Union Budget 2018
-
స్టాక్స్‌లో లాభాలపై పన్ను ఆదా..!
రూపాయిని ఆదా చేశామంటే.. రూపాయిని సంపాదించినట్టే. ఇది ఎప్పటి నుంచో మనం వినే సామెతే. అన్ని తరాలకూ ఇది వర్తిస్తుంది. కరోనా కల్లోలం వచ్చిన తర్వాత ఇంటికే పరిమితమైన వాతావరణంలో చాలా మంది కొత్త ఇన్వెస్టర్లు ఈక్విటీల్లోకి అడుగుపెట్టారు. ఇంటి నుంచే అదనపు ఆదాయం కోసం స్టాక్స్ పెట్టుబడులను ఎంపిక చేసుకున్నారు. దీనికి నిదర్శనం సీడీఎస్ఎల్ వద్ద ఆరు నెలల్లోనే కోటి డీమ్యాట్ ఖాతాలు కొత్తగా తెరుచుకున్నాయి. కాకపోతే ఇన్వెస్టర్లు పెట్టుబడులు, విక్రయాలపైనే దృష్టి పెడుతుంటారు కానీ, పన్ను అంశాన్ని అంతగా పట్టించుకోరు. స్టాక్ మార్కెట్లో ఆర్జించే లాభాలపై పన్ను చెల్లించాలన్న అంశాన్ని ఇన్వెస్టర్లు తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే ‘స్మార్ట్’గా అడుగులు వేయడం ద్వారా ఈ పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. తద్వారా కొంత ఆదా చేసుకోవచ్చు. ఆ వివరాలే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనంలో.. ఇవి గమనించండి... ► ఏడాది, అంతకుమించిన పెట్టుబడులపై ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష వరకు లాభంపై పన్ను ఉండదు. ► రూ.2 లక్షల దీర్ఘకాల మూలధన లాభం కనిపిస్తుంటే.. రెండు ఆర్థిక సంవత్సరాల్లో రెండు భాగాలుగా తీసుకోవచ్చు. ► లాభాలు ఎక్కువగా కనిపిస్తుంటే.. నష్టాలతో సర్దుబాటు చేసుకోవడం ద్వారా పన్ను తగ్గించుకోవచ్చు. ► నివాస గృహంపై ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎల్టీసీజీ భారాన్ని దింపుకోవచ్చు. నష్టాలతో సర్దుబాటు.. 2018 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఎల్టీసీజీ పన్నును ప్రతిపాదించారు కనుక ఆ ముందు రోజు వరకు చేసిన పెట్టుబడులకు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను వర్తించదు. ‘‘నూతన నిబంధనను ప్రవేశపెట్టినప్పుడు అప్పటి వరకు ఉన్న పెట్టుబడులకు సాధారణంగా మినహాయింపునిస్తుంటారు. దీన్నే గ్రాండ్‌ఫాదరింగ్ అంటారు. కనుక 2018 జనవరి 31 నాటి వరకు చేసిన పెట్టుబడులు గ్రాండ్ ఫాదరింగ్‌కు అర్హత కలిగినవి’’ అని ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ సీఈవో గౌరవ్ మోహన్ తెలిపారు. అంటే 2018 జనవరి 31 వరకు చేసిన పెట్టుబడులకు.. కొనుగోలు తేదీగా 2018 జనవరి 31ని పరిగణిస్తుంది చట్టం. ఆ తర్వాత తేదీ నుంచి ఆర్జించిన దీర్ఘకాల మూలధన లాభాలపైనే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. స్వల్పకాల మూలధన నష్టాలను.. స్వల్పకాల మూలధన లాభాలు, దీర్ఘకాల మూలధన లాభాలు రెండింటితోనూ సర్దుబాటు చేసుకోవచ్చు. అదే ఎల్టీసీఎల్ అయితే ఎల్టీసీజీతోనే సర్దుబాటు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. వరుసగా ఎనిమిదేళ్లపాటు దీర్ఘకాల, స్వల్పకాల మూలధన నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకోవాలంటే.. అందుకోసం గడువులోపు ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసుకోవడం తప్పనిసరి. లేదంటే వాటిని భవిష్యత్తు లాభాల్లో సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని కోల్పోయినట్టే. పన్ను బాధ్యత ఈక్విటీల్లో (స్టాక్స్) నేరుగా చేసిన పెట్టుబడులు లేదా మ్యూచువల్ ఫండ్స్ రూపంలో స్టాక్స్‌లో పెట్టుబడులైనా సరే.. ఏడాది, అంతకు మించి కొనసాగించిన తర్వాత విక్రయించినట్టయితే వచ్చే లాభాన్ని దీర్ఘకాలిక మూలధన లాభంగా (ఎల్టీసీజీ) ఆదాయపన్ను చట్టం పరిగణిస్తోంది. ఒకవేళ నష్టం వస్తే దాన్ని దీర్ఘకాలిక మూలధన నష్టం(ఎల్టీసీఎల్)గా చూస్తారు. అదే ఏడాది లోపు విక్రయించగా వచ్చిన లాభం స్వల్పకాల మూలధన లాభం (ఎస్టీసీజీ)గాను.. నష్టం వస్తే స్వల్పకాల మూలధన నష్టం(ఎస్టీసీఎల్)గాను పరిగణిస్తారు. ఎల్టీసీజీపై 10 శాతం పన్ను చెల్లించాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో మొదటి రూ.లక్ష దీర్ఘకాల మూలధన లాభంపై పన్ను లేదు. రూ.లక్షకు మించి ఉన్న లాభంపైనే 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే ఎస్‌టీసీజీపై 15 శాతం పన్ను చెల్లించాలి. ఇందులో బేసిక్ పరిమితి అంటూ ఏదీ లేదు. అంటే ఏడాదిలోపు పెట్టుబడులపై లాభం రూ.1,000 వచ్చినా ఆ మొత్తంపై 15 శాతం పన్ను చెల్లించాల్సిందే. ఎల్టీసీజీ 2018 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. కొద్ది కొద్దిగా... పన్ను ఆదా చేసుకునేందుకు మరో మార్గం.. ఒకే విడత వెనక్కి తీసేసుకోకుండా పరిమితి పాటించడం. ‘‘ఆర్థిక సంవత్సరం ముగింపు సమీపంలో షేర్లపై ఎల్టీసీజీ రూ.2లక్షలు ఉందనుకుంటే ఒకే పర్యాయం మొత్తాన్ని విక్రయించకుండా రెండు భాగాలు చేసుకుని.. ఒక భాగాన్ని నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలోనూ, మరో భాగాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం ఆరంభంలో వెనక్కి తీసుకోవాలి’’ అని ట్యాక్మన్కు చెందిన వాధ్వాన్ సూచించారు. అప్పుడు పన్ను భారం సున్నా అవుతుంది. ఒకవేళ మూలధన లాభాల పన్ను గణనీయంగా ఉన్నట్టయితే.. అప్పుడు రెండు భాగాలు చేసినా కానీ చెల్లించాల్సిన పన్ను గణనీయంగా ఏమీ తగ్గదు. పన్ను ఆదా కోసం పెట్టుబడుల ఉపసంహరణను మరింత దీర్ఘకాలం పాటు వాయిదా వేయడం కూడా సరికాదు. దీనివల్ల మార్కెట్లో పరిస్థితులు మారిపోతే రిస్క్‌లో చిక్కుకున్నట్టు అవుతుంది. దీనికి మోహన్ మరో పరిష్కారాన్ని సూచించారు. ‘‘పెద్ద పోర్ట్‌ఫోలియో నిర్వహించే వారు.. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష దీర్ఘకాల మూలధన లాభం మినహాయింపు తర్వాత కూడా పన్ను చెల్లించాల్సిన లాభం ఉన్నట్టయితే పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వెళ్లడమే’’ అని ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ సీఈవో గౌరవ్ మోహన్ పేర్కొన్నారు. అంటే మూలధన లాభాల పన్ను రూ.లక్షకు సమీపించగానే విక్రయించడం.. తిరిగి మరుసటి రోజు కొనుగోలు చేయడం. దీనివల్ల లావాదేవీల వ్యయాలే తప్పించి మూలధన లాభాల పన్ను భారం ఉండదు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కూ ఇదే అమలవుతుంది. ఫండ్ యూనిట్లను కొనుగోలు చేసిన (సిప్ అయితే విడిగా ప్రతీ సిప్ కొనుగోలు చేసిన తేదీ నుంచి) నాటి నుంచి ఏడాది, ఆ తర్వాత విక్రయించగా వచ్చిన లాభంపై 10 శాతం దీర్ఘకాల మూలధన లాభాల పన్ను, ఏడాదిలోపు అయితే 15 శాతం పన్ను చెల్లించాలి. కనుక షేర్లు, ఈక్విటీ ఫండ్స్ విషయంలో పెట్టుబడి ఏడాది కాలాన్ని పూర్తి చేసుకున్న వెంటనే అందులోని మూలధన లాభాన్ని రూ.లక్ష వరకు తీసేసుకోవడం మంచి ఆలోచన అవుతుంది. కాకపోతే ఏడాది రాకుండా విక్రయిస్తే పన్ను భారం 15 శాతం అవుతుందని మర్చిపోవద్దు. అలాగే, మీ పోర్ట్ఫోలి యోలోని షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌కు అన్నింటికీ పన్ను లేని మూలధన లాభం గరిష్టంగా రూ.లక్షే అవుతుంది. ఒక్కో దానికి విడిగా రూ.లక్ష అనుకోవద్దు. ఇల్లు కొనుక్కోవడం ఈక్విటీ షేర్ల విక్రయాలపై ఎల్టీసీజీ పన్ను మినహాయింపు కోసం ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 54ఎఫ్ కింద.. నూతన ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణానికి ఆ మొత్తాన్ని వినియోగించాలి. కేవలం లాభాలే కాకుండా విక్రయం ద్వారా సమకూరిన మొత్తాన్ని నూతన ఇంటిపై వినియోగించాలి. మొదటి ఇంటికే ఇది పరిమితం. నూతన ఇల్లు కొనుగోలు అయితే ఈక్విటీ షేర్లను విక్రయించిన నాటి నుంచి రెండేళ్లలోగా చేయాలి. నూతన ఇంటి నిర్మాణం కోసం వినియోగించేట్టు అయితే మూడేళ్లలోగా చేయాలి. అంతేకాదు ఇలా చేసిన తర్వాత ఏడాది లోపు రెండో ఇల్లు కొనుగోలు చేయకూడదు లేదా మూడేళ్లలోపు రెండో ఇంటిని నిర్మించకూడదు. అలాగే మూలధన లాభాల పన్ను మినహాయింపునకు కొనుగోలు చేసిన మొదటి ఇంటిని లేదా నిర్మించుకున్న ఇంటిని మూడేళ్ల వరకు విక్రయించకూడదు. ఈ నిబంధనలను పాటించకపోతే కల్పించిన మినహాయింపులను త్యజించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. షేర్లను విక్రయించిన సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను రిటర్నుల దాఖలు సమయం సమీపిస్తున్నట్టయితే క్యాపిటల్ గెయిన్స్ డిపాజిట్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసుకుని రిటర్నుల్లో పేర్కొనాలి. ఆ తర్వాత చట్టం అనుమతించిన సమయంలోపు మొదటి ఇంటిని సమకూర్చుకోవడంపై వ్యయం చేయాల్సి ఉంటుంది. షేర్లను విక్రయించడానికి ముందు ఏడాదిలోపు నూతన ఇంటిని కొనుగోలు చేసినా పన్ను మినహాయింపు కోరవచ్చు. ఈక్విటీల్లో దీర్ఘకాల మూలధన లాభాలపై పన్ను భారం వద్దనుకుంటే అందుకోసం 54ఈసీ బాండ్లలో ఇన్వెస్ట్ చేసుకోవడం ఒక ఆప్షన్. ఎక్కువ ఆదా అయితేనే ప్రయోజనం చిన్న ఇన్వెస్టర్లకు ఇంతకు ముందు పేర్కొన్న విధాలనాలతో పన్ను ఆదా చేసుకోవడం సౌకర్యంగా ఉంటుంది. మరి రూ.కోట్లలో పెట్టుబడులను నిర్వహించే వారు ఏటా రూ.లక్ష వరకే మూలధ లాభాలను పరిమితం చేసుకోవడం ఆచరణలో అసాధ్యం. కనుక వారు మొత్తం పోర్ట్‌ఫోలియోని సమీక్షించుకుని.. స్వల్పకాల నష్టాల్లో ఉన్న స్టాక్స్‌ను విక్రయించడం ద్వారా.. అటు స్వల్పకాల మూలధన లాభాలు, దీర్ఘకాల మూలధన లాభాల పన్ను భారాన్ని కొంత వరకు అయినా తగ్గించుకోవచ్చు. ‘‘ఎల్‌టీసీజీని సరిగ్గా మదింపు వేసుకోవడమే కాకుండా లాభ, నష్టాల సర్దుబాటులో భాగంగా విక్రయించిన స్టాక్స్‌ను మరుసటి రోజు మళ్లీ కొనుగోలు చేసుకోవాలి. విక్రయించిన పెట్టుబడులను మళ్లీ ఇన్వెస్ట్ చేసేందుకు సమయం తీసుకుంటే ఈ లోపు ఆ నిధులు వేరే అవసరాలకు కరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా చేయడం వల్ల దీర్ఘకాల లక్ష్యాల విషయంలో రాజీపడాల్సి వస్తుంది. కాకపోతే ఇక్కడ కూడా ఒక రిస్క్ ఉంటుంది. విక్రయించిన ధరకే తిరిగి కొనుగోలు చేసకునే అవకాశం అన్ని సందర్భాల్లోనూ ఉంటుందని చెప్పడానికి లేదు. ధరల్లో గణనీయమైన వ్యత్యాసం కూడా రావచ్చు. విక్రయించిన తర్వాత స్టాక్ ధర పడిపోతే లాభమే కానీ, పెరిగిపోతేనే సమస్య. మ్యూచువల్ ఫండ్స్ అయితే విక్రయించిన మేర ఇన్వెస్టర్ బ్యాంకు ఖాతాకు చేరుకునేందుకు మూడు నుంచి ఐదు రోజుల వ్యవధి తీసుకోవచ్చు. కనుక తిరిగి ఇన్వెస్ట్ చేసే సమయానికి ధరల్లో వ్యత్యాసం వస్తే ఈ విధమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకనే ఇలా చేయడం వల్ల ఎంత మేర మూలధన లాభాల పన్ను ఆదా అవుతుందన్న అంచనాకు ముందుగానే రావాలి. కనీసం 10–20 శాతం మేర ఆదా అవుతుందనుకుంటే ధరల పరంగా రిస్క్‌ను అధిగమించే వెసులుబాటు ఉంటుంది. అంతేకానీ, కొద్ది మేర పన్ను ఆదా కోసం హోల్డింగ్స్‌ను విక్రయించడం అంతగా కలసిరాకపోవచ్చు. ఎందుకంటే స్టాక్స్ అయితే స్టాంప్ డ్యూటీ, బ్రోకరేజీ, ఎక్సే్ఛంజ్ చార్జీలు చెల్లించుకోవాలి. దీనికి ధరల్లో వ్యత్యాసం అదనం. -
ఆదాయపన్నులో.. స్టాండర్డ్ డిడక్షన్ అంటే..
పశ్చిమగోదావరి, నిడమర్రు : ఇటీవల ప్రవేశపెట్టిన 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లో ఆదాయపన్ను రిటర్న్ దాఖలు విషయంలో పన్ను శ్లాబుల్లో మార్పులేమీ చేయలేదు. కేవలం ప్రామాణిక మినహాయింపు(స్టాండర్డ్ డిడక్షన్)తో సరిపెట్టారు. 12 ఏళ్ల తర్వాత ఉద్యోగస్తులు, పెన్షనర్ల కోసం సాండర్డ్ డిడక్షన్‌ను తిరిగి ప్రవేశపెట్టడం ఉద్యోగస్తుల్లో కాస్త ఊరట లభించే అంశం. నూతన బడ్జెట్లో స్టాండర్డ్ డిడక్షన్ రూ.40 వేలుగా ప్రకటించారు. అసలు ఆదాయ పన్ను లెక్కల్లో స్టాండర్డ్ డిడక్షన్ అంటే ఏమిటి..? మినహాయింపు పొందే మార్గాలు తదితర సమాచారం తెలుసుకుందాం. 12 ఏళ్ల తర్వాత స్టాండర్డ్ డిడక్షన్ ఒక ఉద్యోగి ఆఫీసుకు వెళ్లి రావడానికి అయ్యే వ్యయాలను దృష్టిలో పెట్టుకొని గతంలో స్టాండర్డ్ డిడక్షన్ కింద ఆదాయంలోంచి కొంత మొత్తాన్ని తగ్గించి మిగిలిన దానిపై పన్ను లెక్కించేవారు. కానీ దీన్ని 2006–07 అసెస్మెంట్ ఇయర్లో తొలగించారు. అప్పట్లో స్టాండర్డ్ డిడక్షన్ రూ.30 వేలుగా ఉండేది. 12 ఏళ్ల తర్వాత తిరిగి రూ.40 వేలు స్టాండర్డ్ డిడక్షన్‌గా ప్రకటించారు. స్టాండర్డ్ డిడక్షన్ అంటే.. స్టాండర్డ్ డిడక్షన్ అంటే మినహాయించబడిన ఆదాయ పన్ను ప్రకారం దాని నుంచి మినహాయించడం, లేదా వ్యక్తి పెట్టిన పెట్టుబడి. ఈ ప్రయోజనం కోసం ఒక వ్యక్తి ఏదైనా పెట్టుబడి రుజువులు లేదా వ్యయం బిల్లులను బహిర్గతం చేయకూడదు. స్టాండర్డ్ డిడక్షన్ అనేది ఒక స్టాండర్డ్ రేటులో అనుమతించబడుతుంది. స్టాండర్డ్ డిడక్షన్ అర్థం.. స్టాండర్డ్ డిడక్షన్ అనేది స్థిర మినహాయింపు. సంస్థలో ఉన్న స్థానంతో నిమిత్తం లేకుండా జీతం నుండి తీయడం జరుగుతుంది. స్థిర డబ్బు వార్షిక జీతం నుంచి తీసివేయబడుతుంది. కాబట్టి ఇది పన్ను విధించదగిన ఆదాయాన్ని తగ్గిస్తుంది. అలాగే పన్ను చెల్లించిన మొత్తం కూడా తగ్గిపోతుంది. ఉద్యోగి, పింఛనుదారుడు స్టాండర్డ్ డిడక్షన్ పొందవచ్చు. ఈ ప్రయోజనం కోసం, జీతం వేతనం, వార్షికం, ఎసెస్మెంట్, పెన్షన్, ఫీజు, గ్రాట్యుటీ, కమిషన్, ముందు జీతం వంటి వాటికీ, ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 10 కింద తక్కువ అద్దెలు, గృహ అద్దె భత్యం, రవాణా భత్యం వంటివి ఉన్నాయి. అద్దె ఆదాయం నుంచి ప్రామాణిక మినహాయింపు భారతదేశంలో గృహ ఆస్తి నుంచి తలసరి ఆదాయం కింద వర్గీకరించబడిన అద్దె నుంచి వచ్చే ఆదాయం కోసం ప్రామాణిక మినహాయింపు అనుమతించబడుతుంది. 30 శాతం ప్రామాణిక మినహాయింపు అద్దె నుంచి ఆదాయం కోసం అనుమతించబడుతుంది. అద్దె నుంచి వచ్చే ఆదాయం సంపాదించిన వ్యక్తికి వార్షిక విలువ లేదా స్థానిక అధికారులకు చెల్లించిన పురపాలక మరియు ఇతర పన్నులను తగ్గించుకోవచ్చు ఉద్యోగులకు అందుబాటులో ఉన్న మినహాయింపులు స్టాండర్డ్ డిడక్షన్ నేపథ్యంలో ప్రస్తుతం పన్ను పరిధిలో ఉన్న రవాణా, వైద్య చికిత్స అలవెన్సుల్ని పన్ను పరిధిలోకి రూ.40 వేల వరకూ తెచ్చారు. జీతం నుంచి ఉద్యోగి ఆదాయం కింద ప్రామాణిక తగ్గింపు భాగంగా వినోదభత్యం, వృత్తి పన్ను పొందవచ్చు. ఇవే కాకుండా అనేక అంశాల్లో మినహాయింపు పొందేందుకు వీరు అర్హులు. మినహాయింపు పొందే వర్గాలు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్‌లో పెట్టుబడులు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్, ఐదేళ్ల టాక్స్ సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్, పెన్షన్ ప్లాన్స్, ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్స్, జీవిత బీమా పాలసీ, జాతీయ సేవింగ్స్ సర్టిఫికేట్స్, విద్యా రుణాన్ని తిరిగి చెల్లించడం, ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులు ఆదాయం పన్ను చట్టం కింద ఉద్యోగి ఆదాయంలో పొదుపును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆదాయం పన్ను చట్టం వ్యక్తిగత విభాగాల కింద తగ్గింపులకు అనుమతి ఇచ్చింది. విభాగం 80సీ, సెక్షన్ 80సీసీసీ, సెక్షన్ 80 సీసీడీలో పేర్కొన్న ప్రకారం ఏదైనా పెట్టుబడి పెట్టి ఉంటే, అప్పుడు మొత్తం పెట్టుబడి సంవత్సరానికి రూ.1.5 లక్షలు తగ్గించుటకు అర్హులు. దీంతో పాటు నేషనల్ పెన్షన్ పథకంలో (ఎన్పీఎస్) పెట్టుబడి పెట్టడానికి 80సీసీడీ కింద రూ.50 వేల ఆదనపు మినహాయింపు అందుబాటులో ఉంది. -
వ్యాగన్ వర్క్‌షాపునకు కదలిక
రాష్ట్రంలోనే ఇలాంటి వర్క్‌షాపు విజయవాడలో ఉంది. వడ్లపూడిలో ఏర్పాటు కానున్నది రెండో వ్యాగన్ వర్క్‌షాపు. అయితే విజయవాడ వర్క్‌షాపు కంటే అత్యాధునిక యంత్ర పరికరాలు, సామగ్రిని కలిగి ఉంటుంది. సాక్షి, విశాఖపట్నం: వడ్లపూడిలో నిర్మించ తలపెట్టిన వ్యాగన్ వర్క్‌షాపునకు ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఈ బడ్జెట్లో రూ.150 కోట్లు కేటాయించడంతో త్వరలోనే ఈ వ్యాగన్ వర్క్‌షాపు పనులు ప్రారంభం కానున్నాయి. ఈ వ్యాగన్ వర్క్‌షాపును 2015–16 రైల్వే బడ్జెట్లో మంజూరు చేశారు. అప్పట్లో దీనికి రూ.213.97 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. 2016–17లో రూ.30 కోట్లు, 2017–18లో రూ.80 కోట్లు వెరసి రూ.110 కోట్లు కేటాయించారు. అయినప్పటికీ రైల్వే మంత్రిత్వశాఖ తీసుకున్న నిర్ణయాల వల్ల జాప్యం జరుగుతూ వచ్చింది. పలు తర్జన భర్జనల అనంతరం ఈ వర్క్‌షాపునకు గత జూన్ 15న అప్పటి రైల్వే మంత్రి సురేష్‌ప్రభు విజయవాడ నుంచి వీడియో లింకు ద్వారా శంకుస్థాపన చేశారు. 240 ఎకరాలు కేటాయింపు వడ్లపూడిలో ఈ వ్యాగన్ వర్క్‌షాపు నిర్మాణానికి 240 ఎకరాలు కేటాయించారు. దీని నిర్మాణ బాధ్యతను చేపట్టడానికి తొలుత బీహార్‌లోని పాట్నాకు చెందిన ఓ సంస్థ ముందుకొచ్చింది. కానీ కొన్నాళ్ల తర్వాత వెనక్కి తగ్గింది. దీంతో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్)కు అప్పగించారు. ఈ వ్యాగన్ వర్క్‌షాప్ వ్యయం రూ.328.81 కోట్లకు పెరుగుతుందని ఆ సంస్థ అంచనా వేసింది. ఇందులో సివిల్ ఇంజినీరింగ్ పనులకు రూ.137 కోట్లు, మెకానికల్‌కు రూ.126 కోట్లు, విద్యుత్ పనులకు రూ.22 కోట్లు, సిగ్నలింగ్, టెలికాం అవసరాలకు రూ.8 కోట్లు, ఇతరత్రా పనులకు రూ.36 కోట్లు అవసరమవుతుందని పేర్కొంది. దీనికి రైల్వేశాఖ కూడా ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ పీరియాడికల్ ఓవర్ హాలింగ్ (పీవోహెచ్) వ్యాగన్ వర్క్‌షాపు పనులు ప్రారంభం కావడానికి మార్గం సుగమమైంది. మరమ్మతులు, నిర్వహణ పనులు ఈ వర్క్‌షాపులో 200 వరకు పాసింజరు, ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైళ్ల బోగీలు, ఆయిల్ ట్యాంకర్లకు మరమ్మతులు, నిర్వహణ పనులు చేయడానికి వీలవుతుంది. ఇన్నాళ్లూ నిధులు కేటాయించినా, శంకుస్థాపన చేయడానికి వీలుపడలేదు. శంకుస్థాపన జరగకుండా పనులు మొదలు పెట్టే అవకాశం లేదు. ఈ బడ్జెట్లో ఆశించిన స్థాయిలో రూ.150 కోట్లు కేటాయించడంతో త్వరలోనే ఈ వ్యాగన్ వర్క్‌షాపు పనులు మొదలు పెడతామని రైల్వే వర్గాలు ‘సాక్షి’కి చెప్పాయి. దీంతో వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఈ వ్యాగన్ వర్క్‌షాప్‌ను పూర్తి చేస్తామని చెబుతున్నాయి. -
టీడీపీలో అంతర్మథనం
సాక్షి, విజయవాడ : జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నేతల్లో అంతర్మథనం ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వ ఆఖరి బడ్జెట్లోనూ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు, రాజధాని అమరావతి నిర్మాణానికి కావాల్సిన నిధులు రాబట్టలేకపోవడం, విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ సాధించలేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీ ఎంపీల వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. నిన్నమొన్నటి వరకు రాష్ట్రానికి కేంద్రంగొప్పగా చేస్తోందని, కేంద్రాన్ని ఒత్తిడి చేస్తే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అంటూ కల్లబొల్లిమాటలతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రజలను మభ్యపెడుతూ వచ్చారు. తాజాగా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం చేయడంతో ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులకు అర్థం కావడం లేదు. కేంద్రమంత్రి, ఎంపీల తీరుపై విమర్శలు బీజేపీతో పూర్తిగా తెగదెంపుల దాకా రానీయకుండా జాగ్రత్తపడాలని పార్టీ ముఖ్యనేతల నుంచి సూచనలు రావడంతో జిల్లా ఎంపీలు కొనకళ్ల నారాయణ, కేశినేని శ్రీనివాస్ పార్లమెంట్లో నిరసన తెలిపేందుకే పరిమితమయ్యారు. ఎంపీ కేశినేని నాని కాంగ్రెస్‌ను తప్పుపట్టేందుకే ప్రాధాన్యత ఇచ్చి, కేంద్రాన్ని నిలదీయలేదు. తీవ్ర అన్యాయం జరుగుతన్న సమయంలో తన పదవికి రాజీనామా చేసి, ముందుండి పోరాడాల్సిన జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి సుజనాచౌదరి సహచర కేంద్రమంత్రులతో చర్చలు జరపడం, ప్రధాని ప్రసంగానికి అభినందలు తెలపడం వంటి చర్యలతో ప్రజాగ్రహానికి గురయ్యారని టీడీపీ నాయకులే అంగీకరిస్తున్నారు. మిత్రపక్షం నుంచీ తప్పని విమర్శలు కేంద్రంపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలను జిల్లా బీజేపీ నేతలు అదేస్థాయిలో తిప్పికొడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ఓట్ల కోసం ప్రజల వద్దకు వెళ్లలేని దుస్థితి దాపురిస్తుందని కొందరు టీడీపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. పేదలకు పక్కా ఇళ్లు, బీమా తదితర కేంద్ర ప్రభుత్వ కార్యాక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను పెట్టకపోవడాన్ని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రానికి ముఖ్యంగా విజ యవాడ అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులను సద్వి నియోగం చేయలేదంటూ ఆరోపిస్తున్నారు. బీజేపీ మంత్రి కామినేని శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వం విషయంలో మౌనంగా ఉన్నప్పటికీ టీడీపీ ప్రజాప్రతినిధులు, ఆపార్టీ నాయకుల అవినీతిని జిల్లా, సిటీ బీజేపీ అనుబంధ సంఘాల నాయకులు ఎండగుతున్నారు. జిల్లాలోని వామపక్షపార్టీలు కూడా తమనే తప్పుపట్టడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే జిల్లాలో అనేక నియోజకవర్గాలో టీడీపీ నేతల మధ్య సఖ్యత లోపించడంతో రెండు వర్గాలకు దూరంగా ఉంటున్న కార్యకర్తలు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల వద్దకు వెళ్లకపోవడమే మంచిదనే ఆలోచనలో ఉన్నారు. హోదాపై వైఎస్సార్ సీపీ నేతలు ఆందోళనలు రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, రైల్వేజోన్, పోలవరానికి నిధులు వంటి అంశాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మొదటి నుంచీ పోరాడుతూ ప్రజల్లోకి చొచ్చుకెళ్తున్నారు. పార్టీ మచిలీపట్నం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి, విజయవాడ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లాది విష్ణు, ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల ఇన్చార్జులు ఎప్పటికప్పుడు ప్రత్యేక హోదా, ఇతర అంశాలపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతున్నారు. రాజధాని రైతుల వద్ద బలవతంగా భూములు లాక్కోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాకు వచ్చి రైతులకు అండగా ధర్నా చేయడాన్ని జిల్లా వాసులు మరిచిపోలేదు. పంటలు ఎండిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా పర్యటించిన రైతులకు భరోసా ఇచ్చారు. టీడీపీ అధిష్టానం చేసిన తప్పులకు ప్రజల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను ఏవిధంగా తట్టుకోవాలో తెలియక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. -
ఆ భాషేంటి.. పార్థా..
♦ ‘ఈ... కొడుకులను చెప్పుతో కొట్టి అరెస్టు చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టండి. వీళ్లను వదలొద్దు. తమాషా చేస్తారా? వాళ్ల సంగతి చూడు.’ ♦ ఈ నెల 8న పెనుకొండలో ధర్నా చేస్తున్న విపక్షనేతపై బీకే పార్థసారథి చేసిన వ్యాఖ్యలు ♦ ‘... నా కొడకా, అవతారం చేస్తావా? ...మూసుకుని ఉండవోయి. ఈ నా కొడుకును తీసుకెళ్లి కేసులు పెట్టండి. అప్పుడు తెలుస్తాది.’ ♦ ఇంటింటికీ టీడీపీలో బ్రహ్మసముద్రంలో సొంత పార్టీ కార్యకర్తపై పార్థుడి దురుసు ♦ బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధి విచక్షణ మరిచి రెచ్చిపోతున్న వైనమిది. ఓట్లేసి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటున్న తీరిదీ. నరం లేని నాలుక పలుకుతున్న బూతు పురాణమిది. అడ్డూఅదుపు లేకుండా.. రాయలేని భాషను ఉపయోగిస్తున్న తీరు ప్రజల్లోనే కాదు.. రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమవుతోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం:ఆ ఎంపీ.. ఈ ఎమ్మెల్యే అంతే. నోటికి ఏది వస్తే అది.. ఏది తోస్తే అది అనేయడమే. ఇప్పటి వరకు టీడీపీలో ఆ ఇద్దరికే పరిమితమైన నోటి దురుసును మరో ఎమ్మెల్యే అందిపుచ్చుకున్నారు. పెనుకొండ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బి.కె.పార్థసారథి వ్యవహారం అందరినీ కలవరపరుస్తోంది. ఓటమి భయమో.. పార్టీ తీరుతోనే ఆయన ఇటీవల కాలంలో విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. బూతులు తిట్టడం.. కేసులు నమోదు చేయండని పోలీసులను పురమాయించడం చూస్తుంటే ప్రజాస్వామ్యం ఏమైపోతుందనే చర్చకు తావిస్తోంది. ఇటీవల ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో పార్థసారథి సోమందేపల్లి మండలం బ్రహ్మసముద్రంలో పర్యటించారు. అప్పుడు జగన్ అనే టీడీపీ కార్యకర్త గ్రామ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. గ్రామంలో రోడ్లు, మంచినీళ్లు తదితర కనీస సౌకర్యాలు కూడా లేవని.. ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు రావడం, వెళ్లిపోవడం మినహా సమస్యలను పట్టించుకోవట్లేదని వాపోయాడు. ఓట్లేసి గెలిపించిన ఓటరుగా ప్రశ్నించే హక్కు ఆయనకుంది. ఇందుకు బాధ్యతగా సమాధానం చెప్పాల్సిన ఎమ్మెల్యే పార్థు తీవ్ర పదజాలంతో దూషించిన తీరు అక్కడి ప్రజలను నివ్వెరపోయేలా చేసింది. కేసులు పెట్టండని పోలీసులను పురమాయించడంతో భయాందోళనకు లోనైన ఆ వ్యక్తి పది రోజులకు పైగా గ్రామం విడిచి వెళ్లి హిందూపురంలో తలదాచుకోవడం గమనార్హం. బంద్ సమయంలోనూ బూతులు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఈనెల 8న సీపీఐ, సీపీఎంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో వామపక్ష పార్టీల నేతలు పెనుకొండలోని అంబేద్కర్ సర్కిల్‌కు చేరుకున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే పార్థసారథి కారులో అటుగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిల్చున్నారు. అక్కడ కారుకు అడ్డంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వామపక్ష నేతలు నినాదాలు చేశారు. కొందరు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గళంవిప్పారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే వారిని బూతులు తిడుతూ నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేయాలని సీఐ శ్రీనివాసులును ఆదేశించారు. బ్రహ్మసముద్రం, పెనుకొండలోనే కాదు చాలా సందర్భాల్లో పార్థసారథి ఇలా విచక్షణ కోల్పోయి మాట్లాడారు. దీనిపై నియోజకవర్గ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ, వైఎస్సార్ విద్యార్థి విభాగం నేతలు పెనుకొండలో పార్థసారథి దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు. -
పతాక స్థాయికి లీకుల డ్రామా
సాక్షి, అమరావతి: టీడీపీ లీకుల డ్రామా శుక్రవారం రాత్రి పతాక స్థాయికి చేరింది. పార్లమెంట్ వాయిదా పడిన తర్వాత జరిగిన ఒక సమావేశంలో విభజన హామీలన్నింటినీ అమలు చేసేందుకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అంగీకరించారంటూ ఆ పార్టీ కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. జైట్లీ, అమిత్‌షా, పీయూష్ గోయల్, సుజనా చౌదరిలు సమావేశమై, హామీల అమలుకు అంగీకరించినట్లు మీడియాకు విస్తృతంగా లీకులిచ్చింది. ప్రధాని మోదీ గానీ, అరుణ్ జైట్లీ రెండుసార్లు పార్లమెంట్లో చేసిన తమ ప్రసంగాల్లో గానీ ఎక్కడా విభజన హామీలు అమలు చేస్తామని చెప్పలేదు. జైట్లీ పార్లమెంట్లో రెండుసార్లు మాట్లాడినప్పుడు ఇవ్వని హామీలను సభ వాయిదా పడిన తర్వాత జరిగిన సాధారణ సమావేశంలో ఇచ్చేసినట్లు శుక్రవారం అర్ధరాత్రి టీడీపీ అనుకూల మీడియాలో ఊదరగొట్టారు. పోరాటం పేరుతో పార్లమెంట్లో ఎంత హడావుడి చేసినా అదంతా డ్రామాయేనని పసిగట్టిన కేంద్రం తెలుగుదేశం పార్టీని ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో తాము నడిపిన డ్రామా అంతా విఫలమైందని గ్రహించిన చంద్రబాబు శుక్రవారం రాత్రి మరో కొత్త లీకుల నాటకానికి తెరలేపారు. ఇవీ లీకులు...: విభజన హామీలన్నీ అమలు చేసేందుకు కేంద్రం అంగీకరించిందని టీడీపీ నేతలు లీకులు వదిలారు. రాజ్యసభ వాయిదా పడిన తర్వాత కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్, అమిత్‌షాలు సుజానా చౌదరితో అత్యవసరంగా సమావేశమై, టీడీపీ చేసిన అన్ని డిమాండ్లను ఒప్పుకున్నట్లు లీకులిచ్చారు. రెవెన్యూ లోటు (2014–15లో పది నెలలకు) భర్తీకి, ప్రత్యేక ప్యాకేజీ నిధులన్నింటినీ ఒకేసారి ఇచ్చేందుకు, ఈఏపీ నిధులు సర్దుబాటు చేసేందుకు అంగీకరించినట్లు ప్రచారం చేశారు. దుగరాజపట్నం పోర్టు నిర్మాణానికి ఇస్రో అభ్యంతరం తెలపడంతో రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మరోచోట నిర్మాణానికి కేంద్రం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చినట్లు ప్రచారం మొదలుపెట్టారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వేజోన్ ఏర్పాటుపైనా ప్రకటన చేస్తామని, రాజధాని అమరావతి నిర్మాణానికి చేసిన ఖర్చుల వివరాలు పంపితే వెంటనే నిధులు విడుదల చేస్తామని జైట్లీ చెప్పినట్లు వల్లెవేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేసినట్లు లీకులిచ్చారు. అయితే, పార్లమెంట్లో ఎంత హంగామా చేసినా అక్కడ ఇవ్వని ఈ హామీలను ప్రైవేట్ సమావేశంలో బేషరతుగా ఇచ్చేందుకు జైట్లీ ఒప్పేసుకున్నారని విస్తృతంగా ప్రచారం చేయడం చూసి టీడీపీ వర్గాలే ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. నాలుగేళ్లుగా ఇవ్వని వీటన్నింటినీ రాత్రికి రాత్రి, అదీ మోదీ విదేశాలకు వెళ్లిన సమయంలో ఇచ్చేందుకు జైట్లీ సాహసిస్తారా? అని అనుమానిస్తున్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి చంద్రబాబు ఆడిస్తున్న నాటకంలో ఇది పతాక సన్నివేశమని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
ఇదేం అ'న్యాయం'!
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు.. ఇందులో ఎవరికీ అభ్యంతరం లేదు.. కానీ అందుకు ఆయన ఎంచుకున్న సమయం.. సందర్భం.. పక్కనే కొనసాగుతున్న మత్స్యకారుల దీక్షలను పట్టించుకోకపోవడం ఇప్పుడు వివాదానికి తావిస్తున్నాయి. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టి వారమైంది. ఇన్నాళ్లూ నోరుమెదపని వాసపల్లి ఈరోజే పనిగట్టుకొని కొంతమందిని వెంటేసుకొచ్చి నిరసన పేరుతో కాసేపు హడావుడి చేశారు.. ఆ పక్కనే తన సామాజికవర్గీయులే ఎస్టీ జాబితాలో చేర్చాలని 43 రోజులుగా చేస్తున్న దీక్షలను మాత్రం ఆయనగారు పట్టించుకోలేదు.. కనీసం శిబిరం వైపు కన్నెత్తి చూడలేదు.. బడ్జెట్ కేంద్రం పరిధిలోనిది.. తనకు ప్రత్యక్ష ప్రమేయం లేకపోయినా ఏదో చేశానన్న మెహర్బానీ కోసం నిరసన తెలిపిన ఎమ్మెల్యే.. రాష్ట్ర పరిధిలోని అంశమైన మత్స్యకారుల ఎస్టీ సాధన డిమాండ్‌ను పట్టించుకోకపోవడం.. సీఎంను ఒప్పించ లేకపోవడం.. దీక్షలను ఉపేక్షించడంపై నిరసన వ్యక్తమవుతోంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న దక్షిణ నియోజకవర్గంలోనే మత్స్యకార జనాభా ఎక్కువగా ఉన్నా.. ఎమ్మెల్యే వాసుపల్లి అంటీముట్టనట్లు వ్యవహరించడం చర్చలకు తావిచ్చింది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: టీడీపీ నగర అధ్యక్షుడు, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ వ్యవహారశైలి మరోసారి వివాదాస్పదమైంది. కేంద్ర బడ్జెట్‌కు నిరసనగా బుధవారం నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తనదైన శైలిలో నిరసన చేపట్టిన ఎమ్మెల్యే.. ఆ పక్కనే ఉన్న మత్స్యకారుల దీక్షా శిబిరం వైపు తొంగిచూడకపోవడం విమర్శలపాలవుతోంది. తమను ఎస్టీ జాబితాలో చేర్పించాలంటూ పార్టీలకతీతంగా మత్స్యకారులు గత డిసెంబర్ 27 నుంచి నిరవధిక దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో దీక్షాశిబిరం జోలికి వెళ్లని వాసుపల్లి.. సీఎం చంద్రబాబునాయుడు నగరానికి వచ్చినప్పుడు మాత్రం ఏదో చేశానని చెప్పుకోవడానికి మత్స్యకార నాయకులను ఆయన వద్దకు తీసుకుని వెళ్లారు. కానీ సీఎం అందరి ముందు వాసుపల్లిని చెడామడా తిట్టేశారు. ఆయనతోపాటు మత్స్యకార నేతలపైనా బాబు విరుచుకుపడ్డారు. కనీసం వినతిపత్రం కూడా తీసుకోకుండా ‘తొక్క తీస్తా.. బ్లాక్మెయిల్ రాజకీయాలు నా వద్ద చేస్తున్నారా’.. అంటూ వాసుపల్లి ముందే మత్స్యకారులపై మండిపడ్డారు. న్యాయమైన డిమాండ్‌తో శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న మత్స్యకారులపై సీఎం అలా మాట్లాడినా వాసుపల్లి ఏమీ స్పందించలేని పరిస్థితిలో మిన్నకుండిపోయారు. ఆ ఘటన దరిమిలా వాసుపల్లి మత్స్యకారుల దీక్షాశిబిరం జోలికి వెళ్లలేదు. పోలీసులు వేధిస్తున్నా.. పట్టించుకోని ఎమ్మెల్యే మరోవైపు ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శాంతియుత దీక్షలతో నిరశన తెలియజేస్తున్న మత్స్యకారులపైకి ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పింది. దీక్షలకు అనుమతి లేదంటూ శిబిరాన్ని ఎత్తివేయాలని గత రెండు రోజులుగా నేతలపై పోలీసులు ఒత్తిడి తెస్తున్నారు. శ్రీకాకుళంలో మత్స్యకారుల దీక్షలు భగ్నం చేసేందుకు కొంతమంది ప్రభుత్వ అనుకూల కుట్రదారులు దీక్షా శిబిరానికి నిప్పు పెట్టారు. అటువంటి ఘటనలు ఇక్కడా చోటుచేసుకోవచ్చన్న నెపంతో పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. వాస్తవానికి అటువంటి పరిస్థితి విశాఖలో లేదు. గత 43రోజులుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రశాంతంగానే దీక్షలు కొనసాగుతున్నాయి. కానీ పోలీసులు మాత్రం ఓ విధంగా మత్స్యకార నేతలను వేధిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మత్స్యకారులకు అండగా నిలవాల్సిన వాసుపల్లి అస్సలు పత్తా లేకుండా పోయారు. బుధవారం బడ్జెట్‌పై నిరసన చేపట్టిన సందర్భంగానైనా పక్కనే ఉన్న మత్స్యకారుల శిబిరం వద్దకు వస్తారని అందరూ భావించారు. కానీ ఎమ్మెల్యే అటు వైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలపాలవుతోంది. వాసుపల్లి తీరు గర్హనీయం ఓ వైపు పగపట్టిన విధంగా ప్రభుత్వ తీరు.. పోలీసుల ఆంక్షలతో నిరసనకారులు అల్లాడిపోతుంటే కనీసం దీక్షా శిబిరం వద్దకు రావాలన్న కనీస స్పృహ కూడా ఎమ్మెల్యే వాసుపల్లికి లేకపోయిందని వైఎస్సార్సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు విమర్శించారు. న్యాయమైన డిమాండ్‌తో గంగపుత్రులు 43 రోజులుగా దీక్షలు చేస్తుంటే ఎమ్మెల్యేగా, మత్స్యకార వర్గీయునిగా ఉన్న వాసుపల్లి ఏమాత్రం పట్టించుకోకపోవడం గర్హనీయమన్నారు. తీరిక లేదేమో దీక్షా శిబిరం వైపు తొంగిచూడని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తీరుపై మత్స్యకారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని మత్స్యకార సంఘం నేత నీలకంఠం వ్యాఖ్యానించారు. బహుశా ఆయనకు తీరిక లేదేమో.. అందువల్లనే వచ్చి ఉండరు.. అని వ్యంగాస్త్రం సంధించారు. -
మౌన ముని..!
సాక్షిప్రతినిధి, విజయనగరం: ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభిమతానికి విరుద్ధంగా రాష్ట్రాన్ని విడగొట్టారు. విభజన సమయంలో కొన్ని హామీలు ఇచ్చారు. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ఒకవేళ కేంద్రం వాటిని విస్మరిస్తే గుర్తు చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మన రాష్ట్ర ఎంపీలు, కేంద్ర మంత్రులపై ఉంది. టీడీపీ మంత్రులు, ఎంపీలు ఈ విషయంలో ఇన్నాళ్లూ మౌనం వహించారు. దాని ఫలితంగా కేంద్ర బడ్జెట్లో ఏపీకి నిరాశే ఎదురైంది. దీంతో ప్రజల్లో వ్యతిరేకత ఉవ్వెత్తున లేచింది. దాని నుంచి తప్పించుకోవడానికి టీడీపీ ఎంపీలు ఢిల్లీలో ఆందోళన మొదలుపెట్టారు. కేంద్ర మంత్రి స్థానంలో ఉన్న జిల్లాకు చెందిన అశోక్ గజపతిరాజు అయితే టీడీపీ అధినేత చంద్రబాబును సైతం లెక్కచేయడం లేదు. బీజేపీని ఇరకాటంలో పెట్టే పనులకు దూరంగా ఉంటున్నారు. తాజా పరిణామాలు, టీడీపీతో కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు నడుచుకుంటున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. ఏమీ ఇవ్వకపోయినా.. కేంద్ర బడ్జెట్ తర్వాత జనంలో వచ్చిన వ్యతిరేకత చూసి ఎంపీలతో సీఎం అమరావతిలో పెట్టిన సమావేశానికి అశోక్ హాజరు కాకపోగా ఢిల్లీలో టీడీపీ ఎంపీలు చేసిన ఆందోళనలోనూ పాల్గొనలేదు. తర్వాత ఇతర మంత్రులతో కలి సి కేంద్రంలోని పెద్దలను కలిసి వినతిపత్రం ఇచ్చి సరిపెట్టారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపులు చూసి టీడీపీ నేతలు బీజేపీపై విమర్శలు చేస్తు న్నా అశోక్ మాత్రం ఒక్కమాట కూడా కేంద్రాన్ని అనడం లేదు. పోనీ సొంత జిల్లాకేమైనా తెచ్చుకోగలిగారా అంటే అదీ లేదు. బడ్జెట్లో భోగాపురం విమానాశ్రయానికి నిధులు లేవు. వైద్య కళాశాల ఊసెత్తలేదు. గిరిజన యూనివర్సిటీకి పిడికెడు నిధులతో సరిపెట్టారు. అయినా అశోక్ బీజేపీపై ఒక్క విమర్శ కూడా చేయడం లేదు. జిల్లాపైనా పట్టువదిలేసి.. కేంద్రంలో ఉన్న బీజేపీని పల్లెత్తు మాట అనని అశోక్ గజపతిరాజు జిల్లాపైనా పట్టు వదిలేస్తున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు.. విజయనగరం జిల్లాకు చెందిన మరో మంత్రి సుజయకృష్ణ రంగారావు, కొందరు ఎ మ్మెల్యేలతో విశాఖ జిల్లాలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అశోక్ తీరును పట్టించుకోకుండా త నే అన్నీయై జిల్లా పార్టీ వ్యవహారాలు నడిపిస్తూ వర్గాలుగా విడగొడుతున్నారు. ఇంకోవైపు టీడీ పీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కిమిడి కళావెంకటరావు కూడా జిల్లాపై పెత్తనం చేస్తున్నారు. తన కు ప్రాభవం ఉన్న పార్వతీపురం ప్రాంతంపై పట్టు సాధిస్తూ జన్మభూమి సభల్లోనూ పాల్గొం టున్నారు. ఈ పరిణామాలు అశోక్‌కు, టీడీపీకి మధ్య ఏర్పడుతున్న దూరానికి నిదర్శనమనే వాదనలు జిల్లాలో బలంగా వినిపిస్తున్నాయి. అంతా తెలిసే: నిజానికి కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు ఇదంతా కావాలనే చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీని వీడే అవకాశాలున్నాయని గతంలోనే వార్తలు వచ్చినప్పటికీ కనీసం వాటిని ఖండించని అశోక్ జిల్లాకు, టీడీపీకి దూరంగానే ఉంటున్నారు. జిల్లా మంత్రులతో ఎలాంటి సమీక్షలు నిర్వహించడం లేదు. గంటాను తన నెత్తిన తెచ్చిపెట్టారన్న కోపంతో సీఎం చంద్రబాబును ఖాతరు చేయడం లేదు. పైగా వచ్చే ఎన్నికల్లో బీజేపీ పంచన చేరే ఆలోచన ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయంటే వాటిలో ఎంతోకొంత నిజం లేకపోదు. ఈ నేపథ్యంలోనే బీజేపీపై విమర్శలు చేయకపోవడం, బడ్జెట్నపై నోరు విప్పకపోవడం, సీఎం సమావేశాలకు సైతం వ్యక్తిగత కారణాలు చూపి డుమ్మా కొట్టడం వంటి చర్యలు తెలిసే.. కావాలని అశోక్ చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఎన్నో ఏళ్లుగా టీడీపీలో పెద్దగా మెలుగుతున్న అశోక్‌గజపతిరాజుకు ఇప్పుడు ఆ పార్టీపైనా, జిల్లా ప్రజలపైన కూడా పెద్దగా ప్రేమ కనిపించడం లేదు. -
అక్కడ ఆమోదించి... ఇక్కడ డ్రామాలా?
విజయవాడసిటీ: కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయం, విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా కోరుతూ ఈనెల 8వ తేదీ వామపక్షాలు ఇచ్చిన బంద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్ష, కార్యనిర్వాహక అధ్యక్షులు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు ప్రకటించారు. బీసెంట్‌రోడ్డులోని మల్లాది విష్ణు కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. బంద్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజ, మహిళా విభాగాలతో పాటు అన్ని అనుబంధ సంఘాలు కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు. కేంద్ర కేబినెట్లో భాగస్వామిగా ఉన్న టీడీపీ.... పార్లమెంటు లోపల బడ్జెట్‌కు ఆమోదం తెలిపి, మరో వైపు బయటకొచ్చి డ్రామాలాడుతోందని ధ్వజమెత్తారు. ఇవన్నీ చంద్రబాబు చేస్తున్న కొత్తడ్రామాలేనని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎమ్మెల్సీ సోమువీర్రాజు చేసిన ఆరోపణలు వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా ఏమి సాధించలేక దుక్కుతోచని స్థితిలో టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏకైక వీరుడు వైఎస్ జగన్ అనే విషయాన్ని గుర్తు చేశారు. కుంభకోణాలపై న్యాయ విచారణ చేయాలి... రాజధాని అమరావతిలో రోజుకొకటి చొప్పున వెలుగులోకి వస్తున్న భూ కుంభకోణాలపై న్యాయవిచారణ జరిపించాలని మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మందడంలో గౌస్ ఖాన్ అనే భూమిలేని వ్యక్తికి ల్యాండ్ పూలింగ్‌లో ప్లాట్లు కేటాయించడం, అతినికి మూడున్నర కోట్ల రూపాయల మేరకు ప్రయోజనం కల్పించడం వెనుక సీఆర్డీఏ పాత్ర స్పష్టంగా ఉనట్లు తెలుస్తోందన్నారు. -
టీడీపీ ఎంపీలది రెండు నాల్కల ధోరణి
నక్కపల్లి (పాయకరావుపేట) : కేంద్రబడ్జెట్లో రాష్ట్రానికి నిధులు కేటాయింపుల్లో జరిగిన అన్యాయంపై టీడీపీ ఎంపీలు రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారని వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త వరుదు కల్యాణి ఆరోపించారు. సోమవారం ఆమె నక్కపల్లిలో విలేకర్లతో మాట్లాడుతూ విభజన చట్టంలో హామీలను నెరవేర్చాలని పార్లమెంట్లో ఒత్తిడి చేయలేక చేతకాని దద్దమ్మల్లా ఉండిపోయారని ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. ఏపీకీ ప్రత్యేకహోదా, విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ సాధించడంలో వీరంతా విఫలమయ్యారని కల్యాణి విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంపై వైఎస్సార్ సీపీ ఎంపీలే పార్లమెంట్లో గట్టిగా నినాదాలు చేశారంటూ ఈరోజు వరకు కూడా వైఎస్సార్సీపీ ప్రత్యేక హోదా కోసం రాజీలేనిపోరాటం చేస్తోందన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే కేంద్ర సహాయ నిరాకరణకు నిరసనగా తమ పార్టీ ఎంపీలు, మంత్రులతో∙రాజీనామాలు చేయించి ప్రజాతీర్పుకోరాలని ఆమె సవాల్ విసిరారు. సమావేశంలో సమన్వయకర్త వీసం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
తోడు దొంగల కొత్త నాటకం
అనంతపురం: కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ప్రజలంతా గగ్గోలు పెడుతుంటే వారి దృష్టి మళ్లించేందుకే టీడీపీ, బీజేపీ నేతలు తోడు దొంగల్లా పరస్పర విమర్శలతో కొత్త నాటకానికి తెర తీశారని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో లాయర్లు చేస్తున్న ఆందోళనకు సంపూర్ణ మద్దతునిస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు అవినీతిని బీజేపీ ఎమ్మెల్సీ కొత్తగా చెప్పాల్సిందేమీ లేదని, రెండెకరాల నుంచి లక్షల కోట్లు ఎలా సంపాదించారో ప్రజలకు తెలుసన్నారు. తామెప్పుడూ ప్రజల పక్షాన ఉంటామని, అధికారం కోసం మీలా కేంద్రానికి దాసోహం కామని టీడీపీ నాయకులపై మండిపడ్డారు. నాలుగేళ్లుగా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. నిధుల కేటాయింపు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, రైల్వేజోన్, రాజధాని నిర్మాణం, పోలవరం, దుగరాజపట్నం పోర్టు, కడప ఉక్కు పరిశ్రమ ఇలా అన్నింటా మోసపోతున్నామన్నారు. అసెంబ్లీలో తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పలుమార్లు ప్రశ్నించారని గుర్తు చేశారు. రాజకీయంగా విభేదాలున్నా ప్రత్యేకహోదా విషయంలో కలిసికట్టుగా ముందుకెళ్దామని చెబితే తమను హేళన చేశారన్నారు. టీడీపీ హంగామాప్రచారానికే.. ‘ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. అభివృద్ధి ఎలా చేయాలో తెలుసు. నిధులు ఎలా తెచ్చుకోవాలో తెలుసు’ అని చెప్పిన సీఎం చంద్రబాబుకు ఈ రోజు అసలు విషయం తెలుస్తోందా? అని మండిపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామన్న సీఎం ఈ రోజు రాష్ట్రంలో ఏమి చేస్తున్నారో.. అభివృద్ధి ఎక్కడ చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డులు పట్టుకుని టీడీపీ ఎంపీలు చేసిన హంగామా కేవలం ప్రచారానికే అనేది ప్రజలకు అర్థమైందన్నారు. దమ్ముంటే రాజీనామాలు చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న ఆందోళనలో పాల్గొనాలని సవాల్ విసిరారు. బీజేపీ ఎమ్మెల్సీ వీర్రాజు వైఎస్సార్సీపీ కోవర్టు అని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ ఆయన మా పార్టీ కోవర్టయితే చంద్రబాబు బీజేపీ కోవర్టా? అని ఎద్దేవా చేశారు. బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఈనెల 8న వామపక్షాలు చేస్తున్న బంద్‌లో వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ మేయర్ రాగే పరుశురాం, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైవీ శివారెడ్డి, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఆలుమూరు శ్రీనివాసరెడ్డి, గోగుల పుల్లయ్య, బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
8న జిల్లా బంద్
కాకినాడ రూరల్: కేంద్ర బడ్జెట్లో నవ్యాంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేశారని, దీనికి నిరసనగా ఈనెల 8న రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని జిల్లాలోని పది వామపక్షాలు పిలుపునిచ్చాయి. ఆదివారం సాయంత్రం కాకినాడలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన వామపక్షాల సమావేశంలో పలువురు నాయకులు బడ్జెట్‌పై చర్చించి రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం, విశాఖ రైల్వేజోన్‌ను ప్రకటించకపోవడం, ప్రత్యేక హోదా ఇవ్వకపోగా, ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వకపోవడాన్ని వామపక్ష నాయకులు తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై రాష్ట్ర వ్యాప్తంగా పది వామపక్షాలు రాష్ట్ర బంద్‌కు పిలుపు నిచ్చాయన్నారు. అందులో భాగంగా జిల్లాలో కూడా బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంతి చంద్రబాబునాయుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో లాలూచీ పడి, రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని, ఇప్పుడు కేంద్రబడ్జెట్‌పై మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే 8వ తేదీన రాష్ట్ర బంద్‌లో పాల్గొనేలా తమ శ్రేణులకు పిలుపు నివ్వాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. సమాశానికి సీపీఎం (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం దుర్గాప్రసాద్ అధ్యక్షత వహించగా సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, సీపీఎం జిల్లా కార్యదర్శి కే శ్రీనివాస్, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు జె వెంకటేశ్వరరావు, వామపక్షాల నాయకులు ఎం రాజశేఖర్, తోకల ప్రసాద్, నక్కా కిషోర్, అంజి, జె కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
లీకుల్లో యుద్ధం... మైకుల్లో స్నేహం
సాక్షి, అమరావతి: కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగింది, ఇక తీవ్రమైన నిర్ణయాలు తప్పవంటూ నాలుగు రోజులుగా హంగామా చేసి, ఏదో జరిగిపోతోందంటూ భారీగా బిల్డప్ ఇచ్చిన అధికార తెలుగుదేశం పార్టీ చివరకు అలాంటిది ఏమీ లేదని తేల్చేసింది. అసంతృప్తిని తొలుత కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని, మరీ అవసరమైతే పార్లమెంట్లో ప్రస్తావించాలని నిర్ణయించింది. కేంద్రంలో, రాష్ట్రంలో మిత్రపక్షాలుగా ఉన్న తెలుగుదేశం, బీజేపీ నాయకులు బడ్జెట్ అంశంపై నాలుగు రోజులుగా పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. బడ్జెట్లో రాష్ట్రానికి అరకొర కేటాయింపులపై ప్రజలు అసంతృప్తి చెందుతుండటంతో టీడీపీలో కలవరం మొదలైంది. బీజేపీతో పొత్తుపై తీవ్ర నిర్ణయం తీసుకుంటామని అనుకూల మీడియా ద్వారా లీకులు ఇప్పించింది. ఆదివారం ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ(టీడీపీపీ) సమావేశం సందర్భంగా ఇదే పరంపర కొనసాగింది. బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం కంటే ప్రస్తుతం విమర్శల నుంచి ఎలా తప్పించుకోవాలన్న అంశంపైనే ఎక్కువ సమయం చర్చించినట్లు సమాచారం. కాగా, బయట జరిగిన ప్రచారం, మీడియాకు ఇచ్చిన లీకులకు విరుద్ధంగా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీతో పొత్తును వదులుకునే పరిస్థితి లేదని, ఏదోలా ఒత్తిడి తెచ్చి కొంతవరకైనా నిధులు సాధించుకోవడం తప్ప వేరే మార్గం లేదని చంద్రబాబు కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. ఆదివారం మీడియాతో సుజనా ‘‘బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రంతో మాట్లాడాలని నిర్ణయించాం. చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ చేయలేదు. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరేతోనూ చంద్రబాబు మాట్లాడలేదు. బీజేపీ నుంచి విడిపోయే పరిస్థితి లేదు. ఎప్పుడైనా విడాకుల గురించి ఆలోచించకూడదు, ఎలా కలిసుండాలో ఆలోచించాలి. ఇప్పటికిప్పుడు కఠిన నిర్ణయాలు వద్దని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎలా సమన్వయం చేసుకోవాలో సర్వం తెలిసిన నాయకుడు చంద్రబాబు’’ ఇవీ లీకులు.. - బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించం. - తీవ్ర నిర్ణయం తీసుకుంటాం.. విడిపోయేందుకు సమయం ఆసన్నమైంది. - ఎన్డీఏ సర్కారు నుంచి బయటకు వచ్చేస్తాం. ఇక బీజేపీతో తెగతెంపులే. - కేంద్ర ప్రభుత్వానికి మా తడాఖా చూపిస్తాం. ఇక యుద్ధానికి సన్నద్ధం. - పార్లమెంట్లో సస్పెండయ్యే వరకూ పోరాటం చేస్తాం, తాడోపేడో తేల్చేస్తాం. - రాజీనామాలకు రంగం సిద్ధం చేసుకున్న టీడీపీ ఎంపీలు. మీడియా సాక్షిగా మైకు ముందు.. - రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. - అవసరమైతే పార్లమెంట్లో ప్రస్తావిస్తాం.. - ఎలాగైనా ఒత్తిడి తీసుకొచ్చి నిధులు సాధించుకోవడం తప్ప మరో మార్గం లేదు. - ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో పొత్తును వదులుకోవడం సాధ్యం కాదు. ఆ పార్టీతో ఘర్షణ వద్దు. - కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకు రాలేం. - ఓవరాక్షన్ చేస్తే ఇబ్బందుల్లో పడతాం. రాజీనామాలు, నిరసనలు వద్దు. బీజేపీకి వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలు చేయొద్దు. -
రాష్ట్రానికి ‘రైల్వే’ నిధులు రూ.1,850 కోట్లు?
సాక్షి, హైదరాబాద్: తాజా కేంద్ర బడ్జెట్లో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రానికి రూ.1,850 కోట్లు దక్కాయి. గత బడ్జెట్లో రూ.1,729 కోట్లు మంజూరు చేయగా ఈసారి రూ.121 కోట్లు ఎక్కువే దక్కినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు సోమవారం వెల్లడి కానున్నాయి. ఈ నెల 1నే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినా రైల్వేకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. దేశవ్యాప్తంగా రైల్వేకు కేటాయించిన ప్రధాన వివరాలను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. జోన్ల వారీగా కేటాయించిన నిధుల వివరాలు ‘పింక్‌బుక్’గా పేర్కొనే ప్రత్యేక పుస్తకంలో ఉంటాయి. ఆ రోజు దానిని వెల్లడించలేదు. సోమవారం దానిని పార్లమెంటుకు సమర్పించనున్నారు. డిమాండ్‌కు తగ్గట్టుగా రైల్వే ప్రాజెక్టులు, కొత్త రైళ్ల కేటాయింపులు లేక చాలా కాలంగా తెలంగాణ బాగా వెనకబడింది. గత ఏడాది తెలంగాణ వాటాగా రూ.1,729 కోట్లు మంజూరు చేయడంతో ప్రాజెక్టుల పురోగతి కొంత వేగం పుంజుకుంది. కేటాయించిన నిధుల్లో ఇప్పటికే 90 శాతం ఖర్చు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. తాజా బడ్జెట్లో గతం కంటే రూ.121 కోట్లు పెంచటం రాష్ట్రానికి కొంత ఊరటనిచ్చే అంశమే. -
'అశోక్‌గజపతి రాజు సమాధానం చెప్పాల్సిందే'
సాక్షి, విజయనగరం : విజయనగరం జిల్లా అవినీతి కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు పాలుపంచుకున్నారని, ఎయిర్పోర్ట్ టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందో అశోక్ గజపతి రాజు సమాధానం చెప్పి తీరాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మజ్జి శ్రీనివాసరరావు డిమాండ్ చేశారు. తాను కేంద్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పుకుంటున్న ఆయన కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్ విషయంపై మజ్జి శ్రీనివాసరరావు శనివారం విలేకరులతో మాట్లాడుతూ ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ హామీ నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం గిరిజన యూనివర్సిటీ, భోగాపురం ఎయిర్పోర్ట్ కల నెరవేరలేదని మండిపడ్డారు. ఇప్పటి వరకు ఐదు బడ్జెట్లు అయ్యాయని, విభజన హామీలను సాధించడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. సామాన్యులు, యువత, కార్మికుల ఆశలు ఆడియాసలు అయ్యాయని, ముమ్మాటికి ఇది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రుల వైఫల్యమే అన్నారు. బడ్జెట్‌కు ముందు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సి ఉన్నా అలా జరగలేదని చెప్పారు. ఎన్నికల సమయంలో తిరిగి అధికారం రాబట్టుకోవడం కోసం మనోభావాలు తాకట్టుపెట్టారని మండిపడ్డారు. ఈ నెల 10న ఉత్తరాంధ్రలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో విజయనగరంలో కార్యక్రమం ఏర్పాటుచేసి ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని తెలిపారు. -
బాబుగారి ‘బడ్జెట్’ డ్రామా!
సాక్షి, అమరావతి: కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై ఒత్తిడి పెంచి విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు న్యాయంగా రావాల్సిన వాటిని సాధించటంలో ఘోరంగా విఫలమైన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కనీసం ప్రశ్నించే సాహసం కూడా చేయకపోవటంపై రాష్ట్రమంతా తీవ్ర చర్చ జరుగుతోంది. నాలుగేళ్లుగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా, బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై నోరు మెదపటం లేదు. ఓటుకు కోట్లు కేసుతో సహా ఈ నాలుగేళ్లలో పలు అవినీతి, అక్రమాల్లో మునిగిపోయిన ముఖ్యమంత్రి సీబీఐ కేసులు పెడతారనే భయంతోనే దిక్కులు చూస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అభిప్రాయం రాష్ట్రంలోని అన్నివర్గాల్లో నెలకొందని, దీన్ని పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వ పెద్ద ఇన్నాళ్లూ మౌనం దాల్చారని అంటున్నారు. సమావేశాలతో కాలహరణం కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత రాష్ట్రాధినేతగా తన అభిప్రాయాన్ని మీడియా ముందుకు వచ్చి చెప్పాల్సిన చంద్రబాబు తెరవెనుక నుంచి నాయకులతో టెలికాన్ఫరెన్సులు, అభిప్రాయ సేకరణలు, సమన్వయ కమిటీ, కేబినెట్ సమావేశాలు, ఎంపీలతో మీటింగ్‌లు అంటూ కాలం గడుపుతున్నారు. ఇదంతా అయోమయానికి గురి చేసే కొత్త డ్రామాయేనని పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీకి పలుమార్లు వెళ్లినట్లు చెప్పుకుంటున్న చంద్రబాబు అక్కడ ఆయన సొంత పనులు చక్కపెట్టుకోవడమే తప్ప ఆంధ్రప్రదేశ్ గురించి పట్టించుకోలేదనే విషయం తాజా బడ్జెట్ కేటాయింపులతో తేటతెల్లమైంది. పోలవరం కాంట్రాక్టు పనులు తనకు నచ్చిన సంస్థలకు అప్పగించుకోవడం, అసెంబ్లీ సీట్ల పెంపు లాంటి వ్యవహారాలే తప్ప ఇతర అంశాలను చంద్రబాబు ప్రస్తావించలేదని స్పష్టమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్యాబినెట్లోనూ ఆయన మంత్రులే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో చంద్రబాబు భాగస్వామిగా కొనసాగుతున్నారు. నాలుగేళ్లుగా కేంద్రంలో ఆయన పార్టీకి చెందిన వారు మంత్రులుగా ఉన్నారు. వారు మంత్రులుగా ఉన్న కేబినెట్టే కేంద్ర బడ్జెట్‌ను ఆమోదించి పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కేబినెట్లో, పార్లమెంటులో బడ్జెట్‌ను తన వారితో ఆమోదింప చేసిన చంద్రబాబు బయటకు వచ్చాక రాష్ట్రానికి అన్యాయం జరిగిందని తాపీగా అనటాన్ని తప్పుబడుతున్నారు. రాష్ట్రానికి కేటాయింపులు ఏమీ లేకున్నా గత నాలుగేళ్లుగా కేంద్ర బడ్జెట్ అద్భుతంగా ఉందంటూ పొగిడిన చంద్రబాబు ఇప్పుడు సర్దుకుని సరిగా లేదంటూ తప్పించుకునే యత్నం చేస్తున్నారు. ఓటుకు కోట్లు కేసుతో సహా పలు అక్రమాలపై సీబీఐ కేసులు నమోదవుతాయనే భయంతో బడ్జెట్‌పై బహిరంగంగా మాట్లాడకుండా తెరవెనుక నుంచి అనుకూల మీడియా ద్వారా లీకులు ఇప్పిస్తున్నారు. కేసుల భయంతో కనీసం ప్రెస్‌మీట్ పెట్టే సాహసం కూడా చేయలేకపోతున్నారని, ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని పేర్కొంటున్నారు. తన ప్యాకేజీ కోసం ముందునుంచే... బడ్జెట్ కన్నా ముందే చంద్రబాబు ఈ డ్రామాకు తెరలేపారని గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలను విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం కేంద్రంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకే నాటకాన్ని నడిపిస్తున్నారని పేర్కొంటున్నారు. బడ్జెట్లో రాష్ట్రానికి ఏమీ ఇవ్వకున్నా ఫర్వాలేదు, పోలవరం ప్రాజెక్టు పనులు మాత్రం తాము చెప్పిన కాంట్రాక్టర్‌కే అప్పగించాలనే ధోరణితో వెళుతున్నారు. బడ్జెట్‌కు ముందు ఢిల్లీలో జరిగిన సమావేశంలో చంద్రబాబు పేర్కొన్న సంస్థకు కాంట్రాక్టు బదలాయింపు జరగడాన్ని ఉదహరిస్తున్నారు. అందుకే బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు లేకున్నా మారు మాట్లాడకుండా తెరవెనుక మాత్రం ఆగ్రహం అంటూ పక్కదారి పట్టించే యత్నాలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల్లో కమీషన్ల కోసమే ఈ వ్యవహారాన్ని నడిపారన్నది అందరికీ తెలిసిందేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు చేయటం లేదనే విషయం చంద్రబాబుకు ముందే తెలుసని అంటున్నారు. ప్రతిపక్షం హితోక్తులు పెడచెవిన... ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా? అంటూ చంద్రబాబు ప్యాకేజీని తెరపైకి తెచ్చారు. ఇప్పుడు ప్యాకేజీలోనూ ఏమీ ఇవ్వడం లేదనే లీకులు ఇస్తున్నారు. ప్యాకేజీతో లాభం లేదని, హోదా ఉంటేనే రాయితీలు, ఇతర సదుపాయల వల్ల పరిశ్రమలు వాటంతట అవే వస్తాయని, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు దీర్ఘకాలికంగా ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయని ప్రతిపక్షం పదేపదే చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు. ‘కోడలు మగబిడ్డను కంటానంటే ఏ అత్త అయినా వద్దంటుందా?’ అని చలోక్తులు విసిరారు. కేంద్రంలో భాగస్వాములుగా ఉంటూ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా మాట్లాడకుండా అధికారాన్ని అనుభవిస్తున్న చంద్రబాబు నెపాన్ని ఇతరులపైకి నెట్టే ప్రయత్నాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇన్నాళ్లూ ఏం చేశారు? ఇప్పటికే నాలుగు బడ్జెట్లు ముగిశాయి. విభజన చట్టం హామీలు నెరవేరడం లేదు. లోటు బడ్జెట్‌ను తొలి ఏడాదిలోనే భర్తీ చేయాలని చట్టంలో ఉన్నా నెరవేరలేదు. ఇంత జరుగుతున్నా రాష్ట్రాధినేతగా ఉన్న పెద్ద అడగడం లేదెందుకన్న ప్రశలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ సంస్థలకు నిధులు అరకొరగా ఇస్తున్నా నోరు మెదపడం లేదు. రైల్వేజోన్‌పై ఇన్నాళ్లూ మొద్దు నిద్ర నటించి ఇప్పుడు ఇక వచ్చే అవకాశం లేదని తన పార్టీ నాయకుల ద్వారా సంకేతాలు ఇస్తున్నారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని నిధులకు బదులు మట్టి, నీరుతో సరిపెట్టినా చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు మిన్నకున్నారు. కేంద్రం నుంచి ఇతోధిక సాయం సాధిస్తామని పలు సమావేశాల్లో చెప్పుకొంటూ వచ్చారు. దుగరాజపట్నం ఓడరేవును సాధించాల్సింది పోయి తన స్వార్థం కోసం ఎకనమిక్ జోన్ అంటూ అదీ నెరవేరకుండా చంద్రబాబు అడ్డుతగలటాన్ని నిపుణులు పేర్కొంటున్నారు. అప్పులపాలైన రాష్ట్రం చంద్రబాబు తీరుతో ఒకపక్క కేంద్రంనుంచి నిధులు రాకపోగా మరోపక్క రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని నిపుణులు చెబుతున్నారు. తాత్కాలిక నిర్మాణాలు, పర్యటనల కోసం భారీగా నిధులు వ్యయం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సైతం తప్పుడు గణాంకాలతో మాయచేస్తున్నారని మండిపడుతున్నారు. ఫిస్కల్ రెస్పాన్సిబులిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంటు (ఎఫ్ఆర్బీఎం) నిబంధనల ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో (జీఎస్డీపీ) 3 శాతం వరకు మాత్రమే రుణాలు తీసుకోవచ్చునని, కానీ చంద్రబాబు ఎక్కువ అప్పులు చేసేందుకు 12 శాతం వృద్ధి శాతం చూపించారని పేర్కొంటున్నారు. జాతీయస్థాయిలో జీడీపీ గ్రోత్‌రేట్ 6, 7 శాతానికి మించిలేదని, యూరోప్ లాంటి దేశాల్లో కూడా 3 శాతానికి మించిలేదని చెబుతున్నారు. చంద్రబాబు మాత్రం గ్రోత్‌రేట్‌ను భారీగా పెంచి రుణాలు తీసుకున్నారని, ఫలితంగా గతంలో ఏపీకి 96 వేల కోట్ల అప్పులుంటే చంద్రబాబు 1.20 లక్షల కోట్లు అప్పుచేశారని ఇదంతా కమీషన్ల కోసమేనని అందరికి తెలుసునంటున్నారు. అంతా ఊదరగొట్టే ప్రకటనలు కోట్ల రూపాయలు వెచ్చించి ఈవెంట్లను నిర్వహిస్తూ రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయంటూ ప్రభుత్వ పెద్దలు ఊదరగొట్టారు. తీరా అవన్నీ పచ్చి బూటకమేనని ఇండస్ట్రియల్ ఎంటప్రెన్యూర్స్ మెమొరాండం (ఐఈఎం) నివేదికల్లో తేటతెల్లమైందని గుర్తుచేస్తున్నారు. 2015 డిసెంబర్ 31 నాటికి రూ. 4500 కోట్లు, 2016 డిసెంబర్ 31 నాటికి 10వేల కోట్లు, 2017 డిసెంబర్ చివరి నాటికి 4400 కోట్లు మేరకు మాత్రమే పెట్టుబడులకు అవకాశముందన్న అంశం ఆయా నివేదికలు స్పష్టంచేస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు లక్షల కోట్లు పెట్టుబడులు అంటూ చంద్రబాబు చెప్పినవన్నీ తప్పుడు ప్రకటనలేనని అంటున్నారు. ఎన్నికల హామీలు ఒక్కటీ నెరవేర్చకపోవడం, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం, ప్రత్యేక హోదా లేక రాష్ట్రానికి కొత్తగా ప్రాజెక్టులు రాకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, దీన్ని పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు ఆడుతున్న డ్రామాలో భాగమే తాజా ఎత్తుగడలనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
కేంద్రంపై ఎలా ఒత్తిడి తేవాలో నిర్ణయిస్తా
సాక్షి, అమరావతి: బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి కేంద్రంపై ఒత్తిడి తెద్దామని, అదెలా అనేది రెండురోజుల్లో నిర్ణయిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. మంత్రివర్గ సమావేశంలో కేంద్ర బడ్జెట్ తీరుతెన్నులపై ఆయన మాట్లాడారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొత్త రాజధాని అమరావతిని కేంద్రం నగరంగా చూడడంలేదని... ముంబై, బెంగుళూరు మెట్రో రైలు ప్రాజెక్టులకు రూ.వేల కోట్లు ఇచ్చి అమరావతి మెట్రోను పరిగణనలోకి తీసుకోలేదని సీఎం వ్యాఖ్యానించారు. ఇది అటు పూర్తిగా పల్లెటూరుగానూ, పూర్తిగా నగరంగానూ లేకపోవడంవల్ల దీన్ని పట్టించుకోలేదని అభిప్రాయపడ్డారు. కనీసం విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకైనా నిధులిస్తే బాగుండేదన్నారు. బడ్జెట్లో ఉత్తరాది రాష్ట్రాలకే ఎక్కువ నిధులిచ్చారని, దక్షిణాది రాష్ట్రాలపై నిర్లక్ష్యం చూపారని చెప్పారు. నీతి ఆయోగ్ నిధులను రాష్ట్రానికి ఎలా తేవచ్చో అధ్యయనం చేయాలని, ఈఏపీ ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. కాగా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగిందో అధ్యయనం చేస్తున్నామని ఏపీ టీడీపీ అధ్యక్షుడు, విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావు చెప్పారు. -
ఆశలెక్కువ..అసలు తక్కువ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావం నుంచి ప్రతి బడ్జెట్లో తెలంగాణ ఆశలను కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తూ వస్తోంది. వరుసగా ఐదేళ్లు ప్రత్యేక కేటాయింపులు, వరాలేమీ ఇవ్వకుండా దాటవేసింది. ఇస్తామని చెబుతున్న నిధులు కూడా ఇవ్వకుండా మొండిచేయి చూపిస్తోంది. కేంద్రం నుంచి వచ్చే నిధులపై రాష్ట్ర ప్రభుత్వం భారీ అంచనాలేసుకోవడం.. వాస్తవ కేటాయింపులు మరోలా ఉండటంతో ఏటేటా ఈ అంతరం పెరిగిపోతోంది. 2014–15 నుంచి ప్రస్తుత ఏడాది వరకు కేంద్రం నుంచి రూ. 81 వేల కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం లెక్కలేసుకోగా ఇప్పటివరకు రూ. 32 వేల కోట్లకు మించి నిధులు రాలేదు. అంటే అంచనాలకు, వాస్తవాలకు కనీసం పొంతన కుదరనంత వ్యత్యాసం కనిపిస్తోంది. ముందే తేలుద్ది.. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏటా ఎన్ని నిధులొస్తాయో ముందే లెక్క తేలుతుంది. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే ఏయే రాష్ట్రాలకు ఎన్ని నిధులందుతాయో అంచనాకు రావొచ్చు. అందుకే చాలా రాష్ట్రాలు కేంద్ర బడ్జెట్ ఆధారంగానే వార్షిక బడ్జెట్ తయారు చేసుకుంటాయి. కేంద్ర పన్నుల్లో వాటా, ఆర్థిక సంఘం గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు వచ్చే నిధులను అందులో పొందుపరుస్తాయి. ఆర్థిక సంఘం గ్రాంట్లను 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన మేరకు ఇవ్వడం తప్పనిసరి. అందులో కోత పడే అవకాశం లేదు. పన్నుల వాటా, కేంద్ర పథకాలకు కేటాయింపుల్లో కేంద్రం అంచనాలు తలకిందులైతేనే నిధుల విడుదలపై ప్రభావం పడుతుంది. కానీ గత నాలుగేళ్లలో కేంద్రం ప్రకటించిన.. రాష్ట్రానికి విడుదల చేసిన నిధులకు భారీగా తేడా కనిపిస్తోంది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ప్రభావం ఉంటోంది. తొలి ఏడాది నుంచే.. కొత్త రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది కేంద్రం నుంచి రూ.10 వేల కోట్ల సాయం అందుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసుకుంది. కానీ కేంద్రం నుంచి ఆ ఊసే లేదు. మరోవైపు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులకు రూ.40 వేల కోట్లు కేటాయించాలని పలుమార్లు ఢిల్లీని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించింది.కానీ వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.900 కోట్లు మినహా అన్నింటినీ కేంద్రం తోసిపుచ్చింది. వీటికి తోడు పన్నుల వాటా, పథకాల కేటాయింపుల్లో భారీగా కోత పెట్టింది. కేంద్రం లెక్కలు వేరే.. గత మార్చి నుంచి రూ.26 వేల కోట్లు వస్తాయని అంచనా వేస్తే ఇప్పటికీ అందులో నాలుగో వంతే రాష్ట్రానికి విడుదలయ్యాయి. కానీ రూ. 21 వేల కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం లెక్కలు చూపుతోంది. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, వాటి నిర్వహణ నిధులనూ రాష్ట్ర ఖజానాకు ఇచ్చినట్లు లెక్కలేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. అందుకే కేంద్రం లెక్కలకు, రాష్ట్రం గణాంకాలకు పొంతన కుదరటం లేదు. ఈ ఏడాదీ అదే పరిస్థితి పునరావృతమైంది. -
మధ్య తరగతి ప్రజలే లోకువ
జాతిహితం గొప్ప ప్రభుత్వం ఆ 1.7ను విస్తరింపచేయడానికి ఏదో ఒకటి చేయాలని ఇది సూచిస్తుంది. ఆ క్రమంలో మొదటి తెలివైన చర్య పెద్ద నోట్ల రద్దు అని భావించారు. తర్వాత జీఎస్టీని తీసుకొచ్చారు. కానీ ఆశించిన పెరుగుదల ఏదీ? వాస్తవానికి ఈ ఒక్క లక్ష్య సాధనలోనే అన్ని ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఫలితంగా, పెద్దమొత్తంలో పన్ను ఎగవేతదారు లను, లేదా పన్ను చెల్లించని కోట్లాదిమందిని పట్టుకోవడానికి బదులుగా దాచుకోవడానికి తమవద్ద ఏదీ లేని వారిపైనే దాడిచేయడానికి సిద్ధమవుతున్నారు. తరతరాలుగా కాసాబ్లాంకా సంస్కృతి విస్తరిస్తున్నది. ఆ కారణంగా దానికి సంబంధించినవే శిలాక్షరాల వంటి రెండు పంక్తులతో ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆఖరి బడ్జెట్ భారత మధ్య తరగతి ప్రజానీకానికి ఏం ఒరగబెట్టిందనే విషయం చెప్పవచ్చు. రిక్ కేఫ్ అమెరికన్ ఉదంతం సందర్భంలో కెప్టెన్ రెనాల్ట్ అనే ఎందుకూ కొరగాని పోలీసు చెబుతాడు చూడండి, ‘ఎప్పుడూ పట్టుకునే అనుమానితులనే పట్టు కోండి!’ అని. అలాగే జరిగింది. భ్రష్టత్వం వల్ల కావచ్చు, రాజకీయం ప్రయోజనాలతో ఓట్ల కోసం డబ్బును వెదజల్లడం వల్ల కావచ్చు– మన ప్రభుత్వానికి నిరంతరం డబ్బుకి కొదవే. ప్రభుత్వం ఎప్పుడూ ఈ దురదృష్టకర మధ్య తరగతి మీదే పడుతుంది. మరీ ముఖ్యంగా వేతనాల మీద ఆధారపడి జీవించే ఉద్యోగులే కనిపిస్తూ ఉంటారు. వీళ్లని ఎంతవరకు వీలుంటే అంత వరకు ఊపిరి సలపకుండా చేసేయవచ్చు. వీళ్ల గురించి మాట్లాడేవారు లేరు. ప్రజా ప్రతినిధులు లేరు. అలాగే వీరందరికీ సమంగా వర్తించే ఏకసూత్రం కూడా ఏదీ లేదు. అలా వాళ్ల మెడ పట్టుకుని, వెనక ఒక్క తన్ను తన్నితే చాలు వారి నుంచి ఏదైనా సరే కక్కించవచ్చు. పైగా రాజ కీయాలకు వచ్చిన ప్రమాదం కూడా ఏమీ ఉండదు. పెద్ద నోట్ల రద్దు తరహా రాజకీయం ఒకవేళ వారి నుంచి ఏదైనా పెద్ద ఆరోపణ వస్తే, అది పేదందరికి దృశ్యానం దపు తృప్తిని కలిగించేదే అవుతుంది. ప్రస్తుత వాతావరణంలో ఈ పరిస్థితిని పెద్ద నోట్ల రద్దు తరహా రాజకీయం అని పిలవవచ్చు. ఏదో ఒకటి నాటకీ యంగా చేయాలి. అది పేదల దగ్గరకు తీసుకెళ్లి, ఆ చర్యతో వారు నష్టపోయే అవకాశం ఉందని చెప్పేటట్టు చేయాలి. నేను చెప్పేది కొంచెం ఓర్పుగా వినండి, ధనవంతులు ఎంతగా నష్టపోతున్నారో మీకు అవగాహన లేదు. అయితే వాస్తవానికి ధనికులు ఎప్పుడూ దెబ్బతినరు. అది వేరే విషయం. పేదలు నమ్ముతారు. వారిలో గందరగోళం అనంతంగా సాగుతూనే ఉంటుంది. ఇక మధ్య తరగతినైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు గాయ పరచవచ్చు. ఈ బడ్జెట్ మన స్మృతిపథంలో ఎంతోసేపు ఉండదు. అది వెంటనే వార్తాకథనం కూడా కాలేదు. అందులో చాలా విషయాలు 2019 సంవత్సరం వేసవిలో బీజేపీ ఎన్నికల ప్రణాళిక తయారయ్యే వరకు కూడా మనని వెంటా డుతూనే ఉంటాయి. కానీ స్టాక్, బాండ్ల మార్కెట్లో మారణహోమం సృష్టిస్తూ ఇవాళ మాత్రం సజీవంగానే ఉంది. మార్కెట్ విధ్వంసక అత్యవసర బడ్జెట్‌గా వెళ్లింది కాబట్టి, ఇది దాదా ప్రణబ్ ముఖర్జీ పునరావృత ఒడాఫోన్ సవరణ తరగతికి చెందుతుంది. చాలా విషపూరితం. ఆయన తరువాత ఇద్దరు ఆర్థికమంత్రులు బడ్జెట్లు సమర్పించిన ఆరేళ్ల కాలంలో కూడా శస్త్ర చికిత్స చేసేటప్పుడు ధరించే గ్లోవ్స్ ధరించి కూడా అలాంటి బడ్జెట్ జోలికి మాత్రం వెళ్లలేదు. బ్యాంకు నగదు లావాదేవీలపై పన్ను, సెక్యూరిటీల లావాదేవీల మీద పన్ను, ఉద్యోగుల స్టాక్ ఆప్షన్‌ను తిర గరాసిన పన్నులను కూడా వెంటపెట్టుకుని వచ్చిన పి. చిదంబరం బడ్జెట్ కూడా మార్కెట్లను కకావికలు చేసింది. పైన ముగ్గురు ఆర్థిక మంత్రులలో ఆయన కూడా ఒకరు. మధ్య తరగతి మదుపునకు దెబ్బ కానీ ఈ బడ్జెట్ చేసిందేమిటంటే, మధ్య తరగతి మదుపులకు దశాబ్దంగా ఉన్న భద్రత మీద దాడి. మధ్య తరగతికి ఎటూ పాలుపోని పరిస్థితిని కల్పిం చింది. ఇదంతా నేను బిజినెస్ స్టాండర్డ్ లిమిటెడ్ సంస్థ చైర్మన్, ఆర్థిక వ్యవస్థ విశ్లేషకుడు టీఎన్ నైనన్ మాటల ఆధారంగా రాస్తున్నాను. ఆయన షేర్ల మీద దీర్ఘకాలిక కేపిటల్ గెయిన్స్ పన్నును ఉపసంహరించుకోమని గట్టిగా కోరారు. 2017, జనవరి 6న ఆయన నిర్వహించిన వారాంతపు జ్ఞాపకాల కార్య క్రమంలో ఈ విషయం గురించి వాదించారు. లోటును తగ్గించాలని ఆర్థిక మంత్రి కోరుకుంటే ఈక్విటీ ప్రాఫిట్ల మీద పన్ను విధించడం తప్ప మరో మార్గం లేదని నైనన్ చెప్పారు. ఆర్థికమంత్రి కూడా నైనన్ సలహా విలువైన దని గ్రహించారు. లోటును తగ్గించడానికి ఆయన సూచించిన విధానం బల మైనదని కూడా గుర్తించారు. ఈ అంశాన్నే నేను మరో కోణం నుంచి వివరి స్తున్నాను. ఆ కోణం పరిశీలించడానికి అనువైనది కూడా. రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా? మొదటిగా ఒక ప్రశ్న. ఆర్థిక విధానంలో ఎదరుయ్యే పరిణామాలతో, ఎగుడు దిగుళ్లతో ఏమాత్రం సంబంధం లేకుండా ఒక ప్రభుత్వం ఎన్నికల రాజకీ యాల కోసం ప్రజాధనం యథేచ్ఛగా వెచ్చించగలదా? అలాగే తన ఇష్టం వచ్చినట్టు పన్నులు విధించగలదా? అలా అని నేను పేదల అనుకూల పథ కాలను లేదా రాయితీలను విమర్శించడం లేదు. అయితే పెద్ద నోట్ల రద్దు వంటి ఒక వికృత ఆలోచన ఒక సంవత్సరపు స్థూల జాతీయోత్పత్తిలో 1 నుంచి 2 శాతం పెరుగుదలకు మంగళం పాడింది. అక్కడితో ఆగకుండా చిన్న చిన్న వ్యాపారులకు నష్టం చేయడంతో పాటు ఎన్నో ఉద్యోగాలను ఊడ గొట్టింది. దీని వెనుక ఉన్న ఆర్థికపరమైన ప్రతిపాదన లక్షలాది మందిని అధికారిక ఆర్ధిక వ్యవస్థ నుంచి అనధికార ఆర్థిక వ్యవస్థకు నెట్టింది. ఆర్థికవేత్త కౌశిక్ బసు ఆర్థికసర్వేలో ప్రత్యేకంగా కనిపించే కొన్ని వాక్యాలను కను గొన్నారు. అవి పెద్ద నోట్ల రద్దు ఆలోచన విఫలమైందని అంగీకరించేవి. ముందు తీసుకున్న విధాన పరమైన చర్యల ప్రభావం అదృశ్యం కావడమే ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత మందగమనానికి కారణమని 2017–18 ఆర్థిక సర్వేలో చెప్పడమంటే పెద్ద నోట్ల రద్దు పెద్ద తప్పిదమని అంగీకరించడమేనని కౌశిక్ ట్వీట్ చేశారు. తరువాతి వాదన లేదా ప్రశ్న రాజకీయాలకు సంబంధించినది. మధ్య తరగతిని ప్రభుత్వాలు (ఒక్క బీజేపీ ప్రభుత్వాలే కాదు, మొత్తం అన్ని ప్రభు త్వాల గురించి) అంత కర్కశంగా చూడడానికి కారణం వారి వెనుక ఎలాంటి లాబీ లేకపోవడమే. అలాగే ఎన్నికలను నిర్దేశించే ఎలాంటి శక్తి వారి వద్ద లేకపోవడం కూడా. ఈ తరహా బడ్జెట్ మీ రాజకీయాల వరకు సానుకూల మైనదే కావచ్చు. కానీ పేదలను ఒప్పించగలగాలి. అలాగే రైతుల సమస్యల పరిష్కారానికి కూడా కావలసినంత వెచ్చిస్తామని చెప్పాలి. ఎందుకంటే వారికి కూడా ఓటు హక్కు ఉంది. మీ ప్రభుత్వాన్ని ఓట్లతో ముంచెత్తిన మధ్య తరగతికి నష్టం జరగకుండా అదనపు పరిహారాలు ఇవ్వాలి. కొన్ని గణాంకాలు మన విశ్లేషణలో కనిపిస్తాయి. అందులో ఒక అంశం– కేవ లం 1.7 శాతం భారతీయులు ఆదాయపు పన్ను చెల్లిస్తారు. 2015–16 నాటి అంచనాల అధికారిక సమాచారంలో ఈ విషయం పేర్కొన్నారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో, అదికూడా అత్యధికంగా మధ్య తరగతి ఉన్న దేశంలో ఈ విషయం భయంకరంగా అనిపిస్తుంది. దీనిని మరో ప్రశ్న రూపంలో చెప్పవచ్చు. అంటే దేశంలో వంద శాతం పన్నును ఈ 1.7 శాతమే చెల్లిస్తున్నారా? పన్ను చెల్లింపుదారులు ఇంతేనా? గొప్ప ప్రభుత్వం ఆ 1.7ను గొప్పగా విస్తరింపచేయడానికి ఏదో ఒకటి చేయాలని ఇది సూచిస్తుంది. ఆ క్రమంలో మొదటి తెలివైన చర్య పెద్ద నోట్ల రద్దు అని భావించారు. తర్వాత జీఎస్టీని తీసుకొచ్చారు. కానీ ఆశించిన పెరుగుదల ఏదీ? వాస్తవానికి ఈ ఒక్క లక్ష్య సాధనలోనే అన్ని ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఫలితంగా, పెద్దమొత్తంలో పన్ను ఎగ వేతదారులను, లేదా పన్ను చెల్లించని కోట్లాదిమందిని పట్టుకోవడానికి బదులుగా దాచుకోవడానికి తమవద్ద ఏదీ లేని వారిపైనే దాడిచేయడా నికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు వేతన జీవులు తమ పొదుపులను ఎక్కడ పెడతారు? ఎందుకంటే వారివద్ద నగదు లేదు. వీరు ఆస్తుల కొనుగోళ్లవైపు అడుగు పెట్టడం కష్టం. పైగా ఎన్డీయే నాలుగేళ్ల పాలనలో ఆస్తులు తమ విలువను వేగంగా కోల్పోయాయి. బ్యాంకులు, ప్రభుత్వ పొదుపు పథకాలు కూడా వడ్డీ రేట్లను తగ్గించివేశాయి. కానీ ఈ బ్యాంకులే తాము అప్పులిచ్చినవారికి ఈఎమ్ఐ రేట్లను తగ్గించడానికి పూనుకోవడం లేదు. ప్రభుత్వాలలాగే దురాశాపూరితమైన బ్యాంకులు కూడా భారీస్థాయి ఎగవేతదారులు ధ్వంసం చేసిన బ్యాలెన్స్ షీట్లను మళ్లీ పూరించుకోవడానికి నివాస గృహాలు, విద్య, వాహనాలను ఆశించే మధ్యతరగతి డిపాజిట్‌దారులు, రుణగ్రహీతలపైనే కన్నేస్తున్నాయి. నాటి ఆర్థిక మంత్రి చిదంబరం 2004లో ప్రవేశపెట్టిన బడ్జెట్ మార్కెట్ల తక్షణ పతనానికి కారణమైనప్పుడు, అలాంటి పరిస్థితుల్లో ఆర్థికమంత్రులు తరచుగా చెప్పే మాటలనే వల్లె వేశారు. నేను బడ్జెట్‌ను రైతుకోసం రూపొం దించాలా లేక బ్రోకర్ కోసం రూపొందించాలా? అప్పుట్లో నేను దీనిపై వ్యాఖ్యానిస్తూ ఆధునిక ఆర్థిక వ్యవస్థ పనితీరు ఇకపై రైతు వెర్సెస్ బ్రోకర్‌గా ఉండకూడదని, అది ఇక నుండి రైతు, అలాగే బ్రోకర్‌లాగా కూడా ఉండాలని రాశాను. ఎందుకంటే వ్యవసాయం, ద్రవ్యమార్కెట్లు ఒక దాన్నొకటి నిషేధిం చుకోవడం లేదు. అందుకే చిదంబరం బడ్జెట్ తర్వాత అనేక దిద్దుబాట్లకు గురైంది. పలు నష్టనివారణ చర్యలు చేపట్టింది. జైట్లీ సమర్పించిన ఈ బడ్జెట్ కూడా దాన్నే అనుసరించాల్సి ఉంటుంది. భారతీయ మధ్యతరగతి దాదాపుగా పట్టణ స్వభావంతో కూడి ఉంటోంది. గుజరాత్ ఎన్నికల్లో మాదిరి అది ఇప్పటికీ నరేంద్రమోదీ పట్ల అభిమానం చాటుతోంది. గత నాలుగేళ్లుగా మోదీ ప్రభుత్వం తగ్గిన చమురు ధరల ప్రయోజనాన్ని మధ్యతరగతికి అందించకుండా, దానినుంచి అదనపు వసూళ్లకు పూనుకుంటున్నప్పటికీ ఆ వర్గం మోదీ పట్ల విశ్వాసం ప్రదర్శిస్తూనే ఉంది. ఇప్పుడు పొదుపులను నిరుత్సాహపరుస్తున్న ప్రభుత్వ చర్య మధ్య తరగతికి మరింత గాయాన్ని కలిగిస్తోంది. - శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupt -
మధ్యతరగతికి గతంలో చాలా ఇచ్చాం!
న్యూఢిల్లీ: తాజా ఆర్థిక సంవత్సర బడ్జెట్లో మధ్యతరగతి వర్గాలకు ఊరటనిచ్చేలా ప్రత్యేక ప్రతిపాదనలేమీ చేయకపోవడాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమర్ధించుకున్నారు. గత బడ్జెట్లో మధ్యతరగతి వర్గాలకు చాలానే చేశామని వ్యాఖ్యానించారు. వెసులుబాటును బట్టి భవిష్యత్‌లోనూ మరికొన్ని ప్రయోజనాలు కల్పించే ప్రయత్నం చేస్తామన్నారు. ‘భారత్‌లో చట్టాలను అమలు చేయడంలో చాలా సవాళ్లున్నాయి. అలాగే పన్నులు చెల్లించే వారి సంఖ్యను పెంచే విషయంలోనూ పెద్ద సవాళ్లే ఉన్నాయి. నేను ప్రవేశపెట్టిన నాలుగైదు బడ్జెట్లను పరిశీలిస్తే.. పద్ధతిప్రకారం చిన్న స్థాయి పన్ను చెల్లింపుదారులకు ప్రతీ బడ్జెట్లోనూ ఎంతో కొంత ఊరట కల్పిస్తూనే ఉన్నాను‘ అని ఓపెన్ మ్యాగజైన్ నిర్వహించిన బడ్జెట్ అనంతర చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ. 2 లక్షల నుంచి పెంచామని, అదనంగా పొదుపునకు సంబంధించి మినహాయింపు పరిమితిని మరో రూ. 50,000 పెంచి మొత్తం రూ. 1.5 లక్షలకు చేర్చామని, గృహ రుణాల రీపేమెంట్స్పై పరిమితిని కూడా ఏడాదికి రూ. 2 లక్షలకు పెంచామని జైట్లీ చెప్పారు. ఇక రూ. 50 లక్షల దాకా ఆదాయం ఉన్న డాక్టర్లు, లాయర్లు మొదలైన వృత్తి నిపుణులకు ట్యాక్సేషన్‌ను సరళతరం చేశామన్నారు. రూ. 5 లక్షల దాకా వార్షికాదాయం ఉన్న వారిపై పన్ను శాతాన్ని పది నుంచి అయిదు శాతానికి తగ్గించామని జైట్లీ వివరించారు. మౌలిక సదుపాయాల కల్పన, సరిహద్దుల రక్షణ, సామాజిక సంక్షేమ పథకాలు మొదలైన వాటన్నింటి కోసం నిధులు సమకూర్చుకోవడం తప్పనిసరి అని ఆయన చెప్పారు. ఇందుకోసం తక్కువ మొత్తంలోనైనా పన్నులు కట్టేలా పెద్ద సంఖ్యలో ప్రజలను పన్ను పరిధిలోకి తేవడం ద్వారా దేశ ప్రయోజనాలను పరిరక్షించగలమన్నారు. చమురు రేట్లు ఆందోళనకరమే అయినా.. ముడిచమురు ధరల పెరుగుదల ఆందోళన కలిగించేదే అయినా, పరిస్థితులు ప్రస్తుతం అదుపులోనే ఉన్నాయని జైట్లీ చెప్పారు. అధిక ద్రవ్యోల్బణ జమానా నుంచి భారత్ బైటపడ్డట్లేనని ఆయన తెలిపారు. రెండు శాతం అటూ ఇటూగా నాలుగు శాతం ద్రవ్యోల్బణ గణాంకాల లక్ష్యం సహేతుకమైనదేనని, సాధించగలిగే లక్ష్యమేనని జైట్లీ పేర్కొన్నారు. కూరగాయలు, ముడిచమురు ధరల పెరుగుదల, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపు తదితర అంశాలు ఇటీవలి ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం, ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, బ్యాంకుల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడిన తర్వాత తగిన సమయంలో తగు నిర్ణయం తీసుకోగలమని జైట్లీ చెప్పారు. నిజాయితీగా పన్ను చెల్లించే వారికి ప్రయోజనం! స్టాండర్డ్ డిడక్షన్పై హస్ముఖ్ ఆదియా న్యూఢిల్లీ: తాజా బడ్జెట్లో ప్రతిపాదిన రూ.40,000 స్టాండర్డ్ డిడక్షన్ నిజాయితీగా పన్ను చెల్లించే వారికి ప్రయోజనం కలిగిస్తుందని ఆర్థిక శాఖ కార్యదర్శి హస్ముఖ్ ఆదియా పేర్కొన్నారు. పన్ను రహిత ఆదాయాన్ని ఉద్యోగ వర్గాలు, పెన్షనర్లు రూ.2.9 లక్షల వరకూ పెంచుకునే వెలుసుబాటు దీనివల్ల కలుగుతోందన్నారు. నిజాయితీగా పన్ను చెల్లించే వేతన వర్గం ప్రధాన లక్ష్యంగా ఆర్థికమంత్రి ఈ ప్రయోజనాన్ని బడ్జెట్లో పొందిపరిచారని అన్నారు. కాగా స్టాండర్డ్ డిడక్షన్ నేపథ్యంలో ప్రస్తుతం మినహాయింపు పరిధిలో ఉన్న రవాణా, వైద్య చికిత్స అలవెన్సులను పన్ను పరిధిలోకి తేవడంతో కొంత నిరాశ వ్యక్తమయిన సంగతి తెలిసిందే. ప్రైవేటు పెట్టుబడులు పెంచే చర్యల్లేవ్... ద్రవ్యలోటు లక్ష్యాల పెంపు పట్ల భారత ప్రముఖ ఆర్థికవేత్త,, కార్నెల్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ (వాణిజ్య విధానం) ఈశ్వర ప్రసాద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ఆర్థిక వ్యవస్థలో పలు విభాగాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. ద్రవ్య క్రమశిక్షణ కట్టుతప్పినట్లేనని పేర్కొన్నారు. అలాగే ప్రైవేటు పెట్టుబడులు పెరగడానికీ బడ్జెట్లో చర్యలు లేవని విమర్శించారు. అయితే బడ్జెట్లో ప్రతిపాదిత ఆరోగ్య బీమా పథకం పేదలకు ప్రయోజనం చేకూర్చుతుందని అన్నారు. కాగా ఇది వృద్ధికి దోహదపడే బడ్జెట్ అని అమెరికా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రెసిడెంట్ నిషా దేశాయ్ బిస్వాల్ పేర్కొన్నారు. -
ఊరిస్తూ...
భారీ ఆశలు, అంచనాల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌పై ఉమ్మడి మెదక్ జిల్లా వాసుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిరంగాలకు పెద్దపీట వేయడం కొంత ఊరటనిచ్చేదిగా ఉంది. ఐఐటీకి నిధుల కేటాయింపు మినహా.. రైలు మార్గాలు, జాతీయ రహదారులు, ఇతర మౌలిక సౌకర్యాల కల్పనకు సంబంధించిన ప్రస్తావనేదీ కనిపించలేదు. పేదలకు ఉచిత వైద్యం, గ్యాస్ కనెక్షన్లు, గ్రామీణ జీవనోపాధి వంటి అంశాలపై సానుకూలత వ్యక్తమవుతోంది. అదే సమయంలో ఆదాయ పన్ను పరిమితి పెంచక పోవడంపై వేతన జీవుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. –సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి ఆదాయ పన్ను పరిమితి శ్లాబులను సవరిస్తారని భావించిన వేతన జీవులు తీవ్ర నిరాశ చెందారు. పెన్షనర్లు, సీనియర్ సిటిజన్లకు కొన్ని రాయితీలు ఇవ్వడం ఊరటనిచ్చేదిగా ఉంది. సూక్ష్మ, లఘు పరిశ్రమలకు ఊతం లభిస్తుందని అంచనా వేసినా, కార్మికుల సంక్షేమానికి సంబంధించి ఈపీఎఫ్ మినహా ఇతర అంశాలకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. మెదక్ : ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ హైదరాబాద్)కి రూ.75 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర సాధారణ బడ్జెట్‌ను గురువారం ఆయన పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఐఐటీ హైదరాబాద్ శాశ్వత క్యాంపస్‌కు 2008లో శంకుస్థాపన చేయగా, 2017 నాటికి నిర్మాణ పనులు పూర్తి కావాల్సి ఉంది. నిధులు పూర్తి స్థాయిలో విడుదల కాకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత ఏడాది రూ.50 కోట్లు కేటాయించగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.75 కోట్లు ఇస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఎన్నికల బడ్జెట్‌గా అభివర్ణించిన కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి రంగాలతో పాటు మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత దక్కుతుందని భావించారు. వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి రంగాలకు కేటాయించిన నిధులు వ్యవసాయ ప్రధానంగా ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లాకు మేలు చేస్తుందని భావిస్తున్నారు. మద్దతు ధర ప్రకటించని ఖరీఫ్ పంటలకు మద్దతు ధర ప్రకటించి, సాగు వ్యయానికి ఒకటిన్నర రెట్లు అదనంగా ఇస్తామని ప్రకటించారు. ప్రస్తుతం వరి, మొక్కజొన్న, కంది వంటి పంటలకే మద్దతు ధర లభిస్తుండగా.. ఇతర పంటలు సాగు చేసే రైతులకూ ప్రయోజనం చేకూరనుంది. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామనే ప్రకటనపై ఆసక్తి వ్యక్తమవుతోంది. వ్యవసాయ రంగానికి రూ.11 లక్షల కోట్ల రుణాలు, కౌలు రైతులకు భూ యజమానితో సంబంధం లేకుండా రుణాలు వంటి అంశాలపై సంబంధిత వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ఏటా సుమారు రూ.5వేల కోట్ల మేర పంట రుణాలు ఇస్తుండగా, ప్రస్తుత ప్రకటనతో కౌలు రైతులకు ఊరట లభించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ మార్కెట్ల సంఖ్యను పెంచడంతో పాటు ఇంటర్నెట్ ద్వారా అనుసంధానం చేస్తామని బడ్జెట్లో ప్రతిపాదించారు. ప్రస్తుతం జిల్లాల వారీగా సంగారెడ్డిలో ఏడు, మెదక్‌లో ఐదు, సిద్దిపేటలో 14 వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉన్నాయి. జాతీయ మార్కెటింగ్ వ్యవస్థ ‘ఈ–నామ్’తో జోగిపేట, జహీరాబాద్, సదాశివపేట, సిద్దిపేట మార్కెట్ యార్డులు ఇప్పటికే అనుసంధానమయ్యాయి. ప్రభుత్వ ప్రకటనతో మిగతా మార్కెట్ యార్డులు దశల వారీగా జాతీయ మార్కెటింగ్ వ్యవస్థతో అనుసంధానమయ్యే అవకాశం ఉంది. బడ్జెట్ కేటాయింపుల్లో జాతీయ ఉపాధి పథకాలకు పెద్దపీట వేసిన నేపథ్యంలో ఉపాధి హామీ పథకంలో నమోదైన వారికి లబ్ధి చేకూరనుంది. జిల్లాల వారీగా సంగారెడ్డి జిల్లాలో 2.19 లక్షలు, సిద్దిపేటలో 1.39లక్షలు, మెదక్‌లో 1.02లక్షల మంది ఈజీఎస్ జాబ్ కార్డులు కలిగిన వారు ఉన్నారు. ప్రస్తుత కేటాయింపులతో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, వివిధ ప్రభుత్వ శాఖలు ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టే పనులు వేగవంతం కానున్నాయి. గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా చేపట్టే సామాజిక భద్రత పింఛన్లు, బ్యాంకు రుణాలు, జీవనోపాధి కార్యక్రమాలకు ఊతం లభించనుంది. తెలుపు రంగు రేషన్ కార్డులు కలిగిన వారికి జాతీయ స్థాయిలో తొలిసారిగా ప్రవేశ పెట్టిన ఆరోగ్య పథకం కింద సంగారెడ్డిలో 3.33 లక్షలు, మెదక్‌లో 1.94లక్షలు, సిద్దిపేటలో 1.89 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. జాతీయ స్థాయి ఆరోగ్య పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల వరకు ఆరోగ్య సేవలు ఉచితంగా అందే అవకాశం ఉంది. ప్రస్తుతం దీపం పథకం ద్వారా తెలుపు రంగు రేషన్ కార్డు కలిగిన వారి వంట గ్యాస్ కనెక్షన్లు ఇస్తుండగా, ఉజ్వల పథకం కింద ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని తాజాగా ప్రతిపాదించారు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో సుమారు రెండు లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని పౌర సరఫరా శాఖ వర్గాలు చెబుతున్నాయి. స్వచ్ఛభారత్ మిషన్‌కు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించగా.. సిద్దిపేట, మెదక్ జిల్లాలను ఇప్పటికే సంపూర్ణ బహిరంగ మల విసర్జన రహిత జిల్లాలుగా ప్రకటించారు. సంగారెడ్డి జిల్లాలో 45వేలకు పైగా మరుగుదొడ్లను ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి సంపూర్ణ బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా ప్రకటించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుత కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల మేరకు బాలికా విద్య, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలకు ఊతం లభించనుంది. రోడ్లు, రైల్వే లైన్ల ప్రస్తావనేదీ? కేంద్ర సాధారణ బడ్జెట్లో రైల్వే పద్దును కూడా చేర్చడంతో గతంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రతిపాదించిన రైలు మార్గాల కేటాయింపులపై స్పష్టత రావడం లేదు. మనోహరాబాద్–కొత్తపల్లి, అక్కన్నపేట–మెదక్ మార్గాల నిర్మాణం కొనసాగుతుండగా.. నిధుల కేటాయింపు కీలకంగా మారింది. బోధన్–బీదర్, పటాన్చెరు–ఆదిలాబాద్, జహీరాబాద్ డబ్లింగ్ వంటి పనులకు నిధుల కేటాయింపు ప్రస్తావన బడ్జెట్లో కనిపించలేదు. రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించినా.. సంగారెడ్డి–అకోలా (ఎన్‌హెచ్ 161), మెదక్–సిద్దిపేట–ఎల్కతుర్తి, బోధన్–మెదక్–బాలానగర్ రహదారుల కేటాయింపులు వెల్లడి కావాల్సి ఉంది. జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్) ప్రస్తావన కూడా అరుణ్ జైట్లీ ప్రసంగంలో కనిపించలేదు. -
బడ్జెట్ మొత్తం అస్పష్టతే..: ఎంపీ వినోద్
సాకి, హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్‌పై టీఆర్ఎస్ ఎంపీ వినోద్‌కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన, కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అరకొర అంశాలతో అసంపూర్తిగా, అస్పష్టంగా ఉందని అభిప్రాయపడ్డారు. దేశ ప్రజల ఆరోగ్యం కోసం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌భవ పథాకానికి విధివిధానలపై కనీస వివరణ కూడా లేదని ఆయన మండిపడ్డారు. దేశం అంటే రాష్ట్రాల సముదాయమని అన్న ఆయన ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలను ఎందుకు సంప్రదించలేదంటూ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా సుమారు 40శాతం మందికి కేవలం రూ.2 వేల కోట్లతో చికిత్స ఎలా అందిస్తారో వివరణ ఇవ్వలన్నారు. ఇన్సూరెన్స్ మోడల్లో స్కీమ్ ప్రధానంగా రూపొందితే పాలసీదారులు పెరిగేకొద్దీ ప్రీమియం తగ్గుతుందన్న ఆయన కేవలం రూ.2వేల కోట్ల ప్రారంభ నిధితో ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ఎలా చేపడతారని ప్రశ్నించారు. అలాగే వరి తదితర ఖరీఫ్ పంటలకు ఉత్పత్తి వ్యయం కన్నా 50 శాతం అధికంగా మద్దతు ధర కల్పించే అంశం, మద్దతు ధర విషయంలోను స్పష్టత లేదన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.11 లక్షల కోట్లు పంట రుణాలు ఇస్తామని వెల్లడించిన జైట్లీ, విధి విధానాలు ప్రకటించడంలో మాత్రం విఫలమయ్యారని అన్నారు. కేంద్రం ఇప్పటికైనా స్పందించి ఆయుష్మాన్‌భవ, పంటల మద్దతు ధరపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అస్పష్ట అంశాలతో ప్రజలను మభ్యపెట్టాలనుకోవడం సరికాదని వినోద్ అన్నారు. -
బడ్జెట్ ఎఫెక్ట్ : నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
-
సాదాసీదాగా జైట్లీ బడ్జెట్ ప్రసంగం
-
పేదల వ్యతిరేక బడ్జెట్: మాయావతి
లక్నో: పేదలకు వ్యతిరేకంగా, పెట్టుబడిదారులకు అనుకూలమైన బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టిందని బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శించారు. ‘మోదీ ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లలాగే ఈసారి కూడా ప్రవేశపెట్టింది. దేశానికి మంచిరోజులు తెస్తామని 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ఇచ్చిన హామీ ఏమైంది? తప్పుడు ప్రసంగాలు, వాదనలతో దేశప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. పేదలు, కార్మికులు, రైతులు, ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకోక నిరుద్యోగం, ధనిక–పేదల మధ్య అంతరం పెరిగిపోతోంది’ అని ఆరోపించారు. -
సాంస్కృతిక శాఖకు రూ.2,843 కోట్లు
న్యూఢిల్లీ: సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు బడ్జెట్లో రూ.2,843 కోట్లను కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఇది 3.82 శాతం ఎక్కువ. గత బడ్జెట్లో ఆ శాఖకు రూ.2,738.47 కోట్లను కేటాయించారు. మరోవైపు భారత పురావస్తు శాఖకు రూ.974.56 కోట్లను కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఇది 5.42 శాతం అధికం. గ్రంథాలయాలకు రూ.109.18 కోట్లు, మ్యూజియాల కోసం రూ.80.60 కోట్లు కేటాయించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రముఖ వ్యక్తుల జయంతులు, వార్షికోత్సవాలకు వినియోగించే నిధుల్లో కేంద్రం కోత విధించింది. ఆ నిధులను రూ.243.01 కోట్ల నుంచి రూ.100 కోట్లకు తగ్గించింది. ‘కళా సంస్కృతి వికాస్ యోజన’పథకానికి రూ.310 కోట్లు కేటాయించింది. ఈ పథకం ద్వారా మహాత్మా గాంధీ హెరిటేజ్ సైట్స్ మిషన్ అండ్ దండి సంబంధిత ప్రాజెక్టులు, కళలు, సంస్కృతి, స్కాలర్షిప్, ఫెలోషిప్లను అందిస్తోంది. -
సీబీఐకి నామమాత్రమే..
న్యూఢిల్లీ: సీబీఐకి రూ.698.38 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోల్చితే ఇది 2.79 శాతమే అధికం. గత ఐదు బడ్జెట్లలో అతి తక్కువ పెంపు కూడా ఇదే కావడం గమనార్హం. సీబీఐ ఈ–గవర్నర్స్, శిక్షణ కేంద్రాల ఆధునీకరణ, సాంకేతిక, ఫోరెన్సిక్ అనుబంధ యూనిట్ల స్థాపన, సీబీఐ శాఖల కార్యాలయాల నిర్మాణం తదితరాలకు ఈ నిధులను వినియోగించనున్నట్లు బడ్జెట్ ప్రతుల్లో పేర్కొన్నారు. -
మార్పుల్లేని లోక్‌పాల్ బడ్జెట్
న్యూఢిల్లీ: అవినీతి కట్టడికి ఏర్పాటు చేయనున్న లోక్‌పాల్ కోసం కేటాయించిన రూ.4.29 కోట్ల బడ్జెట్లో ఎలాంటి మార్పులు లేవు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు కేటాయించిన బడ్జెట్లో మాత్రం 1.5 కోట్ల స్వల్ప వృద్ధి కనిపించింది. గురువారం పార్లమెంట్లో జైట్లీ సమర్పించిన 2018–19 బడ్జెట్ లెక్కల ప్రకారం, అవినీతి నిరోధానికి ఏర్పాటు చేయబోయే లోక్పాల్కోసం 4.29 కోట్లు కేటాయించారు. -
రక్షణకు రూ.2.95 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: చైనా, పాకిస్తాన్‌తో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అంచనాలకు తగ్గట్టుగా రక్షణ రంగానికి కేంద్రం బడ్జెట్లో నిధులివ్వలేదు. 2018–19 బడ్జెట్లో రక్షణ రంగానికి రూ. 2,95,511 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయింపులు రూ. 2.74 లక్షల కోట్ల కంటే 7.81 శాతం ఈ ఏడాది ఎక్కువ. మొత్తం బడ్జెట్లో రక్షణ రంగానికి కేటాయింపులు 12.10 శాతం.. జీడీపీలో 1.58 శాతంగా రక్షణ రంగ కేటాయింపులు ఉన్నాయి. ఇక రక్షణ రంగం కేటాయింపుల మొత్తంలో ఆయుధాలు, యుద్ధవిమానాలు, యుద్ధ నౌకలు, ఇతర రక్షణ సామగ్రి కొనుగోలుకు రూ. 99,947 కోట్లు కేటాయించారు. రక్షణ బడ్జెట్లో సిబ్బంది జీతాలు, నిర్వహణ, ఇతరత్రా ఖర్చులకు సంబంధించి రెవెన్యూ వ్యయం రూ. 1,95,947 కోట్లుగా ఉంది. కాగా, రక్షణ రంగ సిబ్బంది పెన్షన్ కోసం ప్రత్యేకంగా రూ. 1,08,853 కోట్లు కేటాయించారు. ఇది గతేడాది కేటాయింపు రూ. 85,740 కోట్లు కంటే 26.60 శాతం అధికం. కేటాయింపులు సరిపోవు చైనా, పాకిస్తాన్ల సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో రక్షణ రంగాన్ని ఆధునీకరించడానికి ఈ కేటాయింపులు సరిపోవు అని నిపుణులు పేర్కొంటున్నారు. అంచనాలకు తగ్గట్టుగా బడ్జెట్ లేదని డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ ఇన్స్టిట్యూట్కు చెందిన డా. లక్ష్మణ్ బెహరా చెప్పారు. ద్రవ్యోల్బణం, పరికరాల రేట్లు పెరుగుదలతో పోలిస్తే కేటాయింపులు స్వల్పమని మాజీ సైనికాధికారి ఎస్కే చటర్జీ చెప్పారు. రెండు ఇండస్ట్రియల్ కారిడార్లు రక్షణ రంగానికి సంబంధించి దేశీయ పరిశ్రమల ప్రోత్సాహకానికి రెండు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వ, ప్రైవేట్, ఎంఎస్ఎంఈ విభాగాల్లో దేశీయంగా ఆయుధ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి డిఫెన్స్ ప్రొడక్షన్ పాలసీ–2018ని తీసుకువస్తామని బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ పేర్కొన్నారు. దేశీయ రక్షణ పరికరాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. రక్షణ పరికరాల పరిశ్రమల్లో విదేశీ పెట్టుబడుల కోసం సరళీకరణ విధానాలు అవలంభిస్తున్నామని, ప్రైవేట్ రంగం పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. బడ్జెట్లో మూలధనం కేటాయింపు రూ. 3,00,441 కోట్లు అని జైట్లీ తెలిపారు. మూలధనం ఖాతాలోని మొత్తం ఖర్చులో ఇది 33.1 శాతం అని పేర్కొన్నారు. అరుణాచల్ ‘సేలా’ కనుమల్లో సొరంగం చైనా సరిహద్దుకు సమీపంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని సేలా కనుమల్లో సొరంగం నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. 13,700 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో సొరంగం పూర్తయితే... దేశ రక్షణ పరంగా వ్యూహాత్మక ప్రాంతమైన తవాంగ్‌కు వేగంగా బలగాల్ని తరలించేందుకు వీలవుతుందని ఆయన చెప్పారు. బడ్జెట్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ‘ప్రతికూల వాతావరణంలోను ప్రయాణించేలా లడఖ్ ప్రాంతంలో రోహతంగ్ సొరంగం పూర్తిచేశాం. అలాగే 14 కిలోమీటర్ల జోజిలా సొరంగం కోసం పనులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు సేలా కనుమల్లో సొరంగం నిర్మాణానికి ప్రతిపాదన చేస్తున్నాం’అని వెల్లడించారు. అరుణాచల్ ప్రదేశలోని తవాంగ్, పశ్చిమ కామెంగ్ జిల్లాల మధ్య వ్యూహాత్మక ప్రాంతంలో సేలా కనుమ ఉంది. -
పోలీస్ బలగాలకు జై
న్యూఢిల్లీ: పారామిలిటరీ బలగాల బలోపేతమే లక్ష్యంగా ఈ సంవత్సరం (2018–19) కేంద్ర బడ్జెట్లో హోంశాఖకు నిధుల కేటాయింపు జరిగింది. ఈ సారి రూ.92,679.86 కోట్లను కేటాయించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 10.5 శాతం అదనం. గత సంవత్సరం (2017–18)లో రూ.83.823.30 కోట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. మొత్తం కేటాయింపుల్లో సగానికిపైగా పారామిలిటరీ దళాలకే వెచ్చించనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీ పోలీసుల కోసం రూ.6,946.28 కోట్లు, సరిహద్దుల్లో మౌలిక వసతుల కల్పనకు రూ. 1,750 కోట్లు కేటాయించారు. భారత్–పాక్, భారత్–చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ మేరకు కేటాయింపులు జరిపినట్లు మంత్రి పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేసే కేంద్ర పోలీస్ బలగాల(సీఆర్పీఎఫ్)కు రూ.20,268 కోట్లు కేటాయించారు. అలాగే భారత్–పాక్, భారత్–బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పనిచేస్తున్న సరిహద్దు భద్రతా దళాల కోసం ఈ సారి రూ.17,118.64 కోట్లు కేటాయించారు. జాతీయ పోలీస్ బలగాలకు మొత్తంగా రూ.62,741.31 కోట్లు కేటాయించారు. అలాగే ఇంటెలిజెన్సీ బ్యూరో కోసం రూ.1,876.44 కోట్లు కేటాయించారు. -
నిరాశాపూరితమైన బడ్జెట్: కాంగ్రెస్
న్యూఢిల్లీ: 2018–19 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశాపూరితమైనదిగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. ఈ బడ్జెట్ ప్రజల్ని తీవ్రంగా నిరుత్సాహపర్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం విమర్శించారు. ‘ఇదో నిరాశాపూరితమైన బడ్జెట్. ఆర్థిక వ్యవస్థను పట్టిపీడిస్తున్న పలు సమస్యల్ని పరిష్కరించడంలో తాము విఫలమైనట్లు తాజా బడ్జెట్‌తో కేంద్రం అంగీకరించినట్లయింది. ఇందులో ఆందోళన కల్గించే తీవ్రమైన ప్రతిపాదనలు ఉన్నాయి. దురదృష్టవశాత్తూ ఈ బడ్జెట్లోని ప్రతిపాదనలు తీవ్రంగా నిరుత్సాహపర్చాయి. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున 10 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య రక్షణ కల్పిస్తామని జైట్లీ చెప్పడం పెద్ద బూటకం’అని విమర్శించారు. ఆర్థిక స్థిరీకరణ పరీక్షలో జైట్లీ తీవ్రంగా విఫలమయ్యారని ఆరోపించారు. ‘ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ 2018–19 బడ్జెట్లో ఆర్థిక స్థిరీకరణ పరీక్షలో విఫలమయ్యారు. 2017–18 ఆర్థిక లోటును 3.2 శాతానికి పరిమితం చేయలేకపోయారు. ప్రస్తుతం ఆర్థికలోటును ప్రభుత్వం 3.5 శాతంగా అంచనా వేస్తోంది. ఈ వైఫల్యంతో దేశం తీవ్రమైన పర్యావసనాలను ఎదుర్కోవాల్సి వస్తుంది’అని చిదంబరం హెచ్చరించారు. -
మహిళల జీవితాల్లో ఉజ్వల
అష్ట సతుల్లోనూ కృష్ణునికి అత్యంత ఇష్టురాలు సత్య. నారీ శక్తికి, స్త్రీ ఆత్మగౌరవానికి తిరుగులేని ప్రతీక. నరకునితో పోరుతూ వాసుదేవుడు సొమ్మసిల్లిన వేళ విల్లు చేపట్టి అంతటి రాక్షసుణ్నీ అలవోకగా నిలువరిస్తుంది. ఆధునిక భారత మహిళను సత్యభామలా సాధికార పరచడమే లక్ష్యంగా ఈ బడ్జెట్లో పలు కీలక కేటాయింపులు చేశారు అరుణ్ జైట్లీ... న్యూఢిల్లీ: తాజా బడ్జెట్లో మహిళలపై కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ఉచిత గ్యాస్ కనెక్షన్లు సహా.. ఉద్యోగాలు చేసే మహిళలు, స్వయం సహాయక బృందాలకు భారీగా నిధులను కేటాయించింది. పేద మహిళలకు ఇవ్వాల్సిన ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ల లబ్ధిదారుల సంఖ్యను 8 కోట్లకు పెంచినట్లు జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో భాగంగా వెల్లడించారు. పేద మహిళలకు వంటచెరకు పొగనుంచి విముక్తి కల్పించేందుకు ఉజ్వల పథకాన్ని ప్రవేశపెట్టాం. ప్రారంభంలో 5 కోట్ల మంది పేద మహిళలకు ఉచితంగా వంటగ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించి పనిచేస్తున్నాం. ఈ పథకానికి పేద మహిళల్లో ఆదరణ పెరగటంతో ఈ లక్ష్యాన్ని 8 కోట్లకు పెంచాలని నిర్ణయించాం’అని జైట్లీ పేర్కొన్నారు. తొలి మూడేళ్ల వరకు ఈపీఎఫ్ 8 శాతమే! మహిళా ఉద్యోగులను ప్రోత్సహించడంలో భాగంగా ఈసారి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. నూతనంగా ఉద్యోగంలో చేరిన మహిళలు అధిక మొత్తంలో టేక్ హోమ్ శాలరీ (నికర జీతం) తీసుకునే విధంగా వెసులుబాటును ఇచ్చింది. ఉద్యోగ భవిష్యనిధిలో వీరి వాటా చెల్లింపును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. వారి ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్‌ను ప్రస్తుతం ఉన్న 12 శాతం నుంచి 8 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఈ మేరకు ‘ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్–1952’లో మార్పులు చేస్తున్నట్లు జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో తెలియజేశారు. ఇందులో భాగంగా మహిళా ఉద్యోగులు తొలి మూడేళ్ల వరకు 8 శాతం ఈపీఎఫ్ మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. దీంతోపాటుగా సామాజిక భద్రత పథకాల్లో భాగంగా మూడేళ్లపాటు. కొత్తగా ఉద్యోగాల్లో చేరే అందరు ఉద్యోగులకు ఎంప్లాయర్ (యాజమాన్యం) వాటా ఈపీఎఫ్ 12 శాతాన్నీ ప్రభుత్వమే భరించే ప్రతిపాదన చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు ప్రధాన్ మంత్రి రోజ్‌గార్ ప్రోత్సాహన్ యోజన కింద వస్త్ర, తోలు, ఫుట్‌వేర్ పరిశ్రమలకు చెందిన ఉద్యోగులు పొందుతున్న ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ప్రయోజనాన్ని మిగిలిన రంగాలకు కూడా వర్తింపచేస్తున్నట్లు వెల్లడించారు. గతంలో ఈ పథకం కింద ఇచ్చిన ప్రయోజనాలు ఇప్పుడిప్పుడే సత్ఫలితాలను ఇస్తున్నాయని జైట్లీ పేర్కొన్నారు. స్వయం సహాయక బృందాలకు.. జాతీయ గ్రామీణ జీవన కార్యక్రమంలోని క్లస్టర్లలో స్వయం సహాయక బృందాలు సేంద్రియ వ్యవసాయం చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించింది. 2019 మార్చి వరకు ఈ కార్యక్రమం కోసం ఇచ్చే రుణాలను రూ.75 వేల కోట్లకు పెంచుతున్నట్లు జైట్లీ వెల్లడించారు. స్వయం సహాయక బృందాలకు ఇచ్చే రుణాలను గతేడాదితో పోలిస్తే 37 శాతం పెంచి.. రూ.42,500 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన ‘బేటీ బచావో, బేటీ పఢావో’, సుకన్య సమృద్ధి అకౌంట్ పథకాలు అద్భుతమైన విజయాన్ని సాధించాయని జైట్లీ పేర్కొన్నారు. ‘నవంబర్ 2017 వరకు బాలికల పేర్లతో 1.26 కోట్ల అకౌంట్లు దేశవ్యాప్తంగా తెరిచారని.. ఇందులో రూ.19,183 కోట్లు దాచుకున్నారు’అని ఆయన తెలిపారు. బడ్జెట్ హైలైట్స్ ► రూ.5 లక్షల కోట్ల అదనపు రుణాలు అందించేలా బ్యాంకు లకు మూలధన సాయం. ► ఎంపీల వేతనం, నియోజకవర్గ అలవెన్సు, ఆఫీసు ఖర్చులు, అలవెన్సుల్లో మార్పులకు ప్రతిపాదన. ద్రవ్యోల్బణం ఆధారంగా ఐదేళ్లకోసారి వేతనాల సమీక్షకు చర్యలు. ► 018–19 ఆర్థిక సంవత్సరంలో రక్షణ శాఖకు రూ.2.82 లక్షల కోట్ల కేటాయింపు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 2.67 లక్షల కోట్లు. ► జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల కోసం రూ.150 కోట్లు కేటాయింపు. ► 2018 జనవరి 15 వరకూ ప్రత్యక్ష పన్నుల వసూలు 18.7 శాతం వృద్ధి. ► 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.250 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థలపై కార్పొరేట్ పన్ను 25 శాతానికి తగ్గింపు. -
బడ్జెట్ టాప్ 5
ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్, 2018–19 సంవత్సరానికి తన బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో కొన్ని బడా దేశాల బడ్జెట్లపై దృష్టి సారిద్దాం. సీఐఏ వరల్డ్ ఫ్యాక్ట్‌బుక్ అత్యధిక మొత్తాలతో బడ్జెట్లు ప్రవేశపెట్టే దేశాల జాబితా రూపొందించింది. ఇందులో భారత్ 22వ స్థానంలో ఉంది. 2016వ సంవత్సరం నాటి గణాంకాల ప్రకారం టాప్ 5 బడ్జెట్ల వివరాలు... (రూ.లక్షల కోట్లలో) అమెరికా రెవెన్యూ : 391 వ్యయం : 446 లోటు : 55 చైనా రెవెన్యూ : 217 వ్యయం : 245 లోటు : 28 జపాన్ రెవెన్యూ : 116 వ్యయం : 132 లోటు : 16 జర్మనీ రెవెన్యూ : 103 వ్యయం : 101 మిగులు : 2 ఫ్రాన్స్ రెవెన్యూ : 88 వ్యయం : 93 లోటు : 5 -
ఘనవ్యర్థాల నిర్వహణకు ‘గోబర్ ధన్’
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ‘స్వచ్ఛ భారత్ మిషన్’కింద 2 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాలని కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అలాగే ఘనవ్యర్థాల నిర్వహణ కోసం గోబర్–ధన్ అనే పేరుతో కొత్త పథకాన్ని ప్రతిపాదించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరిన్ని మరుగుదొడ్లు నిర్మిస్తామని గురువారం లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఇప్పటికే 6 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించినట్లు జైట్లీ పేర్కొన్నారు. దీంతో దేశంలోని మహిళల గౌరవం, బాలికల విద్య.. మొత్తంగా కుటుంబ ఆరోగ్యం మెరుగుపడిందని చెప్పారు. భారత్‌ను బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా మార్చే లక్ష్యంలో భాగంగా గోబర్–ధన్ (గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో–ఆగ్రో రిసోర్సెస్ ధన్) కార్యక్రమాన్ని ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పశువుల పేడ, ఘన వ్యర్థాలను కంపోస్ట్, ఎరువులు, బయోగ్యాస్‌లా మార్చడంలో తోడ్పడుతుందని పేర్కొన్నారు. -
జిల్లాకో నైపుణ్య కేంద్రం ఏర్పాటు
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి కౌశల్ కేంద్ర పథకం కింద ప్రతి జిల్లాలో ఓ నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని జైట్లీ గురువారం పార్లమెంటులో ప్రకటించారు. ఇందుకోసం 2018–19 బడ్జెట్లో రూ.3,400 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ పథకానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.2,356.22 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. యువతలో నైపుణ్యాభివృద్ధి పెంపొందించడానికి దేశవ్యాప్తంగా ఇప్పటికే 306 ప్రధాన మంత్రి కౌశల్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. -
ముద్రా యోజనకు రూ.3 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: స్వయం ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముద్రా యోజన పథకంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వరాల జల్లు కురిపించారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి ముద్రా పథకం కింద రూ.3 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. 2015 ఏప్రిల్‌లో ప్రారంభించిన ముద్రా యోజన పథకం ద్వారా రూ.4.6 లక్షల కోట్ల రుణాలను ఇచ్చారు. ఈ పథకం కింద 10.38 కోట్ల మంది లబ్ధిపొందారు. రుణ ఖాతాలు ఉన్న వారిలో 76 శాతం మంది మహిళలు ఉండగా, 50 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఉన్నారని జైట్లీ తెలిపారు. ప్రధాన మంత్రి ముద్రా యోజన(పీఎమ్ఎమ్వై)లో శిశు, కిషోర్, తరుణ్ అనే పథకాల కింద రుణాలను ఇస్తారు. -
తయారీకి చేయూత
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘భారత్‌లో తయారీ’లో భాగంగా దేశీ తయారీని ప్రోత్సహించే చర్యలను ఈ బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు. పది రంగాలకు సంబంధించి దిగుమతి చేసుకునే పలు ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాలను భారీగా పెంచారు. చైనా నుంచి చౌకగా వచ్చి పడుతున్న దిగుమతులను నియంత్రించడంతోపాటు, దేశీయంగా ఉపాధిని పెంచేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. సిల్క్ ఫ్యాబ్రిక్స్‌పై కస్టమ్స్ సుంకాన్ని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ రెట్టింపు చేశారు. ప్రస్తుతం ఇది 10 శాతం ఉండగా దీన్ని 20 శాతంగా బడ్జెట్లో పేర్కొన్నారు. అయితే ఈ చర్యను సిల్క్ ఎగుమతిదారుల సమాఖ్య మాత్రం వ్యతిరేకించింది. ఎగుమతులపై ఇది ప్రభావం చూపిస్తుందని సమాఖ్య చైర్మన్ సతీష్ గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, మొబైల్ ఫోన్లపై 15 శాతంగా ఉన్న కస్టమ్స్ సుంకాన్ని 20 శాతం చేశారు. మొబైల్ యాక్సెసరీలపై 7.5 శాతం నుంచి 15 శాతానికి, టీవీలపైనా 15 శాతానికి కస్టమ్స్ సుంకాన్ని పెంచారు. కొత్తగా చార్జింగ్ అడాప్టర్లపై 10 శాతం సుంకం ప్రవేశపెట్టారు. ముఖ్యంగా పళ్లరసాలపై భారీగా పెంచారు. కాన్‌బెర్రీ జ్యూస్‌పై ఐదు రెట్లు పెంచి 50 శాతం చేశారు. అన్ని రకాల పళ్ల, కూరగాయల జ్యూస్‌పైనా 30 నుంచి 50 శాతం చేశారు. సిల్క్ ఫ్యాబ్రిక్స్ మాదిరే పాదరక్షలపైనా దిగుమతి సుంకాన్ని 20 శాతానికి పెంచారు. ఫర్నిచర్, ల్యాంపులు, కళ్లద్దాలు, కొవ్వొత్తులు, పతంగులు, లైటర్లు, సెంట్ స్ప్రేయర్లు, పెర్ఫ్యూమ్లు, గడియారాలు, ఆట వస్తువులపైనా రెట్టింపైంది. ఆటోమొబైల్ విడిభాగాలు, కొన్ని రకాల యాక్సెసరీలు, మోటారు కార్లు, మోటారు సైకిళ్లపై 7.5–10 శాతం మధ్య పన్ను ఉండగా దాన్ని 15 శాతానికి పెంచారు. -
డీవోపీటీకి రూ. 192 కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దేశ విదేశాల్లో శిక్షణ ఇచ్చేందుకు, అందుకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖకు 2018–19 బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రూ.192 కోట్లు కేటాయించారు. ఈ మొత్తంలో రూ.75.35 కోట్లతో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్రటేరియట్ అండ్ మేనేజ్మెంట్(ఐఎస్టీఎం), లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్(ఎల్బీఎస్ఎన్ఏఏ) సంస్థల్లో మౌలిక వసతులు కల్పించనున్నారు. ఎల్బీఎస్ఎన్ఏఏ ఆధునీకరణకు, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ఐఎస్టీఎంను అభివృద్ధి చేసేందుకు మిగిలిన రూ.116.75 కోట్లు ఖర్చు చేయనున్నారు. కాగా, గతేడాది ఈ శాఖకు రూ.194.3 కోట్లను కేటాయించిన సంగతి విదితమే. దీంతో పాటు కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ), పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డుకు రూ.26.54 కోట్లు, సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్(క్యాట్)కు రూ.111.86 కోట్లు కేటాయించారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ)కు రూ. 286.13 కోట్లు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల నివాస సముదాయాల నిర్మాణానికి అడ్వాన్స్‌గా రాష్ట్రాలకు రూ.1.65 కోట్లు కేటాయించారు. -
ఇది ఎన్నికల బడ్జెట్: శివసేన
ముంబై: 2019లో పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈ సారి ‘ఎన్నికల బడ్జెట్’ను ప్రవేశపెట్టిందని శివసేన ఎంపీ అరవింద్ సావంత్ విమర్శించారు. ‘ఇదో ఎన్నికల బడ్జెట్. అందువల్లే కేంద్రం ధ్యాస పరిశ్రమల నుంచి రైతులు, విద్య, ఆరోగ్య రంగాలపైకి మళ్లింది. గుజరాత్ ఎన్నికల ఫలితాలతో పాటు వస్తుసేవల పన్ను(జీఎస్టీ), నోట్ల రద్దుపై విమర్శలు వెల్లువెత్తడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంకుల సర్వీస్ చార్జీలు గత కొంతకాలంగా పెరుగుతూనే ఉన్నాయి. దీన్నుంచి సామాన్యుడికి ఉపశమనం లభించేదెప్పుడు? ఈసారి బడ్జెట్లో శానిటరీ నాప్కీన్స్పై జీఎస్టీని తగ్గిస్తారని మహిళలందరూ ఆశించారు. కానీ దాని ఊసేలేదు. దేశంలో ద్రవ్యోల్బణం తగ్గడంపై కేంద్రం మాట్లాడుతోంది. కానీ పెట్రోల్, డీజిల్ ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగిపోవడంపై ప్రభుత్వం ప్రజలకు జవాబివ్వాలి’అని సావంత్ తెలిపారు. -
కొన్ని సమస్యల్నే ప్రస్తావించింది
చెన్నై / వాషింగ్టన్: ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో కొన్నింటిని మాత్రమే ప్రస్తావించిందని ప్రముఖ ఆర్థికవేత్త, ప్రధాని ఆర్థిక సలహా మండలి మాజీ చైర్మన్ సి.రంగరాజన్ అభిప్రాయపడ్డారు. ‘ఆర్థిక వృద్ధి నెమ్మదించడం, ప్రైవేటు పెట్టుబడులు తగ్గిపోవడం, వ్యవసాయ సంక్షోభం ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు. ఈ బడ్జెట్లో వ్యవసాయ సంక్షోభంతో పాటు ప్రైవేటు పెట్టుబడుల గురించి కొద్దిగా ప్రస్తావించారు. కేవలం ఈ బడ్జెట్ సాయంతో ఆర్థిక వృద్ధి సాధ్యమా? అంటే అది అనుమానాస్పదమే. ఒకవేళ దేశంలోకి పెట్టుబడుల రాక పెరిగితే ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుంది. అందుకే నేను ఈ బడ్జెట్ కొన్ని సమస్యల్ని మాత్రమే స్పృశించింద నీ, అన్ని సమస్యల్ని ప్రస్తావించలే దని చెప్పాను’ అని రంగరాజన్ వ్యా ఖ్యానించారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్యారం గానికి నిధుల కేటాయింపులు పెరగడం ఈ బడ్జెట్ విశేషమని రంగరాజన్ తెలిపారు. ఈ మార్పులు సరైన దిశలోనే సాగుతున్నాయని వెల్లడించారు. ఇకపై ఆర్థికలోటు ఎట్టిపరిస్థితుల్లోనూ పెరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. జైట్లీ ప్రకటించిన జాతీయ ఆరోగ్య రక్షణ పథకంపై మరింత స్పష్టత రావాల్సిన అవసరముందని రంగరాజన్ అభిప్రాయపడ్డారు. ఆచరణీయ బడ్జెట్: పనగరియా కేంద్ర బడ్జెట్ ఆచరణీయంగా ఉందని నీతి ఆయోగ్ మాజీ చైర్మన్ అరవింద్ పనగరియా తెలిపారు. ‘మొత్తం బడ్జెట్లో దాదాపు 10 కోట్ల కుటుంబాలను బీమా పరిధిలోకి తీసుకొచ్చే జాతీయ ఆరోగ్య రక్షణ పథకం అత్యంత ముఖ్యమైనది. ఇది దేశంలోని ప్రజల్ని సార్వత్రిక ఆరోగ్య బీమావైపు తీసుకెళ్తుంది. ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆచరణీయంగా ఉంది. జీఎస్టీ అమలుతో పరోక్ష పన్నులు కేవలం 11 నెలలకే వసూలు చేయగలిగారు. అలాగే నామమాత్రపు వృద్ధిరేటు కూడా అనుకున్నంతగా లేకపోవడంతో ఆర్థిక లోటు 3.2 శాతం నుంచి 3.5 శాతానికి చేరుకుంది’ అని వెల్లడించారు. -
‘ప్రగతిశీల సానుకూల భారత బడ్జెట్’
న్యూఢిల్లీ: 2018–19 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం ‘ప్రగతిశీల, సానుకూల భారత్’బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. గ్రామీణ, పట్టణ భారతాల మధ్య ఉన్న అంతరాన్ని రూపుమాపేందుకు ఈ బడ్జెట్ దోహదం చేస్తుందని తెలిపారు. ‘ప్రగతిశీల, సానుకూల భారతం కోసం దోహదం చేసే బడ్జెట్ ఇది. ఈసారి బడ్జెట్లో ప్రభుత్వ ప్రాధమ్యాలు మారాయి. ఇది దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి దోహదం చేస్తుంది. సరికొత్త భారతం కోసం చారిత్రక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి జైట్లీకి అభినందనలు. ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన పరిధిలోకి 8 కోట్ల కుటుంబాలను తీసుకురావడం.. సాధారణ ప్రజల జీవితాలను మరింత మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నిరూపిస్తోంది. గత కొన్నేళ్లలో వచ్చిన బడ్జెట్లలో రైతులు, ప్రజలకు అత్యంత అనుకూలంగా ఉన్న బడ్జెట్లలో ఇదొకటి. ప్రతి పేద, బలహీన కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున 10 కోట్ల కుటుంబాలకు ఆరోగ్యభీమా కల్పించడం ఆరోగ్యరంగంలో తీసుకొచ్చిన గొప్ప మార్పు. ప్రభుత్వం తీసుకురానున్న ఆపరేషన్ గ్రీన్ పథకంతో అద్భుతమైన వ్యవసాయాభివృద్ధి సాధ్యమవుతుంది. తద్వారా 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకోగలం’అని రాజ్‌నాథ్ వెల్లడించారు. -
‘పేదలు, రైతుల ఆకాంక్షలకు ఊతం’
న్యూఢిల్లీ: ‘ఆర్థికమంత్రి జైట్లీ గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశంలోని పేదలు, రైతులు, మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలకు ఊతమిచ్చేలా ఉందని బీజేపీ చీఫ్ అమిత్ షా ప్రశంసించారు. ‘గ్రామీణ, వ్యవసాయ రంగాలకు రికార్డు స్థాయిలో నిధుల కేటాయింపులతో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్లడంతో పాటు అద్భుతమైన వ్యవసాయాభివృద్ధి సాధ్యమవుతుంది. రైతుల పంటకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను ప్రభుత్వం ఒకటిన్నర రెట్లు పెంచింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని ఇది ధ్రువపరుస్తోంది. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సాధికారత కల్పించడంతో పాటు వారి సంక్షేమానికి ఈ న్యూ ఇండియా బడ్జెట్ దోహదం చేస్తుంది’అని షా ట్వీటర్లో వెల్లడించారు. బడ్జెట్లో 2018–19 సంవత్సరానికి ముద్ర పథకం కింద రూ.3 లక్షల కోట్లు కేటాయించినందుకు ప్రభుత్వానికి షా ధన్యవాదాలు తెలిపారు. ఈ బడ్జెట్ రైతులు, గ్రామీణ రంగం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిచ్చేలా ఉందని పునరుద్ఘాటించారు. 2022 నాటికల్లా సరికొత్త భారతాన్ని ఆవిష్కరించాలన్న ప్రభుత్వ కల సాకారానికి, సమాజంలోని అన్ని వర్గాలు అభివృద్ధి ఫలాలు అందుకోవడానికి ఈ బడ్జెట్ దోహదం చేస్తుందని పేర్కొన్నారు.దాదాపు 10 కోట్ల మందికి ఆరోగ్య రక్షణ కల్పించే మోదీ కేర్ పథకానికి మంచి స్పందన వచ్చిందని వెల్లడించారు. స్వచ్ఛభారత్ కింద 2018–19లో 2 కోట్ల మరుగుదొడ్లు నిర్మించనున్నట్లు షా తెలిపారు. -
లక్ష కోట్లతో ‘రైజ్’
పిట్ట కన్ను మినహా మరేదీ కనిపించనంతటి ఏకాగ్రత పాండవ మధ్యముడిదైతే... గిరిజనుడిగా పుట్టినా, మట్టిబొమ్మలోనే గురువును ఆవాహన చేసి విలువిద్యలో సాటిలేని మేటిగా నిలిచిన పట్టుదల ఏకలవ్యుడిది...! భావి భారత పౌరులను కూడా ఇదే తరహాలో సానపెట్టడమే లక్ష్యమని పేర్కొన్నారు జైట్లీ. గిరిజనుల కోసం ఏకలవ్య గురుకుల పాఠశాలలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. విద్యా రంగానికి కేటాయింపులు కూడా భారీగా చేశారు... న్యూఢిల్లీ కేంద్ర బడ్జెట్లో విద్యారంగం అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఈ రంగానికి రూ.85,010 కోట్లు కేటాయిస్తున్నట్లు వివరించారు. ఇందులో రూ.35,010 కోట్లు ఉన్నత విద్యారంగానికి, రూ.50,000 కోట్లు పాఠశాల విద్యకు కేటాయించామన్నారు. వచ్చే నాలుగేళ్లలో ఉన్నత విద్యాసంస్థల్లో పరిశోధనలను ప్రోత్సహించడానికి, మౌలిక సదుపాయాలు కల్పించడానికి రూ.లక్ష కోట్లతో ‘రివైటలైజింగ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సిస్టమ్ ఇన్ ఎడ్యుకేషన్(రైజ్) పేరిట ప్రత్యేక పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. హయ్యర్ ఎడ్యుకేషన్ ఫండింగ్ ఏజెన్సీ ద్వారా ఈ నిధులు కేటాయిస్తామన్నారు. ‘ప్రధానమంత్రి ఫెలోషిప్ పథకం’కింద ప్రతిఏటా ప్రముఖ విద్యాసంస్థల నుంచి అత్యంత ప్రతిభావంతులైన 1,000 మంది బీటెక్ విద్యార్థులను గుర్తించి, వారికి ఐఐటీలు, ఐఐఎస్సీలో పీహెచ్డీ చేసే అవకాశం కల్పిస్తామన్నారు. అంతేకాకుండా ఆకర్షణీయమైన ఉపకార వేతనం అందజేస్తామని తెలిపారు. 24 కొత్త మెడికల్ కాలేజీలు దేశంలో వైద్యుల–రోగుల నిష్పత్తిలో అంతరాన్ని పూరించేందుకు 24 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు అరుణ్ జైట్లీ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న జిల్లా ఆసుపత్రుల స్థాయిని పెంచుతూ ఈ కళాశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి మూడు పార్లమెంట్ నియోజకవర్గాలకు కనీసం ఒకటి చొప్పున మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. బ్లాక్ బోర్డుల నుంచి డిజిటల్ బోర్డులకు.. వడోదరలో స్పెషలైజ్డ్ రైల్వే యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు అరుణ్ జైట్లీ ప్రకటించారు. అలాగే పూర్తిస్థాయిలో రెండు కొత్త ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాకుండా ఐఐటీలు, ఎన్ఐటీల్లో స్వయం ప్రతిపత్తి కలిగిన 18 ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ స్కూళ్లను నెలకొల్పనున్నట్లు తెలిపారు. విద్యారంగంలో నాణ్యత నానాటికీ పడిపోతోందని జైట్లీ ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలను పాఠశాలలకు రప్పించగలుగుతున్నాం కానీ వారికి నాణ్యమైన విద్యను అందించలేకపోతున్నామని చెప్పారు. పాఠాలు బోధించే ఉపాధ్యాయుల్లో నాణ్యత పెరిగితే విద్యలోనూ నాణ్యత తప్పనిసరిగా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయుల కోసం సమీకృత బీఈడీ కోర్సులను ప్రవేశపెడతామన్నారు. 13 లక్షల మందికిపైగా టీచర్లకు శిక్షణ ఇస్తామన్నారు. ఇటీవల ప్రారంభించిన ‘దీక్షా’పోర్టల్ ద్వారా ఉపాధ్యాయుల్లో నైపుణ్యాలను పెంచేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. విద్యారంగంలో డిజిటల్‌కు ప్రాధాన్యం పెరగాల్సి ఉందని వివరించారు. బ్లాక్ బోర్డుల నుంచి డిజిటల్ బోర్డుల వైపు వెళ్లాలని సూచించారు. 50 శాతానికి పైగా గిరిజన జనాభా గల ప్రాంతాలు లేదా 20 వేల గిరిజన జనాభా ఉన్న ప్రతిచోట నవోదయ విద్యాలయాల తరహాలో 2022 నాటికి ‘ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు’ఏర్పాటు చేయనున్నట్లు జైట్లీ వెల్లడించారు. విద్య, వైద్యం సెస్సు 4 శాతానికి పెంపు వ్యక్తిగత ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్నులపై 3 శాతంగా ఉన్న విద్య సెస్సును ‘విద్య, వైద్యం సెస్సు’కింద 4 శాతానికి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. పేద, గ్రామీణ కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ పెంపు ద్వారా రూ.11 వేల కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. బడ్జెట్ హైలైట్స్ ► 2018–19లో ఎస్సీల సంక్షేమానికి రూ.56,619 కోట్లు.. ఎస్టీల సంక్షేమానికి రూ.39,135 కోట్లు కేటాయింపు. ► ముద్రా పథకం కింద రుణ లక్ష్యం రూ. 3 లక్షల కోట్లు. ► డిజిటల్ ఇండియా పథకానికి రూ. 3,073 కోట్లు కేటాయింపు. ► టెలికం రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 10 వేల కోట్ల కేటాయింపు. ► మౌలిక వసతుల రంగానికి ప్రాధాన్యత. రూ. 5.97 లక్షల కోట్లు కేటాయింపు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.4.94 లక్షల కోట్లు కేటాయించిన ప్రభుత్వం. ► ప్రతి వ్యాపార సంస్థకు ఆధార్ తరహాలో గుర్తింపు సంఖ్య. ► 2018–19 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.80 వేల కోట్లు. ► గోల్డ్ పాలసీని రూపొందిస్తున్నట్టు ప్రకటన. -
బడ్జెట్ బ్యాక్‌గ్రౌండ్..
బడ్జెట్ అనగానే చాలామంది లెక్కల చిక్కులే అనుకుంటారు! కానీ ఈ మూడక్షరాల వెనుక చాలా కృషి దాగుంటుంది. ఎంతో కసరత్తు.. లెక్కకు మించి భేటీలు.. ఆద్యంతం గోప్యత.. అబ్బో చాలా తతంగమే ఉంటుంది. అదేంటో ఓ లుక్కేయండి! సెప్టెంబర్‌లో.. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఏయే రంగానికి ఎంత ఖర్చు పెట్టాలన్న కసరత్తు మొదలవుతుంది. దేశంలో మొత్తం జనాభా తమ తిండి కోసం ఏడాది అంతా ఎంత ఖర్చు చేస్తున్నారో దాదాపు అంత మొత్తాన్ని ప్రభుత్వం బడ్జెట్‌కు కేటాయిస్తుంది. అక్టోబర్‌లో.. తమకు కావాల్సిన నిధులపై వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు ఆర్థికశాఖతో చర్చల్లో తలమునకలవుతారు. డిసెంబర్.. ముసాయిదా బడ్జెట్ కాపీలను అధికారులు ఆర్థికమంత్రికి నివేదిస్తారు. ఈ ముసాయిదా పత్రాలన్నీ నీలం రంగులో ఉంటాయి. జనవరి.. పారిశ్రామిక, బ్యాంకింగ్ రంగాలకు చెందిన వివిధ సంఘాల ప్రతినిధులు ఆర్థికమంత్రిని కలసి తమ సమస్యలను సలహాలను, సూచనలను అందజేస్తారు. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి అందరి వాదనలు వింటారుగానీ ఎవరికీ నిర్దిష్టమైన హామీ ఇవ్వరు. ముద్రణ ప్రక్రియ.. బడ్జెట్‌కు సంబంధించిన అన్ని వివరాలను అత్యంత రహస్యంగా ఉంచేందుకు జనవరి నుంచి ఆర్థికమంత్రిత్వ శాఖ కార్యాలయాల్లోకి జర్నలిస్టుల ప్రవేశాన్ని నిషేధిస్తారు. ఫోన్ ట్యాపింగ్.. బడ్జెట్ ప్రతిపాదనలు ఏమాత్రం లీక్ కాకుండా చూసే బాధ్యతను ఇంటెలిజెన్స్ విభాగం చూసుకుంటుంది. ఇందుకు కొందరు ఉన్నతాధికారుల ఫోన్లను సైతం ట్యాప్ చేస్తుంటుంది. సందర్శకులపై మూడో కన్ను.. ఆర్థిక శాఖ కార్యాలయానికి వచ్చే సందర్శకులపై సీసీటీవీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు నిఘా ఉంటుంది. ఈ కెమెరాల పరిధిని దాటి వారు కనీసం కుర్చీలపై కూర్చోవడానికి కూడా అనుమతి ఉండదు. అంతా ‘ప్రత్యేకం’ బడ్జెట్ పత్రాలను తయారు చేసే ‘ప్రింటింగ్ ప్రెస్’ సిబ్బందిని ఎవరితో సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఉంచుతారు. వీరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. ఆహారంపైనా జాగ్రత్త ప్రింటింగ్ ప్రెస్ సిబ్బందికి అందించే తిండిపై అత్యంత జాగ్రత్త తీసుకుంటారు. ఏ ఆహారాన్నైనా పరీక్షించిన తర్వాతే వారికి ఇస్తారు. నీడలా వెన్నంటే.. ముద్రణ విభాగంలో పనిచేసే సిబ్బంది ఎవరైనా అత్యవసరంగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. సదరు వ్యక్తి వెంట ఓ ఇంటెలిజెన్స్ అధికారి, ఓ పోలీసు ఉంటారు. వారు అనుక్షణం ఆయనను నీడలా అనుసరిస్తారు. ఫిబ్రవరి 1న.. ఉదయం 11 గంటలకు ఆర్థికమంత్రి పార్లమెంటుకు బడ్జెట్‌ను సమర్పిస్తారు. సభలో ప్రవేశపెట్టేముందు రాష్ట్రపతి, ప్రధానమంత్రికి బడ్జెట్ గురించి స్థూలంగా వివరిస్తారు. పరీక్ష పేపర్లే కాదు.. బడ్జెట్ పేపర్లు కూడా లీకైన సంఘటన 1950లో చోటుచేసుకుంది. అప్పట్లో బడ్జెట్ పత్రాల్ని రాష్ట్రపతి భవన్లో ముద్రించేవారు. 1950లో ఈ పత్రాలు ముందే లీక్ కావడంతో అప్పట్నుంచి మింట్‌రోడ్‌లోని సెక్యూరిటీ ప్రెస్‌కు ముద్రణ వేదికను మార్చారు. 1980 నుంచి ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో బడ్జెట్ పత్రాల్ని ముద్రిస్తున్నారు. ఇందుకోసం అక్కడ ప్రత్యేకంగా ప్రింటింగ్ ప్రెస్‌ను ఏర్పాటు చేశారు. -
బిట్ కాయిన్.. బంగారు కొండ
కొంతకాలంగా సంచలనం సృష్టిస్తున్న వర్చువల్ కరెన్సీ బిట్‌కాయిన్. కేవలం సంక్లిష్టమైన ప్రోగ్రామింగ్ కోడ్ల ఆధారంగా రూపొందే క్రిప్టో కరెన్సీల జాబితా లోదే ఇది కూడా. కానీ ప్రతి లావాదేవీ నిక్షిప్తమయ్యే బ్లాక్‌చెయిన్, నిర్ణీతంగా మాత్రమే అందుబాటులో ఉండడం, యజమానుల వివరాలు రహస్యంగా ఉండడం, ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు కరెన్సీగా మార్పిడికి అంగీకరించడంతో డిమాండ్ బాగా పెరిగిపోయింది. 2010లో ఆమోదిత లావాదేవీలు మొదలైనా.. 2015 నుంచి జైత్రయాత్ర చేసింది. దీని విలువ ఏకంగా కొన్ని లక్షల రెట్లు పెరిగిపోయింది. ఏమేం కొనొచ్చు? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలు బిట్‌కాయిన్‌ను కరెన్సీగా అంగీకరిస్తున్నాయి. లావాదేవీ జరిగిన సమయంలో బిట్‌కాయిన్ విలువ ఆధారంగా ఈ కరెన్సీ మార్పిడి ఉంటుంది. మైక్రోసాఫ్ట్, డెల్, వర్జిన్ గెలాక్టిక్, హాలిడే ఇన్, సబ్వే, దిపైరేట్స్ బే, బ్లూమ్‌బర్గ్, అమెరికా డిష్ నెట్వర్క్ వంటి ప్రముఖ సంస్థలతో పాటు వందలాది ఆన్లైన్ షాపింగ్ సైట్లలో బిట్‌కాయిన్‌తో లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఉండేవి 2,10,00,000 మాత్రమే అత్యంత క్లిష్టమైన ప్రోగ్రామింగ్ కోడ్లతో బిట్‌కాయిన్‌ను సృష్టిస్తారు. ఇలా కోడ్లను ఛేదించేవారిని బిట్‌కాయిన్ మైనర్లు అంటారు. ఒక రకంగా చెప్పాలంటే వజ్రాల్లా బిట్కాయిన్లను తవ్వి తీసేవారన్న మాట. దీని బేస్ ప్రోగ్రామ్ ప్రకారం.. మొత్తంగా 2.1 కోట్ల బిట్కాయిన్లను మాత్రమే సృష్టించగలరు. దీనివల్ల కూడా వీటికి ఇంత డిమాండ్. ఇది బిట్‌కాయిన్ వికీ.. బిట్‌కాయిన్ చరిత్ర, కొనుగోళ్ల నుంచి ప్రస్తుత ధర దాకా సమాచారం అందించేందుకు ఏకంగా వికీపీడియా తరహాలో ఓ వెబ్సైట్ ఉంది. ఈ వెబ్‌సైట్‌ను ‘బిట్‌కాయిన్ వికీగా’ పిలుస్తారు. ఇందులో బిట్కాయిన్ల వినియోగం, అమ్మకం, కొనుగోళ్లు, నెట్వర్క్, దాని భద్రతకు తీసుకుంటున్న చర్యలు వంటి వివరాలన్నీ ఉంటాయి. బిట్‌కాయిన్ మొదటి రిటైల్ లావాదేవీ: 2010 మే 22 నాటి ధర: 25 పైసలు (0.004 డాలర్లు) బిట్‌కాయిన్ గరిష్ట ధర నమోదైన రోజు: 2017 డిసెంబర్ 16 ఆ రోజున విలువ: రూ. 12,20,738(19,194 డాలర్లు) 2018 జనవరి 30 నాటికి ఒక్కో బిట్‌కాయిన్ విలువ రూ. 7,14,228 (11,230 డాలర్లు) ఏడున్నరేళ్లలో బిట్‌కాయిన్ విలువ పెరుగుదల శాతం..: 30 లక్షల రెట్లు రెండు పిజ్జాలు.. 714 కోట్లు బిట్‌కాయిన్‌తో మొట్టమొదట కొనుగోలు చేసిన వస్తువేమిటో తెలుసా.. పిజ్జా. 2010 మే 22న లాజ్లో హనైజ్ అనే బిట్ కాయిన్ మైనర్ డోమినోస్ సంస్థ నుంచి రెండు పిజ్జాలు కొన్నారు. ఆ పిజ్జాల ధర 41 డాలర్లు (సుమారు రూ.2,500). ఈ సొమ్ము కింద 10,000 బిట్కాయిన్లు చెల్లించారు. ప్రస్తుతం 10 వేల బిట్కాయిన్ల విలువ మన కరెన్సీలో రూ. 714 కోట్లపైమాటే! ఈ లావాదేవీకి గుర్తుగా ఏటా మే22న ‘బిట్‌కాయిన్ పిజ్జా డే’గా జరుపుకొంటున్నారు. సామ్సంగ్, మోటొరోలా కంపెనీలు సృష్టించాయా? సతోషి నకమొటో’ బిట్‌కాయిన్‌ను సృష్టించినది ఎవరనేది ఇప్పటివరకు తేలక పోవడం గమనార్హం. తొలి బిట్‌కాయిన్ మైనర్ ‘సతోషి నకమోటో’ అనే మారుపేరుతో 2008లో బిట్‌కాయిన్‌ను సృష్టించారు. అసలు ఆ వ్యక్తి ఎవరనే వివరాలేవీ తెలియవు. తర్వాత మరికొందరు మైనర్లు కలసి బిట్కాయిన్లను సృష్టించడం మొదలు పెట్టారు. అయితే బిట్‌కాయిన్‌ను నాలుగు పెద్ద కంపెనీలు సామ్సంగ్, తొషిబా, నకమిచి, మోటోరోలా కలసి సృష్టించాయనే ప్రచార ముంది. ఈ 4 కంపెనీల పేర్లలోని తొలి అక్షరాలను తీసుకునే.. ‘సతోషి నకమొటో’ పేరుతో తొలి మైనర్ వ్యవహరించారని చెబుతుంటారు. కానీ ఎవరూ నిర్ధారించలేదు. -
ఇమాందారీ కా ఉత్సవ్
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి దేశప్రజల మద్దతు లభించిందని, ఇది నిజాయితీకి దక్కిన పురస్కారమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పే ర్కొన్నారు. నల్లధనాన్ని అరికట్టడానికి తీసుకున్న ఈ చర్య, నిజాయితీగా పన్నులు చెల్లించేవారి మెప్పు పొందిందన్నారు. దీనిని ఆయన ‘ఇమాందారీ కా ఉత్సవ్’గా అభివర్ణించారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేసేవారి సంఖ్య పెరిగిందని గురువారం బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. పన్నుల విషయంలో ఇది గొప్ప విజయమని అన్నారు. నిజాయితీగా పన్నులు చెల్లించేవా రికి తగిన ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. గ తంలో రిటర్నులు దాఖలు చేసేవారి సంఖ్య 66.26 లక్షలుండగా, 2016–17లో ఈ సంఖ్య 85.51 లక్షల కు పెరిగిందన్నారు. అలాగే 2014–15 ఆర్థిక సంవత్సరం ఆరంభంలో పన్నులు చెల్లించేవారి సం ఖ్య 6.47 కోట్లు ఉండగా, 2017 మార్చి చివరి నాటికి ఆ సంఖ్య 8.27కోట్లకు పెరిగిందని జైట్లీ వివరించారు. -
అసంతృప్తే.. ఆగ్రహం వద్దు..!
సాక్షి, అమరావతి: కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండిచేయి చూపడంపై అసంతృప్తి వ్యక్తం చేయాలే తప్ప తొందరపాటు ప్రకటనలు చేయొద్దని సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ ఎంపీలు, మంత్రులకు నిర్దేశించారు. బడ్జెట్ తీవ్రంగా నిరుత్సాహపరిచిందని, భాగస్వామ్య పక్షంగా టీడీపీకి ఇది తీవ్రమైన అంశమని, అయినప్పటికీ వెంటనే ఓ నిర్ణయానికి రాలేమని, ఆచితూచి స్పందించాల్సి ఉందని ఆయన అన్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి చేసిన కేటాయింపులపై గురువారం చంద్రబాబు టీడీపీ ఎంపీలు, మంత్రులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తొలుత ఢిల్లీలో ఉన్న టీడీపీ ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీయేలో కొనసాగడం మంచిది కాదని పలువురు ఎంపీలు చెప్పగా.. తామంతా రాజీనామాలు చేస్తామని ఉత్తరాంధ్రకు చెందిన ఓ ఎంపీ అన్నట్టు సమాచారం. రాజీనామాలకంటే ఈ బడ్జెట్ సమావేశాల్ని బహిష్కరించడం ద్వారా నిరసన తెలిపితే బాగుంటుందని మరికొందరు ఎంపీలు అభిప్రాయపడగా, కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తేవాలని ఒకరిద్దరు సూచించారు. అందరి మాటలు విన్న చంద్రబాబు ఆవేశపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేమని, ఎంపీలు తొందరపాటుగా ఎక్కడా మాట్లాడవద్దని సూచించారు. ఆదివారం జరిగే టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పూర్తిస్థాయిలో చర్చించాక ఓ నిర్ణయానికి వద్దామని, అప్పటివరకు ఆచితూచి స్పందించాలన్నారు. కేంద్రమంత్రి సుజనాచౌదరితో ఆయన విడిగా మాట్లాడి ఢిల్లీ పరిణామాల గురించి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు, టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశమై బడ్జెట్‌పై ఎలా మాట్లాడాలనే దానిపై సూచనలు చేశారు. కేంద్రం రాష్ట్రాన్ని పట్టించుకోకున్నా ఎన్డీయేను టీడీపీ వదలట్లేదనే భావన ప్రజల్లో ఉందని, ఇలాంటి సమయంలో ఏదో ఒక గట్టి నిర్ణయం తీసుకోకపోతే పార్టీకి ఇబ్బంది వస్తుందని పలువురు మంత్రులు చెప్పినట్లు తెలిసింది. సీఎం స్పందిస్తూ.. కేంద్రంపై ఒత్తిడి చేయడమే మన ముందున్న మార్గమని, అంతకుమించి ఎక్కువ చేయొద్దని స్పష్టం చేశారు. బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే చెప్పాలని, నేరుగా కేంద్రం, బీజేపీపై విమర్శలు చేయొద్దని సూచించారు. శుక్రవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చిద్దామని, కేంద్రమంత్రులను కలవడమా? నిరసన తెలపడమా? ఇంకా గట్టిగా ఒత్తిడి తేవడమా? అనే విషయాన్ని రెండురోజుల్లో నిర్ణయిద్దామని చెప్పారు. బీజేపీతో తెగతెంపులు చేసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులొచ్చే అవకాశం ఉంటుందనే అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైనట్లు సమాచారం. బీజేపీని దూరం చేసుకోవడం వల్ల నష్టపోతామని, దూరదృష్టితో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పలువురు మంత్రులు అభిప్రాయపడినట్లు తెలిసింది. -
ఏపీకి తీవ్ర అన్యాయం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ కేంద్ర బడ్జెట్లో చేర్చకపోవడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లుగా హామీలు అమలవుతాయని ఎదురుచూస్తున్న ఏపీ ప్రజల ఆశలను కేంద్రం నీరుగార్చిందని వారు అభిప్రా యపడ్డారు. రాష్ట్రానికిచ్చిన హామీలను సాధించుకునే వరకు వైఎస్సార్సీపీ పోరాడుతుందని పేర్కొన్నారు. గురువారం పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రిఅరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం వైఎస్సార్సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. ‘‘కేంద్ర బడ్జెట్ ఏపీ ప్రజలకు తీవ్ర నిరాశ కలిగించింది. విభజన చట్టంలో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ బడ్జెట్లో చేర్చలేదు. ఎన్డీయేకు ఇదే చివరి పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్‌ప్లాంట్, పోలవ రం పూర్తికి నిధుల మంజూరులో స్పష్టత ఇస్తుందని ఆశించాం. కానీ ఏ ఒక్క విషయంలోనూ స్పష్టత ఇవ్వలేదు. హామీలను సాధించుకునేవరకు వైఎస్సార్ సీపీ పోరాడు తుంది. ఇప్పుడు మేం రాజీనామాలు చేస్తే హామీలపై ఎవరూ కేంద్రాన్ని ప్రశ్నిం చరు. తుదివరకు పోరాడి అప్పటికీ కేంద్రం తలొగ్గకపోతే అప్పుడు రాజీనామా అస్త్రాలు ప్రయోగిస్తాం’’ అని స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏపీలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తోందని, ఏటా ప్రతి ఒక్కరికీ 5లక్షల మేరకు ఆరోగ్య బీమా కల్పించడం అభినందనీయమని అన్నారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ బడ్జెట్లో ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు. పార్లమెంటులో కేంద్రాన్ని విభజన హామీలపై ప్రశ్నిస్తామన్నారు. హామీలను అమలు చేయకుండా కేంద్రం చేస్తున్న అన్యాయంపై టీడీపీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. -
సాగునీటికి.. ప్చ్!
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్ ఊరటనిచ్చేలా లేదు. నాబార్డు కింద ఏర్పాటు చేసిన కార్పస్ ఫండ్ నుంచే రూ.6 వేల కోట్ల రుణాలను సత్వర సాగునీటి ప్రాయోజిత పథకం (ఏఐబీపీ) కింద ఎంపిక చేసిన ప్రాజెక్టులకు ఇస్తామని బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. దేశవ్యాప్తంగా 48 ప్రాజెక్టులకు రూ.6 వేల కోట్లు ఇస్తామని పేర్కొనగా, అందులో తెలంగాణకు సంబంధించి 11 ప్రాజెక్టులుండే అవకాశం ఉంది. దేవాదుల, రాజీవ్ బీమా, ఎస్సారెస్పీ రెండో దశ, నీల్వాయి, ర్యాలీ వాగు, మత్తడి వాగు, పాలెం వాగు, కుమురం భీం, జగన్నాథపూర్, పెద్ద వాగు, గొల్ల వాగు, వరద కాలువలకు నిధులు విడుదల కావొచ్చు. నిజానికి ఈ ప్రాజెక్టులకు కేంద్ర సాయం కింద గతేడాదే రూ.659.56 కోట్లు రావాల్సి ఉన్నా కేంద్రం విడుదల చేయలేదు. మరి ప్రస్తుత ఏడాది మొత్తం నిధుల్లో 10 శాతం ఒక్క రాష్ట్రానికే ఇస్తారా అన్నది సందేహమే. ఏఐబీపీ ప్రాజెక్టులన్నీ 2019 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని కేంద్రం పేర్కొనగా, రాష్ట్రంలోని 11 ప్రాజెక్టుల్లో వరద కాల్వ మినహా పదింటిని ఈ ఏడాది మార్చి నాటికే పూర్తి చేయాల్సి ఉంది. దీంతో నిధులు మంజూరు చేస్తేనే ప్రాజెక్టుల పూర్తి సాధ్యం కానుంది. చెక్ డ్యామ్‌లకు వస్తాయో రావో..? ‘హర్ ఖేత్‌కో పానీ’ కింద మైనర్ ఇరిగేషన్, వాటర్‌షెడ్ పథకాలకు రూ.2,600 కోట్లను కేంద్రం కేటాయించింది. ఇందులో మిషన్ కాకతీయకు నిధులు దక్కే అవకాశం ఉంది. ఈ ఏడాది జనవరి మొదటి వారంలో ఖమ్మంలో 66, మెదక్‌లో 45, నల్లగొండలో 36 చెరువుల పనులకు గానూ మరమ్మతులు, పునరుద్ధరణ, పునరావాసం (ఆర్ఆర్ఆర్) పథకం కింద కేంద్రం రూ.162 కోట్లు మంజూరు చేసింది. ఇప్పుడూ అదే మాదిరి నిధులు రావొచ్చని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. ఇక వాటర్‌షెడ్ పథకాల కింద నిర్మిస్తున్న చెక్ డ్యామ్‌లకు నిధులు దక్కుతాయో లేదో వేచి చూడాలి. నదుల అనుసంధాన సమగ్ర ప్రాజెక్టు నివేదికల తయారీకి రూ.225 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. ఇందులో మహానది–గోదావరి, గోదావరి–కావేరీ నదుల అనుసంధాన ప్రతిపాదన ఉండనుంది. ఇక భూగర్భజలాల నిర్వహణకు రూ.450 కోట్లు కేటాయించగా వాటి నుంచి రాష్ట్రానికి నిధులొస్తాయన్న ఆశేమీ లేదు. -
షేర్లపై లాభాలొస్తే పన్ను!
సాక్షి, అమరావతి: ఇక నుంచి షేర్లు, మ్యూచువల్ ఫండ్లు ఎప్పుడు అమ్మినా వచ్చే లాభాలపై పన్ను చెల్లించక తప్పదు. షేర్ మార్కెట్ పరిభాషలో దీర్ఘకాలం అంటే ఇప్పటివరకూ ఏడాది! షేర్లు కొని ఏడాదిలోపు విక్రయిస్తే... ఆ లాభాలపై షార్ట్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ 15 శాతం చెల్లించాలి. అదే ఏడాది దాటాక విక్రయిస్తే ఆ లాభాలపై ఇప్పటిదాకా పన్ను లేదు. దీర్ఘకాలం షేర్లలో ఇన్వెస్ట్ చేయటాన్ని ప్రోత్సహించడానికి ఇది చేసేవారు. కానీ షేర్లు, ఈక్విటీ ఫండ్స్‌పై వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాలపై 10 శాతం పన్నును విధిస్తున్నట్లు తాజా బడ్జెట్లో ప్రకటించారు. ఈ లాభం లక్ష రూపాయలు దాటితే పన్ను పడుతుంది. ఈ చెల్లించే పన్నుపై ఇండక్సేషన్‌ను (ద్రవ్యోల్బణ సూచీ) పరిగణనలోకి తీసుకోరు. జనవరి 31 వరకు వచ్చిన లాభాలను ఈ పన్ను పరిధిని నుంచి మినహాయిస్తూ నిర్ణయం తీసుకోవడం ఒక్కటే ఊరట. ‘గ్రాండ్ఫాదర్డ్’పేరిట జనవరి 31 వరకు ఉన్న షేర్ల ధర ఆధారంగా లాభాలను లెక్కిస్తారు. ఉదాహరణ చూద్దాం... ఏడాది క్రితం మీరు రూ.50 వద్ద కొన్న షేరు ధర జనవరి 31 నాటికి రూ.100కి ఉందనుకుందాం. అంటే ఇప్పటికే మీ షేరు ధర రెట్టింపయింది. ఇప్పుడు ఈ షేరును జూలైలో కూడా రూ.100 వద్ద అమ్మితే మీరు ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగాక ఈ షేరును రూ.120కు అమ్మారనుకుందాం. మీ వాస్తవ లాభం రూ.70 అయినా రూ.20పై పన్ను చెల్లిస్తే చాలు. మిగతా రూ.50 లాభాన్ని జనవరి 31 నాటికే పొందారు గనక దానిపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకూ లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వర్తిస్తుంది. అంటే ఇక నుంచి షేర్లు గానీ, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గానీ ఇన్వెస్ట్ చేసిన ఏడాది తర్వాత అమ్మితే 10 శాతం, 12 నెలలలోపు అమ్మితే 15 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుతం షేర్ల క్రయవిక్రయాలపై చెల్లిస్తున్న లావాదేవీ పన్నుకు (ఎస్టీటీ) అదనం. అంటే ఇప్పుడు ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌పై రెండు రకాల పన్నులు చెల్లించాల్సి వస్తుందన్నమాట. భూముల వంటి ఇతర ఆస్తుల్లో 36 నెలలు దాటితే లాంగ్‌టర్మ్ గెయిన్స్‌పై 20 శాతం, ఆ లోపయితే 30 శాతం పన్ను విధిస్తున్నారు. మ్యూచ్‌వల్ ఫండ్లనూ వదల్లేదు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై 10 శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును ప్రతిపాదించిన జైట్లీ... ఇన్వెస్టర్లకు ఈక్విటీ ఫండ్లు ఇచ్చే డివిడెండ్‌పైనా 10 శాతం పన్ను వేశారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్నును తప్పించుకోవటానికి ఇన్వెస్టర్లు డివిడెండ్ ప్లాన్లకు మళ్లకుండా చెక్ పెట్టడమే దీని ఉద్దేశమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నిబంధన ప్రకారం ఇన్వెస్టర్లకు ఫండ్ సంస్థలు మిగులు నిల్వల నుంచి చేసే డివిడెండ్ చెల్లింపులపై పన్నును ముందుగానే చెల్లించాలి. ఇన్వెస్టర్లు నేరుగా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎల్టీసీజీ అన్నది ఏడాది కాలం దాటిన పెట్టుబడులపై లాభం రూ.లక్ష మించితేనే చెల్లించాల్సి ఉంటుంది. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ మాత్రం ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ (డివిడెండ్ ప్లాన్లు)లో ఇన్వెస్ట్ చేసేవారందరూ చెల్లించాల్సినది. ప్రస్తుతం ఈక్విటీ పథకాలపై డివిడెండ్ పంపిణీ పన్ను లేదు. అయితే, డెట్ ఫండ్స్‌లో మాత్రం డివిడెండ్ పంపిణీపై 28.84 శాతం పన్ను ఇప్పటికే అమలవుతోంది. స్వల్పకాలంలో ప్రభావం డివిడెండ్‌నే ఆదాయంగా భావించే వారిపై తాజా పన్ను గణనీయమైన ప్రభావమే చూపనుంది. తాజా పన్ను ప్రతిపాదనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపొచ్చని హెచ్డీఎఫ్సీ ఏఎంసీ చైర్మన్ దీపక్ పరేఖ్ అభిప్రాయపడ్డారు. ఇక మ్యూచువల్ ఫండ్స్ విక్రయించినప్పుడు 0.001% సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుంది. ‘‘సెంటిమెం ట్ ఆధారిత పెట్టుబడుల ఉపసంహరణలు చోటు చేసుకోవచ్చు. అలాగే, ఎల్టీసీజీ వల్ల స్వల్పకాలంలో నిధుల ప్రవాహం కూడా నిదానించ వచ్చు. అయితే దీర్ఘకాలంలో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై పెద్దగా ప్రభావం ఉండదు’’అని మార్నిం గ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇండియా డైరెక్టర్ కౌస్తభ్ బేలపుర్కార్ పేర్కొన్నారు. -
పెట్రో ఊరట..అంతలోనే వాత
న్యూఢిల్లీ: బడ్జెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని ఆశలు పెట్టుకున్న సామాన్యుడికి ఆర్థిక మంత్రి జైట్లీ మొండిచేయి చూపారు. పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించినట్టే తగ్గించి.. మరో రూపంలో వాతపెట్టారు. దీంతో పెట్రో ధరల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. 2018–19 బడ్జెట్ ప్రతిపాదనల్లో పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ. 2 చొప్పున ఎక్సైజ్ పన్నును తగ్గించారు. అలాగే ఆ రెండింటిపై రూ.6 చొప్పున అదనపు ఎక్సైజ్ పన్నును తగ్గించడంతో అందరూ సంతోషించారు. మొత్తంగా పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ. 8 తగ్గించినా.. అంతే మొత్తంలో ‘లెవీ ఆఫ్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ సెస్’ పేరిట భారీగా వాత పెట్టారు. దీంతో ధరలు మళ్లీ యథాస్థితికి చేరుకున్నాయి. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. గురువారం బడ్జెట్ సమర్పణ రోజునే పెట్రోలు ధర గరిష్టంగా రూ. 73కి, డీజిల్ ధర రూ. 64.11కి(ఢిల్లీలో) చేరడం గమనార్హం. -
వ్యవసాయానికి పెద్ద పీట
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం తెలంగాణకు భారీగానే నిధులు ఇస్తోందని, అయితే రాష్ట్రం సకాలంలో వినియోగించుకోకపోవడం వల్ల అదనపు నిధులు రావడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ బడ్జెట్లో వ్యవసాయానికి, పేదల సంక్షేమానికి పెద్ద పీట వేశారని చెప్పారు. 10 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల వరకు వైద్యం అందించాలన్న నిర్ణయం చరిత్రాత్మకమన్నారు. బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం: ఆర్.కృష్ణయ్య సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో మోదీ ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల సమస్యలపై కేంద్రానికి పలుమార్లు నివేదికలు ఇచ్చినప్పటికీ బడ్జెట్లో ఎలాంటి పథకాలు మంజూరు చేయకపోవడం బాధ కలిగించిందన్నారు. ప్రస్తుత బడ్జెట్‌ను చూస్తే బీసీలను ఉద్దేశపూర్వకంగానే పక్కకు పెట్టినట్లుగా ఉందని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు ప్రవేశపెట్టిన బడ్జెట్లలో బీసీలకు ఎలాంటి నిధులు ఇవ్వలేదన్నారు. ‘బడ్జెట్లో బీసీల ప్రస్తావనే లేదు’ సాక్షి, హైదరాబాద్: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ వెనుకబడిన తరగతులకు నిరాశ మిగిల్చిందని బీసీ సంక్షేమ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. జనాభాలో సగభాగం ఉన్న బీసీలకు అతితక్కువ నిధులు కేటాయించడంతో బీసీలపై కేంద్రానికి ఉన్న శ్రద్ధ ఏమిటో స్పష్టమైందని పేర్కొంది. కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ ప్రసంగంలో బీసీల ప్రస్తావనే లేకపోవడం పట్ల ఆ సంఘ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ గురువారం ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా బీసీ బడ్జెట్‌పై ఉద్యమించాలని కోరారు. తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి ఎప్ట్యాప్సీ అధ్యక్షుడు గౌరా శ్రీనివాస్ సాక్షి, హైదరాబాద్: ఇది పారిశ్రామిక వర్గాలు పెట్టుకున్న ఆశలు నెరవేర్చలేని బడ్జెట్ అని ఎప్ట్యాప్సీ అధ్యక్షుడు గౌరా శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ, ఏపీలను బడ్జెట్లో విస్మరించారని, కొంత వరకు సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు మేలు కలిగించేదిగా ఉన్నా, పారిశ్రామిక వర్గాన్ని పట్టించుకోలేదన్నారు. వ్యవసాయం, ఆహారోత్పత్తి సంస్థలు, ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి రంగాలకు ప్రోత్సాహాన్ని అందించిన ప్రభుత్వం సంక్షేమ పథకాలకు భారీగా కేటాయింపులు జరిపిందన్నారు. -
రాష్ట్రానికి తీవ్ర అన్యాయం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి తీవ్ర నిరాశనే మిగిల్చిందని, కొన్ని శాఖలకు మాత్రమే అరకొర నిధులను కేటాయించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అంశాల్లో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినా.. బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్ర ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుతో పాటు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులకు ఎలాంటి కేటాయింపులు చేయలేదన్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో సీఎం కేసీఆర్, మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు విఫలమయ్యారని ఆయన విమర్శించారు. -
ప్రజల ముద్ర లేని బడ్జెట్: ఈటల
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్లో ప్రజల ముద్ర లేదని ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, బడ్జెట్లో తెలంగాణకు నిధులేమీ ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, భగీరథకు దాదాపు రూ.40 వేల కోట్లివ్వాలని తాము అడిగామని, కానీ ఇచ్చిందేమీ లేదన్నారు. దేశంలో తెలంగాణ అంతర్భాగమే కదా అని ప్రశ్నించారు. ప్రగతిశీల నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తున్న రాష్ట్రాలకు సాయం అందించాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని పేర్కొన్నారు. వ్యవసాయం, వైద్యం, విద్యపై కేంద్రం దృష్టి పెట్టినట్లు కనపించినా, ప్రజల హృదయాల్లో ముద్ర వేయలేకపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలకు బడ్జెట్ ఊతమిచ్చేలా ఉన్నప్పటికీ నిధుల కేటాయింపులో నిబద్ధత పాటించి ఉంటే బాగుండేదన్నారు. ఆరోగ్య బీమా పథకానికి అరకొర నిధులు కాకుండా సంపూర్ణంగా కేటాయింపులుండాలని అన్నారు. -
ఈ చేత్తో ఇచ్చి.. ఆ చేత్తో లాగేశారు!!
సాక్షి, అమరావతి: మధ్యతరగతి ఉద్యోగుల ఆశలపై ఆర్థికమంత్రి నీళ్లు చల్లారు. పన్ను శ్లాబుల్లో మార్పులేమీ చేయకుండా కేవలం స్టాండర్డ్ డిడక్షన్‌తో సరిపెట్టుకోమన్నారు. వ్యక్తిగత ఆదాయ పన్నుకు సంబంధించి నాలుగు కీలక మార్పులను ప్రతిపాదించారు. సుమారు 12 ఏళ్ల తర్వాత ఉద్యోగస్తులు, పెన్షనర్ల కోసం స్టాండర్డ్ డిడక్షన్‌ను తిరిగి ప్రవేశపెట్టడమే కొద్దిగా ఊరట కలిగించే విషయం. కానీ దానివల్ల వచ్చే లాభం కూడా చేతికందకుండా నానా మెలికలూ పెట్టారు జైట్లీ. చెల్లించే ఆదాయపన్నుపై వేసే సుంకాన్ని 3 నుంచి 4 శాతానికి పెంచారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో సీనియర్ సిటిజన్లపై మాత్రం కాస్త కరుణ చూపించారు. ఆ వివరాలు చూద్దాం... స్టాండర్డ్ డిడక్షన్ రూ.40,000 ఒక ఉద్యోగి ఆఫీసుకు వెళ్లి రావడానికయ్యే వ్యయాలను దృష్టిలో పెట్టుకొని గతంలో స్టాండర్డ్ డిడక్షన్ కింద ఆదాయంలోంచి కొంత మొత్తాన్ని తగ్గించి మిగిలిన దానిపైనే పన్ను లెక్కించేవారు. కానీ దీన్ని 2006–07 అసెస్మెంట్ ఇయర్లో తొలగించారు. అప్పట్లో స్టాండర్డ్ డిడక్షన్ రూ.30 వేలుగా ఉండేది. 12 ఏళ్ల తర్వాత తిరిగి రూ.40,000 స్టాండర్డ్ డిడక్షన్‌ను జైట్లీ ప్రకటించారు. దీనివల్ల 2.5 కోట్ల మంది లబ్ధి పొందుతారని, ప్రభత్వానికి రూ.8,000 కోట్ల ఆదాయం తగ్గుతుందని చెప్పారు. కానీ స్టాండర్డ్ డిక్షన్ నేపథ్యంలో ప్రస్తుతం మినహాయింపు పరిధిలో ఉన్న రవాణా, వైద్య చికిత్స అలవెన్సుల్ని పన్ను పరిధిలోకి తెచ్చారు. అసలు డిడక్షన్ ఎంతంటే... ఉద్యోగి జీతంలో నెలకు రూ.1,600 చొప్పున (ఏడాదికి రూ.19,200) రవాణా భత్యం ఉంటుంది. దీనిపై ఇపుడు పన్ను లేదు. అలాగే ఏడాదికి రూ.15,000 వరకు మెడికల్ ఖర్చులను ఆదాయం నుంచి తగ్గించి చూపించుకోవచ్చు. ఆ లెక్కన ఏటా రూ.34,200పై ఇప్పుడు కూడా పన్ను లేదు!! మరిక రూ. 40,000 స్టాండర్డ్ డిడక్ష న్ వల్ల లాభమెంత? కేవలం రూ.5,800!! పెన్షన్లరకు ఇలాంటి భత్యాలు ఉండవు కనక స్టాండర్డ్ డిడక్షన్ వల్ల సీనియర్ సిటిజ న్స్‌కు లాభమని చెప్పాలి. ఇది వ్యాపారులు, వృత్తి నిపుణులకు వర్తించదు. పెరిగిన సెస్ భారం ఆదాయ పన్నుపై చెల్లించే సుంకాన్ని 3 నుంచి 4 శాతానికి పెంచారు. తద్వారా పన్ను చెల్లింపుదారులకు ట్యాక్స్ శ్లాబును బట్టి రూ.125 నుంచి రూ.2,625 వరకు భారం పడుతుంది. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలలోపు పన్ను ఆదాయమున్న వారు ప్రస్తుతం 5 శాతం పన్ను చెల్లించాలి. ఈ పరిమితిలో ఉన్నవారు అదనంగా రూ.125 వరకు చెల్లించాలి. అదే 10శాతం పన్ను పరిధిలో (రూ.5–10 లక్షలు) ఉన్నవారు గరిష్టంగా రూ.1,125, 30% పన్ను పరిధిలో ఉన్న వారు అదనంగా రూ.2,625 సుంకం చెల్లించాల్సి ఉంటుంది. సీనియర్లకు కాస్త నయమే! వయో వృద్ధుల వడ్డీ ఆదాయంపై టీడీఎస్ విధించే పరిమితిని ఐదు రెట్లు పెంచడమే కాకుండా, వైద్య చికిత్స వ్యయాలపై పన్ను మినహాయింపు పరిమితిని కూడా పెంచారు జైట్లీ. స్థిరాదాయాన్నిచ్చే ప్రధాని వయ వందన యోజన పథకాన్ని 2020 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సెక్షన్ 194ఏ కింద రూ.50,000 వడ్డీ ఆదాయం వరకు ఎలాంటి టీడీఎస్ వసూలు చేయరు. ప్రస్తుతం ఈ పరిమితి రూ.10,000 మాత్రమే. అదే విధంగా సెక్షన్ 80డీ కింద సీనియర్ సిటిజన్స్ చెల్లించే వైద్య బీమా ప్రీమియం, వైద్య చికిత్సా వ్యయాల పరిమితిని రూ. 50,000కు పెంచారు. ప్రసుత్తం ఈ పరిమితి రూ. 30,000గా ఉంది. అదే విధంగా సెక్షన్ 80డీడీబీ కింద తీవ్ర రోగాల (క్రిటికల్ ఇల్నెస్)కు చేసే చికిత్స వ్యయాలపై లభించే పన్ను మినహాయింపు పరిమితిని లక్ష రూపాయలకు పెంచారు. ప్రస్తుతం ఈ పరిమితి సీనియర్ సిటిజన్స్‌కు రూ.40,000, సూపర్ సీనియ ర్స్కు రూ.60,000 ఉంది. వడ్డీరేట్లు తగ్గుతుండటం తో వయోవృద్ధులకు స్థిరమైన ఆదాయాన్ని అందించడానికి ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి వయ వందన యోజన పథకాన్ని 2020కి పొడిగించారు. ఎల్ఐసీ అందించే ఈ పథకంపై 8 శాతం వడ్డీ లభిస్తుంది. అంతేగాక ఈ పథకంలో ఇన్వెస్ట్మెంట్ పరిమితిని ప్రస్తుతం రూ.7.5 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచారు. స్టాండర్డ్ డిడక్షన్‌కి బిల్లులక్కర్లేదు న్యూఢిల్లీ: తాజా బడ్జెట్లో ప్రకటించిన రూ.40,000 స్టాండర్డ్ డిడక్షన్ క్లెయిమ్ చేయడానికి వేతన జీవులు, పెన్షనర్లు ప్రత్యేకంగా బిల్లులు, ఇతరత్రా పత్రాలేవీ సమర్పించాల్సిన అవసరం లేదని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీడీటీ చైర్మన్ సుశీల్ చంద్ర వివరణ ఇచ్చారు. వారు నేరుగా ఈ మినహాయింపు పొందవచ్చన్నారు. ఉద్యోగుల ఆదాయాలే ఎక్కువ ఉద్యోగులు తమ ఆదాయం వ్యాపారుల కంటే తక్కువని భావిస్తుంటారని, కానీ ఇది సరికాదని గణాంకయుక్తంగా చెప్పారు జైట్లీ. ‘‘వ్యా పారులతో పోలిస్తే ఉద్యోగస్తులే ఎక్కువ ఆదాయ పన్ను చెల్లిస్తున్నారు. 2016–17 అసెస్మెంట్ ఇయర్లో 1.89 కోట్ల మంది ఉద్యోగస్తులు రూ. 1.44 లక్షల కోట్ల ఆదాయ పన్ను చెల్లించారు. అంటే సగటున ఒక్కో ఉద్యోగి రూ.76,306 చెల్లించారు. కానీ ఇదే సమయంలో 1.88 కోట్ల మంది వ్యాపారులు రూ.48,000 కోట్ల పన్నే చెల్లించారు. వీరి సగటు చెల్లింపు రూ.25,753 మాత్రమే. పన్ను తక్కువ చెల్లిస్తున్నారంటే వారి ఆదాయం తక్కువే కదా!’’అంటూ లాజిక్ లాగారు ఆర్థిక మంత్రి! -
ఈసారీ నిరాశే!
సాక్షి, హైదరాబాద్ : మరోసారి కేంద్ర బడ్జెట్ తెలంగాణకు నిరాశనే మిగిలించింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులన్నీ కేంద్రం పక్కనబెట్టింది. బడ్జెట్లో కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాల ప్రస్తావనే లేదు. ఈ మూడింటికీ కేంద్రం నుంచి తగినంత ఆర్థిక సాయం అందుతుందని రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న ఆశలన్నీ గల్లంతయ్యాయి. బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఎయిమ్స్ హామీలు ఆచరణకు నోచుకుంటాయన్న ఆశలూ అడియాసలయ్యాయి. గోదావరి నుంచి సాగునీటిని అందించేందుకు భారీ ఎత్తున నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని, రూ.10 వేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇంటింటికీ తాగునీటిని అందించే మిషన్ భగీరథకు రూ.19 వేల కోట్లు, చెర్వుల పునరుద్ధరణకు రూ.5 వేల కోట్లు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేసింది. మిగతా రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా ఉన్న ఈ రెండు పథకాలకు తగినంత ఆర్థిక సాయం అందించాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా బడ్జెట్లో కేటాయింపులు లేకపోవటం నిరాశపరిచింది. గిరిజన వర్సిటీకి రూ.10 కోట్లు తెలంగాణ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు 2018–19 బడ్జెట్లో రూ.10 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. హైదరాబాద్ ఐఐటీలో నాణ్యత ప్రమాణాల పెంపునకు రూ.75 కోట్లు కేటాయించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు సమీపంలోని జాకారంలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. దీంతో ములుగుకు జాతీయ స్థాయిలో గుర్తింపు రానుంది. దేశంలో తొలి గిరిజన విశ్వవిద్యాలయం మధ్యప్రదేశ్‌లోని అమరకంఠక్‌లో ఉండగా, ములుగులో ఏర్పాటయ్యే వర్సిటీ రెండోదిగా రికార్డులకెక్కనుంది. పెరిగిన పన్నుల ఆదాయం ప్రత్యేకంగా వరాలేమీ లేకపోయినా.. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా, గ్రాంట్లు, ప్రాయోజిత పథకాల నిధులే తెలంగాణకు మరోసారి పెద్ద దిక్కుగా మారనున్నాయి. తాజా బడ్జెట్ అంచనాల ప్రకారం.. ఈ ఏడాది దాదాపు రూ.30,308.69 కోట్లు కేంద్రం నుంచి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం విశ్లేషించుకుంటోంది. కేంద్ర పన్నుల వాటాలో ఈసారి రాష్ట్రానికి భారీగానే నిధులు రానున్నాయి. జీఎస్టీ పూర్తిస్థాయి అమల్లోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్రం పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని భారీగా అంచనా వేసుకుంది. దీంతో కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి రూ.19,207.43 కోట్లు రానున్నాయి. 14వ ఆర్థిక సంఘం సూచించిన మేరకు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 42 శాతం వాటా పంపిణీ అవుతుంది. మొత్తం రూ.7.88 లక్షల కోట్ల పన్నుల వాటాను రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నట్లు బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది. రాష్ట్రాల వారీగా అందులో 2.437 శాతం నిధులు రాష్ట్రానికి విడుదలవుతాయి. ఈ నిధులను కేంద్రం ఏ నెలకానెలా విడుదల చేస్తుంది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి పన్నుల వాటాలో రూ.16,401.13 కోట్లు వచ్చాయి. దీంతో వచ్చే ఏడాది రూ.2,806.30 కోట్లు రాష్ట్రానికి అదనంగా రానున్నాయి. కేంద్ర పథకాలు.. గ్రాంట్లు నిరుటితో పోలిస్తే కేంద్ర ప్రాయోజిత పథకాల కేటాయింపులు సైతం పెరగనున్నాయి. రాష్ట్రంలో అమలవుతున్న కేంద్ర ప్రాయోజిత పథకాలకు గత బడ్జెట్లో రూ.6,694 కోట్లు కేటాయించగా ఈసారి అంచనాల్లో రూ.8,333 కోట్లు పొందుపరిచారు. వీటికి తోడు వచ్చే ఏడాది రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు రూ.2,768.26 కోట్లు కేంద్రం గ్రాంట్ల రూపంలో విడుదల చేయనుంది. 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన మేరకు ఈ నిధుల కేటాయింపు తప్పనిసరి. రాష్ట్ర అవసరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం రాష్ట్రాల వారీగాకాక మంత్రిత్వ శాఖలకు బడ్జెట్ కేటాయించారు. కేంద్రం గతేడాది నుంచి ఈ కొత్త విధానాన్ని అవలంబిస్తోంది. ఇంటింటికి మంచినీరు, రైతుల ఆదాయం రెట్టింపు, రైల్వే, మౌలిక వసతులకు బడ్జెట్లో పెద్దపీట వేశారు. రాష్ట్ర అవసరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. కేంద్ర బడ్జెట్‌పై ఇంకా కొంత స్పష్టత రావాలి. ఏ రాష్ట్రానికి, ఏ ప్రాంతానికి ఎన్ని నిధులు కేటాయించారో స్పష్టత లేదు. – టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి ‘మద్దతు’ ఒక్కటే అనుకూలం రైతులకు మద్దతు ధర పెంపు అంశం ఒక్కటే బడ్జెట్లో అనుకూల అంశంగా కనిపిస్తోంది. ఈ మద్దతు ధర సైతం అన్ని పంటలకా లేక కొన్నింటికే పరిమితమా అన్న విషయంలో స్పష్టత లేదు. మొదటి బడ్జెట్లోనే ఈ ప్రతిపాదన ఉంటే మూడేళ్లుగా రైతులు లబ్ధి పొందేవారు. రైతులకు మద్దతు ధర ఎలా కల్పిస్తారో చెప్పకపోవడం బాధాకరం. పేదలకు రూ. 5 లక్షల వరకు ఆరోగ్య ఖర్చు భరిస్తామనడం సంతోషకరం. – కె.కవిత, ఎంపీ తెలంగాణకు కేంద్రం నుంచి వచ్చే నిధులు(2018–19) (రూ.కోట్లలో..) కేంద్ర పన్నుల వాటా - 19,207.43 కేంద్ర ప్రాయోజిత పథకాలు - 8,333 14వ ఆర్థిక సంఘం నిధులు - 2,768.26 మొత్తం - 30,308.69 తెలంగాణకు కేంద్ర పన్నుల ఆదాయం (రూ.కోట్లలో) సెంట్రల్ జీఎస్టీ 6,181.16 కార్పొరేట్ ట్యాక్స్ 5,392.78 ఆదాయ పన్ను 4,772.31 కస్టమ్స్ ట్యాక్స్ 946.26 ఎక్సైజ్ డ్యూటీ 922.11 ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ 511.77 మొత్తం 19,207.43 -
మేం కట్టం..
పాలకుల ఆజ్ఞల్ని శిరసావహించేవారు కొందరైతే, వాటిని పూచికపుల్లగా ధిక్కరించి విప్లవాగ్ని రగిల్చినవారు మరికొందరు. చరిత్ర పుటల్లో కొందరు ఇలాంటి ధిక్కారాలకు పాల్పడి పాలకుల పాలిట సింహస్వప్నమై నిలిచారు. పన్ను పోట్లపై దండెత్తారు. ‘దండి’గా ధిక్కరణ ►తెల్లవాడి దురహంకారంపై తొలి దెబ్బ. రవి అస్తమించని సామ్రాజ్యం మాది.. అంటూ విర్రవీగుతున్న ఆంగ్లేయుల నెత్తిపై తొలి పిడుగు.. అదే ఉప్పు సత్యాగ్రహం. ఉప్పుపై విధించిన పన్నుకు వ్యతిరేకంగా 1930 మార్చి 12న జాతిపిత బాపూజీ నేతృత్వంలో సాగిన ఈ సత్యాగ్రహం ఏప్రిల్ 6న గుజరాత్‌లోని దండిలో బ్రిటిష్ చట్టాలను ధిక్కరించి ఉప్పును తయారుచేయడంతో ముగిసింది. ఉక్కు మహిళకూ తప్పలేదు.. ►స్థానిక, సేవల పన్నులకు వ్యతిరేకంగా 1990లో బ్రిటన్ పౌరులు సర్కారుపై తిరుగుబావుటా ఎగురవేశారు. 2కోట్ల మంది ఈ పన్నులను చెల్లించేందుకు నిరాకరించారు. ట్రఫాల్గర్ స్క్వేర్ వద్దకు లక్షలాదిగా చేరుకుని సర్కారుపై యుద్ధభేరి మోగించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున గొడవలు, అల్లర్లు చెలరేగాయి. చివరికి నాటి ప్రధాని, ఉక్కు మహిళ మార్గరేట్ థాచర్ ప్రజాగ్రహానికి తలవంచక తప్పలేదు. టీ కప్పులో ‘బోస్టన్’తుపాను.. ►ఆంగ్లేయుల గుత్తాధిపత్యానికి ‘బోస్టన్ టీ పార్టీ’ఉదంతం చెంపపెట్టులాంటిది. బ్రిటన్ ప్రభుత్వానికి చెందిన ఈస్టిండియా కంపెనీకి, వారి తొత్తులకు మాత్రమే టీ పొడి దిగుమతిపై పన్నును మినహాయించడం వలస పాలనలో మగ్గుతున్న అమెరికా వర్తకులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో బోస్టన్ వర్తకులు తిరుగుబాటు చేసి అక్కడి నౌకల్లోని టీ పొడి మొత్తాన్ని సముద్రంపాలు చేశారు. 1773 డిసెంబర్లో జరిగిన ఈ సంఘటన చరిత్రలో బోస్టన్ టీ పార్టీగా వినుతికెక్కింది. ప్రజలకోసం నగ్నంగా.. ►పన్నుల పేరిట భర్త అరాచకాన్ని చూడలేక భార్యే ఎదురుతిరిగిన సంఘటన ఇది. 11వ శతాబ్దంలో ఇంగ్లండ్‌లోని మెర్సియా రాజ్యపాలకుడు లియోఫ్రిక్ ప్రజలపై విపరీతంగా పన్నులు వేసి వేధించేవాడు. సామాన్యుల కష్టాలకు చలించిపోయిన అతడి భార్య లేడీ గొడవపడి భర్తతో వాగ్వాదానికి దిగింది. రెచ్చిపోయిన భర్త.. నగ్నంగా శ్వేతాశ్వంపై నగరాన్ని చుట్టొస్తే పన్నుల భారం తగ్గిస్తానన్నాడు. ఆమె ఒప్పుకుంది. గుర్రంపై నగ్నంగా వెళుతున్నప్పుడు ప్రజలు ఇంట్లోంచి బయటకు రావద్దన్న షరతుతో నగ్నంగా నగర వీధుల్లో దౌడులు తీసింది. బడ్జెట్.. ‘బొగెట్టీ’ ►బడ్జెట్ అనే మాట ‘బొగెట్టీ’ అనే ఫ్రెంచి పదం నుంచి ఆవిర్భవించింది. బొగెట్టీ అంటే తోలుసంచి అని అర్థం. పూర్వం ఆదాయ వ్యయాలకు సంబంధించిన లెక్కల పత్రాల్ని సభకు తోలుసంచిలో తీసుకొచ్చేవారు. అందువల్లే ఈ మాట వాడుకలోకి వచ్చింది. -
15 శాతం పెరిగిన సబ్సిడీలు
న్యూఢిల్లీ: ఆహారం, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులపై సబ్సిడీలు ఈసారి 15 శాతం పెరిగాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీల కోసం కేంద్రం రూ.2.64 లక్షల కోట్లు కేటాయించింది. బడ్జెట్ సవరణల తర్వాత 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఈ సబ్సిడీల కోసం రూ.2,29,715.65 కోట్లు కేటాయించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆహార సబ్సిడీ కోసం రూ.1,69,323 కోట్లు కేటాయించగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,40,281 కోట్లు కేటాయించారు. ఎరువుల కోసం సబ్సిడీ వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను రూ.70,079.85 కోట్లు కేటాయించగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.64,973.5 కోట్లు కేటాయించారు. యూరియా కోసమే వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.44,989.5 కోట్లు కేటాయించారు. ఫాస్ఫేట్, పొటాషియం ఎరువుల కోసం రూ.25,090.35 కోట్లు కేటాయించగా, 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.22,251.8 కోట్లు కేటాయించారు. కాగా, పెట్రోలియం సబ్సిడీ కోసం రూ.24,932.8 కోట్లు, ఎల్పీజీ సబ్సిడీ కోసం రూ.24,933 కోట్లు కేటాయించారు. -
సగానికిపైగా బడ్జెట్ గ్రామాలకే!
న్యూఢిల్లీ: తాజా బడ్జెట్లో గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. బడ్జెట్లో సగానికిపైగా గ్రామీణ ప్రాంతాలకే కేటాయించారు. వ్యవసాయంతో పాటు గ్రామీణాభివృద్ధి రంగాలకు పెద్దపీట వేశారు. 2018–19కిగాను మొత్తం బడ్జెట్లో సగానికిపైగా.. ఏకంగా 14.34 లక్షల కోట్లను గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ఇతర పథకాల కోసం ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 3.17 లక్షల కిలోమీటర్ల పొడవైన రోడ్లు నిర్మిస్తామని, 51 లక్షల కొత్త ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. కొత్తగా 1.75 కోట్ల గృహాలకు విద్యుత్ కనెక్షన్లు ఇస్తామని, 1.88 కోట్ల టాయిలెట్లు నిర్మిస్తామని ప్రకటించారు. 2018–19లో మొత్తంగా 321 కోట్ల పనిదినాలు కల్పిస్తామన్నారు. ‘‘దేశంలోని గ్రామీణ ప్రాంతా ల్లో గరిష్ట స్థాయిలో జీవనోపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి, వ్యవసాయం, దాని అను బంధ రంగాలు, మౌలిక సదుపాయాలకు భారీ గా నిధులు కేటాయించాం..’’ అని జైట్లీ ప్రకటిం చారు. గ్రామీణాభివృద్ధి శాఖకు గతేడాది కన్నా రూ.7 వేల కోట్లు అదనంగా.. మొత్తం రూ.1.12 లక్షల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. -
సైన్స్ అండ్ టెక్నాలజీకి అరకొర నిధులే..
ఆధునిక సాంకేతికతను వినియోగించే దేశంగానే భారత్ మిగిలిపోకూడదు.. సొంతంగా టెక్నాలజీని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేయాలి’’ అని ఆర్థిక సర్వేలో ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించింది. అయితే కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం అది అంతగా ప్రతిఫలించలేదు. కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ రంగాల్లో పరిశోధనల కోసం అత్యున్నత స్థాయి నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని బడ్జెట్లో ప్రకటించడం కొంత సానుకూల పరిణామం. అలాగే బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వినియోగంపైనా ఆర్థిక మంత్రి ఆసక్తి కనబరిచారు. బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీ నిర్వహణలో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఈ టెక్నాలజీతో లావాదేవీల నిర్వహణలో అవినీతి, అక్రమాల్ని పూర్తిస్థాయిలో అడ్డుకోగలమని కేంద్రం భావిస్తోంది. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ అంటే.. ‘అన్ని లావాదేవీలను నమోదు చేసేందుకు ఉపయోగపడే ఒక పద్దుల పుస్తకం. ఇది ఒకే చోట కాకుండా.. నెట్‌వర్క్‌లో ఎన్ని కంప్యూటర్లు ఉంటాయో అన్నింటిలోనూ రహస్య సంకేత భాషలో నిక్షిప్తమై ఉంటుంది. అందరూ అనుమతిస్తేగానీ ఈ పద్దుల పుస్తకంలో చిన్న మార్పైనా చేయడం సాధ్యం కాదు. ఎవరైనా చేయాలనుకుంటే వెంటనే అందరికీ తెలిసిపోతుంది’. ప్రభుత్వ పథకాల అమలులో ఈ టెక్నాలజీని వినియోగించాలన్నదే కేంద్రం భావన. 1.5 లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం ఇక దేశంలో జనాభా కంటే ఎక్కువ మొబైల్స్ అందుబాటులో ఉన్నా.. ఇంటర్నెట్ విషయంలో గ్రామీణ భారతం ఎంతో వెనుకంజలో ఉంది. ఈ లోటు భర్తీకి నేషనల్ నాలెడ్జ్ సెట్‌వర్క్ పేరుతో గ్రామ పంచాయతీల్ని అనుసంధానించే ప్రాజెక్టును గత ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే లక్ష గ్రామ పంచాయతీల్ని అనుసంధానించినట్లు ఎన్డీయే ప్రభుత్వం ప్రకటించింది. మిగిలిన 1.5 లక్షల గ్రామాల్ని శరవేగంగా భారత్ నెట్లోకి చేర్చే చర్యలు ముమ్మరం చేస్తామని ఈ బడ్జెట్లో ప్రకటించడం ఆహ్వానించదగ్గ విషయం. గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ కనెక్టివిటీ పెంచేందుకు ఐదు లక్షల వైఫై హాట్స్పాట్ల ఏర్పాటు ప్రకటన, డిజిటల్ ఇండియా పథకానికి కేటాయింపులు రెట్టింపు చేయడం, 5జీ మొబైల్ టెక్నాలజీ పరీక్షలకు చెన్నై ఐఐటీలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వంటివి శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించిన ఇతర ముఖ్యాంశాలు. మొదటి నుంచి భారతదేశంలో పరిశోధనలకు బడ్జెట్లో కేటాయింపులు నామమాత్రమే.. స్థూల జాతీయోత్పత్తిలో కనీసం ఒక్క శాతం నిధుల్ని పరిశోధనలకు కేటాయించాలని శాస్త్రవేత్తలు చాలాకాలంగా కోరుతున్నారు. అమెరికా, చైనా వంటి దేశాల్లో స్థూల జాతీయోత్పత్తిలో మూడు నుంచి నాలుగు శాతం నిధులు శాస్త్ర, సాంకేతిక రంగాలకు కేటాయిస్తుండగా.. మన వద్ద అవి అరశాతం దాటకపోవడం గమనార్హం. – సాక్షి, హైదరాబాద్ -
ఎన్నికలకు ‘గ్రామీణ’ అస్త్రం!
గోవర్ధనమంతటి పర్వతాన్ని చిటికెన వేలిపై ఎత్తిపట్టి గోకులవాసులందరికీ రక్షణ కల్పించాడు చిన్నికృష్ణుడు. అలాగే జైట్లీ కూడా అనేకానేక పరిమితుల మధ్యే, ప్రధాన పథకాలన్నింటికీ వీలైనంత భారీ కేటాయింపులు చేస్తూ కత్తిమీద సామును విజయవంతంగా పూర్తి చేశారు... రానున్న అసెంబ్లీ, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా గ్రామీణ ఓటర్లకు గాలం వేసేందుకు మోదీ సర్కారు గట్టిగానే కసరత్తు చేసింది. నోట్ల రద్దుతో పాటు కరువుతో తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్న గ్రామీణ భారతంపై నిధుల వర్షం కురిపించింది. పల్లెవాసులకు మౌలిక సదుపాయాలను భారీగా పెంచేందుకు వీలుగా పలు కీలక పథకాలకు జైట్లీ తన చిట్టచివరి పూర్తిస్థాయి బడ్జెట్(ఎన్డీఏ ప్రస్తుత టర్మ్)లో పెద్దపీట వేశారు. ఉపాధి హామీకి నిధుల పెంపుతో పాటు పల్లెల్లో డిజిటల్ విప్లవమే లక్ష్యమని జైట్లీ ప్రకటించారు. 5 లక్షల వైఫై హాట్స్పాట్ల ఏర్పాటు, గ్రామాల్లో పేదలకు మరిన్ని ఉచిత విద్యుత్ కనెక్షన్లు, వచ్చే ఏడాది మార్చికల్లా కోటి పక్కా ఇళ్ల నిర్మాణం వంటివన్నీ పూర్తి చేస్తామని వెల్లడించారు. మొత్తంమీద ఈ ఎన్నికల బడ్జెట్లో ‘గ్రామీణ’రాగాన్ని ఆలపించారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ‘ఉపాధి’కి దన్ను.. 2018–19 బడ్జెట్ కేటాయింపు రూ.55,000 కోట్లు(14.5% పెంపు) 2017–18 బడ్జెట్ కేటాయింపు: రూ.48,000 కోట్లు ►గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు కీలకంగా మారిన ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకానికి మోదీ ప్రభుత్వం ఈసారీ నిధులను భారీగా విదిల్చింది. ►2017–18లో బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే సవరించిన అంచనాలు రూ.55,000 కోట్లకు పెంచడం ఈ పథకం అమలు జోరుకు నిదర్శనం. ►వర్షాలపైనే ఆధారపడిన ప్రాంతాల్లో 5 లక్షల వ్యవసాయ చెరువులు, బావుల తవ్వకంతో పాటు సేంద్రియ ఎరువుల తయారీ కోసం 10 లక్షల కంపోస్టు గుంతల ఏర్పాటు వంటి లక్ష్యాలను మోదీ సర్కారు పూర్తిచేసింది. ఈ ఏడాది మార్చి చివరి నాటికి మరో 5 లక్షల వ్యవసాయ చెరువుల తవ్వకాన్ని పూర్తి చేయనున్నట్లు కేంద్రం చెబుతోంది.అదేవిధంగా ఈ పథకం కింద దాదాపు 22 లక్షల సహజ వనరుల నిర్వహణ(ఎన్ఆర్ఎం–చెక్ డ్యామ్‌లు, ఇతరత్రా నీటి పరిరక్షణ) పనులు జరుగుతు న్నాయి. దీనివల్ల 47.1 లక్షల హెక్టార్లకు లబ్ధి చేకూరడంతోపాటు వ్యవసాయ ఉత్పాదకత, ఆదాయాలు పెరిగేందుకు దోహదం చేయనుందని కేంద్రం పేర్కొంది. ఈ స్కీమ్‌లో పూర్తయిన దాదాపు 3.29 కోట్ల పనులకు జియో ట్యాగింగ్‌ను చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, 2018 జనవరి 15 నాటికి 3.15 కోట్ల ఆస్తులకు పూర్తి చేశారు.కొత్తగా 60 లక్షల పనులను మొదలు పెట్టనున్నారు. 10 లక్షల ఆస్తుల నిర్మాణం, 230 కోట్ల పనిదినాలను సృష్టించడం వంటివి వచ్చే ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘స్వచ్ఛ భారత్’ జోరు.. 2018–19 కేటాయింపులు రూ.15,343 కోట్లు (10% పెంపు) 2017–18 కేటాయింపులు: రూ.13,948 కోట్లు ►2019 అక్టోబర్ 2 నాటికి(గాంధీ జయంతి) దేశవ్యాప్తంగా అన్ని కుటుంబా లకు.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 100 శాతం పారిశుధ్యాన్ని(సెప్టిక్ మరుగుదొడ్ల నిర్మాణం) కల్పించడం లక్ష్యం. ∙ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకూ 6 కోట్ల వ్యక్తిగత టాయిలెట్ల నిర్మాణం పూర్తయిందని.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 1.88 కోట్లను నిర్మించే లక్ష్యంతో బడ్జెట్‌ను పెంచినట్లు జైట్లీ పేర్కొన్నారు. ►ఈ ఏడాది జనవరి 1 నాటికి 284 జిల్లాల్లో మొత్తం 1,32,038 గ్రామ పంచాయతీలు, 3,02,445 గ్రామాలను బహిరంగ మరుగుదొడ్ల రహితం(ఓడీఎఫ్)గా ప్రకటించారు. ఇక 9 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలను(సిక్కిం, హిమాచల్, అరుణాచల్, డామన్ అండ్ డయ్యూ, కేరళ, ఉత్తరాఖండ్, హరియాణా, గుజరాత్) ఓడీఎఫ్‌గా ప్రకటించారు. మొత్తం ఓడీఎఫ్ ప్రాంతాల సంఖ్య 8,02,054కు చేరింది. కాగా, పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ పథకం కోసం తాజా బడ్జెట్లో రూ.2,500 కోట్లు కేటాయించారు. ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ.. 2018–19 కేటాయింపులు రూ.7,000 కోట్లు (15% పెంపు) 2017–18 కేటాయింపులు రూ. 6,050 కోట్లు దేశంలో తాగునీటి సౌకర్యం లేని అన్ని గ్రామీణ ప్రాంతాలకూ తాగునీటిని అందించాలనేది ఈ పథకం లక్ష్యం. నాలుగేళ్లలో 28,000 ఆర్సినిక్, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని అందించాలనేది కూడా మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది అరకొర నీటి సదుపాయం ఉన్న 60,000 ప్రాంతాలను, తాగునీరు అందని 9,000 ప్రాంతాలను ఈ పథకం కిందికి తీసుకురావాలని నిర్ణయించారు. గ్రామీణ టెలిఫోనీ.. 2018–19 కేటాయింపులు రూ.10,000 కోట్లు(14% తగ్గింపు) 2017–18 కేటాయింపులు రూ.11,636 కోట్లు(322% పెంపు) ►దేశంలో టెలికం మౌలిక వసతులను పెంచడమే ఈ పథకం లక్ష్యం. ఇందులో ప్రధానంగా భారత్ నెట్ కార్యక్రమంలో భాగంగా 2019 మార్చి నాటికి దేశంలోని 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని లక్ష్యంగా పెట్టుకున్నారు. ∙భారత్ నెట్ ఫేజ్–1లో ఇప్పటివరకూ లక్ష గ్రామ పంచాయతీలకు ఆప్టిక్ ఫైబర్ నెట్‌వర్క్‌తో అనుసంధానించామని, తాజాగా గ్రామీణ భారత్‌లో 5 కోట్ల మందికి బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు 5 లక్షల వైఫై హాట్స్పాట్లను ఏర్పాటు చేయనున్నామని జైట్లీ ప్రకటించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై).. 2018–19 కేటాయింపులు: రూ.21,000 కోట్లు(8.7 శాతం తగ్గింపు) 2017–18 కేటాయింపులు: రూ. 23,000 కోట్లు ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై).. 2018–19 కేటాయింపులు రూ.19,000 కోట్లు(పెంపు లేదు) 2017–18 కేటాయింపులు రూ. 19,000 కోట్లు ►మారుమూల గ్రామీణ ప్రాంతాలన్నింటికీ రోడ్డు సదుపాయాన్ని కల్పించే ఉద్దేశంతో 2000లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పథకం ఇది. 2011–14 మధ్య రోజుకు సగటు రోడ్డు నిర్మాణం 73 కిలోమీటర్లు కాగా, 2016–17లో ఇది 133 కిలోమీటర్లకు పెరిగిందని జైట్లీ పేర్కొన్నారు. ►గ్రామీణ ప్రాంతాలను ప్రధాన రోడ్లతో అనుసంధానించడానికి మరో 57,000 కిలోమీటర్ల రోడ్లను నిర్మించాలని ప్రతిపాదించారు. తద్వారా అర్హతగల గ్రామీణ ప్రాంతాల్లో 100 శాతం అనుసంధానం లక్ష్యం. ప్రస్తుతం 82 శాతం అనుసంధానం పూర్తయింది. 2019 మార్చికల్లా 100 శాతం లక్ష్యాన్ని సాధించనున్నట్లు జైట్లీ చెప్పారు. ►2021 నాటికి మిగిలిన 65,000 అర్హత గల గ్రామీణ ప్రాంతాలను ప్రధాన రోడ్లతో అనుసంధానించేందుకు దాదాపు 2.3 లక్షల కిలోమీటర్ల రోడ్లను నిర్మించాలనేది లక్ష్యం కాగా, దీన్ని 2019 నాటికే పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2018 జనవరి 15 నాటికి) 25 వేల కిలోమీటర్ల రోడ్లను నిర్మించారు. 6,400 ప్రాంతాలను అనుసంధానించగలిగారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన.. 2018–19 కేటాయింపులు రూ.11,485 కోట్లు(8 శాతం పెంపు) 2017–18 కేటాయింపులు రూ.10,635 కోట్లు ►విద్యుత్ సౌకర్యం లేని లక్ష గ్రామాలకు కరెంటు.. దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న కుటుంబాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్ లక్ష్యం(సమగ్ర విద్యుదీకరణ స్కీమ్స్–ఐపీడీఎస్). 2018 మే 1 కల్లా దేశంలో అన్ని గ్రామాలకూ విద్యుత్ సౌకర్యం కల్పించనున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. ►ఐపీడీఎస్‌లో భాగంగా సౌభాగ్య ఘర్ యోజన(ఉచిత విద్యుత్ కనెక్షన్లు) కోసం రూ.3,700 కోట్లను, ఫీడర్లను వేరు చేసేందుకు గాను(33/11 కేవీ సబ్స్టేషన్ల ఏర్పాటు, హై–లో టెన్షన్ విద్యుల్ లైన్ల నిర్మాణం వంటివి) రూ.4,935 కోట్లను కేటాయించారు. గ్రామాల్లో కొత్తగా 175 లక్షల బీపీఎల్ కుటుంబాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలనేది లక్ష్యం. పర్యాటకంపై ప్రత్యేక దృష్టి న్యూఢిల్లీ: దేశంలోని 10 ప్రముఖమైన చరిత్రాత్మక, సాంప్రదాయిక పర్యాటక కేంద్రాలను ‘ఐకానిక్ టూరిజం డెస్టినేషన్స్’గా మార్చేందుకు చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నామని జైట్లీ పేర్కొన్నారు. దీంతోపాటుగా భారత పురావస్తు శాఖ ప్రతిపాదించిన 100 ఆదర్శ కట్టడాల వద్ద పర్యాటకానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. నేషనల్ హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ అగ్మెంటేషన్ యోజన (హృదయ్)లో భాగంగా ప్రాచీన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రోప్‌వేలు నిర్మించటం.. ఆయా ప్రాంతాలకు రైల్వే సదుపాయం కల్పించటం, సమీప రైల్వే స్టేషన్ల అభివృద్ధి వంటివి చేపట్టామన్నారు. పౌష్టికాహార మిషన్‌కు రూ.3 వేల కోట్లు న్యూఢిల్లీ: జాతీయ పౌష్టికాహార మిషన్(ఎన్ఎన్ఎం)కు ఈ బడ్జెట్లో కేటాయింపుల్ని మూడు రెట్లు పెంచారు. గతేడాది రూ.950 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.3,000 కోట్లకు పెంచారు. రాబోయే మూడేళ్లలో(2017–20) ఎన్ఎన్ఎంకు రూ.9,046 కేటాయించాలన్న కేంద్ర కేబినెట్ నిర్ణయం మేరకు బడ్జెట్లో తాజా కేటాయింపులు చేశారు. చిన్నారుల్లో పోషకాహారలోపం తదితర సమస్యల్ని నివారించడానికి ఎన్ఎన్ఎం కృషి చేస్తోంది. ఈ ఏడాది కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు బడ్జెట్లో రూ.24,700 కేటాయించగా.. దీంట్లో రూ.16,334 కోట్లను అంగన్వాడీ సేవలకు వినియోగిస్తారు. గర్భిణులు, పాలిచ్చే తల్లులకు రూ.6 వేలు అందించే ప్రధాన్‌మంత్రి మాతృ వందన యోజనకు గతేడాది రూ.2,594 కోట్లు కేటాయించగా, ఈసారి ఆ మొత్తం రూ.2,400 కోట్లకు పరిమితమైంది. ‘బేటీ బచావో–బేటీ పడా వో’ పథకానికి ఈసారి రూ.280 కోట్లు కేటాయించారు. గతేడాది ఈ మొత్తం రూ.200 కోట్లు. మహిళల రక్షణకు 2013లో రూ.3,500 కోట్లతో ఏర్పాటు చేసిన నిర్భయ ఫండ్‌ను ఈసారి రూ.500 కోట్లకు పెంచారు. చిన్నారుల్ని రక్షించే సేవలకు ఈసారి రూ.725 కోట్లు ఇవ్వనున్నారు. ఢిల్లీకి రూ.790 కోట్లు న్యూఢిల్లీ: 2018–19 వార్షిక బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీకి రూ.790 కోట్లు కేటాయించింది. కేంద్ర పన్నుల వాటా పెంచాలని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం డిమాండ్ చేసినప్పటికీ ఎలాంటి మార్పూలేదు. ఈ బడ్జెట్లో కేంద్ర సాయం రూ.449.99 కోట్లు. ఇది గత బడ్జెట్లో 412.98 కోట్లు. 1984 అల్లర్ల బాధిత కుటుంబాల కోసం గత బడ్జెట్లో రూ.15 కోట్లివ్వగా ఈసారి రూ.10 కోట్లే కేటాయించింది. కేంద్ర పన్నుల వాటా కింద ఢిల్లీకి రూ.325 కోట్లు కేటాయించింది. 2001–02 నుంచి కేంద్రంలో ప్రభుత్వాలు మారినా ఈ మొత్తం మాత్రం స్థిరంగా ఉంది. ప్రజల నుంచి సౌరవిద్యుత్ కొనుగోలు న్యూఢిల్లీ: ప్రజల నుంచి మిగులు సౌరవిద్యుత్‌ను డిస్కమ్‌లు కొనుగోలు చేసేందుకు విధివిధానాలు రూపొందిస్తామన్న ఆర్థిక మంత్రి జైట్లీ ప్రతిపా దనను పారిశ్రామిక వర్గాలు స్వాగతించాయి. అయితే సోలార్ ఉత్పత్తుల దిగుమతులపై 70 శాతం భద్రతా సుంకం విధిస్తామన్న కేంద్రం ప్రతిపా దనపై మాత్రం ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రజల నుంచి సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు వీలుగా అన్ని రాష్ట్రాలు విధివిధానాలు రూపొందిం చుకునేలా ప్రోత్సహిస్తామని జైట్లీ గురువారం బడ్జెట్ ప్రసంగంలో చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోలార్ ట్యాంపర్డ్ గ్లాస్ లేదా సోలార్ ప్యానెల్స్‌పై విధిస్తున్న 5 శాతం కస్టమ్స్ సుంకాన్ని రద్దుచేస్తామని ఆయన ప్రకటించారు. భారత పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థకు వచ్చే ఏడాదికిగానూ రూ.10,099.41 కోట్ల పెట్టుబడుల్ని ఈ బడ్జెట్లో కేటాయించారు. అలాగే భారత సౌర విద్యుత్ సంస్థ(ఎస్ఈసీఐ)కు వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేటాయింపులు తగ్గాయి. 2018–19 కాలానికి ఎస్ఈసీఐకి రూ.217.43 కోట్ల పెట్టుబడుల్ని కేటా యించగా.. ఈ మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.250.42 కోట్లుగా ఉంది. మరోవైపు సౌర విద్యుత్‌పై జైట్లీ చేసిన ప్రసంగాన్ని స్వాగ తిస్తున్నట్లు ఖైతాన్ సంస్థ భాగస్వామి దిబ్యాన్షు తెలిపారు. ఈ పథకాన్ని ప్రభుత్వం ఎలా అమలు చేస్తుందోనని ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు. -
వీవీఐపీల హవా!
న్యూఢిల్లీ : పౌర విమానయాన శాఖకు తాజా బడ్జెట్లో రూ.6,602.86 కోట్ల నిధులు దక్కా యి. గతేడాదితో పోలిస్తే కేటాయింపులు మూడు రెట్లు పెరిగాయి. అయితే ఇందులో రూ.4,469.5 కోట్లను కేవలం రెండు విమానాలు కొనడానికే ప్రత్యేకంగా కేటాయించారు. రెండు బోయింగ్ 777–300 ఈఆర్ విమానా లను కొనుగోలు చేసి కేవలం వీవీఐపీల పర్య టనల కోసం మాత్రమే వాడనురు. ఉడాన్ పథకం కోసం రూ.1,014.09 కోట్లను కేటాయిం చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉడాన్ కోసం కేటాయించిన నిధులు రూ.200 కోట్లు మాత్రమే. విమానాశ్రయాల సామర్థ్యం ఐదు రెట్లు.. ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిరిండియాకు నిధులు భారీగా తగ్గించి తాజా బడ్జెట్లో కేవలం రూ.650 కోట్లు కేటాయించారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి కూడా నిధులను దాదాపు సగానికి తగ్గించి రూ.73.3 కోట్లను మాత్రమే ఇచ్చారు. ఐఈబీఆర్ (ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ బడ్జెటరీ రిసోర్సెస్) మార్గంలో ఏఏఐ మరో రూ.4,086 కోట్లు సమీకరిస్తుందని బడ్జెట్లో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో పైలట్ శిక్షణా కేంద్రమైన ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీతో పాటు రాజీవ్ గాంధీ విమానయాన విశ్వవిద్యా లయాలకు కలిపి రూ.50 కోట్లు కేటాయించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు రూ.210 కోట్లు, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్)కి రూ.70 కోట్ల నిధులు దక్కాయి. ’ఎన్ఏబీహెచ్ (నెక్టŠస్‌జెన్ ఎయిర్‌పోర్ట్స్ ఫర్ భారత్) నిర్మాణ్’ ప్రాజెక్టులో భాగంగా దేశ విమానాశ్రయాల సామ ర్థ్యాన్ని ఐదు రెట్లు పెంచనున్నట్లు జైట్లీ చెప్పారు. 900 కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోలుకు ఆర్లర్లు దేశవ్యాప్తంగా వాడుకలో లేని 56 విమానాశ్రయాలు, 31 హెలిపాడ్లను ‘ఉడాన్’ పథకం కింద వినియో గంలోకి తీసుకురా నున్నట్లు జైట్లీ ప్రకటించారు. ఏటా వంద కోట్ల ప్రయాణాలకు అనువుగా వీలుగా విమానాశ్ర యాలు విస్తరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే 16 ఎయిర్‌పోర్టుల్లో సేవలు ప్రారంభమైనట్లు వివరించారు. ‘గత మూడేళ్లుగా దేశీయ ప్రయాణికుల సంఖ్య ఏటా 18 శాతం పెరిగింది. మన విమానయాన సంస్థలు 900 కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోలుకు ఆర్లర్లు ఇచ్చాయి’ అని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో హవాయి చెప్పులు ధరించే వారు సైతం విమానాల్లో ప్రయాణిస్తారని వ్యాఖ్యానించారు. సీ ప్లేన్ పరిశ్రమకు ప్రోత్సాహం న్యూఢిల్లీ: దేశంలో సీ ప్లేన్ (నీటి మీదనే ల్యాండ్, టేకాఫ్ అయ్యే చిన్న విమానాలు)ల కార్యకలాపాల్లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసం గంలో చెప్పారు. గతేడాది డిసెంబరులో విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ముంబై దగ్గర్లో వీటిని ప్రయోగా త్మకంగా నడిపింది. 400 మిలియన్ల అమెరికన్ డాలర్ల వ్యయంతో 100 సీ ప్లేన్లను కొనేందుకు కూడా ఈ సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. ఈ రంగానికి పెట్టుబడు లను ప్రోత్సహించే చర్యలు తీసుకుంటామని జైట్లీ చెప్ప డంపై స్పైస్‌జెట్ చైర్మన్, ఎండీ అజయ్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. సీ ప్లేన్ల ద్వారా ప్రతి నదిని ఒక రన్‌వేగా, ప్రతి చెరువును ఒక విమానాశ్రయంగా మార్చడం సాధ్యపడుతుందని ఆయన అన్నారు. -
మౌలికం.. కీలకం!
న్యూఢిల్లీ: ‘‘ఆర్థికాభివృద్ధికి మౌలిక రంగమే చోదకశక్తి. ఈ రంగంలో భారీగా పెట్టుబడులకు అవకాశం ఉంది. రూ. 50 లక్షల కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తే జీడీపీ వృద్ధిరేటు పెరుగుతుంది. తద్వారా రోడ్లు, ఎయిర్‌పోర్ట్‌లు, రైల్వేలు, భూగర్భ జలాలు మెరుగుపడి ప్రజ లకు నాణ్యమైన సేవలు అందించేందుకు అవకాశం లభిస్తుంది’’అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. ఈసారి సాధారణ బడ్జెట్లో మౌలిక వసతుల కల్పనకు జైట్లీ పెద్దపీట వేశారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికిగానూ మౌలిక వసతుల కల్పనకు రూ.5.97 లక్షల కోట్లను కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ కేటాయింపులు రూ. లక్ష కోట్ల మేరకు పెరిగాయి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగానికి కేటాయించింది రూ. 4.94 లక్షల కోట్లే. వృద్ధికి ఊతమివ్వడం, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ రంగానికి కేటాయింపులు పెంచారు. రోడ్డు రవాణా, హైవేలకు మొత్తం రూ.71 వేల కోట్లు కేటాయించారు. ప్రాజెక్టులపై నిరంతరం సమీక్ష మౌలిక ప్రాజెక్టుల లక్ష్యాలు, వాటిని పూర్తి చేసే అంశాలను ప్రధాని మోదీ నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ఇందుకోసం ఆన్లైన్ మానిటరింగ్ వ్యవస్థను వినియోగిస్తున్నారని జైట్లీ చెప్పారు. ప్రస్తుతం రూ.9.46 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని, వీటిని మరింత వేగవంతం చేస్తామన్నారు. రహదారులు, రైల్వేలకు గతంలో ఎన్నడూ లేనంతగా భారీ కేటాయింపులు చేశామని, అవసరమైతే మరిన్ని నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 2018–19లో 9,000 కిలోమీటర్ల జాతీయ రహదారు లను విస్తరించనున్నట్టు ప్రకటిం చారు. భారత్‌మాల ప్రాజెక్టులో భాగంగా దేశ సరిహద్దులు, వెనకబ డిన ప్రాంతాలకు రోడ్ కనెక్టివిటీని విస్తరిస్తామన్నారు. భారత్‌మాల ఫేజ్ 1లో 35,000 కిలోమీటర్ల జాతీయ రహదారులను, రూ.5.35 లక్షల కోట్లతో నిర్మిస్తామన్నారు. రైల్వే శాఖకు మూలధన వ్యయం కింద రూ.1,48,528 కోట్లు కేటాయించామని, దేశ భద్రత దృష్ట్యా సరిహద్దు ప్రాంతాల్లో కనెక్టివిటీకి సంబంధించి మౌలిక వసతులను అభివృద్ధి చేస్తామన్నారు. అత్యవసర వైద్య సేవల నిమిత్తం సీప్లేన్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. 16 కొత్త ఎయిర్‌పోర్ట్‌లు ఏర్పాటు చేస్తామని, వినియో గంలో లేని 56 ఎయిర్‌పోర్టులను, 31 హెలీప్యాడ్లను వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. పట్టణీకరణ ఓ అద్భుత అవకాశం.. పట్టణీకరణ ఒక అద్భుతమైన అవకాశమని, దీనికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రపంచస్థాయి మౌలిక వసతుల కల్పన నిమిత్తం స్మార్ట్ సిటీ మిషన్‌ను ప్రారంభించిందని జైట్లీ చెప్పారు. ఇప్పటికే 99 నగరాలను ఎంపిక చేశామని, రూ. 2.04 కోట్లతో వీటిని అభివృద్ధి చేస్తున్నామని, ఈ నగరాల్లో స్మార్ట్ రోడ్లు, సోలార్ రూఫ్, ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మొదలైన ప్రాజెక్టులను చేపట్టామని తెలిపారు. రూ. 2,350 కోట్ల ప్రాజెక్టులు పూర్తయ్యాయని, మరో రూ. 20,850 కోట్ల ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయన్నారు. మరింత మంది పర్యాటకులను ఆకర్షించేందుకు దేశంలో 10 పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని జైట్లీ ప్రకటించారు. పేదల, ప్రజల బడ్జెట్: గడ్కరీ ఇది పేదల, ప్రజల బడ్జెట్ అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అభివర్ణించారు. మౌలిక వసతుల రంగానికి ఎప్పటిలాగే బడ్జెట్లో ప్రాధాన్యత దక్కిందన్నారు. హైవేలకు నిధులు రూ.7 వేల కోట్లు పెరిగాయన్నారు. భారీ కేటాయింపులు జరపడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. -
వైఫై రైళ్లు!
సారథి అనగానే కృష్ణుడు, లేదంటే శల్యుడు గుర్తొస్తారు గానీ నిజానికి ఉత్తర గోగ్రహణ వేళ బృహన్నల రూపంలో అర్జునుడు ప్రదర్శించే రథచోదన ప్రావీణ్యం నభూతో! గాలితో పందెం వేస్తూ వాయువేగ మనోవేగాలతో రథాన్ని పార్థుడు పరుగులెత్తిస్తుంటే ఉత్తర కుమారుడికి పై ప్రాణాలు పైనే పోతాయి. దేశీయ విమానయానాన్ని కూడా అదే తరహాలో ఉరకలెత్తించనున్నట్టు ప్రకటించారు జైట్లీ. రైల్వేల ఆధునీకరణనూ వేగవంతం చేస్తామన్నారు.. న్యూఢిల్లీ: ఈసారి బడ్జెట్లో రైల్వేలు ‘వైఫై’ కూత పెట్టాయి. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లు, రైళ్లలో దశలవారీగా వైఫై సదుపాయం కల్పించనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018–19 బడ్జెట్లో ప్రకటించారు. రైల్వే స్టేషన్ల ఆధునీకరణతోపాటు ప్రయాణికుల భద్రత కోసం సీసీటీవీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయనున్నారు. ప్రధానమైన కొత్త రైళ్లు ఏవీ ప్రకటించకపోవటం ఈసారి బడ్జెట్లో నిరాశ కలిగించే అంశం. రైల్వే బడ్జెట్‌ను విడిగా ప్రవేశపెట్టే 92 ఏళ్ల సంప్రదాయానికి గత ఏడాది ముగింపు పలికి కేంద్ర బడ్జెట్లో కలపటం తెలిసిందే. 3,600 కి.మీ రైల్వే లైన్ల పునరుద్ధరణ రైల్వేలకు ఈసారి బడ్జెట్లో 1,48,528 లక్షల కోట్లను కేటాయించారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 13 శాతం అదనం. గత ఏడాది బడ్జెట్లో రైల్వేలకు రూ.1.31 లక్షల కోట్లు కేటాయించారు. రైల్వేలను పరిపుష్టం చేసి రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరచనున్నట్లు అరుణ్‌జైట్లీ చెప్పారు. ‘రాష్ట్రీయ రైల్ సంరక్ష కోష్’ కింద నిధులు కేటాయించి ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. దేశవ్యాప్తంగా 18 వేల కి.మీ. డబ్లింగ్, 5 వేల కి.మీ. మేర 3, 4 లైన్ల ట్రాక్‌లుగా మార్చటం వల్ల రైల్వే నెట్వర్క్ దాదాపుగా బ్రాడ్‌గేజ్‌లోకి మారుతుందని జైట్లీ చెప్పారు. రైల్వే ట్రాక్‌ల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని, 3,600 కి.మీ మేర రైల్వే లైన్లను పునరుద్ధరించాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. ‘ట్రైన్ 18’.. ‘ట్రైన్ 20’ ప్రయాణికులకు సౌకర్యవంతమైన అనుభూతి కోసం ప్రపంచశ్రేణి రైళ్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా చెన్నైలోని కోచ్‌ల తయారీ కేంద్రంలో ‘ట్రైన్ 18’, ‘ట్రైన్ 20’ తయారు కానున్నాయి. జర్మనీకి చెందిన లింక్ హాఫ్మాన్ బాష్ టెక్నాల జీతో తయ్యారయ్యే ఈ ప్రయాణికుల రైళ్లు 2018లో ఉత్పత్తి అవుతున్న నేపథ్యంలో ‘ట్రైన్ 18’ అని వ్యవహరిస్తున్నారు. గంటకు 160 కి.మీ వేగంతో దూసుకెళ్లటం వీటి ప్రత్యేకత. ఇక ‘ట్రైన్ 20’ మరింత ఆధుని కంగా స్లీపర్ కోచ్‌లతో ఉంటుంది. 2020లో ఇది అందుబాటులోకి రానుంది. వంద రైళ్లను ఉత్పత్తి చేసి శతాబ్ది, రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్థానంలో ప్రవేశపెట్టే యోచన ఉన్నట్లు రైల్వే మంత్రి గోయల్ తెలిపారు. రూ.3 వేల కోట్లతో సీసీటీవీలు దేశవ్యాప్తంగా 11 వేల రైళ్లలో 12 లక్షల సీసీటీవీ కెమెరాల కోసం రైల్వే శాఖ రూ. 3 వేల కోట్లను వ్యయం చేయనుంది. 8,500 స్టేషన్లు సీసీటీవీల నిఘాలో ఉంటాయి. ప్రతి బోగీకి 8 సీసీటీవీలను అమరుస్తారు. ప్రస్తుతం 395 స్టేషన్లు, 50 రైళ్లను సీసీటీవీలతో అనుసంధానించారు. వచ్చే రెండేళ్లలో ప్రతి రైలులో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తామని రైల్వే శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఇక ప్రయాణికుల సదుపాయాల కోసం ఈసారి రూ.1,657 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే ఇది దాదాపు 50 శాతం ఎక్కువ. రైల్వేలకు ఇచ్చినవి.. ►రైల్వేస్టేషన్ల పరిసరాలలో వాణిజ్య సముదాయాల అభివృద్ధి ►పెరంబూర్‌లోని రైల్వే కోచ్‌ల తయారీ పరిశ్రమలో అధునాతన కోచ్‌ల నిర్మాణం. 2018–19లో తొలి రైలు పట్టాలపై పరుగులు తీయనుంది. ►రైల్వే సిబ్బందికి శిక్షణ కోసం వడోదరలో ఇన్స్టిట్యూట్. ►భారత రైల్వే స్టేషన్ల అభివృద్ధి కంపెనీ లిమిటెడ్ ద్వారా 600 ప్రధాన రైల్వే స్టేషన్ల అభివృద్ధి ►25,000 మించి ప్రయాణికులు రాకపోకలు సాగించే అన్ని రైల్వే స్టేషన్లలో ఎస్కలేటర్ల ఏర్పాటు. ►వచ్చే రెండేళ్లలోగా బ్రాడ్ గేజ్ పరిధిలో కాపలా లేని 4,267 రైల్వే గేట్ల తొలగింపు. ►ముంబై రైళ్లలో రద్దీ నివారణకు 90 కి.మీ. మేర రూ.11 వేల కోట్లతో డబుల్ లైన్ల పనులకు నిర్ణయం. ►సిగ్నలింగ్, టెలి కమ్యూనికేషన్ వ్యవస్థ ఆధునీకరణ కోసం రూ. 2,025 కోట్లు ►రైల్వే ట్రాక్‌ల నవీకరణ కోసం రూ.11,450 కోట్లు ►రాష్ట్రీయ రైల్ సంరక్షణ కోష్ తదితరాల కింద ప్రయాణికుల భద్రత కోసం రూ.73,065 కోట్లు బడ్జెట్ హైలైట్స్ ►వయోధిక పౌరుల బ్యాంకు, పోస్టాఫీస్ డిపాజిట్ల వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు పరిమితి రూ.10 వేల నుంచి రూ.50 వేలకు పెంపు. ►సీనియర్ సిటిజన్ల వైద్య ఖర్చులు, వైద్య బీమా ప్రీమియంపై రూ.50 వేల వరకూ అదనపు రాయితీ. ►ఈక్విటీ మార్కెట్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రూ.లక్ష దాటిన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై 10 శాతం పన్ను ►విద్యా, వైద్య సెస్సు 3 నుంచి 4 శాతానికి పెంపు. ►ప్రతి మూడు లోక్‌సభ నియోజకవర్గాలకు ఒక వైద్య కళాశాల ఏర్పాటు. ►ప్రభుత్వ బీమా కంపెనీల విలీనం. ►టామాటో, ఉల్లి, ఆలు ఉత్పత్తికి రూ. 500 కోట్లతో గ్రీన్ ఆపరేషన్ పథకం. ►విదేశీయులను ఆకర్షించేం దుకు 10 ప్రధాన పర్యాటక ప్రాంతాల అభివృద్ధి. 1851 డిసెంబర్ 22 భారత్‌లో తొలి రైలు 1851 డిసెంబర్ 22న పట్టాలెక్కింది. రూర్కీలో నిర్మాణ సామగ్రితో అది ప్రయాణించింది. ప్రయాణికుల రైలు మాత్రం 1853 ఏప్రిల్ 16న బాంబే నుంచి థానే మధ్య (34 కిలోమీటర్లు) నడిచింది. దీన్నే భారత్‌లో తొలి రైలుగా పేర్కొంటారు. 1925 ఫిబ్రవరి 3 తొలి ఎలక్ట్రిక్ రైలు 1925 ఫిబ్రవరి 3న బాంబే వీటీ, కుర్లా మధ్య నడిచింది. రైళ్లలో తొలిసారిగా 1891లో టాయిలెట్లు(ఒకటో తరగతిలో) ప్రవేశపెట్టారు. దిగువ తరగతుల్లో 1907లో వాటిని ఏర్పాటుచేశారు. తొలి రైల్వే వంతెన.. ముంబై–థానే మార్గంలోని దపూరీ వయాడక్ట్ ఇప్పుడంటే సెకండ్ క్లాస్ స్లీపర్. అప్పట్లో థర్డ్ క్లాస్ స్లీపర్ కూడా ఉండేది. అదే ఇది. మూడు వరుసలలో స్లీపర్ బెర్తులుండేవి. రాజావారి రైలు ఇది రాజావారి రైలు. రాచరిక వ్యవస్థ ఉన్న రోజుల్లో శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడి మహారాజా కృష్ణచంద్ర గజపతి తన కుటుంబంతో కలిసి గుణుపూర్ నుంచి నౌపడ ఉప్పు గల్లీల వరకు, అటు నుంచి తీర ప్రాంత సందర్శనకు వీలుగా ప్రత్యేక రైల్వే లైనునే నిర్మించుకున్నారు. నౌపడ–గుణుపూర్ల మధ్య నిర్మించిన నేరో గేజ్ రైల్వే లైన్‌ను 1912లో ఆయన జాతికి అంకితమిచ్చారు. ఆ తర్వాత 1953లో భార త ప్రభుత్వం ఈ రైల్వే లైన్‌ను స్వాధీనం చేసుకున్నా.. దశాబ్దం క్రితం వరకు ఈ లైను దశ మారలేదు. అదే నేరో గేజ్.. అదే రాజావారి బండి కొనసాగాయి. 2002లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని బ్రాడ్‌గేజ్‌గా మార్చాలని ప్రతిపాదించింది. ఎట్టకేలకు 2010లో బ్రాడ్‌గేజ్ నిర్మాణం పూర్తయ్యింది. 2011 డిసెంబర్లో పూరి–పర్లాకిమిడి మధ్య బ్రాడ్‌గేజ్ రైలు ప్రయాణం ప్రారంభమైంది. ఐసే ఏసీ ఇది భారత్‌లో తొలి ఏసీ రైలు ఫ్రాంటియర్ మెయిల్. దీన్ని 1934లో ప్రారంభించారు. అప్పట్లో ఏసీ అంటే.. ఇలా పెద్ద పెద్ద ఐస్ గడ్డల్ని బోగీకి రెండు చివర్లా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాక్సుల్లో వేసేవారు. బ్యాటరీ ద్వారా పనిచేసే బ్లోయర్ ద్వారా ఈ బాక్సుల్లోకి గాలిని పంపిస్తే.. అది ప్రత్యేకంగా ఉన్న చిల్లుల ద్వారా ఇన్సులేటెడ్ బోగీల్లోకి వెళ్లేది. అలా బోగీల్లోపల చల్లదనం ఉండేలా చేసేవారు. ఒక ఐస్ గడ్డ కరిగిపోయాక మరొకటి వేసేందుకు వీలుగా.. రైలు వెళ్లే మార్గంలో కొన్ని చోట్ల ఇలా ఐస్ గడ్డలను సిద్ధంగా ఉంచేవారు. ఈ రైలును ఎక్కువగా బ్రిటిష్ వాళ్లు ప్రయాణించడానికి వాడేవారు. ప్రత్యేక బడ్జెట్ సమస్యలనే మిగిల్చింది: పీయూష్ గోయల్ రైల్వే బడ్జెట్‌ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టే అవకాశాన్ని కోల్పోయినట్లుగా తానేమీ భావించటం లేదని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పా రు. నిజానికి రైల్వే బడ్జెట్‌ను విడిగా ప్రవేశపెట్టటం రైల్వేలకు సమస్యలనే మిగిల్చిందన్నారు. రైల్వే మంత్రి చేతుల మీదుగా ఏదైనా కొత్త రైలు పేరును ప్రకటించాలని కోరుకుంటున్నారా? అన్న ప్రశ్నకు తనకు ప్రయాణికుల భద్రతే, సౌకర్యమే ముఖ్యమన్నారు. ‘ప్రతి రైలుకు, ప్రతి బోగీకి సిబ్బంది ద్వారా భద్రత కల్పించటం ఖరీదైన ప్రక్రియ. ఈ నేపథ్యంలో అన్ని రైళ్లు, బోగీల్లో సీసీ కెమెరాలు, వైఫై వైపు దృష్టి పెట్టాం’ అని చెప్పారు. -
‘ఆయుష్’కు రూ. 1,626 కోట్లు
న్యూఢిల్లీ: ఆయుష్ మంత్రిత్వ శాఖకు ఈ ఏడాది బడ్జెట్లో రూ.1626.37 కోట్లు కేటాయించారు. ఇది గతేడాది కన్నా 13 శాతం ఎక్కువ. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలుచేస్తున్న వివిధ ప్రాజెక్టులు, పథకాలకయ్యే మొత్తం వ్యయాన్ని రూ.71.36 కోట్లుగా అంచనా వేశారు. గతేడాది బడ్జెట్లో ఇందుకోసం తొలుత రూ.68.86 కోట్లు కేటాయించి తరువాత రూ.87.64 కోట్లకు పెంచారు. నియంత్రణ సంస్థలు, స్వయంప్రతిపత్తి సంస్థలకు ఈసారి కేటాయింపులు పెరిగాయి. చట్టబద్ధ, నియంత్రణ సంస్థలకు రూ.9.60 కోట్లు, స్వయంప్రతిపత్తి సంస్థలకు రూ.906.70 కోట్లు కేటాయించారు. చట్టబద్ధ, నియంత్రణ సంస్థల కింద న్యూఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి, సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్, స్వయంప్రతిపత్తి సంస్థల్లో ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఉన్నాయి. -
చురుక్కుల్లేవ్.. చమక్కుల్లేవ్!
న్యూఢిల్లీ: చురుక్కుల్లేవ్.. చమక్కుల్లేవ్.. కవితలు లేవు.. పంక్తులు లేవు.. జైట్లీ బడ్జెట్ ప్రసంగం ఎలాంటి ఛలోక్తులు లేకుండా అత్యంత సాదాసీదాగా సాగింది! బడ్జెట్లో చివర్లో వివేకానందుడి మాటలు తప్ప ఎక్కడా కవులు, ప్రముఖుల సూక్తులను ఉటంకించలేదు. గురువారం ఆయన పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆసాంతం.. రైతులు, పేదలు, గ్రామీణం, మహిళలు.. ఈ నాలుగు అంశాల చుట్టే తిరిగింది. తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలను ప్రస్తావించే సమయంలో హిందీలో ప్రసంగించారు. మిగతా వివరాలన్నీ ఇంగ్లిష్‌లోనే చెప్పారు. తమది ‘భారత్ కోణం’లో ఉన్న బడ్జెట్ అని చెబుతూ.. వీలైనచోటల్లా మోదీ లక్ష్యాలు, ఆశయాలను ప్రస్తావించారు. ‘‘ఈ దేశ అత్యున్నత స్థానంలో ఉన్న నాయకత్వం పేదల కష్టాలు, కన్నీళ్లను అతి దగ్గరి నుంచి చూసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు మా నాయకత్వానికి తెలుసు. పేదలు, మధ్యతరగతి వర్గాలు మాకు కేస్‌స్టడీ మాదిరి కాదు.. ఎందుకంటే స్వయంగా మా నాయకత్వమే ఆయా వర్గాలకు చెందినది. సుమారు 1.50 గంటలపాటు సాగిన జైట్లీ ప్రసంగంలో.. ‘రైతులు’ అన్న పదం 27 సార్లు, ‘పేదలు’ 21 సార్లు, ‘గ్రామీణం’ 20 సార్లు, ‘వ్యవసాయం’ 16 సార్లు, ‘మహిళలు’ 10 సార్లు ఉచ్చరించారు. వ్యవసాయ రంగం బలోపేతంతోపాటు గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, విద్య, ఉపాధి, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు, మౌలిక వసతుల రంగాలపై దృష్టి సారించినట్లు వివరించారు. ప్రసంగం చివరల్లో ‘మనం ఆశిస్తున్న ఉజ్వల భారతం తప్పకుండా ఆవిర్భవించి తీరుతుంది’ అంటూ వివేకానందుడు ఐరోపా యాత్రలో చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు. ‘‘రైతుల ఇళ్లల్లోంచి, వారి చేతుల్లోని నాగళ్లలోంచి, జాలర్ల పూరి గుడిసెల్లోంచి, అపార ప్రకృతి సంపదలోంచి భరతమాత ఉద్భవిస్తుంది..’’ అన్న వివేకానందుడి మాటలతో ప్రసంగాన్ని ముగించారు. ఆర్థిక అవసరాలు తీరుస్తుంది తమ బడ్జెట్ గ్రామీణం, వ్యవసాయ రంగాలకు ఊతమిచ్చేందుకు ఎంతగానో దోహదపడుతుందని అరుణ్‌జైట్లీ అన్నారు. ఆర్థికరంగ అవసరాలను తీరుస్తుందని పేర్కొన్నారు. ‘‘ఈ ఏడాది ద్రవ్యలోటును 3.2 శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా జీఎస్టీ అమలు, ఇతరత్రా కారణాల వల్ల 3.5 శాతానికి సవరించాల్సి వచ్చింది..’’ అని వివరించారు. బడ్జెట్ హైలైట్స్ ♦ 2018–19 ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో ద్రవ్యలోటు అంచనా 3.3 శాతం. ♦ 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీల సంక్షేమానికి రూ.56,619 కోట్లు.. ఎస్టీల సంక్షేమానికి రూ.39,135 కోట్లు కేటాయింపు. ♦ ప్రస్తుతం ప్రపంచంలోనే ఏడో అతిపెద్ద ఆర్థికశక్తిగా భారత్. భారత ఆర్థిక వ్యవస్థ విలువ రూ.160 లక్షల కోట్లు. త్వరలోనే ఐదో అతిపెద్ద ఆర్థికశక్తిగా అవతరించనుంది. ♦ ఖరీఫ్‌లో అన్ని పంటలకు ఉత్పత్తి వ్యయం కన్నా 1.5 రెట్లు అధికంగా మద్దతు ధర కల్పించేందుకు చర్యలు. ♦ 2018–19 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ నుంచి ప్రభుత్వ రుణాల సేకరణ అంచనా రూ.4.07 లక్షల కోట్లు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.4.79 లక్షల కోట్లుగా ఉంది. -
జైట్లీ పల్లెబాట
చాన్నాళ్లకు కేంద్ర బడ్జెట్ పల్లెబాట పట్టింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంత ఓటర్ల ఆగ్రహాన్ని పసిగట్టడం వల్లకావొచ్చు... మరి కొన్ని నెలల్లో ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ ఎన్నికల పరంపరను దృష్టిలో పెట్టుకుని కావొచ్చు... లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరిపే ఉద్దేశంతో కావొచ్చు–ఈ బడ్జెట్ పల్లెసీమలపైనా, వ్యవసాయంపైనా ప్రధానంగా దృష్టి పెట్టింది. అలాగే కీలకమైన ఆరోగ్య బీమా ప్రతిపాదన చేసింది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడుతూ వ్యవసాయ దిగుబడులకైన వ్యయంపై 50 శాతం అదనంగా లెక్కేసి ఇకపై కనీస మద్దతు ధరను నిర్ణయిస్తామని ప్రకటిం చారు. ఇప్పటికే రబీ దిగుబడులకు అమల్లో ఉన్న ఈ విధానం ఇకపై ఖరీఫ్‌కు కూడా వర్తింపజేస్తామన్నారు. అలాగే రూ. 2,000 కోట్లతో అగ్రి మార్కెట్ మౌలిక సదుపాయాల నిధి ఏర్పాటు, పంట రుణాలను రూ. 10 లక్షల కోట్ల నుంచి రూ. 11 లక్షల కోట్లకు పెంచడం, కౌలు రైతులకు రుణ సదుపాయం వంటివి కూడా ఇందులో ఉన్నాయి. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో వ్యవసాయం వాటా 14 శాతం. ఇప్పటికీ గ్రామసీమల్లో అత్యధికులకు ఉపాధి కల్పిస్తున్నది సాగురంగమే. ఆ రంగంపై దృష్టి సారించడం హర్షించదగిందే. అయితే పంటకయ్యే వ్యయాన్ని ఏ ప్రాతిపదికన లెక్కేస్తారన్నది కీలకం. అందులో ఎరువులకయ్యేదే చాలా ఎక్కువ. విత్తనాలు, పురుగుమందులు, నీటిపారుదల వ్యయం, కూలీల వేతనాలు, కౌలు వంటి ఇతర ఖర్చులుంటాయి. చాలా ప్రాంతాల్లో రైతులు భూగర్భ జలాలపై ఆధారపడాల్సి వస్తుంది. సరైన విద్యుత్ సదుపాయం లేనిచోట మోటార్లకు డీజిల్ వినియోగం తప్పనిసరి. ఈ వ్యయాన్నంతటినీ పరిగణించి దిగుబడి ఖర్చును లెక్కేసినప్పుడే రైతుకు ప్రయోజనం ఉంటుంది. కనీస మద్దతు ధరకు ప్రభుత్వానికి పంటను అమ్మే రైతులు కేవలం 6 శాతం మాత్రమే. మిగిలినవారంతా దళారులకు తెగనమ్ముకోవాల్సి వస్తోంది. ఈ దళారీ వ్యవస్థను సమర్థవంతంగా అరికట్టినప్పుడే రైతులకు మేలు జరుగుతుంది. సాగు రంగ సంక్షోభంవల్ల ఏటా వేలాదిమంది రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారు. పది కోట్ల పేద కుటుంబాల ఆరోగ్యావసరాలను తీర్చగలదంటున్న జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకాన్ని (ఎన్‌హెచ్‌పీఎస్) కూడా ఈ బడ్జెట్లో ప్రకటించారు. వాస్తవానికి ఇది పాత పథకమే. పాత పథకం కింద కుటుంబానికి లక్ష రూపాయల వరకూ ఆరోగ్య బీమా కల్పిస్తే, ఆ పరిమితిని ఇప్పుడు రూ. 5 లక్షలకు పెంచారు. అయితే ఈ పథకం విధివిధానాలెలా ఉంటాయో చూడాల్సి ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూపకల్పన చేసి సమర్థవంతంగా అమలు చేసిన ఆరోగ్యశ్రీ పథకం నిరుపేద వర్గాలకు అత్యున్నత వైద్య సేవలను చేరువ చేసింది. తర్వాత కాలంలో ఆ పథకాన్ని వేరే రాష్ట్రాలు కూడా అనుసరించాయి. కేంద్ర పథకం ఆ స్థాయిలో ఉంటేనే పేద కుటుంబాలకు మేలు కలుగుతుంది. ఈసారి బడ్జెట్లో ఆరోగ్యరంగానికి కేటాయించింది రూ. 52,800 కోట్లు. ఇది గత బడ్జెట్‌కన్నా రూ. 5,448 కోట్లు... అంటే 11.5 శాతం మాత్రమే ఎక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య ఉపకేంద్రాలను పటిష్టం చేసి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చిన్న చిన్న వ్యాధులకిచ్చే ఔషధాలు అక్కడ లభ్యమయ్యేలా చూడాలన్న ఆలోచన మెచ్చదగ్గదే అయినా దీనికి కేటాయించిన మొత్తం రూ. 1,200 కోట్లు చాలా స్వల్పం. క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహారం నిమిత్తం రూ. 600 కోట్లు కేటా యింపు మంచి నిర్ణయం. ఈ పథకంకింద చికిత్స చేయించుకుంటున్న సమ యంలో రోగికి నెలకు రూ. 500 ఇస్తారు. ఇది సక్రమంగా అమలయ్యేలా చూస్తే ఆ రోగులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నిరుడు ప్రకటించిన జాతీయ ఆరోగ్య విధానం 2025నాటికి జీడీపీలో 2.5 శాతం వ్యయం చేయడం గురించి మాట్లా డింది. అంతేకాదు... పేదరికం విస్తరించడానికి గల ప్రధాన కారణాల్లో ఆరోగ్యానికి పెట్టే అపరిమిత ఖర్చు కూడా ఒకటని గుర్తించింది. మన దేశంలో 61 శాతం మరణాలకు కేన్సర్, మధుమేహం, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులే కారణం. ఇవి వ్యక్తులు, కుటుంబాలను మాత్రమే కాదు.. ఉత్పాదకతను కూడా దెబ్బతీస్తు న్నాయి. తాజా బడ్జెట్లో ప్రకటించిన ఎన్హెచ్పీఎస్కూ, ఇప్పటికే అమలవుతున్న కుటుంబసంక్షేమ పథకాల అమలుకూ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్డీజీ)ను సాధించడానికీ ప్రస్తుత కేటాయింపులు ఏమాత్రం సరిపోవు. బడ్జెట్ రాబోతుందనగానే కోట్లాదిమంది వేతన జీవులందరూ ఎదురుచూసేది ఆదాయం పన్ను మినహాయింపుల గురించే. కానీ అరుణ్ జైట్లీ వారి విషయంలో చాలా నిర్దయగా వ్యవహరించారని చెప్పాలి. చాన్నాళ్ల తర్వాత స్టాండర్డ్ డిడక్షన్ విధానం ప్రవేశపెట్టి దాన్ని రూ. 40,000గా నిర్ణయించినా ఇప్పుడున్న రవాణా, వైద్య చికిత్స వ్యయాలకిచ్చే రూ. 34,200 మినహాయింపును రద్దు చేశారు. పైగా ఆదాయంపన్నుపై చెల్లించే సెస్సు 3 శాతాన్ని 4 శాతానికి పెంచారు. ఏతావాతా ఉద్యోగులకు లభించేది అతి స్వల్పం. రూ. 250 కోట్ల టర్నోవర్ కంటే తక్కువ ఉన్న పరిశ్రమలకు 25 శాతం ఆదాయంపన్ను రాయితీ ఇవ్వడం హర్షదాయకం. అయితే షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ అమ్మితే వచ్చే లాభాలపై 10 శాతం పన్ను విధింపు ప్రతిపాదన మదుపుదార్లను నిరుత్సాహపరుస్తుంది. అంతి మంగా అది కార్పొరేట్లపై ప్రభావాన్ని చూపుతుంది. ఉత్పాదకత పెంపుపై దృష్టి సారించి ద్రవ్యలోటు తగ్గించడానికి బదులు మన ప్రభుత్వాలు పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా దాన్ని సాధించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ బడ్జెట్లోనూ అది కనబడు తుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలకూ ఈ బడ్జెట్లో దక్కింది శూన్యం. ఆంధ్ర ప్రదేశ్‌కు వరసగా నాలుగోసారి విశాఖ రైల్వే జోన్ విషయంలో వాగ్దానభంగం జరిగింది. పోలవరం, కడప స్టీల్‌ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు వగైరాల ప్రస్తావనే లేదు. అమరావతి ఊసే లేదు. ఇటు తెలంగాణ పరిస్థితి కూడా అందుకు భిన్నంగా లేదు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, ఎయిమ్స్‌లకు చోటు దక్కలేదు. సారాంశంలో ఇది ఎవరినీ పూర్తిగా సంతృప్తిపరచలేని బడ్జెట్‌గా మిగిలిపోయింది. -
సులభతర వ్యాపారాలకు 372 సంస్కరణలు
న్యూఢిల్లీ: వ్యాపారాల నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు 372 సంస్కరణలను గుర్తించినట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. రాష్ట్రాలు వీటిని యుద్ధప్రాతిపదికన అమలు చేయాల్సి ఉంటుందని, నిర్మాణాత్మకంగా ఒకదానితో మరొకటి పోటీపడాలని సూచించారు. ఈ విషయంలో ఆయా రాష్ట్రాల పనితీరుపై కేంద్రం ఎప్పటికప్పుడు పారిశ్రామిక వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తుందని తెలిపారు. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడం ద్వారా మరిన్ని పెట్టుబడులు ఆకర్షించవచ్చని, ఇన్వెస్టర్లకు అనుకూల పరిస్థితులు కల్పించ వచ్చని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. 2016 ‘ఆలిండియా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాయి. ప్రపంచ బ్యాంకు ఇటీవలే విడుదల చేసిన వ్యాపారాలకు అనువైన 190 దేశాల జాబితాలో భారత్ 30 స్థానాలు ఎగబాకి 100వ ర్యాంకుకు చేరుకున్న తెలిసిందే. భవిష్యత్తులో టాప్ 50లోకి చేరాలని లక్ష్యంగా నిర్దేసించుకున్నట్లు జైట్లీ వెల్లడించారు. -
నవభారత లక్ష్య సాధన దిశగా..!
న్యూఢిల్లీ: 2018–19 సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ప్రధాని మోదీ ప్రశంసించారు. ‘ఈ బడ్జెట్ అభివృద్ధి అనుకూల, నవభారత నిర్మాణ లక్ష్యాలను బలపరిచేలా ఉంది. జైట్లీ, బడ్జెట్ బృందానికి అభినందనలు. రైతులు, దళితులు, గిరిజనులు దీని ద్వారా లబ్ధి పొందుతారు. గ్రామీణ భారతంలో కొత్త అవకాశాలు పెరిగేందుకు ఇది దోహదపడనుంది. రైతు, సామాన్యుడు, వ్యాపారస్తుల అనుకూల బడ్జెట్ ఇది. నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ), ఎమ్ఎస్ఎమ్ఈల మొండి బకాయీలను పరిష్కరించేందుకు ప్రభుత్వం త్వరలోనే చర్యలు చేపట్టనుంది’ అని మోదీ పేర్కొన్నారు. వ్యవసాయం నుంచి మౌలిక వసతుల వరకు అన్ని రంగాల దృష్టిని ఆకర్షిం చేలా బడ్జెట్ ఉందన్నారు. ‘దేశాభివృద్ధిని పరుగులు పెట్టించేలా పద్దును రూపొందిం చారు. జీవించేందుకు అనుకూల, వ్యాపారాను కూల వాతావరణాన్ని ఈ బడ్జెట్ సృష్టించింది. చాలాకాలంగా, ఎమ్ఎస్ఎమ్ఈ రంగం పన్నుల భారాన్ని మోస్తోంది. బడ్జెట్లో ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కార్పొరేట్ పన్నులను తగ్గించాం. గతంలో ఉన్న 30 శాతానికి బదులుగా ఇకపై 25 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది’ అని ప్రధాని తెలిపారు. పేదల బతుకుల్లో ‘ఆయుష్మాన్’ ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా పేదలు ఏడాదికి రూ.5లక్షల వరకు ఆసుపత్రి చికిత్స ఖర్చులను పొందవచ్చన్నారు. ‘నాణ్యమైన వైద్యం అందుకోలేక ఇబ్బందిపడుతున్న పేదలకు ఇదో గొప్ప అవకాశం. పదికోట్ల కుటుంబాలు (40–50 కోట్ల మంది) ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతాయి. ప్రపంచంలో ప్రభుత్వ నిధులతో జరిగే అతిపెద్ద వైద్య సహాయం ఇదే’ అని ప్రధాని పేర్కొన్నారు. కొత్త విమానాశ్రయాలు, పోర్టులు, రైల్వే ట్రాక్‌లు, మెట్రో ప్రాజెక్టుల ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ‘125కోట్ల మంది భారతీయుల కలల బడ్జెట్ ఇది. మన రైతులు రికార్డు స్థాయిలో ధాన్యాలు, కూరగాయలు ఉత్పత్తి చేస్తున్నారు. వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేసేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాం’ అని మోదీ తెలిపారు. అనంతరం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని అమలుచేస్తోందన్నారు. పరిశీలనలో రైల్వేల ప్రైవేటీకరణ న్యూఢిల్లీ: ప్రైవేటు సంస్థలు రైల్వే లైన్లను సొంతంగా నిర్మించి, నిర్వహించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని రైల్వే బోర్డు సీనియర్ అధికా రులు గురువారం చెప్పారు. ప్రాజెక్టులకు మొత్తం వ్యయాన్ని ప్రైవేటు సంస్థలే భరించి, రైల్వేకు లైసెన్సు ఫీజు మాత్రం చెల్లించేలా ఈ ప్రతిపాదన ఉందని వారు వెల్లడించారు. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ ‘రైల్వే రంగంలోనూ ప్రైవేటు కంపెనీలు రావాలి. ప్రై వేటును అనుమతిస్తేనే రైల్వేల సామర్థ్యం పెరుగుతుంది. ఎక్కువ పెట్టుబడులు వస్తాయి’ అని అన్నారు. 150 ఏళ్ల నాటి సిగ్నలింగ్ వ్యవస్థ కారణంగానే రైళ్ల రాకపోకల్లో ఆలస్యం చోటు చేసుకుంటోందని, వచ్చే ఆరేళ్లలో మొత్తం సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునీకరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
నల్లధనం కట్టడికి మరిన్ని చర్యలు: జైట్లీ
న్యూఢిల్లీ: నల్లధనానికి చెక్ చెప్పేందుకు చేపట్టిన పలు పథకాలు సత్ఫలితాలివ్వడంతో మున్ముందు మరిన్ని చర్యలు చేపడతామని అరుణ్ జైట్లీ తెలిపారు. పన్ను ఎగవేత కట్టడి చర్యల్లో భాగంగా గత రెండేళ్లలో రూ.90 వేల కోట్ల అదనపు మొత్తాన్ని వసూలు చేసినట్లు కేంద్ర బడ్జెట్లో వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థలో నగదు వినియోగాన్ని తగ్గించేలా, పన్ను వ్యవస్థను విస్తృతం చేసేలా చేపట్టిన పలు చర్యల్ని జైట్లీ ఉదహరించారు. ‘2016–17, 2017–18లలో ప్రత్యక్ష పన్నుల్లో వృద్ధి రేటు ఆశాజనకంగా ఉంది. గతేడాది వృద్ధి రేటు 12.6 శాతంగా ఉంటే.. జనవరి 15, 2018 నాటికి 18.7 శాతం ఉంది’ అని వెల్లడించారు. వ్యక్తిగత ఆదాయç పన్నుల వసూళ్లు పెరిగాయని, 2016–17, 2017–18లలో వ్యక్తిగత ఆదాయపు పన్నుల ఉత్తేజిత(బ్యుయన్సీ) రేటు 1.95, 2.11 గా ఉందని చెప్పారు. అంతకముందు ఏడేళ్ల సరాసరి వ్యక్తిగత ఆదాయపు పన్నుల ఉత్తేజిత రేటు 1.1గా ఉందని వెల్లడించారు. దేశంతో పాటు విదేశాల్లోని నల్లధనానికి అడ్డుకట్ట వేసేందుకు చట్టాల్ని రూపొందించామని గుర్తుచేశారు. పెద్ద నోట్ల రద్దు అంశాన్ని ప్రస్తావిస్తూ.. ‘నిజాయతీ ఉత్సవం’గా అందరి మన్ననలు అందుకుందని పేర్కొన్నారు. -
ఇక కంపెనీలకూ ‘ఆధార్’
న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి వ్యక్తికి ఆధార్ సంఖ్య ఉన్నట్లే ఇకపై ప్రతి కంపెనీకి కూడా ఓ గుర్తింపు సంఖ్య ఉండేలా కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అరుణ్‌జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడుతూ.. చిన్న కంపెనీ కానీ, పెద్ద కంపెనీ కానీ ప్రతి ఒక్క కంపెనీకి ఓ గుర్తింపు కార్డు ఉండాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రత్యేకమైన పథకాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే దాదాపు 119 కోట్ల మంది భారతీయులకు ఆధార్ కార్డును కేంద్రం అందజేసింది. ప్రస్తుతం ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేసేందుకు లబ్ధిదారుల ఎంపికలో ఆధార్ తప్పనిసరైంది. -
ఆరోగ్యశ్రీ రథం... ఆ‘కర్షక’ ధ్వజం.. గెలుపే లక్ష్యం!
అది మహా భారతం. కురుక్షేత్ర సంగ్రామం. అస్త్రాలు సంధించేది అర్జునుడే అయినా... దేనినెప్పుడు సంధించాలో... దేనినెలా ఎదుర్కోవాలో... ఎప్పుడు ఏ మాయ చేయాలో అన్నీ తెలిసినవాడు శ్రీ కృష్ణుడు. అర్జునుడి రథానికే కాదు, యావద్భారత సంగ్రామానికీ తనే సారథి. కర్ణుడిపైకి అంజలీకాన్ని సంధించినా... బ్రహ్మాస్త్రాన్ని వదిలి వెనక్కు తీసుకున్నా... సమ్మోహనాన్ని ప్రయోగించినా... జయద్రథుడిపైకి పాశుపతాన్ని పంపినా... అర్జునుడి గాండీవానికి కృష్ణుడే మార్గదర్శి. మన భారతంలో... మరో ఏడాదిలో ఎదుర్కోవాల్సిన ఎన్నికల కురుక్షేత్రానికి శంఖారావం పూరించారు నరేంద్రమోదీ. ప్రధానిగా యావద్భారతాన్నీ నడిపిస్తున్న మోదీ.. బడ్జెట్ రథ సారథిగా అరుణ్ జైట్లీకి శక్తిమంతమైన అస్త్రాలనందించారు. ఏకంగా 50 కోట్ల మందిని సమ్మోహితుల్ని చేసే ఆరోగ్య బీమాస్త్రం... పాశుపతంలాంటిదే.10 కోట్ల కుటుంబాలకు ఏడాదికి రూ.5 లక్షల వరకూ ఉచిత ఆరోగ్య బీమా కల్పించటం దీని లక్ష్యం. ఒకరకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ లాంటిదే ఇది కూడా. ఇపుడు దేశవ్యాప్తం కాబోతోంది!! ఆహార భారతానికి వెన్నెముకయిన రైతును ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఆ‘కర్షక’అస్త్రం వేశారు జైట్లీ. ఖరీఫ్ పంటల కోసం రైతులు వెచ్చించే పెట్టుబడి వ్యయానికి 50% ఎక్కువగా కనీస మద్దతు ధరనిస్తామన్నారు. వేతన జీవులకు ఆదాయపు పన్ను శ్లాబులు మార్చకుండా నిరాశ కలిగించినా... రూ.40 వేల స్టాండర్డ్ డిడక్షన్‌తో ఆశపెట్టారు. మొత్తంగా చూస్తే... ఇది ఎన్నికల కురుక్షేత్రానికి శంఖారావం పూరించిన బడ్జెట్ రథం. కాకపోతే మన భారతంలో కురుక్షేత్రం ఐదేళ్లకోసారి జరుగుతుంది. అందులో గెలుపోటములే... అంతిమంగా జనం చేతిలోని అస్త్రాలు. పెరిగేవి.. కార్లు, మోటార్ సైకిళ్లు, బస్సులు, ట్రక్కుల రేడియల్ టైర్లు, మొబైల్ ఫోన్లు, వాటి యాక్సెసరీలు, ఎల్సీడీ, ఎల్ఈడీ, ఓఎల్ఈడీ టీవీ ప్యానెళ్లు, ఇతర టీవీ విడిభాగాలు, ధరించగలిగిన ఎలక్ట్రానిక్ వస్తువులు, పెర్ఫ్యూమ్లు, డియోడ్రంట్లు, టాయిలెట్ వాటర్, టాయిలెట్ స్ప్రేలు, సౌందర్య ఉత్పత్తులు, పాదరక్షలు, పట్టు వస్త్రాలు, రంగు రాళ్లు, కొన్ని రకాల వజ్రాలు, పండ్లు, కూరగాయల జ్యూస్‌లు, వంటనూనెలు, బంగారం, వెండి, సన్‌గ్లాసెస్, సన్‌స్క్రీన్, సన్‌ట్యాన్ లోషన్లు, మ్యానిక్యూర్, పెడిక్యూర్లలో వాడే పదార్థాలు.. తగ్గేవి ముడి జీడిపప్పు, కాక్లియర్ ఇంప్లాంట్ల తయారీలో వాడే పరికరాలు, సౌర ఫలకాల తయారీలో వాడే సోలార్ టెంపర్డ్ గ్లాస్లు, కొన్ని రకాల మేకులు బడ్జెట్ హైలైట్స్ ♦ వ్యక్తిగత ఆదాయపన్ను శ్లాబులు, రేట్లలో మార్పు లేదు ♦కిసాన్ క్రెడిట్ కార్డులను పశు, చేపల పెంపకందారులకిస్తారు. ♦ 2018 ఆర్థిక సంవత్సరం చివరి 6 నెలల్లో 7.2–7.5% వృద్ధి రేటు నమోదు కావొచ్చు. ♦ 2017–18కి సవరించిన ద్రవ్యలోటు అంచనా 5.95 లక్షల కోట్లు. జీడీపీలో ఇది 3.5%. ♦ దశాబ్దం తర్వాత మళ్లీ స్టాండర్డ్ డిడక్షన్ అమలు. వేతన ఉద్యోగులకు రూ.40 వేల వరకు ప్రయాణ, వైద్య ఖర్చులకు స్టాండర్డ్ డిడక్షన్ వర్తింపు. ♦ రూ.50 లక్షలు మించి రూ.కోటికి తక్కువ ఆదాయం ఉన్న వారిపై 10%, రూ.కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారిపై 15% సర్‌చార్జ్ కొనసాగింపు. ♦ 2018–19 ఆర్థిక సంవత్సరంలో రైతులకు రూ.11 లక్షల కోట్ల మేర పంట రుణాల మంజూరు లక్ష్యం. గత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.10 లక్షల కోట్లే. ♦ అన్ని రంగాల్లో కొత్తగా చేరే ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించే ఈపీఎఫ్‌ను 12 శాతానికి పెంచారు. ఇది మూడేళ్ల పాటు అమలవుతుంది. ♦ రాష్ట్రపతి గౌరవ వేతనం నెలకు రూ. 5లక్షలకు పెంపు. ఉపరాష్ట్రపతి గౌరవ వేతనం రూ.4 లక్షలకు, గవర్నర్ల గౌరవ వేతనం రూ. 3.5 లక్షలకు పెంపు. ♦ మొబైల్ ఫోన్ల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ 15 నుంచి 20 శాతానికి పెంపు. టీవీలకు సంబంధించి కొన్ని విడిభాగాలపై కస్టమ్స్ డ్యూటీ 15 శాతానికి పెంపు. ♦దేశంలో 10 కోట్ల పేద కుటుంబాలకు లబ్ధి చేకూరేలా జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనికింద ఒక్కో కుటుంబానికి గరిష్టంగా ఏటా రూ. 5 లక్షల వైద్య బీమా సదుపాయం కల్పిస్తారు. ఈసారి బడ్జెట్లో ప్రపంచంలోనే అత్యంత భారీ ఆరోగ్య బీమా పథకాన్ని జైట్లీ ప్రకటించారు. ఎందుకంటే 10 కోట్ల పేద కుటుంబాలు.. అంటే దాదాపు 50 కోట్ల మందికి వర్తించేలా ఏడాదికి రూ.5 లక్షల కవరేజీతో ఆరోగ్య బీమా పథకాన్ని అమల్లోకి తెస్తామని జైట్లీ ప్రకటించారు. గురువారం 2018–19 బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పిస్తూ.. ఈ కీలక ప్రకటన చేశారు. ఈ పథకం ఎప్పట్నుంచి అమల్లోకి వస్తుందనేది, ప్రత్యేకంగా కేటాయింపులెంతనేది వెల్లడించలేదు. మొత్తంగా ఆరోగ్యం, విద్య, సామాజిక పరిరక్షణకు రూ.1.38 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఏడాదిలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జనాభాలో 40 శాతం మందిని ఆకర్షించే ప్రయత్నం చేశారన్నది నిపుణుల మాట. – సాక్షి, ప్రత్యేక ప్రతినిధి. వ్యవసాయానికి పెద్ద పీట! ఈసారి బడ్జెట్లో వ్యవసాయానికి, గ్రామీణ భారతానికి పెద్ద పీట వేశారు జైట్లీ. ‘‘నవ భారత నిర్మాణానికి ఇదే చోదకం’’ అని బడ్జెట్ అనంతరం జైట్లీ వ్యాఖ్యానించడాన్ని బట్టి ఈ రంగాలకిచ్చిన ప్రాధాన్యం అర్థమవుతుంది. పంట చేతికొచ్చినపుడు సరైన ధర లేక... సరైన ధర ఉన్నపుడు చేతిలో పంట లేక రైతులు నష్టపోతున్నారని వ్యాఖ్యానించిన జైట్లీ... పంటల నిల్వకోసం ఉచితంగా గిడ్డంగుల సౌకర్యం కల్పించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాక కనీస మద్దతు ధర నిర్ణయించేటపుడు రైతు పెట్టుబడిని పరిగణనలోకి తీసుకుంటామని, పెట్టుబడికన్నా కనీసం 50 శాతం అధికంగా ఉండేలా కనీస మద్దతు ధరను నిర్ణయిస్తామని తెలియజేశారు. వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధికి రూ.2000 కోట్లివ్వటం, కిసాన్ క్రెడిట్ కార్డుల్ని మత్స్య, పశు సంవర్థక రైతులకూ వర్తింపజేయటం... ఇవన్నీ రైతాంగానికిచ్చిన వరాలేనని చెప్పాలి. సీనియర్ సిటిజన్లకు ఊరటే! సంపాదించినన్నాళ్లూ పొదుపు చేసుకుని... రిటైరయ్యాక బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వడ్డీయే ఆదాయంగా బతుకుతున్న వారు కోకొల్లలు. ఎందుకంటే అసంఘటిత రంగమే అత్యధిక ఉద్యోగుల్ని పోషిస్తున్న మన భారతంలో పింఛన్ వచ్చేది అతితక్కువ మందికే. అందుకేనేమో.. డిపాజిట్లపై వచ్చే వడ్డీ రూ.10 వేలు దాటితే పన్ను చెల్లించాల్సిన పరిస్థితిని తప్పించి.. ఆ మొత్తాన్ని రూ.50వేలకు పెంచారు. వారు వైద్య అవసరాల కోసం (క్రిటికల్ ఇల్నెస్) వెచ్చించే దాంట్లో పన్ను మినహాయింపునకు అర్హమయ్యే మొత్తాన్ని రూ.లక్షకు పెంచారు కూడా. వేతన జీవికి విదిలింపే! ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు చేస్తారని అంతా ఎదురు చూసినా... ఈసారి జైట్లీ వాటి జోలికెళ్లలేదు. అయితే అందరికీ వర్తించేలా రూ.40 వేల స్టాండర్డ్ డిడక్షన్‌ను అమల్లోకి తెస్తామని ప్రకటించారు. అంటే ప్రతి ఒక్కరికీ పన్ను ఆదాయంలో ఎలాంటి బిల్లులూ లేకుండా రూ.40 వేలను మినహాయిస్తారన్న మాట. అయితే అదే సమయంలో ప్రస్తుతం పన్ను మినహాయింపు పరిధిలో ఉన్న రవాణా భత్యాన్ని, వైద్య ఖర్చుల్ని దాన్నుంచి తొలగించారు. పైపెచ్చు ప్రస్తుతం పన్ను ఆదాయంపై విధిస్తున్న 3 శాతం విద్యా సెస్సును 4 శాతానికి పెంచారు. అంటే మొత్తంగా చూసినపుడు స్టాండర్డ్ డిడక్షన్ వల్ల లాభం పరిమితమేనని చెప్పాలి. అలాగే షేర్లపై వచ్చే లాభానికి ప్రస్తుతం ఏడాది దాటితే పన్ను లేదు. కానీ లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పేరిట దీన్ని జైట్లీ అమల్లోకి తెచ్చారు. కాకపోతే దీనికి కొన్ని పరిమితులు విధించడం కొంత ఊరట. ఈక్విటీ మ్యూచ్‌వల్ ఫండ్లు చెల్లించే డివిడెండ్లపైనా 10 శాతం పన్ను వేశారు. లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ షేర్లను కొని, ఏడాదికన్నా ఎక్కువకాలం వాటిని అట్టేపెట్టుకుంటే వాటిపై వచ్చే లాభాలపై లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను ఉండదు. ఏడాదిలోపు విక్రయిస్తే మాత్రం షార్ట్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద పన్నుంటుంది. నిజానికి పద్నాలుగేళ్ల కిందట లాం గ్టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్నును తొలగించారు. దాన్ని జైట్లీ మళ్లీ తెచ్చారు. రూ.లక్షకు మించి వచ్చిన లాభాలపై 10 శాతం పన్ను విధిస్తామని చెప్పారు. నిజానికి 2004 జూలైలో లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్నును తొలగించి... దాని స్థానంలో సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌ను తెచ్చారు. ఇప్పుడు రెండూ అమల్లో ఉండటం గమనార్హం. గ్రామీణులకు వరాలు నిరుపేదలకు ఉచితంగా ఇస్తున్న గ్యాస్ కనెక్షన్ల లక్ష్యాన్ని ఈ బడ్జెట్లో ప్రస్తుతమున్న 5 కోట్ల నుంచి 8 కోట్లకు పెంచారు. దీనికితోడు 4 కోట్ల కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్ ఇస్తామని ప్రకటించారు. వ్యవసాయం, గ్రామీణ ఇళ్ల నిర్మాణం, ఆర్గానిక్ వ్యవసాయం, పశు సంవర్థకం, మత్స్య పరిశ్రమ వంటి వాటికి జైట్లీ ఏకంగా రూ.14.34 లక్షల కోట్లు కేటాయించారు. దిగుమతి సుంకాల పెంపు! మిగిలిన పన్నులన్నీ జీఎస్టీ పరిధిలోకి వచ్చి ఎప్పటికప్పుడు సవరణలు జరుగుతుండటంతో ఈ సారి వాటిలోకి ప్రవేశించే అవకాశం జైట్లీకి రాలేదు. దీంతో దిగుమతి సుంకాలను పెంచేశారు. సెల్ఫోన్లు, అత్తర్లు, ముస్తాబు సామగ్రి (టాయ్లెట్రీ), వాచ్‌లు, ఆటోమొబైల్ భాగాలు, సన్‌గ్లాసులు, ట్రక్–బస్సు టైర్లు వంటి వస్తువులపై దిగుమతి సుంకాలను పెంచేశారు. ద్రవ్య నియంత్రణ కష్టమేనా విద్య, ఆరోగ్యాలకు రూ.1.38 లక్షల కోట్లను ప్రకటించిన జైట్లీ... ఈ ఏడాది ద్రవ్యలోటు ముందుగా అంచనా వేసినట్టుగా జీడీపీలో 3.2 శాతంగా కాకుండా 3.5 శాతంగా ఉండవచ్చని స్పష్టంచేశారు. 2018–19లో ఇది 3.3 శాతానికి చేరుకోవచ్చన్నారు. కార్పొరేట్ ట్యాక్స్ ఊరట కొందరికే కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించాలన్న డిమాండ్‌పై జైట్లీ కొందరికే ఊరటనిచ్చారు. ప్రస్తుతం రూ.50 కోట్ల వరకూ వార్షిక టర్నోవర్ ఉన్న సంస్థలకు ఈ వెసులుబాటు ఉండగా.. ఇకపై రూ.250 కోట్ల టర్నోవర్ చేసే సంస్థలకు కూడా వర్తింపజేశారు. అంపశయ్యపై ఉండి కూడా... రాజ్యపాలన రీతులు, లోతులు, ధర్మ సూక్ష్మాలు తదితరాలను ధర్మజుడికి, పాండవులకు తన అనుభవాన్నంతా రంగరించి వివరిస్తాడు భీష్ముడు. ప్రజా సంక్షేమమే పరమావధి అంటాడు. ధర్మనందనుడి పాలనకు ఒకరకంగా అవే శిలాక్షరాలు. అందుకేనేమో సంక్షేమ మంత్రాన్ని పఠిస్తూ అన్ని వర్గాలనూ సంతృప్తిపరిచే ప్రయత్నం చేశారు జైట్లీ. -
మంత్రుల జీతభత్యాలకు రూ. 295 కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులు, మాజీ ప్రధానుల జీతభత్యాలు, ప్రయాణ ఖర్చులకు 2018–19 కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రూ. 295 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్లో రూ. 400 కోట్లు కేటాయించారు. ఈ మొత్తంలో 29% తగ్గించారు. బడ్జెట్లో కేటాయించిన మొత్తాన్నే మంత్రి మండలి, సహాయ మంత్రులు, మాజీ ప్రధానుల జీతభత్యాలకు, ఇతర సౌకర్యాలు, విందు, ప్రయాణ ఖర్చుల నిమిత్తం వినియోగించాలి. ఇక వీవీఐపీలు వినియోగించే విమానాల నిర్వహణ ఖర్చులను కూడా ఈ మొత్తంలోనే ఖర్చు చేయాలని జైట్లీ తెలిపారు. 2017–18 కేంద్ర బడ్జెట్లో రూ. 418.49 కోట్లను కేటాయించారు. ప్రధాని కార్యాలయం పాలనాపరమైన ఖర్చులకు ఈ ఏడాది బడ్జెట్లో రూ. 50.35 కోట్లను కేటాయించారు. -
సాగుకు సాయం.. రైతుకు మోదం
కుండల నిండా అన్నంతో, చూస్తూనే చవులూరించేలా రకరకాల కూరలతో, నోరూరించే అనేకానేక ఆదరువులతో... బకాసుర సంహారానికి బయల్దేరిన భీమసేనుడి బండి అక్షరాలా అన్నపు కొండనే తలపిస్తుంది! అలాగే మన దేశాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వ్యవసాయ రంగానికి తాజా బడ్జెట్ కేటాయింపుల్లో ఇతోధిక ప్రాధాన్యమిచ్చారు జైట్లీ... ►మత్స్య, పశు సంవర్థక రంగాల్లో మౌలిక సదుపాయాల కోసం 10,000 రూ. కోట్లలో ►వ్యవసాయ రుణ మంజూరు లక్ష్యం 11,00,000 రూ. కోట్లలో న్యూఢిల్లీ :బడ్జెట్లో కీలక రంగాలపై దృష్టి సారించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ... వ్యవసాయ రంగానికి భారీ వరాలు గుప్పించారు. వరి తదితర ఖరీఫ్ పంటలకు ఉత్పత్తి వ్యయం కన్నా 50 శాతం అధికంగా మద్దతు ధర కల్పించేందుకు చర్యలు చేపడతామని ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.11 లక్షల కోట్లు పంట రుణాలు ఇస్తామని వెల్లడించారు. రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని.. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయడమే లక్ష్యమని తెలిపారు. వ్యవసాయ శాఖ బడ్జెట్ కేటాయింపులను గతేడాది (రూ.51,576 కోట్లు) కన్నా 13 శాతం అధికంగా రూ. 58,080 కోట్లకు పెంచారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనకు ఈసారి రూ.13,000 కోట్లు కేటాయించారు. దీనికి గతేడాది కేటాయింపులు రూ.10,698 కోట్లే. ఖరీఫ్ పంటలకు మద్దతు వరి, మొక్కజొన్న, సోయాబీన్, పప్పుధాన్యాల వంటి ఖరీఫ్ పంటలకు కచ్చితమైన కనీస మద్దతు ధర అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు జైట్లీ వెల్లడించారు. ఆయా పంటల ఉత్పాదక వ్యయానికి 50 శాతం అదనంగా జోడించి మద్దతు ధర అందిస్తామని ప్రకటించారు. పంట ఉత్పత్తుల ధరలు పడిపోయినా రైతులకు కనీస మద్దతు ధర కచ్చితంగా అందేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. రైతులకు తగిన మద్దతు ధర అందించేలా వ్యవస్థీకృత ఏర్పాట్లపై నీతి ఆయోగ్ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తుందని తెలిపారు. రబీ పంటల మద్దతు ధరలను ఇప్పటికే పెంచినట్లు చెప్పారు. వ్యవసాయ భూముల యజమానులకు ఎలాం టి సమస్య తలెత్తకుండానే... కౌలు రైతులకు రుణాలు, నిధులు అందేలా చర్యలు చేపడతామని ప్రకటించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వా లతో నీతి ఆయోగ్ సంప్రదింపులు జరుపుతుందని తెలిపారు. భారీగా వ్యవసాయ ఎగుమతుల లక్ష్యం వివిధ వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. దేశం నుంచి ప్రస్తుతం 30 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 2 లక్షల కోట్లు) విలువైన వ్యవసాయోత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని.. ఇవి 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 6.4 లక్షల కోట్లు)కు చేరే అవకాశముందని పేర్కొన్నారు. ముఖ్యంగా టీ, కాఫీ, పండ్లు, కూరగాయల ఎగుమతులను ప్రోత్సహిస్తామని, ఇందుకోసం నిబంధనలను సరళీకరిస్తామని ప్రకటించారు. ఫుడ్ ప్రాసెసింగ్‌కు ప్రోత్సాహం ఫుడ్ ప్రాసెసింగ్‌కు గతేడాదికన్నా వంద శాతం అధికంగా రూ.1,400 కోట్లు కేటాయిస్తున్నట్లు జైట్లీ ప్రకటించారు. స్థానిక ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను రక్షించుకునేందుకు విదేశాల నుంచి దిగుమతయ్యే పలు ప్రాసెస్డ్ ఫుడ్‌పై కస్టమ్స్ సుంకాలను సవరిస్తున్నట్లు తెలిపారు. ఆరెంజ్ జ్యూస్‌పై 30 నుంచి 35 శాతానికి, ఇతర పళ్ల రసాలు, కూరగాయల జ్యూస్లపై 30 శాతం నుంచి 50 శాతానికి సుంకాన్ని పెంచారు. సోయా ప్రొటీన్ మినహా ఇతర వ్యవసాయ ప్రాసెస్డ్ ఉత్పత్తులపైనా సుంకాన్ని 50 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. ముడి జీడిపప్పు దిగుమతి సుంకాన్ని 5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు. కాగా ఫుడ్ ప్రాసెసింగ్‌కు నిధులు పెంచడంపై ఆ శాఖ కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్ హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల రైతులకు ప్రయోజనం కలుగుతుందని, లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. కూరగాయల ధరల నియంత్రణకు ‘ఆపరేషన్ గ్రీన్స్’ ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉండే ఉల్లి, టమాటా వంటి వ్యవసాయ ఉత్పత్తులు, కూరగాయల ధరల నియం త్రణ, పర్యవేక్షణ కోసం ‘ఆపరేషన్ గ్రీన్స్’ను చేపడతామని జైట్లీ ప్రకటించారు. దేశంలో పాల ఉత్పత్తి పెంపునకు దోహదపడిన ‘ఆపరేషన్ ఫ్లడ్’తరహాలో దీనిని చేపడతామని చెప్పారు. ‘ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌పీవో)’లను ప్రోత్సహించేందుకు.. ఆయా ఉత్పత్తుల నిల్వ, రవాణా, ప్రాసెసింగ్, నిర్వహణ కోసం రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. రూ.100 కోట్లలోపు టర్నోవర్ ఉన్న ఎఫ్‌పీవోలకు పూర్తి పన్ను మినహాయింపు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. లక్ష్యాలివీ.. ►రైతులకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 11 లక్షల కోట్ల మేర పంట రుణాల మంజూరు లక్ష్యం. గత ఆర్థిక సంవత్సరం కంటే ఇది రూ.లక్ష కోట్లు అదనం. ►ఒక్కో జిల్లా పరిధిలో ఒక్కో తరహా పంట పండించేలా ‘క్లస్టర్’ఆధారిత వ్యవసాయ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు చర్యలు. ఇందుకోసం ప్రస్తుత పథకాల్లో మార్పులు చేర్పులు. ►మత్స్య పరిశ్రమ, పశువుల పెంపకానికి మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.10,000 కోట్లతో ఇన్ఫ్రా ఫండ్ ఏర్పాటు. ►జాతీయ వెదురు మిషన్‌కు రూ.1,290 కోట్లు.. ఔషధ, సుగంధ ద్రవ్యాల మొక్కల పెంపకానికి రూ.200 కోట్లు. ►ఈ–నామ్ (జాతీయ వ్యవసాయ మార్కెట్) కింద ఈ ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా ఉన్న మార్కెట్ల అనుసంధానం. ►దేశవ్యాప్తంగా మెగా ఫుడ్‌పార్కుల ఏర్పాటు. ప్రస్తుతమున్న 42 మెగా ఫుడ్‌పార్కుల్లో అత్యాధునిక సదుపాయాల కల్పనకు చర్యలు. శీతల గిడ్డంగుల నిర్మాణం. ‘ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన’కింద రూ.1,313 కోట్లు కేటాయింపు. ►వ్యవసాయ మార్కెట్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ఇన్ఫ్రా ఫండ్ కింద రూ.2,000 కోట్లు కేటాయింపు. దేశవ్యాప్తంగా 22 వేల సంతలను గ్రామీణ వ్యవసాయ మార్కెట్లుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు. ►వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌కు నిధులు అందించేందుకు ప్రత్యేకంగా ‘ఆగ్రో–ప్రాసెసింగ్ ఫైనాన్షియల్’సంస్థల ఏర్పాటు. ►మత్స్య పరిశ్రమ, పశువుల పెంపకం చేపట్టే రైతులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డుల మంజూరు. రైతుల ఆదాయం రెట్టింపు రైతులు అధిక ఆదాయం పొందాలన్నదే మా లక్ష్యం. ప్రస్తుతం సాగు చేస్తున్న విస్తీర్ణంలో.. తక్కువ ఖర్చుతో ఇప్పటికన్నా ఎక్కువ దిగుబడి సాధించాలి. ఇదే సమయంలో పంటలకు ప్రస్తుతం కన్నా అధిక ధర పొందాలి. కేవలం మద్దతు ధరే కాదు.. అంతకన్నా ఎక్కువ ధర లభించాలి. 2022 నాటికి రైతుల ఆదాయం రెండింతలు కావాలన్నదే మా లక్ష్యం.. – అరుణ్ జైట్లీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు ఇది వినూత్న బడ్జెట్. వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. 2020 నాటికి రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ బడ్జెట్ తోడ్పడుతుంది.. – ఇఫ్కో ఎండీ అవస్తీ ఇది రైతుల బడ్జెట్ బడ్జెట్లో వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇది రైతుల బడ్జెట్. ఇక ముందు వ్యవసాయం నష్టదాయకం కాబోదు. దీనివల్ల యువత కూడా వ్యవసాయం వైపు మళ్లుతుంది. – చౌదరి బీరేందర్‌సింగ్, కేంద్ర మంత్రి 47% దాకా ‘మద్దతు’ ఆర్థిక మంత్రి బడ్జెట్లో పేర్కొన్న ప్రకారం ఖరీఫ్ పంటలకు మద్దతు ధర 47% వరకు పెరుగుతుంది. పంటను బట్టి 8 శాతం నుంచి 47% వరకు పెరగవచ్చు. క్వింటాల్ రూ. 1,900గా ఉన్న రాగుల మద్దతు ధర రూ. 2,791కు చేరుతుంది. – రమేశ్ చాంద్ (నీతి ఆయోగ్ సభ్యుడు) అపూర్వ బడ్జెట్: అడ్వాణీ న్యూఢిల్లీ: కేంద్రం అపూర్వమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని బీజేపీ సీనియర్ నేత ఎల్కే అడ్వాణీ కొనియాడారు. ‘ప్రజా సంక్షేమం కేంద్రంగా ఆర్థికవృద్ధిపై బీజేపీ దృష్టి సారించడం ఆనందంగా ఉంది. దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఉన్నత స్థాయి లక్ష్యాలు, నిబద్ధత ఉన్న ఇలాంటి బడ్జెట్‌ను గతంలో నేనెన్నడూ చూడలేదు. భారత్ ఉజ్వలమైన భవిష్యత్‌వైపు దూసుకెళ్తుంది. ఈ బడ్జెట్ దేశాన్ని, బీజేపీని గర్వపడేలా చేసింది. ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని హృదయ పూర్వకంగా అభినందిస్తు్తన్నా’అని అడ్వాణీ తెలిపారు. రెట్టింపు ఆదాయం అసాధ్యం: మన్మోహన్ న్యూఢిల్లీ: 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం అసాధ్యమని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ అభిప్రాయపడ్డారు. వ్యవసాయ వృద్ధిరేటు 12 శాతానికి చేరనిదే ఆ లక్ష్యం నెరవేరదన్నారు. ఆర్థిక లోటు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. హామీలను ప్రభుత్వం ఎలా నెరవేరుస్తుందో చూడాలన్నారు. ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకే ప్రకటించిన ఇలాంటి బడ్జెట్‌ను తాను తప్పు పట్టడంలేదని అన్నారు. ఈ బడ్జెట్ సంస్కరణల ఆధారితమా అని ప్రశ్నించగా..‘సంస్కరణలు’అనే పదాన్ని అతిగా వాడి దుర్వినియోగం చేశామని అన్నారు. హమ్మయ్యా.. మరో ఏడాదే మోదీ పాలన: రాహుల్ న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ వ్యంగ్యంగా స్పందించారు. దేశ ప్రజల అదృష్టం కొద్దీ మోదీ ప్రభుత్వ పాలన ఇంకా ఏడాది మాత్రమే ఉందన్నారు. ‘అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అయిపోయినా.. ఇంకా రైతుల పంటకు మద్దతు ధర కల్పిస్తామని బీజేపీ హామీలు ఇస్తూనే ఉంది. నాలుగేళ్లలో దేశంలోని యువతకు ఎలాంటి ఉద్యోగావకాశాలు కల్పించలేదు. మన అదృష్టం కొద్దీ మోదీ పాలన ఇంకో ఏడాది మాత్రమే ఉంటుంది’అని రాహుల్ ట్వీట్ చేశారు. -
రాష్ట్రపతి వేతనం రూ.5 లక్షలు
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వేతనాలు భారీగా పెరిగాయి. రాష్ట్రపతి వేతనం నెలకు రూ.5 లక్షలకు, ఉపరాష్ట్రపతి వేతనం నెలకు రూ.4 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే గవర్నర్ల వేతనం రూ.3.5 లక్షలకు చేరింది. ప్రస్తుతం రాష్ట్రపతికి నెలకు రూ.1.50 లక్షలు, ఉపరాష్ట్రపతికి 1.25 లక్షలు, గవర్నర్లకు రూ.1.10 లక్షల చొప్పున జీతాలు చెల్లిస్తున్నారు. ఈ వేతనాల పెంపును బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ..వారి జీతభత్యాలు చివరిసారి 2006 జనవరి 1న పెరిగిన సంగతిని గుర్తుచేశారు. రెండేళ్ల క్రితం ఏడో వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చినప్పటి నుంచి కేబినెట్ కార్యదర్శి, ఇతర కార్యదర్శులు రాష్ట్రపతి కన్నా ఎక్కువ వేతనాలు పొందుతున్న సంగతి తెలిసిందే. ఎంపీలకు డబుల్ ధమాకా... ఎంపీల మూల వేతనాలు రెట్టింపు కానున్నాయి. వచ్చే ఏప్రిల్ 1 నుంచి వారి మూలవేతనాన్ని ప్రస్తుతమున్న రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచుతూ తాజా బడ్జెట్లో జైట్లీ ప్రతిపాదించారు. వారికిచ్చే ఇతర భత్యాలను కూడా పెంచనున్నారు. ద్రవ్యోల్బణం ఆధారంగా ఐదేళ్లకోసారి ఎంపీల వేతనాలు, భత్యాలను ఆటోమేటిక్‌గా సవరించేందుకు కూడా జైట్లీ కొత్త చట్టాన్ని ప్రతిపాదించారు. ఎంపీల వేతనాల పెంపుపై ప్రస్తుతం అనుసరిస్తున్న పద్ధతులు విమర్శలకు దారితీస్తున్నాయని అన్నారు. అందుకే వచ్చే ఏప్రిల్ 1 నుంచి ఎంపీల వేతనాలు, నియోజకవర్గాల భత్యం, కార్యాలయాల ఖర్చులు, సమావేశాల భత్యాలను సవరించే విధానాల్లో మార్పులు తెస్తున్నట్లు ప్రకటించారు. -
‘ఆరోగ్య శ్రీ’కారం
న్యూఢిల్లీ: ఆరోగ్యశ్రీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకం పేదలపాలిట సంజీవనిలా నిలిచింది! బీదాబిక్కీకి కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించి లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే దిశగా అడుగులు వేస్తోంది. ఆరోగ్యశ్రీ తరహాలోనే బడ్జెట్లో కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో కీలక ప్రకటన చేశారు. దేశంలో 10 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరేలా జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకాన్ని ప్రవేశపెడతామని వెల్లడించారు. దీనికింద ఒక్కో కుటుంబానికి గరిష్టంగా ఏటా రూ.5 లక్షల వైద్య బీమా సదుపాయం కల్పిస్తామని తెలిపారు. ప్రభుత్వరంగంలో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వైద్య పథకమని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా సుమారు 50 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న జిల్లా ఆసుపత్రులను అప్‌గ్రేడ్ చేస్తూ కొత్తగా 24 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రతి మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు కనీసం ఒక మెడికల్ కాలేజీ ఉండేలా చూస్తామన్నారు. ‘‘ఆరోగ్యభారతం ద్వారానే సంపన్న భారతం సాకారమవుతుంది. పౌరులు ఆరోగ్యంగా ఉంటేనే దేశాభివృద్ధి సాధ్యపడుతుంది. అందుకే జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకాన్ని ప్రవేశ పెడుతున్నాం. ఆరోగ్య రంగానికి సంబంధించి ప్రపంచంలోనే ఇది అతిపెద్ద ప్రభుత్వ పథకం. ఈ పథకం ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడిచేందుకు తగినన్ని నిధులు కేటాయిస్తాం. మున్ముందు దేశ ప్రజలందరికీ వర్తించేలా ‘సార్వత్రిక ఆరోగ్య బీమా’ వైపు అడుగులు వేస్తాం’’ అని జైట్లీ పేర్కొన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు వివిధ ఆరోగ్య పథకాలను అమలు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిం చారు. ప్రస్తుతం కేంద్రం అమలు చేస్తున్న రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన (ఆర్‌ఎస్‌బీఐ) కింద పేదలకు ఏటా రూ. 30 వేల వైద్య బీమా మాత్రమే ఉంది. ఈ పథకానికి తాజా బడ్జెట్లో రూ.2 వేల కోట్లు కేటాయించారు. ఆరోగ్య బడ్జెట్ రూ.54,667 కోట్లు ఆరోగ్య రంగానికి గతేడాది రూ.53,198 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.54,667 కోట్లు కేటాయించారు. అలాగే ఆరోగ్య పరిశోధన విభాగానికి కిందటేడాది రూ.1,500 కోట్లు కేటాయిస్తే.. ఈసారి రూ.1,800 కోట్లు ప్రతిపాదించారు. జైట్లీ ఇంకా ఏమన్నారంటే.. ► ‘ఆయుష్మాన్ భారత్’ కార్యక్రమంలో భాగంగా జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం, 1.5 లక్షల హెల్త్, వెల్నెస్ సెంటర్ల ఏర్పాటును చేపట్టాం. ► ఈ సెంటర్ల ద్వారా పేదలకు ఉచిత మందులతోపాటు వైద్య పరీక్షల సౌకర్యం కల్పిస్తాం ► ఆరోగ్య రంగంలో తెస్తున్న కొత్త పథకాల ద్వారా లక్షల మందికి.. ప్రత్యేకించి మహిళలకు ఉపాధి కల్పిస్తాం ► కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ(సీఎస్ఆర్) కింద హెల్త్, వెల్నెస్ సెంటర్లను దత్తత తీసుకునేలా ప్రైవేటు కంపెనీలను ఆహ్వానిస్తాం ► క్షయ వ్యాధి ఏటా ఎందరినో బలితీసుకుంటోంది. అందుకే టీబీ రోగులకు పోషకాహారం అందించేందుకు రూ.600 కోట్లు కేటాయిస్తున్నాం. ► చికిత్స పొందే కాలంలో రోగులకు నెలకు రూ.500 చొప్పున అందిస్తాం ► ‘ఆయుష్మాన్ భారత్’ కింద 2022 నాటికల్లా అందరూ ఆరోగ్యంగా ఉండే, ఉత్పత్తిని పెంచే, పేదరికం లేని నవ భారత్‌ను నిర్మిస్తాం ► దివ్యాస్త్రాలతో ఆకాశానికి అడ్డుగోడ కట్టి అర్జునుడు కాపు కాస్తుండగా... అనేకానేక అమూల్యమైన మూలికలకు నిలయమైన ఖాండవ వనాన్ని వేయి నాల్కలతో కబళించి ఆరోగ్యం పుంజుకుంటాడు అగ్నిదేవుడు. ► అదే మాదిరిగా ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా పథకంతో ఏకంగా 50 కోట్ల మంది భారతీయుల ఆరోగ్యానికి రక్షణ ఛత్రం కల్పించనున్నట్టు ప్రకటించారు విత్త మంత్రి...! ► వైద్య చికిత్సల కోసం దేశంలో లక్షలాది మంది ఆస్తులు ► అమ్ముకోవాల్సి వస్తోంది. మరెందరో అప్పుల పాలవుతున్నారు. అలాంటి నిరుపేదలను ఆదుకునేందుకు మా ప్రభుత్వం ► చిత్తశుద్ధితో ఉంది. వైద్య సదుపాయాలను మరింత విస్తృతం చేస్తాం. నాణ్యమైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతోనే కొత్తగా 24 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. – అరుణ్‌జైట్లీ బడ్జెట్ హైలైట్స్ ► వ్యవసాయ మార్కెట్లలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.2,000 కోట్లతో నిధి. దీని ద్వారా దేశవ్యాప్తంగా 22 వేల గ్రామీణ వ్యవసాయ మార్కెట్లు, 585 ఏపీఎంసీల అభివృద్ధి. ► అన్ని రంగాల్లో ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత. ► రూ. 2.5 లక్షలు, అంతకు మించిన లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరి. ► ఫుడ్ ప్రాసెసింగ్‌కు గత ఏడాది రూ.715 కోట్లు కేటాయిస్తే.. ఈసారి అది రూ.1,400 కోట్లకు పెరిగింది. ► ఢిల్లీ–ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం నియంత్రణకు చర్యలు. ► స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా మరో 2 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం ► జాతీయ జీవనోపాధి మిషన్‌కు రూ.5,750 కోట్లు. ► ‘ఆయుష్మాన్‌భవ’ కింద 2 ప్రధాన కార్యక్రమాలను ప్రభుత్వం ప్రకటించింది. -
బడ్జెట్ ప్రభావిత షేర్లు
ప్రస్తుత మోదీ ప్రభుత్వపు అఖరి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. వ్యవసాయ, గ్రామీణ ప్రాంతాలకు అధిక ప్రాధాన్యతనిచ్చిన ఈ బడ్జెట్లో మౌలిక రంగానికి భారీగానే కేటాయింపులున్నాయి. వివిధ ప్రతిపాదనలకు ప్రభావితమయ్యే ఆయా రంగ షేర్ల వివరాలు... బడ్జెట్ ప్రతిపాదన - ప్రభావిత షేర్లు సిగరెట్లపై పెరగని పన్ను - ఐటీసీ మౌలిక రంగానికి రూ.5.97 లక్షల కోట్ల నిధులు గత బడ్జెట్‌తో పోల్చితే రూ.1 లక్ష కోట్లు అధికం - దిలిప్ బిల్డ్‌కాన్, జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రా, జీఎమ్ఆర్ ఇన్ఫ్రా ఎన్సీసీ, హెచ్‌సీసీ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిపై అధిక దృష్టి మద్దతు ధర పెంపు సాగు రుణాలు 10 శాతం వృద్దితో రూ.11. లక్షల కోట్లకు గ్రామీణ్ అగ్రికల్చరల్ మార్కెట్ల ఏర్పాటు - ఎన్ఏసీఎల్ ఇండస్ట్రీస్, పీఐ ఇండస్ట్రీస్, శక్తి పంప్స్ ఇండియా మోన్శాంటో ఇండియా, ఏరీస్ ఆగ్రో, ధనుక ఆగ్రిటెక్, కావేరి సీడ్ కంపెనీ, యూపీఎల్, యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఎస్కార్ట్స్, మహీంద్రా, ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి నిధులు రెట్టింపు రూ.1,400 కోట్ల కేటాయింపు - శీతల్ కూల్ ప్రొడక్ట్, అవంతి ఫీడ్స్, గోద్రేజ్ ఆగ్రోవెట్, ప్రెష్ట్రాప్ ప్రూట్స్ పది కోట్ల పేద కుటుంబాలకు నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ - ఎస్బీఐ లైఫ్, ఐసీఐసీఐ ప్రు లైఫ్, హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉడాన్ స్కీమ్ కింద మరిన్ని విమానశ్రయాల అనుసంధానం - స్పైస్‌జెట్, జెట్ ఎయిర్వేస్,ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక, జీవనోపాధి కోసం రూ.14.34 లక్షల కోట్ల కేటాయింపు - ఏసీసీ, శ్రీ సిమెంట్, అంబుజా సిమెంట్,గ్రాసిమ్, అల్ట్రాటెక్ సిమెంట్ ఆఫర్డబుల్ హౌసింగ్ ఫండ్ ఏర్పాటు - రియల్టీ షేర్లు ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ కింద 1.5 లక్షల ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు రూ.1,200 కోట్లు కేటాయింపు - హెల్త్‌కేర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్, షాల్బీ అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ కోవై మెడికల్ సెంటర్ అండ్ హాస్పిటల్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2 కోట్ల టాయిలెట్ల నిర్మాణం - సోమానీ సెరామిక్స్, సెరా శానిటరీ వేర్, ఏషియన్ గ్రానిటో, ఏరో గ్రానైట్ ప్రతికూల ప్రభావం దీర్ఘకాల మూలధన లాభాలపై 10 శాతం పన్ను - రెలిగేర్ ఎంటర్ప్రైజెస్, మోతిలాల్ ఓస్వాల్, ఆదిత్య బిర్లా మనీ రైల్వేలకు రూ.1.48 లక్షల కోట్లు కేటాయింపు కొత్త రైళ్ల, ప్రయాణికుల భద్రత ఊసే లేదు - స్టోన్ ఇండియా, టిటాఘర్ వ్యాగన్స్,కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్, కంటైనర్ కార్పొ -
దివాలా ప్రొసీడింగ్స్‌లో పన్ను రాయితీలు
న్యూఢిల్లీ: బకాయిల ఇబ్బందుల్లో కూరుకుపోయిన కంపెనీలను కొనుగోలు చేయడానికి ఒక ఆకర్షణీయమైన ప్రోత్సాహకాన్ని కేంద్రం ప్రకటించింది. దివాలా ప్రొసీడింగ్స్‌లో కంపెనీల కొనుగోలు విషయంలో పన్ను రాయితీలను కల్పించనున్నట్లు కేంద్రం గురువారం ప్రకటించింది. మినిమం ఆల్ట్రర్నేటివ్ ట్యాక్స్ (ఎంఏటీ)కు సంబంధించిన రాయితీ విషయంలో ఆదాయపు పన్ను చట్టంలో తగిన సవరణలు తీసుకువస్తారు. ఇందుకు సంబంధించి 2018–19 బడ్జెట్లో చేసిన ప్రతిపాదనలు ఏప్రిల్ 1వ తేదీ నుంచీ అమల్లోకి వస్తాయి. 2016 డిసెంబర్ నుంచీ అమల్లోకి వచ్చిన ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ (ఐబీసీ) కింద కేసులు భారీగా పెరిగిన నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. హైబ్రిడ్ ఇనుస్ట్రుమెంట్లకు ప్రత్యేక పాలసీ హైబ్రిడ్ ఇనుస్ట్రుమెంట్లకు ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నట్టు అరుణ్‌జైట్లీ ప్రకటించారు. స్టార్టప్‌లు, వెంచర్ క్యాపిటల్ సంస్థలు సహా పలు కీలక విభాగాల్లో విదేశీ నిధుల ఆకర్షణకు ఇవి సరైనవని మంత్రి పేర్కొన్నారు. కంపెనీలు ఐటీ రిటర్నులు వేయకుంటే ప్రాసిక్యూషన్ ఆదాయ పన్ను రిటర్నులను సకాలంలో దాఖలు చేయడంలో విఫలమయ్యే కంపెనీలు ఇకపై ప్రాసిక్యూషన్ చర్యలు ఎదుర్కొనాల్సి రానుంది. ఇందుకు సంబంధించి ఆదాయ పన్ను చట్టంలో కేంద్రం సవరణలు చేయనుంది. అక్రమ మార్గాల్లో నిధులు మళ్లించడాన్ని నిరోధించే దిశగా డొల్ల కంపెనీలపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తున్న నేపథ్యంలో తాజా ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది. వెంచర్ క్యాపిటల్, ఏంజెల్ ఇన్వెస్టర్ల బలోపేతం దేశంలో వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, ఏంజెల్ ఇన్వెస్టర్ల వ్యవస్థల బలోపేతానికి అదనపు చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. నవ్యతకు, ప్రత్యేకమైన అభివృద్ధికి ఇవి అవసరమన్నారు. ‘‘విధానపరమైన చర్యలు ఎన్నో తీసుకున్నాం. స్టార్టప్ ఇండియా కార్యక్రమం చేపట్టాం. ప్రత్యామ్నాయ పెట్టుబడుల విధానాన్ని ప్రవేశపెట్టాం’’ అని అన్నారు. స్పెక్యులేషన్ పరిధి నుంచి అగ్రి డెరివేటివ్స్ తొలగింపు అగ్రి–కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్లో హెడ్జింగ్‌ను మరింతగా ప్రోత్సహించే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారు. అగ్రి–కమోడిటీ డెరివేటివ్స్‌లో ట్రేడింగ్‌ను ’నాన్–స్పెక్యులేటివ్’ గా వ్యవహరించేలా సంబంధిత చట్టాన్ని సవరించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి ఈ సవరణలు అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం కమోడిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (సీటీటీ) వర్తించే కమోడిటీ డెరివేటివ్స్ లావాదేవీలన్నింటినీ నాన్–స్పెక్యులేటివ్‌గా పరిగణిస్తున్నారు. అయితే, అగ్రి–కమోడిటీలకు సీటీటీ నుంచి మినహాయింపు ఉండగా, వాటి డెరివేటివ్స్‌లో నిర్వహించే ట్రేడింగ్‌ను మాత్రం స్పెక్యులేషన్గా వ్యవహరిస్తున్నారు. దీంతో చాలా మంది అగ్రి–డెరివేటివ్స్‌లో ట్రేడింగ్‌కు దూరంగా ఉంటున్నారని .. తాజా మార్పుతో ప్రాసెసింగ్ సంస్థలు, తయారీ సంస్థలు ఇకపై వీటిపై దృష్టి సారించగలవని ఎస్ఎంసీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అడ్వైజర్స్ సీఎండీ డీకే అగర్వాల్ తెలిపారు. అగ్రి–డెరివేటివ్స్‌లో వచ్చే లాభాలను వ్యాపార ఆదాయం లేదా నష్టంగా పరిగణించడం జరుగుతుందని పేర్కొన్నారు. -
ఇది ఎన్నికల బడ్జెట్: ఫ్యాప్సీ
బడ్జెట్‌పై ఫ్యాప్సీ మిశ్రమంగా స్పందించింది. ఎలక్షన్ బడ్జెట్‌గా అభివర్ణించింది. ఎంఎస్ఎంఈలకు కార్పొరేట్ ట్యాక్స్‌ను 2017–18 ఆర్థిక సంవత్సరంలో 30 నుంచి 25 శాతానికి తగ్గించడంతోపాటు, రూ.50 కోట్లుగా ఉన్న టర్నోవర్ పరిమితిని రూ.250 కోట్లకు పెంచారు. టర్నోవర్ పరిమితి లేకుండా అన్ని కంపెనీలకు ఈ ప్రయోజనాన్ని వర్తింపజేయాల్సిందని ఫ్యాప్సీ ప్రెసిడెంట్ గౌర శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. తాజాగా విద్యా సెస్సు విధించడం భారంగా పరిగణిస్తున్నాం’ అని వివరించారు. చిన్న పరిశ్రమలకు దన్ను: డిక్కీ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంఎస్ఎంఈ రంగానికి ఆశాజనకంగా ఉందని డిక్కీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మన్నెం మధుసూదన రావు తెలిపారు. చిన్న వ్యాపారులకు ముద్ర యోజన కింద రూ.3 లక్షల కోట్ల రూపాయల రుణాలను అంజేస్తామన్న అరుణ్ జైట్లీ ప్రకటన ఆశలు కల్పిస్తోందని అన్నారు. రూ.50 కోట్ల టర్నోవర్‌కు పరిమితం చేసిన 25 శాతం కార్పొరేట్ పన్ను విధానాన్ని రూ.250 కోట్ల టర్నోవర్ వరకు ఉన్న కంపెనీలకు వర్తింపజేయడంతో మధ్యతరహా పరిశ్రమలు దీని కిందకు వస్తాయని చెప్పారు. ఇన్సూరెన్స్‌కు పట్టం ప్రస్తుత బడ్జెట్లో ఇన్సూరెన్స్ సంబంధిత అంశాలు చాలానే ఉన్నాయి. నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్, సీనియర్ సిటిజన్స్‌కు ఆరోగ్య బీమాకు సంబంధించి సెక్షన్ 80 డి కింద పన్ను మినహాయింపు పరిమితి పెంపు, జన్ ధన్ ఖాతాదారు లకు ఇన్సూరెన్స్ సర్వీసులు వంటి గురించి చెప్పుకోవాలి. దేశ పౌరులకు సరైన ఆరోగ్య బీమా కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సంతోషకరం. - తపన్ సింఘెల్, బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో -
ఒక ఆశ.. ఒక నిరాశ
ఈ బడ్జెట్లోని ‘ఆయుష్మాన్ భారత్’ కార్యక్రమాన్ని సాదరంగా ఆహ్వానించవలసిన అవసరం ఉన్నది. ప్రాథమిక, మాధ్యమిక, తృతీయక ఆరోగ్య సేవా కేంద్రాలను పెంపొందించాలన్న ఆలోచనను స్వాగతించవలసిందే. ఇందుకు అవసరమైన కార్యాచరణ కోసం నిష్ణాతులైన భాగస్వాములను కలుపుకొని బడ్జెట్ పరిధిని దాటి విస్తృత పరచవలసిన అవసరం ఉన్నది. జాతీయ ఆరోగ్య భద్రతా పథకాన్ని 50 కోట్ల మంది లబ్ధిదారులకు అన్వయించడం కూడా ముదావహం. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ మెజారిటీ వర్గాల్లో, ప్రజల్లో, ప్రాంతాల్లో తీవ్ర నిరుత్సాహమే మిగి ల్చింది. స్వతహాగా ఎంతో ఉత్సాహంగా, హాస్యోక్తులను జోడించి, వైరి వర్గాల, పార్టీల వారిని సున్నితంగా ఎత్తిచూపుతూ ప్రసంగించే ఆర్థికామాత్యులు, అందుకు భిన్నంగా, చప్పగా, పేలవంగా తన ప్రసంగాన్ని ముగించడం ఆయన సమర్ధకులనే కాదు, ప్రత్యర్థులను కూడా ఒకింత విస్మయపరచిన మాట వాస్తవం. ఇందుకు కారణం ప్రస్తుత బడ్జెట్లో లక్ష్యసిద్ధి, గమ్య స్పష్టత, నిర్దిష్ట ప్రణాళికా గమనం, నిబద్ధత లోపించడం కావచ్చు. 2016, నవంబర్ 8న ప్రధాని మోదీ నోట్ల రద్దు చర్య తర్వాత క్రమక్రమంగా ఈ ప్రభుత్వ ఆర్థిక గమనం, సాంద్రత తగ్గి పలుచబడటం మొదలయ్యింది. ఈరోజు సాధారణ బడ్జెట్ స్వరూపం కూడా అందులో భాగమేనేమో! తాజా బడ్జెట్లో ఉటంకించిన మూడు ప్రధాన లక్ష్యాలు: 1. వ్యవసాయరంగం, గ్రామీణ ఆర్థికవ్యవస్థలపై స్పష్టమైన దృష్టి. 2. ఆరోగ్య, విద్యా, సామాజిక ఉత్పత్తి (Social Production) రంగాలను ప్రత్యేక ప్రోత్సాహకాలతో అభివృద్ధి చేయడం. 3. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (M Mఉ) పరిశ్రమలను ప్రోత్సహించడానికి చర్యలు. ఈ మూడింటినీ వరుస క్రమంలో మొదట పరిశీలిద్దాం. తర్వాత ఇతర అంశాలను విశ్లేషించుకుందాం. వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంపొందించే దిశగా చర్యలు చేపట్టడం ఇప్పటి వరకు ఉన్న ఆనవాయితీ. అంటే వ్యవసాయానికి కావలసిన ఇన్ పుట్స్, సాధనాలు, నీటి పారుదల, విద్యుచ్ఛక్తి, మౌలిక వసతులు, ఎరువులు వగైరాలపై దృష్టి పెట్టడం ద్వారా అధిక ఉత్పత్తి సాధించడం. అందుకు భిన్నంగా ప్రధాని పిలుపు మేరకు 75వ స్వాతంత్య్ర దినోత్సవం (2022) నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశలో ఒక నమూనా మార్పు, లేదా పారడైం షిఫ్ట్‌ని ప్రవేశపెడ్తున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. దీనికోసం వ్యవసాయాన్ని ఒక ఎంటర్‌ప్రైజ్‌గా పరిగణించి రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంచే దిశలో వ్యవసాయ ధరలను మార్కెట్ ద్వారా పెంచేందుకు ప్రయత్నం చేయడం గమనార్హం. అంటే ధాన్యాలు, దినుసులు, పండ్లు, కూరగాయలు, నూనెగింజలు, వంటనూనెలు మొదలైన వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులను కార్పొరేట్ పరిధిలోకి తీసుకురావడంగా అర్థమవుతుంది. దీనివల్ల రైతులకు ఒనగూడే ప్రయోజనం సంగతి అటుంచి, దళారీలకు, కార్పొరేట్లకు లాభాలు తెచ్చి పెట్టే అవకాశమే ఎక్కువ. ఈ వాస్తవాన్ని ఆచరణలో ఉన్న గణాంకాలు, ప్రపంచవ్యాప్తంగా కనిపించే అనుభవాల సారం సూచిస్తున్నాయి. కనీస మద్దతు ధర విషయంలో రాష్ట్ర, కేంద్ర పథకాల ప్రయోజనాలు రైతులకు చేరడం లేదనేది అందరికీ తెలిసిన సత్యమే. ప్రసంగంలోని 15వ పేరాలో చెప్పిన ప్రకారం కోతల తర్వాత పంటలకు సరసమైన ధరలను సాధించుకోవడం కోసం రైతులు ‘సరైన నిర్ణయాలు’ తీసుకోవాలని సూచించడం స్పష్టంగా ‘ఏ ధరకు అమ్ముకోవాలో మీరే నిర్ణయించుకోండి’ అని రైతులను ప్రోత్సహించడంగానే చూడవచ్చు. 2018–19లో పంట రుణాల సౌకర్యాన్ని రూ. లక్షల కోట్లకు పెంచుతున్నట్టు ప్రతిపాదించారు. ఈ అంశం ద్వారా స్పష్టమయ్యే ఒక వాస్తవం ఏదంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవీ కూడా కౌలుదారుల వివరాలను సమగ్రంగా సేకరించలేదు. కాబట్టి నిజమైన కౌలుదారుడు లబ్ధి పొందటం కష్టం. ఈ పరిస్థితులలో రుణ సదుపాయాలు కూడా సరిౖయెన ఫలితాలను సాధించటం కష్టం. ఆర్థిక, సామాజిక స్వప్నాలు సాకల్యం చేసుకోవడం కోసం జనాభా గణన, సామాజిక–ఆర్థిక కుల పరిగణన, అనాథ పిల్లలు, దివ్యాంగుల వివరాల ఆధారంగా జాతీయ సామాజిక సహాయతా కార్యక్రమానికిగాను ఈ సంవత్సరం రూ. 9,973 కోట్లు కేటాయించడం హర్షించతగినదే. ప్రాథమిక విద్యా ప్రమాణాలు పెంపొందించడానికి ఉపాధ్యాయ శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానంతోపాటు ఇంకా ఎన్నో చర్యలు తక్షణం చేపట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ముఖ్యంగా బడి చదువులు మధ్యలోనే ఆపివేసే, బాలబాలికల సంఖ్యను గణనీయంగా తగ్గించవలసిన అవసరం ఉన్నది. ఈ బడ్జెట్లోని ‘ఆయుష్మాన్ భారత్’ కార్యక్రమాన్ని సాదరంగా ఆహ్వానించవలసిన అవసరం ఉన్నది. ప్రాథమిక, మాధ్యమిక, తృతీయక ఆరోగ్య సేవా కేంద్రాలను పెంపొందించాలన్న ఆలోచనను స్వాగతించవలసిందే. ఇందుకు అవసరమైన కార్యాచరణ కోసం నిష్ణాతులైన భాగస్వాములను కలుపుకొని బడ్జెట్ పరిధిని దాటి విస్తృత పరచవలసిన అవసరం ఉన్నది. జాతీయ ఆరోగ్య భద్రతా పథకాన్ని 50 కోట్ల మంది లబ్ధిదారులకు అన్వయించడం కూడా ముదావహం. అయితే డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ‘ఆరోగ్యశ్రీ’ పథకం ద్వారా కొత్త ఒరవడి సృష్టించారు. కానీ అధిక ప్రయోజనాలను కార్పొరేట్ హాస్పిటల్స్ దండుకున్నాయి. సామాన్య ప్రజలు, దళితులు, ఆదివాసీలు, బడుగువర్గాలు పొందిన ప్రయోజనాలు స్వల్పమేనని ఎన్నో అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ బడ్జెట్లో ప్రకటించిన పథకం అలాంటి లోటుపాట్లకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న మధ్య, సూక్ష్మ పరిశ్రమలు తక్షణమే కుదుటపడాలంటే రూ. 3,794 కోట్ల రుణ సదుపాయం ఒక్కటే సరిపోదు. మన దేశంలో ఈ రంగానికి చెందిన పరిశ్రమలు 95 శాతం ఉద్యోగావకాశాలు సృష్టిస్తున్న విషయం మన వార్షిక పారిశ్రామిక సర్వే గణాంకాల ద్వారా స్పష్టమైంది. అందులో ప్రస్తావించని విషయం ఏమిటంటే, ఈ కార్మికుల వివరాలు రిజిస్టరులో నమోదు కావు. దీనికి పెద్ద కారణం ఉంది. తాత్కాలిక భృతితోనో, కాంట్రాక్టులతోనో కాలం గడిపేవారి సంఖ్య చాలా ఎక్కువ. ఈ కారణంచేత లావాదేవీలన్నీ నగదు రూపేణా తప్ప, డిజిటల్ రూపంలో ఉండవు. అందుకే నోట్ల రద్దు కాలంలో తక్షణ ప్రభావం ఈ రంగంపైన కలిగిందనడం వాస్తవం. ఈ పరిస్థితి మారడానికి కూడా చాలా కాలం పట్టవచ్చు. ఈ రకమైన రుణ సదుపాయాలు ఏ మేరకు లక్ష్యాన్ని సాధించగలవన్నది ప్రశ్నార్థకమే. చివరగా 24,000 ప్రభుత్వ రంగ పరిశ్రమల అమ్మకం ద్వారా రూ. 80,000 కోట్లు సమీకరించడం అంత విజ్ఞతతో కూడిన చర్య అనిపించుకోదు. ప్రొ జె. మనోహర్‌రావు వ్యాసకర్త హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు