pans
-
ఇంట్లో వాడే పాత్రల వెనుక ఇంత కష్టం ఉంటుందా?
మనం నిత్యం ఎలా పడితే అలవాడే పాత్రలు ఎలా తయారవ్వుతాయో వింటే షాకవ్వుతారు. ఇంత శ్రమ ఉంటుందా! అనుకుంటారు. మనం పాత సామాన్లను అమ్మేస్తుంటాం. ఎంతో కొంత డబ్బులు తీసుకుని పనికిరాని సామాన్లను పాత సామాన్ల వాడికి ఇచ్చేస్తుంటాం. అలా వచ్చిన వాటిని వాళ్లు ఏం చేస్తారో తెలుసా..? మనం నిత్యం కూరలు వండేది అల్యూమినియం పాత్రల్లోనే. వాటిల్లో వండొద్దని హెచ్చరిస్తున్నా.. మనం వాటిల్లోనే వండేస్తుంటాం. అవే అయితే కడగడం ఈజీ. పైగా అంత బరువు ఉండవు. వాడుకునేందుకు సౌలభ్యంగా ఉండటంతో ప్రజలు ఆ పాత్రలకే అలవాటు పడిపోయారు. అదీగాక పెద్ద హోటల్స్, రెస్టారెంట్లలో కూడా వీటిని వాడుతుంటారు. కడిగేందుక వీలుగానూ, ఎక్కువ మొత్తంలో వండే కూరకు ఈ గిన్ని కాస్త వెసులుబాటుగా ఉంటుంది. బరువు కూడా ఓ మోస్తారుగా ఉంటుంది. అలాంటి ఈ అల్యూమినియం పాత్రలను మనం ఎలా తయారు చేస్తారో చూస్తే మాత్రం వీటి వెనుక ఇంత కష్టం ఉంటుందా? అని నోరెళ్లబెడతారు. వాడిపడేసిన అల్యూమినయం చెత్తను బొగ్గుల వేడిపై కరిగించి వాటిని మంచిగా మరిగించి ఓ పాత్ర రూపంలో ఉన్న బట్టిలో వేసి అల్యూమినియం గిన్నెలను తయారు చేస్తారు. అవి అందంగా ఉండేలా మంచి పాలిష్ పెట్టడం ఒక వంతు. ఆ తర్వాత ఆ గిన్నెలను పట్టుకునేలా హ్యాండిల్స్ బిగించి చక్కగా గిన్నె తయారయ్యిందని నిర్థారించుకున్నాక కంపెనీ స్టిక్కర్ వేసి పొద్దికగా పెట్టడం ఒక ఎత్తు. ఇంత తతంగం అయితే గానీ ఒక గిన్నే తయారవ్వదు. అయితే ఇలా తయారయ్యిన గిన్నెలు తక్కువ స్వచ్ఛతను కలిగి ఉంటాయని అంటున్నారు నిపుణులు. వీటిలో సీసం, ఆర్సెనిక్, కాడ్మియం తదితర మెటల్ మలినాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. వంట ప్రకియలో ఆయా కూరలు తయారు చేసేటప్పుడూ ఉప్పు, పులుపు వంటివి ఉంటాయని, వాటితో ఈ అల్యూమినియం రియాక్షన్ చెంది రంధ్రాలను ఏర్పరచటం లేదా అల్యూమినయంలోని విషపదార్థాలు ఈ కూరలో కలవడం జరుగుతుందని అన్నారు. ఇది ఆహారంగా తీసుకుంటే రకరకాల అనారోగ్య సమస్యలు వస్తయాని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. Using recycled aluminium to make pans What issues immediately stick out here? pic.twitter.com/i0QceNsTgx — Science girl (@gunsnrosesgirl3) March 13, 2024 (చదవండి: మసాలా ఎక్కువై కూర పాడవ్వకూడదంటే ఇలా చేయండి!) -
కొండంత అండ
ఎంపీ: తమ్ముడూ నీ పేరేంటి? హాస్టల్లో భోజనం ఎలా ఉంటుంది? విద్యార్థి: నాపేరు వెంకటేశ్ సార్. తొమ్మిదో తరగతి చదువుతున్నా. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదు. ఈ హాస్టల్లో అన్నీ సమస్యలే సార్. ఎంపీ: బాబూ.. నువ్వేం చదువుతున్నావ్..? విద్యార్థి: నా పేరు సందీప్ సార్, 8వ తరగతి చదువున్నా. ఎంపీ: ఈ హాస్టల్లో బాత్రూంలు, మరుగుదొడ్లు ఉన్నాయా? సందీప్ : పేరుకు చాలానే ఉన్నాయ్ సార్.. కానీ ఏ ఒక్కటీ పనిచేయడం లేదు. ఎంపీ: అందేంటీ? ఉన్నాయంటున్నావ్.. ఎందుకు పనిచేయడం లేదు? సందీప్ : అప్పుడెప్పుడో నిర్మించిన ఈ మరుగుదొడ్లకు నీటి సౌకర్యం లేదు సార్.. ఉపయోగించక పూర్తిగా పాడైనయ్. చెత్తా చెదారంతో నిండిపోయినయ్. ఎంపీ: మీరంతా ఎక్కడ స్నానాలు చేస్తున్నారు? కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నారు? సందీప్: స్నానాలు ఆరుబయట ఉన్న నల్లా కింద చేస్తున్నం. మరుగుదొడ్లు లేకపోవడంతో బయటకి వెళ్తున్నాం. రాత్రివేళలో చాలా ఇబ్బందిగా ఉంది సార్.. ఎంపీ: మీరంతా ఆటలు ఆడుకునేందుకు స్థలం ఉందా? మహిపాల్: వసతి గృహంలో ఎలాంటి ఆటవస్తువులు లేవండి. ఆడుకోవడానికి గ్రౌండ్ కూడా లేదు. ఎంపీ: మరి మీరంతా ఖాళీ సమయంలో ఏం చేస్తున్నారు? మహిపాల్: స్కూల్ నుంచి వచ్చినంక చదువుకునేటోళ్లు చదువుకుం టరు. మిగతా వాళ్లు ఖాళీగానే ఉంటరు. ఎంపీ: వసతి గృహానికి ట్యూటర్ (టీచర్) వస్తున్నాడా? అన్ని సబ్జెక్టులకు ఉన్నారా? బాలునాయక్: ప్రస్తుతం ట్యూటర్ రావడంలేదు సార్.. మొదట్లో కొన్ని రోజులు వచ్చారు.. మళ్లీ రావడంలేదు. ఎంపీ: హాస్టల్లో రాత్రి వేళ కరెంట్ ఉంటుందా? ఏమైనా ఇబ్బందులున్నాయి? శ్రీకాంత్ : రాత్రివేళలో కరెంట్ ఉంటుంది. కానీ హాస్టల్లో వైరింగ్, లైట్లు, ప్యాన్లు సరిపడా లేవు. రాత్రిపూట కరెంట్ పోతే మాకు భయం వేస్తోంది. ఎంపీ : ఎందుకు భయం వేస్తుంది. అందరూ కలిసే ఉంటారు కదా? శ్రీకాంత్: మా హాస్టల్ గ్రామానికి దూరంగా గట్టుపై ఉండడంతో చుట్టూ ఎవరూ ఉండరు. దీనికి తోడు రాత్రి వేళ బాత్రూంకు పోవాలంటే బయటకు వెళ్లాలి.. అందుకే భయం. ఎంపీ: ఇంకా ఏమైనా సమస్యలున్నాయా? విష్ణు: హాస్టల్‌కు ప్రహరీ లేకపోవడంతో పాములు వస్తున్నాయ్ సార్.. ఎంపీ : పాములు వస్తున్నాయా..? ఎప్పుడైనా లోపలికొచ్చాయా? విష్ణు: ఓ సారి గదిలోకి వచ్చింది. అందరం బయపడిపోయి బయటకు పరుగు తీశాం. వాచ్‌మన్ వచ్చి చూసి పాము పోయిందని చెప్పిన తర్వాత లోపలికొచ్చాం. ఎంపీ: హాస్టల్ గదులను శుభ్రం చేసేవాళ్లు వస్తున్నారా? రోజూ శుభ్రం చేస్తారా? మహేందర్: మా గదులను మేమే శుభ్రం చేసుకుంటాం సార్.. ఎవరూ రారు. ఎంపీ: హాస్టల్లో ఏమైనా సమస్యలుంటే ఎవరికి చెబుతారు? శ్రీనివాస్: వార్డెన్‌కు చెబుతాం. ఎంపీ: వర్షం వస్తే గదులు కురుస్తాయా? గోవింద్: అవును సార్.. గదుల పరిస్థితి బాగాలేదు. వర్షం వస్తే కురుస్తాయి. డోర్స్ కూడా బాగాలేవు. చలి కాలం.. ఇబ్బంది పడుతున్నాం. ఎంపీ: నీటి సమస్య ఉందా? నీళ్లు ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి? రజినీకాంత్: హాస్టల్‌కు ప్రత్యేకంగా బోరు లేదు సార్.. గ్రామ పంచాయతీకి సరఫరాచేసే పైపు నుంచే నీళ్లు వస్తాయి. ఎంపీ: నీటి నిల్వకు ట్యాంకులున్నాయా? రజనీకాంత్: లోపల ట్యాంకులు ఉన్నా.. అవి నిరుపయోగంగా ఉన్నాయి. ఆరు బయట వస్తున్న నల్లా నీటితోనే స్నానం చేస్తాం. ఎంపీ: ఇంకా ఇతర సమస్యలు చెప్పండి? సునీల్ : హాస్టల్ లోపల ఫ్లోరింగ్ లేదు సార్.. దుమ్ములోనే కూర్చుని భోజనం చేస్తున్నాం.. వెంకటేశ్: మా హాస్టల్లో అనేక సమస్యలున్నాయ్ సార్.. మీరే వాటిని పరిష్కరించాలి. ఎంపీ: తప్పకుండా పరిష్కరిస్తా.. మీరంతా ఒకే పాఠశాలలో చదువుకుంటున్నారా? వినయ్‌చారి: కొందరం ప్రభుత్వ పాఠశాలలో, మరి కొందరు మోడల్ స్కూల్లో చదువుకుంటున్నం. ఎంపీ: హాస్టల్ వార్డెన్ అందుబాటులో ఉంటున్నారా? లేరా? కార్తిక్:మా వార్డెన్ మ్యాట్రిన్ లావణ్యగారు.. రోజూ వస్తారు. ఎంపీ : బాగా చదువుతున్నారా? గత ఏడాది మార్కులెలా వచ్చాయ్? సరేందర్: అందరికీ గత ఏడాది మంచి మార్కులే వచ్చాయ్సార్.. ఎంపీ: ఈ ఏడాది టెన్త్‌లో అందరూ పాసవుతారా? అర్జున్: అందరం తప్పకుండా పాసవుతాం సార్. ఎంపీ: వెరీ గుడ్. బాగా చదువుకొని హాస్టల్లో ఉన్న వారంతా ఫస్టు గ్రేడ్‌లో పాసవ్వాలి.