది. దీనిని యుఐడిఏఐ జారీ చేస్తుంది. ఇది ప్రపంచంలోనే అతి పెడా బయోమెట్రిక్ ఐడి సిస్టం అని చెబుతారు. ఇందులో సంబంధిత వ్యక్తి వేలిముద్రలు మొదలైనవి ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి.
Comments
Please login to add a commentAdd a comment