కారు పార్క్‌ చేసిన మహిళ.. ఒక్కసారిగా వరద రావడంతో.. | Car Washed Away In Heavy Rain Lashes Panchkula Haryana | Sakshi
Sakshi News home page

కారు పార్క్‌ చేసిన మహిళ.. ఒక్కసారిగా వరద రావడంతో..

Published Sun, Jun 25 2023 3:49 PM | Last Updated on Sun, Jun 25 2023 4:12 PM

Car Washed Away In Heavy Rain Lashes Panchkula Haryana - Sakshi

వేసవి కాలం ముగిసింది. ఇక నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తుండడంతో పలు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకుంటున్నాయి. దీంతో ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్‌, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. ఆదివారం కురిసిన భారీ వర్షానికి హర్యానాలోని పంచకుల నది వద్ద ఆగి ఉన్న కారు కొట్టుకుపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

వివరాల ప్రకారం.. పంచకులలోని ఖరక్ మంగోలి నది ఒడ్డున ఓ మహిళ తన కారును పార్క్ చేసింది. అయితే భారీ వర్షాల కారణంగా నదిలో వరద పోటెత్తడంతో కారు నదిలో కొట్టుకుపోయింది. ఇది గమనించిన స్థానికులు మహిళను రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్రేన్ సాయంతో వాహనాన్ని నదిలో నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

మరో వైపు.. ఢిల్లీ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఓ యువతి రైలు ఎక్కేందుకు స్టేషన్‌కు చేరుకుంటోంది. మార్గమధ్యంలో నీటి గుంటలను దాటే క్రమంలో ఓ విద్యుత్‌ స్తంభాన్ని పట్టుకోవడంతో కరెంట్‌ షాక్‌కు గురైంది. ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. 
 

చదవండి: పిల్లాడి టైమ్‌ టేబుల్‌.. చదువుకు కేటాయించిన టైమ్‌ చూస్తే నవ్వాపుకోలేరు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement