న్యూఢిల్లీ: సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు బడ్జెట్‌లో రూ.2,843 కోట్లను కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఇది 3.82 శాతం ఎక్కువ. గత బడ్జెట్‌లో ఆ శాఖకు రూ.2,738.47 కోట్లను కేటాయించారు. మరోవైపు భారత పురావస్తు శాఖకు రూ.974.56 కోట్లను కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఇది 5.42 శాతం అధికం.
గ్రంథాలయాలకు రూ.109.18 కోట్లు, మ్యూజియాల కోసం రూ.80.60 కోట్లు కేటాయించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రముఖ వ్యక్తుల జయంతులు, వార్షికోత్సవాలకు వినియోగించే నిధుల్లో కేంద్రం కోత విధించింది. ఆ నిధులను రూ.243.01 కోట్ల నుంచి రూ.100 కోట్లకు తగ్గించింది. ‘కళా సంస్కృతి వికాస్ యోజన’పథకానికి రూ.310 కోట్లు కేటాయించింది. ఈ పథకం ద్వారా మహాత్మా గాంధీ హెరిటేజ్ సైట్స్ మిషన్ అండ్ దండి సంబంధిత ప్రాజెక్టులు, కళలు, సంస్కృతి, స్కాలర్‌షిప్, ఫెలోషిప్‌లను అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment