వెళ్తున్న కారులోనే వంటకాలు చేసి ఔరా! అనిపిస్తున్నారు. యూట్యూబ్ రీల్ కోసం అనో చాలామంది ఇలా కారులోనే వంటకాలు చేసిన వీడియోలు చూశాం. కానీ వాటిలో అదంతా ఫేక్ అయ్యి ఉండొచ్చు కుదరదు అనుకునే వాళ్లం కదా!. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసి మీ అభిప్రాయం మార్చుకుంటారు. ఈజీగా కారులో కూడా వంట చేసేయొచ్చేని అంటారు. ఇంతకీ ఎలా కారులో వండేస్తున్నారంటే..
ఆ వీడియోలో ఒక మహిళ సీటులో కూర్చొని చక్కగా చికెన్‌ని కబాబ్ ముక్కలుగా కట్ చేస్తుంది. ఆ తర్వాత ఓ చిన్న కవర్ తీసుకుని అందులో మసాల దినుసులు, పెరుగు అని కలిపి ఉంచుతుంది. దానిలో చికెన్ కబాబ్ ముక్కలు అన్ని వేసి కాసేపు అలా ఉంచుతుంది. ఆ తర్వాత మరో కవర్ కార్న్‌ఫోర్ తీసుకుంటుంది. ఇప్పుడు మసాలాలో నాన్చిన చికెన్‌ముక్కలను ఈ కార్న్‌ఫోర్ కవర్‌లో దొర్లించి ఓ ప్లేట్‌లో పెట్టుకుంటుంది. ఆ తర్వాత ఓ ఎలక్ట్రిక్ కుక్కర్ తీసుకుని దానిలో ఆయిల్ వేసుకుని కాసేపు అలా ఉంచుతుంది.
అది వేడిక్కెంది అని నిర్థారించుకున్నాక ఈ కార్న్‌ఫోర్ అద్దిన చికెన్ ముక్కల్ని వేసి చక్కగా డీప్ ఫ్రై చేస్తుంది. ఆ తర్వాత చక్కగా ఓ ప్లేట్‌లో మంచిగా సర్వ్ చేసుకుని లాంగించేస్తుంది. అబ్బా ఇంత ఈజీనా కారులో వంటలు చేయడం అనిపిస్తుంది ఆ మహిళ చేసిన విధానం చూస్తే. కానీ ఎలాగైన కిచెన్.. కిచెనే! ఎందుకంటే కారులో వంట చేయాలంటే కావాల్సిన పదార్థాల తోపాటు అన్ని క్లీన్ చేసుకుని ముందుగా రెడీ చేస్తేనే చేయడం ఈజీ. ఇంతలా ముందుగా హైరాన పడి రెడీ చేసుకోవడం కంటే వంటగదిలో హాయిగా టెన్షన్ పడకుండా చేసుకుంటే బెటర్ కదా..! అనిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment