![Union Budget Anti-Poor, Pro-Capitalists: BSP Leader Mayawati - Sakshi](/styles/webp/s3/article_images/2018/02/2/mayawati.JPG.webp?itok=N4YX5VK0)
లక్నో: పేదలకు వ్యతిరేకంగా, పెట్టుబడిదారులకు అనుకూలమైన బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టిందని బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శించారు. ‘మోదీ ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లలాగే ఈసారి కూడా ప్రవేశపెట్టింది. దేశానికి మంచిరోజులు తెస్తామని 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ఇచ్చిన హామీ ఏమైంది? తప్పుడు ప్రసంగాలు, వాదనలతో దేశప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. పేదలు, కార్మికులు, రైతులు, ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకోక నిరుద్యోగం, ధనిక–పేదల మధ్య అంతరం పెరిగిపోతోంది’ అని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment