
పార్లమెంట్ ఆవరణలో బడ్జెట్ పత్రాలు, డాగ్‌స్క్వాడ్ తనిఖీలు
సాక్షి, న్యూఢిల్లీ : వార్షిక బడ్జెట్ 2018-19 పత్రాలు పార్లమెంట్‌కు వచ్చాయి. గురువారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. నేటి ఉదయమే బడ్జెట్ సూట్‌కేసుతో ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకున్న జైట్లీ.. అక్కడి నుంచి నేరుగా రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి ప్రధమ పౌరుడు రామ్‌నాథ్ కోవింద్‌ను కలుసుకున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఇది ఆనవాయితీగా వస్తున్నది. ఈ మర్యాదపూర్వక భేటీకి జైట్లీతో పాటు ఆర్థిక శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా వచ్చారు.
కేబినెట్ భేటీ.. బడ్జెట్‌కు ఆమోదం : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం ఉదయం కేంద్ర కేబినెట్ ప్రత్యేకంగా భేటీ అయింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉదయం 11 గంటలకు ఉభయసభలు ప్రారంభంకానున్నాయి.
వరాలు.. తాయిలాలు! : వచ్చేఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనుండటంతో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టే పూర్తిస్థాయి చివరి బడ్జెట్ ఇదే కావడం గమనార్హం. అటు సార్వత్రిక ఎన్నికలు, మరి కొద్ది రోజుల్లో 8 రాష్ట్రాల్లోజరుగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా అన్ని వర్గాలనూ మెప్పించే రీతిలో బడ్జెట్‌ను రూపకల్పన చేసినట్లు తెలిసింది. ప్రధానంగా వ్యయసాయ రంగానికి ఊతమిచ్చేలా, వేతన జీవులపై భారాన్ని తగ్గించేలా బడ్జెట్ ఉండబోతున్నది. ద్రవ్యలోటు కట్టడి చేయడం కూడా ప్రభుత్వ ప్రాధామ్యాల్లో కీలకం కానుంది.
ప్రెసిడెంట్ కోవింద్‌తో ఫైనాన్స్ మినిస్టర్ భేటీ
Comments
Please login to add a commentAdd a comment