Watch: Anand Mahindra Shares AI Created Video Of A Girl Aging, Goes Viral - Sakshi
Sakshi News home page

ఏఐపై ఆనంద్‌ మహీంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు: అద్భుతమైన వీడియో 

Published Tue, Apr 25 2023 4:04 PM | Last Updated on Tue, Apr 25 2023 6:24 PM

Anand Mahindra shares AI created video of a girl aging - Sakshi

సాక్షి,ముంబై: పారిశ్రామికవేత్త, ఎంఅండ్‌ఎం అధినేత ఆనంద్‌ మహీంద్ర మరో అద్భుతమైన వీడియో షేర్‌ చేశారు. ప్రధానంగా  ఏఐ చాట్‌జీపీటీపై ఆందోళనలు కొనసాగుతున్న తరుణంలో ఆనంద్‌ మహీంద్రా సైతం ఏఐపై తన స్పందనను ట్వీట్‌ చేశారు. ఏఐ గురించి ప్రస్తుతానికి తనకైదే ఎలాంటి ఆందోళన లేదని వ్యాఖ్యానించడం విశేషం. ఈవీడియో నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది.  ఇప్పటికే ఆరు లక్షలకుపైగా వ్యూస్‌ రాగా,  11,000 కంటే ఎక్కువ లైక్‌లతోపాటు  కామెంట్‌లు ఉన్నాయి.

(ఇదీ చదవండి: ముంబై ఇండియన్స్‌ బాస్‌ గురించి తెలుసా? అంబానీని మించి సంపాదన)

అయిదేళ్ల నుంచి 95 సంవత్సరాల వయస్సుదాకా అమ్మాయి పరిణామక్రమంతో ఉన్న ఏఐ జనరేటెడ్‌ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు.  బాలికనుంచి స్త్రీగా రూపాంతరం చెంది ఆపై 95 ఏండ్ల వృద్ధ మహిళగా ఎలా మారుతుందో ఈ వీడియోలో అద్భుతంగా సృష్టించారు. దీనిపై  స్పందించిన మహీంద్ర ఏఐ సాయంతో జనరేట్‌ చేసిన పోర్ట్రెయిట్స్‌తో కూడిన ఈ వీడియో అద్భుతంగా ఉంది.  ఏఐతో తనకైతే ఎలాంటి భయాలు లేవు..నిజంగా ఇది ఎంతో అందమైన వాటిని సృష్టిస్తోందంటూ  వ్యాఖ్యానించారు.  దీంతో ఇది చాలా అందంగా, మెస్మరైజ్‌ చేసేలా ఉంది. వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది,  చాలా బ్యూటిఫుల్‌గా ఉందని కొందరు ఏఐతో  ప్రపంచం ఉద్యోగ సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందిమరొకరు కమెంట్‌ చేశారు. అటు వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకూడా ఇదే వీడియోను ట్వీట్‌  చేశారు. (వన్‌ప్లస్‌ ప్యాడ్‌ వచ్చేసింది: ధర చూస్తే ఇపుడే కావాలంటారు!)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement