సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్, మొబైల్ నెంబర్ అనుసంధానంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(డీఓటీ) ప్రకటించింది. ఈ కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందువల్ల.. ఆధార్‌తో మొబైల్‌ను లింక్ చేయకపోయినా ఎటువంటి చర్యలు తీసుకోమని డీఓటీ కార్యదర్శి అరుణ సౌందరరాజన్ తెలిపారు. ఆధార్-మొబైల్ లింకింగ్ విషయంలో టెలికాం శాఖ సుప్రీంకోర్టు నిర్ణయం కోసం ఎదురు చూస్తోందని అరుణ సౌందరరాజన్ తెలిపారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఈ నెల 13న విచారణ జరపనుంది.
ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఉన్న వినియోగదారుల వివరాలను మరోసారి ధృవీకరించుకోవాలని ప్రయివేట్ టెలికాం ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె స్పష్టం చేశారు. డిసెంబర్ 1లోగా మొబైల్ వినియోగదారులంతా.. తమతమ నెంబర్లను ఒన్ టైమ్ పాస్‌వర్డ్ సాయంతో వెరిఫై చేయించుకోవాలని ఆమె సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment