Number
-
Pranab Mukherjee: 13 అశుభం.. ఆ మాజీ రాష్ట్రపతికి అత్యంత శుభం?
ఈరోజు డిసెంబరు 11.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జన్మదినం. ఆయన 1935, డిసెంబర్ 11న పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లా మిరాటి గ్రామంలో జన్మించారు. 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ దేశానికి ఎనలేని సేవలు అందించారు. ఆయన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖల బాధ్యతలను కూడా చేపట్టారు. 2020 ఆగస్టులో కన్నుమూసిన ప్రణబ్ ముఖర్జీ జీవితంలో 13వ నంబరుకు ప్రత్యేక స్థానముంది.చాలామంది 13వ నంబరును అశుభ సంఖ్యగా పరిగణిస్తారు. పాశ్చాత్య దేశాల్లో 13వ నంబరుపై ఉండే భయాన్ని ట్రిస్కైడెకాఫోబియా అంటారు. ముఖ్యంగా అమెరికా, ఐరోపా దేశాలలోని ప్రజలు 13 సంఖ్యను అశుభ సూచికగా చెబుతారు. దీనివెనుక పలు కారణాలను కూడా చెబుతుంటారు. అయితే ఇదే 13వ సంబరు ప్రణబ్ ముఖర్జీ జీవితంలో అదృష్ట సంఖ్యగా మారింది. ఆయన జీవితంలోని అన్ని ముఖ్యమైన సంఘటనలు 13వ నంబర్‌తో ముడిపడి ఉన్నాయి.ప్రణబ్ ముఖర్జీ వివాహందివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వైవాహిక జీవితం 13వ సంఖ్యతో ప్రారంభమైంది. ఆయన 1957, జూలై 13న వివాహం చేసుకున్నారు.రాజ్యసభకు..ప్రణబ్ ముఖర్జీ నాటి ప్రధాని ఇందిరాగాంధీకి సన్నిహితునిగా పేరొందారు. ఆమె ప్రణబ్ ముఖర్జీని 1969లో పశ్చిమ బెంగాల్ నుండి రాజ్యసభకు పంపారు. ప్రణబ్ ముఖర్జీ మొదటిసారిగా 1969 జూలై 13న పార్లమెంటులో ప్రవేశించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా..యూపీఏ ప్రభుత్వ హయాంలో రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారి ప్రణబ్ ముఖర్జీ పేరు తెరపైకి వచ్చిన తేదీ కూడా 13 కావడం విశేషం. 2012, జూన్ 13న యూపీఏ ముందుకు రెండు పేర్లు వచ్చాయి. ఒకరు ప్రణబ్ ముఖర్జీ. మరొకరు హమీద్ అన్సారీ. సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ పేర్లను మమతా బెనర్జీ అందరి ముందుకు తీసుకువచ్చారు.13వ రాష్ట్రపతిగా..ప్రణబ్ ముఖర్జీ దేశ 13వ రాష్ట్రపతి అయ్యారు. ఈ సమయంలో ఆయనకు ప్రభుత్వం 13వ నంబరు బంగ్లాను కేటాయించింది. ప్రణబ్ ముఖర్జీ 1996 నుండి 2012 వరకు ఢిల్లీలోని తల్కటోరిలోని 13వ నంబర్ బంగ్లాలో నివసించారు. 13వ నంబర్‌తో ప్రణబ్ ముఖర్జీకి ఉన్న అనుబంధం ఆయన జీవితంలోని చిరస్మరణీయ క్షణాలుగా మారాయి. ఇది కూడా చదవండి: నేడు గీతా జయంతి: రూపాయికే భగవద్గీతను అందిస్తూ.. గీతాప్రెస్ వందేళ్ల ఘన చరిత్ర -
మాస్క్డ్ ఆధార్ కార్డు గురించి తెలుసా?: ఇది చాలా సేఫ్..
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో కొంతమంది.. ఇతరుల ఆధార్ కార్డు నెంబర్‌ను కొన్ని అనధికార కార్యకలాపాలకు వినియోగిస్తారు. అసలు ఆ వ్యక్తికే తెలియకుండా ఈ చర్య జరిగిపోతుంది. కాబట్టి మన ఆధార్ కార్డు నెంబర్ సురక్షితంగా ఉండాలంటే.. మాస్క్డ్ ఆధార్ కార్డును ఉపయోగించుకోవచ్చు. ఇంతకీ మాస్క్డ్ ఆధార్ కార్డ్ అంటే ఏమిటి? దీనిని ఎక్కడ, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.ఆధార్ కార్డు దుర్వినియోగానికి చరమగీతం పాడటానికి కేంద్రం ఈ మాస్క్డ్ ఆధార్ కార్డును తీసుకువచ్చింది. ఆధార్ కార్డును తప్పనిసరిగా సమర్పించాల్సిన అవసరం లేని.. లేదా ఈకేవైసీ మాత్రమే ఇవ్వాల్సిన చోట మాస్క్డ్ ఆధార్ కార్డును ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఈ తరహా ఆధార్ కార్డులో కేవలం చివరి నాలుగు నెంబర్లు మాత్రమే కనిపిస్తాయి. మాస్క్డ్ ఆధార్ కార్డుసాధారణ ఆధార్ కార్డులో 12 అంకెలు ఉంటాయని అందరికి తెలుసు. కానీ మాస్క్డ్ ఆధార్ కార్డులో కేవలం చివరి నాలుగు అంకెలు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ముందు ఉన్న ఎనిమిది అంకెలకు మాస్క్ ఉంటుంది. అంటే.. ఆ ఎనిమిది నెంబర్లు కనిపించవన్నమాట. దీనిని ఉపయోగించడం వల్ల ఇతరులు మీ ఆధార్ నెంబర్‌ను దుర్వినియోగం చేయడానికి అవకాశం లేదు.మాస్క్డ్ ఆధార్‌ని డౌన్లోడ్ చేయడం ఎలా?•మాస్క్డ్ ఆధార్‌ని డౌన్లోడ్ చేసుకోవాలనుకునేవారు ముందుగా అధికారిక UIDAI వెబ్సైట్ ఓపెన్ చేయాలి.•వెబ్సైట్ ఓపెన్ చేసిన తరువాత డౌన్లోడ్ ఆధార్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయాలి.•తరువాత 12 ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, దాని కింద ప్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.•ఆలా చేసిన తరువాత రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబరుకు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి అక్కడ మాస్క్డ్ ఆధార్ కావాలా? అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.•ఆలా చేసిన తరువాత మీకు మాస్క్డ్ ఆధార్ కార్డు పీడీఎఫ్ రూపంలో డౌన్లోడ్ అవుతుంది. దీనిని పాస్వర్డ్ ఉపయోగించి ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: మొబైల్ యూజర్లకు ట్రాయ్ హెచ్చరికపాస్వర్డ్ ఏమిటంటే•మాస్క్డ్ ఆధార్ డౌన్లోడ్ అయిన తరువాత పాస్వర్డ్ ఉపయోగించి ఓపెన్ చేసుకోవాలి.•పాస్వర్డ్ ఏమిటంటే.. ఉదాహరణకు మీ పేరు RAGHURAMARAJU అనుకుందాం. మీరు పుట్టిన సంవత్సరం 1994 అనుకుంటే..•మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలు, పుట్టిన సంవత్సరం కలిపితే అదే పాస్వర్డ్ (RAGH1994) అవుతుంది. దీనిని ఉపయోగించి మాస్క్డ్ ఓపెన్ చేసుకోవచ్చు. -
మూడు లక్షలకు అమర్నాథ్ యాత్రికుల సంఖ్య
అమర్‌నాథ్‌లోని మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు జమ్ముకశ్మీర్‌కు తరలివస్తున్నారు. ఆదివారం నాటికి యాత్రికుల సంఖ్య మూడు లక్షలు దాటే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. శనివారం అమరనాథుణ్ణి 14,200 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇప్పటి వరకు 2,93,929 మంది భక్తులు అమర్నాథ్కు తరలివచ్చారు.అమరనాథుణ్ణి త్వరగా దర్శించుకోవాలనే ఉత్సాహం భక్తుల్లో కనిపిస్తోంది. ఇందుకోసం టోకెన్లు పొందేందుకు, భక్తులు తెల్లవారుజాము నుంచే సేవా కేంద్రాలకు చేరుకుంటున్నారు. తాజాగా 1,630 మంది భక్తులు 74 చిన్న, పెద్ద వాహనాల్లో జమ్ము నుంచి బల్తాల్‌కు బయలుదేరారు. వీరిలో 1068 మంది పురుషులు, 546 మంది మహిళలు, 16 మంది పిల్లలు ఉన్నారు. అదేవిధంగా పహల్గాం మార్గంలో 109 చిన్న, పెద్ద వాహనాల్లో 3039 మంది భక్తులు కశ్మీర్‌కు తరలి వెళ్లారు. వీరిలో 2350 మంది పురుషులు, 584 మంది మహిళలు, ఏడుగురు పిల్లలు, 96 మంది సాధువులు, ఇద్దరు సాధ్వులు ఉన్నారు. కాగా ఆగస్టు 19న అమర్నాథ్ యాత్ర ముగియనుంది. -
ఏజ్ ఈస్ జస్ట్ నెంబర్: నలభైలలో ఆ మదర్స్..!
చాలామంది వివిధ కళలు నేర్చుకోవాలనుకుంటారు. కొన్ని కారణాల రీత్యా సాధ్యం కాకపోవచ్చు. మరికొందరూ వయసు మీదపడ్డ దాన్ని వదలక ఎలాగైనా నేర్చుకోవాలని తపన పడుతుంటారు. అలాంటి కోవకు చెందని వారే ఈ ముగ్గురు తల్లులు. నాలుగు పదుల వయసులో ఏ మాత్రం సంకోచించకుండా భరతనాట్యం నేర్చుకునేందుకు ముందుకు రావడమేగాక శభాష్ అనే రేంజ్లో ప్రదర్శనలు ఇచ్చారు. ఎవరంటే ఆ ముగ్గురు.. నలభైల వయసులో ఉన్న ముగ్గుర మహిళలు ఏ మాత్రం సంకోచించకుండా కోరమంగళలోని నృత్య స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో జాయిన్ అయ్యి భరతనాట్యం నేర్చుకున్నారు. అంత ఏజ్‌లో ఉన్నామన్నా.. బిడియాన్ని పక్కన పెట్టిమరీ తమకిష్టమైన కళపై దృష్టిసారించారు ఆ ముగ్గరు తల్లులు. గురువు గాయత్రి చంద్రశేఖర్ మార్గదర్శకత్వంలో అద్భుతమైన మెళుకవలు నేర్చుకున్నారు. వాళ్లేవరంటే....తమిళనాడుకి చెందిన లక్ష్మీ రమణి, సుమన్ వెలగపూరి, రాజస్థాన్‌కి చెందిన మోనికా లధాలు.. ముగ్గుర మదర్స్‌లో ఒకరు కుటుంబాన్ని, మిగతా ఇద్దరూ ప్రొఫెషన్ని పక్కన పెట్టి మరీ కళకు అంకితమై నేర్చుకున్నారు. ఆ ముగ్గరు తల్లలు బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్స్ ప్రాంతంలోని సీఎంఆర్ఐటీ ఆడిటోరియంలో ప్రదర్శనలు ఇచ్చారు. ఆ వేదికపై ముగ్గురు తల్లులు సోలో, సంయుక్త ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. వాళ ప్రదర్శన అనంతరం అక్కడి హాల్ అంతా కరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోయింది. ఈ ఏజ్‌లో ఇంత బాగా ప్రదర్శన ఇస్తున్నా ఆ ముగ్గరు ఎవ్వరూ.. అని అందరిలో తీవ్ర ఆసక్తి నెలకొంది. ప్రదర్శన అనంతరం ఒక్కొక్కరిగా తమ నేపథ్యం వివరిస్తూ..ముందుగా తమిళనాడుకు చెందిన లక్ష్మీ రమణి (44) మైక్ పట్టుకుని మాట్లాడుతూ..తన కలను సాకారం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన అత్తగారి గురించి చెబుతూ కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇక మరో తల్లి సుమన్ వెలగపూడి(47) క్లౌడ్‌లో కస్టమర్ సర్వీస్ వైస్ ప్రెసిడెంట్‌గా కెరీర్‌ని విడిచిపెట్టి మరీ భరతనాట్యం నేర్చుకుంది. తనకు డ్యాన్స్‌పై ఉన్న మక్కువతో కొన్నాళ్లు పార్ట్ టైంగా నేర్చుకున్నాని, ఆ తర్వాత ఇక పూర్తిగా దీనికే టైం కేటాయించాలని ఉద్యోగాన్ని వదిలేశానని చెప్పుకొచ్చింది సమన్. పెద్ద కార్పోరేట్ ఉద్యోగాన్ని వదిలేయడం పెద్ద సాహసమే అయినప్పటికీ, అందుకు సహకరించిన తన కుటుంబ సభ్యులకు ఎంతగానో రుణపడి ఉంటానాని భావోద్వేగంగా మాట్లాడింది. ఇక చివరిగా రాజస్థాన్‌కి చెందని 46 ఏళ్ల మోనికా లధా ఓ పక్కన భరతనాట్యం నేర్చుకుంటూనే ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పనిచేసేది. చిన్న కుమార్తె ఈ చార్టర్ అకౌంటెంట్. ఆమె కూడా దక్షిణా భారత శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించడం విశేషం. ఎందుకంటే రాజస్తాన్ వాళ్లు ఉత్తరాది శాస్తియ నృత్యమైన కథక్ని అభ్యసిస్తుంటారు. ఇక మోనిక తనకు డ్యాన్స్ అంటే బాగా ఇష్టమని, భరతనాట్యం లాంటివి నేర్చుకోవాలన్నిది తన ప్రగాఢ కోరిక అని చెప్పుకొచ్చింది. ఈ విషయంలో తన భర్త వివేక్ లధా ఇచ్చిన ప్రోత్సాహన్ని మరవలేనదని ఉద్వేగంగా చెప్పింది. ఇక గురువు గాయత్రీ దేవి మాట్లాడుతూ, ఆ మహిళల ప్రదర్శనను చూసి స్ఫూర్తి పొందానని చెప్పారు. క్రమశిక్షణ, నేర్చుకోవాలన్న తపనా ఉంటే ఏదైనా సాధ్యమే అని అన్నారు. ఈ ముగ్గురు తమ కళా నైపుణ్యంతో వయసు కేవలం నెంబర్ మాత్రమే అని ప్రూవ్ చేసి చూపించారు. నిజంగా మన భారతీయ కళలు ఎంతో గొప్పవి కదూ. అవి ఎంతటి విద్యా వంతుడిని, అధికారినైనా ఆకర్షించి నేర్చుకునేలా చేస్తాయి. (చదవండి: పైథాని చీరలో అదిరిపోతున్న నీతా అంబానీ..ఆ చీర స్పెషల్ ఏంటంటే..!) -
దేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక జిల్లాలున్నాయి?
‘ఈ దేశంలో ఉంటూ.. ఈ దేశానికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకోకపోతే ఎలా?’ అని చాలామంది అంటుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల వివరాలు తెలుసుకోవడం ఎవరికైనా తప్పనిసరి. అందుకే మన దేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక జిల్లాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో వైశాల్యం పరంగా రాజస్థాన్‌ను అతిపెద్ద రాష్ట్రంగా పరిగణిస్తారు. జనాభా కోణంలో చూస్తే ఈ టైటిల్ ఉత్తరప్రదేశ్‌కు దక్కుతుంది. అయితే మన దేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక జిల్లాలు ఉన్నాయి? అవి ఎన్ని? అనే విషయాన్ని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అందుకే ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో అత్యధిక జిల్లాలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఈ రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 75. ఇవి 2,40,928 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఈ జిల్లాలను 18 డివిజన్లుగా విభజించారు. రాష్ట్రంలో 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 822 కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాకులు, 350 తహసీల్లు కూడా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అతిపెద్ద జిల్లా లఖింపూర్ ఖేరీ. ఇది దాదాపు 10.1 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. లఖింపూర్ ఖేరీ పొరుగు దేశం నేపాల్‌తో సరిహద్దును పంచుకుంటుంది. ఈ జిల్లాలో గోమతి, శారద, కథన తదితర నదులు ప్రవహిస్తున్నాయి. యూపీలోని అతి చిన్న జిల్లా హాపూర్. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో జిల్లాలు కలిగిన రెండవ రాష్ట్రం మధ్యప్రదేశ్. ఈ రాష్ట్రంలో మొత్తం 52 జిల్లాలు ఉన్నాయి. రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా చింద్వారా. ఈ జాబితాలో మూడవ స్థానంలో బీహార్ ఉంది. ఈ రాష్ట్రంలో మొత్తం 38 జిల్లాలున్నాయి. 101 సబ్ డివిజన్లు, 534 సిడి బ్లాక్‌లు ఉన్నాయి. బీహార్‌లోని అతిపెద్ద జిల్లా పట్నా. ఇది బీహార్ రాజధాని. పట్నా పలు ప్రత్యేకతలు కలిగిన ప్రాంతం. -
మొబైల్ నంబర్.. మీకు నచ్చినట్టు..
ఈరోజుల్లో ప్రతిఒక్కరికీ మొబైల్ ఫోన్ ఉంటుంది. ఫోన్ లేనివారు ఉండటం చాలా అరుదు. ఇప్పుడన్నీ డ్యుయల్ సిమ్ ఫోన్ కావడంతో చాలా మందికి రెండు ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి. ఇంకొంత మందికి అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఏదైనా టెలికామ్ సంస్థ నుంచి కొత్తగా సిమ్ తీసుకుంటున్నప్పుడు చాలామంది తమకు నచ్చిన కస్టమైజ్డ్ మొబైల్ నంబర్లను ఇష్టపడతారు. కొంతమందికి ప్రత్యేకమైన ఇష్టమైన నంబర్లు ఉంటే, మరికొందరు కొన్ని నంబర్లను అదృష్టంగా భావిస్తారు. ఇలా మంచి నంబర్ల కలయిక కోసం శోధిస్తారు. అయితే తమకు కావలసిన నంబర్ కాంబినేషన్లను ఎంచుకునే అవకాశం ఉందని చాలా మందికి తెలియదు. వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్, రిలయన్స్‌తో సహా భారతీయ టెలికాం మార్కెట్లోని కొన్ని కంపెనీలు ఆసక్తిగల సబ్స్క్రైబర్లకు వారికి నచ్చిన మొబైల్ నంబర్ల నిర్దిష్ట అంకెలను అందిస్తున్నాయి. వీటిలో రిలయన్స్ జియో తక్కువ ధరకే ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు కావాల్సిన నిర్దిష్టమైన మొబైల్ నంబర్లను అందిస్తోంది. ఈ ఛాయిస్ నంబర్ స్కీమ్ ద్వారా కస్టమర్లు పూర్తి నంబర్‌ను ఎంచుకోలేనప్పటికీ తమ కొత్త జియో నంబర్లోని చివరి 4 నుంచి 6 అంకెలను ఎంచుకోవచ్చు. -
భార్య జెర్సీ నెంబర్ తో అదరగొడుతున్న రుతురాజ్ గైక్వాడ్..!
-
ఒడిశా రైలు ప్రమాదం: ఇంకా గుర్తించని 81 మృతదేహాలు
ఒడిశాలోని బాలాసోర్‌లో జూన్ 2న జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగి 110 గంటలు గడిచినప్పటికీ ఇంకా 81 మృతదేహాలను ఇంకా గుర్తించలేదు. 205 మృతదేహాలను మాత్రమే గుర్తించారు. మిగిలిన మృతదేహాలను గుర్తించేందుకు భారతీయ రైల్వే వార్తాపత్రికలలో ప్రకటనల ద్వారా ప్రజల సహాయాన్ని కోరుతోంది. రైల్వే విభాగం ఒక వెబ్సైట్ లింకును ప్రకటిస్తూ దానిలో మృతదేహాల ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ సమాచారం వీలైనంతమందికి చేరితే మృతుల కుటుంబాలకు ఈ విషయం తెలుస్తుందని రైల్వేశాఖ భావిస్తోంది. భారతీయ రైల్వే www.srcodisha.nic.in వెబ్సైట్లో మృతుల ఫొటోలను ఉంచింది. ఈ మృతదేహాలను బాడీ నంబరు 1, 2, 3... 151, 152... 288లుగా పేర్కొంది. కాగా ఈ ఫొటోలలో ఘటన తాలూకా భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని మృతదేహాలు చిధ్రమైపోయిన స్థితిలో ఉన్నాయి. రైల్వే విభాగం వార్తా పత్రికలలో ప్రకటనలు ఇవ్వడంలో పాటు హెల్ప్‌లైన్ నంబర్లు(139, 1929, 1800-3450061) కూడా ఇచ్చింది. దీనితోపాటు ప్రమాదానికి సంబంధించిన అన్ని వివరాలను www.osdma.org అనే వెబ్సైట్లో ఉంచింది. గాయపడినవారి వివరాలను www.bmc.gov.in వెబ్సైట్లో తెలియజేసింది. ఈ ప్రమాదంలో 1100 మంది గాయపడగా, వారిలో 900 మంది చికిత్స పొందిన అనంతరం ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 200 మంది బాధిత ప్రయాణికులు ఇంకా వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. చదవండి: శవాల కుప్పలోంచి కుమారుని శరీరాన్ని బయటకు లాగి... -
ఆధార్ బిగ్ అప్డేట్ ఒక్క ఫోన్ తో ఆధాార్ సమస్యలకు చెక్
-
ఆధార్ కార్డ్ పోయిందా.. నంబర్ కూడా గుర్తులేదా.. ఎలా మరి?
దేశంలో ఆధార్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరికీ చాలా కీలకమైన డాక్యుమెంట్. అనేక ప్రభుత్వ పథకాలకు, ఆర్థిక లావాదేవీలకు ఇది చాలా అవసరం. మరి ఇంత ముఖ్యమైన ఆధార్ కార్డ్‌ను పోగొట్టుకుంటే.. ఆధార్ నంబర్ కూడా గుర్తు లేకుంటే ఏం చేయాలి.. డూప్లికేట్ ఆధార్ ఎలా పొందాలి? ఆధార్ కార్డ్ మన రోజువారీ జీవనంలో భాగమైపోయింది. బ్యాంకు వెళ్లినా.. ఏదైనా ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేయాలన్నా ఆధార్ కార్డ్ చాలా ముఖ్యమైపోయింది. ఒక వేళ మన ఆధార్ కార్డ్ పోగొట్టుకునిపోతే ఆధార్ నంబర్ గుర్తుంటే ఈ ఆధార్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఆ నంబర్ కూడా గుర్తు లేనప్పుడు ఆధార్ కార్డ్‌ను పొందడం ఎలాగో తెలియక తికమక పడుతుంటారు. ఇప్పుడు ఆధార్ నంబర్ గుర్తు లేకపోయినా సరే ఆధార్ కార్డ్ పొందవచ్చు. ఇదీ చదవండి: ఆధార్ కొత్త ఫీచర్: ఓటీపీ మీ మొబైల్ నంబర్‌కే వస్తోందా? ఆధార్ నంబర్ ఉంటే.. https://uidai.gov.in లేదా https://resident.uidai.gov.inని సందర్శించండి ‘ఆర్డర్ ఆధార్ కార్డ్’ను క్లిక్ చేయండి 12 అంకెల ఆధార్ నంబర్, 16 అంకెల వర్చువల్ ఐడెంటిఫికేషన్ నంబర్ లేదా 28 అంకెల ఎన్రోల్మెంట్ నంబర్ నమోదు చేయండి. స్క్రీన్‌పై ఇతర వివరాలు, సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేయండి. తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేయండి అనంతరం మీ మొబైల్ నంబర్‌కు ఆధార్ నంబర్ లేదా ఎన్రోల్మెంట్ నంబర్ వస్తుంది. మళ్లీ యూఐడీఏఐ సెల్ఫ్-సర్వీస్ పోర్టల్‌ని సందర్శించి ‘డౌన్లోడ్ ఆధార్’పై క్లిక్ చేయండి. ఆధార్ నంబర్ లేకపోతే.. https://myaadhaar.uidai.gov.in/retrieve-eid-uidని సందర్శించండి. ఆధార్ నంబర్ కావాలో లేదా ఎన్రోల్మెంట్ ఐడీ కావాలో ఎంచుకోండి. పేరు, మొబైల్ నంబర్ లేదా మెయిల్ ఐడీ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీపై క్లిక్ చేయండి. తర్వాత ఓటీపీ నమోదు చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా మెయిల్ ఐడీకి ఆధార్ నంబర్ లేదా ఎన్రోల్మెంట్ ఐడీ వస్తుంది. యూఐడీఏఐ హెల్ప్‌లైన్ ద్వారా.. యూఐడీఏఐ హెల్ప్‌లైన్ నంబర్ 1800 180 1947 లేదా 011 1947కు డయల్ చేయండి మీ ఆధార్ కార్డును తిరిగి పొందడానికి అవసరమైన ఆప్షన్ ఎంచుకోండి. అన్ని వివరాలను నమోదు చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా మెయిల్ ఐడీకి ఆధార్ నంబర్ వస్తుంది. ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవడానికి యూఐడీఏఐ సెల్ఫ్ సర్వీస్ పోర్టల్‌ని సందర్శించండి. ఇదీ చదవండి: Jio-bp premium diesel: జియో ప్రీమియం డీజిల్.. అన్నింటి కంటే తక్కువ ధరకే! -
బీజేపీకి అచ్చిరాని 13! గతంలోనూ ఇలా..
సైన్స్ అండ్ టెక్నాలజీలో దూసుకుపోయే పాశ్చాత్య దేశాలు సైతం వణికిపోచే నెంబర్ 13. దురదృష్ట సంఖ్యగా, అపశకునంగా భావిస్తాయి చాలా దేశాలు(మన దేశంలో కాదులేండి). అందుకే ఆ నెంబర్‌కు దూరంగా ఉండే యత్నం చేస్తుంటారు. అయితే ఈ నెంబర్ భారతీయ జనతా పార్టీకి కూడా అచ్చిరాదేమో అనిపిస్తోంది. ఆ సెంటిమెంట్ ఇవాళ్టి(మే 13వ తేదీ) కర్ణాటక ఎన్నికల ఓటమి ఫలితంతో బలపడగా.. అంతకు ముందు జరిగిన పరిణామాలను ఓసారి గమనిస్తే.. 👉 దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని వాజ్‌పేయి నేతృత్వంలో 1996 మే 16వ తేదీన ఏర్పాటు చేసింది బీజేపీ. అయితే, మెజార్టీని నిరూపించుకోలేకపోవడంతో కేవలం 13 రోజుల్లోనే ప్రధాని పదవికి వాజ్‌పేయి రాజీనామా చేశారు. 👉 1996-1998 మధ్న రెండు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు పడియాయి. ఆపైత లోక్‌సభ రద్దై, 1998 లో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ 182 సీట్లు గెలుచుకుంది. అయితే ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టకుని ఎన్టీయే కూటమిగా ఏర్పడిన బీజేపీ.. వాజ్‌పేయిని మళ్ళీ ప్రధానిని చేసింది. కానీ, ఏడాది తిరిగాక.. కూటమికి పగళ్లు వచ్చాయి. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన జయలలిత నాయకత్వంలోని ఏఐఏడీఎంకే మద్దతు ఉపసంహరించుకోవడంతో మరోసారి అటల్జీ ప్రభుత్వం మెజారిటీని కోల్పోయింది. 1999 ఏప్రిల్ 17న జరిగిన విశ్వాస పరీక్షలో ఒక్క ఓటుతో ఓడిపోవడంతో ప్రధాని పదవికి వాజ్‌పేయి రాజీనామా చేశారు. అలా రెండోసారి వాయ్‌పేయి నేతృత్వంలోని బీజేపీ సర్కార్ కూడా కేవలం 13 నెలల కాలం కొనసాగింది. 👉 ఇక మే 13వ తేదీ సైతం బీజేపీ కలిసి రాలేదేమో!. 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వాజ్‌పేయి నేతృత్వంలోని బీజేపీ సర్కార్ ఓటమి పాలైంది. అయితే అప్పుడు ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది మే 13వ తేదీనే. 👉 2004లోనే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే 13 సెంటిమెంట్‌ను పరిగణనలోకి తీసుకుందో ఏమో.. ఆ ఏడాది అక్టోబర్ 13వ తేదీన జరగాల్సిన పోలింగ్‌ను వాయిదా వేయాలంటూ అప్పట్లో బీజేపీ అప్పటి మిత్రపక్షం శివసేనతో కలిసి ఈసీకి విజ్ఞప్తి చేసింది. ఆ తేదీన సర్వ ప్రీతి అమవాస్య ఉందని, హిందువులకు పవిత్రమైన ఆ తేదీన ఎన్నికలు జరపొద్దని కోరింది. కానీ, ఈసీ ఆ విజ్ఞప్తిని పట్టించుకోలేదు. ఆ ఎన్నికల్లో కూటమి దారుణంగా ఓటమిపాలైంది. 👉 2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ 13 ఫలితం రిపీట్ అయ్యింది. మే 13 అంటే ఇవాళ జరిగిన కౌంటింగ్‌లో అధికార పార్టీ హోదాలో బీజేపీ కన్నడనాట దారుణంగా ఓటమి పాలైంది. దీంతో 13 సెంటిమెంట్ బీజేపీ శ్రేణుల్లో మరింత బలపడే ఛాన్స్ కనిపిస్తోంది. -
ఎమర్జెన్సీకి ఫోన్ చేసి తల్లిని కాపాడిన 4ఏళ్ల బుడతడు
నాలుగేళ్ల చిన్నారి ఎమర్జెన్సీ నెంబర్‌కి కాల్చేసి మరీ తన తల్లిని కాపాడుకున్నాడు. అసలేం జరిగిందంటే...తస్మానియాకి చెందిన నాలుగేళ్ల బాలుడు రెండు రోజుల క్రితమే అంబులెన్స్‌కి సంబంధించిన ఎమర్జెన్సీ నెంబర్ని ఎలా డయల్ చేయాలో నేర్చుకున్నాడు. అనుకోకుండా ఆ తర్వాత రోజు ఆమె తల్లి మూర్చతో కింద పడిపోయింది. దీంతో సదరు బాలుడు ఆ ఎమర్జెన్సీ నెంబర్ '000కి' కాల్ చేసి అమ్మ కింద పడిపోయిందని చెప్పాడు. వెంటనే పారామెడికల్స్ వచ్చి ఆ బాలుడి తల్లికి సకాలంలో వైద్యం అందించి ఆమెను రక్షించారు. అంతేకాదు సదరు అంబులెన్స్ పారామెడికల్ అధికారులు ఆ బాలుడి ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఒక సర్టిఫికేట్‌ని కూడా ప్రధానం చేశారు. ఆ బాలుడి తల్లి ఒక నర్సు ఆమె ఫోన్ అన్‌లాక్‌లో ఉంటే ఎలా ఓపెన్ చేయాలో, ఎమర్జెన్సీ నెంబర్‌కి ఎలా కాల్ చేయాలో నేర్పించినట్లు తెలిపారు. అదే ఈ రోజు తన జీవితాన్ని కాపాడుతుందని ఊహించలేదని చెప్పారు. ప్రస్తుతం తన కొడుకు ఒక చిన్న హిరో అయిపోయాడంటూ మురిసిపోయారు. ఈ ఘటనతో ఆ బాలుడు వార్తల్లో నిలిచాడు. అంతేకాదు ఈ విషయం సోషల్ మాధ్యమాలో కూడా తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఆ పిల్లవాడి ధైర్యాన్ని మెచ్చుకుంటూ...చిన్న ఛాంపియన్ అని ప్రశంసిస్తున్నారు. (చదవండి: వైట్ హౌస్‌లో సందడి చేసిన బరాక్ ఒబామా దంపతులు) -
డయల్ 112
సాక్షి, హైదరాబాద్: దేశంలోని అత్యవసర సేవలన్నీ ఒక్కతాటిపైకి రాబోతున్నాయి. ఇందుకోసం నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం (ఎన్‌ఈఆర్‌ఎస్) పేరుతో మైక్రో మిషన్‌ను కేంద్ర హోం శాఖ చేపట్టింది. ఈ ప్రాజెక్టు కోసం ‘112’నంబర్‌ను కేటాయించింది. ఇప్పటికే రాష్ట్రాల్లో అమలు లో ఉన్న 100, 101, 108 తదితర ఎమర్జెన్సీ నంబర్లను దీని పరిధిలోకి తీసుకొస్తోంది. వీలైనంత త్వరగా ‘112’ను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర పోలీసు విభాగం కూడా కొత్త నంబర్‌పై ప్రచారం చేయాలని నిర్ణయించింది. డయల్ 100కు కాల్ చేసిన వారికి వచ్చే సందేశంలో 100కు బదులుగా డయల్ 112 అంటూ పొందుపరిచింది. దేశంలో 36 చోట్ల 24 గంటల కాల్ సెంటర్లు ‘112’వ్యవస్థలో భాగంగా దేశవ్యాప్తంగా 36 చోట్ల 24 గంటలు నిర్విరామంగా పనిచేసే కంట్రోల్ రూమ్ తరహా కాల్ సెంటర్లను కేంద్రం ఏర్పాటు చేసింది. పోలీసు, మెడికల్, ఫైర్, విపత్కర పరిస్థితుల్లో ఉన్న మహిళలు సహా ఇబ్బందులు, సమస్యల్లో ఉన్న బాధితులు మొత్తం 9 రకాల అత్యవసర సేవలకు ఈ కాల్ సెంటర్‌ను ఆశ్రయించేలా ఏర్పాటు చేస్తోంది. ల్యాండ్‌లైన్, సెల్‌ఫోన్ ద్వారా కాల్, ఎస్సెమ్మెస్, ఈ మెయిల్, చాట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్‌లో ఏర్పాటు చేసే ప్యానిక్ బటన్, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్, మొబైల్ యాప్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ).. ఇలా అన్ని మాధ్యమాల ద్వారా కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చేలా చర్యలు చేపట్టింది. ఫోన్ చేస్తే ఎక్కడున్నారో కనిపెట్టేలా.. అత్యవసర సాయం కోసం బాధితులు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసేటప్పుడు.. అన్ని సందర్భాల్లో పూర్తి వివరాలు అందించే పరిస్థితిలో ఉండరు. సమాచారం అందగానే ఎంత తక్కువ సమయంలో పోలీసులు స్పందిస్తే బాధితులకు అంత ఊరట ఉంటుంది. కాబట్టి కంట్రోల్ రూమ్‌కు వచ్చిన కాల్, మెసేజ్, మెయిల్ ఏ ప్రాంతం నుంచి వచ్చిందో సాంకేతికంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. దీన్ని గుర్తించేందుకు రాష్ట్ర పోలీసుల దగ్గర ఇప్పటికే కొంత పరిజ్ఞానం ఉంది. తాజాగా ఎన్‌ఈఆర్‌ఎస్ అమలుతో మరింత అత్యాధునిక పరిజ్ఞానం చేకూరనుంది. ఇది పూర్తిస్థాయిలో అందు బాటులోకి వస్తే జీఐఎస్ పరిజ్ఞానంతో కూడిన వీడియో వాల్స్ కంట్రోల్ రూమ్స్‌లో ఉంటా యి. బాధితులు ఏ ప్రాంతం నుంచి ఫిర్యా దు చేస్తున్నారో తక్షణం గుర్తించవచ్చు. పో లీసుల రెస్పాన్స్ టైమ్ మరింత తగ్గనుంది. కేంద్ర, రాష్ట్రాలు కలిసికట్టుగా.. ఎన్‌ఈఆర్‌ఎస్ వ్యవస్థ కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి భాగస్వామ్యంతో పని చేస్తోంది. మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని కేంద్రం అంది స్తుండగా.. సిబ్బంది, బాధితులను ఆదుకునేందుకు ఆయా ప్రాంతాలకు చేరుకోవడానికి వాహనాలు, తదితరాలను రా ష్ట్రం చూసుకుంటోంది. సిబ్బందిని రిక్రూట్మెంట్, ఔట్ సోర్సింగ్ ద్వారా నియమించనున్నారు. వాహనాలు, ఇతర సౌకర్యాలను కేంద్రం అందించే వివిధ పథకాల కింద, రాష్ట్ర నిధులతో సమీకరించుకుంటున్నారు. ఇక వైపరీత్యాలు సంభ వించినప్పుడు సత్వర స్పందన కోసం పోలీసు విభా గంతో పాటు అగ్నిమాపక, విపత్తు నిర్వహణ, వైద్యారోగ్య, మున్సి పల్ కార్పొరేషన్లకు ఒకేసారి సమాచారం అందేలా ఇంటిగ్రేటెడ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. సైబర్ నేరాల్లో బాధితులుగా మారిన వారికి సహాయం చేయడానికి కేంద్రం టోల్ ఫ్రీ నంబర్ 1930 అందుబాటులోకి తీసుకువచ్చింది. దీన్ని కూ డా 112లో కలిపేయాలని కొన్ని రాష్ట్రాలు కోరుతున్నాయి. -
