Aadhaar Update: భారతీయ పౌరులకు ఆధార్ కార్డు ఎంత ప్రధానమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు రావాలన్నా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, డ్రైవింగ్ లైసెన్స్ పొందాలన్నా కూడా ఆధార్ కార్డే ఆధారం. అయితే ఆధార్ కార్డులో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరి చేసుకోవడం మంచిది. అంతే కాకుండా ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు గడిచిన వారు తప్పనిసరిగా ఆధార్ కార్డుని ఉచితంగా అప్డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ గతంలోనే సూచించింది. అయితే ఈ గడువు ఇప్పుడు సమీపిస్తోంది.
గతంలో వెల్లడైన సమాచారం ప్రకారం ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఆధార్ కార్డు వివరాలను రూపాయి చెల్లించకుండా జూన్ 14 లోపల అప్డేట్ చేసుకోవాలి. ఆ తరువాత ఆన్‌లైన్‌లో చేసిన కనీసం రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది.
(ఇదీ చదవండి: మీ పాన్ నెంబర్‌తో ఆధార్ లింక్ అయిందా? ఈ సింపుల్ టెక్నిక్స్‌తో తెలుసుకోండి)
నిజానికి ఈ గడువు మే చివరి నాటికి ముగియాల్సి ఉంది. కానీ అందరూ ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోవడానికి అవకాశం కల్పించాలని 'యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా' ఆధార్ కార్డుని ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేయడానికి అనుమతించింది. కావున ఇప్పటి వరకు ఆధార్ అప్డేట్ చేయని వారు ఈ నెల 14లోపు తప్పకుండా అప్డేట్ చేసుకోవడం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment