
బడ్జెట్‌పై ఫ్యాప్సీ మిశ్రమంగా స్పందించింది. ఎలక్షన్ బడ్జెట్‌గా అభివర్ణించింది. ఎంఎస్‌ఎంఈలకు కార్పొరేట్ ట్యాక్స్‌ను 2017–18 ఆర్థిక సంవత్సరంలో 30 నుంచి 25 శాతానికి తగ్గించడంతోపాటు, రూ.50 కోట్లుగా ఉన్న టర్నోవర్ పరిమితిని రూ.250 కోట్లకు పెంచారు. టర్నోవర్ పరిమితి లేకుండా అన్ని కంపెనీలకు ఈ ప్రయోజనాన్ని వర్తింపజేయాల్సిందని ఫ్యాప్సీ ప్రెసిడెంట్ గౌర శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. తాజాగా విద్యా సెస్సు విధించడం భారంగా పరిగణిస్తున్నాం’ అని వివరించారు.
చిన్న పరిశ్రమలకు దన్ను: డిక్కీ
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంఎస్‌ఎంఈ రంగానికి ఆశాజనకంగా ఉందని డిక్కీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మన్నెం మధుసూదన రావు తెలిపారు. చిన్న వ్యాపారులకు ముద్ర యోజన కింద రూ.3 లక్షల కోట్ల రూపాయల రుణాలను అంజేస్తామన్న అరుణ్ జైట్లీ ప్రకటన ఆశలు కల్పిస్తోందని అన్నారు. రూ.50 కోట్ల టర్నోవర్‌కు పరిమితం చేసిన 25 శాతం కార్పొరేట్ పన్ను విధానాన్ని రూ.250 కోట్ల టర్నోవర్ వరకు ఉన్న కంపెనీలకు వర్తింపజేయడంతో మధ్యతరహా పరిశ్రమలు దీని కిందకు వస్తాయని చెప్పారు.
ఇన్సూరెన్స్‌కు పట్టం
ప్రస్తుత బడ్జెట్‌లో ఇన్సూరెన్స్ సంబంధిత అంశాలు చాలానే ఉన్నాయి. నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్, సీనియర్ సిటిజన్స్‌కు ఆరోగ్య బీమాకు సంబంధించి సెక్షన్ 80 డి కింద పన్ను మినహాయింపు పరిమితి పెంపు, జన్ ధన్ ఖాతాదారు లకు ఇన్సూరెన్స్ సర్వీసులు వంటి గురించి చెప్పుకోవాలి. దేశ పౌరులకు సరైన ఆరోగ్య బీమా కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సంతోషకరం. - తపన్ సింఘెల్, బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో
Comments
Please login to add a commentAdd a comment