Hyderabad Woman Injured After Hit By Car On Road At Rajendranagar, CCTV Video Goes Viral - Sakshi
Sakshi News home page

Viral Video: రాజేంద్రనగర్‌లో దారుణం.. యువతిని కారుతో ఢీకొట్టి..

Published Thu, Jul 7 2022 3:24 PM | Last Updated on Thu, Jul 7 2022 7:14 PM

Car Hit Woman Who Walking On Road At Rajendranagar, CCTV Footage Viral - Sakshi

సాక్షి, రంగారెడ్డి: రాజేంద్రనగర్‌లో దారుణం చోటుచేసుకంఉది. చింతల్ మెట్ హకీం హిల్స్ వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ యువతిని కొందరు గుర్తుతెలియని యువకులు కారుతో ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నించారు. యువతిని ఢీ కొట్టిన దండగులు వెంటనే కారుతో పారిపోయారు. రోడ్డుపై కారును ముందుకు తీసుకొని వెళ్లి  రివర్స్ చేసి మరి ఎదురుగా వస్తున్న యువతిని ఢీ కొట్టారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. రక్తపు మడుగులో రోడ్డు పడి పోయిన యువతిని స్థానికులు గమనించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. 

యువతి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సీసీటీవీ ఫుటేజీలో మాత్రం స్పష్టంగా రోడ్డు పక్కన నుంచి నడుచుకుంటూ వెళుతున్న యువతిని కారుతో ఢీ కొట్టి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అది రోడ్డు ప్రమాదమా, హత్య? అనే విషయాన్ని పోలీసులు తేల్చాల్సి ఉంది. 
చదవండి: వీఆర్వో పాడుబుద్ది.. భార్యకు సంతానం కలగడం లేదని యువతికి గాలంవేసి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement