President Ram Nath Kovind
-
ఇది భారత శతాబ్దం
న్యూఢిల్లీ: మూలాలను మర్చిపోరాదని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దేశ యువతను కోరారు. ప్రకృతి మాత తీవ్ర వేదన చెందుతోందని, వాతావరణ సంక్షోభంతో పుడమి భవిష్యత్ ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. పదవీ విరమణ చేయనున్న కోవింద్ ఆదివారం జాతి నుద్దేశించి వీడ్కోలు ప్రసంగం చేశారు. 21వ శతాబ్దాన్ని ‘భారత శతాబ్దం’గా మార్చడానికి దేశం సన్నద్ధమవుతోందని అన్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్యతోపాటు ఆర్థిక సంస్కరణలు పౌరులు తమ సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు, ఆనందంగా ఉండేందుకు సాయపడతాయన్నారు. ‘కోవిడ్ మహమ్మారి దేశ ఆరోగ్య సంరక్షణ మౌలిక వనరులను మెరుగుపర్చుకోవాల్సిన అవసరాన్ని కల్పించింది. ప్రభుత్వం కూడా ఈ రంగానికి ప్రాధాన్యం ఇవ్వడం సంతోషకరం. అదేవిధంగా, యువజనులు తమ ఘనమైన వారసత్వాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లడానికి జాతీయ విద్యా విధానం దోహదపడుతుంది. యువ త మూలాలను మరువరాదు’ అని కోరారు. ‘మన పిల్లల కోసం దైనందిన జీవితంలో అవకాశమున్నంత మేర చెట్లు, నదులు, సముద్రాలు, పర్వతాలు, ఇతర జీవరాశుల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రథమ పౌరుడిగా, నా తోటి పౌరులకు ఒక సలహా ఇవ్వవలసి వస్తే అది ఇదే అయి ఉంటుంది’ అని కోవింద్ అన్నారు. ‘ఒక పూరింట్లో నివసించే ఒక చిన్న పిల్లాడికి దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి గురించి ఎలాంటి అవగాహన ఉండదు. కానీ, మన ఉమ్మడి విధి రూపకల్పనలో ప్రతి పౌరుడు పాలుపంచుకునేలా మార్గాలను సృష్టించడమే దేశ ప్రజాస్వామ్య శక్తికి నిదర్శనం’ అని చెప్పారు. పరూంఖ్ గ్రామానికి చెందిన కోవింద్ ఈ రోజు మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించడం ప్రజాస్వామ్య వ్యవస్థల శక్తికి నిదర్శనమన్నారు. విధి నిర్వహణలో తనకు సమాజంలోని అన్ని వర్గాల సహకారం, మద్దతు, ఆశీస్సులు లభించాయని చెప్పారు. డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ ఎస్.రాధాకృష్ణన్, డాక్టర్ అబ్దుల్ కలాం వంటి మహామహుల వారసుడిననే స్పృహతో శాయశక్తులా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాను’ అని తెలిపారు. రాష్ట్రపతి కోవింద్ కాబోయే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆదివారం విందు ఇచ్చారు. విందులో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, పలువరు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. -
స్వార్థ రాజకీయాలొద్దు
న్యూఢిల్లీ/న్యూఢిల్లీ: పార్లమెంట్ సభ్యులు జాతి ప్రయోజనాలే పరమావధిగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. శనివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన సమావేశంలో ఆయన వీడ్కోలు ప్రసంగం చేశారు. ప్రజలు శాంతి, సామరస్యంతో మెలగాలన్నారు. ‘‘ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించే హక్కు ప్రజలకుంది. కానీ అందుకు గాంధేయ మార్గాన్నే అనుసరించాలి. నేనెల్లప్పుడూ ఎంపీలతో కూడిన పెద్ద కుటుంబంలో సభ్యుడిననే భావించుకున్నాను. కుటుంబంలోలానే పార్లమెంట్‌లోనూ విభేదాలు తలెత్తుతుంటాయి. ఒక్కో పార్టీకి ఒక్కో అభిప్రాయముండొచ్చు. జాతి ప్రయోజనాలే పరమావధిగా పని చేయాలి’’ అన్నారు. రాష్ట్రపతిగా సేవ చేసే అవకాశం కల్పించిన దేశ ప్రజలకు కృతజ్ఞుడినై ఉంటానన్నారు. రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదీ ముర్ముకు అభినందనలు తెలిపారు. ‘‘విధి నిర్వహణలో నాకు సహకరించిన ప్రధాని మోదీకి, కేంద్రమంత్రులు, ఎంపీలకు కృతజ్ఞతలు. పార్లమెంట్ కార్యక్రమాలను సజావుగా నిర్వహించి ఘన సంప్రదాయాలను కొనసాగించిన రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కూడా కృతజ్ఞతలు’’ అన్నారు. రాష్ట్రపతి ఆదివారం జాతినుద్దేశించి తుది ప్రసంగం చేయనున్నారు. కార్యక్రమంలో వెంకయ్యనాయుడు, మోదీ, ఓం బిర్లా, మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. వెంకయ్య వీడ్కోలు విందు రాష్ట్రపతికి వెంకయ్య తన నివాసంలో వీడ్కోలు విందు ఇచ్చారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన కోవింద్ దంపతులను వెంకయ్య దంపతులు సాదరంగా ఆహ్వానించారు. విందులో తెలుగు వంటకాలు వడ్డించారు. విందు ఇచ్చారు. రాష్ట్రపతిగా కోవింద్‌హుందాగా బాధ్యతలు నిర్వహించారని వెంకయ్య కొనియాడారు. కోవింద్ జీవితం ఆదర్శనీయమైందని, ఆయన ఆలోచనలు, ప్రసంగాల నుంచి యువత ఎంతో నేర్చుకోవాలని అన్నారు. న్యాయవాది నుంచి రాష్ట్రపతి దాకా... దేశ 14వ రాష్ట్రపతిగా ఐదేళ్లపాటు సేవలందించిన రామ్‌నాథ్ కోవింద్ సాధారణ న్యాయవాదిగా జీవితం ఆరంభించారు. నిరంతర శ్రమ, పట్టుదల, అంకితభావంతో పార్లమెంట్ సభ్యుడిగా, గవర్నర్‌గా సేవలందించి అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. 2017 జూలై 25న రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీ కాలం ఆదివారంతో ముగియనుంది. కోవింద్ 1945 అక్టోబర్ 1న ఉత్తరప్రదేశ్ కాన్పూర్ జిల్లా పరౌంఖ్ గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు. 1971లో ఢిల్లీ బార్ కౌన్సిల్లో అడ్వొకేట్‌గా నమోదు చేసుకున్నారు. 1978లో సుప్రీంకోర్టులో అడ్వొకేట్–ఆన్–రికార్డుగా ఎంపికయ్యారు. 1980 నుంచి 1993 దాకా సుప్రీంకోర్టులో కేంద్రం తరఫు న్యాయవాదిగా పనిచేశారు. అణగారిన వర్గాలకు, ప్రధానంగా మహిళలు, పేదలకు ఉచితంగా న్యాయ సేవలందించారు. బీజేపీలో చేరి పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1994 నుంచి 2006 దాకా రెండుసార్లు యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2015లో బిహార్ గవర్నర్‌గా నియమితులయ్యారు. బిహార్ విశ్వవిద్యాలయాల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. 2017లో అధికార ఎన్డీయే తరఫున రాష్ట్రపతిగా ఘన విజయం సాధించారు. కె.ఆర్.నారాయణన్ తర్వాత రాష్ట్రపతి అయిన రెండో దళితుడు కోవింద్. పుస్తక పఠనమంటే ఆయనకు విపరీతమైన ఇష్టం. సామాజిక సాధికారతకు విద్యే ఆయుధమని చెబుతుంటారు. దివ్యాంగులు, అనాథలకు సమాజంలో మరిన్ని అవకాశాలు కల్పించాలని సూచిస్తుంటారు. రాష్ట్రపతి హోదాలో కోవింద్ 33 దేశాల్లో పర్యటించారు. సైనిక దళాల సుప్రీం కమాండర్‌గా 2018 మేలో సియాచిన్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధ క్షేత్రమైన కుమార్ పోస్టును కూడా ఆయన సందర్శించారు. -
రాష్ట్రపతికి ప్రధాని వీడ్కోలు విందు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వీడ్కోలు విందు ఇచ్చారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముతోపాటు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పద్మ అవార్డు గ్రహీత మొగిలయ్య, గిరిజన నేతలు పాల్గొన్నారు. హోటల్ అశోకాలో జరిగిన ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ చౌధురితోపాటు 18 పార్టీల నేతలు కూడా ఉన్నారు. రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం సోమవారంతో ముగియనుంది. -
మెడికల్ టూరిజం హబ్‌గా భారత్
భోపాల్: ప్రపంచదేశాల్లో భారత్‌లోనే తక్కువ ధరకి వైద్య చికిత్స లభిస్తోందని, అందుకే, ఇరుగు పొరుగు దేశాల వారు మన దేశంలో చికిత్స చేయించుకోవడానికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. భారత్‌లో మెడికల్ టూరిజం శరవేగంగా విస్తరిస్తోందన్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో శనివారం ఆరెస్సెస్ మద్దతు సంస్థ ఆరోగ్య భారతి ఒకే దేశం–ఒకే ఆరోగ్య వ్యవస్థ అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సుని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే మన దేశంలో ఆస్పత్రుల్లోనే చవగ్గా వైద్య చికిత్స చేస్తున్నారని చెప్పారు. ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందే రోగుల్లో స్థానికుల కంటే విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య ఎక్కువ ఉందని చెప్పారు. కరోనా సంక్షోభ సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడడానికి త్వరితగతిన వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చిన శాస్త్రవేత్తలు, వైద్యుల కృషిని రాష్ట్రపతి ప్రశంసించారు. ఇటీవల తాను పర్యటించిన దేశాల్లో నాయకులందరూ భారత్ వైద్య రంగం పట్ల ఎక్కువ ఆసక్తిని ప్రదర్శించారని, వివరాలు అడిగి తెలుసుకున్నారని వెల్లడించారు. మన దేశంలో అత్యంత సులభంగా వైద్య చికిత్సలు అందుబాటులో ఉండడంతో మెడికల్ టూరిజం హబ్‌గా మారుతోందని అన్నారు. -
విశాఖలో రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూ (ఫోటోలు)
-
రాష్ట్రపతి కోవింద్ కు స్వాగతం పలికిన సీఎం వైఎస్ జగన్
-
రాష్ట్రపతి కోవింద్ కు ఘన స్వాగతం పలకనున్న సీఎం జగన్
-
విశాఖకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
-
విశాఖకు సీఎం జగన్
-
బాపూజీకి జాతి నివాళి
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా రాజ్‌ఘాట్‌లో జాతిపితకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతిపిత ఆలోచనలను ప్రాచుర్యంలోకి తీసుకురావడం మన బాధ్యత అని ప్రధాని ట్వీట్ చేశారు. అమరజవాన్ల దినోత్సవం సందర్భంగా దేశం రక్షణ కోసం వీరోచితంగా పోరాడిన అమర సైనికులకు శ్రద్ధాంజలి ఘటించారు. వారి సేవ, ధైర్యసాహసాలు మరువలేనివని ప్రధాని కొనియాడారు. అహ్మదాబాద్: మహాత్మాగాంధీ ‘స్వదేశీ’ ఉద్యమానికి అసలైన నిర్వచనం.. తమ ప్రభుత్వం కార్యక్రమాలైన మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. స్వాతంత్య్రం తరువాత భారత్‌ను పునర్నిర్మించాలన్న ఆయన ఆలోచన ఏళ్లపాటు పక్కన పెట్టారని, తాము అధికారంలోకి వచ్చాక దాన్ని అమల్లోకి తెచ్చామని అన్నారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా అహ్మదాబాద్‌లోని సబర్మతి నదీతీరాన ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) ఏర్పాటు చేసిన కుడ్య చిత్రాన్ని ఆయన ఆదివారం ఆవిష్కరించారు. ఈ కుడ్యచిత్రం బాపూజీకి నిజమైన నివాళి అని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ రాణే, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తెలిపారు. నిజం బతికున్నంత కాలం గాంధీ సజీవం మహాత్మాగాంధీ లేరని హిందుత్వ వాదులు భావిస్తున్నారని, కానీ సత్యం బతికున్నంత కాలం జాతిపిత సజీవంగా ఉంటారని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ అన్నారు. బాపూజీ 74వ వర్ధంతి సందర్భంగా ట్విట్టర్లో ‘ఫరెవర్ గాంధీ’ హ్యాష్‌ట్యాగ్‌తో నివాళులర్పించారు. రాజ్‌ఘాట్ దగ్గరా రాహుల్ ఆదివారం జాతిపితకు అంజలి ఘటించారు. హిందుత్వవాదీ అయిన గాడ్సే మహాత్ముడిని కాల్చి చంపాడని ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘‘నేను నిరాశకు గురైనప్పుడు... సత్యం, ప్రేమ మాత్రమే గెలుస్తుందన్న చరిత్రను గుర్తు చేసుకుంటాను. కొంతకాలం పాటు అది కనిపించకుండా ఉండొచ్చు... హంతకులు, నిరంకుశులు మాత్రమే ఉండొచ్చు. కానీ చివరికి వాళ్లు ఓడిపోతారు. అది నిత్యం మనసులో ఉంచుకోండి’’ అన్న మహాత్ముడి కోట్ని రాహుల్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా మహాత్మాగాంధీకి ట్విట్టర్లో నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ తన అధికార ట్విట్టర్ ఖాతాలో మహాత్ముడికి ఘన నివాళులర్పించింది. కాళీచరణ్‌కు ‘గాడ్సే భారత రత్న’ రాయ్‌పూర్‌లో జరిగిన ధర్మసంసద్‌లో మహాత్ముడిని కించపరిచే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో గత డిసెంబర్లో అరెస్టయి, గ్వాలియర్ జైల్లో ఉన్న మత నాయకుడు కాళీచరణ్ మహారాజ్‌కు, మరో నలుగురు హిందూ మహాసభ నేతలకు ‘గాడ్సే–ఆప్టే భారతరత్న’ అవార్డును ప్రదానం చేసింది. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా హిందూమహాసభ జాతిపితను హత్య చేసిన నాథురామ్ గాడ్సేకి నివాళులర్పించింది. గాంధీ హత్యకేసులో గాడ్సే సహనిందితుడు అయిన నారాయణ ఆప్టేకు నివాళిగా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఆదివారం ‘గాడ్సే–ఆప్టే స్మృతి దివస్’ను నిర్వహించింది. 1948 జనవరి 30న గాడ్సే, ఆప్టేల అరెస్టుకు వ్యతిరేకంగా ‘గాడ్సే–ఆప్టే స్మృతి దివస్’ నిర్వహిస్తున్నామని హిందూ మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు జైవీర్ భరద్వాజ్ తెలిపారు. మహాత్మాగాంధీకి జాతిపిత ఇవ్వడమేంటని మీరట్‌లోని హిందూ మహాసభ నేతలు ప్రశ్నించారు. -
బంగ్లాలో భారత రాష్ట్రపతికి ఘనస్వాగతం
ఢాకా: బంగ్లాదేశ్ స్వతంత్య్ర స్వర్ణోత్సవాల్లో పాల్గొనేందుకు ఢాకా వచ్చిన భారత రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌కు బుధవారం ఘనస్వాగతం లభించింది. మూడురోజుల ఈ పర్యటనలో ఆయన బంగ్లా ప్రెసిడెంట్‌తో చర్చలు జరపనున్నారు. రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌తో పాటు ఆయన సతీమణి, కూతురు, ఇతర అధికారులు బంగ్లా పర్యటనకు వచ్చారు. కోవింద్‌కు 21 తుపాకుల సెల్యూట్‌తో బంగ్లా ఆర్మీ స్వాగతం పలికింది. ఆ దేశ అధ్యక్షుడు సతీసమేతంగా విమానాశ్రయానికి వచ్చి కోవింద్‌కు ఆహా్వనం పలికారు. 1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లా విముక్తి పొందింది. చదవండి: మంత్రి మిశ్రా రాజీనామా ప్రసక్తే లేదు: బీజేపీ బంగ్లా విముక్తి యుద్ధంలో అసువులు బాసిన వీరులకు కోవింద్ నివాళులర్పించారు. అనంతరం ఆయన ముజిబుర్ రహ్మన్ మ్యూజియంను దర్శించారు. కోవిడ్ కల్లోలం తర్వాత రాష్ట్రపతి జరుపుతున్న తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం. డిసెంబర్ 16న కోవింద్ గౌరవార్ధం నేషనల్ పెరేడ్ గ్రౌండ్లో గెస్ట్ ఆఫ్ ఆనర్ నిర్వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని హసీనాతో రాష్ట్రపతి చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సహా పలు అంశాలను ఈ సందర్భంగా చర్చించారు. -
శీతకాల విడిది.. హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శీతకాల విడిది కోసం హైదరాబాద్ రానున్నారు. డిసెంబర్ మూడు లేదా నాలుగో వారంలో ఈ పర్యటన ఉండబోతోంది. బొల్లారంలో 90 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. నిరుడు కోవిడ్ కారణంగా రాష్ట్రపతి శీతాకాల విడిదికి రాలేదు. ఈ సారి రాష్ట్రపతి దక్షిణాది విడిదికి వస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్రపతిభవన్ వర్గాలు సమాచారం అందించారు. ఈ విడిదిలో భాగంగా నాలుగైదు రోజులపాటు ఇక్కడి రాష్ట్రపతి నిలయంలో విడిది చేస్తారు. -
పద్మ అవార్డుల ప్రదానం
-
మిశ్రాను పదవి నుంచి తప్పించండి
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో లఖీమ్‌పూర్ ఖేరి ఘటనకు బాధ్యుడిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని కోరింది. ఈ మేరకు రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రియాంకా గాంధీ, ఖర్గే, ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్ తదితరులతో కూడిన కాంగ్రెస్ బృందం బుధవారం రాష్ట్రపతి రామ్నా«థ్ కోవింద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. రాజ్యాంగ సంరక్షకుడిగా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థించింది. అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. లఖీమ్‌పూర్ ఘటనపై పూర్తి వివరాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ప్రధాన నిందితుడి తండ్రి కేంద్రంలో మంత్రిగా ఉండడం వల్ల దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగదని భావిస్తున్నామని అన్నారు. అందుకే సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జీలతో జ్యుడీషియల్ విచారణ జరిపించాలని కోరామని చెప్పారు. అజయ్ రాజీనామాతో బాధితులకు న్యాయం జరుగుతుందని రాహుల్ అన్నారు. ‘సెప్టెంబరు 27న నిరసన తెలుపుతున్న రైతులను అజయ్ మిశ్రా బహిరంగంగా బెదిరించారు. మంత్రే ఇలా రెచ్చగొడితే న్యాయం ఎలా లభిస్తుంది? ఘటనలో అజయ్ కొడుకు ఆశిష్ ఉన్నట్లు ప్రత్యక్ష సాక్ష్యాలున్నాయి’ అని వినతి పత్రంలో నేతలు పేర్కొన్నారు. ఆశిష్‌కు బెయిల్ నిరాకరణ లఖీమ్‌పూర్ ఖేరి: లఖీమ్‌పూర్ ఖేరి హింసాకాండ ఘటనలో ప్రధాన నిందితుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్‌కు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు బుధవారం నిరాకరించింది. ఈ కేసులో అంకిత్ దాస్, లతీఫ్ అలియాస్ కాలే అనే ఇద్దరు వ్యక్తులను సిట్ బుధవారం అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టింది. వారిని 14 రోజులపాటు జ్యుడీíÙయల్ రిమాండ్‌కు తరలిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య ఆరుకు చేరుకుంది. ఆశిష్ మిశ్రాతోపాటు అతడి సహచరుడు ఆశిష్ పాండేకు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయగా, చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ చింతా రామ్ తిరస్కరించారని సీనియర్ ప్రాసిక్యూషన్ ఆఫీసర్ ఎస్.పి.యాదవ్ చెప్పారు. -
ధిక్కారణాధికారాన్ని తొలగించలేరు!
న్యూఢిల్లీ: కోర్టులకు ఉండే ధిక్కార శిక్షాధికారాన్ని ఎలాంటి చట్టంతో తొలగించలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక ఎన్జీఓ చైర్‌పర్సన్‌ను కోర్టు ధిక్కారం కింద విచారిస్తూ గతంలో విధించిన రూ.25 లక్షల జరిమానాను చెల్లించకపోవడం ధిక్కరణేనని స్పష్టం చేసింది. ముద్దాయివి ధిక్కరణ చర్యలేనని, అలాంటి వాటిని శిక్షించకుండా కోర్టు వదిలేయదని జస్టిస్ సంజయ్ కిషన్‌తో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. సూరజ్ ట్రస్ట్ ఇండియా అనే సంస్థ అధిపతి రాజీవ్ దైయాపై కోర్టు ధిక్కార ఆరోపణలను సుప్రీం విచారించింది. గతంలో రాజీవ్ 64 ప్రజాప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేశారు. అయితే ఒక్కదాంట్లో కూడా విజయం సాధించలేదు. దీంతో రాజీవ్‌కు సుప్రీంకోర్టు రూ.25 లక్షల జరిమానాను 2017లో విధించింది. దీనిపై పునఃపరిశీలన జరపాలని రాజీవ్ తాజాగా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు రాజీవ్‌ది ధిక్కారమేనని తేలి్చచెప్పింది. రాజీవ్ కోర్టులపై బురద జల్లుతున్నాడని ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన కోర్టు ధిక్కారణాధికారం తమకు రాజ్యాంగం ఇచి్చందని తెలిపింది. రాష్ట్రపతితో జస్టిస్ ఎన్.వి. రమణ భేటీ సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ బుధవారం ఢిల్లీలో రాష్ట్రపతి రామ్నా«థ్ కోవింద్‌తో భేటీ అయ్యారు. శనివారం విజ్ఞాన్ భవన్లో న్యాయ సేవలపై అవగా హనా కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. ఈ సదస్సు వివరాలను జస్టిస్ ఎన్.వి.రమణ రాష్ట్రపతికి వివరించారు. -
రాముడు లేనిదే అయోధ్య లేదు
లక్నో/అయోధ్య: రాముడు లేనిదే అయోధ్య లేదని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతున్న ప్రాంతం రామ్ లల్లాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు ఆదివారం సందర్శించారు. పురోహితుల మంత్రోచ్ఛారణల మధ్య తాత్కాలిక మందిరం దగ్గర పూజలు నిర్వహించారు. ఆ ప్రాంతంలో ఒక మొక్కను నాటిన కోవింద్ అక్కడ పురోహితులతో కాసేపు మాట్లాడారు. 2019లో సుప్రీంకోర్టు అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి వీలుగా చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిన తర్వాత కోవింద్ అయోధ్యకు రావడం ఇదే మొదటిసారి. యూపీ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా చివరిరోజు కోవింద్ లక్నో నుంచి అయోధ్యకి రైలులో వచ్చారు. సాంస్కృతిక, పర్యాటక శాఖ చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రామాయణ ఘట్టాలతో కూడిన పోస్టల్ కవర్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాముడు లేని అయోధ్య అయోధ్యే కాదన్నారు. ‘‘రాముడు ఎక్కడుంటే అక్కడే అయోధ్య ఉంటుంది. ఈ నగరంలోని రాముడు శాశ్వతంగా ఉంటాడు’’అని కోవింద్ వ్యాఖ్యానించారు. రాముడు ఎప్పుడూ గిరిజనులపై వల్లమాలిన ప్రేమాభిమానాలు కురిపించారని రాష్ట్రపతి అన్నారు. -
ఐదేళ్ల జైలు.. కోటి జరిమానా
న్యూఢిల్లీ: ఢిల్లీ, పరిసర రాష్ట్రాల్లో వాయు కాలుష్యానికి కారణమయ్యే వారికి భారీగా జరిమానా, జైలుశిక్ష విధించేలా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీనిప్రకారం కాలుష్య కారకులకు ఏకంగా కోటి రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. గరిష్టంగా ఐదేళ్ల దాకా జైలు శిక్ష పడే ప్రమాదం కూడా ఉంది. ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్ బుధవారం సంతకం చేయడంతో వెంటనే అమల్లోకి వచ్చింది. ఆర్డినెన్స్‌ను కేంద్ర న్యాయ శాఖ గురువారం విడుదల చేసింది. దీని ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీ, హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ నిమిత్తం 22 ఏళ్ల క్రితం నాటి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అథారిటీ(ఈపీసీఏ)ని రద్దు చేసి, దాని స్థానంలో ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఈ కమిషన్‌లో 20 మందికిపైగా సభ్యులు ఉంటారు. ఆర్డినెన్స్ నియమ నిబంధనలను, ప్రత్యేక కమిషన్ ఆదేశాలను ఉల్లంఘిస్తే కోటి రూపాయల జరిమానా లేదా ఐదేళ్ల దాకా జైలు శిక్ష విధించవచ్చు. కమిషన్ చైర్మన్‌ను కేంద్ర పర్యావరణం, అటవీ శాఖ మంత్రి అధ్యక్షతన ఏర్పాటయ్యే కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ కమిటీలో రవాణా, వాణిజ్య, సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర శాఖల మంత్రులు, కేబినెట్ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఢిల్లీకి పొరుగున ఉన్న రాష్ట్రాల్లో ప్రతిఏటా పంట వ్యర్థాలను దహనం చేస్తుంటారు. దీనివల్ల ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. పంట వ్యర్థాల దహనాన్ని, తద్వారా వాయు కాలుష్యాన్ని అరికట్టాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయ్యింది. ఈ వ్యాజ్యంపై న్యాయస్థానం ఇటీవలే విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కమిషన్ ఏం చేస్తుందంటే.. ►ఏయే ప్రాంతాల్లో గాలి నాణ్యతను ఎంత స్థాయిలో ఉండాలో నిర్ధారించే అధికారం కమిషన్‌కు కట్టబెట్టారు. ►చట్టాన్ని ఉల్లంఘిస్తూ వాయు కాలుష్యానికి కారణమవుతున్న కంపెనీలు/ప్లాంట్లను కమిషన్ తనిఖీ చేస్తుంది. ►అలాంటి కంపెనీలు/ప్లాంట్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేస్తుంది. ►కమిషన్ తనంతట తానుగా(సుమోటో) లేదా ఫిర్యాదుల ఆధారంగా ఆదేశాలు జారీ చేస్తుంది. ►కమిషన్ తన వార్షిక నివేదికలను నేరుగా పార్లమెంట్‌కు సమర్పిస్తుంది. ►కమిషన్ ఆదేశాలను సివిల్ కోర్టుల్లో సవాలు చేసేందుకు వీల్లేదు. జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో సవాలు చేయొచ్చు. -
వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో రైతుల ఆందోళనలకు కారణమైన వ్యవసాయ బిల్లులు చట్టరూపం దాల్చాయి. ఆదివారం విడుదలైన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మూడు బిల్లులను ఆమోదించారు. అవి.. రైతు ఉత్పత్తుల వాణిజ్యం, వ్యాపారం (ప్రోత్సాహం, వసతుల కల్పన) బిల్లు–2020, రైతు(సాధికారత, రక్షణ) ధరల హామీ, వ్యవసాయ సేవల బిల్లు–2020, నిత్యావసరాల(సవరణ) బిల్లు–2020. వీటిలో.. రైతు ఉత్పత్తుల వాణిజ్యం, వ్యాపారం (ప్రోత్సాహం, వసతుల కల్పన) బిల్లు అమల్లోకి వస్తే రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను రాష్ట్రాల ఆధీనంలోని మండీలకు వెలుపల విక్రయించుకునే వెసులుబాటు ఉంటుంది. అదేవిధంగా, రైతు(సాధికారత, రక్షణ) ధరల హామీ, వ్యవసాయ సేవల చట్టంతో కాంట్రాక్టు వ్యవసాయానికి దారులు తెరుచుకుం టాయి. మూడోది.. నిత్యావసరాల(సవరణ) బిల్లు. దీని ద్వారా బంగాళా దుంపలు, ఉల్లిగడ్డలు, వంటనూనెలు, చిరుధాన్యాల సరఫరా, ఉత్పత్తి, పంపిణీపై నియంత్రణలు తొలిగిపోతాయి. ఈ బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సమయంలో కూడా ప్రతిపక్షం నిరసనలు తెలిపింది. ఈ బిల్లులను నిరసిస్తూ అధికార ఎన్డీఏ నుంచి శిరోమణి అకాలీదళ్ పార్టీ బయటకు వచ్చింది. కశ్మీరీ, డోంగ్రీ, హిందీ.. జమ్మూకశ్మీర్‌లో ఉర్దూ, ఇంగ్లిష్‌తోపాటు కశ్మీరీ, డోంగ్రీ, హిందీలకు అధికార భాషల హోదా కల్పించే బిల్లును కూడా రాష్ట్రపతి కోవింద్ ఆమోదించారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలయింది. జమ్మూకశ్మీర్ అధికార భాషల బిల్లు–2020ను ఇటీవలి వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ ఆమోదించింది. బీజేపీని నిలదీయండి: కాంగ్రెస్ వ్యవసాయ రంగం, రైతుల పాలిట కేన్సర్‌లా మారిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించాలనీ, ఈ విషయంలో ఎన్డీఏను వీడి బయటకు రావాలని జేడీయూ, ఎల్జేపీ, జేజేపీ పార్టీలను కాంగ్రెస్ కోరింది. ఇలా ఉండగా, వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్‌లో రైతుల ఆందోళనలు ఆదివారం కూడా కొనసాగాయి. అమృత్సర్– ఢిల్లీ మార్గంలో రైలు పట్టాలపై కూర్చుని నిరసన తెలిపారు. కిసాన్ మజ్దూర్ సంఘర్‡్ష కమిటీ నేతృత్వంలో రైతులు బుధవారం నుంచి రైలు రోకోలు జరుపుతున్న విషయం తెలిసిందే. -
తీరని అవమానం.. గోల్డ్‌మెడల్ నాకొద్దు!
-
తీరని అవమానం.. గోల్డ్‌మెడల్ నాకొద్దు!
పుదుచ్చేరి విశ్వవిద్యాలయంలో బంగారు పతక విజేత రుబీహాకు చేదు అనుభవం ఎందురైంది. 2018 మాస్ కమ్యూనికేషన్ (ఎంఏ) విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన రుబీహా కాన్వొకేషన్ కార్యక్రమానికి వెళ్లారు. కార్యక్రమానికి హాజరైన రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ వేదిక నుంచి వెళ్లేంత వరకు తనను తిరిగి హాల్లోకి అనుమతించలేదని రుబీహా ఆరోపించారు. రాష్ట్రపతి విశ్వవిద్యాలయం నుండి బయలుదేరే వరకు దాదాపు 20 నిమిషాలు బయటనే వేచి ఉండాల్సి వచ్చిందని వాపోయారు. స్నాతకోత్సవం ముగిసిన తరువాత ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి వచ్చినప్పుడు, తను హాలు నుంచి బయటికి (బలవంతం చేయనప్పటికీ) రావాలని కోరారని తెలిపారు. ఇది తనకు తీరని అవమానమని కేరళకు చెందిన రుబీహా కంట తడి పెట్టారు. సీఏఏకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయవచ్చనే అనుమానంతోనే తనను కాన్వొకేషన్ హాల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారన్నారు. దీనికి నిరసనగా తన సర్టిఫికెట్‌ను మాత్రమే తీసుకుని, గోల్డ్‌మెడల్‌ను తిరస్కరిస్తున్నట్టు వెల్లడించారు. అంతేకాదు, దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీకి, సీఏఏకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రతీ ఒక్కరికీ సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల దారుణానికి వ్యతిరేకంగా తన బంగారు పతకాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తున్నట్టు చెప్పారు. దీనిపై విద్యావంతులైన యువతగా తాము బలమైన వైఖరి తీసుకోవాలన్నారు. అయితే ఈ ఆరోపణలను విశ్వవిద్యాలయ అధికారులు ఖండించారు. కాగా, విశ్వవిద్యాలయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ర్యాలీలలో రుబీహా క్రమం తప్పకుండా పాల్గొనేవారని తెలుస్తోంది. ముఖ్యంగా గతంలో బీజేపీ నాయకుడు తరుణ్ విజయ్ క్యాంపస్ పర్యటనకు వ్యతిరేకంగా ఆమె నిరసనలకు నాయకత్వం వహించినట్టుగా సమాచారం. మరోవైపు బంగారు పతకాలను గెల్చుకున్న ఇతర విద్యార్థులు ఈ సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించారట. ఇందులో భాగంగా కొంతమంది కేవలం సర్టిఫికెట్లను మాత్రమే స్వీకరించారు. -
ఎన్ఆర్సీ అంటే ఏమిటి.. నష్టం ఎవరికి?
న్యూఢిల్లీ: పౌరసత్వ చట్ట సవరణ బిల్లు కాస్తా పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టమైంది మొదలు.. దేశవ్యాప్త ఎన్ఆర్సీపై ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే ఈ అంశంపై తన వైఖరిని స్పష్టం చేయగా, ప్రతిపక్షాలు సైతం ఈ అంశంపై పోరుకు సన్నద్ధమవుతున్నాయి. ఎన్ఆర్సీ అంటే..? జాతీయ స్థాయిలో అర్హులైన పౌరులదరితో కూడిన జాబితాను నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్.. క్లుప్తంగా ఎన్ఆర్సీ అంటారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అక్రమ వలసదారుల ఏరివేత కోసం ఇటీవలే ఈ ఎన్ఆర్సీ ప్రక్రియను ఈశాన్య రాష్ట్రం అస్సాంలో పూర్తి చేశారు కూడా. ప్రత్యేక జాతులపై ప్రభావం పడరాదన్న ఉద్దేశంతో ఈ ప్రక్రియను అస్సాంలో చేపట్టారు. అయితే అక్కడ ఎన్ఆర్సీ పూర్తయినప్పటి నుంచి జాతీయ స్థాయిలో అమలుకు డిమాండ్లు పెరుగుతున్నాయి. హోం మంత్రి అమిత్ షాతోపాటు బీజేపీ అగ్రనేతలు పలువురు ఇందుకు బహిరంగంగానే మద్దతిచ్చారు. ఈ మేరకు జాతీయ స్థాయిలో ఓ చట్టం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నట్లు అంచనా. దేశవ్యాప్త ఎన్ఆర్సీ చట్టం అమల్లోకి వస్తే.. ప్రభుత్వం ఈ దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని గుర్తించడంతోపాటు అదుపులోకి తీసుకునేందుకు అవకాశముం టుంది. వారిని స్వదేశాలకు తిప్పి పంపేందుకూ అధికారాలు లభిస్తాయి. నష్టం ఎవరికి? ప్రస్తుతానికి ఎన్ఆర్సీ చట్టం అనేది ఓ ప్రతిపాదన మాత్రమే. అమల్లోకి వస్తే అక్రమ వలసదారులే లక్ష్యంగా మారతారు. అయితే అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చిన హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైన్, పార్శీలకు పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు. మతపరమైన హింసను స్వదేశాల్లో ఎదుర్కొన్నందుకే ఇక్కడకు వచ్చామని వారు చెప్పుకుంటే సరిపోతుంది. ఇంకోలా చెప్పాలంటే ఎన్ఆర్సీ దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తే పైన చెప్పుకున్న మూడు దేశాలు మినహా మిగిలిన ఏ దేశపు అక్రమ వలసదారు కూడా ఇక్కడ ఉండేందుకు అవకాశం ఉండదు. అంతేకాకుండా.. ఈ దేశాల నుంచి వచ్చిన ముస్లింలూ చిక్కుల్లో పడతారు. ఎందుకంటే వీరు పౌరసత్వ చట్ట సవరణ నిబంధనల్లో లేరు కాబట్టి. దీంతో వీరందరినీ అదుపులోకి తీసుకుని డిటెన్షన్ కేంద్రాలకు తరలించాల్సి వస్తుంది. అస్సాంలో ఇప్పటికే గుర్తించిన 19 లక్షల మంది అక్రమ వలసదారులను ఇలాగే డిటెన్షన్ కేంద్రాల్లోనే ఉంచారు. దేశవ్యాప్తంగా అక్రమ వలసదారులను ఇలా డిటెన్షన్ కేంద్రాలకు తరలించిన తరువాత విదేశీ వ్యవహారాల శాఖ ఆయా దేశాలకు సమాచారం ఇస్తుంది. ఆయా దేశాలు అంగీకరిస్తే వారిని తిప్పి పంపుతారు. దేశవ్యాప్త ఎన్ఆర్సీకి కట్టుబడి ఉన్నామని అమిత్ షా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లు ప్రవేశపెడతారా? అన్నది ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశం అవుతోంది. ఎన్ఆర్సీపై ప్రశాంత్ కిషోర్ భగ్గు! అక్రమ వలసదారులను గుర్తించేందుకు దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ నిర్వహిస్తామన్న అధికార బీజేపీ ప్రకటనలపై ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ భగ్గుమంటున్నారు. ఈ చర్య పెద్దనోట్ల రద్దు మాదిరిగానే పేదలు, దిగువ తరగతి వారికి తీవ్ర నష్టం చేయనుందని ఆయన ట్వీట్ చేశారు. -
శ్రీవారి సేవలో రాష్ట్రపతి
తిరుమల: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సతీమణి సవితా కోవింద్, కుమార్తె స్వాతి, కుటుంబ సభ్యులతో కలసి విశ్రాంతి భవనం నుంచి కోవింద్ ఉదయం 6 గంటలకు ఆలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం శ్రీవారి పుష్కరిణిని దర్శించారు. క్షేత్ర సంప్రదాయం ప్రకారం భూ వరాహస్వామివారిని దర్శించుకున్న అనంతరం మహద్వారం వద్ద టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి, అర్చకులతో కలసి రాష్ట్రపతికి ఇస్తికఫాల్ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి ఆలయంలోకి ప్రవేశించిన రాష్ట్రపతి తొలుత ధ్వజస్తంభానికి నమస్కరించారు. అనంతరం సన్నిధిలో పచ్చ కర్పూరపు వెలుగులో శ్రీవేంకటేశ్వర స్వామివారి దివ్య మంగళరూపాన్ని దర్శించుకున్నారు. స్వామివారి పాదాల వద్ద ఉంచిన పట్టుశేషవస్త్రాన్ని ఆలయ ప్రధాన అర్చకులు రాష్ట్రపతికి బహూకరించారు. తర్వాత వకుళమాతను దర్శించుకుని, హుండీలో కానుకలు సమర్పించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు రాష్ట్రపతికి ఆశీర్వాదం చేయగా, టీటీడీ చైర్మన్, ఈవో, ప్రత్యేకాధికారి.. శ్రీవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు ఆయనకు అందజేశారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్ నరసింహన్ దంపతులు కూడా శ్రీవారిని దర్శించుకుని, ప్రసాదాలు స్వీకరించారు. రాష్ట్రపతితో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, టీటీడీ సీవీఎస్ఓ గోపీనాథ్‌జెట్టి ఉన్నారు. -
ఫోన్లో చూస్తూ బిజీ బిజీగా రాహుల్!
న్యూఢిల్లీ: పార్లమెంటులో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరు.. వివాదాస్పదం అయ్యే అవకాశం కనిపిస్తోంది. నవభారతం నిర్మాణం దిశగా ముందడుగు వేద్దామంటూ.. భవిష్యత్తు పట్ల ఆశావాదం, దృఢ సంకల్పంతో సాగుదామని గురువారం పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. రాష్ట్రపతి సీరియస్‌గా ప్రసంగిస్తున్న సమయంలో రాహుల్ తన సెల్ఫోన్లో చూస్తూ బిజీబిజీగా గడిపినట్టు తెలుస్తోంది. రాహుల్ పక్కన కూర్చున్న యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీతోపాటు మొదటి వరుసలో కూర్చున్న ప్రధాని మోదీ, ఇతర సభ్యులు శ్రద్ధగా రాష్ట్రపతి ప్రసంగాన్ని ఆలంకించారు. అయితే రాహుల్ మాత్రం తన సెల్ఫోన్లో ఏదో చూస్తున్నట్టు కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీజేపీ కిసాన్ మోర్చా తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలోనూ రాహుల్ ఫోన్లో బిజీగా గడిపారని కామెంట్ చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైన నేపథ్యంలో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటానని, తన తదుపరి అధ్యక్షుడు ఎవరు అన్నది పార్టీ నిర్ణయిస్తుందని రాహుల్ తాజాగా పేర్కొన్న సంగతి తెలిసిందే. -
శతాబ్దానికొక్క అవకాశం!
న్యూఢిల్లీ: ఓటు హక్కు వినియోగించుకోవడం పవిత్ర కార్యం, శతాబ్దంలో ఒక్కసారి మాత్రమే దక్కే అరుదైన అవకాశంగా భావించండి అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశానికి ఇది పరీక్షా సమయమన్న రాష్ట్రపతి.. ఇప్పుడు వేసే ఓటు ఈ శతాబ్దంలో దేశం గతిని నిర్ణయిస్తుందన్నారు. పేదలకు రిజర్వేషన్ల కల్పన గాంధీ కలల సాకారం దిశగా పడిన అడుగుగా ఆయన అభివర్ణించారు. 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ‘వైవిధ్యం, ప్రజాస్వామ్యం, అభివృద్ధి అనే మూడు అంశాలపై ఆధారపడిన భిన్నత్వంలో ఏకత్వ భావనను స్వీకరించనిదే దేశాభివృద్ధి పరిపూర్ణం కాదు. ఈ దేశం మనది, మన అందరిదీ. మన వైవిధ్యం, ప్రజాస్వామ్యం, అభివృద్ధి ప్రపంచానికి ఆదర్శం. ఇవి విడదీయరానివి. ఈ మూడూ మనకు అత్యవసరం’ అని రాష్ట్రపతి అన్నారు. ఓటర్లకు విన్నపం మరో నాలుగు నెలల్లో జరగనున్న సాధారణ ఎన్నికలను ప్రస్తావిస్తూ ఆయన..‘21వ శతాబ్దంలో పుట్టిన పౌరులు మొదటి సారిగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లోక్‌సభ ఎన్నికల్లో దక్కనుంది. భారతీయుల ఆకాంక్షలకు, విభిన్నతకు నిదర్శనం ఈ ఎన్నికలు. అర్హులైన ఓటర్లందరికీ నా విన్నపం ఒక్కటే.. పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేయండి’ అని ప్రజలకు ముఖ్యంగా యువతకు పిలుపునిచ్చారు. ‘ఈ ఎన్నికలు తరానికి ఒక్కసారి వచ్చే ఎన్నికలు మాత్రమే కాదు..ఈ శతాబ్దానికి ఏకైక ఎన్నికలుగా భావించండి. ప్రజాస్వామ్య ఆదర్శాలు, ఆలోచనలను ఆచరణలోకి తెచ్చేవి ఈ ఎన్నికలు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రయాణంలో, దేశ అభివృద్ధిలో ఇవి ఒక మైలురాయి మాత్రమే’ అని అన్నారు. ప్రజలందరికీ సమాన అవకాశాలు ‘పేద కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రత్యేక సౌకర్యం కల్పించేందుకు ఇటీవల చేపట్టిన రాజ్యాంగ సవరణ గాంధీజీ కలలు, భారతీయుల కలల సాకారం వైపునకు పడిన మరో అడుగు’ అని అన్నారు. ప్రతి చిన్నారి, ప్రతి మహిళకు సమాన అవకాశాలు, సమాన పరిస్థితులు కల్పించడమే మన సమాజం లింగ సమానత్వం సాధించిందనేందుకు సరైన సూచిక’ అని తెలిపారు. మన రాజ్యాంగానికి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు గౌరవసూచికగా ఈ ఏడాది దేశం ఘనంగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకోనుంది’ అని పేర్కొన్నారు. -
సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం
మెడికల్ టూరిజంలో మన దేశం ప్రత్యేకమైన అభివృద్ధి సాధిస్తోంది. అయినప్పటికీ చిన్నారుల్లో తలసేమియా వ్యాధి బాధిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ తరహా వైద్యసేవలు అందుబాటులోకి రావాలి. పిల్లల్లో రక్తహీనతను తగ్గించడానికి ప్రభుత్వాలు, డాక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. సాక్షిప్రతినిధి, కరీంనగర్: వైద్యరంగంలో మన దేశం ఎంతో అభివృద్ధి సాధిస్తోందని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు. సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా భారత్ ముందుకు సాగుతోందన్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 23న కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం ప్రజలకు ఒక వరమని అన్నారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఆరు లక్షల మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్సలు పొందారన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.800 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. కరీంనగర్ మండలం నగునూరులోని ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్ (పిమ్స్)లో శనివారం సికిల్‌సెల్, తలసేమియా చికిత్స కేంద్రాన్ని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రారంభించారు. వైద్య విద్యలో అత్యంత ప్రతిభ చూపిన ఐదుగురు మెడికోలకు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రతిమ ఆడిటోయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మెడికోలు, వైద్యులను ఉద్దేశించి ప్రసంగించారు. మెడికల్ టూరిజంలో మన దేశం ప్రత్యేకమైన అభివృద్ధి సాధిస్తోందన్నారు. అయినప్పటికీ చిన్నారుల్లో తలసేమియా వ్యాధి బాధిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ తరహా వైద్య సేవలు అందుబాటులోకి రావాలన్నారు. పిల్లల్లో రక్తహీనతను తగ్గించడానికి ప్రభుత్వాలు, డాక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రక్తదానంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలన్నారు. దేశంలో పోలియో, స్మాల్ఫాక్స్ వ్యాధులను విజయవంతంగా నిర్మూలించామని, అదే తరహాలో తలసేమియా వ్యాధి నిర్మూలనకు ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. వైద్య విద్యలో బాలబాలికల నిష్పత్తి పెరగడం సంతోషకర పరిణామమని అన్నారు. చారిత్రాత్మక నేపథ్యం గల కరీంనగర్‌కు రావడం ఇదే ప్రథమని, ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు. ఒకప్పుడు ఒక్కరే.. ఇప్పుడు మూడు, నాలుగు కోట్ల మంది : మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్‌రావు తలసేమియా దేశాన్ని కంగదీసే వ్యాధి అని మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు అన్నారు. 1938లో దేశంలో ఒక్కకేసే నమోదైతే... ఇప్పుడా సంఖ్య మూడు నుంచి నాలుగు కోట్లకు చేరిందన్నారు. కేరళలోని ఆదివాసీలలో తలసేమియా అధికంగా ఉందన్నారు. తలసేమియా విషయంలో భారతావని అప్రమత్తం కావాలన్నారు. తలసేమియా బాధితులకు రక్తమార్పిడి కోసం 2లక్షల యూనిట్లు అవసరమని తెలిపారు. బాధితులకు ఉచిత రక్తమార్పిడి చేసేందుకు ప్రయత్నించాలని కోరారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మేనరికం వల్ల మాత్రమే తలసేమియా వస్తుందనుకుంటే పొరపాటని, ఇప్పుడు అందరికీ సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. యువతీ యువకులు పెళ్లికి ముందు రక్తపరీక్షలు చేయించుకోవడం మంచిదన్నారు. అందరూ కృషి చేస్తేనే ఆరోగ్య తెలంగాణ: గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఒక మంచి ఆశయం, లక్ష్యంతో ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్రం ఆరోగ్య తెలంగాణగా మారాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆకాంక్షించారు. పట్టణ ప్రాంతాలకు తోడు గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో ఆరోగ్యంపై అవగాన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్య తెలంగాణ సాధించాలంటే గ్రామీణలం తా ఆరోగ్యంగా ఉండాలన్నారు. తలసేమియా, సికెల్‌సెల్ తదితర వ్యాధులపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలన్నారు. ఆర్యోగవంతమైన తెలంగాణ నిర్మాణం కోసం అందరి కృషి అవసరమన్నారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ, కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ప్రతిమ ఆసుపత్రి చైర్మన్ బోయినపల్లి శ్రీనివాస్‌రావు, కళాశాల ప్రొఫెసర్లు, వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంతకు మందు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, పోలీస్ కమిషనర్ వీబీ.కమలాసన్‌రెడ్డి హెలికాప్టర్లో వచ్చిన రాష్ట్రపతి, గవర్నర్లను హెలిప్యాడ్ వద్ద కలిసి స్వాగతం పలికారు.