Woman Shouts At BMTC Conductor When Asked ID To Travel For Free Scheme - Sakshi

మహిళ ఓవర్‌ యాక్షన్‌.. టికెట్‌ అడిగాడని కండక్టర్‌పై తిట్ల పురాణం

Published Thu, Jul 27 2023 10:19 AM | Last Updated on Thu, Jul 27 2023 1:46 PM

Woman Shouts Conductor Over Ticketless Journey Karnataka - Sakshi

యశవంతపుర(బెంగళూరు): బస్‌ కండక్టర్‌ను మహిళ ఒకరు నోటికొచ్చినట్లు తిట్టిన వీడియో వైరల్‌ అయ్యింది. బెంగళూరులో సిటీ బస్‌ ఎక్కిన మహిళ టికెట్‌ తీసుకోలేదు. కండక్టర్‌ ఆమెను టికెట్‌ తీసుకోవాలని కోరగా ఉచిత ప్రయాణమని తెలిపింది. ఆధార్‌ కార్డు చూపాలని కండక్టర్‌ కోరగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగిని అని ఆమె ఐడీ కార్డు చూపారు.

స్థానిక చిరునామా కార్డును చూపించాలని, లేదా టికెట్‌ తీసుకోవాలని కండక్టర్‌ చెప్పడంతో మహిళ రౌద్రరూపం దాల్చింది. ఇష్టానుసారం తిట్ల పురాణం వినిపించింది. కొందరు ఇది వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా మహిళ తీరుపై నెటిజన్లు మండిపడ్డారు.
 

చదవండి: విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా.. భారత్‌ పాస్‌పోర్టుతో 57 దేశాలకు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
 
Advertisement