బెల్టు షాపులపై దాడులు | on belt shop attacks | Sakshi
Sakshi News home page

బెల్టు షాపులపై దాడులు

Published Sun, Apr 27 2014 1:51 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

బెల్టు షాపులపై దాడులు - Sakshi

బెల్టు షాపులపై దాడులు

అనంతగిరి, న్యూస్‌లైన్: బెల్టు దుకాణాల్లో దాడులు నిర్వహించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రాజేంద్రనగర్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయభాస్కర్ పేర్కొన్నారు. శనివారం ఆయన వికారాబాద్‌లోని సర్కిల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పూడూరు మండలం గట్టుపల్లిలో ఓ మహిళ ఇంట్లో దాడులు చేసి 480 సారా ప్యాకెట్లు, 44 నాకౌట్ బీర్లు, 28 క్వార్టర్ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. దీంతో పాటు మంచన్‌పల్లి గ్రామంలో రాంచంద్రయ్య ఇంట్లో తనిఖీలు చేసి 12 క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈమేరకు నిందితులను రిమాండుకు తరలించినట్లు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ తెలిపారు. 

సారా బట్టీలపై దాడులు
 మర్పల్లి: పలు తండాల్లో ఎక్సైజ్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. రాజేంద్రనగర్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయభాస్కర్ ఆధ్వర్యంలో షాపూర్ తండా, దామస్తాపూర్ తండా, బంట్వారం మండలం నాగారం తండాలో తనిఖీలు చేశారు. 4,050 లీటర్ల ఊట బెల్లంతో పాటు 110 లీటర్ల సారాను ధ్వంసం చేశారు. మరో ఘటనలో.. శనివారం సాయంత్రం ఓ ఆటో(ఏపీ 28 వీ 0052)లో మర్పల్లి నుంచి కోటమర్పల్లికి తరలిస్తున్న 192 క్వార్టర్ మద్యం బాటిళ్లను  స్వాధీనం చేసుకున్నారు. ఆటోను సీజ్ చేసి డ్రైవర్ మహ్మద్‌జలీల్‌ను రిమాండుకు తరలించినట్లు సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ సుధాకర్‌వర్మ, ఎస్సైలు శ్రీనివాస్, రఘురాంరెడ్డి, సిబ్బంది ఉన్నారు.

 వేర్వేరు ఘటనల్లో మద్యం పట్టివేత
 తాండూరు టౌన్: వేర్వేరు ఘటనల్లో పోలీసులు మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టణ సీఐ వెంకట్రామయ్య కథనం ప్రకారం.. పెద్దేముల్ మండలం తట్టేపల్లి గ్రామానికి చెందిన కోట్ల మల్లికార్జున్ ఓ ఆటోలో 239 క్వార్టర్ బాటిళ్లను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. తాండూరు మండలం నారాయణపూర్‌కు చెందిన సురేష్ నుంచి 25 క్వార్టర్ బాటిళ్లు, యాలాల మండలం ఎన్కేపల్లి గ్రామస్తుడు బీటీ గోవింద్ వద్ద 45 క్వార్టర్ బాటిళ్లు, పెద్దేముల్ మండలం కోటపల్లికి చెందిన కోమలి శ్రీనివాస్ క్వాలిస్‌లో తరలిస్తున్న 90 బీర్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చెప్పారు. నిందితులు మల్లికార్జున్, సురేష్, బీటీ గోవింద్, శ్రీనివాస్‌లతో పాటు క్వాలిస్ డ్రైవర్ జైపాల్‌రెడ్డి, ఆటో డ్రైవర్ ఇస్మాయిల్‌లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. క్వాలిస్‌ను సీజ్ చేసినట్లు సీఐ చెప్పారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement