న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి వ్యక్తికి ఆధార్ సంఖ్య ఉన్నట్లే ఇకపై ప్రతి కంపెనీకి కూడా ఓ గుర్తింపు సంఖ్య ఉండేలా కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అరుణ్‌జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడుతూ.. చిన్న కంపెనీ కానీ, పెద్ద కంపెనీ కానీ ప్రతి ఒక్క కంపెనీకి ఓ గుర్తింపు కార్డు ఉండాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రత్యేకమైన పథకాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే దాదాపు 119 కోట్ల మంది భారతీయులకు ఆధార్ కార్డును కేంద్రం అందజేసింది. ప్రస్తుతం ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేసేందుకు లబ్ధిదారుల ఎంపికలో ఆధార్ తప్పనిసరైంది.
Comments
Please login to add a commentAdd a comment