
మనం నిత్యం ఎలా పడితే అలవాడే పాత్రలు ఎలా తయారవ్వుతాయో వింటే షాకవ్వుతారు. ఇంత శ్రమ ఉంటుందా! అనుకుంటారు. మనం పాత సామాన్లను అమ్మేస్తుంటాం. ఎంతో కొంత డబ్బులు తీసుకుని పనికిరాని సామాన్లను పాత సామాన్ల వాడికి ఇచ్చేస్తుంటాం. అలా వచ్చిన వాటిని వాళ్లు ఏం చేస్తారో తెలుసా..?
మనం నిత్యం కూరలు వండేది అల్యూమినియం పాత్రల్లోనే. వాటిల్లో వండొద్దని హెచ్చరిస్తున్నా.. మనం వాటిల్లోనే వండేస్తుంటాం. అవే అయితే కడగడం ఈజీ. పైగా అంత బరువు ఉండవు. వాడుకునేందుకు సౌలభ్యంగా ఉండటంతో ప్రజలు ఆ పాత్రలకే అలవాటు పడిపోయారు. అదీగాక పెద్ద హోటల్స్, రెస్టారెంట్లలో కూడా వీటిని వాడుతుంటారు. కడిగేందుక వీలుగానూ, ఎక్కువ మొత్తంలో వండే కూరకు ఈ గిన్ని కాస్త వెసులుబాటుగా ఉంటుంది.
బరువు కూడా ఓ మోస్తారుగా ఉంటుంది. అలాంటి ఈ అల్యూమినియం పాత్రలను మనం ఎలా తయారు చేస్తారో చూస్తే మాత్రం వీటి వెనుక ఇంత కష్టం ఉంటుందా? అని నోరెళ్లబెడతారు. వాడిపడేసిన అల్యూమినయం చెత్తను బొగ్గుల వేడిపై కరిగించి వాటిని మంచిగా మరిగించి ఓ పాత్ర రూపంలో ఉన్న బట్టిలో వేసి అల్యూమినియం గిన్నెలను తయారు చేస్తారు. అవి అందంగా ఉండేలా మంచి పాలిష్ పెట్టడం ఒక వంతు. ఆ తర్వాత ఆ గిన్నెలను పట్టుకునేలా హ్యాండిల్స్ బిగించి చక్కగా గిన్నె తయారయ్యిందని నిర్థారించుకున్నాక కంపెనీ స్టిక్కర్ వేసి పొద్దికగా పెట్టడం ఒక ఎత్తు.
ఇంత తతంగం అయితే గానీ ఒక గిన్నే తయారవ్వదు. అయితే ఇలా తయారయ్యిన గిన్నెలు తక్కువ స్వచ్ఛతను కలిగి ఉంటాయని అంటున్నారు నిపుణులు. వీటిలో సీసం, ఆర్సెనిక్, కాడ్మియం తదితర మెటల్ మలినాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. వంట ప్రకియలో ఆయా కూరలు తయారు చేసేటప్పుడూ ఉప్పు, పులుపు వంటివి ఉంటాయని, వాటితో ఈ అల్యూమినియం రియాక్షన్ చెంది రంధ్రాలను ఏర్పరచటం లేదా అల్యూమినయంలోని విషపదార్థాలు ఈ కూరలో కలవడం జరుగుతుందని అన్నారు. ఇది ఆహారంగా తీసుకుంటే రకరకాల అనారోగ్య సమస్యలు వస్తయాని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
Using recycled aluminium to make pans
— Science girl (@gunsnrosesgirl3) March 13, 2024
What issues immediately stick out here?
pic.twitter.com/i0QceNsTgx