ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు పూర్తయిన వారు, కేంద్రం ప్రకటించిన గడువు లోపల అప్‌డేట్ చేసుకోవాలి. లేకుంటే అలాంటి ఆధార్ కార్డులు రద్దవుతాయి. దీనిని ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి డిసెంబర్ 14 చివరి రోజు. ఇప్పటికే.. పలుమార్లు ఈ గడువును పెంచిన కేంద్రం, మళ్ళీ గడువును పెంచుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఆధార్ అప్‌డేట్ అనేది అవసరమా?.. ఇది ఎందుకు పనికొస్తుందనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఒక నగరం నుంచి మరో నగరానికి మారితే? లేదా అడ్రస్ ఏమైనా మార్చుకుంటే.. అలాంటి వారు తమ ఆధార్ కార్డులో కూడా అప్‌డేట్ చేసుకోవాలి. ఇది మాత్రమే కాకుండా.. పేరు, పుట్టిన తేదీ, ఫోటో వంటి వాటిని అప్‌డేట్ చేసుకోవచ్చు.
ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు పూర్తయిన వారు స్థాన చలనం జరగకుండా ఉంటే.. లేదా వ్యక్తిగత వివరాలలో ఎలాంటి అప్‌డేట్ అవసరం లేకుంటే.. అలాంటి వారు తప్పకుండా అప్‌డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే బయోమెట్రిక్, ఫోటో వంటివి అప్డేట్ చేసుకోవడం ఉత్తమం. దీని వల్ల మోసాలను నివారించవచ్చు.
ఆధార్ ఫ్రీ అప్‌డేట్ కోసం గడువును పొడిగించిన ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఈ తేదీని పొడిగిస్తూ ప్రకటనలు జారీ చేశారు. అయితే ఇకపైన లేదా డిసెంబర్ 14 తరువాత గడువును పొడిగించే అవకాశం ఉండకపోవచ్చని సమాచారం. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఆధార్ అప్‌డేట్ చేసుకుంటే.. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఆధార్ సెంటర్‌కు వెళ్లి అప్‌డేట్ చేసుకుంటే మాత్రం.. రూ. 50 అప్లికేషన్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే కంటే ఎక్కువ ఉద్యోగాలు!.. జెప్టో ఫౌండర్
ఆన్‌లైన్‌లో ఆధార్ అప్‌డేట్ చేసుకోవడం ఎలా?
➠మైఆధార్ పోర్టల్ ఓపెన్ చేయండి
➠లాగిన్ బటన్ మీద క్లిక్ చేసి.. మీ 16 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, దానికింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
➠నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసిన తరువాత లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి.
➠రిజిస్టర్ మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
➠అక్కడే డాక్యుమెంట్స్ అప్డేట్, అడ్రస్ అప్డేట్ వంటివన్నీ కనిపిస్తాయి.
➠మీరు ఏదైనా అప్డేట్ చేయాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు. అయితే దీనికి అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
➠అవసరమైనవన్నీ అప్డేట్ చేసుకున్న తరువాత మీరు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ పొందుతారు. దీని ద్వారా డాక్యుమెంట్ అప్‌డేట్‌ను ట్రాక్ చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment