rajendranagar
-
HYD: అనాథాశ్రమంలో బాలికలతో కేర్ టేకర్ అనుచిత ప్రవర్తన!
సాక్షి, రాజేంద్రనగర్: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అనాథాశ్రమంలో కేర్ టేకర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ.. బాలికల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేర్ టేకర్ చెప్పిన మాట వినకపోతే దుస్తులు లేకుండా అందులో పనిచేసే ఇద్దరు పురుషుల ఎదుట నిలబెట్టడం సంచలనంగా మారింది.వివరాల ప్రకారం.. అనాథలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఓ మహిళ రంగారెడ్డి జిల్లా బండ్లగూడలోని కిస్మత్ పూరలో 15ఏళ్ల క్రితం అనాథాశ్రమాన్ని ప్రారంభించారు.ఈ క్రమంలో సంస్థ వ్యవస్థాపకురాలు తొలుత తన తల్లిని కేర్ టేకర్‌గా నియమించారు. ఆమె వృద్ధురాలు కావడంతో రెండేళ్ల కిందట మరో మహిళ సునీతను ఆమె స్థానంలో కేర్ టేకర్‌గా నియమించారు. ప్రస్తుతం అనాథాశ్రమంలో 45 మంది బాలికలు ఉన్నారు. వారంతా 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్నారు.అయితే, కొత్తగా చేరిన కేర్ టేకర్ సునీత.. బాలికలను చిత్రహింసలకు గురిచేయడంతో వారంతా ఆవేదన చెందారు. సునీత చెప్పిన మాటలు వినకపోతే బాలికలను దుస్తులు లేకుండా అందులో పనిచేసే వారి ఎదుట నిలబెడుతూ అసభ్యకరంగా ప్రవర్తించింది. కాగా, ఈ అనాథాశ్రమానికి చెందిన 25 మంది బాలికలు బుద్వేల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. సునీత వేధింపులను వారంతా.. ప్రధానోపాధ్యాయురాలు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చలించిపోయిన ఆమె.. రాజేంద్రనగర్ పోలీసులతో పాటు షీ టీమ్స్‌కి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు కేసు నమోదు చేసి సునీతను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, సంస్థ వ్యవస్థాపకురాలితో అందులో పనిచేసే వారిని విచారిస్తున్నారు.ఇది కూడా చదవండి: జానీ భార్య అయేషా అరెస్ట్‌కు రంగం సిద్ధం! -
రాజేంద్రనగర్‌లో విషాదం.. గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి
హైదరాబాద్, సాక్షి: రాజేంద్రనగర్‌లో సోమవారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. బాబుల్ రెడ్డి నగర్ కాలనీలో ఓ ఇంటి గోడకూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. అలాగే మరో ఇద్దరికి తీవ్ర గాయాలయినట్లు తెలిసింది. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.ఇద్దరికి గాయాలు...సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. నిన్న కురిసిన భారీ వర్షానికి నానిన గోడ కూలినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే పోలీసులు మాత్రం అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. -
రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు
-
రాజేంద్రనగర్‌లో విషాదం.. ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో..
హైదరాబాద్: వారిద్దరూ వరుసకు అక్కా తమ్ముడు అవుతారు. ఏం జరిగిందో ఏమోగానీ ఇద్దరూ వేర్వేరు గదుల్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై మోనిక తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం ధర్మారం గ్రామానికి చెందిన నర్సింహ గౌడ్, సోమేశ్ గౌడ్ అన్నదమ్ములు. పన్నెండేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు. రాజేంద్రనగర్ సర్కిల్ హైదర్‌గూడ కేశవ్‌నగర్‌లో ఇల్లు కట్టుకుని కుటుంబ సభ్యులతో నివసిస్తున్నారు. పై అంతస్తులో నర్సింహ, స్వప్న దంపతులు తమ ఇద్దరు కుమారులతో పాటు నర్సింహ మేనమామ కుమారుడు, స్వప్న సోదరుడైన శేఖర్ (26) ఉంటున్నారు. కింది అంతస్తులో సోమేశ్, ఆయన భార్య స్రవంతి (28), ఇద్దరు కుమారులతో కలిసి నివసిస్తున్నారు. నర్సింహ, సోమేశ్ అన్నదమ్ములిద్దరూ ప్రైవేటు జాబ్ చేస్తుండగా.. శేఖర్ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. పిల్లలు ఇంటికి వచ్చి చూడగా.. మంగళవారం స్వగ్రామంలో బంధువు దశదిన కర్మ ఉండటంతో నర్సింహ, సోమేశ్‌తో పాటు స్వప్న వెళ్లారు. ఉదయం పిల్లలను స్కూల్లో వదిలి వచ్చిన సోమేశ్ భార్య స్రవంతి ఇంట్లోనే ఉంది. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో స్రవంతి కుమారులు శశి, చందు ఇంటికి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉన్నాయి. గది లోపలి వెళ్లగా తల్లి ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది. భయంతో వెంటనే బయటికి వచ్చి పక్కింటి వారితో ఈ విషయం చెప్పారు. వారు సోమేశ్కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. హాల్లో స్రవంతి, బెడ్రూంలో శేఖర్ ఉరేసుకొని విగతజీవులై కనిపించారు. పంచనామా చేసి ఇరువురి మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. విషయం తెలుసుకున్న నర్సింహ, సోమేశ్, స్వప్న ఇంటికి చేరుకున్నారు. ఏ కారణంతో స్రవంతి, శేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డారో తెలియడం లేదని, తామంతా కలిసి మెలిసి ఉండేవాళ్లమన్నారు. శేఖర్ ఐదేళ్లుగా తమతోనే ఉంటున్నాడని.. వరుసకు తమకు మేనమామ కుమారుడు అవుతాడని నర్సింహ, సోమేశ్ వెల్లడించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
HYD: న్యూ ఇయర్ వేడుకలు.. ఐటీ ఉద్యోగిని ఇంట్లో డ్రగ్స్ స్వాధీనం!
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్‌లో డ్రగ్స్ కలకలం చోటుచేసుకుంది. న్యూ ఇయర్ సందర్భంగా పార్టీ కోసం సాఫ్ట్వేర్ ఉద్యోగి సంధ్య ఇంట్లో రెండు లక్షల విలువ చేసే డ్రగ్స్‌ను ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీని వెనుక ఎవరు? ఉన్నారని ఆరా తీస్తున్నట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు లక్షల విలువ చేసే డ్రగ్స్‌ను బాలానగర్, రాజేంద్ర నగర్లో ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. శివరాంపల్లిలోని పిల్లర్ నెంబర్ 290 వద్ద ఉన్న ప్రోవిడెంట్ కేన్వర్త్ అపార్ట్మెంట్లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి సంధ్య ఇంట్లో రెండు లక్షల విలువ చేసే 7.5 గ్రాముల డ్రగ్స్ పోలీసులు పట్టుకున్నారు. కాగా, ఓ విశ్వసనీయ సమాచారం మేరకు బాలానగర్ ఎస్వోటీ పోలీసులు రాజేంద్రనగర్ పోలీసులతో సంయుక్తంగా కలిసి దాడి నిర్వహించారు. ఈ క్రమంలో సంధ్య (26)దగ్గర డ్రగ్స్ ఉండగా, అది తీసుకోవడానికి వచ్చిన అర్జున్ (25), డేవిడ్‌ను ట్రాప్ చేసి ముగ్గురిని ఒకే సారి పట్టుకున్నారు. పది గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసకున్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. దీని వెనుక ఎవ్వరూ ఉన్నారు?. డ్రగ్స్ ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు? అనేది దర్యాప్తు ప్రారంభించినట్టు వెల్లడించారు. డ్రగ్స్‌ను బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు అర్జున్ తీసుకువచ్చినట్టు గుర్తించారు. జూబ్లీహిల్స్‌లో భారీగా డ్రగ్స్.. అంతకుముందు కూడా న్యూఇయర్ వేడుకలకు జూబ్లీహిల్స్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్ నుంచి తీసుకువచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్‌లో ప్రముఖ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు ఈ ముఠాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 100 గ్రాముల ఎండీఎంఏ, 29 గ్రాముల బ్రౌన్ షుగర్ ప్యాకెట్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కోసం ప్రత్యేక పరికరాలు న్యూఇయర్ వేళ డ్రగ్స్ విక్రయంపై పోలీసుల ఆంక్షలు విధించారు. డ్రగ్స్‌ను సేవిస్తే గుర్తించేందుకు ప్రత్యేక పరికరాలు తెప్పించారు. డ్రగ్స్ తీసుకున్నారన్న అనుమానం వస్తే అక్కడిక్కడే పరీక్షలు నిర్వహించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. విద్యార్ధులపై ప్రత్యేక దృష్టి సారించారు. -
హైదరాబాద్: రాజేంద్రనగర్ లో భారీ అగ్నిప్రమాదం
-
రాజేంద్రనగర్‌లో అగ్నిప్రమాదం..భయాందోళనలో స్థానికులు
సాక్షి,హైదరాబాద్ : రాజేంద్రనగర్‌లోని గగన్ పహాడ్ పారిశ్రామిక వాడలోని థర్మకోల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆరు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం వల్ల వెలువడిన దట్టమైన పొగలవల్ల స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఫ్యాక్టరీ ఆవరణలో గ్యాస్ సిలిండర్లు ఉండటం ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ ఏడాది మార్చిలోనూ గగన్‌పహాడ్ ప్రాంతంలోని ఓ స్క్రాప్ దుకాణంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పది మందికి గాయలయ్యాయి. పేలుడు కారణంగా వెలువడిన శబ్దంతో చుట్టుపక్కల వారు అప్పట్లో తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇదీచదవండి..కారులో డబ్బుల సంచులు.. సీఐపై కాంగ్రెస్ నేత దాడి! -
రాజేంద్రనగర్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
సాక్షి, రంగారెడ్డి: రాజేంద్రనగర్‌లో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. డైరీ ఫామ్ వద్ద ఓ నిర్మానుష్య ప్రాంతంలో రౌడీ షీటర్ సర్వర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. పథకం ప్రకారం సర్వర్‌ను నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లిన దుండగులు కత్తులతో పొడిచి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటానికి స్థలానికి చేరుకొని హత్య తీరును పరిశీలించారు.కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నాయి. పాతకక్షల నేపథ్యంలో సర్వర్‌ను దుండగులు చంపినట్లు తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
HYD: హైస్పీడ్‌లో కారు బీభత్సం.. సినిమా రేంజ్లో టైర్లు ఊడిపోయి..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో ఉన్న కారు సినిమా రేంజ్లో డివైడర్‌ను ఢీకొట్టి.. అనంతరం మరో కారును ఢీకొట్టింది. ఈ క్రమంలో కారు రెండు వీల్స్ ఊడిపోయి గాల్లోకి ఎగిరి కిందపడ్డాయి. వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్‌లోని పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై కారు బీభత్సం సృష్టించింది. ఆదివారం తెల్లవారుజూమన హైస్పీడ్‌లో ఉన్న కారు.. 198వ పిల్లర్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం, మరో కారును కూడా సదరు కారు ఢీకొట్టింది. ఈ సందర్బంగా కారు రెండు టైర్లు ఉడిపోయి.. ఒక్కసారిగా గాల్లోకి లేచి కిందకు ఎగిరిపడ్డాయి. ఈ ప్రమాదంలో కారు ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే, మైనర్లు ఈ కారు నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ కీలక నిర్ణయం!.. అక్కడి నుంచి బరిలో బండ్ల గణేష్? -
ఐపీఎల్ బెట్టింగ్ భారీగా పట్టుబడ్డ డబ్బు
-
రంగారెడ్డి: నేషనల్ పోలీస్ అకాడమీలో కంప్యూటర్లు చోరీ
సాక్షి, రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్ర నగర్ మండలంలోని హైదరాబాద్ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో చోరీ జరిగింది. కట్టుదిట్టమైన భద్రత ఉండే ఐపీఎస్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ అకాడమీ నుంచి కంప్యూటర్లు మాయం అయ్యాయి. సిబ్బంది కళ్లు గప్పిన కేటుగాడు.. సుమారు ఏడు కంప్యూటర్లు మాయం చేసినట్టు తెలుస్తోంది. అయితే.. ఇది ఎట్టకేలకు అది ఇంటి దొంగ పనే అని తేల్చారు అధికారులు. కంప్యూటర్లు మాయం అయిన విషయాన్ని గమనించిన అధికారులు.. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించారు. ఆ ఫుటేజీల్లో చోరీ దృశ్యాలు రికార్డు అయ్యాయి. దొంగను ఐటీ సెక్షన్ లో పని చేస్తున్న చంద్రశేఖర్ గా గుర్తించారు. ఈ మేరకు ఎన్పీఏ అధికారులు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీస్ అకాడమీలో చోరీ జరగడం, అది బయటకు రావడంతో ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. -
గ్యాంగ్ నుంచి వెళ్లిపోయాడని..కిడ్నాప్ చేసి బట్టలూడదీసి...
సాక్షి, రాజేంద్రనగర్: గ్యాంగ్ నుంచి వెళ్లిపోయి తమపైనే దుష్ప్రచారం చేస్తావా అంటూ ఓ రౌడీషీటర్ తన అనుచరులతో కలిసి ఓ యువకుడిని కిడ్నాప్ చేసి బట్టలూడదీసి చితకబాదిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గతంలో రెండు సార్లు సదరు యువకుడిపై ఇదే గ్యాంగ్ దాడికి పాల్పడింది బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన స్పందించకపోవడంతో వారు మరోసారి తెగబడ్డారు. రౌడీషీటర్‌తో పాటు అతడి అనుచరులు యువకుడిని కొడుతున్న దృశ్యాలను వీడియో తీసి తమ సెల్‌ఫోన్ స్టేటస్‌లలో పోస్టు చేసుకోవడం గమనార్హం. తమతో ఎవరైనా పెట్టుకుంటే తమను కాదంటే ఇదే గతి పడుతుందంటూ హెచ్చరికలు జారీ చేశారు. రాజేంద్రనగర్ పోలీసులు, బాధితుడి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సన్‌సిటీ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇర్ఫాన్ ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతను గతంలో రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ రౌడీïÙటర్ ఇర్ఫాన్‌తో సన్నిహితంగా ఉండే వాడు. అతడి గ్యాంగ్‌లో తిరుగుతూ గొడవలు పడేవాడు. దీంతో తల్లిదండ్రులు మహ్మద్ ఇర్ఫాన్‌ను మందలించి ట్యాక్సీ కోనుగోలు చేసి ఇచ్చారు. గత 8 నెలలుగా ట్యాక్సీ నడుపుకుంటున్న ఇర్ఫాన్ ఇంటి వద్దే ఉంటున్నాడు. దీంతో రౌడీషీటర్ ఇర్ఫాన్ తన గ్యాంగ్ నుంచి వెళ్లిపోయినందుకు రూ.50 వేలు ఇవ్వాలని అతడికి ఫోన్‌చేసి బెదిరిస్తున్నాడు. రెండు సార్లు ఇంటి వద్దకు వచ్చి గొడవపడి దాడి చేశాడు. రెండు నెలల క్రితం అతడిపై దాడి చేయడంతో బాధితుడి సోదరుడు రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మంగళవారం రాత్రి మహ్మద్ ఇమ్రాన్ తన కారును లంగర్‌హౌజ్‌లో సరీ్వసింగ్‌కు ఇచ్చి ఇంటికి వచ్చేందుకు వేచి ఉన్నాడు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన రౌడీషీటర్ ఇర్ఫాన్ అతడి స్నేహితులు జహీర్, షహీన్‌షా, ముదస్సర్, ఫవాద్‌లు మహ్మద్ ఇర్ఫాన్‌ను మాట్లాడేది ఉందంటూ ఆటోలో బలవంతంగా ఎక్కించుకుని కిస్మత్పూర్ దర్గా సమీపంలోని శ్మశానవాటిక వద్దకు తీసుకువెళ్లారు. అక్కడే అతడి దుస్తులు విప్పించి బెల్టులు, కర్రలతో చితకబాదారు. ఈ దృశ్యాలను తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము వరకు మహ్మద్ ఇర్ఫాన్‌పై దాడి చేసి అనంతరం సన్‌సిటిలోని ఇంటి వద్ద వదిలి వెళ్లారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో ఎవరికీ చెప్పలేదు. రౌడీషీటర్ గ్యాంగ్ రికార్డు చేసిన దృశ్యాలను తమ సెల్‌ఫోన్ స్టేటస్‌లతో పాటు గ్రూప్‌లలో పోస్టులు చేశారు. తమతో విభేదించినా, తమతో పెట్టుకున్న వారికి ఇదే గతి పడుతుందని కామెంట్ చేశారు. ఈ క్లిప్పింగ్ చూసిన మహ్మద్ ఇర్ఫాన్ సోదరుడి స్నేహితుడు సమాచారం అందించడంతో అతను మహ్మద్ ఇర్ఫాన్‌ను నిలదీశాడు. అప్పటికే గాయాలతో బాధపడుతున్న మహ్మద్ ఇర్ఫాన్‌ను రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేసి ఉషామోహన్ ఆసుపత్రికి తరలించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు స్పందించి ఉంటే... గతంలో మహ్మద్ ఇర్ఫాన్‌పై రౌడీషీటర్ ఇర్ఫాన్ గ్యాంగ్ దాడి చేసి బెదిరించింది. ఈ విషయాన్ని రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని బాధితుడి సోదరుడు ఆరోపించారు. అప్పుడే స్పందించి ఉంటే ఈ సంఘటన జరిగేది కాదన్నాడు. ఇప్పటికైనా రౌడీïÙటర్ ఇర్ఫాన్‌తో పాటు అతడి గ్యాంగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. (చదవండి: మానవత్వం మరుస్తున్నామా...నిద్రిస్తున్నట్లుగానే పడిపోయారు..కానీ ఒక్కరూ...) -
ఓలా డ్రైవర్‌పై రెచ్చిపోయిన గ్యాంగ్
-
‘ఎంఎస్ స్వామినాథన్ అనెక్సి’ ప్రారంభం
వ్యవసాయ విశ్వవిద్యాలయం (రాజేంద్రనగర్): ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధి రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ పరిశోధన సంస్థ వద్ద రాష్ట్రీయ కృషి వికాస్ యోజన నిధుల సాయంతో ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్’, ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్’ కాంప్లెక్స్‌ను బుధవారం ప్రారంభించారు. ఈ కాంప్లెక్స్‌కు వ్యవసాయ శాస్త్రవేత్త ‘డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అనెక్సి’ అని నామకరణం చేశారు. ఈ సందర్భంగా వర్సిటీ వీసీ డాక్టర్ ప్రవీణ్‌రావు మాట్లాడుతూ.. గత ఎనిమిదేళ్లుగా రాష్ట్రప్రభుత్వ సాయంతో విశ్వవిద్యాలయంలో బోధన, పరిశోధనలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఈ సదుపాయాల్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకుని రైతాంగం వ్యవసాయాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. -
రాజేంద్రనగర్‌లో దారుణం.. యువతిని కారుతో ఢీకొట్టి..
సాక్షి, రంగారెడ్డి: రాజేంద్రనగర్‌లో దారుణం చోటుచేసుకంఉది. చింతల్ మెట్ హకీం హిల్స్ వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ యువతిని కొందరు గుర్తుతెలియని యువకులు కారుతో ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నించారు. యువతిని ఢీ కొట్టిన దండగులు వెంటనే కారుతో పారిపోయారు. రోడ్డుపై కారును ముందుకు తీసుకొని వెళ్లి రివర్స్ చేసి మరి ఎదురుగా వస్తున్న యువతిని ఢీ కొట్టారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. రక్తపు మడుగులో రోడ్డు పడి పోయిన యువతిని స్థానికులు గమనించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. యువతి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సీసీటీవీ ఫుటేజీలో మాత్రం స్పష్టంగా రోడ్డు పక్కన నుంచి నడుచుకుంటూ వెళుతున్న యువతిని కారుతో ఢీ కొట్టి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అది రోడ్డు ప్రమాదమా, హత్య? అనే విషయాన్ని పోలీసులు తేల్చాల్సి ఉంది. చదవండి: వీఆర్వో పాడుబుద్ది.. భార్యకు సంతానం కలగడం లేదని యువతికి గాలంవేసి A 19 yr old woman sustained serious injuries after she was hit by a car, while she was walking on the road side footpath, when the driver of a car rammed into her, at Chintalmet at Rajendranagar in Hyderabad on Wednesday, she is undergoing treatment. pic.twitter.com/pFofLzI8zT — AMIT KUMAR GOUR (@gouramit) July 7, 2022 -
రూ.2లక్షల అప్పు.. భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం..
సాక్షి, హైదరాబాద్: ఈసీ నదిలో తేలిన మృతదేహం కేసులో మిస్టరీ వీడింది. సంఘటనా స్థలానికి కొద్ది దూరంలో దొరికిన ప్రెస్ ఐడీ కార్డు ఆధారంగా పోలీసులు కేసులను చేధించారు. శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి శుక్రవారం వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్, బనారస్‌కు చెందిన ప్రమోద్‌కుమార్(40) నగరానికి వలస వచ్చాడు. మతం మార్చుకున్న అతను తన పేరును మహ్మద్ ఇక్బాల్‌గా మార్చుకున్నాడు. 15 ఏళ్ల క్రితం మెహరాజ్బేగంను వివాహం చేసుకుని గోల్కొండ రిసాలా బజార్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. మహ్మద్ ఇక్బాల్ భూత వైద్యుడిగా, రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా పని చేసేవాడు. అతను ఇదే ప్రాంతానికి చెందిన మహ్మద్ లతీఫ్ అలియాస్ మన్ను వద్ద గతంలో రూ. 2 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో లతీఫ్ తరచు ఇక్బాల్ ఇంటికి వచ్చి వెళ్లేవాడు. దీంతో మెహరాజ్‌బేగంతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న ఇక్బాల్ భార్యను హెచ్చరించాడు. లతీఫ్‌ను సైతం తన ఇంటికి రావద్దని హెచ్చరించాడు. దీంతో ఇక్బాల్, మెహరాజ్‌బేగం తమకు అడ్డుగా ఉన్న ఇక్బాల్‌ను హత్య చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం లతీఫ్ మలక్‌పేట్ ముసారాంబాగ్‌కు చెందిన మహ్మద్ ఉస్మాన్, గోల్కొండ ప్రాంతానికి చెందిన షేక్ సోఫియాన్ సహాయం కోరాడు. వీరికి రూ.10 వేలు ఇచ్చి తాను పిలిచిన వెంటనే రావాలని సూచించాడు. ఈ నెల 11న మహ్మద్ ఇక్బాల్ సిద్ధిపేట వెళ్తున్నట్లు సమాచారం అందడంతో లతీఫ్ 11న తెల్లవారుజామున మహ్మద్ ఉస్మాన్, షేక్ సోఫియన్‌తో కారులో వేచి ఉన్నాడు. ఇక్బాల్ యాక్టివాపై టోలిచౌకీ వైపు వెళుతుండగా లక్ష్మిగూడ రోడ్డు వద్దకు రాగానే లతీఫ్ కారును బైక్‌కు అడ్డుపెట్టి ఇక్బాల్‌ను కిడ్నాప్ చేశాడు. చదవండి: (ఇద్దరితో పెళ్లి.. మరొకరితో సహజీవనం.. చివరకు..) బైక్‌ను షేక్ సోఫియాన్ తీసుకోగా కారులో లతీఫ్, మహ్మద్ ఉస్మాన్ ఇక్బాల్ కాళ్లు, చేతులు కట్టేసి కత్తితో పొడిచి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఈసీ నదిలో పారవేశారు. నది వద్దకు కారు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో మృతదేహాన్ని లాక్కెళ్లారు. ఈ సందర్భంగా ఇక్బాల్‌కు చెందిన ప్రెస్ ఐడీ కార్డు పడిపోయింది. అయితే నదిలో నీరు కొద్దిగా ఉండడంతో మూడు రోజులకే మృతదేహం పైకి తేలింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలో దొరికి ప్రెస్ ఐడీ కార్డు ఆధారంగా ముందుకు సాగారు. సీసీ కెమెరాల్లో 11న తెల్లవారుజామున టాటా ఇండికా కారు, యాక్టివా తెల్లవారుజామున రావడం, 25 నిమిషాల్లో తిరిగి వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు వాటి నంబర్లు లేకపోవడంతో ఆ దిశలో దర్యాప్తు ప్రారంభించారు. ఇక్బాల్ మృతిపై అతడి భార్యకు సమాచారం అందించగా తన భర్త మూడు రోజుల క్రితం బయటికి వెళ్లి రాలేదని చెప్పింది. మూసీ నదిలో దొరికిన మృతదేహాన్ని చూసినా ఆనవాళ్లు సరిగ్గా చెప్పకపోడంతో ఆమెను మరింత లోతుగా ప్రశ్నించగా అసలు విషయం వెల్లడించింది. దీంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ తెలిపారు. చదవండి: (Hyderabad: స్పా ముసుగులో వ్యభిచారం, ఐదుగురి అరెస్టు) -
తన గర్ల్ ఫ్రెండ్ కు హాయ్ చెప్పాడంటూ టెన్త్ విద్యార్ధిపై దాడి
-
సాగును లాభసాటిగా మార్చాలి
ఏజీ వర్సిటీ: దేశంలో వ్యవసాయ ఉత్పత్తిని పెంచడంతోపాటు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా పరిశోధనలు విస్తృతం చేయాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఈ రంగంలో జరిగే ప్రతి పరిశోధన అంతిమ లక్ష్యం వ్యవసాయాన్ని సుస్థిరం చేయడం, వాతావరణ మార్పుల నుంచి పంటలను రక్షించుకోవడం, అన్నదాతల ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడం, దేశ ఆహార భద్రతను కాపాడటమే కావాలన్నారు. వెంకయ్య శనివారం రాజేంద్రనగర్‌లోని జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ (ఐసీఏఆర్–ఎన్‌ఏఏఆర్‌యం) స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వ్యవసాయ పరిశోధనలకు మరింత ప్రోత్సాహమివ్వాలని కోరారు. ప్రతి రైతును సంప్రదాయ విధానం, ఆధునాతన సాంకేతిక పద్ధతులతో కలిసి పనిచేసేలా చైతన్యపరచాల్సిన బాధ్యతను వ్యవసాయ విద్యాలయాలు తీసుకోవాలని సూచించారు. రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసే విషయంలోనూ స్థానిక భాషలోనే శాస్త్రవేత్తలు వారికి బోధించాలని చెప్పారు. జెనోమిక్స్, మాలిక్యులర్ బ్రీడింగ్, నానోటెక్నాలజీ మొదలైన రంగాలపై దృష్టిసారించాలన్నారు. డ్రోన్లు, కృత్రిమ మేధ వంటి సాంకేతికతనూ వ్యవసాయానికి మరింత చేరువ చేయడంలో ఐసీఏఆర్ మరింత కృషి చేయాలని చెప్పారు. వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న వారు వ్యవసాయాన్ని సంఘటిత రంగంగా మార్చేందుకు కృషి చేయాలని హితవు పలికారు. వాతావరణ సమస్యలు, ఇతర అనేక ఇబ్బందులు ఎన్నున్నా అన్నదాత తన బాధ్యతను విస్మరించకుండా ఆహారోత్పత్తికోసం అహర్నిశలు శ్రమిస్తున్నాడని వెంకయ్య చెప్పారు. కరోనా సమయంలోనూ దేశంలో ఆహారోత్పత్తి ఏమాత్రం తగ్గకపోగా ఉత్పత్తి పెరిగిందని, ఇది అన్నదాతల అంకితభావానికి నిదర్శమని పేర్కొన్నారు. -
రాజేంద్రనగర్‌లో ఆటోడ్రైవర్ వీరంగం.. మహిళలపై దాడి
Rajendranagar: టో ట్రాలీని నెమ్మదిగా వెళ్లమని సూచించినందుకు డ్రైవర్ ఇద్దరు మహిళలతో పాటు మరో యువకుడిపై దాడికి దిగాడు. ఈ ఘటనను స్థానికులు తమ సెల్ఫోన్లలో వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దీంతో శనివారం ఈ విషయం బయటకు వచ్చింది. హైదర్‌గూడకు చెందిన చందు తన ద్విచక్ర వాహనంపై కుటుంబ సభ్యులతో ఈశ్వర్ థియేటర్ లైన్ రోడ్డులో శుక్రవారం సాయంత్రం వెళ్తున్నాడు. ఇదే సమయంలో ఓ ఆటో ట్రాలీలో వస్తూ వారి పక్క నుంచి కట్ కొట్టాడు. దీంతో వాహనంపై ఉన్న మహిళలు నెమ్మదిగా వెళ్లమని తెలపడంతో ఆటో డ్రైవర్ వాగ్వాదానికి దిగి మొదట చందుపై దాడి చేశాడు. అనంతరం అడ్డుకునేందుకు యత్నించిన మహిళలపై సైతం దాడి చేశాడు. ఈ ఘటనను స్థానికులు తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు. ఈ వీడియోలు శనివారం వైరల్ కావడంతో రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అక్కడి వైద్యం..ఓ ధైర్యం
సాక్షి హైదరాబాద్(ఏజీవర్సిటీ): ఇంట్లో ఇష్టంగా పెంచుకుంటున్న పప్పీకి గానీ..పిల్లికి గానీ అనారోగ్యం సోకితే.. మనం కనిపిస్తే చాలు కళ్లల్లో ఆనందం నింపుకొని గెంతులేస్తూ వచ్చి ఒళ్లో వాలిపోయే నోరు లేని ఆ జీవులు కదలకుండా కూర్చుంటే..మనసు కీడు శంకిస్తుంది..వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని పోరుపెడుతుంది. అప్పుడే మనకు అసలు సమస్య ఎదురవుతుంది. చికిత్సకోసం ఎక్కడికి తీసుకెళ్లాలని? అటువంటి వారికోసమే సేవలందిస్తోంది రాజేంద్రనగర్‌లోని ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రి. కుక్క..కోడి..పిల్లి..మేక..ఏదైనా సరే మేం వైద్యమందిస్తామని గర్వంగా చెబుతున్నారు అక్కడి వైద్యులు. మేకలు, పిల్లులకు ఉచితమే... వెటర్నరీ ఆసుపత్రిలో మేకలు, పిల్లులు, గెదే, గొర్రె, ఆవు తదితర వాటన్నిటికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ల బృందం ఆసుపత్రికి వచ్చిన ప్రతి జంతువుకు మొదట దాని జాతి, బరువు, జ్వరం తదితరాలు నమోదు చేస్తారు. అనంతరం వ్యాధికి సంబంధించిన డాక్టర్ వద్దకు పంపించి పరిశీలించి అనంతరం సూదులు, మందులు ఉచితంగా అందజేస్తారు. కుక్కలు, కుందేలు, గుర్రాలు, చిన్న జీవులు తదితర వాటిని రూ. 20 ఫీజులు వసూలు చేస్తున్నారు. అధునాతన పరికరాలు ఎలాంటి అనారోగ్యాలపాలైన బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాం. మా ఆసుపత్రికి ప్రతి రోజు 200 వరకు రకరకాల జంతువులను చికిత్స కోసం తీసుకువస్తారు. ఆసుపత్రిలో అధునాతనమైన పరికరాలు ఉన్నాయి. అల్ట్రాసౌండ్, స్కానింగ్, ఎక్స్‌రే తదితర పరికరాలు ఉన్నాయి. మాతో పాటు మా సిబ్బంది, పీజీ విద్యార్థులు ఎల్లవేళల అందుబాటులో ఉంటాం. – అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రామ్‌సింగ్ 30 కిలోమీటర్ల దూరం నుంచి వస్తాం.. మా తాతముత్తాతల నుంచి రకరకాల మేకలను మేము పెంచుతున్నాం. ఈ మేకలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఇక్కడికే వచ్చి వైద్యం చేయిస్తాం. ఎప్పుడు కూడా డబ్బులు తీసుకోలేదు. ఉచితంగానే వైద్యంతో పాటు మందులు కూడా ఇస్తారు. మా ఇంటి ఆసుపత్రికి రావడానికి సుమారు 30 కిలోమీటర్లు అవుతుంది. అయినా మంచి వైద్యం అందుతుంది కాబట్టి ఇక్కడికే వస్తున్నాం. – మహ్మద్ ఇబ్రహీం, మొఘల్‌పురా త్వరలో నూతన భవనం ప్రారంభం ఇక్కడ 55 సంవత్సరాలనుంచి సేవలందిస్తున్నాం. కొన్ని మూగ జీవాలకు తక్కువ ఫీజు తీసుకుంటాం. చాలావాటికి ఉచితంగా సేవలందిస్తాం. ఇప్పటికి లక్షలాది జీవులకు ప్రాణం పోశాం. ఆసుపత్రి భవనం సరిపోవడం లేదని ప్రభుత్వానికి సూచించడంతో రూ. 11 కోట్ల తో అధునాతన హంగులతో నూతన భవనం నిర్మించాం. త్వరలో ప్రారంభిస్తాం. జరుగుతుంది. – రవీందర్‌రెడ్డి, వైస్ ఛాన్సలర్ -
Hyderabad: ఇస్తా సిటీ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇస్తా సిటీ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్లాట్ నెంబర్ ఐదు వందల ఒకటిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అపార్ట్ మెంట్ వాసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్‌తోనే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. చదవండి: (నాలుగేళ్లుగా మంచంలో.. ఇక జీవితమే లేదనుకున్నాడు.. అంతలోనే..) -
రాజేంద్రనగర్‌లో దారుణం.. టెన్త్ క్లాస్ విద్యార్థినిపై అత్యాచారం
సాక్షి, రంగారెడ్డి: రాజేంద్రనగర్‌లో దారుణం జరిగింది. పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ మానవ మృగం అత్యాచారానికి పాల్పడింది. ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న అమ్మాయికి ఓ యువకుడు మాయమాటలు చెప్పి మోటార్ సైకిల్‌పై హిమాయత్‌సాగర్ వైపు తీసుకెళ్లాడు. మార్గమధ్యలో చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. అత్యాచారం అనంతరం తిరిగి బాధిత యువతిని నిందితుడు ఇంటి వద్ద వదిలి వెళ్లాడు. అయితే తనపై జరిగిన అత్యాచార ఘటన గూర్చి ఇంట్లో ఉన్న తల్లితో బాధితురాలు చెప్పుకుంది. దీంతో వెంటనే తల్లి, బాధితురాలుతో కలిసి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు యువకునిపై అత్యాచార కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ఏడాది పాటు కాపురం.. మోజు తీరాక..) -
యువతులకు డబ్బును ఎరగా చూపి వ్యభిచారం..
సాక్షి, మైలార్‌దేవ్‌పల్లి (హైదరాబాద్): నిరుపేద యువతులకు డబ్బును ఎరగా చూపుతూ.. గత కొంత కాలంగా వ్యభిచారం చేయిస్తున్న ఓ మహిళను మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మైలార్‌దేవ్‌పల్లి ఇన్స్పెక్టర్ నర్సింహ్మ తెలిపిన వివరాల ప్రకారం.. వట్టెపల్లి మహ్మదీయ కాలనీకి చెందిన షాబానాబేగం(37)ను గత కొంత కాలంగా పేదరికంలో ఉన్న అమ్మాయిలను వ్యభిచార వృత్తిలోకి దింపుతోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
అదృశ్యమైన బాలుడు అనీష్ మృతి
-
లైంగిక దాడి కేసు: ముగ్గురు ఆటో డ్రైవర్ల రిమాండ్
రాజేంద్రనగర్: ఇంటి వద్ద దింపుతామని ఆటోలో తీసుకువెళ్ళి ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల వద్ద నుంచి ఆటోతో పాటు బాధితురాలి సెల్‌ఫోన్, రోల్డ్ గోల్డ్ చైన్, పర్సును స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ కనకయ్య తెలిపిన మేరకు.. పురానాపూల్ ప్రాంతానికి చెందిన 35 సంవత్సరాల వివాహిత సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తోంది. ఆమెకు కల్లు తాగే అలవాటు ఉండటంతో హైదర్‌గూడలోని కల్లు కంపౌండ్‌కు వచ్చి కల్లు తాగి ఇంటికి తిరిగి వెళ్ళేది. ఇందులో భాగంగానే ఈ నెల 13న హైదర్‌గూడ కంపౌండ్‌కు వచ్చింది. ఇదే సమయంలో కూకట్పల్లి వివేక్నగర్కు చెందిన ఆటో డ్రైవర్ నర్సింగ్‌రావు(32), జగద్గిరిగుట్టకు చెందిన నరేష్(31), బాలానగర్‌కు చెందిన ప్రసాద్(35) లు వచ్చారు. ఈ ముగ్గురూ మహిళతో మాటలు కలిపి పరిచయం చేసుకున్నారు. తాము కూడా ఆటోలో పురానాపూల్ వైపు వెళ్తున్నామని ఇంటి వద్ద దించేస్తామని నమ్మించారు. అత్తాపూర్ మీదుగా తిరిగి రాజేంద్రనగర్ వైపు ఆటోను మళ్లించడంతో ఆ మహిళ ఎక్కడకు తీసుకువెళ్తున్నారని అడగడంతో హోటల్లో బిర్యానీ తిని వెళదామని తెలిపారు. హిమాయత్‌సాగర్ లార్డ్స్ కళాశాల వెనుక భాగంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి ముగ్గురూ లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలి సెల్‌ఫోన్, మెడలోని రోల్డ్ గోల్డ్ చైన్, పర్సును తీసుకోని ఆటోలో పరారయ్యారు. అర్ధరాత్రి సమయంలో స్థానికుల సహాయంతో బాధితురాలు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కల్లు కంపౌండ్‌తో పాటు ప్రధాన రహదారులు, హోటల్, హిమాయత్‌సాగర్ ప్రాంతంలోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల ఆటో నెంబర్‌ను గుర్తించి శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించడంతో రిమాండ్‌కు తరలించారు.