‘జామ్’తో సామాజిక విప్లవం
జామ్ అంటే జన్‌ధన్, ఆధార్, మొబైల్ త్రయం: అరుణ్‌జైట్లీ
న్యూఢిల్లీ: జన్‌ధన్, ఆధార్, మొబైల్(జామ్) త్రయం దేశంలో సామాజిక విప్లవానికి నాంది పలికాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. దీని వల్ల ప్రతి భారతీయుడు ఏకీకృత డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోకి వస్తాడని చెప్పారు. ‘ప్రస్తుతం 100 కోట్ల ఆధార్ నంబర్లను 100 కోట్ల బ్యాంకు ఖాతాలకు, 100 కోట్ల మొబైల్ ఫోన్లకు అనుసంధానించడమే లక్ష్యం.
ఒకసారి ఈ ప్రక్రియ పూర్తయితే దేశం డిజిటల్ ఆర్థిక వ్యవస్థ రూపంలో ఏకతాటిపైకి వస్తుంది’ అని వెల్లడించారు. జన్‌ధన్ యోజన ప్రారంభించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా జైట్లీ తన ఫేస్‌బుక్ పేజీలో ఒక పోస్ట్‌ను ఉంచారు. ‘జీఎస్‌టీతో ఒకే పన్ను, ఒకే మార్కెట్, ఒకే దేశం అమలులోకి వచ్చిన మాదిరిగానే.. ఈ అనుసంధానంతో దేశం మొత్తం ఒకే ఆర్థిక వ్యవస్థ కిందకు వస్తుంది. దీనికి వెలుపల ఎవరూ ఉండరు’ అని చెప్పారు.