
ప్రపంచ వ్యాప్తంగా అనేకమందిని కేన్సర్ మహమ్మారి పొట్టన పెట్టుకుంటోంది. ముందుగా గుర్తించి, సరైన సమయంలో చికిత్స తీసుకుంటే చాలావరకు ప్రమాదం తప్పుతుంది. ఇది తెలియక చాలామంది ఆందోళనలో పడిపోతారు. తాజాగా చర్మ కేన్సర్ బారినపడి కోలుకున్న ఒక యువతి ఈ ధైర్యాన్నిస్తోంది. తీవ్రమైన మెలనోమా బారిన పడి కోలుకున్నతన జర్నీని సోషల్ మీడియాలో షేర్ చేసింది. కేన్సర్ బాధల నుంచి కోలుకున్న వైనాన్ని రికార్డ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
టెక్సాస్‌లోని హ్యూస్టన్‌కు చెందిన అలోండ్రా సియెర్రా టిక్‌టాక్‌లో స్కిన్ క్యాన్సర్ బారిన పడింది. గత ఏడాది కాలంగా చికిత్సలు, ఆపరేషన్లను అచంచలమైన ధైర్యంతో ఎదుర్కొంది. అంతేకాదు తనలాంటి వారికి అవగాహన కల్పించేందుకు, బలాన్నిచ్చేందుకు తాను అనుభవించిన బాధలను పంచుకుంటూ ఒక పవర్‌ఫుల్ సందేశాన్ని ఇవ్వడం విశేషం.
వయస్సు, జెండర్, లేదా చర్మం రంగుతో సంబంధం లేకుండా ఎవరినైనా దాడి చేసే మెలనోమా అత్యంత తీవ్రమైనదని ఇది చాలా త్వరగా విస్తరిస్తుందని కూడా హెచ్చరించింది. తగిన శ్రద్ధతో చికిత్స తీసుకోవాలని సూచించింది. తన జుట్టును షేవ్ చేసుకోవడం నుండి మళ్లీ పొడవాటి జుట్టు దాకా, తీవ్రమై అలసట నుంచి పూర్తి ఆరోగ్యం దాకా ఇలా మొత్తం జర్నీని రికార్డు చేసింది. ‘‘నేను ముందుకు సాగడానికి తగిన శక్తిని వచ్చిన దేవునికి ధన్యవాదాలు’’ అని పేర్కొంది. దీంతో నెటిజన్లు ఆమెకు అభినందనలు అందించారు. అదృష్టవంతురాలు, ఆమె చిరునవ్వు ఇలాగే శాశ్వతంగా ఉండాలి అంటూ వ్యాఖ్యానించారు. క్రేజీ క్లిప్స్ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటికే 20 మిలియన్లకుపైగా వ్యూస్ దక్కించుకోవడం గమనార్హం.
Woman with cancer records her recovery process pic.twitter.com/aJxSLI398z
— Crazy Clips (@crazyclipsonly) March 7, 2024