రాష్ట్రపతికి ఓ కన్నతల్లి ఆవేదన
రాష్ట్రపతికి ఓ కన్నతల్లి ఆవేదన
Published Fri, Sep 15 2017 11:59 AM | Last Updated on Tue, Sep 19 2017 4:36 PM
సాక్షి, కాన్పూర్: ఏ తల్లి తన బిడ్డ చావును కోరుకోదు. కానీ, కళ్ల ముందే కన్న కొడుకు అనుభవిస్తున్న నరకాన్ని చూడలేక ఇక్కడ ఓ తల్లి మాత్రం అది నెరవేరాలని కోరుకుంటోంది. తన బిడ్డకు మరణం ప్రసాదించాలంటూ విజ్ఞప్తి చేస్తోంది.
ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన జానకీకి పదేళ్ల కొడుకు ఉన్నాడు. గత కొంత కాలంగా అతను చర్మ కేన్సర్‌తో బాధపడుతున్నాడు. చికిత్సకు చాలా డబ్బు ఖర్చవుతుందని వైద్యులు చెప్పటంతో.. నిరుపేద అయిన ఆమె అధికారులను ఆశ్రయించింది. జిల్లా కలెక్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దినేశ్ శర్మ, ఇలా అందిరిని కలిసి విన్నవించుకుంది. చివరకు ఎమ్మెల్యే నీలిమా కటియార్ స్పందించి.. మే నెలలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్‌కు ఓ లేఖ రాశారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బు ఇవ్వాలని కటియార్ విజ్ఞప్తి చేశారు.
అయినా సీఎం కార్యాలయం నుంచి ఎటువంటి స్పందన లేదు. చివరకు నిస్సహయక స్థితిలో తన కుమారుడికి మెర్సీ కిల్లింగ్ (కారుణ్య మరణం) ప్రసాదించాలని కోరుతూ ఆ తల్లి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఓ లేఖ రాసింది. స్వచ్ఛ భారత్‌లో భాగంగా నేడు కాన్పూర్‌లో నిర్వహించే కార్యక్రమంలో రామ్‌నాథ్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను కలిసి తమ గోడును వెల్లబోసుకునేందుకు ఆ మహిళ సిద్ధమౌతోంది.
Advertisement