‘కరోనా’లో ఆర్, కే అంటే ఏమిటి?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచాన్ని కుదిపేస్తోన్న కరోనా వైరస్ మహమ్మారికి సంబంధించిన వార్తల ప్రస్తావన వచ్చినప్పుడల్లా వివిధ దేశాల ప్రభుత్వాలు, అధికారులు, టీవీ యాంకర్లు ‘ఆర్’ నెంబర్ లేదా ఆరు శాతం ఎంతుందంటే’ అని చెబుతున్నారు. ఇంతకు ‘ఆర్’ నెంబర్ దేనికి ప్రాతినిథ్యం వహిస్తోంది. ఆర్ అంటే రీప్రొడక్షన్ (పునరుత్పత్తి). ఓ కరోనా వైరస్ బారిన పడిన రోగి ద్వారా ఎంత మందికి ఆ వైరస్ పాకుతుందన్న లెక్కలే ‘ఆర్’ నెంబర్లు లేదా శాతం. అంటే ఓ కరోనా రోగి నుంచి ఒకరికి మాత్రమే కరోనా వ్యాపిస్తే అది ‘ఆర్ వన్’గా, ఇద్దరికి, ముగ్గురికి వ్యాపిస్తే ‘ఆర్ 2’, ఆర్ 3’గా వ్యవహరిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తికి కొలమానంగా ‘ఆర్’ అంకెను వాడుతున్నారు. ఆర్ అంకె తక్కువగా ఉంటే కరోనా వైరస్ తక్కువగా ఉన్నట్లయితే వ్యాధి అదుపులో ఉన్నట్లు అదే ఆర్ అంకె ఎక్కువగా ఉంటే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు. కరోనా వైరస్ విస్తరించిన తొలి రోజుల్లో బ్రిటన్‌లో ఆర్ రేటు 3గా ఉండేది. అంటే ఒకరి నుంచి ముగ్గురికి, ఆ ముగ్గురిలో ప్రతి ఒక్కరి నుంచి ముగ్గురికి వైరస్ వ్యాప్తి చెందడాన్నే ‘ఆర్ 3’గా వ్యవహరిస్తారు. (భారత్‌లో ఒక్క రోజే 17,296 కరోనా కేసులు) ఇప్పుడు కరోనా వైరస్‌కు సంబంధించి ‘కే’ అనే పదం కొత్తగా పుట్టుకొచ్చింది. కే అంటే ఏమిటీ? అది దేనికి ప్రాతినిథ్యం వహిస్తోంది. కొందరి వ్యక్తుల్లో కరోనా వైరస్ తీవ్రంగా ఉన్నప్పటికీ బయటకేమీ కరోనా లక్షణాలు కనిపించవు. అలాంటి వారు సమాజంలో స్వేచ్ఛగా తిరుగుతూ అనేక మందికి కరోనా వ్యాపించేందుకు కారణం అవుతారు. వారిని ‘కే’గా వ్యవహరిస్తున్నారు. ‘కే’ల సంఖ్య తక్కువున్నప్పటికీ వారి వల్ల వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతుంది. (కరోనా కట్టడిలో ఆ రాష్ట్రం ఆదర్శం) -
ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తెగువ
లక్నో: దేశవ్యాప్తంగా మహిళలపై వరుస హత్యాచార ఘటనలు, దాడులు ఆందోళన రేపుతున్నాయి. మరీ ముఖ్యంగా గత కొన్ని రోజులుగా పసిపిల్లలు, వృద్దులు అనే తేడా లేకుండా మహిళలపై నమోదవుతున్న అత్యాచార ఘటనలు మహిళ భద్రతను, రక్షణను సవాల్ చేస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ అత్యాచార బాధితురాలిపై దాడిచేసి సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించిన దారుణ ఘటన వెలుగు చూసింది. అయితే తనకు జరిగిన అన్యాయంపై ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తున్న బాధితురాలు, గురువారం జరిగిన మరో దాడిలో కూడా చూపించిన తెగువ, సాహసం చర్చనీయాంశమైంది. తనే స్వయంగా పోలీసు ఎమర్జెన్సీ నెంబరు 112 ఫోన్ చేసింది. ఆమె ఫోన్ కాల్తోనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే తనపై దాడిచేసిన వ్యక్తులు పేర్లను పోలీసులకు వెల్లడించింది. ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షి అందించిన కథనం ప్రకారం, మంటల్లో కాలిపోతూ కూడా దాదాపు కిలోమీటరు దూరం పరుగెత్తింది. సహాయం కోసం అర్ధిస్తోంది. ఆమెకు సహాయం చేసేందుకు దగ్గరికెళ్లి ఆమెను పలకరించాను. తన పేరు చెప్పిన వెంటనే.. తన దగ్గరినుంచి ఫోన్ తీసుకుని పోలీసుల అత్యవర నంబరుకు కాల్ చేసిందని ఆయన చెప్పారు. ఆమె మంటల్లో కాలిపోతున్న ఆ దృశ్యం ఇప్పటికే తనను భయాందోళనకు గురిచేస్తోందన్నారు. ఇంతలో పోలీసులొచ్చి ఆమెను ఆసుపత్రికి తరలించారంటూ ఈ దారుణాన్ని గుర్తు చేసుకున్నారు. కాగా అత్యాచార బాధితురాలు విచారణ నిమిత్తం రైల్వే స్టేషన్‌కు వెళ్తుండగా, ఇటీవల బెయిల్‌పై విడుదలైన నిందితులు దారికాచి, దగ్గర్లోని పొలంలోకి ఈడ్చుకెళ్లి మరి నిప్పంటించారు. ఈ ఘటనలో 90 శాతం కాలిన గాయాలతో ఆమె మృత్యువుతో పోరాడుతోంది. ఈ ఘటనలో ఇద్దరు నిందితులు సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఢిల్లీకి తరలించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం విమానాశ్రయం నుంచి సివిల్ ఆసుపత్రి వరకు గ్రీన్ కారిడార్‌కు ఏర్పాట్లు చేస్తోంది. (లైంగిక దాడి బాధితురాలు కోర్టుకు వెళుతుండగా..) -
అశ్లీల సైట్లలో ప్రభుత్వ హెల్ప్‌లైన్ నంబర్
న్యూఢిల్లీ : బాలల పట్ల లైంగిక నేరాల నిరోధం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రభుత్వం కొన్ని రోజులపాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ‘జనాలు ఇంటర్నెట్లో అశ్లీల విషయాల గురించి సర్చ్ చేస్తున్నప్పుడు ఈ చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ కనిపిస్తుండటంతో.. వారు ఈ నంబర్‌ను సెక్సువల్ సర్వీస్‌లు అందజేయడానికి ఉద్దేశించినదిగా భావిస్తున్నారు. దాంతో జనాలు ఈ నంబర్‌కు ఫోన్ చేసి అసభ్యకరమైన సేవలు అందించాల్సిందిగా అడుగుతున్నారు. అందువల్ల కొన్ని రోజుల పాటు ఈ నంబర్‌ను నిలిపివేస్తున్నట్లు’ అధికారులు తెలిపారు. ప్రస్తుతం చైల్డ్‌హెల్ప్‌లైన్ కోసం వినియోగిస్తున్న 1098 నంబర్ స్థానంలో త్వరలోనే మరో కొత్త నంబర్ని తీసుకువస్తామని అధికారులు వెల్లడించారు. అంతేకాక ఈ విషయం మీద పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 2016లో మహిళాశిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ చిన్నపిల్లల పట్ల లైంగిక నేరాలకు పాల్పడే వారికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేయడానికి వీలుగా ‘ఇ - బాక్స్’ ప్రొగ్రామ్‌ని ప్రారంభించింది. అందులో భాగంగా ఈ చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్‌ను తీసుకొచ్చారు. -
ఆటోలకు ‘పోలీస్’ నంబరు తప్పనిసరి
గుంటూరు : అర్బన్ జిల్లా పరిధిలో ప్రయాణించే ప్రతి ఆటోకు పోలీసు గుర్తింపు నంబరు తప్పని సరిగా ఉండేలా చర్యలు చేపడుతున్నామని అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయారావు చెప్పారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గురువారం ఆటోలకు పోలీస్ గుర్తింపు నంబర్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రయాణీకులకు కనిపించేలా ఆటో యజమాని వివరాలు, క్విఆర్ కోడ్, ట్రాఫిక్ అధికారుల ఫోన్ నంబర్లతో కూడిన వివరాలతో పోలీస్ నంబర్‌తో ఉండేలా చర్యలు చేపట్టామని తెలిపారు. అంతేకాకుండా ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఆటో వివరాలు సునాయాసంగా తెలుసుకునేందుకు వీలుగా ఏ ఆటో స్టాండ్‌కు సంబంధించిన వాహనం, యజమాని వివరాలు, డ్రైవింగ్ లైసెన్స్ నంబరు, ఆధార్, ఫోన్ నంబర్లను ఆటోడిజిటైజేషన్.కం వెబ్సైట్లో నమోదు చేస్తున్నామన్నారు. ఎవరైనా వివరాలు చూడాలనుకునే వారు ఈ వెబ్సైట్లో పరిశీలించుకొనే వెసులుబాటు ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రయాణీకులు అప్రమత్తంగా ఉండి ఎక్కిన వెంటనే సదరు ఆటో నంబరు, లేదా ట్రాఫిక్ పోలీస్ నంబరు గుర్తుంచుకోవడం లేకుండా ఫోన్లో ఫొటో తీయడం చేస్తే ఏదైనా నేరం జరిగిన సమయంలో సునాయాసంగా గుర్తుంచవచ్చని తెలిపారు. అనంతరం 200 ఆటోలకు పోలీస్ గుర్తింపు నంబర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు పాపారావు, వెంకటరెడ్డి, సీఐలు వేమారెడ్డి, పూర్ణచంద్రరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
అతి పెద్ద ప్రధాన సంఖ్య!
వాషింగ్టన్: ప్రపంచంలోనే ఇప్పటి వరకు తెలిసిన అతిపెద్ద ప్రధాన సంఖ్యను ఔత్సాహిక శాస్త్రవేత్త కనుగొన్నారు. గతేడాది డిసెంబర్ 26న అమెరికాకు చెందిన జొనాథన్ పేస్ అనే 51 ఏళ్ల ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఈ ఘనత సాధించారు. 2ను 7,72,32,917 సార్లు గుణించి, ఆ తర్వాత అందులో నుంచి ‘1’ ని తీసివేశారు. ఆ వచ్చిన సంఖ్యలో 2,32,49,425 అంకెలున్నాయి. ఇప్పటివరకు తెలిసిన ప్రధాన సంఖ్య కన్నా ఎం77232917 అని పిలుస్తున్న ఈ కొత్త ప్రధాన సంఖ్యలో దాదాపు 10 లక్షల అంకెలు ఎక్కువగా ఉన్నాయి. అత్యంత అరుదుగా ఉండే ఈ ప్రధాన సంఖ్యలను మెర్సెన్నె ప్రధాన సంఖ్యలు అంటారు. 350 ఏళ్ల కిందటే ఈ ప్రధాన సంఖ్యల గురించి అధ్యయనం చేసిన ఫ్రెంచ్ శాస్త్రవేత్త మారిన్ మెర్సెన్నె పేరు వీటికి పెట్టారు. ఈ కొత్త ప్రధాన సంఖ్యను ఆరు రోజుల పాటు ఆగకుండా లెక్కించారు. ఎం77232917 ఇప్పటి వరకు కనుగొన్న 50వ మెర్సెన్నె ప్రధాన సంఖ్య. గ్రేట్ ఇంటర్నెట్ మెర్సెన్నె ప్రైమ్ సెర్చ్ (జీఐఎంపీఎస్) అనే సాఫ్ట్వేర్ సాయంతో ప్రధాన సంఖ్యలు కనుగొనేందుకు వేల మంది వలంటీర్లు నిత్యం ప్రయతిస్తుంటారు. ఈ ప్రధాన సంఖ్యను కనుగొన్న వారికి రూ.50 వేలను పారితోషికంగా అందిస్తారు. జొనాథన్ పేస్ గత 14 ఏళ్లుగా ప్రధాన సంఖ్యను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. -
లింక్ చేయకపోయినా..!?
సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్, మొబైల్ నెంబర్ అనుసంధానంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(డీఓటీ) ప్రకటించింది. ఈ కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందువల్ల.. ఆధార్‌తో మొబైల్‌ను లింక్ చేయకపోయినా ఎటువంటి చర్యలు తీసుకోమని డీఓటీ కార్యదర్శి అరుణ సౌందరరాజన్ తెలిపారు. ఆధార్-మొబైల్ లింకింగ్ విషయంలో టెలికాం శాఖ సుప్రీంకోర్టు నిర్ణయం కోసం ఎదురు చూస్తోందని అరుణ సౌందరరాజన్ తెలిపారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఈ నెల 13న విచారణ జరపనుంది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఉన్న వినియోగదారుల వివరాలను మరోసారి ధృవీకరించుకోవాలని ప్రయివేట్ టెలికాం ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె స్పష్టం చేశారు. డిసెంబర్ 1లోగా మొబైల్ వినియోగదారులంతా.. తమతమ నెంబర్లను ఒన్ టైమ్ పాస్వర్డ్ సాయంతో వెరిఫై చేయించుకోవాలని ఆమె సూచించారు. -
ఆధార్‌తో మొబైల్ లింక్ తప్పనిసరి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని అన్ని మొబైల్ నెంబర్లను ఆధార్‌తో తప్పనిసరిగా లింక్ చేయాల్సిందేనని కేంద్రం ప్రభుత్వం మరోసారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆధార్‌తో మొబైల్‌ను ఫిబ్రవరి 6 లోగా అందరూ తప్పనసరిగా అనుసంధానం చేసుకోవాలన కేంద్రం ప్రకటించింది. అంతేకాక పాత బ్యాంక్ అకౌంట్లకు ఇది వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. ఆధార్, మొబైల్ నెంబర్ అనుసంధానంపై గడువుతేదీలో ఇక మార్పులు ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. అయితే బ్యాంక్ అకౌంట్లకు గడుపు తేదీని మాత్రం మార్చి 31 వరకూ ప్రభుత్వం పొడిగించింది. ఆధార్‌తో అనుసంధానం చేయడం అనేది.. వ్యక్తిగత గోప్యతా హక్కును ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టులో వేల సంఖ్యలో పిటీషన్లు దాఖలయ్యాయి. వీటిని రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది. ఇదిలా ఉండగా.. మార్చి 31లోపు ఆధార్‌తో అనుసంధానం చేయబడని బ్యాంకు ఖాతాలను స్థంభింపచేయాలని ఆయా బ్యాంకులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. -
లోవకు భక్తజన వెల్లువ
తలుపులమ్మను దర్శించుకున్న లక్ష మంది గంటల తరబడి స్తంభించిన ట్రాఫిక్ తునిరూరల్ : జిల్లాలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం లోవ దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఆషాఢమాస మూడో ఆదివారం కావడం.. వాతావరణం అనుకూలంగా ఉండడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. తెల్లవారు జాము నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక వాహనాల్లో భక్తులు వస్తూనే ఉన్నారు. లక్ష మంది భక్తులు తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్నట్టు అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ఎస్. చంద్రశేఖర్ తెలిపారు. అమ్మవారి ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు, ఉచిత దర్శనానికి మూడు గంటలు భక్తులు క్యూల్లో వేచి ఉండాల్సి వచ్చింది. పులిహోర ప్రసాదం మధ్యాహ్నం 12.30 గంటలకే నిండుకుంది. వివిధ విభాగాలు ద్వారా దేవస్థానానికి రూ.6,70,282 ఆదాయం లభించినిట్టు ఈఓ చంద్రశేఖర్ తెలిపారు. భక్తులకు అవస్థలు భారీగా తరలివచ్చి భక్తులకు వసతి గదులు లభించకపోవడంతో నానా ఇబ్బందులు పడ్డారు. ఒక మోస్తరు వర్షం కురుస్తుండడంతో భక్తులు చిత్తడితో అవస్థలు పడ్డారు. దేవస్థానం అధీనంలో ఉన్న 125 కాటేజీలు, పొంగలి షెడ్లను భక్తులకు ఇచ్చారు. అవి లభించని వారు చెట్లను, కొండ దిగువన ఉన్న మామిడి, జీడి మామిడి తోటలను, ప్రైవేట్ పాకలను ఆశ్రయించారు. ఇదే అదునుగా భావించిన కొంతమంది ప్రైవేట్ పాకల యజమానులు రూ.800 - రూ.1200 వరకు అద్దెలను డిమాండ్ చేశారు. కొంతమంది తమ వాహనాల్లోనే వంటలు, భోజనాలు చేశారు. స్తంభించిన ట్రాఫిక్ పెద్దసంఖ్యలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, లారీలు, బస్సులు, కార్లు, ఇతర భారీవాహనాలపై భక్తులు లోవ దేవస్థానానికి భక్తులు చేరుకున్నారు. లోవ కొత్తూరు ఎర్రచెరువు వద్ద కల్వర్టు నిర్మాణంలో ఉండడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పలేదు. రూరల్ సీఐ జి.చెన్నకేశవరావు ఆధ్వర్యంలో తుని రూరల్, కోటనందూరు ఎస్సైలు సుధాకర్, శంకరరావు, 80 మంది పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు శ్రమించారు. బెల్టు షాపుల హవా లోవదేవస్థానంలో తలుపులమ్మతల్లిని దర్శించేందుకు భారీ సంఖ్యలో యాత్రికులు తరలిరావడంతో మందుబాబులతో మద్యం దుకాణం కిక్కిరిసిపోయింది. మందుబాబులు మంచి జోష్‌మీద ఉండడంతో బెల్టు షాపులు విచ్చలవిడిగా వెలిశాయి. టోల్‌గేటు వద్ద నుంచి ఘాట్ రోడ్డు వరకు 40 నుంచి 50 బెల్టు షాపులు వెలసినట్టు అంచనా. అయినప్పటికీ ఎక్సైజ్‌శాఖ అధికారులు పట్టించుకోలేదు. -
తేలిన ఉద్యోగుల లెక్క
నల్లగొండకు 1257, సూర్యాపేటకు 928, యాదాద్రికి 831 పోస్టులు అవసరం –కలెక్టరేట్లు, పశుసంవర్థక శాఖలకు భారీగా పోస్టులు అవసరం –వైద్యశాఖకు కూడా ఓ మోస్తరుగా.. మిగిలిన శాఖలకు సరిపోయే అవకాశం –జిల్లాల వారీగా పంచిన అధికారులు.. త్వరలోనే పంపిణీ షురూ –జిల్లా పోస్టులకు స్థానికతే ప్రామాణికం.. అవసరమైతే జూనియర్లకు అనివార్య బదిలీలు –జోనలæ, రాష్ట్ర పోస్టులకు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు.. –మూడు జిల్లాల్లో కలిపి మంజూరైన పోస్టులు 2,755 –ఖాళీగా ఉన్న పోస్టులు 668, అదనంగా కావాల్సినవి 288 –మూడు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగుల విభజనపై ప్రాథమిక కసరత్తు పూర్తి –ఉపాధ్యాయులు, పోలీసులకు ప్రత్యేక కసరత్తు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లా విభజన ప్రాథమిక నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో జిల్లాలోని ఉద్యోగుల విభజనపై కూడా అధికార యంత్రాంగం ప్రాథమిక కసరత్తు పూర్తి చేసింది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న శాశ్వత ఉద్యోగులను నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రికి పంపిణీ చేస్తూ లెక్కలు తేల్చింది. ఈ లెక్కల ప్రకారం ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో 2,755 పోస్టులుండగా, అందులో 1257 నల్లగొండకు, 928 పోస్టులు సూర్యాపేటకు, 831 పోస్టులు యాదాద్రికి పంపిణీ చేసింది. జనాభా, మండలాల ప్రాతిపదికన కేటాయించిన ఈ పోస్టులకు సంబంధించిన పంపిణీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ పంపిణీకి సంబంధించిన ఉత్తర్వులు, మార్గదర్శకాల కోసం జిల్లా యంత్రాంగం ఎదురుచూస్తోంది. కాగా, మూడు జిల్లాల్లోకి ఉద్యోగుల పంపిణీకి స్థానికతనే ప్రామాణికంగా తీసుకుంటారని జిల్లాలోని ఓ సీనియర్ అధికారి ‘సాక్షి’కి చెప్పారు. జిల్లా, అంతకన్నా తక్కువ స్థాయిల్లో పనిచేస్తున్న ఉద్యోగుల స్వంత మండలం, గ్రామాన్ని బట్టి ఆయా ఉద్యోగులను ఆ జిల్లాకు పంపిస్తారని, అవసరమైన ఉద్యోగులు పోను ఇంకా అవసరం అయితే ఆయా శాఖల్లో, ఆయా హోదాల్లో ఉన్న జూనియర్లకు అనివార్య బదిలీలు చేస్తారని తెలుస్తోంది. అయితే, జోనల్ పోస్టులు, రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న వారి పంపిణీ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుందని సమాచారం. ఈ నేపథ్యంలో అటు జిల్లా పోస్టులకు, ఇటు జోనల్, రాష్ట్ర పోస్టులకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేస్తుంది... ఏ నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగులను మూడు జిల్లాలకు పంపిణీ చేస్తుందనేది ఇప్పుడు జిల్లా ఉద్యోగ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. సుమారు వెయ్యి ఇదిలా ఉంటే, మూడు జిల్లాలకు పంపిణీ చేసిన పోస్టులను పరిశీలిస్తే, ప్రస్తుతం మంజూరై ఉన్న పోస్టుల కన్నా 288 పోస్టులు అవసరమవుతున్నాయి. మరి, ఈ పోస్టులను ఎలా భర్తీ చేస్తారనేది ఓ ప్రశ్నగా కనిపిస్తోంది. అయితే, ఒక్క జిల్లాను మూడు జిల్లాలుగా విభజించిన పక్షంలో మాత జిల్లాలో మంజూరై ఉన్న పోస్టుల్లో మూడో వంతు సూపర్‌న్యూమర్ పోస్టులను మంజూరు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని, అలా జరిగితే మూడు జిల్లాలకు ఉద్యోగుల పంపిణీకి ఎలాంటి ఇబ్బంది ఉండబోదని తెలుస్తోంది. అలా కాని పక్షంలో నూతన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే జిల్లాలో మంజూరైన పోస్టుల్లో 668 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలతో పాటు అదన ంగా కావాల్సిన 288 కలిపి మొత్తం 1000 వరకు ప్రభుత్వ ఉద్యోగుల కొరత మూడు జిల్లాల్లో ఉంటుందని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. కలెక్టరేట్ కార్యాలయాలకు సంబంధించిన లెక్కలు పరిశీలిస్తే ప్రస్తుత కలెక్టరేట్లో 75 మంజూరు పోస్టులున్నాయి. అందులో 4 ఖాళీలున్నాయి. ఇప్పుడు మూడు జిల్లాలకు గాను ఒక్కో కలెక్టరేట్‌కు 50 మంది చొప్పున 150 మంది అవసరమని అధికారులు అంచనా వేశారు. అంటే ఇప్పుడున్న పోస్టులకన్నా మరో 75 పోస్టులు అదనంగా కావాలి. ఖాళీలను కూడా కలుపుకుంటే 79 అవసరం అవుతాయి. మరి ఈ పోస్టులను భర్తీ చేయకుండా ఉన్న 71 మందిని మూడు జిల్లాలకు పంపిణీ చేస్తే పరిస్థితేంటనేది అర్థం కాని పరిస్థితి. ఇక, పశుసంవర్థక, వైద్య శాఖల్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. మిగిలిన శాఖల్లోనూ ఖాళీలు బాగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అదనపు పోస్టులు ఇవ్వకపోయినా, మూడోవంతు పోస్టులు అదనంగా మంజూరు చేయకపోయినా, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోయినా జిల్లాల విభజన అనంతరం మూడు జిల్లాలు ఉద్యోగుల కొరతను తీవ్రంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని శాఖల్లో అయితే మంజూరైన పోస్టుల్లో సగమే భర్తీ అయి ఉన్నాయి. అందులో ఒక్క జిల్లాకే ఆ సగం పోస్టులు సరిపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో మిగిలిన రెండు జిల్లాల పరిస్థితి ఆగమ్యగోచరమే. అవే సగం పోస్టులను మూడు జిల్లాలకు పంపిణీ చేసినా మూడు జిల్లాల్లోనూ ఉద్యోగుల కొరతే. ఈ నేపథ్యంలో అసలు ఉద్యోగుల పంపిణీకి ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు, మార్గదర్శకాలు ఇస్తుంది? అదనపు పోస్టులను ఎలా మంజూరు చేస్తుంది? అసలు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ జరుగుతుందా? అన్న దానిపైనే మూడు జిల్లాల భవిష్యత్తు ఆధారపడనుందని ఉద్యోగ సంఘాలంటున్నాయి. ఇదిలా ఉంటే, ప్రభుత్వ ఉపాధ్యాయులు, పోలీసులకు సంబంధించిన పంపిణీ కసరత్తు ప్రత్యేకంగా జరుగుతోంది. పోలీసులకు సంబంధించి పంపిణీ కసరత్తు తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. యాదాద్రిపై భారీ అభ్యంతరాలు –ఒక్కరోజే ప్రభుత్వ వెబ్సైట్లో 163 అభ్యంతరాలు, సూచనలు నమోదు –నల్లగొండ జిల్లాపై 14, సూర్యాపేటపై 5... –ఆర్డీవో కేంద్రాల ఏర్పాటుపై 7, మండలాల ఏర్పాటుపై 19 (సాక్షి ప్రతినిధి, నల్లగొండ) నల్లగొండ జిల్లాను మూడు జిల్లాలు, 7 రెవెన్యూ డివిజన్లు, 71 మండలాలుగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం ఒక్క రోజే 208 అభ్యంతరాలు, సూచనలు నమోదయ్యాయి. ఇందులో ముఖ్యంగా యాదాద్రి జిల్లా ఏర్పాటుపై 163 అభ్యంతరాలు నమోదయ్యాయని ప్రభుత్వ వెబ్సైట్లో పెట్టిన లెక్కలు చెపుతున్నాయి. ఈ జిల్లా ఏర్పాటులో కలిపిన మండలాలు, నియోజకవర్గాలలో మార్పులు సూచిస్తూ, ఫలానా మండలాన్ని ఈ జిల్లాలో కలపవద్దంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ 163 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఎక్కువగా వరంగల్ జిల్లా నుంచి యాదాద్రిలోనికి వచ్చే నాలుగు మండలాల నుంచి ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ జిల్లాలో ఆర్డీవో కేంద్రాలుగా పేర్కొన్న జనగాం, భువనగిరిలపై కూడా 5, 20 మండలాలపై 5 అభ్యంతరాలు, సూచనలు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లా ఏర్పాటుపై 14, నల్లగొండ జిల్లా పరిధిలోని ఆర్డీవో కేంద్రాలపై 2, మండలాలపై 8 అభ్యంతరాలు, సూచనలు వచ్చాయి. ఇక, సూర్యాపేట విషయంలో పెద్దగా అభ్యంతరాలు, సూచనలు నమోదు కాలేదు. ఈ జిల్లా ఏర్పాటుపై 5 అభ్యంతరాలు రాగా, ఆర్డీవో కేంద్రాలపై ఒక్క అభ్యంతరం కూడా నమోదు కాలేదు. ఈ జిల్లాలో ప్రతిపాదించిన మండలాలపై మాత్రం ఒక్క అభ్యంతరం వచ్చినట్టు వెబ్సైట్లో పొందుపరిచిన లెక్కలు చెపుతున్నాయి. కాగా, ప్రభుత్వ ప్రాథమిక నోటిఫికేషన్‌పై ఎవరికైనా అభ్యంతరాలు, సూచనలు ఉంటే నేరుగా జిల్లా కలెక్టర్‌కు గానీ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ..... వెబ్సైట్లో కానీ 30 రోజుల్లోపు తెలియజేయవచ్చని ప్రభుత్వ అధికారులు చెపుతున్నారు. అభ్యంతరాలు, సూచనల వివరాలివి: జిల్లాపేరు జిల్లా అభ్యంతరాలు ఆర్డీవో అభ్యంతరాలు మండలాల అభ్యంతరాలు నల్లగొండ 14 2 8 సూర్యాపేట 5 0 1 యాదాద్రి 163 5 10 –––––––––––––––––––––––––––––––––––––––––––––– మొత్తం 182 7 19 –––––––––––––––––––––––––––––––––––––––––––––– -
విద్యార్థులు ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయాలి
విద్యారణ్యపురి : జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవే ట్ యాజమాన్యాల పాఠశాలల విద్యార్థుల ఆధార్ నంబర్‌ను చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్లో అనుసంధానం చేయాలని డీఈఓ పి.రాజీవ్ కోరారు. ఆధార్‌కార్డు నంబర్ కలిగి ఉంటేనే టెన్త్ విద్యార్థులకు నామినల్ రోల్స్, ప్రభుత్వం నుంచి లభించే ప్రోత్సహాకాలు అందిస్తారన్నారు. జిల్లాలో 47,658 మంది విద్యార్థులకు ఆధార్ నంబర్లు లేవన్నారు. వీటిల్లో అత్యధికంగా హన్మకొండ మండలంలో ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో 14,620మంది విద్యార్థులకు 8,899 మంది విద్యార్థులు మాత్రమే ఆధార్ నం బర్లు కలిగి ఉన్నారన్నారు. ఇక ప్రైవేట్ విద్యాసంస్థల్లో 56,035 మంది విద్యార్థులకు గాను 40,971 మంది విద్యార్థులకు ఆధార్ నంబర్ కలిగి ఉన్నారని చెప్పారు. వరంగల్ మండలంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో 10,617మందికి గాను 6,870 మంది విద్యార్థులు మాత్రమే ఆధార్ నంబర్ కలిగి ఉన్నారని తెలిపారు. ఆధార్‌నంబర్ లేని విద్యార్థు వివరాలన్నీ ఆయా ఎంఈవోల ద్వారా అన్ని పాఠశాలలకు పంపించామన్నారు. ఆధార్ కార్డు నంబ ర్ లేని విద్యార్థులు ఈనెల 31తేదీ వరకు మీసేవా కేంద్రంలో నంబర్‌ను పొందాలని కోరారు. -
వన్యప్రాణులనుంచీ రక్షణకు టోల్ ఫ్రీ నెంబర్..
కర్ణాటకః అడవి జంతువులు తమ పంటపొలాలను నాశనం చేస్తున్నాయని, తమ ఖరీదైన పశువులను పులి చంపేసిందని, చెరకు పంటను ఏనుగుల గుంపు తొక్కేసిందంటూ ఆందోళన చెందే మారుమూల గ్రామాల ప్రజలను ఆదుకునేందుకు వైల్డ్ సేవా కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చారు. బాధితులకు ప్రభుత్వ పరిహారం వెంటనే అందేట్లుగా గ్రామసస్థుల్లో అవగాహన కల్పిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా గ్రామస్థుల్లో కొందరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి, సమస్యలను వెంటనే తెలిపేందుకు టోల్ ఫ్రీ నెంబర్ అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. లబ్ధిదారులకోసం 'వైల్డ్ సేవ' ను కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లోని మారుమూల గ్రామాల్లో అందుబాటులోకి తెచ్చారు. కార్యక్రమంలో భాగంగా గ్రామస్థుల్లో అవగాహన కల్పించేందుకు స్థానికులు కొందరికి 'ఫీల్డ్ ఏజెంట్ల పేరుతో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. తాము నష్టపోయామంటూ రైతులు దరఖాస్తులు చేసుకొని కార్యాలయాలచుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సిన అవసరం లేకుండా.. లబ్ధిదారులకు వెంటనే పరిహారం అందేలా 'వైల్డ్ సేవ' కార్యక్రమం చేపట్టారు. నష్టపోయిన రైతులకు కేవలం నాలుగు రోజుల్లోనే పరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. వైల్డ్ లైఫ్ కంజర్వేషన్ సొసైటీ (డబ్ల్యూసీఎస్) ఆధ్వర్యంలో ఓ లాభాపేక్ష లేని స్వచ్ఛంద సేవకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ అటవీ శాఖతో కలసి కర్ణాటక, తమిళనాడుల్లోని సుమారు 284 గ్రామాల్లో వన్యప్రాణులనుంచి జనజీవనాన్ని రక్షించడంతోపాటు... వైల్డ్ సేవ కార్యక్రమంతో అంతరించిపోతున్న అడవి జంతువులను కూడా రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా జనాభా కలిగిన అటవీ ప్రాంతాలమీత దృష్టి సారించి.. అక్కడి ప్రజలకు, వన్యప్రాణులకు నష్టం కలగకుండా ప్రయత్సిస్తున్నారు. సుమారు 20 వేల రూపాయల ఖరీదు చేసే అవును పులి చంపేయడంతో పరిహారంకోసం దరఖాస్తు చేసుకున్నఓ రైతు.. వైల్డ్ సర్వీస్ తో 9 వేల రూపాయలు పొందాడు. అయితే పరిహారం తక్కువ వచ్చినా.. తనకు సంతృప్తిగానే ఉందన్న అతడు... గతంలో పరిహారంకోసం అధికారులచుట్టూ, కార్యాలయాలచుట్టూ తిరగడంతోపాటు పరిహారం పొందేందుకు డబ్బు ఎదురు చెల్లించాల్సి వచ్చేదని తెలిపాడు. అదీకాక ముందుగా పంటదాడులు, చనిపోయిన పశువుల ఫొటోలు తీసుకొని, గంటలకొద్దీ ప్రయాణం చేసి అటవీశాఖ కార్యాలయాలకు వెళ్ళాల్సి వచ్చేదని, సమయానికి అధికారులు లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని చెప్తున్నాడు. 'వైల్డ్ సేవ' కార్యక్రమం ప్రారంభమైన తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసిన ఏజెంట్ల ద్వారా సేవలు అందించడంతో వెంటనే పరిహారం పొందగల్గుతున్నట్లు స్థానిక రైతులు చెప్తున్నారు. అంతేకాదు 'వైల్డ్ సేవ' ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ తో తమకు జంతువులనుంచీ రక్షణతోపాటు, సమస్యలకు వెంటనే పరిష్కారం దొరుకుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ పంటలను అడవిజంతువులు నాశనం చేశాయనో, పశువులను చంపేశాయనో గ్రామస్థులు, రైతులనుంచీ తమకు రోజుకు ఒక్క ఫోన్ కాల్ అయినా వస్తుంటుందని, ఒక్కో ఏజెంట్ కు సుమారు 20 కిలోమీటర్ల పరిథిలో ఉన్న 70 గ్రామాలనుంచీ ఫోన్లు వస్తాయని, వచ్చిన ఎనిమిది గంటల్లోపు అక్కడికి వెళ్ళి సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తామని ఫీల్డ్ ఏజెంట్లు చెప్తున్నారు. ఏడుగురు ఫీల్డ్ ఏజెంట్లతో గత సంవత్సరం ప్రారంభించిన వైల్డ్ సేవా కార్యక్రమంలో భాగంగా పంటలు, ఆస్తుల నష్టం కేసుల్లో ఇప్పటిదాకా సుమారు 3,261 పరిష్కరించినట్లు 'వైల్డ్ సేవ' తెలిపింది. దీంతోపాటు.. 148 వరకూ పులులు, అడవికుక్కలద్వారా నష్టపోయిన పశుసంపద, తీవ్ర గాయాలైన 11 మంది, ఇద్దరు చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన కేసులను పరిష్కరించినట్లు 'వైల్డ్ సేవ' నివేదించింది. -
వందేళ్ల లో ఫస్ట్ టైమ్
కాలిఫోర్నియా: ప్రపంచ వ్యాప్తంగా గడిచిన వందేళ్ల లో మొదటిసారిగా పులుల సంఖ్య పెరిగినట్టు తాజా నివేదికలు వెల్లడిస్తన్నాయి. పులుల అక్రమ రవాణాను అడ్డుకుని, సంరక్షణ చర్యలు చేపడుతున్నందు వల్లే పులుల సంఖ్యలో ఈపెరుగుదల నమోదైనట్టు తెలుస్తోంది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్(ఐయూసీఎన్) ప్రపంచ వ్యాప్తంగా పులుల సంఖ్య 3,890 ఉన్నట్టు ప్రకటించింది. 2010లో 3,200గా ఉన్న పులుల సంఖ్య నమోదైంది. అంటే దాదాపు 700 పులుల సంఖ్య పెరిగినట్టు ఐయూసీఎన్ తెలిపింది. ఆసియా మొత్తంలో ఉన్న పులులను వీరు లెక్కించారు. భారతదేశంలో 2,226, రష్యా, సైబీరియా-433, 371, ఇండోనేషియా-371, మలేషియా-250, నేపాల్-198, థాయిలాండ్-189, బంగ్లాదేశ్-106, భూటాన్-103, చైనా-7, వియత్నాం-5, లావోస్-2, కంబోడియా-1, మయన్మార్ లో పులుల సంఖ్య శూన్యం. వరల్డ్ వైడ్ ఫండ్ (డబ్యూడబ్యూఎఫ్) మేసేజర్ డారెన్ గ్రోవర్ 20వ శతాబ్దంలో పులుల సంఖ్య పెరగడం ఇదే మొదటి సారని సంతోషం వ్యక్తం చేశారు. పులుల పెరుగుదల ఇలాగే కొనసాగితే 2022 నాటికి పులుల సంఖ్య 6400 కు చేరుకుంటుందని గ్రోవర్ తెలిపారు. పులి పాధాన్యత ఏంటి? పులి ప్రపంచ వ్యాప్తంగా అధిక గుర్తింపు కలిగిన జంతువు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో పులికి విపరీతమైన ప్రాధాన్యత ఉంది. అడవిలో ఉండే జంతువుల ఆహార చైన్ సిస్టంలో పులి అగ్రస్థానంలో ఉంటుంది. అంటే అడవిలో పులి ఉంటే అక్కడ అన్ని జంతువులు సమృద్ధిగా ఉంటాయి. అందుకోసం పులుల సంరక్షణకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయి.