belt shop
-
బాధ్యత మరచి ఎదురుదాడా!
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఆర్నెల్లు గడుస్తున్నా తన వైఫల్యాలను, తప్పిదాలను ఒప్పుకోకుండా వైఎస్సార్ సీపీపై బురద చల్లేందుకు ఆపసోపాలు పడటం సిగ్గుచేటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ప్రజలపై రూ.15 వేల కోట్లకుపైగా విద్యుత్తు చార్జీల భారాన్ని మోపడం.. మరోవైపు నిత్యం జగన్ జపం చేస్తూ ఎల్లో మీడియాలో బురద కథనాలకే పరిమితమైందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇసుక నుంచి మద్యం వరకు.. కాకినాడలో పీడీఎస్ బియ్యం నుంచి ధాన్యం రైతులను తుపాన్‌కు వదిలేయడం దాకా అడుగడుగునా కూటమి సర్కారు వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని గుర్తు చేస్తున్నారు.ఇసుకలో లూటీ చేసేదీ వారే..! బెల్టు షాపులకు అనుమతి ఇచ్చేదీ వారే..! బియ్యాన్ని ఎగుమతి చేసేది వారే.. మళ్లీ స్మగ్లింగ్ జరుగుతోందంటూ హడావుడి చేసేదీ వారేనని పేర్కొంటున్నారు. అసలు కాకినాడ పోర్టుకు రేషన్ బియ్యం ఎందుకు వస్తోంది? పీడీఎస్ బియ్యం వస్తుంటే గత ఆర్నెల్లుగా ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? ఎవరు పంపుతున్నట్లు? కూటమి పార్టీల ప్రజాప్రతినిధులే దోపిడీ చేసి అమ్ముకుంటున్నారు కదా? తన పార్టీకి చెందిన మంత్రి పౌరసరఫరాల శాఖను పర్యవేక్షిస్తుంటే డిప్యూటీ సీఎం వచ్చి హడావుడి చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. స్థానిక ఎంపీ కూడా అదే పార్టీకి చెందిన వారని ప్రస్తావిస్తున్నారు. సీఎంఆర్ బియ్యం బకాయిల విడుదలలో కమీషన్ల పర్వం వెలుగులోకి రావడంతో దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించడం.. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, గత సర్కారుపై బురద చల్లడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోందంటున్నారు. ఊరూరా బెల్ట్ షాపులు తెరిచి.. బెల్ట్ తీస్తామంటారా?మద్యం దుకాణాలను లాటరీ పేరుతో కూటమి శ్రేణులకు కట్టబెట్టిన ప్రభుత్వ పెద్దలు.. టీడీపీ కార్యకర్తలకు లబ్ధి చేకూర్చడం కోసం ఊరూరా బెల్ట్ షాపులను తెరిపించారు. సీఐ, ఎస్ఐలను పంపి ఇతరులకు మద్యం దుకాణాలు దక్కకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. ఊరూరా ఒక్కో బెల్ట్ షాపును వేలం వేసి వచ్చిన డబ్బులను టీడీపీ కార్యకర్తలకు పంచిపెట్టారు. రూ.2 లక్షల నుంచి మూడు లక్షల దాకా వసూలు చేస్తూ నీకింత.. నాకింత! అని వాటాల దందా నడిపిస్తున్నారు. బెల్ట్ షాపులతో వాడవాడలా మద్యం ఏరులై పారుతోంది. ఈ అక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు.. బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తానంటూ సీఎం చంద్రబాబు బీరాలు పలుకుతుండటంపై ఎక్సైజ్‌శాఖ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. స్వయంగా హోంమంత్రి అనిత ఇలాకాలో కూడా బెల్టు షాపుల దందా తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.కాకినాడ కేంద్రంగా బియ్యం డ్రామా!ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం పంపిణీ కోసం సేకరించిన వరి ధాన్యాన్ని మర ఆడించేందుకు పౌరసరఫరాల శాఖ మిల్లర్లకు అప్పగిస్తుంది. మిల్లర్లు మర ఆడించి సీఎంఆర్ కింద బియ్యాన్ని తిరిగి అప్పగిస్తారు. దీనికి సంబంధించి సుమారు రూ.1,600 కోట్ల వరకు మిల్లర్లకు ప్రభుత్వం చెల్లించాలి. ఆ బిల్లుల చెల్లింపులో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయని రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కాకినాడ కేంద్రంగా సరి కొత్త డ్రామాకు తెర తీశారు.స్మగ్లింగ్‌కు కాకినాడ పోర్టు అడ్డాగా మారిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించడం విస్మయానికి గురి చేస్తోంది. కాకినాడ యాంకరేజ్ పోర్టు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంటుంది. బియ్యం ఎగుమతి.. ఎరువుల దిగుమతి అంతా యాంకరేజ్ పోర్టు మీదుగానే సాగుతుంది. కాకినాడ యాంకరేజ్ పోర్టుకు.. కాకినాడ పోర్టుకు ఎలాంటి సంబంధం ఉండదు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న యాంకరేజ్ పోర్టు ద్వారా బియ్యం అక్రమ రవాణా ఎలా సాధ్యమవుతుందని అధికార వర్గాలే ప్రశ్నిస్తున్నాయి. పారదర్శక వ్యవస్థను తొలగించి ఇంటికే పౌరసేవలా?ప్రభుత్వ సేవలు, పథకాలను పారదర్శకంగా ఇంటి గుమ్మం వద్దే ప్రజలకు అందించే లక్ష్యంతో వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా దేశంలోనే ఎక్కడా లేనివిధంగా గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టింది. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చాక 2.60 లక్షల మంది వలంటీర్లను తొలగించి దారుణంగా వంచించారు. వలంటీర్ వ్యవస్థను రద్దు చేసిన సీఎం చంద్రబాబు తాజాగా ఇంటి గుమ్మం వద్దకే పౌర సేవలు అందిస్తానని చెప్పడంపై విస్తుపోతున్నారు. వలంటీర్లు లేకపోవడంతో టీడీపీ నేతలు లబ్ధిదారులను పెన్షన్ల కోసం ఇళ్ల వద్దకు రప్పించి చుట్టూ తిప్పుకుంటున్నారు. సచివాలయాల వద్ద ప్రజలు పడిగాపులు కాస్తున్న ఫోటోలు మీడియాలోనూ వచ్చాయి. మరోవైపు కూటమి సర్కారు దాదాపు లక్షన్నర పెన్షన్లను కుదించింది. ఇక పౌరసేవలు, పథకాలను ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.విద్యుత్ చార్జీలు తగ్గిస్తామంటూ బాదుడే బాదుడు..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ చారీలను ఏమాత్రం పెంచబోమని.. వాటిని తగ్గిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు ఊరూవాడా ప్రచారం చేశారు. అయితే హామీని నిలబెట్టుకోకుండా అధికారంలోకి వచ్చాక ఇప్పటికే రూ.15,485.36 కోట్ల భారాన్ని విద్యుత్ చార్జీల రూపంలో ప్రజలపై మోపారు. విద్యుత్ చార్జీల మంటతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. దాంతో ఆ నెపాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నెడుతూ సీఎం చంద్రబాబు బురద చల్లుతున్నారు.ధాన్యం రైతుకు దగా..ధాన్యం రైతులకు మద్దతు ధర కల్పించి ఆదుకోవడంలో కూటమి సర్కారు దారుణంగా విఫలమైంది. ఎమ్మెస్పీ దక్కకపోవడంతో అన్నదాతకు బస్తాకు రూ.300 – రూ.400 వరకు నష్టం వాటిల్లింది. దళారులకు అయినకాడికి అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పుడు తుపాన్ కారణంగా అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. నాలుగు రోజులు ముందే తుపాన్ హెచ్చరికలున్నా సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించి ముందస్తు జాగ్రత్తలు చేపట్టలేదు. ప్రభుత్వం పంటను కొనుగోలు చేయకుండా చోద్యం చూసింది. గోనె సంచులు సమకూర్చలేదు. పంట చేతికందే సమయంలో వర్షాలకు ధాన్యం తడిచిపోవడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది.అప్పులపై అవే అబద్ధాలు..వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని.. రూ.పది లక్షల కోట్లు.. రూ.12 లక్షల కోట్లు.. రూ.14 లక్షల కోట్లు అప్పు చేసిందని ఎన్నికలకు ముందు చంద్రబాబు, కూటమి నేతలు, ఎల్లో మీడియా ప్రచారం చేసింది. ఎన్నికల్లో సూపర్ సిక్స్‌తోపాటు వందల హామీలను ప్రజలకు చంద్రబాబు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్తోసహా ఎన్నికల హామీల అమలు నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి అప్పులతోపాటు రోజుకో డ్రామాకు తెర తీస్తున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2024–25 బడ్జెట్ సాక్షిగా రాష్ట్ర అప్పు రూ.6.46 లక్షల కోట్లేనని కూటమి ప్రభుత్వమే అంగీకరించింది. అయినా సరే రాష్ట్రం అప్పు రూ.పది లక్షల కోట్లు కంటే ఎక్కువ ఉందంటూ సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలను వల్లె వేస్తూ.. ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా ఉండటం వల్లే హామీలను అమలు చేయలేకపోతున్నానని సమర్థించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.పోలవరానికి ద్రోహం..వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ఎత్తును 41.15 మీటర్లకే తగ్గిస్తున్నారంటూ చంద్రబాబు, టీడీపీ నేతలు దుష్ఫ్రచారం చేశారు. అయితే ఇప్పటికే స్పిల్ వేను 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా నిర్మించామని.. పోలవరం ప్రధాన డ్యామ్‌ను కూడా అదే రీతిలో నిర్మిస్తామని.. కావాలంటే టేపు తీసుకుని వచ్చి కొలుచుకోవాలని నాడు సీఎంగా ఉన్న వైఎస్ జగన్ సవాల్ విసరడంతో తోక ముడిచారు. పోలవరంలో నీటిని నిల్వ చేసే ఎత్తును 45.72 మీటర్ల నుంచి ఒక్క అంగుళం కూడా తగ్గించబోమని అప్పటి కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సైతం పార్లమెంట్ ఉభయ సభల్లో అనేక మార్లు స్పష్టం చేశారు.కానీ.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడాది ఆగస్టు 28న పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వను పరిమితం చేస్తూ కేంద్ర కేబినెట్ తీర్మానం చేయడం గమనార్హం. దీనిపై ఆ సమావేశంలో పాల్గొన్న టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి కె.రామ్మోహన్నాయుడు నోరు మెదపలేదు. పోలవరానికి కూటమి ప్రభుత్వం తలపెట్టిన ద్రోహానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన దుష్ఫ్రచారాన్నే సీఎం చంద్రబాబు, మంత్రి నిమ్మల ఇప్పుడూ చేస్తుండటం గమనార్హం.ఇసుకపై ఇష్టారాజ్యంగా.. ఇసుక ఉచితంగా ఇస్తామంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీలిచ్చారు. వర్షాకాలంలో అవసరాల కోసం గత సర్కారు స్టాక్ పాయింట్లలో నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకలో 40 లక్షల టన్నులను అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే టీడీపీ నేతలు తెగనమ్మి సొమ్ము చేసుకున్నారు. అందరూ దసరా పండుగ సందడిలో ఉన్న సమయంలో కేవలం రెండు రోజులే గడువు ఇచ్చి ఇసుక రీచ్‌లకు టెండర్లు నిర్వహించారు. ఇసుక రీచ్‌లన్నీ టీడీపీ నేతలకే కట్టబెట్టారు. ఇసుక ధరలను పచ్చ ముఠాలు ఇష్టారాజ్యంగా వసూలు చేయడంపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహాన్ని తప్పించుకునేందుకు సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీశారు. -
బావ మాట అయినా మూడు పెగ్గులు.. ఆరు గ్లాసులే!!
సాక్షి, శ్రీ సత్యసాయి: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో మద్యం ఏరులై పారుతోంది. రాష్ట్రంలో దాదాపు ప్రతీ గ్రామంలో అడ్డగోలుగా బెల్ట్ షాపులు వెలిశాయి. కొన్ని చోట్లైతే టీడీపీ ముఖ్య నేతలు డబ్బులు తీసుకుని మరీ బెల్టు షాపులకు అనుమతి ఇస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. ఈ బాటలో చంద్రబాబు బావమరిది బాలకృష్ణ నియోజకవర్గం కూడా ఉందనే విషయం తాజాగా వెలుగు చూసింది. హిందూపురం నియోజకవర్గంలో బెల్టు షాపులు విచ్చలవిడిగా.. భారీగా వెలిశాయి. మందుబాబులకు మూడు పెగ్గులు.. ఆరు గ్లాసులుగా నడుస్తోంది అక్కడ. ఈ నియోజకవర్గంలో దాదాపు వందకుపైగా బెల్ట్ షాపులు ఉన్నట్టు అనధికార సమాచారం. ఇక, ఈ బెల్డ్ షాపులు మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వాళ్ల ఇష్టానుసారం లిక్కర్ అమ్మకాలు జరుపుతున్నారు. ఒక్కో లిక్కర్ బాటిల్‌పై రూ.20 అదనంగా తీసుకుంటున్నారు. అయితే, ఎలా పడితే అలా బెల్ట్ షాపులకు అనుమతులు ఇవ్వమని, అలా కాదని అమ్మితే రూ.5లక్షలు జరిమానా విధిస్తామని సాక్ష్యాత్తూ సీఎం చంద్రబాబే హెచ్చరించారు. ఇక్కడ కూడా కొందరు టీడీపీ లీడర్లే ఈ దందాలు నడిపిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. అయితే ఎక్సైజ్ అధికారులు పట్టించుకోని ఈ విషయాన్ని కనీసం.. బాలయ్య అని పట్టించుకోవాలని కింది స్థాయి కూటమి నేతలు కోరుకుంటున్నారు. మరి బావ మాటలను ఇప్పటికైనా బాలకృష్ణ సీరియస్‌గా తీసుకుంటారా? లిక్కర్ మాఫియాకు అడ్డుకట్ట వేస్తారా? అనే చర్చ మొదలైంది ఇప్పడు. -
3 క్వార్టర్లు, 6 ఫుల్లుల్లా కూటమి మద్యం దందా
-
గల్లీకో బెల్ట్ షాప్ పెడతారా?
సాక్షి, హైదరాబాద్: మద్యం అమ్మకాలపై, బెల్ట్ షాపులపై రాద్ధాంతం చేసిన కాంగ్రెస్ నాయకులే ఇప్పుడు అదే మద్యంతో అధిక రాబడి కోసం ప్రయతి్నస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. అసెంబ్లీలో శనివారం బడ్జెట్‌పై చర్చను ప్రారంభిస్తూ ఆయన మాట్లా డారు. మద్యం అమ్మకాల ద్వారా రూ. 7 వేల కోట్లకుపైగా అధికంగా రాబడిని బడ్జెట్లో చూపారని నిలదీశారు. ‘బీర్లపై డ్యూటీని రూ. 2,760 కోట్ల నుంచి రూ. 3,500 కోట్లకు పెంచారు.సుంకాన్ని రూ. 11,031 కోట్ల నుంచి 15,500 కోట్లకు పెంచి బీర్లు, లిక్కర్ ధరలు భారీగా పెంచబోతున్నట్లు స్పష్టం చేశారు. గతే డాది కంటే మద్యం అమ్మకాల కింద వ్యాట్ రూపంలో రూ.2 వేల కోట్లు వస్తుందంటున్నారు. ఊరికో బెల్ట్ షాప్ ఉందని గతంలో భట్టి అన్నా రు. మీరు ప్రతిపాదించిన దాన్నిబట్టి గల్లీకో బెల్ట్ షాప్ పెడతారా? మద్యాన్ని నియంత్రించి బెల్ట్ షాపులు ఎత్తేస్తామని చెప్పి ఇప్పుడు రూ. 7 వేల కోట్లకుపైగా అదనపు ఆదాయాన్ని ఎలా పెంచుకుంటారో చెప్పండి?’ అని హరీశ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో అప్పు రూ. 3,85,340 కోట్లే బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు రూ. 3,85,340 కోట్లు మాత్రమేనని హరీశ్‌రావు అన్నారు. ‘బీఆర్ఎస్ ప్రభుత్వం 6,71,757 కోట్లు అప్పు చేసిందని పదేపదే చెబుతున్నారు. కోవిడ్ సమయంలో కేంద్రం 2020–21 ఆర్థిక సంవత్సరానికి జీఎస్డీపీలో 1.75% అధికంగా అప్పులు చేసే వెసులుబాటు కల్పించింది. గ్రాంట్ల రూపంలో రాష్ట్రాలను ఆదుకోకుండా అప్పులు తీసుకొనే స్థితికి నెట్టింది. కేంద్రం నిర్ణయాలు, కోవిడ్ వల్ల తెలంగాణ అనివార్యంగా రూ. 41,159 కోట్ల అప్పు తీసుకోవల్సిన పరిస్థితి వచి్చంది. అవన్నీ తీసేస్తే రూ. 3,85,340 కోట్లుగా అప్పు తేలుతుంది’ అని హరీశ్‌రావు చెప్పారు. వైఎస్సార్ పథకాలను కొనసాగించాం... ‘అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108 అనే మంచి పథకాలని పేర్లు కూడా మార్చకుండా కొనసాగిస్తామని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే సభలో చెప్పారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను కేసీఆర్ సభలో పొగిడి కొనసాగించారు. కానీ మీరు అలాంటి హుందాతనాన్ని ప్రదర్శించకుండా కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ పథకాలు రద్దు చేయడంతో పేద గర్భిణులపై ఎంతో ప్రభావం చూపుతుంది. మీకు భేషజాలు ఉంటే పథకాల పేర్లు మార్చుకోండి. కానీ దయచేసి పథకాలు ఆపకండి. ఆరోగ్యశ్రీకి గతేడాదితో పోలిస్తే బడ్జెట్‌ను కుదించారు’ అని హరీశ్ విమర్శించారు. గన్‌పార్క్ వద్దకు వెళ్లి కరెంటు వస్తుందా లేదా ప్రజలను అడుగుదాం? ‘బీఆర్ఎస్ పాలనలో అన్ని రంగాలకు 24 గంటలు కరెంట్ ఇచ్చాం. పది నిమిషాలు టీ బ్రేక్ ఇస్తే గన్‌పార్క్ దగ్గర రోడ్డు మీదికి వెళ్దాం. నాతోపాటు డిప్యూటీ సీఎం భట్టిని రమ్మనండి. మా పాలనలో కరెంట్ బాగుందా? ఇప్పుడు బాగుందా? అని ప్రజల్ని అడుగుదాం’ అని హరీశ్‌రావు అన్నారు. -
మందుబాబులకు తెలంగాణ సర్కార్ షాక్?
సాక్షి, హైదరాబాద్: మందు బాబులకు షాక్ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోందా?. గత ప్రభుత్వాల నిర్ణయాలపై వరుస సమీక్షలతో గడుపుతున్న సీఎం రేవంత్‌రెడ్డి ఈ దిశగా అధికార యంత్రాంగంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఈ క్రమంలో.. తెలంగాణ వ్యాప్తంగా బెల్ట్ షాపుల మూసివేతకు తెలంగాణ సర్కార్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే.. వైన్ షాపుల లిక్కర్ సేలింగ్ సమయాన్ని సైతం కుదించే దిశగా సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా 2,620 బెల్ట్ షాపులు ఉన్నాయి. మరోవైపు మద్యం రేట్ల విషయంలోనూ విధివిధానాల రూపకల్పన కోసం.. ఒక పాలసీ ఏర్పాటు యోచనలోనూ రేవంత్ సర్కార్ ఉన్నట్లు సమాచారం. మరో రెండు, మూడు రోజుల్లో ఈ అంశంపై ఒక స్పష్టమైన ప్రకటన వెలువడొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికప్పుడు అది అమలు కాకపోవచ్చనే అభిప్రాయమూ వ్యక్తం చేస్తున్నారు కొందరు అధికారులు. -
90ఎం.ఎల్. పోయట్లేదు.. బెల్ట్‌షాప్‌పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
సాక్షి, జగిత్యాల జిల్లా: జగిత్యాల రూరల్ మండలం హబ్సీపూర్ గ్రామంలోని బెల్ట్‌షాపు నిర్వాహకుడు మద్యం పోయడం లేదని ఓ వ్యక్తి మంగళవారం రాత్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హబ్సీపూర్ గ్రామానికి చెందిన చిరంజీవి మంగళవారం ఉదయం గ్రామంలోని రవికి చెందిన బెల్ట్‌షాపులోకి వెళ్లాడు. తనకు 90 ఎం.ఎల్.మద్యం పోయాలని కోరగా.. అందుకు నిర్వాహకుడు నిరాకరించాడు. అయితే, తనను కులం పేరుతో తిట్టడమే కాక తనకు మద్యం పోయకుండా అవమానించాడని బాధితుడు రాత్రి పోలీసుస్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. చిరంజీవి ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేస్తున్నారు. -
బెల్ట్ షాపుల సరికొత్త ప్రచారం..
-
మద్యం మత్తుకు.. ‘మామూళ్ల’ కిక్కు!
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఆరు వైన్‌షాప్‌లు ఉన్నాయి. అవన్నీ సిండికేట్‌గా దందా చేస్తున్నాయని.. మండలంలోని ఓ గోదాంలో సరుకు నిల్వచేసి మరీ సిండికేట్ నిర్వాహకులు బెల్ట్‌షాపులకు మందు పంపిస్తుంటారని ఎక్సైజ్ వర్గాలకూ తెలుసు. ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు అమ్మడం ద్వారా బెల్టుషాపులతో నెలకు లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. అయితే సిండికేట్ నుంచి కొందరు ఎక్సైజ్ సిబ్బందికి నెలకు రూ.1.20 లక్షలు, సివిల్ పోలీసు అధికారులు, సిబ్బందికి మరో రూ.1.20 లక్షలు ముడుపులు అందుతుండటంతో ఈ వ్యవహారమంతా చూసీచూడనట్టు వదిలేస్తున్నట్టు ప్రచారముంది. .. ఇది కేవలం పర్వతగిరి మండలానికి చెందిన విషయం కాదు. దాదాపు రాష్ట్రమంతటా ఇదే తరహాలో దందా కొనసాగుతోందని.. అటు ఎక్సైజ్ పోలీసులు, ఇటు సివిల్ పోలీసులు వైన్‌షాపులు, బార్ల యజమానుల నుంచి నెలవారీ మామూళ్లను ముక్కు పిండి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇది ఎప్పటి నుంచో కొనసాగుతున్నా ఈ మధ్య ‘వసూళ్ల’ డిమాండ్ పెరిగిందని.. లేకుంటే ఏదో ఒక పేరిట ఇబ్బందిపెడుతున్నారని అంటున్నారు. ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో ఇలాంటి అంశాలు మరిన్ని వెలుగుచూశాయి. అమ్మకాలను బట్టి మామూళ్ల లెక్క.. రాష్ట్రంలోని వైన్‌షాపులు, బార్ అండ్ రెస్టారెంట్ల నుంచి వసూళ్లు గత రెండేళ్ల కాలంలో రెండింతల వరకు పెరిగినట్టు అంచనా. ముఖ్యంగా సివిల్ పోలీసుల దందా ఎక్కువైందని వైన్‌షాప్‌ల నిర్వాహకులు అంటున్నారు. దీనికితోడు అప్పుడప్పుడూ మద్యం బాటిళ్లు కూడా ఫ్రీగా తీసుకెళ్తుంటారని చెప్తున్నారు. ఇక ఎక్సైజ్ సిబ్బందికి అయితే లైసెన్సు తీసుకున్నప్పుడు, రెన్యువల్ సమయంలో, ఫైనల్ క్లియరెన్స్ సందర్భంగా వారికి లక్షల్లోనే ముట్టజెప్పాల్సి వస్తుందని అంటున్నారు. ఈ మామూళ్లలో స్టేషన్ నుంచి డీఎస్పీ కార్యాలయం వరకు, నగరాల్లో అయితే ఏసీపీ స్థాయి అధికారుల వరకు వాటాలు చేరుతుంటాయనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా వైన్స్, బార్ల నిర్వాహకుల అక్రమ దందాలు ఓవైపు.. ఎక్సైజ్, సివిల్ పోలీసుల మామూళ్లు మరోవైపు కలిసి మందుబాబుల జేబుకు మాత్రం చిల్లు పడుతోందన్న విమర్శలు ఉన్నాయి. ఊరి నుంచి రాజధాని దాకా ఇంతే.. హైదరాబాద్ నగర శివార్లలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 44 వైన్‌షాపులు, 38 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వాటినుంచి ఎక్సైజ్ సిబ్బందికి నెలకు రూ.10.40 లక్షలు, సివిల్ పోలీసులకు రూ.5.20 లక్షలు మామూళ్ల రూపంలో వెళుతున్నట్టు ప్రచారముంది. కొన్ని నెలల కింద మామూళ్లను 50శాతం పెంచారని అంటున్నారు. మామూళ్లు ముట్టకపోతే వైన్‌షాపుల ముందు కానిస్టేబుల్ ప్రత్యక్షమవుతారని.. పార్కింగ్ నుంచి జనాలు గుమికూడే వరకు అన్ని విషయాల్లో ఇబ్బంది పెడుతుంటారని వైన్‌షాపుల నిర్వాహకులు చెప్తున్నారు. జనగామ జిల్లాలో వైన్‌షాపుల నిర్వాహకులు ఎక్సైజ్ పోలీసులకు నెలకు రూ.15వేల–30 వేలవరకు, సివిల్ పోలీసులకు రూ.20–35వేల వరకు ఇస్తున్నట్టు సమాచారం. గ్రేటర్ వరంగల్‌లో గతంలో ఎక్సైజ్ సిబ్బంది నెలకు రూ.15వేలు వసూలు చేసేవారని, ఇప్పుడు రూ.20వేలు తీసుకుంటున్నారని.. సివిల్ పోలీసులు కూడా రూ.10 వేల నుంచి రూ.15వేలకు పెంచారని వైన్స్‌షాపుల నిర్వాహకులు అంటున్నారు. పోలీసులకు మామూలు ముట్టకపోతే.. వైన్‌షాపు ఎదురుగా ట్రాఫిక్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని, న్యూసెన్స్ జరుగుతోందని కేసులు పెడుతున్నారని చెప్తున్నారు. కొన్నిచోట్ల సివిల్ పోలీసులే తనిఖీలు కూడా చేస్తున్నారని పేర్కొంటున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పోలీసులకు గతంలో నెలకు రూ.25 వేలు ఇచ్చేవారమని, ఇప్పుడు రూ.50 వేలు వసూలు చేస్తున్నారని వైన్స్‌షాపుల వర్గాలు చెప్తున్నాయి. లేకుంటే డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు, బెల్ట్‌షాపులపై దాడులు చేస్తుంటారని అంటున్నాయి. తమ వ్యాపారం ఎక్కడ దెబ్బతింటుందోనని ప్రతినెలా ఠంచన్‌గా ముట్టజెప్పాల్సి వస్తోందని చెప్తున్నాయి. హైదరాబాద్ నడిరోడ్డు హిమాయత్‌నగర్, నారాయణగూడ ప్రాంతాల్లో సివిల్ పోలీసుల దందా ఎక్కువైందని వైన్‌షాపుల యజమానులు చెప్తున్నారు. కేవలం ఎక్సైజ్ వాళ్లకు మాత్రమే ఇస్తే సరిపోదని, తమకూ ఇవ్వకపోతే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని అంటున్నారు. నారాయణగూడలో వైన్‌షాపుల నుంచి పోలీసులకు నెలకు రూ.25 వేల చొప్పున అందుతుంటాయని.. అందుకే సిబ్బంది ఆ షాపులు సమయం దాటి తెరిచి ఉన్నా, రోడ్డుపై ఇబ్బంది అవుతున్నా పట్టించుకోరని స్థానికులు ఆరోపిస్తున్నారు. మేడ్చల్ డివిజన్ పరిధిలో సివిల్ పోలీసులు తరచూ దావత్ల పేరుతో పెద్ద సంఖ్యలో మద్యం బాటిళ్లు తీసుకెళ్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడి బార్ల నుంచి నెలకు రూ.15 వేల దాకా వసూలు చేస్తున్నారని వైన్స్ నిర్వాహకులు చెప్తున్నారు. రాత్రి సమయం ముగిశాక మద్యం అమ్మితే.. అందినంత దోచుకుని ఏమీ జరగనట్టు వెళ్లిపోతుంటారని స్థానికులు అంటున్నారు. ఖమ్మం జిల్లాలో గోదావరి జిల్లాలకు ఆనుకుని ఉండే ప్రాంతాల్లోని వైన్స్ నుంచి పోలీసులకు నెలకు రూ.50వేల చొప్పున అందుతాయని.. పైగా అడిగినన్ని మద్యం బాటిళ్లూ ఇవ్వాల్సిందేనని నిర్వాహకులు చెప్తున్నారు. అలా ఇవ్వకుంటే వైన్‌షాపుల్లో మద్యం అన్లోడ్ కూడా కానివ్వరని అంటున్నారు. ఇక ఎక్సైజ్ మామూళ్లు సాధారణమేనని.. లేకుంటే పర్మిట్ రూం, ఇతర అంశాల్లో తీవ్రంగా ఇబ్బందిపెడతారని ఆరోపిస్తున్నారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రాంతంలో కొందరు పోలీసుల మామూళ్ల దందా మరీ ఎక్కువన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ సమయానికి డబ్బులు అందకుంటే అలుగుతారని.. కొన్నిరోజులు ఇబ్బందిపెడతారని వైన్ షాపుల నిర్వాహకులు చెప్తున్నారు. స్టేషన్‌కు తీసుకెళ్లి ఇబ్బంది పెడుతున్నారు నెలవారీగా సివిల్ పోలీసులకు మామూళ్లు ఇవ్వకపోతే షాప్ వద్దకు వచ్చి ఇబ్బందిపెడతారు. షాప్‌లో పనిచేసే వారిని స్టేషన్‌కు తీసుకెళుతుంటారు. లేదంటే షాప్ దగ్గర డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు పెట్టి భయాందోళనకు గురిచేస్తున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఓ వైన్‌షాప్ నిర్వాహకుడు మద్యం కూడా ఫ్రీగా తీసుకెళ్తారు ప్రభుత్వ జీతాలైనా ఆలస్యంగా అందుతాయేమోగానీ పోలీసులకు ఇచ్చే మామూళ్లకు మాత్రం ఆలస్యం జరగకూడదు. డబ్బులేకాదు వారు అడిగినప్పుడల్లా మద్యం బాటిళ్లు ఫ్రీగా ఇవ్వాలి. లేదంటే వేధింపులు మొదలవుతాయి. మాకు మిగిలే దాంట్లో ఎంతోకొంత ఇచ్చి ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటున్నాం. డబ్బులిస్తే మా జోలికి వచ్చే వారే ఉండరు. – వైన్‌షాప్ యజమాని, నారాయణగూడ, హైదరాబాద్ -
బెల్ట్ షాప్ వద్దన్నాడని.. సామాజిక బహిష్కరణ!
ఏర్పేడు (తిరుపతి): గ్రామంలో మద్యం అమ్మరాదని ప్రశ్నించాడని ఓ వ్యక్తిని గ్రామ బహిష్కరణ చేసిన సంఘటన మండలంలోని కొత్తవీరాపురంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం.. గ్రామానికి చెందిన పెద్దమనుషులు రామదాసు, కృష్ణారెడ్డి, సుబ్రమణ్యం, కుమార్, గిరిబాబు గ్రామంలో మద్యం అమ్మకాలకుగాను ఆదివారం రాత్రి వేలం నిర్వహించారు. గ్రామానికి చెందిన శ్రీనివాసులు, పెరిబ్బ, నాగభూషణమ్మ బెల్టు షాపును వేలంలో రూ.75 వేలకు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన కృష్ణయ్య మద్యం అమ్మడానికి వీలులేదని వ్యతిరేకించాడు. దీంతో కృష్ణయ్యతో మాట్లాడినా, ఇంటికి వెళ్లినా, పనులకు వెళ్లినా వారికి జరిమానా విధించి గ్రామ బహిష్కరణ చేస్తామని సోమవారం రాత్రి దండోరా వేశారు. అయితే గ్రామస్తులు దండోరా వేసే వ్యక్తిని మందలించి పంపారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి శ్రీనివాసులును అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించినట్లు సమాచారం. చదవండి: (Raptadu: టీడీపీ వర్గీయుల చేతిలో వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య) -
ముషంపల్లి ఘటనతో తెరపైకి బెల్ట్ షాపుల అంశం
-
బెల్ట్‌షాపు నిర్వాహకుడిపై మహిళల దాడి
-
‘ఇకపై ఒక వ్యక్తికి మూడు మద్యం బాటిళ్లే’
సాక్షి, అమరావతి : వచ్చే నెల 1వ తేదీ నుంచి పైలెట్ ప్రాజెక్టు కింద 500 మద్యం దుకాణాలను ప్రభుత్వం ప్రారంభించబోతుందని ఎక్సైజ్ కమిషనర్ ఎంఎం నాయక్ వెల్లడించారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 3000 మద్యం దుకాణాలు సర్కారు ఆధ్వర్యంలోనే నిర్వహిస్తామని చెప్పారు. గురువారం ఆయన తొలివిడత షాపుల నిర్వహణ కోసం సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కల సాకారం చేసే దిశగా ఎక్సైజ్ శాఖ పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సమూలంగా నిర్మూలించిందని చెప్పారు. జూన్ 1నుంచి ఆగస్ట్ చివరినాటికి 2,500 కేసులు నమోదు చేశామని వెల్లడించారు. సీఎం ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 4,380 షాపులను 3,500కు కుదించామన్నారు. మరికొద్ది గంటల్లోనే నూతన ఎక్సైజ్ పాలసీ అమలులోకి రాబోతుందని, అది పూర్తిగా అమల్లోకి వచ్చాక పర్మిట్ రూమ్‌లు ఉండవని స్పష్టం చేశారు. ఇకపై రాష్ట్రంలో బెల్టు షాపులు, ఎమ్మార్పీ ధరల ఉల్లంఘన ఉండబోవన్నారు. ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకే మద్యం అమ్మకాలు జరుగుతాయన్నారు. ఒక వ్యక్తి దగ్గర ఆరు బాటిళ్లు ఉండొచ్చన్న నిబంధన రద్దు చేసి దానిని మూడు బాటిళ్లకు తగ్గించామని చెప్పారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
తప్పుచేస్తే వదలొద్దు
సాక్షి, చిత్తూరు : ఊరు బాగుంటే జనం బాగుంటారు.. జనం బాగుంటే సమాజం బాగుంటుంది. అందుకే సామాన్యుల ప్రశాంత జీవనానికి ఎక్కడా విఘాతం కలగకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. మంగళవారం అమరావతిలో కలెక్టర్లు, ఎస్పీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో.. తప్పుచేస్తే పార్టీలతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోమన్న సీఎం మద్యంపై యుద్ధం ప్రకటించారు. పోలీస్ స్టేషన్లలో జవాబుదారీతనం ఉండాలన్నారు. ఆ ప్రసంగం ఆయన మాటల్లోనే.. స్టేషన్లలో రిసెప్షన్ కేంద్రాలు న్యాయం కోసం సామాన్యుడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలంటేనే ఓ రకమైన భయాన్ని వ్యక్తం చేస్తుంటాడు. ఇలాంటి వారికి పోలీసుల పట్ల గౌరవం కలిగించాలంటే ప్రజలకు, పోలీసులకు మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలి. అందుకే ప్రతి పోలీస్‌స్టేషన్‌లో రిసెప్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఎస్పీలను సీఎం ఆదేశించారు. వచ్చిన ప్రతి ఫిర్యాదుకూ రశీదు ఇవ్వడంతో పాటు సమస్య పరిష్కారమయ్యే వరకు కిందిస్థాయి సిబ్బంది దానిపై ఆరా తీస్తుండాలి. తద్వారా అధికారుల్లో బాధ్యత పెరగడమేగాక ఫిర్యాదుదారుల పట్ల గౌరవంతో ఉంటారు. మద్యంపై యుద్ధం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్లే రానున్న ఐదేళ్లలో మద్యాన్ని ఫైవ్‌స్టార్ హోటళ్లకే పరిమితం చేస్తామని చెప్పడంతో ఆ దిశగా సీఎం ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా అక్టోబర్ ఒకటో తేదీకి జిల్లాలో ఎక్కడా బెల్టు దుకాణాలు ఉండకూదన్నారు. గాంధీ జయంతి రోజున బెల్టు దుకాణాలకు మంగళం పాడాలన్నారు. దీంతో జిల్లాలో టీడీపీ నేతలకు ఉపాధి కేంద్రాలుగా ఉన్న 5వేలకు పైగా దుకాణా లపై ఎక్సైజ్, పోలీసు శాఖ సంయుక్తంగా దాడులు చేయనున్నాయి. ఇక రహదారుల వెంబడి మద్యం దుకాణాలు వద్దని కూడా సూచించారు. ఈ లెక్కన జిల్లాలోని జాతీయ రహదారులపై 500 మీటర్ల లోపున్న 148 మద్యం దుకాణాలు, రాష్ట్ర రహదారులపై 220 మీటర్లలోపున్న 178 మద్యం దుకాణాలు, ఈ రెండు రోడ్లపై ఉన్న 9 బార్లు కనుమరుగవనున్నాయి. దీనికితోడు దాబాల్లో మద్యం లభిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో రోడ్డు ప్రమాదాలు తగ్గనున్నాయి. ‘హోదా’ ఉద్యమకారులపై కేసుల ఉపసంహరణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే నినాదంతో గత ఐదేళ్లలో పోరాటం చేసిన వారిపై నమోదైన కేసులను ఎత్తేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర విభజన తర్వాత జిల్లాలోని తిరుపతి, చిత్తూరు, మదనపల్లె ప్రాంతాల్లో ప్రత్యేక హోదా ఉద్యమాలు జరిగాయి. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపారు. హోదా పేరెత్తితే జైల్లో పెట్టడంటూ ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా ఐదేళ్ల కాలంలో ఉద్యమకారులతో పాటు ప్రజలకు అండగా నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపైనా కేసులు బనాయించారు. తాజాగా వైఎస్.జగన్ నిర్ణయంతో జిల్లాలో నమోదైన ప్రత్యేక హోదా కేసులు మాఫీ కానున్నాయి. సైబర్ క్రైంపై ఇటీవల సామాజిక మాధ్యమాల్లో మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయి. జిల్లాలో రోజుకు 30 మంది మహిళలు బాధితులుగా ఉంటే స్టేషన్లలో నెలకు రెండు కేసులు నమోదవడం కష్టతరంగా ఉంది. దీనికి ప్రధాన కారణం పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితులను పట్టుకోలేకపోవడమే. దీనిపైనా సీఎం స్పందించారు. విదేశాల్లో ఉపయోగించే సాంకేతిక విధానాన్ని ఇక్కడ వాడాలని, మహిళలపై ఆన్లైన్ వేదికల్లో జరుగుతున్న వేధింపులను అరికడుతూ నిందితులను చట్టం ముందు నిలబెట్టాలన్నారు. ఈవ్‌టీజింగ్ నివారణ, ఆన్లైన్ మోసాలపై ఎస్పీలు చొరవ చూపాలని చెప్పడం మహిళలకు రక్షణగా నిలవడమే అవుతుంది. -
బెల్టు తీయాల్సిందే
సాక్షి,గుడివాడ: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్యనిషేధంపై తీసుకున్న నిర్ణయంలో భాగంగా బెల్టుషాపులపై ఉక్కుపాదం మోపుతూ తొలి అడుగు వేశారు. ఎక్కడైనా బెల్టు షాపులు నిర్వహిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల వారీగా బృందాలు ఏర్పాటుచేసి పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గ్రామాల్లో బెల్టు షాపులకు తావు లేకుండా పోతోంది. గత ప్రభుత్వం బెల్టుషాపుల నియంత్రణ విషయంలో ఏమాత్రం శ్రద్ధ తీసుకోకపోవడంతో గ్రామాల్లో మద్యం ఏరులై పారింది. ప్రతి గ్రామంలో గుడి, బడి, గ్రామ శివారులో బెల్టుషాపులు విచ్చలవిడిగా ఉండేవి. బెల్టుషాపుల వల్ల కష్టజీవులు తమ కష్టాన్ని మద్యానికి తగలేయడమే కాకుండా పచ్చని కాపురాల్లో చిచ్చు రేపి ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా కుదేలై రోడ్డున పడ్డాయి. ఎంతోమంది అనారోగ్యం పాలై ఆస్ప్రతుల్లో చేరారు. ప్రజా సంకల్పయాత్ర స్ఫూర్తిగా... వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా అనేకమంది పేదలు మద్యం ద్వారా తమ కుటుంబాలు ఏవిధంగా నాశనం అవుతున్నాయో జగన్ వద్ద తమగోడును వివరించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి వారి కష్టాలను కళ్లారా చూశారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే మద్యం మహమ్మారిని తరిమికొడతానని మాట ఇచ్చారు. ఆ మాటకు కట్టుబడి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల్లోనే బెల్టుషాపులు ఎత్తివేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఎక్సైజ్ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగి గ్రామాల్లోని బెల్టుషాపులపై దాడులు నిర్వహిస్తూ, కేసులు నమోదు చేస్తూ, వాటిని నియంత్రిస్తున్నారు. నియోజకవర్గంలో 200లకు పైగా బెల్టుషాపుల తొలగింపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎక్సైజ్ అధికారులు ఇప్పటికి 200లకు పైగా బెల్టుషాపులను తొలగించారు. బెల్టుషాపుల నిర్వాహకులకు కౌన్సెలింగ్ నిర్వహించి బెల్టుషాపులు నిర్వహిస్తే చట్టప్రకారం తీసుకునే చర్యలు వివరించారు. గుడివాడ మండలంలో 79, గుడ్లవల్లేరు మండలంలో 68, నందివాడ మండలంలో 53కు పైగా బెల్టుషాపులు నిర్వహించే వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటున్నారు. -
‘బెల్టు’ తీస్తేనే బతుకులు బాగు
సాక్షి,బాపట్ల : కుటుంబాల్ని కూల్చేస్తుంది.. చిన్నారుల్ని అనాథల్ని చేసేస్తుంది. ఆర్థిక కష్టాల్లోకి నెట్టేస్తుంది. మొత్తంగా సమాజాన్ని ఛిన్నాభిన్నం చేస్తోందీ మద్యం. ఎన్నో జీవితాల ఉసురు పోసుకుంటున్న మద్యాన్ని నిషేదిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. దశల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మూలాల నుంచి ప్రక్షాళన చేసేందుకు బెల్టుషాపులపై ఉక్కుపాదం మోపుతున్నారు. మరోవైపు మద్యం దుకాణాల లైసెన్సుల్ని తగ్గించే దిశగా రూపుదిద్దుకుంటున్న సర్కారు కార్యచరణపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మద్యం మహమ్మారితో మహిళలు పడుతున్న వేదనలను ప్రజాసంకల్ప యాత్రలో విన్న వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చలించారు. మద్యం మత్తుకు బానిసలైన మందు బాబులు సాయంత్రానికి తమ కష్టాన్ని తాగుడుకి తగలేస్తూ కుటుంబాలను పస్తులు పెడుతున్నారనే ఆవేదనలు.. మద్యం మత్తులో గొడవలు, ఘర్షణలకు దిగుతూ సంసారాలను వీధిన పెడుతున్న వేదనలు విన్న జగన్.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నవరత్నాల పథకాల్లో పొందుపరిచిన హామీ అయిన మద్యం మహమ్మారిని పారదోలేందుకు సమాయత్తమయ్యారు. దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానంటూ ప్రకటించారు. బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపారు. పేద కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్న బెల్టుషాపులను తొలగించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మద్యం వ్యాపారం ప్రభుత్వ ఆదాయంగా చూడొద్దని స్పష్టం చేశారు. అవసరమైతే బెల్టు దుకాణాలకు మద్యం సరఫరా చేసే షాపుల లైసెన్సులను రద్దు చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మద్య నిషేధానికి తొలి అడుగు వేయడంతో మహిళల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేస్తున్న మద్యం రక్కసిని నిర్మూలించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కార్యచరణ రూపొందించారు. గ్రామీణ ప్రాంతాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బెల్టుషాపులను పూర్తిగా నిర్మూలించడంతో పాటు మద్యం షాపులను దశల వారీగా తగ్గించి రానున్న ఐదేళ్ళ నాటికి సంపూర్ణ మద్య నిషేధం అమలు చేసేదిశగా అడుగులు వేస్తున్నారు. మామూళ్ల కోసం... గత ప్రభుత్వంలో ఎక్సైజ్, పోలీసు శాఖలు మద్యం వ్యాపారులకు సహకరించారు. బెల్టుదుకాణాల ఏర్పాటుకు అనధికారికంగా అనుమతులిచ్చేశారు. దీనికి ప్రతిఫలంగా ప్రతి నెలా ఆ రెండు శాఖల సిబ్బంది మామూళ్లు పుచ్చుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఎమ్మార్పీ ఉల్లంఘించినా పట్టించుకోకపోవడం.. కొత్తగా బెల్టుదుకాణాలు వెలుస్తున్నా చూసీ చూడనట్లుగా వ్యవహరించేవారు. ఇకపై ఆ పరిస్థితి కనిపించదు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయించినా చర్యలు తీసుకునేందుకు ఎక్సైజ్ అధికారులు ముందుకొస్తున్నారు. ఇటీవల బాపట్లలోని పాతబస్టాండ్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఉదయం పూట మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు చర్యలు తీసుకున్నారు. బాపట్ల ప్రాంతంలోని స్టువర్టుపురంలో నాటు సారా తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. చాలా వరకు సారా తయారీ మానేసినప్పటికి ప్రకాశం జిల్లా నుంచి దిగుమతవుతోందనే విమర్శలు కూడా లేకపోలేదు. మద్యం మత్తులో మృత్యు ఒడిలోకి.. పూటుగా మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల మృతి చెందిన వారి సంఖ్య బాపట్ల నియోజకవర్గం బాపట్ల డివిజన్‌లోనే మొదటి స్థానంలో ఉంది. నియోజకవర్గంలోని పిట్టలవానిపాలెం మండలం కోమలిలో 2010 సంవత్సరం ట్రాక్టర్ డ్రైవర్ మద్యం సేవించి ట్రాక్టర్ నడపటం వలన శుభాకార్యానికి వెళ్తుతున్న 11మంది మృత్యువాత పడ్డారు. అదేవిధంగా 2011లో చందోలులో కారుడ్రైవర్ తప్పతాగి చెట్టుకు ఢీకొట్టడం వలన ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మరణించారు. 2018లో జమ్ములపాలెం ప్లైఓవర్ బ్రిడ్జి వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. బస్టాండ్ వద్ద పూటుగా మద్యం సేవించి ఆర్టీసీ బస్సును ఢీకొట్టి ఇద్దరు మృతి చెందారు. ఈ నెల మొదటి వారంలో హైదరాబాద్ నుంచి సూర్యలంక సముద్రతీరానికి వచ్చి మద్యం సేవించి కారు నడుపుతూ అప్పికట్ల వద్ద జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఇలా ఎంతో మంది కుటుంబాల ఉసురు తీస్తున్న మద్యాన్ని నిషేదించాలని పలువురు కోరుతున్నారు. -
‘బెల్టు’ తీసేదెవరు..?
కదిరి నియోజకవర్గంలోని బెల్టు షాపుల్లో మద్యం ఏరులై పారుతోంది. నియోజకవర్గ వ్యాప్తంగా పేరుకు 12 మద్యం దుకాణాలున్నా వాటికి అనుబంధంగా 120 దాకా బెల్టుషాపులు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో మద్యం దుకాణాలకు వేలం పాటద్వారా దక్కించుకున్న టీడీపీ నాయకులు తమ బినామీల ద్వారా వాటిని నడుపుతున్నారు. తమ వ్యాపారానికి అడ్డురాకుండా అబ్కారీ అధికారులకు నెల మామూళ్లు ముట్టజెబుతున్నారు. వీటి మూలంగా మందుబాబులు తమ ఇల్లు, ఒళ్లు, గుల్ల చేసుకుంటూ పచ్చని సంసారాలు కూల్చుకుంటున్నారు. కదిరి: కదిరి పట్టణంతో పాటు మండల కేంద్రాల్లో ఉన్న మద్యం దుకాణాలన్నీ టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ తన బినామీల పేరుమీద గత ప్రభుత్వ హయాంలో దక్కించుకున్నారు. ఎంఆర్పీని పక్కన బెట్టి అధిక ధరలకు విక్రయించడమే కాకుండా కల్తీ మద్యం విక్రయిస్తున్నారని మందు బాబులు వాపోతున్నారు. మద్యం దుకాణాల వ్యాపారులే కర్ణాటక నుండి చీప్ లిక్కర్ తెప్పించి బెల్టుషాపుల ద్వారా నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నారు. మద్యం దుకాణాల వద్ద సిట్టింగ్ రూంలకు అనుమతి లేకున్నా తాగేందుకు అక్కడే ఏర్పాట్లు చేశారు. మద్యం దుకాణాల ద్వారా 40 శాతం విక్రయాలు జరుగుతుంటే మిగిలిన 60 శాతం అమ్మకాలు బెల్టు షాపుల ద్వారానే సాగుతున్నాయని అధికారులే అంగీకరిస్తున్నారు. ఎందుకంటే బెల్టు దుకాణాలకు సమయపాలన లేకుండా రోజంతా అమ్మడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. కదిరి పట్టణంలో ప్రతి వీధిలోనూ ఒక బెల్టుషాపు ఉంది. వీటి మూలంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు వాపోతున్నారు. అబ్కారీ అధికారులు వారి హోదాను బట్టి నెలసరి మామూళ్లు తీసుకుంటున్నారని తెలుస్తోంది. నిబంధనలు గాలికి పట్టణంలో ఉన్న బార్‌లోనూ కల్తీ మద్యం, అధిక ధరలకు విక్రయాలు, నిబంధనలకు విరుద్ధంగా అక్కడే నిలబడి తాగేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ గదిని పార్కింగ్ కోసం అంటూ వారి లైసెన్స్ పత్రాల్లో కనబరిచారు. బార్ ముందు వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా స్థలం లేకపోవడంతో జాతీయ రహదారిపైనే మందుబాబులు తమ ద్విచక్ర వాహనాలను గంటల తరబడి ఆపి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కల్గిస్తున్నారు. అబ్కారీ శాఖతో పాటు పోలీస్ శాఖ అధికారులు సైతం దీన్ని ‘మామూలు’గా తీసుకుంటున్నారు. మొబైల్ అమ్మకాలు మద్యం దుకాణాల యజమానులు మొబైల్ అమ్మకాలు సైతం సాగిస్తున్నారు. ద్విచక్రవాహనాలతో పాటు ఆటోల్లో మారుమూల గ్రామాలకు తరలిస్తున్నారు. ఇందుకోసం గ్రామాల్లో కొందరిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో క్వార్టర్ బాటిల్‌పై అదనంగా రూ.20 తీసుకుంటున్నారని మందుబాబులు చెబుతున్నారు. సామాజిక బాధ్యత ఎక్కడ? నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న వారి భరతం పట్టాల్సిన అబ్కారీ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ తమ సామాజిక బాధ్యతను విస్మరించారు. మద్యం తాగడం వలన కలిగే అనర్థాలను ప్రచారం చేయడాన్ని పూర్తిగా పక్కన బెట్టారు. ఏనాడూ ఇలాంటి ప్రచార కార్యక్రమాలను నిర్వహించిన పాపాన పోలేదు. తండాల్లో గుడుంబా విక్రేతలపై ఉక్కుపాదం మోపే అబ్కారీ అధికారులు విచ్చల విడిగా నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మేవారిపై చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. విరుద్ధంగావిక్రయిస్తే చర్యలు బెల్టు షాపులపై పూర్తిగా నిఘా పెట్టాం. మద్యం వ్యాపారులు సైతం నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. మద్యం వ్యాపారుల నుంచి తాము ఎలాంటి మామూళ్లూ తీసుకోవడం లేదు.– కేఆర్ రాజేంద్రప్రసాద్,అబ్కారి సీఐ, కదిరి -
బిగుసుకుంటున్న బెల్ట్
సాక్షి, విశాఖపట్నం: బెల్టు షాపులపై ఉచ్చు బిగుస్తోంది. మద్యం షాపులకు అనుబంధంగా అనధికారికంగా నిర్వహిస్తున్న ఈ బెల్టు షాపుల నిర్మూలన దిశగా ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో మద్య నిషేధాన్ని దశల వారీగా అమలు చేయాలన్న లక్ష్యంలో భాగంగా బెల్టు షాపులను నిర్మూలించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం వారం రోజులు గడువిచ్చారు. దీంతో ఎక్సైజ్ అధికారులు కార్యాచరణ రూపొందించారు. బెల్టు షాపుల ఆచూకీ కోసం గ్రామస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఆయా గ్రామాల డ్వా క్రా మహిళలు, పంచాయతీ కార్యదర్శి, ఎక్సైజ్ ఎస్ఐ లేదా హెడ్ కానిస్టేబుల్ ఉంటారు. ఎక్కడైనా బెల్టు షాపు ఉంటే దాని నిర్వాహకుడిని బైండోవర్ చేసి, కేసు నమోదు చేస్తారు. అలాగే బెల్టు షాపులపై గ్రామాలు, నగరంలోని వార్డుల్లో అవగాహన కార్యక్రమాలను చేపట్టనున్నారు. తమ గ్రామం, ప్రాంతంలో బెల్టు షాపులు లేవని తీర్మానం చేయిస్తారు. గ్రామ పంచాయతీల్లో బెల్టు షాపుల ఆచూకీ తెలియజేయడానికి వీలుగా ఎక్సైజ్, పోలీసు అధికారుల ఫోన్ నంబర్లను ప్రదర్శిస్తారు. అలాగే ఇప్పటి వరకు బెల్టు షాపులను నిర్వహించినట్టు అనుమానం ఉన్న వారికి కౌన్సెలింగ్ ఇస్తారు. షాపుల్లో ఉన్నతాధికారులకు వాటాలు! బెల్టు షాపుల నిర్మూలన నిర్ణయం లిక్కర్ వ్యాపారులకే కాదు.. కొంతమంది ఎక్సైజ్ ఉన్నతాధికారులకూ ఇబ్బందికరంగా పరిణమించింది. కొన్ని మద్యం షాపుల్లో వీరికి వాటాలుండడమే ఇందుకు కారణం. వీరు మద్యం సిండికేట్లతో ప్రత్యక్ష సంబంధాలను కలిగి ఉన్నారు. విశాఖ జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లా ఎక్సైజ్ ఉన్నతాధికారి ఒకరికి, మరికొందరికి విశాఖ మద్యం సిండికేట్లలో వాటాలున్నాయి. వీరు బినామీల పేరిట లిక్కర్ షాపులు నడుపుతున్నారు. అలాగే విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు తన నియోజకవర్గం పరిధిలో 20కి పైగా మద్యం దుకాణాలున్నాయి. ఒక్క వెలగపూడి ఆధ్వర్యంలోనే నడుస్తున్న షాపుల పరిధిలో వందకు పైగా బెల్టు షాపులున్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ ఉన్నతాధికారులు, వెలగపూడిల బెల్టు షాపులపై దాడులు చేసి, కేసులు నమోదు చేయాల్సి రావడం స్థానిక అధికారులకు ఒకింత ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. లిక్కరు వ్యాపారులకు వార్నింగ్ మరోవైపు బెల్టు షాపులు నిర్వహించరాదంటూ మద్యం వ్యాపారులను కూడా ఎక్సైజ్ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. బెల్టు షాపులు నిర్వహిస్తే మద్యం షాపుల లైసెన్స్‌లు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలోను, నగరంలోనూ ప్రతి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మద్యం షాపుల యజమానికి ఈ విషయాన్ని తెలియజేయనున్నారు. అంతేకాదు.. ఎక్కడైనా బెల్టు షాపు నడుపుతున్నట్టు నిర్థారణ అయితే సమీపంలోని మద్యం దుకాణ లైసెన్స్‌ను రద్దు చేస్తామని వారికి తెలియజేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వీటిని నిర్మూలించడానికి ఎక్సైజ్ ఉన్నతాధికారులు రాత్రి పూట అకస్మిక తనిఖీలు నిర్వహించాలని, గ్రామాల్లో బస చేయాలని నిర్ణయించారు. బెల్టు షాపులు 2 వేలకు పైనే! జిల్లాలోను, నగరంలోను 402 మద్యం దుకాణాలున్నాయి. ఒక్కో షాపు పరిధిలో 5 నుంచి 7 వరకు బెల్టు షాపులు నడుస్తున్నాయి. ఇలా దాదాపు 2 వేలకు పైగా బెల్టు షాపులు నిర్వహిస్తున్నట్టు అంచనా. ఇప్పుడు వీటన్నిటినీ పూర్తి స్థాయిలో నిర్మూలించే పనిలో ఎక్సైజ్ అధికారులు తలమునకలై ఉన్నారు. శుక్రవారం నుంచి బెల్టు షాపుల నిర్మూలనకు శ్రీకారం చుట్టనున్నారు. బెల్టు షాపుల్లేకుండా చేస్తాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోను, నగరంలోనూ బెల్టు షాపులను పూర్తిగా నిర్మూలిస్తాం. దీనిపై కార్యాచరణ రూపొందించాం. గ్రామ కమిటీలు వేస్తున్నాం. రాత్రి వేళ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం. అవసరమైతే సమస్యాత్మక గ్రామాల్లో రాత్రి బస చేస్తాం. బెల్టు షాపులు నిర్వహిస్తూ పట్టుబడితే వారిపై కేసులు పెడతాం. సంబంధిత షాపుల లైసెన్స్‌లు రద్దు చేస్తాం. ఇదే విషయాన్ని మద్యం వ్యాపారులకూ చెప్పాం. వారంలోగా బెల్టు షాపులు లేకుండా చేస్తాం.– టి.శ్రీనివాసరావు, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్. -
అక్కాచెల్లెమ్మలకు దగా
టీడీపీ గడచిన ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోలో మహిళలకు సంబంధించి చేసిన హామీలివి.. ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యం బెల్టుషాపులను రద్దు చేస్తూ రెండో సంతకం చేస్తాం. డీఅడిక్షన్ సెంటర్లను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తాం. ఆర్థిక చిక్కుల్లో పడిన డ్వాక్రా సంఘాలకు ఊపిరిపోసేందుకు రుణాలన్నింటినీ మాఫీ చేస్తాం. మహిళా సంఘాలకు రూ.లక్ష వరకు వడ్డీలేని రుణాలు ఇస్తాం. మహిళలు ఆర్థిక పురోభివృద్ధి సాధించేందుకు పరిశ్రమలు, పెద్ద ఎత్తున వ్యాపారాలు చేపట్టే స్థాయికి విస్తరిస్తాం. పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరుతో మహాలక్ష్మి పథకం కింద అర్హులైన కుటుంబాలకు రూ.30వేలు బ్యాంకులో డిపాజిట్ చేసి యుక్త వయసు వచ్చే నాటికి రూ.2లక్షలు అందిస్తాం. పండంటి పథకం ద్వారా పేద గర్భిణులకు ఆరోగ్యం, పౌష్టికాహారం కోసం రూ.10వేలు అందిస్తాం. పేద మహిళలకు స్మార్ట్ సెల్ఫోన్లు ఉచితంగా ఇస్తాం. ఏడాదికి ఒక కుటుంబానికి 12 వంట గ్యాస్ సిలిండర్లను ఇచ్చి సిలిండర్‌కు రూ.100 సబ్సిడీ ప్రకారం ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా సరఫరా చేస్తాం. అన్నీ ప్రభుత్వ కాలేజిల్లో విద్యార్థినులకు హాస్టల్ వసతి కల్పిస్తాం. పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ద్వారా ఆమోదింపజేసే ప్రయత్నం చేస్తాం. అంగన్వాడీ కేంద్రాల పనితీరు మెరుగుపరచడంతోపాటు కార్యకర్తలకు వేతనాలను పెంచుతాం. మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు కుటీర లక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సహాయం, శిక్షణతోపాటు ప్రత్యేక పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేస్తాం. పేద వితంతువులకు రూ.1000 పింఛన్ మంజూరు చేస్తాం. పై హామీలు ఏమేరకు అమలు చేశారంటూ మహిళలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కొత్త హామీలకు పసుపు రంగు పులుముతూ తమను మోసగించవద్దని చెబుతున్నారు.టమహిళల రక్షణకు సంబంధించి ప్రత్యేక పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఐజీ స్థాయి అధికారిని, డివిజన్లో ఎస్పీ స్థాయి మహిళా అధికారిని, జిల్లాలో అడిషనల్ ఎస్పీ స్థాయి మహిళా అధికారిని, మండలంలోని సీఐ స్థాయి మహిళా అధికారిని, పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్ మహిళా అధికారిని నియమిస్తామని ముఖ్యమంత్రి గతంలో తెలిపారు. నిర్భయ చట్టాన్ని, గృహ హింస చట్టాన్ని, ఇతర మహిళా చట్టాలను కఠినంగా అమలు చేసి విద్యార్థినులపై, మహిళలపై అత్యాచారాలకు అడ్డుకట్ట వేస్తాం. కానీ గడచిన అయిదేళ్లలో మహిళలకు రక్షణ కొరవడింది. మహిళా కమిషన్ పటిష్టపరుస్తామన్న మాటలే మిగిలాయి. బాలికలకు పథకాలేవీ.. బాలికలకు సంబంధించిన పథకాలు ఏవీ అమలులో లేకపోవడం ఇబ్బందికరంగా ఉంది. తరచూ ఆడపిల్లల తల్లిదండ్రులు తమను సంప్రదిస్తున్నారు. ఏ పథకం లేదని చెబుతున్నాం. – ఎ.రాజమ్మ, అంగన్వాడీ కార్యకర్త, నాగేంద్రనగర్, ప్రొద్దుటూరు -
ఆదాయమే లక్ష్యం.. మద్యమే మార్గం
సాక్షి, అనంతపురం సెంట్రల్: టీడీపీ 2014లో అధికారంలోకి వచ్చాక మద్యం వ్యాపారానికి గేట్లు తెరిచింది. అప్పటి వరకు ఉన్న మద్యం దుకాణాలు, బార్లు కాదని అదనంగా కొత్తవాటిని మంజూరు చేశారు. జిల్లా కేంద్రం మొత్తానికి రెండు మాత్రమే బార్లు ఉండగా టీడీపీ సర్కార్ వాటికి సంఖ్యను పదికి పెంచింది. జిల్లా వ్యాప్తంగా గతంలో ఆరు మాత్రమే ఉండగా ప్రస్తుతం 32 బార్లు తెరిచారు. దీన్ని బట్టి చూస్తే మద్యంను ఏ విధంగా ఆదాయ వనరుగా మార్చేశారో అర్థం చేసుకోవచ్చు. పేద ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా వదిలేసి ఆదాయంపైనే మక్కువ చూపుతున్నారు. ఎమ్మార్పీకి తూట్లు జిల్లాలో మద్యం దొరకని గ్రామమంటూ లేదంటే అతిశయక్తి కాదు. ఎక్కడ చూసిన మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరుపుతున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేవలం మద్యం విక్రయం ద్వారా వచ్చిన ఆదాయమే కాకుండా ఎమ్మార్పీపై అదనంగా రూ. 10 నుంచి రూ.20 వసూలు చేస్తున్నారు. మద్యం వ్యాపారులు మొత్తం సిండికేట్‌గా మారి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో మద్యంబాబుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ప్రతి నెలా దాదాపు రూ.100కోట్లకు పైగా అధికారికంగా విక్రయాలు జరుపుతుంటే అదనంగా వచ్చే మొత్తంతో రూ. 5కోట్లకు పైగా ఉంటోందని లెక్కలు తేలుస్తున్నారు. ఈ విషయం అధికారులందరికీ తెలిసినా కూడా పెద్దగా దృష్టి సారిస్తున్న పాపాన పోలేదు. కర్ణాటక మద్యం దిగుమతి ఇదిలా ఉంటే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కర్ణాటక మద్యం కూడా దిగుమతి అవుతుండడం గమనార్హం. ఎన్నికల కోడ్ ప్రకటించినప్పటి(మార్చి 10) నుంచి అధికారుల దాడుల్లో రూ. 1.11 కోట్లు విలువైన మద్యం సీజ్ చేశారు. అనధికారికంగా మద్యం నిల్వ ఉంచుకున్న నగరంలోని ఓ బార్‌ను సీజ్ చేశారు. కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం దిగుమతిపై 34 కేసులు నమోదు చేశారు. ఎన్నికల నేపథ్యంలో 179 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. ఇదంతా అధికారులు చేపట్టిన దాడుల్లో వెలుగుచూసిన అంశాలు. కానీ ఇంతకు పదింతలు రెట్టింపులో మద్యం విక్రయాలు, అక్రమాలు జరుగుతున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి మద్యం విక్రయాలు పెంచాలని స్పష్టమైన ఆదేశాలు ఉండడంతో ఎక్సైజ్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. జగన్ నిర్ణయంపై మహిళల హర్షం టీడీపీ అధినేత చంద్రబాబు మద్యం వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకునేలా నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా బార్, మద్యం షాపులు, వాటికి అనుబంధంగా పర్మిట్ రూంలు పెంచి మద్యం విక్రయాలు పెరిగేలా చర్యలు తీసుకున్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి బెల్టుషాపుల నిషేధిస్తామని ప్రకటించడంతో బాబు కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే పకడ్బందీగా అమలు చేయడంలో విఫలమయ్యారు. ప్రస్తుతం జిల్లాలో ప్రతిగ్రామంలో బెల్టుషాపులు కొనసాగుతున్నాయి. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అదినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే మూడు దశల్లో మద్యపాన నిషేధం చేస్తామని ప్రకటించడంపై మహిళల్లో హర్షం వ్యక్తమవుతోంది. తొలుత గ్రామీణ ప్రాంతాల్లో, అనంతరం మండల స్థాయి, ఆ తర్వాత జిల్లా కేంద్రంలో మద్యం దుకాణాలను తొలగిస్తారు. దీని వలన విచ్చలవిడి మద్యం విక్రయాలకు బ్రేక్ పడుతుంది. మద్యం తాగాలంటే కనీసం 10 నుంచి రూ. 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే తప్ప దొరకని పరిస్థితి కల్పించడం జరుగుతుంది. దీంతో మద్యం బాబులు కొంత వరకు గాడిలో పడతారు. దశల వారీగా మద్యం దుకాణాలు తొలగిస్తే పేదల బతుకులు బాగుపడుతాయని ఆశిస్తున్నారు. గత మూడు నెలల్లో మద్యం విక్రయాలు .. నెల జరిగిన విక్రయాలు జనవరి రూ. 107 కోట్లు ఫిబ్రవరి రూ. 108 కోట్లు మార్చి రూ. 103 కోట్లు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులతో రూ.కోట్లలో ఆదాయం ఓ వైపు మద్యం విచ్చల విడిగా తాపుతూనే.. మరో వైపు జరిమానాలతో మద్యం బాబుల నుంచి రూ.కోట్లలో వసూలు చే స్తున్నారు. తాగి వాహనాలు నడుపుతున్న వారి నుంచి పోలీసులు జరిమానాలు విధించి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. అనంతపురంలో ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలో మాత్రమే ఏడాదికి 2వేలకు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా ఈ సంఖ్య మూడు, నాలుగు రెట్లు అధికంగా ఉంటుంది. అనంతపురం ట్రాఫిక్‌పోలీసు స్టేషన్ పరిధిలో 2017లో 2132 కేసులు, 2018లో 2432 కేసులు, 2019లో ఇప్పటి వరకూ 579 డ్రంక్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. జరిమానాలు కోర్టులో చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కొక్కరి నుంచి రూ. 1500 నుంచి రూ. 2000 చొప్పున జరిమానాలు విధిస్తున్నారు. సరాసరిన రూ.35 లక్షలకు పైగా డ్రంక్ డ్రైవ్ నుంచి ఆదాయం సమకూరుతోంది. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో రూ. కోట్లలో ఆదాయం వస్తోంది. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగించేది ప్రభుత్వమే... తాగి రోడ్లపైకి రాకూడదనే ఆంక్షలు పెట్టేది ప్రభుత్వమేనని ప్రజలు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే విచ్చల విడి మద్యం అమ్మకాల వలన అతిగా మద్యం తాగి మృతి చెందిన వారు, రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వారు వందలో ఉన్నారు. బెల్ట్ షాపులతో ఇబ్బంది ఊరి మధ్యలో బెల్ట్ షాపులుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం గ్రామాల్లో బెల్ట్ షాపులు ఉండకుండా చర్యలు తీసుకుంటామని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. ఇప్పటికీ గ్రామాల్లో విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. – రాజు, ఇనగలూరు, అగళి మండలం మద్యంతో అన్నీ అనర్థాలే .. మద్యం షాపుల వల్ల ఎన్నో అనర్థాలు కలుగుతున్నాయి. మద్యం తాగడానికి వచ్చిన వారు ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నారు. తద్వారా ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. జగనన్న విడతల వారీగా మద్యపానం నిషేధిస్తామని హామీ ఇచ్చాడు. ఈ హామీని స్వాగతిస్తున్నాం. మద్యానికి బానిసలైన వారు తమ కుటుంబ సభ్యులను డబ్బుల కోసం వేధించడమే కాకుండా ప్రతి రోజు ఇంట్లో గొడవపడుతుంటారు. మద్యపానం నిషేధిస్తే ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో హాయిగా ఉంటారు. – తిప్పేస్వామి, మోరుబాగల్, గుడిబండ చెక్‌పోస్టుల ద్వారా నిఘా ఎన్నికల సమయంలో అక్రమంగా మద్యం దిగుమతి కాకుండా పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో ఆరు శాశ్వత చెక్‌పోస్టులు ఉన్నాయి. ఇవి కాకుండా జిల్లా సరిహద్దులో తాత్కాలికంగా 12 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నాం. ఇదే కాకుండా బెల్టుషాపులు, నాటు సారా వాటిపై ఉక్కుపాదం మోపుతున్నాం. మద్యం విక్రయాలపై ఫిర్యాదు కోసం ప్రత్యేకంగా 0866–2428333, 18004254868 టోల్‌ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేశాం. – టి. విజయ్‌కుమార్, అసిస్టెంట్ కమిషనర్, ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంట్ -
'సారో'దయ ఆంధ్రప్రదేశ్!
ఈ చిత్రంలో కత్తిపోట్లకు గురై మృతి చెందిన యువకుడి పేరు.. అబ్దుల్ హమీద్. కర్నూలు జిల్లా నంద్యాల సలీంనగర్‌కు చెందిన అబ్దుల్ లారీ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈనెల 5 రాత్రి ఓ ఉత్సవంలో గొడవపడుతున్న స్నేహితులను వారించేందుకు వెళ్లాడు. మద్యం మత్తులో ఉన్నవారు విచక్షణారహితంగా కత్తితో పొడవడంతో హమీద్ (27) తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరంతా ఐదేళ్లలోపు చిన్నారులు కావడంతో కుటుంబ సభ్యులు అనాథలుగా మిగిలిపోయారు. మద్యం మనుషుల్లో విచక్షణను చంపేస్తుందనడానికి ఈ సంఘటన ఒక నిదర్శనం. సాక్షి, అమరావతి: ‘సూర్యోదయ’ ఆంధ్రప్రదేశ్.. ఇది ఏపీ సర్కారు ప్రచార నినాదం. దీని సంగతేమో కానీ.. ‘సారో’దయ ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రం వర్థిల్లుతోంది. మూడు మద్యం షాపులు.. ఆరు బెల్టు షాపులు.. అన్న రీతిలో మద్యం అమ్మకాల్లో రెండంకెల వృద్ధి సాధిస్తోంది. రాష్ట్రంలో తాగునీరు దొరకని గ్రామాలున్నాయి కానీ.. మద్యం దొరకని గ్రామాలు లేవు. టీడీపీ అధికారంలో వచ్చిననాటి నుంచి ఊరూరా.. వీధివీధిన మద్యం షాపుల్ని ఏర్పాటు చేస్తోంది. నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల్లో బార్ల సంఖ్యను పెంచి ప్రతి వంద మందికి 13 నుంచి 15 మందిని తాగుబోతుల్ని చేస్తోంది. జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన అయితే అర్ధరాత్రి, అపరాత్రి తేడా లేకుండా మద్యం లభిస్తోంది. జాతీయ/రాష్ట్ర రహదారుల పక్కన మద్యం షాపులను ఎత్తేయాలని గతంలోనే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు రాష్ట్ర ప్రభుత్వమే గండికొడుతోంది. ఏకంగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ప్రసంగంలో మద్యం షాపుల్ని రహదారుల వెంబడి తొలగించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, ఈ తీర్పుతో తమ ఆదాయం తగ్గిపోతుందని పేర్కొన్నారంటే ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగానే చూస్తోందని తేటతెల్లమవుతోంది. బీరును హెల్త్ డ్రింక్‌గా ప్రమోట్ చేస్తామని మరో మంత్రి జవహర్ ప్రకటించడం విస్మయం కలిగిస్తోంది. మద్యం ఆదాయం కోసం కారాడుతూ ఆవాస ప్రాంతాలు, నివాస గృహాలు, చివరకు తినుబండారాలు అమ్మే దుకాణాల్లోనూ బెల్టు షాపులను ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటు చేస్తున్నారు. అటకెక్కిన నవోదయం టీడీపీ అధికారంలోకొచ్చేనాటికి రాష్ట్రంలో నాటు సారా తయారీ గ్రామాల సంఖ్య.. 1,942. ఈ సంఖ్య నాలుగున్నరేళ్లలో నాలుగు వేలకు చేరినట్లు ఎక్సైజ్ శాఖ అంచనా. సారా రహిత ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని మారుస్తామని 2016, ఫిబ్రవరి 1న ప్రభుత్వం ప్రకటించి ‘నవోదయం’ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. రెండు దశల్లో ఈ పథకాన్ని అమలుచేస్తామని ప్రకటించింది. ఈ పథకం అమల్లో భాగంగా.. అబ్కారీ శాఖలో ప్రతి ఉద్యోగి కాపు సారా గ్రామాన్ని దత్తత తీసుకుని ప్రతి మూడు నెలలకు ఒకసారి శనివారం ఆ గ్రామాన్ని సందర్శించాలి. ఎక్సైజ్ అధికారులు, పోలీసులు సంయుక్తంగా సారా తయారీదారులు, విక్రేతలను గుర్తించి కేసులు నమోదు చేయాలి. సారా తయారీదారు, ముడి పదార్ధాలను అందించేవారిపై సీఆర్పీసీ చట్టం ప్రకారం బాండ్లను తీసుకోవాలి. అయితే మొదట్లో హడావుడి చేసిన ఎక్సైజ్ యంత్రాంగం ఆ తర్వాత ‘నవోదయం’ పథకాన్ని అటకెక్కించింది. కాపు సారా తయారీదారులపై దాడులు చేయలేమని చేతులెత్తేసింది. దీంతో రాష్ట్రంలో మారుమూల, అటవీ ప్రాంతాల్లో కూడా కాపు సారా దందా యథేచ్ఛగా సాగుతోంది. ఇటీవలి కాలంలో సారా విక్రయాలు ఊపందుకున్నాయి. నవోదయం మొదటి దశలో.. శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, గుంటూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్, అనంతపురం, కృష్ణా, విజయనగరం జిల్లాలను సారా రహిత జిల్లాలుగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. కానీ కృష్ణా, విజయనగరం జిల్లాలను ఇంకా ప్రకటించకపోవడం గమనార్హం. నవోదయం రెండో దశలో.. తూర్పుగోదావరి, కర్నూలు, చిత్తూరు జిల్లాలను సారా రహిత జిల్లాలుగా ప్రకటిస్తామని చెప్పి ఏడాది దాటుతున్నా ఇంతవరకు పట్టించుకోలేదు. దీంతో రాష్ట్రంలో ఆయా జిల్లాల్లో కాపు సారా ఇంకా కుటీర పరిశ్రమగానే కొనసాగుతోంది. ‘తూర్పు’లోనే ఎక్కువ రాష్ట్రంలో ప్రధానంగా సారా తయారీ, అమ్మకాలు తూర్పుగోదావరి జిల్లాలోని లంక గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. రోజుకు ఈ జిల్లాలో సగటున ఐదు లక్షల లీటర్ల సారా తయారవుతున్నట్లు అంచనా. ఈ జిల్లాలో పదివేల కుటుంబాలు సారా తయారీపై ఆధారపడి ఉన్నట్లు ఎక్సైజ్ వర్గాలే చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 120 కోట్ల లీటర్ల పరిమాణం గల సారా బట్టీలు పల్లెల్లో ఉన్నట్లు సమాచారం. గుంటూరు–నల్గొండ జిల్లాల సరిహద్దులోని కృష్ణా నదీ తీర ప్రాంతంలోని గ్రామాల్లో కూడా యథేచ్ఛగా సారా తయారవుతోంది. కర్నూలు జిల్లా సంజామల మండలం కుందూ నదీ తీర ప్రాంతంలోనూ సారా తయారుచేస్తున్నారు. ఈ జిల్లాలోని కొలిమిగుండ్ల, బనగానపల్లె నుంచి వైఎస్సార్ జిల్లాలో జమ్మలమడుగు, అనంతపురం జిల్లాలోని తాడిపత్రి ప్రాంతాలకు సారా సరఫరా చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు, బేతంచర్ల, ప్యాపిలి అటవీ ప్రాంతాల్లోనూ జోరుగా సారా వ్యాపారం జరుగుతోంది. అదేవిధంగా కృష్ణా జిల్లా మైలవరం, రెడ్డిగూడెం తండాల్లో నాటు సారా తయారవుతోంది. సారా తయారీలో విషతుల్య పదార్ధాలను వినియోగిస్తున్నారు. బెల్లంతోపాటు పాత రబ్బర్లు, చెప్పులు, తుమ్మ, చెడిపోయిన బ్యాటరీలు, సల్ఫర్ వంటివి వాడుతున్నారు. కొందరైతే కిక్కు కోసం మిథైల్ ఆల్కహాల్‌ను కలిపి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. బాబు అధికారంలోకి రాగానే బెల్టు షాపులు 1990వ దశకంలో సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమ స్ఫూర్తితో నెల్లూరు జిల్లాలో దూబగుంట రోశమ్మ అనే మహిళ ఆధ్వర్యంలో సారా వ్యతిరేక ఉద్యమం ప్రారంభమై చివరకు మద్యపాన నిషేధానికి దారి తీసింది. ఆ తర్వాత 1995లో చంద్రబాబు అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం ఎత్తివేశారు. దీంతో వాడవాడలా బెల్టు షాపులు వెలిశాయి. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి తాను చేసిన సంతకాన్నే మరిచిపోయి బెల్టు షాపుల్ని వీధివీధినా ఏర్పాటు చేసేలా మద్యం సిండికేట్లకు ఊతమిచ్చారు. పైగా మద్యం గోడౌన్ల సంఖ్యను పెంచారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,380 మద్యం షాపులుంటే, వీటికి అనుబంధంగా 40 వేలకు పైగా బెల్టు షాపులు నడుస్తున్నాయి. మద్యం మహమ్మారితో కుటుంబాలు చిన్నాభిన్నం మద్యం మహమ్మారి రాష్ట్రంలో ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది. ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురుకు చెందిన కోలాబత్తుల శ్రీనివాసరావు (44) కుటుంబంలో విషాదం నింపింది. శ్రీనివాసరావు రోజువారి కూలిపని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాగుడుకు బానిసై 2015, మార్చిలో మృత్యువాత పడ్డాడు. దీంతో అతని కుటుంబం జీవనాధారం కోల్పోయింది. భార్య ఆదిలక్ష్మి కుటుంబ పోషణ భుజాన వేసుకుని రెండు నెలల క్రితం గల్ఫ్ వెళ్లింది. 7, 8 తరగతులు చదువుతున్న పిల్లలిద్దరినీ నాయనమ్మ వెంకటనర్సమ్మ తనకు వచ్చే పింఛన్ డబ్బులతో పోషిస్తోంది. కొడుకు తాగుడుకు అలవాటు పడడం తమల్ని దిక్కులేనివాళ్లను చేసిందని తల్లి వెంకటనర్సమ్మ కన్నీటిపర్యంతమవుతోంది. ఇదేవిధంగా కర్నూలు జిల్లా హాలహర్వి మండలం బిలేహాలుకు చెందిన లక్ష్మమ్మ భర్త గత ఐదేళ్లుగా తాగుడుకు బానిసయ్యాడు. రోజూ తాగడంతో ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. కనీసం నడిచి గడప దాటలేని పరిస్థితి. వీరికున్న రెండెకరాల పొలాన్ని అమ్మగా వచ్చిన డబ్బుతో ఆస్పత్రుల్లో చూపిస్తున్నారు. కానీ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టు షాపుల ద్వారా మద్యం అమ్మకాలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని లక్ష్మమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది కుటుంబాలను మద్యం రక్కసి కాటేసింది. దిక్కుతోచని స్థితిలో జీవిస్తున్నాం మద్యానికి బానిసై నా భర్త అకస్మాత్తుగా మృతి చెందాడు. మా కుటుంబాన్ని ఆదుకునేవారు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పాచి పనులు చేసుకొని జీవిస్తున్నాను. నాకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్దపాప ఏడో తరగతి, చిన్నపాప నాలుగో తరగతి చదువుతున్నారు. వారిని పోషించుకోవడం భారంగా మారింది. ప్రభుత్వం నుంచి నాకు ఏవిధమైన సహాయం అందలేదు. మా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. – కొణిదల వీరలక్ష్మి, రాజమహేంద్రవరం కుటుంబాలు నాశనమవుతున్నాయి చంద్రబాబు గత ఎన్నికల సమయంలో మద్యపానాన్ని నియంత్రిస్తానని చెప్పడం వల్లే మహిళలు అధిక సంఖ్యలో ఓట్లేసి అధికారాన్ని కట్టబెట్టారు. అయితే అధికారంలోకి వచ్చాక మద్యాన్ని విచ్చలవిడి చేశారు. ఇంటింటికి అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. దీంతో కుటుంబాలు నాశనమైపోతున్నాయి. ఆదాయ వనరులు సమకూర్చుకోవాలంటే ఎన్నో రకాల మార్గాలుండగా మద్యం అమ్మకాలను ఆదాయంగా చేసుకోవడం దారుణం. వైఎస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దశలవారీగా మద్య నియంత్రణ చేస్తానని చెప్పడాన్ని మంచి పరిణామంగా భావిస్తున్నాం. – ఇల్లూరి లక్ష్మిశేషు, ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు, ఒంగోలు కాపురాల్లో చిచ్చు పెడుతున్నారు రోజూ సాయంత్రం మగాళ్లు తాము సంపాదించిన డబ్బు తీసుకొచ్చి తాగేస్తున్నారు. అరకొరగా మిగిలే డబ్బులే ఇంట్లో మహిళలకు ఇస్తున్నారు. ఇక ఆ ఇల్లాలు పిల్లల కడుపు ఎలా నింపుతుంది? టీడీపీ అధికారంలోకి రాగానే బెల్ట్‌షాపులు ఎత్తేస్తామని చంద్రబాబు ఎన్నికల్లో వాగ్దానం చేశారు. కానీ ఎక్కడా అమలు కాలేదు సరికదా గ్రామాల్లో వీధికో బెల్ట్‌షాపు వెలిసింది. పేదల కష్టార్జితాన్ని దోచుకుంటున్నారు. ప్రజలు తాగుబోతులైతే రాష్ట్రం అభివృద్ది చెందుతుందా? నివాసాల మధ్య దుకాణాలు ఏర్పాటుచేస్తే పేదలు, «మధ్యతరగతి ప్రజలు ఏమైపోతారో తెలియదా? ఇళ్ల మధ్య దుకాణాల ఏర్పాటుపై పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతున్నాం. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్యం అమ్మకాలను దశల వారీగా అరికడతామంటున్నారు. ఆయన చేసి చూపుతారనే నమ్మకం ఉంది. – చల్లారి రాజ్యలక్ష్మి, ఐద్వా నాయకురాలు, ఏలూరు మద్యంతో ఆర్థికంగా చితికిపోయాం మా నాన్న పేరు.. చిన్న ఆంజనేయ. తాగుడుకు అలవాటు పడి లివర్ వ్యాధితో చనిపోయాడు. మా అమ్మ లక్ష్మీదేవి భవన నిర్మాణ పనులు చేస్తూ మమ్మల్ని సాకింది. తినడానికి తిండి కూడా లభించని దుస్థితిలో బడికి పంపకుండా నన్ను, నా సోదరుడిని పనులకు తీసుకెళ్లింది. కూలికి పోతేనే తిండి.. లేదంటే లేదు. దుర్భర జీవితం గడుపుతున్నాం. ప్రభుత్వం మద్యనిషేధం చేసి మా పరిస్థితి మరెవరికీ రాకుండా చూడాలి. –బాబు, పత్తికొండ, కర్నూలు జిల్లా -
బెల్టు తీసిన మహిళలు
పశ్చిమగోదావరి, బుట్టాయగూడెం: గిరిజన గ్రామాల్లో మద్యాన్ని నిషేధించాలని కోరుతూ గిరిజన మహిళలు, యువకులు ఉద్యమబాట పట్టారు. దీనిలో భాగంగా సోమవారం రాత్రి రెడ్డిగణపవరం గ్రామంలో మద్యం అమ్మకాలపై కన్నెర్ర చేశారు. గ్రామానికి చెందిన గిరిజన మహిళలు, అల్లూరి సీతారామరాజు యూత్ సభ్యులు బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్న ప్రదేశాలకు వెళ్లి అక్కడ లభించిన మద్యం సీసాలను తీసుకుని గ్రామాల నడుబొడ్డున వాటిని పగలకొట్టారు. మూడు ప్రదేశాల్లో సుమారు 30 సీసాలు తమకు లభించాయని మహిళాసంఘం నాయకురాలు గుండి దుర్గ, దారి బజారమ్మలు తెలిపారు. గ్రామాల్లో బెల్ట్‌షాపులు లేకుండా చేయాలని మొత్తుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రీపగలు కష్టపడి పనిచేసిన డబ్బులు కుటుంబ యజమానులు మద్యం కోసం తరలిస్తున్నారని దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని తెలిపారు. పండుగలు వస్తున్న తరుణంలో మరింత గడ్డు పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్నందున గ్రామాల్లో మద్యాన్ని నివారించేందుకు పూనుకున్నామని చెప్పారు. గ్రామాల్లో మద్యం అమ్మితే మరిన్ని దాడులు చేయడంతో పాటు అమ్మకాలు చేసేవారిని పోలీసులకు అప్పగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళలు కట్టం సావిత్రి, పూనెం వేణి, యువకులు మల్లేష్, రమేష్, పవన్, కోటి, రమణ, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు. -
చుక్కల్లో నిషా
బావమరిది: బావా.. ఎన్నిరోజులైంది.. మా ఊరొచ్చి పద పద నీకు మంచి పార్టీ ఇవ్వాలి. బావ: ఈ టైమ్‌లో( రాత్రి 11 గంటలు) ఎక్కడికి వెళతాంలే బామ్మర్ది..అయినా ఈ పల్లెటూళ్లో చుక్క దొరకదుగా.. బావమరిది: ఎంత మాటన్నావ్ బావా.. టీడీపీ అధికారంలోకి వచ్చాక..మా ఊళ్లోనూ బెల్టు షాపు పెట్టారు.. ఎప్పుడంటే అప్పుడు మందే మందు.. కాకపోతే క్వార్టర్‌కు రూ.30 ఎక్కువ. బావ: పల్లెల్లోనే కాదు బామ్మర్తి.. మేముండే రాజధానిలోనూ క్వార్టర్‌కు రూ.10 నుంచి రూ.20 ఎక్కువ గుంజుతున్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే తంతు. మద్యం సిండికేట్ మొత్తం అధికార పార్టీ వాళ్లదే కదా. ఇక అధికారులు కూడా మామూళ్లు పుచ్చుకుని మత్తుగా జోగుతున్నారు.. అయినా బామ్మర్తి మీ ఊళ్లో తాగడానికి నీళ్లు ఉండవుగానీ.. మందు భలే దొరుకుతోందిరా.. బావమరిది: అవును బావా .. టీడీపీ వాళ్లా.. మజాకా.. ఆ మందుతోనే లక్షలు బొక్కేస్తున్నారు.. ఇకవెళ్లి నాలుగు చుక్కలు గొంతులు పోసుకుందాం పద. సాక్షి, గుంటూరు: జిల్లాలో మద్యం దుకాణాల యజమానులు సిండికేట్‌గా మారి తమ హవా కొనసాగిస్తున్నారు. అధికార పార్టీ నేతలే ప్రభుత్వ విధానాలను తుంగలో తొక్కుతూ ఇష్టానుసారం అమ్మకాలు జరుపుతున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా అధికార పార్టీ నేతల అండదండలతో ఎమ్మార్పీ ధరల కంటే అధికంగా మద్యం విక్రయాలు జరుపుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో క్వార్టరు బాటిల్‌కు రూ.10 నుంచి రూ.20 రూపాయల వరకు, గ్రామీణ ప్రాంతాల్లో క్వార్టరుకు రూ.35 చొప్పున పెంచి అమ్మకాలు సాగిస్తున్నారు. రేయింబవళ్లు అనే తేడా లేకుండా ఈ మద్యం అమ్మకాల దందా నడుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉండే తాడేపల్లి, ఉండవల్లిలో సైతం ఒక్కో క్వార్టర్ బాటిల్‌కు రూ.10 వరకూ అధికంగా అమ్ముతున్నారు. రాజధాని ప్రాంతంలోనూ ఎక్కువే.. మంత్రులు, వీవీఐపీలు, ఉన్నతస్థాయి అధికారులు నిత్యం తిరిగే రాజధాని ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మద్యం సిండికేట్లన్నీ అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే నడుస్తుండడంతో ఈ దుస్థితి దాపురించింది. ఎక్సైజ్ అధికారులు కొందరు మద్యం సిండికేట్ల వద్ద నెలవారీ మామూళ్ళు తీసుకుంటూ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. మరి కొందరు ఎక్సైజ్‌శాఖ అధికారులు అధిక ధరలకు మద్యం విక్రయాలు జరిపిస్తూ వచ్చే లాభంలో వాటాలు గుంజుకుంటున్నారు. ఉన్నతాధికారులు సైతం నెల వారీ మామూళ్లు పంపాలంటూ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు మద్యం దుకాణదారులు బహిరంగంగానే చెబుతున్నారు. జిల్లాలో కొనసాగుతున్న బెల్టు షాపులు... జిల్లాలో మొత్తం 342 మద్యం దుకాణాలు ఉన్నాయి. అనధికారికంగా 900 వరకూ బెల్టు షాపులు నడుస్తున్నాయి. ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 70 వరకు బెల్టు షాపులు (బడ్డీకొట్టులతో సహా) నిర్వహిస్తున్నారు. ఈ లెక్కన జిల్లాలో లైసెన్సు దుకాణాల కంటే మూడు రెట్లు బెల్టుషాపులు కొనసాగుతున్నాయి. జిల్లాలో మంత్రుల ఇలాఖాలో ప్రతి గ్రామంలో బెల్టు దుకాణాలు ఉన్నాయి. బెల్టు షాపుల్లో అమ్మకాల ద్వారా వ్యాపారులు కోట్ల రూపాయల లాభాలు ఆర్జిస్తున్నారు. ఇందులో ఎవరి వాటా వారికి అందుతోందని ఎక్సైజ్ అధికారులే ఒప్పుకుంటున్నారు. అన్నీ తెలిసినా చర్యలు తీసుకునేందుకు ఎక్సైజ్ ఉన్నతాధికారులు మాత్రం తమకెందుకులే అన్నట్లు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎనీటైమ్ మద్యం గుంటూరు నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా రాత్రి పగలు తేడా లేకుండా ఎనీ టైమ్ మద్యం దొరుకుతోంది. అర్ధరాత్రి సైతం మద్యం దుకాణాలకు మరో ద్వారం గుండా అమ్మకాలు జరుపుతున్నారు. జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన సైతం అర్ధరాత్రి, తెల్లవారు జామున సైతం మద్యం అందుబాటులో ఉండడంతో డ్రైవర్లు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ఎక్సైజ్ అధికారులుగానీ, రాత్రి గస్తీలో ఉండే పోలీసులుగానీ రాత్రి నడిచే మద్యం దుకాణాల జోలికి వెళ్లడం లేదు. నెలవారీ మామూళ్లు లాటరీ ద్వారా మద్యం దుకాణాలు పొందిన వారి వద్ద నుంచి లక్షల్లో డబ్బు గుంజిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, వారి తనయులు నెలవారీ మామూళ్లు సైతం వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా నరసరావుపేట, సత్తెనపల్లి, రాజధాని ప్రాంతమైన మంగళగిరి, తాడేపల్లి వంటి ప్రాంతాల్లో మద్యం సిండికేట్లు రెచ్చిపోతున్నారు. వీరి వద్ద ముడుపులు పుచ్చుకున్న అధికార పార్టీ నేతలు అండగా ఉండమే వీరి అక్రమాలకు కారణంగా కనిపిస్తోంది. -
పల్లెల్లో 'ఎన్నికల' మద్యం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల) : ముందస్తు ఎన్నికల కోసం నాయకులు మద్యం రెడీ చేశారు. ఎన్నికల కోడ్‌ను దృష్టిలో పెట్టుకుని ముందే కొనుగోలు చేసి పల్లెల్లో నిల్వచేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి బరిలో ఉన్న అభ్యర్థులు డబ్బులు, మద్యంపై దృష్టి సారిస్తున్నారు. సభలు, సమావేశాలు నిర్వహిస్తున్న క్రమంలో సభలకు వచ్చేవారికి పంచేందుకు ఇప్పటికే భారీగా మద్యం కొనుగోలు చేశారు. ఎన్నికలకు ఇంకా 15 రోజులు ఉండడంతో అప్పటి వరకు సరిపోయేలా ఇంకా కొనుగోళ్లు జరుపుతూ రహస్య ప్రాంతాలకు తరలించి నిల్వ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న 42 మధ్యం దుకాణాలు ఉన్నాయి. షాపుల నిర్వాహకులు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే టార్గెట్‌కు మించి మద్యం కొనుగోళ్లు చేశారు. కొనుగోలు చేసిన మద్యాన్ని పార్టీల నేతల సూచనల మేరకు డబ్బులు తీసుకుని లిక్కర్ కంపెనీల నుంచి మద్యం తీసుకొచ్చే వాహనాలను వారు సూచించిన ప్రాంతాలకు రహస్యంగా తరలిస్తున్నారు. గురువారంతో నా మినేషన్ల ఉపసంహరణ ముగియడంతో అభ్యర్థులు ఇక ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. అం దుకు ప్రధానంగా మద్యంపైనే అన్ని పార్టీల అభ్యర్థులు దృష్టి పెట్టారు. ఎన్నికలకు ముందు మద్యం నిలువ చేయడం, పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం కష్టం. అందుకే ఇప్పటికే భారీగా మద్యాన్ని కొనుగోలు చేసి పల్లెల్లో డంప్ చేసినట్లు సమాచారం. పక్కా సమాచారంతో.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ విజయం కోసం ప్రచారం నిర్వహిస్తూనే ప్రత్యర్థి బలహీనతలను దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అన్ని పార్టీల అభ్యర్థులు మద్యం కొనుగోళ్లు జరుపుతున్నా.. ప్రత్యర్థి కొనుగోలు చేసిన మద్యం వాహనం ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడికి వెళ్తుందనే సమాచారం తెలుసుకుని ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇస్తున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగుతున్న ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పట్టుకుంటున్నారు. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో వారం రోజుల వ్యవధిలో ఆరుచోట్ల మద్యం నిల్వలపై పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది దాడులు నిర్వహించడమే ఇందుకు నిదర్శనం. తాజాగా కంచర్ల గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో డంపు చేస్తున్న మద్యంను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. అక్రమ మద్యం నిల్వలపై నిత్యం దాడులు జరుగుతున్నా కొనుగోళ్లు మాత్రం ఆగడంలేదు. ప్రస్తుతం కొద్ది మొత్తంలో మద్యం దొరుకుతున్నప్పటికీ ఇంకా భారీ స్థాయిలో మద్యం డంపులు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పరిమితికి మించి కొనుగోలు చేస్తే కేసులే.. ఎక్సైజ్ చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఆరు బాటిళ్ల కంటే ఎక్కువ కొనుగోలు చేయరాదనే నిబంధన ఉంది. మద్యం దుకాణాల నిర్వాహకులు కూడా ఈ నిబంధనను కచ్చితంగా పాటించాలి. కానీ ఎక్కడా అమలుకు నోచుకోవడంలేదు. వైన్ షాపుల నిర్వాహకులు పరిమితికి మించి అమ్మకాలు సాగిస్తున్నారు. ఎన్నికల సమయంలో పెద్ద మొత్తంలో మద్యం విక్రయాలు జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు అమ్మకాలపై దృష్టి పెట్టకుండా కొనుగోలు దారులను టార్గెట్ చేస్తున్నారు. బెల్టుషాపుల్లో భారీ నిల్వలు జిల్లాలో సుమారు 768 బెల్టుషాపులు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 42 వైన్ షాపులు, 42 పర్మిట్‌రూంలు, సిరిసిల్లలో 3, వేములవాడలో 2 బార్లు అధికారికంగా(లైసెన్స్) నిర్వహిస్తున్నారు. వీటన్నింటినీ మించి బెల్ట్‌షాపుల ద్వారానే మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రస్తుత ఎన్నికల్లో కూడా గ్రామాలలో మద్యంను పంపిణీ చేయడానికి ప్రధానంగా బెల్ట్‌షాపుల నిర్వాహకుల ద్వారానే మద్యాన్ని రహస్య ప్రదేశాల్లో డంపు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని మద్యం దుకాణాలతోపాటు హైదరాబాద్, నిజామాబాద్, మహారాష్ట్రలోని ధర్మాబాద్ నుంచి భారీగా మద్యం తీసుకువచ్చి ఓటర్లకు పంపిణీ చేయడానికి సిద్ధం చేశారు. మద్యం డంపు చేస్తే చర్యలు అనుమతులు లేకుండా రహస్య ప్రాంతాల్లో మద్యం డంపుచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. వైన్‌షాపు నిర్వాహకులు ఒక వ్యక్తి ఆరు బాటిళ్ల కంటే ఎక్కువ మద్యం అమ్మితే లైసెన్స్ రద్దు చేస్తాం. ఎక్సైజ్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం. ఇప్పటికే కొన్నిచోట్ల నిల్వచేసిన మద్యాన్ని పట్టుకుని కేసులు పెట్టాం. ముఖ్యంగా బెల్ట్‌షాపుల నిర్వాహకులు పద్దతి మార్చుకోవాలి. – చంద్రశేఖర్, ఎక్సైజ్ నోడల్ అధికారి -
అన్న గారి బెల్టు కథ!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఇప్పటివరకు కాంట్రాక్టులు చేసిన నేతల గురించి విన్నాం. నీరు–చెట్టు పనుల్లో రూ.కోట్లకు కోట్లు దండుకున్న ఎమ్మెల్యేలు, మంత్రులను చూశాం. ఇప్పుడు ఏకంగా బెల్టుషాపులు కూడా నిర్వహిస్తున్నారు. శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి స్వగ్రామం వేల్పనూరులో ‘అన్న’ ఆదేశాలతో ఆయన డ్రైవరు నేతృత్వంలో సాగుతున్న బెల్టుషాపు కథ ఇది. రోజుకు లక్ష రూపాయల వ్యాపారం సాగిస్తూ.. 30 నుంచి 40 శాతం అధిక ధరకు మద్యాన్ని విక్రయిస్తున్న వ్యవహారం తాజాగా బయటకు వచ్చింది. లక్ష రూపాయల వ్యాపారంలో రూ.40 వేల వరకూ లాభాన్ని ఆర్జిస్తుండటం గమనార్హం. ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంచే ఈ బెల్టు దుకాణం ‘అన్న’ ఆదేశాలతో నడుస్తుండటంతో ఇన్నాళ్లూ అటువైపు కన్నెత్తి చూసేందుకు అధికారులు సాహసించలేదు. అయితే, పక్కా ఫిర్యాదు రావడంతో చేసేదేమీ లేక రెండు రోజుల క్రితం ఎక్సైజ్ అధికారులు దాడి చేసి.. బెల్టుషాపును సీజ్ చేశారు. అయితే, అన్న ఆదేశాలతో.. ఆయన వద్ద డ్రైవరుగా పనిచేస్తున్న రమేష్ అనే వ్యక్తి నేతృత్వంలో ఈ షాపు నిర్వహిస్తున్నట్టు అందులో పనిచేసే వ్యక్తి స్పష్టంగా పేర్కొన్నప్పటికీ కేసులు పెట్టేందుకు అధికారులు జంకుతున్నారు. అసలు ‘అన్న’ ఎవరనే కోణంలో విచారణ చేసేందుకు సైతం సాహసించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. మొత్తమ్మీద ఎమ్మెల్యే స్వగ్రామంలో నడుస్తున్న ఈ బెల్టు షాపు వ్యవహారంలో ఫిర్యాదు చేసిన వారిపైనే తిరిగి కేసు నమోదుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అన్న చెబితేనే చేస్తున్నాం! బెల్టుషాపుపై దాడి సందర్భంగా ఎవరు నిర్వహిస్తున్నారని అడిగిన ప్రశ్నకు... షాపులో ఉన్న వ్యక్తి ‘మాకేం పని సార్. అన్న చెబితేనే చేస్తున్నాను’ అని స్పష్టంగా పేర్కొన్నారు. అన్న ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. చివరకు మాట మార్చి ఎమ్మెల్యే డ్రైవరు రమేష్ చెబితే చేస్తున్నానని బుకాయించాడు. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్సైజ్ అధికారులు బెల్టుషాపుపై దాడి చేసి, సుమారు రూ.20 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ‘అన్న’ ఎవరో నిగ్గుతేల్చి..అతనిపై కేసు పెట్టేందుకు మాత్రం సాహసించడం లేదు. కేవలం కింది వారిని బలిపశువులు చేసేందుకు సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 30–40 శాతం అధిక ధరలకు... ఎమ్మెల్యే సొంతూరిలో నడుస్తున్న ఈ బెల్టుషాపులో మద్యాన్ని భారీగా అదనపు ధరలకు విక్రయిస్తున్నారు. 30 నుంచి 40 శాతం వరకూ అధిక ధర చెల్లించి మరీ మద్యం ప్రియులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇదేంటని అడిగే ధైర్యం ఎవ్వరూ చేయడం లేదు. అంతేకాకుండా ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంచుతున్నారు. దీనిపై గతంలో అనేకసార్లు అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రం తాత్కాలికంగా మూసివేస్తున్నారు. తిరిగి యధావిధిగా నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో సాగుతున్న వ్యవహారం కావడంతో అధికారులు కూడా సీరియస్‌గా దృష్టి సారించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పల్లెలు ప్రశాంతం..!
సాక్షి,మిర్యాలగూడ రూరల్ : శాసన సభ ఎన్నికల పుణ్యమా అని పచ్చని పల్లెల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. ఇదేంటి అనుకుంటున్నారా.. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీస్, ఎక్సైజ్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుండడంతో మండలంలోని గ్రామాల్లో అక్రమంగా నిర్వహించే మద్యం బెల్ట్ షాపులు మూతపడ్డాయి. దీంతో విచ్చల విడిగా మద్యం లభించకపోవడంతో మం దుబాబులు పొద్దుగూకగానే గూటికి చేరుకుంటున్నారు. దీనివల్ల గ్రామాల్లో ప్రశాతంత నెలకొంది. గ్రామాలకి 3–5 బెల్ట్ షాపులు ఎన్నికల ప్రకటన రాక మునుపు ప్రతి మారు మూల పల్లెల్లో సహితం 3నుంచి 5 బెల్ట్ షాపులు అక్రమంగా నిర్వహించేవారు. బెల్ట్ షాపులో ఎప్పుడు మద్యం అయిపోయినా వైన్ షాపు నిర్వాహకులు వెంటనే సరఫరా చేసే వారు. దీంతో మద్యం ప్రియులకు ఎప్పుడుపడితే అప్పుడు మందు అందుబాటులో ఉండేది. నిషేధంతో మహిళలు హర్షం ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు ఎప్పుడైతే పోలీసులు బెల్ట్‌షాపులపై ఖచ్చితత్వం పాటించారో.. గ్రామాల్లో అక్రమంగా నిర్వహించే బెల్ట్ షాపులు మూత పడ్డాయి. మందు ప్రియులకు విచ్చలవిడిగా మద్యం లభించకపోవడంతో తమ పతులు త్వరగా ఇళ్లకు చేరుతున్నారని మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిషేధం కొనసాగించాలి: బెల్టుషాపుల నిషేధం కొనసాగించాలి. వీటి వల్ల గ్రామాల్లో విచ్చల విడిగా మధ్యం లభించడంతో అదుపులేకుండా మద్యం సేవించి రోగ్యం, ఇటు ఆర్థికంగా గుల్ల అయ్యేవారు. బెల్టుషాపుల నిషేధంతో మద్యం అందుబాటులో లేక పోవడంతో మందు ప్రియులు మితిమీరిన చేష్టలు కట్టడి అయ్యాయి. పల్లెలు ప్రశాతంగా మారాయి.–చలెండ్ల పద్మయ్య, అవంతీపురం -
మందు బందు.. పల్లెలు ప్రశాంతం
సాక్షి,పెగడపల్లి(ధర్మపురి): ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. పోలీసులు, ఆబ్కారీశాఖ అధికారులు గ్రామాల్లో జోరుగా తనిఖీలు చేస్తున్నారు. బెల్టు షాపులు, గుడుంబా తయారీ, విక్రయాలపై కేసులు నమోదు చేస్తున్నారు. ముందస్తుగా బెల్టు షాపులు నిర్వాహకులను గుర్తించి బైండోవర్ చేస్తున్నారు. తరువాత అదే పద్ధతిన విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి, జరిమానాలు విధిస్తున్నారు. ఎన్నికల పుణ్యమా అని పల్లెలో మందు బాబుల జోరు తగ్గింది. ప్రశాంత వాతావరణం ఏర్పడుతోంది. ఈ పరిమాణాలపై గ్రామంలో మల్లక్క, ఎల్లక్క అనే ఇద్దరు మహిళలు ఇలా సంభాషించుకుంటున్నారు. ఎల్లక్క: ఏం మల్లక్క.. బాగున్నావా..? మల్లక్క: ఆ కొద్ది రోజుల నుంచి ప్రశాంతంగా ఉంటున్నా. ఎల్లక్క: ఎందుకు..? ఇన్ని రోజుల నుంచి ప్రశాంతంగా లేవా ఏందీ? మల్లక్క: ఆ ఏం ప్రశాంతత పొద్దంతా కూలికెళ్లిన పెనిమిటి రోజూ సాయంత్రం తప్పతాగచ్చి ఒక్కటే నొళ్లి చేసేటోడు. గీ ఎన్నికల పూణ్యమాని ఊల్లేమందు(మద్యం) దుకాణాలను మొన్నటి నుంచి పోలీసోల్లు బందు చేయించుండ్రు. దీంతో నా పెనిమిటి తాగుడు తగ్గించుండు. లొల్లి కూడా తక్కువయింది. ఎల్లక్క: అవును మా ఊళ్లే కూడా గీ మందు దుకాణాలు తీత్తలేరు. ఎందుకో అనుకుంటున్నా..? మల్లక్క: ఇది ఎలచ్చన్ల సమయం. గిప్పుడు పాలనంత గా ఎన్నికల సంఘమోల్ల చేతిలో ఉందట. గీ నాయకులు చెప్పినవి ఇనరట. గా ఎన్నికల సంఘం అధికారులు చెప్పడంతో పోలీసోల్లు ఆబ్కారీ సార్లూ ఊర్లోని దుకాణాలను చెకింగ్ చేస్తున్నారు. కల్లు అమ్మవద్దని చెబుతున్నారు. అమ్మితే జైలులో పెడుతరట. ఎల్లక్క: గదా సంగతి మా ఊళ్లో ఇంతకు ముందు ఇంటికో దుకాణంలో కల్లు అమ్మేటోళ్లు. బాగా మంది గీ దుకాణాళ్లకు వచ్చి తాగేటోళ్లు. ఊర్లో లొల్లులు జడగాలు చేసేటోళ్లు. గిప్పుడు దుకాణాల్లో కల్లు అమ్ముతాలేరు. ఎవరూ అస్తలేరు. కోట్లాటలు లేక ఊరు చడిసప్పుడు లేకుండా సల్లగుంది. ఎపుడూ గిట్లుంటే మంచిగుండు. మల్లక్క: గీ ఎలచ్చన్ల వరకే గిట్లుంటదట. కొత్త సర్కారు వచ్చినంక మల్ల అందరు మొదట్లెక్కనే అమ్ముకుంటరట. ఎల్లక్క: అయితే ఎప్పటికి ఎన్నికల సంఘం పాలిస్తే మంచిగుండు. అప్పుడే మంచిగుంది. మల్లక్క: గట్టేట్ల కుదర్తది. మనది ప్రజాస్వామ్య దేశం. మన పాలకులను మనమే ఎన్నుకోవాలి. ఎల్లక్క: మరి గెలిచినంక గీ పాలకులు కూడి గిట్ల చెయ్యచ్చు కదా. మల్లక్క: గిట్ల చేస్తే సర్కారుకు ఆదాయం ఎట్లస్తది. మనోళ్లు తాగడంతో వచ్చే పైసలతో అభివృద్ధి పేరిట జేబులు నింపుకోవాలి. ఎల్లక్క: అలాంటోళ్లకు మనమెందుకు ఓటేయ్యాలి. మల్లక్క: గందుకే కల్లు పోస్తమనే, పైసలిస్త మనేటోళ్లను తరిమికొట్టాలి. మంచోళ్లను ఎన్నుకోవాలి. -
కల్తీ మద్యమే ప్రాణాలు తీసిందా?
తణుకు : ఉండ్రాజవరం మండలం సత్యవాడ గ్రామంలో మద్యం తాగి ఇద్దరు యువకులు మృత్యువాత పడిన ఘటనపై అనుమానాలు వీడలేదు. స్నేహితుల దినోత్సవం రోజున మందుపార్టీ చేసుకున్న ఐదుగురు యువకుల్లో ఇద్దరు మృత్యువాత పడగా మరొకరు తణుకు ప్రైవేటు ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. గ్రామానికి చెందిన పొనగంటి సుధీర్‌కుమార్, అంబటి ప్రసాద్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా మడిచర్ల శివవర్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీరితో పాటు మద్యం తాగిన పెద్దిశెట్టి నాని, గుండా కార్తీక్‌లు క్షేమంగానే ఉన్నారు. ఇదిలా ఉంటే వీరి మృతి వెనుకకారణాలు తెలియకపోయినప్పటికీ కల్తీ మద్యం కారణంగానే ఇద్దరు యువకులు మృతి చెందినట్లు ఎక్సైజ్, పోలీసు శాఖ ఉన్నతాధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే గ్రామం శివారులో పసలపూడి రోడ్డులో సత్యవాడ గ్రామ మాజీ సర్పంచి, టీడీపీ నాయకుడు నిర్వహిస్తున్న రెస్టారెంటు, బెల్టుషాపులోనే మద్యం, ఆహారం కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. మద్యంలో కల్తీ జరిగిందా లేక ఫుడ్‌పాయిజన్ అయ్యిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భిన్నకోణాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యవాడ ఘటనను అటు పోలీసు, ఇటు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గ్రామంలోని బెల్టుషాపులో కొనుగోలు చేసిన మద్యం, బీరు సీసాలను స్వా«ధీనం చేసుకున్న పోలీసులు వాటిని ఫోరెన్సిక్ లేబొరేటరీకి పరీక్షల నిమిత్తం పంపారు. మూడు బీర్లు తాగేసినప్పటికీ మద్యం సీసాలో మాత్రం కొంతమేర మద్యం మిగిలి ఉంది. అయితే సాధారణ మద్యంతో పోల్చితే సీసాలో ఉన్న మద్యం చిక్కగా ఉండటంతోపాటు భిన్నమైన వాసన వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అదనపు కిక్కు కోసం మద్యంలో మరేదైనా వాళ్లే కలుపుకొన్నారా..? లేక ఉద్దేశపూర్వకంగా ఎవరైనా మద్యంలో ఏదైనా కలిపారా అనేది పోలీసుల దర్యాప్తులోనే తేలాల్సి ఉంది. తొలుత ఫుడ్‌పాయిజన్ కారణంగానే ఇద్దరు యువకులు మృతి చెందినట్లు భావించినప్పటికీ పోస్టుమార్టంలో మాత్రం వారి కడుపులో ఎలాంటి ఆహారం లేదని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో కేవలం మద్యంలో మాత్రమే కల్తీ జరిగినట్లు పోలీసులు, ఎక్సైజ్‌శాఖ అధికారులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. అయితే మద్యం కొనుగోలు చేసిన బెల్టుషాపునకు సరఫరా చేస్తున్న వడ్లూరు, సూర్యారావుపాలెం మద్యం షాపుల్లో సంబంధిత బ్యాచ్‌కు చెందిన మద్యం బాటిళ్లను ఎక్సైజ్‌శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్త కోసం వెనక్కు తీసుకున్నారు. ఒకవేళ కల్తీ జరిగితే ఎవరు చేశారు..? ఎక్కడి నుంచి సరఫరా అయ్యింది అనే విషయాలపై అధికారులు దృష్టి సారించారు. మరోవైపు మద్యం తాగిన ముగ్గురితోపాటు వచ్చిన మరో ఇద్దరు యువకుల కదలికలపైనా పోలీసులు దృష్టి పెట్టారు. మృతి చెందిన యువకులతోపాటు ప్రాణాలతో బయట పడిన వారి సెల్‌ఫోన్ నంబర్లు ఆధారంగా ముందు ఎవరితో మాట్లాడారనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. అక్రమ మద్యం విక్రయాలపై దృష్టి ఉండ్రాజవరం మండలం సత్యవాడ గ్రామంలో జరిగిన ఘటనతో ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులు ఉలిక్కిపడ్డారు. ఎక్కడా బెల్టుషాపులు లేవని ప్రగల్భాలు పలికిన అధికార పార్టీ నాయకులు, ఎక్సైజ్ శాఖ అధికారులు ఇప్పుడు సత్యవాడ ఘటనతో కలిగిన నష్టాన్ని కప్పిపుచ్చుకునే పనిలో పడ్డారు. సత్యవాడ గ్రామంలో అనధికారికంగా నిర్వహిస్తున్న బార్ అండ్ రెస్టారెంట్‌ను మూసివేయించిన అధికారులు నిర్వాహకులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే అధికార పార్టీకి చెందిన నాయకుడు, గ్రామ మాజీ సర్పంచి కావడంతో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి. మరోవైపు దీంతోపాటు గ్రామంలోని పలు బెల్టుషాపులు ఉన్నట్లు గ్రామస్తులే చెబుతున్నారు. ఆయా బెల్టుషాపులకు స్థానిక ఎమ్మెల్యే సమీప బంధువుకు చెందిన మద్యం దుకాణాల నుంచే మద్యం సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకపక్క బెల్టుషాపులే లేవని చెబుతున్న ఎక్సైజ్‌శాఖ అధికారులు తాజాగా సత్యవాడ ఘటనలో వెలుగు చూస్తున్న వాస్తవాలతో ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
1705 బెల్ట్ దుకాణాలపై కేసులు
విజయనగరం రూరల్ : ఏడాది కాలంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా 1705 బెల్ట్ దుకాణాలపై కేసులు నమోదు చేశారని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ పి.సురేంద్రప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది జూలై 1నుంచి 2018 జూన్ 30 వరకు జిల్లాలోని 13 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో 1705 బెల్ట్ దుకాణాలపై కేసులు నమోదు చేసి 1726 మందిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. నిందితుల నుంచి 6759 లీటర్ల మద్యాన్ని, 995 లీటర్ల బీరును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బెల్ట్ దుకాణాలకు మద్యం తరలిస్తున్న 21 లైసెన్స్డ్ మద్యం దుకాణాలను గుర్తించి శాఖపరమైన చర్యలు తీసుకున్నామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా బ్రాండ్ మిక్సింగ్, చిల్లర అమ్మకాలు చేపడుతున్న 10 మద్యం దుకాణాలపై కేసులు నమోదు చేసి, ఒక్కో దుకాణదారుడికి రూ. లక్ష అపరాధ రుసుం విధించామన్నారు. ఎంఆర్పీకి మించి అమ్మకాలు చేపడుతున్న రెండు మద్యం దుకాణాల లైసెన్స్ రద్దు చేసి లక్ష రూపాయల చొప్పున అపరాధ రుసుం విధించామన్నారు. 98 మద్యం దుకాణాల్లో సాంకేతిక పరమైన సమస్యలు గుర్తించి 98 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. నవోదయం కార్యాక్రమంలో భాగంగా నాటుసారా తయారీ, రవాణా, విక్రయాలు సాగిస్తున్న గ్రామాల్లో469 మందిని అరెస్ట్ చేసి 511 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వీరి నుంచి 12,286 లీటర్ల సారాతో పాటు తయారీకి ఉపయోగించే 58, 095 లీటర్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశామన్నారు. అలాగే నాటుసారా రవాణాకు ఉపయోగించిన 90 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. 80 గ్రామాల్లో నవోదయం కార్యక్రమంలో భాగంగా బైండోవర్ కేసులు పెట్టి గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అలాగే జిల్లాలో గంజాయి సాగులేకున్నా తనిఖీల ద్వారా ఏడు కేసులు నమోదు చేసి అక్రమంగా గంజాయి తరలిస్తున్న 11 మందిని అరెస్ట్ చేయడంతో పాటు రెండు వాహనాలు, 47.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. బెల్ట్ దుకాణాల నిర్మూలన, నాటుసారా తయారీ, రవాణా, కేసుల నమోదుపై 13 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో ప్రతి నెలా రెండో శనివారం అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. -
బెల్ట్ దందా.. పల్లెల్లో ఎనీటైం మందు
ఒకప్పుడు మైదాన ప్రాంతాలకే పరిమితమైన బెల్ట్ షాపులు ఇప్పుడు ఏజెన్సీలోని అటవీ గ్రామాలకు సైతం విస్తరించాయి. అధికారులు అడపాదడపా దాడులు చేస్తున్నా పూర్తిగా నివారించలేకపోతున్నారు. రాష్ట్రం దాటి సరిహద్దు రాష్ట్రానికి సైతం ‘బెల్ట్ దందా’ విస్తరించింది. ప్రభుత్వం గుడుంబా తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించి వారిని మంచి మార్గంలో నడిపించేందుకు కృషి చేస్తుండగా.. మరో వైపు ఆ స్థానాన్ని బెల్ట్ షాపులు భర్తీచేస్తున్నాయి. సాక్షి, భూపాలపల్లి: పల్లెల్లో జోరుగా బెల్టుషాపులు వెలుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గుడుంబా తయారీకి చెక్‌పెట్టడంతో గ్రామాల్లో మద్యం దుకా ణాల జోరు కొనసాగుతోంది. మండల కేంద్రాల్లోనూ బెల్ట్‌షాపులు పుట్టుకొస్తున్నాయి. మారుమూ ల ఏజెన్సీ ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాల వరకు ఇవి విస్తరిస్తున్నాయి. వ్యాపారులు ప్రజల ను మత్తుతో ముంచి కాసులను వెనకేసుకుంటున్నారు. ఏజెన్సీలో జోరుగా.. ఏజెన్సీలోని గ్రామాల్లో మద్యం దుకాణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఒక్క ఏటూరునాగా రం మండలంలోనే 70 నుంచి 80 బెల్ట్ షాపులు వెలిశాయి. ఇంతకు ముందు అటవీ గ్రామాల్లో గుడుంబా వినియోగం ఎక్కువగా ఉండేది. ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం గుడుంబా తయారీపై ఉక్కుపాదం మోపింది. తయారీదారులకు ప్రత్యామ్నాయంగా ఆర్థిక సాయంతో ఇతర జీవన మార్గాలను కల్పించింది. ప్రభుత్వ ప్రయత్నం కొంతమేరకు ఫలించినా గుడుంబా తయారీ స్థానాన్ని ప్రస్తుతం బెల్ట్‌షాపులు ఆక్రమించాయి. తాడ్వాయి, ఏటూరునాగరారం, మహదేవపూర్, ములుగు మండలాల పరిధి గ్రామాల్లో ఏర్పాటు చేసిన బెల్ట్ షాపులకు మండల కేంద్రాల నుంచి మద్యం సరఫరా అవుతోంది. రాష్ట్రం దాటుతున్న సరుకు.. పల్లెల్లోనే కాదు జిల్లా నుంచి మద్యం సరిహద్దు రాష్ట్రం చేరుతోంది. ముఖ్యంగా కాళేశ్వరం, మహదేవపూర్ కేంద్రాలుగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు తరలిస్తున్నారు. అక్కడ మద్యనిషేధం ఉండటం జిల్లాలోని మద్యం వ్యాపారులకు కలిసివస్తోంది. సరిహద్దులో ఉండే ఓ మద్యం దుకాణానికి వేలంలో అత్యధిక ధర పలకడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఎండాకాలం గోదావరి ఉధృతి ఉండని సమయంలో సరిహద్దు మంచిర్యాల జిల్లా చెన్నూర్, కోటపల్లి నుంచి మద్యం ఎక్కువగా మహారాష్ట్రకు తరలించేవారు. మంచిర్యాల జిల్లాలోని అర్జునగుట్ట గ్రామం ద్వారా ప్రాణహిత నది దాటి నేరుగా మహారాష్ట్రలోని సిరొంచకు చేరేది. ప్రస్తుతం గోదావరి వరద ఉధృతి ఉండటం, తాత్కాలికంగా గోదావరి నదిలో వేసిన రోడ్లు కొట్టుకుపోవడం సరిహద్దుల్లో ఉండే మద్యం దుకాణాలకు కాసుల వర్షం కురుస్తోంది. అంతర్రాష్ట్ర వంతెన ద్వారా నిత్యం లక్షల రూపాయల విలువైన మద్యం సరిహద్దు దాటుతోంది. మరోవైపు మహదేవపూర్ మండలం అంబట్పల్లి కేంద్రంగా మహారాష్ట్రకు మద్యం సరఫరా అవుతోంది. ఎనీ టైం మందు.. బెల్ట్ షాపులన్నీ ఎనీ టైం మందు అనే పద్ధతిలో నడుస్తున్నాయి. మద్యం దుకాణాలు మూసిన తర్వాత తెల్లవారుజాము 2 నుంచి 3 గంటల వరకు మందుబాబులకు మద్యం దొరుకుతోంది. అర్ధరాత్రి అపరాత్రి అనే తేడాలు లేకుండా అన్ని గ్రామాలు, మండల కేంద్రాల్లో మద్యాన్ని అమ్ముతున్నారు. తలుపు తట్టి పలానా వాడిని వచ్చానంటే ఏ టైంలోనైనా మద్యం ఇస్తున్నారు. వ్యాపారాభివృద్ధి కోసం మద్యం వ్యాపారులు కొత్తదారులను వెతుకుతున్నారు. తెల్లవారుజామున గ్రామాల్లో తిరిగి బెల్ట్‌షాపులకు మద్యాన్ని డంప్ చేస్తున్నట్టు సమాచారం. ఇదే కాకుండా బెల్ట్‌షాపుల నిర్వాహకులకు మద్యం వ్యాపారులు కొత్తగా అప్పులు ఇచ్చి మద్యం అమ్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ సంబంధిత అధికా>రులకు తెలిసినా పట్టించుకోవడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వ్యాపారుల నుంచి కమీషన్లు తీసుకొని మా జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడుతున్నారు. 1600 బెల్ట్ షాపులు..! జిల్లాలో మొత్తం మండలాలు 20 ఉండగా మద్యం షాపులు 55 ఉన్నాయి. బెల్ట్ షాపులు మండలానికి 70 నుంచి 80 వరకు ఉండొచ్చని అంచనా. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా 1400 నుంచి 1600 వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఆదాయం అధికంగా వస్తుండడంతో బెల్ట్ షాపులను విచ్చల విడిగా ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో బాటిల్‌పై ఎమ్మార్పీ ధర కంటే రూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. నియంత్రణకు చర్యలు చేపడుతున్నాం జిల్లాలో బెల్ట్‌షాపులను నియంత్రించేందుకు ఎక్సై జ్ శాఖ కృషి చేస్తోంది. వీటితోపాటు అనుమతి లేకుండా మద్యం అమ్మితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం. – శశిధర్‌రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ -
మద్యం ఎట్లా పారుతున్నదంటే..!
కందుకూరు రూరల్: పల్లెలు మద్యం మత్తులో తూలుతున్నాయి. బెల్ట్ షాపుల నివారించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా పెద్దగా ఫలితం ఉండటం లేదు. లైసెన్స్ ఉన్న ఏ షాపు నుంచీ మద్యం బయటకు వెళ్లకూడదని నిబంధనలు ఉన్నా అందుకు విరుద్ధంగా బెల్ట్ షాపులకు తరలిస్తున్నారు. దీన్ని నివారించాల్సిన ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో తూగుతున్నారు. బెల్ట్ షాపులను బహిరంగంగా బంకుల్లో పెట్టి విక్రయాలు జరుపుతున్నా అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. బెల్ట్ షాపుల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో మధ్య తరగతి కుటుంబాలు గుల్లవుతున్నాయి. కూలీనాలి చేసుకొని జీవనం సాగించే కుటుంబాల్లోని పురుషులు మద్యానికి బానిసై ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్నారు. గ్రామంలోనే అందుబాటులో మద్యం దొరుకుతుండటంతో క్వార్టర్‌కు డబ్బులుంటే చాలు నేరుగా బెల్ట్ షాపుల్లో కూర్చొని మద్యం తాగుతున్నారు. అదే గ్రామంలో అందుబాటులో మద్యం లేకుంటే దూర ప్రాంతాలైన పట్టణాలకు వెళ్లి మద్యం తాగడం కష్టంగానే ఉంటుంది. గ్రామీణ ప్రాతాల్లో బడ్డీ కొట్లు, కూల్‌డ్రింక్ షాపులు నిర్వహిస్తున్న వ్యాపారులు యథేచ్చగా మద్యం విక్రయిస్తున్నారు. ఇది ఇలా ఉంటే కొన్ని గ్రామాల్లో బంకుల్లో కాకుండా నేరుగా సంచులు, జేబుల్లో పెట్టుకొని మద్యం బాటిళ్లు విక్రయిస్తున్నారు. మద్యం కావాలని ఫోన్ కొడితే మందు సీసా జేబులో పెట్టుకొని ఇంటికి తెచ్చిస్తున్నారు. అదనపు వసూలు మద్యం నేరుగా ఇంటికి తీసుకొచ్చి ఇస్తే క్వార్టర్ సీసాపై రూ.20 నుంచి రూ.40ల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇక బంకుల్లో రూ.10 నుంచి రూ30ల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. బంకుల్లో ప్రారంభంలో స్వచ్ఛమైన మద్యం ఇస్తున్నారు. ఆ తర్వాత మత్తులో ఉండగా సీల్ చేసిన మద్యం సీసాలో నీరు కలిపి మందు బాబులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలోని ఓగూరులో బస్టాండ్ దగ్గరలో రెండు షాపుల్లో మద్యం విక్రయిస్తున్నారు. పట్టణాల నుంచి సైతం అక్కడికి వెళ్లి తాగుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మాచవరం ఎస్సీ కాలనీలో కేవలం మద్యం విక్రయాలనికే బంకు ఏర్పాటు చేశారు. ఇంతక ముందు బెల్ట్ షాపుల్లో ఒక చీప్ లిక్కర్ మాత్రమే విక్రయించే వారు. ప్రస్తుతం బీర్లుతో పాటు కొన్ని బ్రాండ్లు విక్రయిస్తున్నారు. యువత కూడా మద్యానికి బానిసవుతున్నారు. లైసెన్స్ షాపుల నుంచే సరఫరా లైసెన్స్ షాపుల నుంచి మద్యం బెల్ట్ షాపులకు వెళ్లకూడదు. కానీ మహదేవపురం, పలుకూరు గ్రామాల్లో ఉన్న మద్యం దుకాణాల నుంచి బెల్ట్ షాపులకు మద్యం వెళ్తున్నట్లు సమాచారం. బైక్‌పై నేరుగా ఆయా గ్రామాలకు వెళ్లి బంకుల్లో మద్యం కేసులు వేసి వస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్సైజ్ అదికారులు కూడా బెల్ట్ షాపులపై దాడులు చేసిన దాఖలాలు లేకపోవడంతో బెల్ట్ షాపుల నిర్వాహణ మూడు క్వార్టర్లు.. ఆరు ఫుల్లుగా సాగుతోంది. అధికారులు మాత్రం తమకేమీ తెలియదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మద్యం దుకాణాలు, బెల్ట్‌షాపుల నుంచి నేరుగా మామూళ్లు వెళ్తుండటంతోనే అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. బెల్ట్ షాపులు నిర్వహకులపై ఉక్కుపాదం మోపాలని ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఆదేశాలు ఉన్నా బేఖాతర్ చేస్తున్నారు. బెల్ట్ షాపులు నిర్వహించే వారు అధికంగా అధికార పార్టీకి చేందిన వారే కావడంతో ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. -
బెల్టుషాపులపై పోలీసుల మెరుపుదాడి
తుంగతుర్తి: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, అన్నారం గ్రామాల్లోని బెల్టు దుకాణా లపై పోలీసులు ఆదివారం మెరుపు దాడి చేశారు. ‘గల్లీకో బెల్టు’అనే శీర్షికతో ఆదివారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి సివిల్ పోలీసులు స్పందించారు. ఆ రెండు గ్రామాల్లోని బెల్టు దుకాణాల్లో దాడులు నిర్వహించి సుమారు రూ.15 వేల విలువల గల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అన్నారంలో ముగ్గురు, తుంగతుర్తిలో ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. సివిల్ పోలీసులు బెల్టుషాపులపై దాడులు చేస్తుంటే.. ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం తమకు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. మండలవ్యాప్తంగా బెల్టుషాపులపై ఎక్సైజ్ పోలీ సులు దాడులు నిర్వహిస్తే పెద్దమొత్తంలో మద్యం లభించేదని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. మద్యం దుకాణదారులు సిండికేట్‌గా ఏర్పడి బెల్టుషాపులకు క్వార్టర్‌పై రూ.10, బీరు పై రూ.10కి అదనంగా విక్రయిస్తున్నారు. బెల్టు షాపులవారు సిండికేట్‌గా మారి ఎమ్మార్పీ కన్నా రూ.20 నుంచి రూ.30 వరకు అదనంగా విక్రయిస్తున్నారు. దాడుల్లో సీఐ శ్రీనివాస్, ఎస్సై బాలునాయక్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
‘బెల్ట్’ తీసిన పోలీసులు
ములుగు(గజ్వేల్) : ములుగు మండలంలోని రెండు బెల్ట్‌షాపులపై సోమవారం దాడులు నిర్వహించినట్లు ఎస్ఐ శ్రీశైలం తెలిపారు. వారి వద్ద నుంచి మద్యం స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. క్షీరసాగర్ గ్రామానికి చెందిన తాటికొండ రేణుక తన ఇంట్లోనే బెల్ట్‌షాపును నిర్వహిస్తూ అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు దాడి చేశామన్నారు. దాడుల్లో 10 బీ రు సీసాలు లభ్యమయినట్లు చెప్పారు. అన్నసాగర్లో మక్తాల వెంకటేశ్ అనే వ్యక్తి కల్లు దుకాణంతో పాటు బెల్టుషాపు నిర్వహిస్తున్నాడన్న సమాచారంతో దాడిచేయగా 20 క్వార్టర్ సీసాలు లభ్యమైనట్లు ఎస్ఐ చెప్పారు. మ ద్యం సీసాలు స్వాధీనం చేసుకుని రేణుక, వెం కటేశ్పై కేసునమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
రాష్ట్రంలో మరో 9 మద్యం డిపోలు
-
ఇంకా తాగిద్దాం!
సాక్షి, అమరావతి:మద్యం ఆదాయం పెంచుకునేందుకు సర్కారు ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. బెల్టు షాపులు, పర్మిట్ రూంల ద్వారా జనం చేత ఫుల్లుగా తాగిస్తున్న ప్రభుత్వం డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా చేసేందుకు అదనపు మద్యం డిపోలను ఏర్పాటు చేయనుంది. డిస్టిలరీల నుంచి సరఫరా అయ్యే మద్యంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే సరుకును డిపోల్లో ఉంచేందుకు ఆగమేఘాల మీద రాష్ట్రంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13 జిల్లాల్లో 24 మద్యం డిపోలు ఉన్నాయి. వీటికి అదనంగా మరో తొమ్మిది ఏర్పాటు కానున్నాయి. గత ఆర్థిక సంవత్సరం(2016–17)లో రూ. 13,640.22 కోట్ల అమ్మకాలు జరగ్గా.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే(డిసెంబర్ 1నాటికి) మద్యం అమ్మకాలు రూ. 11 వేల కోట్లు దాటాయి. మార్చి నాటికి మద్యం అమ్మకాలు రూ. 17 వేల కోట్లు దాటాలని లక్ష్యం విధించిన సర్కారు అదనంగా మద్యం డిపోలను ఏర్పాటు చేసి మద్యం షాపులకు అమ్మకాల టార్గెట్లు విధించనుంది. దీనికి తోడు వచ్చే ఏడాదిలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి ఉండటం, ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో మద్యం డిపోల ద్వారా అధికార పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు సర్కారు ఈ ఆలోచన చేస్తోందని పలువురు అధికారులు అంటున్నారు. తమకు అనుకూలంగా ఉండి, పదవీ విరమణ చేసిన ఓ అధికారికి డిపోల పర్యవేక్షణ బాధ్యత అప్పగించడంతో సర్కారు వ్యవహార శైలిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త మద్యం డిపోలు ఏర్పాటు చేసే ప్రాంతాలివే.. మదనపల్లి(చిత్తూరు జిల్లా), అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని కనగానపల్లి, ప్రొద్దుటూరు(వైఎస్సార్ జిల్లా), నంద్యాల(కర్నూలు జిల్లా), గూడూరు(నెల్లూరు జిల్లా), భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా), గాజువాక(విశాఖ జిల్లా), పలాస(శ్రీకాకుళం జిల్లా), బొబ్బిలి(విజయనగరం జిల్లా)లో మద్యం డిపోలు నూతనంగా ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో సగటున రోజుకు రూ. 50 కోట్లకు పైగా విలువైన మద్యాన్ని తాగిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో మద్యం అమ్మకాల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలో 15 డిస్టిలరీలున్నాయి. వీటి ద్వారా లైసెన్స్డ్ ఉత్పాదక సామర్ధ్యం 2,590 లక్షల ప్రూఫ్ లీటర్ల వరకు ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి చీప్ లిక్కర్ టెట్రా ప్యాక్‌లు, బీర్ల కేసుల్ని భారీగానే దిగుమతి చేస్తున్నారు. ఫోన్ కొడితే ఇంటికే మద్యం రాష్ట్రంలో మద్యం సిండికేట్లు ‘మొబైల్ బెల్టు షాపుల’ ద్వారా అక్రమ మద్యం విక్రయాలకు శ్రీకారం చుట్టాయి. ఆటోలు, ద్విచక్ర వాహనాల ద్వారా మద్యం బాటిళ్లను విక్రయిస్తూ కొత్త పంథా ఎంచుకున్నారు. ఫోన్ కొడితే ఇంటికే మద్యం చేర్చే వ్యాపారం మూడు గ్లాసులు.. ఆరు పెగ్గులు అన్న రీతిలో సాగుతోంది. మద్యం షాపు నుంచి కొనుగోలు చేసే బాటిళ్లపై 13 అంకెల బార్ కోడ్‌తో హాలోగ్రామ్ లేబుల్‌ను తొలగించి అమ్మకాలు చేపడుతున్నారు. బ్యాచ్, హీల్ నంబర్లు లేకపోవడంతో మద్యం బాటిళ్లు ఎక్కడ నుంచి కొనుగోలు చేశారన్నది తెలియడం లేదని ఎక్సైజ్ అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో ఉన్న 4,380 మద్యం షాపులకు అనుబంధంగా ఏర్పాటు చేసిన పర్మిట్ రూంలు మినీ బార్లులా కొనసాగుతున్నాయి. బెల్టు షాపులపై ఫిర్యాదులకు ప్రభుత్వం 1100 నంబరును ప్రకటించింది. అయితే అదంతా ప్రచారం కోసమేనని కొద్ది రోజుల్లోనే తేలిపోయింది. పలుచోట్ల పాన్ షాపులు, మెడికల్ షాపులు, జనరల్ స్టోర్స్‌లలో కూడా విక్రయాలు జరుగుతున్నాయి. -
లూజు వదిలి.. బెల్టు మరిచి!
అధికారంలోకి రాగానే బెల్టు షాపులను తొలగిస్తామని పాదయాత్రలో చంద్రబాబు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్టు షాపులను మూసేయాలని ఎక్సైజ్ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో వాటి జోలికి వెళ్లొద్దని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు ఎక్సైజ్ వర్గాల ద్వారా తెలిసింది. ప్రభుత్వ ద్వంద్వ నీతి కారణంగా బెల్టు షాపుల్లో మద్యం ఏరులై పారుతోంది. ♦ గత నెలలో యల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామాంలో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి సంబంధించిన ఇంట్లో బెల్ట్‌షాపు నిర్వహిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి 60 బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే నివాసంలో బెల్ట్‌షాపు కొనసాగుతుండటం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ♦ అదే మండలంలోని గొడ్డుమర్రిలో ఎక్సైజ్ పోలీసుల దాడుల్లో 42 బాటిళ్ల మద్యం లభ్యమైంది. ఈ బెల్ట్‌షాపు కూడా టీడీపీ నేతకు చెందినదే. ఈ మద్యం బాటిళ్లు నాలుగు దుకాణాల్లో కొనుగోలు చేసినట్లు అధికారుల పరిశీలనలో వెల్లడయింది. ♦ ఈ రెండు ఉదాహరణలు చూస్తే జిల్లాలో బెల్టు షాపులు ఏ స్థాయిలో నిర్వహిస్తున్నారో అర్థమవుతోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: మద్యం సిండికేట్ల వ్యవహారం గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. బినామీల పేరుతో దుకాణాలను దక్కించుకుని యథేచ్ఛగా విక్రయాలు సాగించారు. అప్పట్లో 80 శాతం దుకాణాలు తెల్ల రేషన్ కార్డుదారులైన బినామీల పేరుతో నిర్వహించారు. ఈ క్రమంలో అబ్కారీశాఖ పాత విధానానికి ఫుల్స్టాప్ పెట్టి కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది. ప్రస్తుతం లాటరీ పద్ధతిన దుకాణాలు కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా 246 మద్యం దుకాణాలు ఉండగా.. వీటిలో చాలా దుకాణాల పరిధిలో బెల్టు షాపులు ఏర్పాటయ్యాయి. ఈ ఏడాది మే వరకు బెల్ట్‌షాపుల నిర్వాహకులు దుకాణాల నుంచి మద్యం కేసులను తీసుకెళ్లి విక్రయించేవారు. అయితే ఆన్లైన్బిల్లింగ్ అమల్లోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. ఇదీ ప్రస్తుత పరిస్థితి.. గతంలో ఆర్గనైజర్(గదిలో విక్రయాలు) బెల్ట్ దుకాణాలు కనిపించేవి. ఇప్పుడు మొబైల్(ఊర్లో తిరుగుతూ అమ్మడం) అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఆర్గనైజర్ దుకాణాలు కూడా చాలా గ్రామాల్లో కొనసాగుతున్నాయి. వీరు మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీకి కొనుగోలు చేస్తారు. ఒక దుకాణంలో గరిష్టంగా ఆరు బాటిళ్లు విక్రయించొచ్చు. అంతకంటే ఎక్కువ విక్రయిస్తే మద్యం దుకాణం ఆధ్వర్యంలోనే బెల్ట్‌షాపు నిర్వహిస్తున్నట్లు. దీంతో బాటిళ్ల ఆన్లైన్ బిల్లింగ్‌లో ఆరు బాటిళ్లకు మించకుండా బిల్లు చేస్తున్నారు. రోజూ వచ్చే వారు, ఒక బాటిల్‌కు వచ్చే వారి పేరుతో బిల్లులు ఇస్తున్నారు. గొడ్డుమర్రిలో అధికారుల దాడుల్లో దొరికిన 42 బాటిళ్లు ఏ దుకాణంలో కొనుగోలు చేశారని ఆరా తీస్తే పులివెందులలోని నాలుగు దుకాణాల్లో కొనుగోలు చేసినట్లు తేలింది. తిమ్మంపల్లిలోని 60 బాటిళ్లు కూడా పలు షాపుల్లో కొనుగోలు చేసినట్లు వెల్లడయింది. అంటే బెల్ట్‌షాపు నిర్వాహకులు పట్టణాల్లో ఐదారు దుకాణాలు తిరిగి బాటిళ్లు కొనుగోలు చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఇలా తీసుకెళ్లిన బాటిళ్లను ఇంట్లో పెట్టుకుని కొందరు బెల్టు దుకాణాలను నిర్వహిస్తున్నారు. ఇంకొందరు జేబులో పెట్టుకుని గ్రామాల్లో తిరుగుతూ విక్రయిస్తున్నారు. ఒక్కో బాటిల్‌పై రూ.25 నుంచి రూ.30 అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ తరహా బెల్ట్‌షాపులు నడుస్తున్నట్లు అధికారులకు తెలిసినా లక్ష్యాన్ని అధిగమించేందుకు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని మద్యం దుకాణాల ద్వారా ఆబ్కారీకి 60 శాతం ఆదాయం వస్తుంటే, 40 శాతం ‘బెల్ట్’ ద్వారానే సమకూరుతోంది. ఆర్డర్ సరే.. ఆచరణ కరువు టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు సీఎం పీఠమెక్కాక రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించి ‘మద్యాంధ్రప్రదేశ్’గా మార్చారు. తీ నేపథ్యంలో పదేళ్లు అధికారానికి దూరమైన చంద్రబాబు 2014 ఎన్నికల ప్రచారంలో ‘బెల్ట్ రాగాన్ని’ అందుకున్నారు. అధికారంలోకి వస్తే బెల్టు షాపులను తొలగిస్తామని ప్రకటించారు. మేనిఫెస్టోలో కూడా ఇదే విషయాన్ని పొందుపరిచారు. నిజానికి బెల్ట్‌షాపుల నిర్వహణకు ఎప్పుడూ, ఏ ప్రభుత్వంలో అనుమతుల్లేవు. అయినప్పటికీ ఓ జీఓను కూడా జారీ చేశారు. దీంతో బాబు మాటపైన నిలబడ్డారని అంతా భావించారు. ఇంతలోనే తనదైన శైలిలో ‘బెల్ట్’ జోలికి వెళ్లొద్దని.. ‘బెల్ట్’ తీస్తే సర్కారు ఖజానాకు గండిపడుతుందని మౌఖిక ఆదేశాలు జారీ చేయించారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉందని.. ఇలాంటి సమయంలో ఎంత మద్యం తాగిస్తే.. అంత ఆదాయం వస్తుందని కూడా బాబు సూచించినట్లు తెలుస్తోంది. ఆ మేరకు అధికారులు ‘బెల్ట్’ వైపు కన్నెత్తి చూడని పరిస్థితి. పైగా కొత్త నిబంధనల మేరకు లాటరీలో ఎవరి పేరుతో షాపు వస్తుందో వారే నడపాలి. అయితే లాటరీలో దుకాణం దక్కించుకున్న వారి నుంచి తిరిగి ‘ఎక్సెస్ రేటు’తో ఖద్దరు నేతలు దుకాణాల్లో పాగా వేయడం గమనార్హం. -
తల్లిదండ్రులపై ఎస్ఐ దాడి
నంద్యాల టౌన్: బెల్టుషాపు నిర్వహిస్తున్నారని తల్లిదండ్రులను ఎస్ఐ తన సిబ్బందితో కలిసి అందరి ముందు కొట్టడంతో మనస్తాపానికి గురైన కుమారుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ సంఘటన గురువారం చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బండిఆత్మకూరు మండలం సింగవరం గ్రామానికి చెందిన ధనుంజయగౌడ్, లక్ష్మిదేవిలు బెల్టుషాపు నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు ఆ గ్రామానికి వెళ్లారు. భార్యాభర్త పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా దాడి చేసి కొట్టారు. మధ్యాహ్నం పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన వారి కుమారుడు వెంకటేశ్వర్లుగౌడ్(13) తల్లిదండ్రులను కొట్టడం చూసి మనస్తాపానికి గురయ్యాడు. వెంటనే పురుగుల మందు తాగాడు. స్థానికులు అతన్ని 108 అంబులెన్స్‌లో నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ విషయంపై బండిఆత్మకూరు ఎస్ఐ విష్ణునారాయణ వివరణ ఇస్తూ బెల్టుషాప్ నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు వారి ఇంటిపై దాడి చేశామన్నారు. 25మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో వారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొని వెళ్లడానికి జీపులో ఎక్కాలని చెప్పగా అందుకు అంగీకరించలేదన్నారు. దీంతో బలవంతంగా స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశామనే ఉద్దేశంతో వారు ఫిర్యాదు చేసి ఉండొచ్చని తెలిపారు. కొన్ని రోజుల క్రితమే ఎక్సైజ్ అధికారులు కూడా వారి ఇంటిపై దాడి చేసి మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారని, అయినా బెల్ట్‌షాపు కొనసాగిస్తుండటంతో తాము సిబ్బందితో అక్కడికి వెళ్లామని తెలిపారు. భవిష్యత్తులో పోలీసులెవరూ వారి ఇంటి వద్దకు వెళ్లకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. -
‘నవరత్నాల’ ఎఫెక్ట్ : బెల్టుషాపుల తొలగింపు
-
‘నవరత్నాల’ ఎఫెక్ట్.. బెల్టుషాపుల తొలగింపు
వైఎస్ జగన్ ‘నవరత్నాల’ ఎఫెక్ట్.. ప్లీనరీలో ప్రతిపక్ష నేత చేసిన మద్య నిషేధ ప్రకటనతో కేబినెట్ భేటీలో సర్కారు హడావుడి నిర్ణయం సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్న పథకాలతో చంద్రబాబు సర్కారులో వణుకు మొదలైంది. ఈ పథకాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుండటంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. మొన్నటికి మొన్న డ్వాక్రా సంఘాలకు రూ.676 కోట్లు విడుదల చేస్తే, తాజాగా క్యాబినెట్ సాక్షిగా బెల్ట్ షాపుల ఎత్తివేతకు నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల క్రితం ఎన్నికలకు ముందు ఈ అంశం టీడీపీ మ్యానిఫెస్టోలో ఉన్నప్పటికీ ఇప్పటి వరకూ దాన్ని పట్టించుకోలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్లీనరీలో ప్రకటించిన తొమ్మిది పథకాలకు ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో వాటిని ఎలా ఎదుర్కొవాలన్న దానిపై మంగళవారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సుదీర్ఘ సమావేశంలో క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన ఎక్సైజ్ విధానంపై మహిళల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో పాటు, ప్రతిపక్ష నేత దశలవారీ మద్యపాన నిషేధాన్ని ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బెల్ట్ షాపులను తక్షణం తొలగించాలని నిర్ణయించింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాకు వివరించారు. తాము నిర్వహించిన సర్వేలో నూతన ఎక్సైజ్ పాలసీపై మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఇందులో భాగంగా బెల్ట్‌షాపులను తక్షణం తొలగించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు. లైసెన్స్ లేకుండా అమ్మకాలు జరుపుతున్న వారిపై, వీరికి మద్యం సరఫరా చేస్తున్న షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారన్నారు. ఇందుకోసం పోలీసు, ఎక్సైజ్ శాఖలు సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇదే విధంగా రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి అక్రమ వాడకంపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. సమావేశంలో తీసుకున్న మరిన్ని నిర్ణయాలు.. ► కాపులకు రిజర్వేషన్ల అంశాన్ని పరిశీలించడానికి గత ఏడాది ఫిబ్రవరి 2న ఏర్పాటు చేసిన మంజునాథ కమిషన్.. 8 నెలల్లో నివేదిక ఇవ్వాలని కోరినా ఇప్పటి వరకు ఇవ్వలేదని, తొందరగా నివేదిక ఇవ్వాలని కోరారు. ► రాష్ట్రంలో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి నెలకు రూ.2,500 పెన్షన్ అందించాలని నిర్ణయం. ఉద్దానంతో పాటు రాష్ట్రంలో ఉన్న అందరికీ (ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మాత్రమే) ఈ పథకం వర్తిస్తుంది. ► రియో ఒలిపింక్స్‌లో బంగారు పతకం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధుకు 1,000 గజాల స్థలం కేటాయింపు. -
బెల్టు దుకాణాలపై దాడులు
– 172 మద్యం బాటిళ్ల పట్టివేత – నలుగురి అరెస్ట్ ఆలూరు రూరల్ : ఆలూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, జిల్లా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు ప్రత్యేక సిబ్బంది ఆధ్వర్యంలో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు నియోజకవర్గంలోని గ్రామాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆలూరులోని వరలక్ష్మి అనే మహిళ ఇంటిలో ఉన్న 78 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆస్పరి మండలం బిల్లేకల్లోని రాజశేఖర్ ఇంటిలో 22, కైరుప్పల నాగరాజు ఇంటిలో 24, ఆస్పరి వెంకటరాముడు ఇంటిలో 48 మద్యం బాటిళ్లను పట్టకున్నారు. వారందరిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. గ్రామాల్లో బెల్టు దుకాణాలు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ సీఐ మాధవస్వామి, జిల్లా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు సీఐ గోవిందనాయక్, ఆలూరు ఎక్సైజ్ ఎస్ఐ రామాంజనేయులు హెచ్చరించారు. దాడుల్లో ఆలూరు ఎక్సైజ్ సిబ్బంది రామసుబ్బయ్య, ఈశ్వరయ్య, మాళవ్య, పుల్లయ్య పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలలో బెల్ట్‌షాపు వేలం!
- నిర్వహించింది ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు - రూ.3 లక్షల 15 వేలకు వేలం దక్కించుకున్న వ్యాపారి సాక్షి, నాగర్‌కర్నూల్: అది పవిత్రమైన ప్రభుత్వ పాఠశాల. చదువులమ్మ ఒడిలో అన్నీ తెలిసిన ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు చట్టవిరుద్ధంగా బెల్ట్‌షాపునకు వేలంపాట నిర్వహించి పాఠశాల పవిత్రతను, ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రతిష్టను మంటగలిపారు. ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించాల్సిన ప్రజాప్రతినిధులూ అక్రమ మద్యం అమ్మకాలను ప్రోత్సహించేలా వ్యవహరించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలోని తెలకపల్లి మండలం ఆలేరు గ్రామమది. ఆ గ్రామంలో మద్యం అమ్మకాల కోసం గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుల అధ్యక్షతన ఆదివారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గ్రామ ప్రజల సమక్షంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు బెల్ట్‌షాపులో మద్యం అమ్మకాల కోసం వేలంపాట నిర్వహించాడు. సుమారు ఈ వేలంపాటకు 200 మందికి పైగానే హాజరు కాగా, అందులో 13 మంది వేలంపాటలో పాల్గొన్నారు. ఒక్కొక్కరు రూ.5 వేలు డిపాజిట్ చేసి వేలం పాడగా, వారిలో ఒకరు రూ.3 లక్షల 15 వేలకు వేలం దక్కించుకున్నారు. కాగా, ఈ సంఘటన అందరికీ ఆశ్చర్యాన్ని, ఆవేదనను కలిగిస్తోంది. నిత్యం పిల్లలకు విద్యాబుద్ధులు బోధించాల్సిన ఉపాధ్యాయుడే వేలంపాట కార్యక్రమాన్నిముందుండి నడిపించడం పట్ల ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తెలకపల్లి మండలం ఆలేరు గ్రామ జనాభా 3,500 ఉంటుంది. ఈ గ్రామంలో ప్రస్తుతం 15 బెల్ట్ షాపుల ద్వారా ప్రతిరోజూ రూ.50 వేలకు పైగా అక్రమంగా మద్యం వ్యాపారం జరుగుతోంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా అంతా తాగి తందనాలు ఆడుతుండటంతో మహిళలు వారిని వారించలేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, ఆలేరులో పాఠశాలలో వేలం నిర్వహించినట్లుగా వాట్సాప్‌లో ఫిర్యాదులు అందాయని, వేలం నిర్వహించిన వారిపైనా.. గ్రామంలో అక్రమంగా మద్యం దుకాణాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ ఈఎస్ శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. -
మంత్రి లోకేశ్ విస్మయం
అమరావతి: తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలో విచ్చలవిడిగా విస్తరించిన బెల్టు షాపుల వల్ల మహిళలు పడుతోన్న ఇబ్బందులు అన్నీఇన్నీకావు. అధికారికంగా ఎలాంటి అనుమతులు లేనప్పటికీ దాదాపు అన్ని పెద్ద గ్రామాల్లో బెల్టు షాపుల ద్వారా మద్యం విక్రయాలు జరుగుతుండటం, ఆబ్కారీ శాఖ చూసిచూడనట్లు వ్యవహరించడం తెలిసిందే. తాజాగా తమ గ్రామంలోని బెల్టు షాపు వల్ల ప్రజలు ఇబ్బందిపడుతున్న వైనాన్ని ప్రకాశం జిల్లాకు చెందిన నర్సింహారావు అనే యువకుడు ట్విట్టర్ ద్వారా మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకొచ్చాడు. బెల్టు షాపు ఫొటోను జతచేసి..‘అయ్యా.. మా గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తోన్న ఈ బెల్టుషాపుపై చర్యలు తీసుకోవాల్సిందిగా చాలా సార్లు ఫిర్యాదులు చేశాం. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు’ అని పౌరుడు పేర్కొన్నాడు. గ్రామీణాభివృద్ధి శాఖకు కూడా మంత్రిగా ఉన్న లోకేశ్.. ఆ ఫొటోను చూసి ‘ఏంటి! ఇది బెల్టు షాపా?’ అని విస్మయం వ్యక్తంచేశారు. ఆపై, ‘ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక అధికారులను అలర్ట్ చేస్తా’నని హామీ ఇచ్చారు. కానీ.. చివర్లో ‘ఒకవేళ ఆ(బెల్టు షాప్) సమస్య ఇంకా కొనసాగుతున్నట్లయితేనే చర్యలు తీసుకుంటాం’అని చిన్న మెలిక పెట్టారు మంత్రి లోకేశ్! అసలు బెల్టు షాపులే చట్టవిరుద్ధం. దానిని తక్షణమే మూసేయిస్తామని గట్టిగా చెప్పాల్సిందిపోయి.. ‘సమస్య ఉంటేనే చర్యలు తీసుకుంటా’మని మంత్రి అనడంపై స్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నాటి ఎన్టీఆర్ హయాంలో మద్యపాన నిషేధం అమలుకాగా.. చంద్రబాబు సీఎం అయిన తర్వాత నిషేధం ఎత్తేసిన సంగతి తెలిసిందే. (డెస్క్‌టాప్ నుంచి తీసిన స్క్రీన్ షాట్) -
బెల్టుషాపుపై గ్రామస్తుల దాడి
వరికుంటపాడు(నెల్లూరు జిల్లా): నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం జడదేవి గ్రామంలో నిర్వహిస్తున్న బెల్టుషాపుపై ఆదివారం ఉదయం గ్రామస్తులు దాడిచేశారు. మద్యపానానికి వ్యతిరేకంగా జడదేవి గ్రామస్తులు ఇటీవల తీర్మానించారు. అయితే అందుకు విరుద్ధంగా ఒక దుకాణంలో దొంగచాటుగా మద్యం విక్రయిస్తున్నారని గమనించిన స్థానికులు ఆదివారం ఉదయం ఆ దుకాణంపై దాడిచేసి మద్యం సీసాలను ధ్వంసం చేశారు. ఇకపై గ్రామస్తుల తీర్మానానికి వ్యతిరేకంగా బెల్టుషాపు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
సరస్వతీ క్షమించు..!
* పాఠశాల ఎదుటే బెల్ట్‌షాపు.. * పెట్రేగిపోతున్న అధికార పార్టీ నాయకులు * గుడి, బడి తేడా లేకుండా బెల్టుషాపులు * మందుబాబుల ఆగడాలకు బెంబేలెత్తుతున్న విద్యార్థులు అధికార పార్టీ నాయకులకు కళ్లు నెత్తికెక్కాయి.. అందుకే గుడీ బడీ తేడా లేకుండా మద్యం బెల్టుషాపులు పెట్టేస్తున్నారు. బెల్టు షాపులను పూర్తిగా నిషేధించాం.. అని చెబుతూనే.. మరోవైపు వాటిని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా పాఠశాల ఎదుటే బెల్టుషాపు పెట్టేంతగా బరితెగించారు. చిన్నారుల చదువులకు ఆటంకం కలిగిస్తూ.. ఓ దుర్వ్యసనాన్ని వారి కళ్లకు కడుతున్నారు.. నరసరావుపేట రూరల్ : బెల్ట్ షాపులు రద్దు చేస్తామని ప్రభుత్వం ఒక వైపు చెబుతుంటే మరో వైపు గ్రామాల్లో బెల్ట్‌షాపులు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. వాటిని నిర్వహిస్తున్న అ«ధికార పార్టీ నాయకులకు గుడి, బడి అన్న తేడా లేకుండా పోయింది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు దుకాణం తెరుస్తున్నారు. లింగంగుంట్లలో జెడ్పీ హైస్కూల్ ఎదుట రెండు రోజుల కిందట బెల్ట్‌షాపు వెలిసింది. వేలాది మంది విద్యార్థులకు దేవాలయంగా భాసిల్లే విద్యాలయం ఎదుట బెల్ట్‌షాపు దర్శనమివ్వడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మండలంలోనే ఆదర్శ పాఠశాలుగా గుర్తింపు పొందిన శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్ ఎదుట ఇటువంటి అసాంఘిక చర్యలకు అధికార పార్టీ నాయకులు వత్తాసు ఇవ్వడం పట్ల ఆరోపణలు వినవస్తున్నాయి. గతంలో ఎన్ఎస్పీ కార్యాలయం సమీపంలో ఉన్న ఈ బెల్ట్‌షాపును అక్కడి స్థానికులు అభ్యంతరం వ్యక్తంచేయడంతో ఇక్కడకు మార్చారు. ఖాళీ స్థలం చుట్టూ రేకులు ఉంచి మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. పాఠశాల సమీపంలో మద్యం అమ్మకాలు చేపట్టడంతో మందుబాబుల వీరంగాలకు విద్యార్థులు బెంబేలెత్తిపోతున్నారు. ట్యూషన్ వేళ.. తాగుడు గోల నూరు శాతం ఫలితాలు సాధించేందుకు పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం వేళల్లో ప్రత్యేక ట్యూషన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. దీంతో క్లాస్‌లు పూర్తయ్యాక ఇంటికి వెళ్లే సమయంలో మందుబాబుల హడావుడికి విద్యార్థులు భయపడుతున్నారు. నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం.. జెడ్పీ స్కూల్ ఎదుట బెల్ట్ షాపు ఏర్పాటు చేసిన విషయం తమ దృష్టికి రాలేదని ఎస్ఐ అరుణకుమారి చెప్పారు. బెల్ట్‌షాపు ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. - అరుణకుమారి, ఎక్సైజ్ ఎస్ఐ -
మద్యం కిక్కు
► ఒక్కరోజులోనే రూ.కోటిన్నర విలువజేసే మద్యం తాగేశారు ► కనిపించని పెద్దనోట్ల రద్దు ప్రభావం నాగర్‌కర్నూల్ విద్యావిభాగం : ఒకవైపు పెద్దనోట్ల రద్దు, మరోవైపు పోలీసులు నిబంధనలు విధించినా జిల్లాలో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా మందుబాబులు ఒక్కరోజే జిల్లావ్యాప్తంగా రూ.కోటిన్నరకు పైగా విలువజేసే మద్యం తాగేశారు. శనివారం ఉదయం నుంచే గ్రామీణ ప్రాంతాల్లోని కిరాణా దుకాణాలు, బార్ షాపుల్లో మద్యం విక్రయిం చారు. బెల్ట్‌షాపుల్లోనే మద్యం విక్రయాలు ఎక్కువగా జరి గాయి. జిల్లావ్యాప్తంగా 45 వైన్ షాపులతోపాటు కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ ప్రాంతాల్లో రెండు బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిలో ఒక్కరోజే 2,300 కేసుల లిక్కర్, నాలుగువేల పైచిలుకు బీరు కేసులు అమ్ముడుపోయినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసి దాదాపు 52 రోజులు గడుస్తున్న నేపథ్యంలో రైతులు, కూలీలు, కార్మికులు, కర్షకులు, సామాన్య ప్రజలు నగదు దొరకక సతమతమవుతుంటే మందుబాబులపై దీని ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. గతంలో ప్రతినెలా ఉమ్మడి మహబూబ్‌నగర్ పరిధిలో తిమ్మాజీపేటలోని మద్యం డిపో నుంచి రూ.70 నుంచి రూ.80 కోట్ల వరకు అమ్ముడయ్యేది. పెద్దనోట్ల రద్దు అనంతరం నెల రోజులపాటు పరిశీలిస్తే రూ.160 కోట్లకు పైగా మద్యం అమ్ముడుపోయింది. దీనికితోడు కొత్త జిల్లాగా ఏర్పడిన నాగర్‌కర్నూల్‌లో ఎస్పీ కల్మేశ్వర్ సింగెనవర్ ఒకరోజు ముందే మందుబాబులపై ప్రకటన చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం తాగి వాహనాలు నడపరాదని, ఇతరులకు ఇబ్బంది కలిగించే కార్యకలాపాలకు పాల్పడరాదని హెచ్చరించడం గమనార్హం. -
బెల్ట్ షాపులు బంద్ పెట్టేదెప్పుడు?
• స్త్రీనిధి బ్యాంకు సర్వసభ్య సమావేశంలో మంత్రి జూపల్లిని ప్రశ్నించిన మహిళలు • వీధికో బెల్ట్ షాపుంటే మా బతుకులెట్లా బాగుపడతారుు? సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ రాగానే బెల్ట్‌షాపులు బంద్ పెడ్తామన్నారు. గ్రామ్ర గామాన వీధికో షాపులెక్కన వెలిసినయ్. బెల్ట్ షాపులను సర్కారు బంద్ పెట్టకుంటే మా బతుకులెట్లా బాగుపడతాయ్ సారూ..’’ అంటూ మహిళలు మంత్రి జూపల్లి కృష్ణా రావును నిలదీశారు. మంగళవారం హైదరా బాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ‘స్త్రీనిధి’ బ్యాంకు రెండో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మహిళా సాధికా రత కోసం, స్వయం సహాయక సంఘాల అభివృద్ధి కోసం సలహాలు, సూచనలివ్వాలని మంత్రి కోరారు. దీంతో పలువురు మహిళలు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, స్త్రీనిధి బ్యాంకు అధికారుల అలసత్వాన్ని ఎత్తిచూపారు. నల్లగొండ జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సుమలత బెల్ట్ షాపుల అంశంపై నిలదీశారు. వడ్డీ రీరుుంబర్స్ ఏది? వడ్డీ లేని రుణాల (వీఎల్ఆర్) పథకం కింద తీసుకున్న రుణాలతో పాటు తాము చెల్లించిన వడ్డీని 11 నెలలైనా ప్రభుత్వం రీరుుంబర్స్ చేయలేదని సమావేశంలో జయశంకర్ జిల్లాకు చెందిన ఫర్హానాబేగం నిలదీశారు. ఏడాదిగా అభయహస్తం పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదో మంత్రి చెప్పాలని వరంగల్ జిల్లా పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు ప్రకాశమ్మ పట్టుబట్టారు.జిల్లాకో కలెక్టర్‌ను నియమించినపుడు స్త్రీనిధి బ్యాంక్‌లో రెండేసి జిల్లాలకు ఒక్కో డెరైక్టర్‌ను ఏర్పాటు చేస్తామ నడం సరికాదని సూర్యాపేట జిల్లాకు చెందిన మహిళలు ఆక్షేపించారు. గ్రామ సమాఖ్యలకు ఇచ్చిన విధంగానే పట్టణ సమాఖ్యలకు కూడా వ్యాపారాలకు, పరిశ్రమల స్థాపనలకు రుణా లివ్వాలని సరూర్‌నగర్‌కు చెందిన పద్మ స్త్రీనిధి బ్యాంకు అధికారులకు సూచించారు. రుణ ప్రణాళికకు ఆమోదం... ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,600 కోట్ల రుణాలను పంపిణీ చేయాలని పాలకమండలి చేసిన ప్రతిపాదనకు స్త్రీనిధి బ్యాంకు సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మొత్తం రుణ ప్రణాళికలో రూ.1,450 కోట్లు సెర్ప్ ద్వారా, రూ.15 కోట్లు మెప్మా ద్వారా పంపిణీ చేయాలని నిర్ణరుుంచారు. నికరలాభం రూ.18.54 కోట్లలో ఒకశాతం విద్యానిధికి, ఒకశాతం స్వంత భవనాల ఏర్పాటుకు వెచ్చించాలని సమావేశం నిర్ణరుుంచింది. సిబ్బందికి 30 శాతం వేతనపెంపు, సెర్ప్ నుంచి ఉద్యోగులను డిప్యుటేషన్‌పై తీసుకోవడం, ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ వర్తింపు తదితర అంశాలను పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. గ్రామాల్లో బ్యాంకుల తరపున మహిళా సమాఖ్యల సభ్యులు బిజినెస్ కరస్పెండెంట్లుగా పనిచేసే విధంగా బ్యాంక్ నియమావళిలో సవరణలు చేసేం దుకు ఆమోదం లభించింది. సమావేశంలో బ్యాంక్ పాలకమండలి అధ్యక్షురాలు అనిత, కార్యదర్శి కమల, కోశాధికారి స్వరూప, ఎండీ జీవీఎస్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సీఎస్ ఎస్పీ సింగ్, సెర్ప్ సీఈవో నీతూకు మారి ప్రసాద్, డెరైక్టర్లు రాజేశ్వర్‌రెడ్డి, వెంగళ్ రెడ్డి, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికే అప్పుఇచ్చే స్థారుుకి చేరాలి: జూపల్లి స్త్రీనిధి బ్యాంక్ ఆదాయం ఏటా పెరుగుతుండడం అభినందనీయమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బ్యాంకు మూలధనంలో ప్రభుత్వ వాటా కంటే మహిళా సమాఖ్యల వాటానే ఎక్కువగా ఉందని, అవసరమైతే ప్రభుత్వానికీ అప్పు ఇవ్వగలిగే స్థారుుకి స్త్రీనిధి బ్యాంక్ ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. మహిళలు కోరిన విధంగా రాష్ట్రంలో బెల్టు షాపుల నియంత్రణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కొత్త జిల్లాల ఏర్పాటుతో జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణ పెరిగిందని చెప్పారు. అభయహస్తం పింఛన్లు, వడ్డీలేని రుణాల విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. కొత్త జిల్లాలకు డెరైక్టర్ల ఎన్నికలను నెలరోజుల్లో పూర్తి చేయాలని స్త్రీనిధి బ్యాంక్ అధికారులను మంత్రి జూపల్లి ఆదేశించారు. -
బెల్టుషాపులో వ్యక్తి అనుమానాస్పద మృతి
పెరవలి : బెల్టుషాపు వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పెరవలిలో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పెరవలి జాతీయ రహదారి పక్కన ఉన్న మద్యం దుకాణానికి గురువారం అర్ధరాత్రి 1.30 గంటలకు పెరవలికి చెందిన మానేపల్లిచంద్రశేఖర్(45) వచ్చాడు. మద్యం కొని తాగి అక్కడే ఉన్న బల్లపై పడుకున్నాడు. కొద్దిసేపు అటుఇటు దొర్లి, కిందపడ్డాడు. అయినా దుకాణ సిబ్బంది పట్టించుకోలేదు. నిద్రపోయాడనుకుని సిబ్బంది వెళ్లిపోయారు. మళ్లీ ఉదయం వచ్చి చూసేసరికి అక్కడే బల్ల వద్ద చంద్రశేఖర్ పడి ఉండడంతో అనుమానం వచ్చిన వారు అతడిని లేపగా లేవలేదు. దీంతో చనిపోయాడని నిర్ధారించుకుని పోలీసులకు, బంధువులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న బంధువులు మృతదేహాన్ని చూసి కొట్టి చంపేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. కొద్దిసేపు బెల్టుషాపు నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. నిర్వాహకులు తమకేమీ సంబంధం లేదని, మద్యం ఇవ్వబోమని చెప్పినా.. వినలేదని, తప్పక ఇచ్చామని చెప్పారు. పోలీసులు ఇరువర్గాల వాదనలు విన్నారు. దీంతో షాపు వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బెల్టుషాపు నిర్వాహకులు, మృతుడి బంధువులు గ్రామ పెద్దల వద్దకు వెళ్లి ఓ అంగీకారానికి వచ్చినట్టు సమాచారం. బెల్టుషాపునకు అనుమతి లేకున్నా.. యథేచ్ఛగా నిర్వహించడం, అర్ధరాత్రి మద్యం అమ్మకూడదని నిబంధన ఉన్నా.. పాటించకపోవడం నేరమని పెరవలి ఎస్సై పి.నాగరాజు చెప్పారు. చంద్రశేఖర్ ఎలా చనిపోయాడనేది పోస్టుమార్టం నివేదికలో తేలుతుందని వివరించారు. బెల్టుషాపుపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. బెల్టుషాపులను నియంత్రించాలి : డయల్ యువర్ ఎస్పీలో పలువురి వినతి ఏలూరు అర్బన్ : జిల్లాలో బెల్టుషాపులను నియంత్రించాలని పలువురు ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ను కోరారు. శుక్రవారం డయల్ ఎస్పీ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆయన జిల్లా వాసులతో ఫోన్లో మాట్లాడారు. సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుంచి ప్రజలు ఫోన్ చేసి బెల్టుషాపుల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాటిని నియంత్రించాలని కోరారు. దీనికి స్పందించిన ఎస్పీ ఎక్సైజ్ అధికారులతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించి ఆ షాపులను నియంత్రిస్తామని హామీ ఇచ్చారు. ఇంకొందరు గణపతి lనిమజ్జనాలకు ఏర్పాట్లు బాగా చేశారని ఎస్పీని అభినందించారు. ఏలూరు నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి స్థానిక ఫత్తేబాదలో రోడ్డుపై భవన నిర్మాణ సామగ్రి నిలువ వల్ల రాకపోకలకు ఇబ్బందులు çకలుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులపై జంగారెడ్డిగూడెం నుంచి మరొకరు ఫిర్యాదు చేశారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు కావడం లేదని గణపవరం వాసి చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 25 మంది ఫోన్ చేసి వారి సమస్యలు విన్నవించారు. -
బెల్టు తీశారు..
‘సాక్షి’ చొరవతో బెల్టుషాపు మూసివేత ప్రకాశం బ్యారేజి (తాడేపల్లి రూరల్): ప్రకాశం బ్యారేజీ వద్ద రాత్రింబవళ్లు చాంపియన్ యాచ్ క్లబ్ (గతంలో లోటస్ ఫుడ్ సిటీ) ఆధ్వర్యంలో మద్యం అమ్మకాలు నిర్వహిస్తూ బెల్టు షాప్ ఏర్పాటు చేశారని సాక్షిలో కథనం వెలువడడంతో అధికారులు స్పందించారు. ఏపీ టూరిజం బోటు పాయింట్ సమీపంలో ఉన్న బెల్టు షాపును మూయించారు. -
ఇదేం చోద్యం!
మద్యం వద్దంటే బెదిరింపు లేఖలు లేఖల తీరుపై పెనుబాక కాలనీవాసుల నిరసన ర్యాలీ పోలీసుస్టేషన్ వద్ద ఆందోళన మద్యం వద్దన్నందుకు బెదిరింపులకు పాల్పడుతున్నారు. తమ గ్రామంలో మద్యం విక్రయాలు జరిపేందుకు వీల్లేదంటూ కొన్నాళ్ల కిందట పెనుబాక దళిత కాలనీవాసులు సంబంధిత విక్రయాలను అడ్డుకున్నారు. విక్రయిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అయితే కొద్ది రోజుల పాటు ఊరుకున్న మద్యం వ్యాపారుల వ్యక్తులు గుర్తు తెలియని పేర్లతో కాలనీ వాసులను హెచ్చరిస్తూ తాజాగా లేఖలు పంపారు. దీనిపై ఆగ్రహించిన కాలనీ వాసులు నిరసన ర్యాలీ నిర్వహించారు. సంబంధిత లేఖలు రాసిన వారిని అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే... రాజాం: గ్రామంలో మద్యం విక్రయాలు నిలిపి వేయమన్నందుకు బెదిరింపు లేఖలు పంపిస్తున్నారు. అసభ్య పదజాలాలతో ఆడవాళ్లను అవమానపరిచే విధంగా లేఖలు రాసారు. దీంతో ఆందోళన చెందిన పెనుబాక కాలనీ వాసులు సంబంధిత వ్యక్తులపై చర్యలకు డిమాండ్ చేస్తూ సుమారు ఐదు కిలోమీటర్ల దూరాన నిరసన ర్యాలీ ఆదివారం నిర్వహించారు. ర్యాలీగా రాజాం పోలీసుస్టేషన్‌కు వచ్చి మూకుమ్మడిగా ఫిర్యాదు చేశారు. ఇదేం చోద్యమంటూ ప్రశ్నించారు. సంబంధిత వ్యక్తులను వెంటనే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే... మండల పరిధిలోని పెనుబాక గ్రామంలో మూడు నెలలు కిందట బెల్ట్ దుకాణాలకు సంబంధించి వేలం పాట నిర్వహించారు. దీంతో ఈ పాటను వ్యతిరేకిస్తూ గ్రామంలో మద్యం విక్రయాలు నిలిపివేయాలని గ్రామంలోని దళిత కాలనీకి చెందిన పలువురు డిమాండ్ చేశారు. విక్రయాలు జరిపితే దాడులకు సైతం పాల్పడతామని హెచ్చరించారు. ఈ మేరకు ఎక్సైజ్ శాఖా కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామంలో మద్యం విక్రయాలు నిలిచిపోయాయి. బెదిరింపు లేఖలు వీటిని సహించలేని మద్యం విక్రయాలు కొందరు వ్యక్తులు దళిత కాలనీకి చెందిన బలగ సూర్యనారాయణ, టొంపల గణేష్‌లకు ఆదివారం ఉదయం వేర్వేరుగా పోస్టు ద్వారా లేఖలను బట్వాడా చేశారు. ఈ లేఖల్లో సూర్యనారాయణ, గణేష్ కుటుంబాలను ఎస్సీ కులంతో తిట్టడమే కాకుండా వారి ఇళ్లల్లో ఉన్న భార్య, పిల్లలను అసభ్య పదజాలాలతో తిడుతూ లేఖ రాసారు. దీంతో ఆందోళనకు గురైన ఆయా కుటుంబాలు వారు కాలనీ వాసులైన బలగ అప్పన్న, బలగ నర్శింహులు, జరజాన గణేష్ తదితర వారికి వాటిని చూపించి సుమారు 200 మందితో ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్న రాజాం పోలీస్‌స్టేషన్‌కు ర్యాలీగా వచ్చారు. ఆ లేఖలపై సీఐ శంకరరావుకు ఫిర్యాదు చేశారు. తక్షణమే లేఖలు రాసిన∙వారిని గుర్తించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన సీఐ మాట్లాడుతూ దర్యాప్తు నిర్వహించి చర్యలు చేపడతామని తెలిపారు. -
బెల్టుషాపులు ఎత్తివేయించండయ్యా..
జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డికి కలపాడు మహిళల వినతి వెంకటగిరి: తమ జీవితాల పాలిట శాపంగా మారిన బెల్టుషాపులను ఎత్తివేయించమని కలపాడు ఎస్సీ కాలనీ మహిళలు జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డికి విన్నవించారు. స్థానికంగా శనివారం ఆయన గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. సరిగ్గా 50 కుటుంబాలు లేని తమ కాలనీలో మూడు బెల్టుషాపులు పెట్టి తమ భర్తల సంపాదన కొల్లగొడుతున్నారన్నారు. పోలీసులకో,సారాయి పోలీసులకో చెపితే వచ్చి లంచాలు తీసుకుంటున్నారో ఏమోగానీ... కాలనీలో మాత్రం మద్యం బెల్టుషాపు ఎత్తివేయడం లేదని వాపోయారు. వెంటనే స్పందించిన బొమ్మిరెడ్డి ఎక్సైజ్ సీఐ ద్వారకానాథ్‌తో ఫోన్లో మాట్లాడారు. రెండు రోజుల్లో బెల్టుషాపులను తీయించకపోతే మహిళలే తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ జిల్లా సహాయ కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ, రైతు విభాగం కార్యదర్శి గూడూరు భాస్కర్‌రెడ్డి, వెంకటగిరి, డక్కిలి మండల కన్వీనర్లు ఆవుల గిరియాదవ్, రంగినేని రాజా, మాజీ ఎంపీపీ తాండవ రాజారెడ్డి ఉన్నారు. -
బెల్ట్‌షాపు నిర్వాహకుడి అరెస్ట్
వైన్‌షాపు నుంచి మద్యం బాటిల్స్ కొనుగోలు చేసి ఇంటి వద్ద విక్రయిస్తున్న ఓ యువకుడిపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..బోడుప్పల్ ఆనంద్‌నగర్‌లో నివసించే అప్పగోని రమేష్(30) స్థానిక వైన్‌షాపుల నుంచి మద్యం బాటిల్స్ కొనుగోలు చేసి ఇంటి వద్ద విక్రయిస్తున్నాడు. ఈక్రమంలో స్థానికుల సమాచారం మేరకు ఆదివారం మధ్యాహ్నం 4.30 గంటల సమయంలో మేడిపల్లి పోలీసులు దాడి చేసి 96 బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతనిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. -
ఉసురు తీస్తున్న ‘బెల్టు’
► బెల్టు దుకాణంలో మద్యం తాగి మునగోడులో ఇద్దరు మృతి ► కష్టజీవులే లక్ష్యం.. యథేచ్ఛగా మందు విక్రయాలు మద్యం కాటుకు కష్టజీవులు ప్రాణాలు కోల్పోతున్నారు. మద్యంలో కల్తీ కలిసినా, ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అధికారంలోకి రాగానే బెల్టు షాపులు ఎత్తేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ నేటికీ నెరవేరకపోవడం కష్టజీవుల పాలిట శాపంగా మారింది. రాజధాని ప్రాంతంలో మద్యం బెల్టు దుకాణాలు లేని గ్రామాలు మాత్రం లే వంటే అతిశయోక్తి కాదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ .. ఎంత కావాలంటే అంత..దొరుకుతోంది. తాజాగా అమరావతి మండలం మునగోడులో గురువారం ఉదయం బెల్టు దుకాణంలో మద్యం తాగి ఇద్దరు మృత్యువాత పడ్డారు. పెదకూరపాడు : అమరావతి మండలం మునగోడు గ్రామానికి చెందిన మేకల కాటమరాజు(60) ఇంటి వద్దే బెల్టుషాపు నిర్వహిస్తున్నాడు. గురువారం ఉదయం గ్రామంలోని బంధువుల ఇంటిలో శుభకార్యానికి వెళుతూ ఒక క్వార్టర్ బాటిల్ వెంట తీసుకెళ్లాడు. సమీపంలోని షాపు వద్ద ఆగి డిస్పోజల్ గ్లాసు, కూల్‌డ్రింక్ తీసుకున్నాడు. సగం గ్లాసులో పోసుకుని మిగిలిన బాటిల్ అక్కడే ఉన్న దూరపు బంధువు గండు నీలయ్య(40)కు ఇచ్చాడు. మద్యంలో కూల్‌డ్రింక్ కలుపుకుని తాగిన ఐదు నిముషాల వ్యవధిలో కాటమరాజు కుప్పకూలి అక్కడిక్కడే మరణించాడు. ఈలోపే బాటిల్‌తో ఇంటికి వెళ్లిన నీలయ్య మిగిలిన మద్యంలో నీరు కలుపుకొని కొంత తాగాడు. కొద్ది సేపటికే కుప్పకూలిపోయిన నీలయ్యను స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. మునగోడు ఘటనతో భయం భయం.. మునగోడు ఘటనతో బెల్టు షాపుల నిర్వాహకులు, మద్యం తాగే వారిలో ఆందోళన మొదలైంది. పదిహేను రోజుల కిందట పెదకూరపాడు మండలం జలాల్పురం గ్రామంలో చెరువు కట్టపై ఉన్న బెల్టు షాపులో మద్యం తాగి బంకా మరియస్వామి అనే వ్యక్తి చెరువులో దూకి మృతి చెందాడు. ఈ విధంగా గ్రామాల్లో బెల్టుషాపులు ప్రాణాలు తీస్తున్నాయి. నియోజకవర్గంలో 24 అనుమతి పొందిన మద్యం షాపులు ఉండగా, అక్రమంగా విక్రరుుస్తున్న షాపులు 220కి పైగా ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కష్టజీవులే లక్ష్యంగా.. కష్టజీవులను టార్గెట్ చేసుకొని పల్లెల్లో బెల్టు షాపుల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. గ్రామాల్లో వేళాపాళా పాలనా లేకుండా, అర్ధరాత్రి, తెల్లవారుజూము సైతం మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల అండతో లెసైన్సు షాపులను సైతం తెరిచి, అందులో నుంచి బెల్టుషాపులకు మద్యం అమ్ముకుంటున్నారు. దీంతో మద్యం వ్యసనానికి బానిసలైనవారు ప్రాణాల మీదకు తెచ్చు కుంటున్నారు. వేల సంఖ్యలో బెల్టు దుకాణాలు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కలిపి మొత్తం 750 మద్యం దుకాణాలున్నాయి. ఒక్కో లెసైన్స్ మద్యం దుకాణం పరిధిలో 10 నుంచి 15 వరకు బెల్టు దుకాణాలు ఉన్నాయి. రెండు జిల్లాల్లో కలిపి 6 వేల వరకు బెల్టు షాపులు ఉన్నట్టు అంచనా. అధికారుల అండతోనే బెల్టుషాపులు కొనసాగుతున్నాయనేది బహిరంగ రహస్యం. అధికారం ఇస్తే బెల్టు ఎత్తేస్తామన్నారే.. రాజధాని ప్రాంతంలో తాగునీరు లేని పల్లెలు అనేకం ఉన్నాయి. బెల్టు షాపు లేని గ్రామాలు మాత్రం లే వంటే అతిశయోక్తి కాదు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్టు షాపులు నియంత్రిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పట్లో చెప్పుకొచ్చారు. ఇప్పటికీ పల్లెల్లో బెల్టు షాపుల్లో మద్యం ఏరులైపారుతోంది. యథేచ్ఛగా అమ్మకాలు.. నియోజకవర్గ కేంద్రమైన పెదకూరపాడులో రెండు లెసైన్సుషాపులు ఉన్నాయి. ఒకటి మాత్రమే కార్యాకలాపాలు నిర్వహిస్తున్నట్టుగా కనిపిస్తుంది. రెండోషాపు తీరు చూస్తే మూసివేశారని అందరూ అనుకుంటారు. అయితే ఇక్కడ నుంచి కేవలం బెల్టు షాపులకు మాత్రమే అమ్మకాలు జరుపుతున్నారనే ప్రచారం ఉంది. ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్ ఒకరు స్థానిక అధికార పార్టీ నేతకు బంధువు కావడంతో యథేచ్ఛగా బెల్టు అమ్మకాలు సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
బెల్ట్ షాపులే లక్ష్యం!
జిల్లాలో సుమారు 1500 షాపులు యథేచ్ఛగా కల్తీ మద్యం సరఫరా లీటర్ మద్యంలో ఆరు లీటర్ల నీరు, స్పిరిట్ యనమలకుదురు ఉదంతంతో వెలుగులోకి కట్టడికి ఎక్సైజ్ అధికారుల యత్నం విజయవాడ : జిల్లాలో కల్తీ మద్యం మాఫియా తన హవా కొనసాగిస్తోంది. బెల్ట్ షాపులే లక్ష్యంగా నకిలీ మద్యం తయారుచేసి సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. యనమలకుదురు, బందరులో నకిలీ మద్యం వ్యవహారం మరోసారి వెలుగులోకి రావటంతో ఎక్సైజ్ అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. విజయవాడ స్వర్ణబార్‌లో మద్యం సేవించి ఐదుగురు మృతిచెందిన ఘటనను మరువకముందే మరోమారు ఈ ఉదంతం వెలుగు చూడటం కలకలం రేపుతోంది. జిల్లాలో గ్రామాలు మొదలుకొని విజయవాడ నగరం వరకు ఉన్న ప్రతి వైన్ షాపునకు అనుబంధంగా సగటున 20 నుంచి 35 వరకు బెల్ట్ షాపులు ఉన్నాయనేది అధికారులకూ తెలిసిందే. వైన్ షాపులతో పాటు బెల్టుషాపుల్లోనూ మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఎప్పటికప్పుడు అధికారులు దాడులు చేసి కేసుల నమోదు, అరెస్టులు చేస్తున్నా అదే తీరు కొనసాగుతోంది. జిల్లాలో 336 వైన్ షాపులకు అనుసంధానంగా సుమారు 1500 వరకు బెల్ట్ షాపులు ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో 5,164 కేసులు నమోదు చేసినా పరిస్థితిలో మార్పు లేదు. ఈక్రమంలో బెల్ట్ విక్రయాలు తగ్గకపోగా పెరుగుతూనే ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్లు అధికంగా ఉండటంతో ఎక్సైజ్ శాఖ ఏమీ చేయలేని స్థితిలో మిన్నకుంటోందని తెలుస్తోంది. ట్రాక్ అండ్ ట్రేసింగ్‌లో... వరుస ఘటనల నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు కొంత సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో ఎక్సైజ్ ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ వై.బి.భాస్కరరావు ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ అధికారులు అన్ని బార్లు, వైన్ షాపులను తనిఖీ చేసి మద్యం బ్యాచ్ నంబర్లను పరిశీలించారు. మరోవైపు డిస్టిలరీల్లోనే ప్రతి మద్యం సీసాల నంబర్లు నమోదు చేయటంతో పాటు ప్రతి బార్, వైన్ షాపుల్లో ట్రాక్ అండ్ ట్రేసింగ్ విధానం పెట్టి ప్రతి బాటిల్‌పై బార్‌కోడ్‌ను నోట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిని పూర్తి స్థాయిలో అమలు చేస్తే కల్తీ కట్టడి అయ్యే అవకాశం ఉంది. ఎక్సైజ్ ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ వై.బి.భాస్కరరావు సాక్షితో మాట్లాడుతూ కల్తీ ఘటనలను సీరియస్‌గా తీసుకుంటున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు, దాడులు ముమ్మరం చేస్తామని చెప్పారు. కల్తీ మద్యం తయారీ ఇలా... జిల్లాలో రెక్టిఫైడ్ స్పిరిట్ తయారుచేసే యూనిట్లు 12 వరకు ఉన్నాయి. వాటి నుంచి కొందరు అనధికారికంగా సిర్పిట్‌ను కొనుగోలు చేసి మద్యంలో కలిపి విక్రయిస్తున్నారు. జిల్లాలో మద్యం కల్తీ 1989 నుంచీ అధికంగా ఉంది. మద్యం కల్తీ రెండు రకాలుగా చేస్తుంటారు. చీప్ లిక్కర్ అయితే లీటరు మద్యంలో ఐదు లీటర్ల వరకు నీటిని కలిపి మద్యం రంగు పోకుండా చూసి, కిక్ కోసం స్పిరిట్‌ను వినియోగించి మళ్లీ డిస్టిలరీ నుంచి వచ్చిన మద్యం సీసాల మాదిరిగా స్టిక్కర్లు, ధరల లేబుళ్లు అన్నీ అతికించి ఎక్కడా అనుమానం రాకుండా విక్రయాలు చేస్తుంటారు. ఇంకో కల్తీ ఎలాగంటే.. లీటర్ చీప్ లిక్కర్లో ఆరు లీటర్ల నీరు, ఒక లీటర్ సిర్పిట్‌ను కలిపి సిద్ధం చేసి క్వార్టర్ సీసాలు తయారు చేసి విక్రయిస్తుంటారు. ఇలా కల్తీ చేసిన చీప్ లిక్కర్ ఫుల్ బాటిల్‌ని రూ.130 నుంచి రూ.150 వరకు విక్రయిస్తుంటారు. దానిని పలు బ్రాండ్ల క్వార్టర్ సీసాల్లో నింపటం ద్వారా నాలుగు రెట్లు లాభాలు ఆర్జిస్తున్నారు. -
ఊళ్లు.. ఊగుతున్నయ్
అప్పుడు ఒకటి.. ఇప్పుడు వెయ్యి గుప్పుమంటున్న చీప్ లిక్కర్ గణనీయంగా పెరిగిన వినియోగం తొర్రూరు పరిధిలో ఎక్కువ గత ఏడాది ఒక కేసు అమ్మితే.. ఈ ఏడాది 1643 కేసుల అమ్మకం వరంగల్ : ఆదాయమే లక్ష్యంగా మద్యం విక్రయాలు పెంచుతున్న ఎక్సైజ్ శాఖ తీరుతో గ్రామాల్లోని పేదల కుటుంబాల్లో చిచ్చురేగుతోంది. నాటు సారాను నియంత్రించామని ప్రకటించుకున్న ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నారు. నాటు సారాను తయారు చేసే వారిపై చర్యలు తీసుకోకుండా.. వారికి ప్రత్యామ్నాయ ఉపాధిగా బెల్ట్ షాపులు నిర్వహించుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులు సూచనలు ఇస్తున్నారు. దీంతో జిల్లాలో బెల్ట్ షాపుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. నాటుసారా విక్రయించే వారూ బెల్ట్ షాపులు తెరుస్తుండడంతో ఒక గ్రామంలో గతంలో ఒకటిరెండు బెల్ట్ షాపులు ఉంటే.. ఇప్పుడు కనీసం పది వరకు పెరిగాయి. గ్రామాల్లో కొత్తగా వెలుస్తున్న బెల్ట్ షాపుల్లో అమ్ముడుపో యే మద్యంలో 90 శాతం చీప్ లిక్కరే ఉంటోం ది. చీప్ లిక్కర్ వినియోగం జిల్లాలో గణనీయం గా పెరిగిందని అధికారిక లెక్కలే చెబుతున్నా యి. ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం 2014 నవంబరులో జిల్లా వ్యాప్తంగా 1209 కేసుల చీప్ లిక్క ర్ అమ్మకాలు జరిగగా.. ఈ ఏడాది ఏకంగా 25, 848 కేసుల చీప్ లిక్కర్ వినియోగమైంది. మద్యపాన నియంత్రణపై అవగాహన కల్పించాల్సిన ఎక్సైజ్ శాఖ ఈ పనిని పూర్తిగా పక్కనబెట్టింది. ఈ కారణంగానే జిల్లాలో చీప్ లిక్కర్ వినియో గం పెరిగింది. ఈ చీప్ లిక్కర్ పేద కుటుంబాలను నాశనం చేస్తోంది. నాటుసారా పోయింద ని సంతోషపడే సమయంలో బెల్ట్ షాపులు తమను దెబ్బతీస్తున్నాయని మహిళలు వాపోతున్నారు. కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు చొర వ తీసుకుని.. గ్రామాల్లో బెల్ట్ షాపులు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తుంటే ఎక్సైజ్ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. దీంతో ఎక్సైజ్ శాఖ వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్నాయి. ఎక్సైజ్ శాఖకు సంబంధించి జిల్లాలో వరంగల్, మహబూబాబాద్ యూనిట్లు ఉన్నాయి. వరంగల్ యూనిట్ పరిధిలో తొమ్మిది, మహబూబాబాద్ యూనిట్ పరిధిలో ఎనిమిది ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి. ఏడాది క్రితం వరకు నాటుసారా ఎక్కువగా ఉండి ఇప్పుడు తగ్గిపోయిన మహబూబాబాద్ యూనిట్ పరిధిలో చీప్ లిక్కర్ వినియోగం భారీగా పెరిగింది. ఈ యూనిట్ పరిధిలో గత ఏడాది నవంబరు లో 657 కేసుల చీప్ లిక్కర్ విక్రయాలు జరిగా యి. ఈ ఏడాది నవంబరులో ఏకంగా 8,409 కేసుల చీప్ లిక్కర్ అమ్ముడుపోయింది. తొర్రూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో చీప్ లిక్కర్ అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. గత ఏడాది ఈ స్టేషన్ పరిధిలో కేవలం ఒక్క కేసు మాత్రమే అమ్ముడుపోయింది. ఈ ఏడాది 1643 కేసుల చీప్ లిక్కర్ అమ్మకాలు జరిగాయి. గత ఏడాదితో పోల్చితే ఈ స్టేషన్ పరిధిలో బెల్ట్ షాపులు సంఖ్య పది రెట్లు పెరిగింది. ఇక్కడి ఎక్సైజ్ శాఖ అధికారులు నాటుసారా విక్రయించే వారికి ప్రత్యామ్నాయ ఉపాధిగా బెల్ట్ షాపులను నిర్వహించుకోండని సూచిస్తున్నట్టు కొందరు ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. వరంగల్ అర్బన్ పరిధిలోనూ చీప్ లిక్కర్ అమ్మకాలు ఊహించని విధంగా పెరిగాయి. అర్బన్ స్టేషన్ పరిధిలో గత ఏడాది కేవలం 255 కేసులు అమ్ముడుపోగా ఈ ఏడాది ఏకంగా 6,108 కేసులను విక్రయించారు. వరంగల్ రూరల్ స్టేషన్ పరిధిలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ స్టేషన్ పరిధిలో గత నవంబరులో 25 కేసుల చీప్ లిక్కర్ విక్రయాలు జరిగగా.. ఈ ఏడాది నవంబరులో 4,131 కేసులు వినియోగమైంది. -
బార్లా... బెల్ట్‌షాపులు
సాక్షి ప్రతినిధి, విజయనగరం : పై చిత్రాన్ని చూశారా!. గ్రామ మేలు కోసం పెద్దలంతా కలిసి చర్చిస్తున్నట్టుగా ఉంది కదూ. అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే. మద్యం బెల్ట్‌షాపు వేలం వేసేందుకు నిర్వహించిన సమావేశమిది. ఇటీవల బొండపల్లి మండలం ఒంపిల్లి గ్రామంలో బహిరంగంగా బెల్ట్‌షాపు కోసం వేలం వేస్తున్న దృశ్యమది. ఆ గ్రామంలో బెల్ట్‌షాపు ఏర్పాటు చేసేందుకు ఓ అసామి రూ.2లక్షలకు పాడుకున్నారు. టీడీపీ నేత, సర్పంచ్ ఇల్లాపు కృష్ణ ఆధ్వర్యంలో ఈ వేలం పాట జరిగింది. గతంలో మద్యం బెల్ట్‌షాపులు ఎవరికి వారు నిర్వహించేవారు. ఇప్పుడు టీడీపీ నేతల కనుసన్నల్లో బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నారు. దగ్గరుండి వేలం పాట కూడా వేయిస్తున్నారు. ఎవరొచ్చినా చూసుకుంటామని భరోసా ఇస్తున్నారు. మాకింత- మీకింత అన్న దోరణితో వ్యవహారాన్ని నడుపుతున్నారు. అధికార వర్గాలు సైతం వంతపాడుతున్నాయి. లెసైన్సు షాపు దారుడికి గిట్టుబాటు కావాలంటే బెల్ట్షాపులుండాలనే దోరణితో అధికారులు మిన్నకుండిపోతున్నారు. పరోక్షంగా సహకరిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా బెల్ట్‌షాపులు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 180 లెసైన్సు మద్యం షాపులుండగా, 20 ప్రభుత్వ షాపులున్నాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న షాపులు నామమాత్రంగా నడుస్తుండగా, లెసైన్సు షాపుల్లో జోరుగా విక్రయాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వాటర్పాకెట్ తదితర వంకలతో రేట్లు పెంచి పలు చోట్ల విక్రయిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడేకంగా బెల్ట్‌షాపులు గేట్లు తెరిచారు. టీడీపీ నేతలే సూత్రధారులగా వ్యవహరిస్తున్నారు. విజయనగరం మండలంలో ఇప్పటికే దాదాపు గ్రామంలో ఏర్పాటయ్యాయి. గజపతినగరం నియోజకవర్గంలోనైతే అడ్డూ అదుపు లేకుండా వెలుస్తున్నాయి. నియోజకవర్గ కీలక నేత అండతోనే యథేచ్ఛగా బెల్ట్‌షాపుల్ని నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా వీటి సంఖ్య రెండు వేలు దాటినట్టు సమాచారం. ఎక్కువ గ్రామాల్లో వేలం పాట ద్వారానే బెల్ట్‌షాపుల్ని ఏర్పాటు చేయిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా బొండపల్లి మండలం ఒంపిల్లినే తీసుకోవచ్చు. వ్యతిరేకించినా.. టీడీపీ నేత, గ్రామ సర్పంచ్ ఇల్లాపు కృష్ణ, ఆయన అనుయాయులు బాలి సోమునాయుడు, లండ సత్యనారాయణ, గొర్లె రామునాయుడు, బాలి రమణ తదితరుల నేతృత్వంలో ఒంపిల్లి పాత పంచాయతీ కార్యాలయం ఎదురగా, ఏకంగా రామాలయం అరుగుపై వేలం పాట నిర్వహించారు. తొలుత వేలం పాటను కొందరు వ్యతిరేకించారు. కానీ సర్పంచ్ ఇల్లాపు కృష్ణ వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన మానాపురం గౌరీశంకర్ తీవ్ర స్థాయిలో విభేదించారు. సర్పంచ్‌తో వాగ్వాదానికి దిగారు. కానీ సర్పంచ్ ఏమాత్రం పట్టించుకోలేదు. నిర్వహించి తీరుతామని, ఏం చేయలేవని తిరిగి గౌరీశంకర్‌పై ధ్వజమెత్తారు. చివరికీ ఏం చేయలేక గౌరీశంకర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత వేలం పాట కానిచ్చేశారు. వేలం పాల్గొనేందుకు రూ.500ప్రవేశ రుసుం నిర్ణయించారు. ఆ మొత్తాన్ని చెల్లించిన వారే పాటలో పాల్గొన్నారు. తొలుత రూ.500...రూ.5000వేలు...50వేలు...లక్ష...లక్షా 50వేలు...లక్షా 70వేలు...లక్షా 90వేలు...చివరికీ రూ.2లక్షలకు పాడిన వ్యక్తికి పాట ఖరారు చేశారు. అంతేకాకుండా బెల్ట్‌షాపు నిర్వహించేం దుకు పాట ద్వారా అనుమతిచ్చినట్టు కాగితాలు కూడా రాసుకున్నారు. ఎంత బరితెగించారో అర్థం చేసుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఇదే తంతు నడుస్తోంది. -
ఉభయ తారక ‘మద్యం’
పల్లెల్లో అధికారిక బెల్ట్‌షాపులు! సాక్షి, హైదరాబాద్: పల్లెల్లో గుడుంబా విక్రయాలు, బెల్టుషాపులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఉభయ తారక మంత్రం వేయబోతుంది. మండలంలో మద్యం దుకాణం పొందిన డీలర్‌కే గుడుంబా, బెల్టుషాపులు లేకుండా చేసే అధికారం కట్టబెట్టబోతోంది. అదే సమయంలో మద్యం దుకాణం (ఎ4) లెసైన్స్ పొందిన డీలర్ ఆ మండలంలో గుర్తించిన గ్రామాల్లో బి-లెసైన్స్ ద్వారా అధికారికంగా దుకాణాలు నడుపుకునే స్వేచ్ఛను ఇవ్వనుంది. మండలంలో 2014-15లో అమ్మకాలు, ఎక్సైజ్ శాఖకు చెల్లించిన రుసుముల ఆధారంగా లెసైన్సు ఫీజును నిర్ణయించి ఏడాది కాలానికి వ్యాపారాన్ని అప్పగించనుంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మద్యం విధానంపై కసరత్తు చేసిన ఆబ్కారీ శాఖ ఈ మేరకు ఓ నివేదిక రూపొందించింది. ఈ నివేదికను ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి.చంద్రవదన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రాజీవ్ శర్మకు అందజేశారు. ఆయన కమిషనర్‌తో కలిసి ముఖ్యమంత్రితో భేటీ అయి కొత్త విధానంలోని లోటుపాట్లను తెలియజేయగా, సీఎం సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్లు సమాచారం. దీంతో బుధవారం కూడా సచివాలయం స్థాయిలో కమిషనర్ చర్చలు జరిపారు. గురువారం కమిషనర్ జిల్లాల వారీగా డిప్యూటీ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లతో సమావేశమై లెసైన్సు ఫీజులను నిర్ధారించనున్నట్లు సమాచారం. మండలంలో ఒక్కరే యజమాని కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో లేని మండలాల్లో ప్రస్తుతం రెండు నుంచి ఐదు వరకు మద్యం దుకాణాలున్నాయి. జనాభా ప్రాతిపదికన వీటికి లెసైన్సులు ఇచ్చారు. అయితే ఈసారి మద్యం విధానంలో మండలాన్ని యూనిట్‌గా నిర్ణయిస్తున్న నేపథ్యంలో ఆ మండ లంలో మద్యం వ్యాపారమంతా ఒక వ్యక్తి చేతుల మీదుగానే సాగుతుంది. ఫీజును కూడా అదే స్థాయిలో నిర్ధారించనున్నారు. ఉదాహరణకు ప్రస్తుతం 10వేల నుంచి 50వేల జనాభా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో రూ.34 లక్షలు లెసైన్స్ ఫీజుగా ఉంది. ఆ మండలంలో 4 మద్యం దుకాణాల వరకు లెసైన్సుల జారీకి అవకాశం ఉంది. 4 దుకాణాలకు లెసైన్సు రూ.1.36 కోట్లు అవుతుంది. ఇక లెసైన్సు ఫీజు కన్నా ఏడురెట్లు పైబడిన వసూళ్లతో మద్యం అమ్మితే చెల్లించిన ప్రివిలేజ్ ఫీజును కూడా ఈ లెసైన్సు ఫీజుకు జత చేస్తారు. ఈ లెక్కన గతంలో జరిగిన అమ్మకాల ఆధారంగా మండ లానికి రూ. 1.50 కోట్ల వరకు ఫీజు నిర్ణయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంత మొత్తంలో చెల్లించే స్తోమత ఉన్నవారే డ్రాలో పాల్గొంటారు. మునిసిపాలిటీల్లో వార్డుల వారీగా.. ఇక మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో కూడా ‘గ్రూపు లెసైన్స్’ ఇవ్వాలని ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. వార్డుల్లో దుకాణాలు, వ్యాపారం ఆధారంగా ఒక వ్యక్తి లేదా గ్రూపుగా ముందుకొచ్చిన వారికి లెసైన్సు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రత్యేక మద్యం విధానం తీసుకు రావాలని సీఎం ఆదేశాలిచ్చిన నేపథ్యంలో దానిపైనా ఆబ్కారీ శాఖ కసరత్తు చేస్తోంది. గుడుంబా, బెల్టుషాపులు ఉండవిక! మండలంలో మద్యం వ్యాపారానికి సంబంధించి లెసైన్సు ఒకరికే ఇవ్వడంతో పాటు రూ.15 మద్యం కూడా అందుబాటులోకి తెస్తుండడంతో గుడుంబాను గ్రామాల్లో నుంచి తరిమికొట్టే బాధ్యత కూడా అదే వ్యాపారి తీసుకుంటాడని ప్రభుత్వం భావిస్తోంది. గుడుంబా, బెల్టుషాపుల ద్వారా అనధికారిక అమ్మకాలు సాగితే తన వ్యాపారానికి దెబ్బపడే అవకాశం ఉండటంతో వీటిని ఆ వ్యాపారే నిరోధిస్తాడని ప్రభుత్వ నమ్మకం. అలాగే గుడుంబా ఎక్కువగా విక్రయించే గ్రామంలో అధికారికంగానే బి-లెసైన్సు మద్యం దుకాణం తెరవడం వల్ల రూ.15 మద్యం అందుబాటులోకి వ స్తుందని, జనం నాటుసారా జోలికి పోరని అధికారులు నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. -
బెల్ట్ షాపులపై పోలీసుల దాడి
- భారీగా మద్యం సీసాలు స్వాధీనం - ఒకరి అరెస్టు కోటవురట్ల : అక్రమంగా మద్యం అమ్మకాలు సాగిస్తున్న వారిపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. సోమవారం రాత్రి ఎస్ఐ శ్రీనివాసరావు, సిబ్బంది బెల్ట్ షాపులపై ఆకస్మిక దాడులు జరిపారు. ఈ దాడిలో భారీగా మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని, ఒకరిని అరెస్టు చేశారు. కొడవటిపూడి, టి.జగ్గంపేట శివారు తిమ్మాపురం గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఆకస్మిక దాడులు చేశారు. కొడవటిపూడిలో కోసూరి చిన్నమ్మలు ఇంట్లో నిర్వహిస్తున్న బెల్ట్ షాపుపై దాడి చేసి 509 మద్యం సీసాలు, తిమ్మాపురంలో మద్యం అమ్మకాలు సాగిస్తున్న లాలం వెంకట రమణను అదుపులోకి తీసుకుని 14 మద్యం సీసాలను స్వాధీన పరుచుకున్నారు. రెండు చోట్ల పట్టుబడిన మద్యం సీసాల విలువ రూ.38,760 ఉంటుందని ఎస్ఐ తెలిపారు. పరారైన కోసూరి చిన్నమ్మలును అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. వీరిపై 34ఏ యాక్టు ప్రకారం కేసు నమోదు చేసి ఎక్సైజ్ శాఖాధికారులకు అప్పగిస్తామన్నారు. -
బెల్టుపోయి.. చైన్ వచ్చే!
ఆదాయమే ధ్యేయంగా ప్రభుత్వం మద్యం ఏరులై పారించేందుకు కసరత్తు చేస్తోంది. బెల్టు షాపులను తొలగిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆమేరకు వాటిని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అందువల్ల వల్ల వచ్చే నష్టాలను పూడ్చుకోవడంతో పాటు మరింత ఆదాయం పెంచేందుకు కొత్త మార్గాలను వెతుకుతోంది. అందులో భాగంగానే అనధికారంగా నడుపుతున్న బెల్ట్‌షాపుల స్థానంలో అధికారికంగా చైన్ షాపులు పెట్టాలని భావిస్తోంది. సగటున ఒక్కో వైన్‌షాపు పరిధిలో మూడు చైన్‌షాపులు ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంటే లెసైన్స్డ్ బెల్టు షాపులు నడిపినట్టే. తిరుపతి గాంధీరోడ్: జిల్లాలో ప్రస్తుతం నెలకు సుమారు రూ.90 కోట్ల మద్యం విక్రయిస్తున్నారు. దాన్ని రూ.140 కోట్లు దాటించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. అందుకు అనుగుణంగా కార్యాచరణ కూడా ప్రారంభించింది. జిల్లాలో మద్యం షాపుల వ్యాపార స్థితి, బాగా విక్రయాలు జరిగే షాపులు, ప్రాంతాలు, అనధికారికంగా సాగుతున్న బెల్ట్ షాపుల వివరాలను సేకరించే పనిలో ఎక్సైజ్ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. మూడు రెట్లు పెరగనున్న షాపులు ప్రస్తుతం జిల్లాలో చిత్తూరు పరిధిలో 191, తిరుపతి పరిధిలో 196 మద్యం షాపులు ఉన్నాయి. చిత్తూరు పరిధిలో 16, తిరుపతి పరిధిలో 14 బార్లున్నాయి. వీటన్నింటి ద్వారా నెలకు సగటున 85 నుంచి 90 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయిస్తున్నారు. తిరుపతి పరిధిలో అమ్మకాలు అధికంగా ఉన్నాయి. జిల్లా మొత్తం మీద ప్రస్తుతం ఉన్న షాపులకు అనుబంధంగా సుమారు 1100 వరకు చైన్‌షాపులు ఏర్పాటుచేసే అవకాశం ఉంది. తద్వారా బెల్ట్‌షాపులు పూర్తిగా తగ్గిపోతాయని, ఆదాయం కూడా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వ్యాపారుల ఆదాయానికి గండి నిబంధనల ప్రకారం మద్యం లెసైన్స్ విలువకు అనుగుణంగా దానికి ఆరు రెట్లు విక్రయించే అవకాశం వ్యాపారులకు ఉంటుంది. ఒక వ్యాపారి రూ.50 లక్షలు లెసైన్స్ ఫీజు చెల్లిస్తే అతను రెండు సంవత్సరాల్లో రూ.3 కోట్ల వరకు మద్యం విక్రయించవచ్చు. ఈ మూడు కోట్లు రూపాయలు ఎమ్మార్పీపై 28 శాతం కమీషన్ చెల్లిస్తారు. రూ.3 కోట్లకు పైగా విక్రయాలు జరిగితే కేవలం 12 శాతం మాత్రమే కమీషన్ ఇస్తారు. ఈ క్రమంలోప్రతి షాపునకు అనుబంధంగా మూడు చైన్‌షాపులు ఏర్పాటుచేస్తే వాటి లెక్కలు కూడా అధికారికంగా చూపాల్సి వస్తుంది. దీంతో రూ.3 కోట్ల టర్నోవర్ ఏడాదిలోపే దాటిపోయే అవకాశం ఉంటుంది. కమీషన్ భారీగా తగ్గిపోతుంది. దీంతో పెట్టుబడి ఎక్కువ లాభం తక్కువగా మారుతుంది. -
నకిలీ మద్యం గుట్టురట్టు
కర్నూలు/డోన్‌టౌన్: జిల్లాలో నకిలీ మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇక్కడే తయారు చేస్తున్న మద్యం జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో బెల్టు షాపులకు తరలుతోంది. జిల్లా పరిషత్ కీలక నేత ఒకరు ఈ విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే కర్ణాటక మద్యం జిల్లాలో ఏరులై పారుతుండగా.. ఇటీవల కాలంలో నకిలీ మద్యం జాడలు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం డోన్ మండలం కొత్తకోట గ్రామ సమీపంలోని మామిడితోట వద్ద రూ.11 లక్షల విలువ చేసే నకిలీ మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతోంది. గ్రామానికి సమీపంలోని రాఘవేంద్ర గార్డెన్స్‌లో భారీ మొత్తంలో నకి లీ మద్యం నిల్వ ఉంచినట్లు ప్యాపిలి సివిల్ పోలీసులకు సమాచారం అందడంతో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్చార్జ్ డిప్యూటీ కమిషనర్‌కు విషయం తెలియజేశారు. ఆయన ఆదేశాలకు మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సీఐ రాజశేఖరగౌడ్ నేతృత్వంలో సిబ్బంది దాడి చేసి 15,360 నకిలీ బ్యాగ్‌పైపర్ బాటిళ్లు, లేబుళ్లను స్వాధీనం చేసుకున్నారు. బయటపడిందిలా.. ఉడుమలపాడుకు చెందిన ఓ వ్యక్తి డోన్ ప్రాంతంలో నకిలీ మద్యం రవాణా చేస్తుంటాడు. గత అక్టోబర్ 31న పట్టణ సమీపంలోని జాతీయ రహదారి పక్కనున్న రాజధాని డాబా, రాజ్ డాబా వద్ద నాగరాజు, హనుమంతు నుంచి 45 బాటిళ్ల కల్తీ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. తీగ లాగితే డొంక కదిలిన చందంగా వారిచ్చిన సమాచారంతో కొత్తకోట వద్ద భారీ డంప్ ఉన్నట్లు వెలుగుచూసింది. అయినా స్థానిక ఎక్సైజ్ అధికారులు పట్టించకోకపోవడంతో అజ్ఞాత వ్యక్తులు మరోసారి ప్యాపిలి సివిల్ పోలీసుల ద్వారా జిల్లా ఎక్సైజ్ అధికారులకు సమాచారం చేరవేశారు. దీంతో దాడులు చేసి నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో జిల్లా పరిషత్ ముఖ్య నేత పేరు వెలుగులోకి రావడంతో సమాచారాన్ని గోప్యంగా ఉంచారు. డోన్‌లో లిక్కర్ డాన్ డోన్ మండల పరిషత్ కార్యాలయంలో అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి కుమారుడు నకిలీ మద్యం డాన్‌గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. డంప్ దొరికిన ప్రాంతం కూడా సదరు నాయకుడు గ్రామ సమీపానే ఉండడం ఇందుకు ఊతమిస్తుంది. జిల్లా పరిషత్ ముఖ్య నేతతో ఉన్న సంబంధాల నేపథ్యంలో ఆయన డోన్ ప్రాంతంలో నకిలీ మద్యం వ్యాపారాన్ని నిరాటంకంగా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మద్యం షాపుల్లో తగ్గిన అమ్మకాలు నకిలీ మద్యం పల్లెల్లో ఏరులై పారుతున్న కారణంగా ప్రభుత్వ దుకాణాల్లో వ్యాపారం మందగించింది. రోజుకు రూ.లక్షల్లో జరిగే వ్యాపారం తగ్గిపోవడంతో లెసైన్స్‌దారులు కూడా గగ్గోలు పెడుతున్నారు. ఎక్సైజ్ అధికారులు పూర్తి స్థాయిలో నిఘా ఉంచితే నకిలీ మద్యం రవాణా వెనుక ఉన్న బడా నేతల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
బెల్టు షాపుల్ని పెంచి పోషిస్తారా ?!
-
‘డయల్ యువర్ ఎస్పీ’కి 25 ఫిర్యాదులు
చిత్తూరు (అర్బన్): జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో 25 ఫిర్యాదులు అందాయి. బెల్టుషాపు, ఇసుక రవాణా తో పాటు పలు సివిల్ కేసులకు సంబంధించి ఫిర్యాదులు ఎక్కువగా అందా రుు. జిల్లాలోని పెద్దపంజాణి, శంకరాయనిపేట, శివాడి, చిత్తూరు, మదనపల్లె, వెదుకుప్పం, పాతగుంట ప్రాంతా ల్లో బెల్టుషాపులు ఎక్కువగా ఉన్నాయని ప్రజలు ఫిర్యాదు చేశారు. పీలేరులోని టెలిఫోన్ కాలనీ, చిత్తూరులోని పలు ప్రాంతాల్లో సారా విక్రయాలు జోరుగా జరుగుతున్నాయని వివరించారు. పుం గనూరులో అమ్మాయిలను వేధిస్తున్నారని, మదనపల్లె, చిప్పిలి ప్రాంతాల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఫిర్యాదులు అందాయి. చిత్తూరు సీసీఎస్, పీలేరు పోలీసు స్టేషన్ల పరిధిలో చోరీ ఘటనలపై ఫిర్యాదులు చేస్తే ఇప్పటి వరకు సొమ్ము రికవరీ చేయలేదని స్థానికులు ఫిర్యాదు చేశారు. కుటుంబ గొడవలు, పలు సివిల్ తగాదాలు, తిరుపతికి సంబంధించి నాలుగు ఫిర్యాదులు అందాయి. వచ్చిన ఫిర్యాదులపై సత్వరమే విచారణ చేసి నివేదిక అందచేయాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ అన్నపూర్ణారెడ్డి, చిత్తూరు డీఎస్పీ లక్ష్మీనాయుడు, సీఐలు శ్రీకాంత్, చిన్నగోవిందు పాల్గొన్నారు. కానిస్టేబుల్‌పై ఫిర్యాదు శ్రీకాళహస్తి రూరల్ పోలీసు స్టేషన్ కాని స్టేబుల్ దేవప్రసాద్, తన కూతురు రమ్యను కిడ్నాప్ చేశాడని తండ్రి బాబు ఎస్పీకు ఫిర్యాదు చేశారు. రమ్యను ఏడా దిక్రితం, లక్ష్మీప్రసాద్‌కు ఇచ్చి వివాహం చేశామని వివరించారు. పెళ్లి చూపుల సమయంలో వచ్చిన ఆ కానిస్టేబుల్ రమ్యతో పరిచయం పెంచుకుని ఈ పని చేశాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈనెల 8న పాలసముద్రం మండలం నల్లవెంకటయ్యగారిపల్లెలోని తన తం డ్రి ఇంటి వద్ద ఉన్న రమ్యను దేవప్రసాద్ కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడని, దీనిపై అప్పుడే పాలసముద్రం ఎస్ఐకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. -
‘బెల్టు’ పై పోరు
- కలెక్టరేట్లో ఆమరణ దీక్ష చేపట్టిన బాధిత కుటుంబం నెల్లూరు(పొగతోట): బెల్టుషాపు నిర్వహణపై ఫిర్యాదు చేసినందుకు కక్షగట్టి ఇంట్లోకివచ్చి దాడి చేశారని కోవూరు మండలం పాటురుకు చెందిన పూండ్ల లోకనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్లో బాధిత కుటుంబం సోమవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా లోకనాథ్ మాట్లాడుతూ బెల్టుషాపు నిర్వహిస్తున్నారని ఫిర్యాదు చేశామని, దీంతో 60 మంది తమ ఇంటికి వచ్చి దాడి చేశారన్నారు. దీనిపై పోలీసులు, కోవూరు తహశీల్దార్, సీఐకు ఫోన్ చేసినా స్పందించలేదన్నారు. కోవూరు పోలీసులు తమను కొట్టుకుంటూ జీపులో తీసుకుపోయారని ఆయన ఆరోపించారు. బంధువులకు కూడా చెప్పడానికి వీల్లేకుండా సెల్‌ఫోన్ లాక్కుని రాత్రి 9 గంటల తరువాత వదిలివేశారన్నారు. బెల్టుషాపు నిర్వాహకులు తమ ఇంటి వద్దే ఉంటూ బయటకు వస్తే చంపేస్తామంటూ బెదిరించారని వాపోయారు. తమకు రక్షణ కల్పించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయం జరిగేంత వరకు దీక్ష కొనసాగిస్తామని తెలిపారు. వన్ టౌన్ సీఐ శ్రీనివాసులు వారి వద్దకు వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
తాగినోడికి తాగినంత !
బెల్ట్‌షాపుల్లో ఏరులై పారుతున్న మద్యం సీఎం మాటలు ఒట్టివే మద్యం దుకాణాల్లోనూ లూజు విక్రయాలు ఎమ్మార్పీ కంటే అధిక ధరలు తెల్లవారక ముందే తెరుచుకుంటున్న దుకాణాలు ‘నోరు ఒకటి చెబుతాది.. చెయ్యి ఇంకోటి చేస్తాది..దేనిదోవ దానిదే’! అన్నట్టుంది సీఎం చంద్రబాబు తీరు. అధికారంలోకి రాగానే బెల్ట్‌షాపులను తొలగిస్తామని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఒట్టి బూటకమని స్పష్టమవుతోంది. ఓ వైపు బెల్ట్‌షాపులు మూసేయాలని జిల్లా ఎక్సైజ్ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు పంపి.. మరోవైపు వాటి జోలికెళ్లొద్దని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీంతో బెల్ట్‌షాపుల్లో మద్యం ఏరులై పారుతోంది. దీనికి తోడు మద్యం దుకాణాల్లో ‘లూజు’ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఎకై ్సజ్ యంత్రాంగం కూడా బెల్ట్‌షాపుల తనిఖీలు చేయకుండా నిర్లిప్తంగా ఉంది. సాక్షి, చిత్తూరు: మద్యం సిండికేట్ల వ్యవహారం రెం డేళ్ల కిందట రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే! బినామీల పేరుతో దుకాణాలను దక్కిం చుకుని యథేచ్ఛగా విక్రయాలు సాగించారు. అప్ప ట్లో 80 శాతం దుకాణాలు తెల్లరేషన్ కార్డుదారులైన బినామీల పేరుతో నడిచాయి. ఈ క్రమంలో గత ప్రభుత్వం పాత విధానానికి ఫుల్స్టాప్ పెట్టి కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది. లాటరీ పద్ధతిన దుకాణాలు కేటాయించింది. చంద్రబాబు సర్కారు కూడా అదే పాలసీని కొనసాగిస్తోంది. ప్రస్తుతం జిల్లా లో 458 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇందులో 388 దుకాణాలకు లెసైన్స్‌లు ఇచ్చారు. 70 దుకాణాలకు లెసైన్స్‌దారులు ముందుకు రాలేదు. ప్రస్తుతం నడుస్తున్న మద్యం దుకాణాల పరిధిలో భారీగా బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయి. జిల్లాలో 3600 బెల్ట్‌షాపులు ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు ప్రతి గ్రామంలో మద్యం బాటిళ్ల విక్రయాలు సాగుతున్నాయి. జిల్లాలోని మద్యం దుకాణాల ద్వారా ఆబ్కారీకి 40 శాతం ఆదాయం వస్తుంటే, 60 శాతం ‘బెల్ట్’ ద్వారానే సమకూరుతోంది. ఆర్డర్ సరే.. ఆచరణ ఏదీ? టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేశారు. ఆపై చంద్రబాబు సీఎం పీఠమెక్కాక రాష్ట్రంలో మద్యాన్ని పారించి ‘మద్యాంధ్రప్రదేశ్’గా మార్చారు. ఇలాంటి చేష్టలతో పదేళ్లు అధికారానికి దూరమైన చంద్రబాబు 2014 ఎన్నికల ప్రచారంలో ‘బెల్ట్రాగాన్ని’ అందుకున్నారు. అధికారంలోకి వస్తే బెల్ట్‌షాపులను నివారిస్తామని ప్రకటించారు. మ్యానిఫెస్టోలో కూడా పొందుపరిచారు. నిజానికి బెల్ట్‌షాపుల నిర్వహణకు ఎప్పుడూ, ఏ ప్రభుత్వంలో అనుమతుల్లేవు. ఈ క్రమంలో నెలకిందట బెల్ట్ షాపులను తొలగించాలని ఓ జీవోను కూడా జారీచేశారు. దీం తో బాబు మాటపైన నిలబడ్డారని అంతా భావించారు. ఇంతలోనే తనదైన శైలిలో ‘బెల్ట్’జోలికి వెళ్లొద్దని, ‘బెల్ట్’ తీస్తే సర్కా రు ఖజానా గండిపడి గల్లాపెట్టె నిండదని మౌఖిక ఆదేశాలు జారీ చేయించారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తు తం రాష్ట్రం ఆర్థికకష్టాల్లో ఉందని ఇలాంటి సమయంలో ఎంత మద్యం తాగిస్తే.. అంత ఆదాయం వస్తుందని కూడా బాబు సూచించినట్టు తెలుస్తోంది. దీంతో అధికారులు ‘బెల్ట్’ వైపు కన్నెత్తి చూడటం లేదు. పైగా జూలై నుంచి కొత్త లెసైన్స్‌లు జారీ చేశారు. ఆర్థిక సంవత్సరానికి ఎక్సైజ్‌శాఖ ఆదాయ సేకరణలో లక్ష్యాన్ని చేరుకోవాలంటే ‘బెల్ట్’ ఆసరా తప్పనిసరి. నడుస్తున్నవీ నిబంధనలకు విరుద్ధంగానే.. కొత్త నిబంధన ప్రకారం లాటరీలో ఎవ్వరి పేరుతో షాపు వచ్చిందో వారే నడపాలి. అయితే లాటరీలో దుకాణం దక్కించుకున్న వారి నుంచి తిరిగి ‘ఎక్సెస్రేటు’ చెల్లించి ఖద్దరు నేతలు నడుపుతున్నారు. ప్రస్తుతం 388 దుకాణాల్లో 246 దుకాణాలు ఇదే రకంగా నడుస్తున్నాయని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. అయినా చర్యలు లేవు. జిల్లాలో కొన్ని మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారు. లిక్కర్‌పై 5-10, బీరుపై 10-15 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారు. లూజు విక్రయాల సంగతి సరేసరి! ఆగస్టు నుంచి కంప్యూటర్ బిల్లుల ద్వారా విక్రయాలు జరపాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దాన్ని అమలు చేసేందుకు ఇప్పటి ప్రభుత్వం ముందడుగు వేయడం లేదు. నిబంధనల మేరకు ఉదయం 11 గంటలకు దుకాణం తెరిచి, రాత్రి 10 గంటలకు మూసేయాలి. దాదాపు ఎక్కడా ఈ నిబంధన అమలు కావడం లేదు. తెల్లవారినప్పటి నుంచి అర్ధరాత్రి దాకా అమ్మకాలు సాగిస్తున్నారు. మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. అయినా ఎక్సైజ్ చూపు అక్కడ పడటం లేదు. కాదు..కాదు..చూసీ చూడనట్టు వ్యవహరిస్తోంది. సమాచారం ఇస్తే దాడులు చేస్తాం బెల్ట్‌షాపులు నివారించాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది. బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నారని సమాచారం ఇస్తే దాడులు చేస్తాం. ఇందుకోసం రెండు టాస్క్‌ఫోర్స్ టీంలు పనిచేస్తున్నాయి. కంప్యూటర్ బిల్లులపై ఇంకా విధివిధానాలు రాలేదు. రాగానే అమలు చేస్తాం. -సత్యప్రసాద్, డెప్యూటీ కమిషనర్, ఎక్సైజ్‌శాఖ -
బెల్టు షాపులను సమూలంగా నిర్మూలిస్తాం
నెల్లూరు(క్రైమ్): బెల్టుషాపులను సమూలంగా నిర్మూలించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నగరంలోని ఓ హోటల్లో మద్యం వ్యాపారులు, ఎక్సైజ్ ఉద్యోగులతో బెల్టుషాపుల నిర్మూలనపై గురువారం సదస్సు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూగత ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూస్తూ సిండికేట్లను ప్రోత్సహించిందన్నారు. మద్యం ద్వా రా ఆదాయం పొందాలన్న ఆలోచన తమ ప్రభుత్వానికి లేదన్నారు. గ్రామ, మండల, జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి బెల్టు నిర్మూలనకు నడుం బిగించామన్నారు. టాస్క్ఫోర్సులను ఏర్పాటు చేసి విసృ్తత దాడులు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే 2 వేల కేసులు నమోదు చేసి 1,800 మందిని జైలుకు పంపామన్నారు. త్వరలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో రీజనల్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ బెల్టుషాపులను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు కృషి చేయాలన్నారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూ టీ కమిషనర్ డాక్టర్ వై. చైతన్యమురళీ బెల్టు దుకాణాల నిర్మూలనకు తీసుకుం టున్న చర్యలను వివరించారు. నెల్లూ రు, గూడూరు ఎక్సైజ్ ఈఎస్‌లు డాక్టర్ కె.శ్రీనివాస్, సుబ్బారావు, ఏఈఎస్ రవికుమార్‌రెడ్డి, టీడీపీ నేతలు కన్నబాబు, కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కిలారి వెంకటస్వామి పాల్గొన్నారు. బీసీలకు మళ్లీ ‘ఆదరణ’ నెల్లూరు (దర్గామిట్ట): గతంలో వెనకబడిన తరగతులకు సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన ఆదరణ పథకాన్ని మళ్లీ పునరుద్ధరించనున్నట్లు బీసీ సంక్షేమ, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలి పారు. స్థానిక జిల్లా టీడీపీ కార్యాలయంలో గురువారం జరిగిన ఆత్మీయ సమావేశంలో టీడీపీ మత్స్యకార సెల్ విభాగం, వివిధ మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో మంత్రిని గజమాలతో సత్కరించారు. మంత్రి మాట్లాడుతూ పదేళ్ల కాంగ్రెస్ హయాంలో బీసీలను నిర్లక్ష్యం చేశారన్నారు. ఎస్ఈజెడ్ల పేరుతో భూములన్నీ బడా పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టారని ఆరోపిం చారు. గతంలో మాదిరిగా బీసీలకు సబ్‌ప్లాన్, కులవృత్తులకు పరికరాలను అందజేయునున్నట్లు చెప్పారు. జిల్లా లో మత్స్యకారులకు ఫిషింగ్ హార్బర్ అవసరం ఉందన్నారు. హార్బర్ నిర్మాణంపై సీఎంతో చర్చించి ఏర్పాటుకు తనవంతు కృషిచేస్తానని హామీ ఇచ్చా రు. పులికాట్ సరస్సులో ఇబ్బందులు లేకుండా పూడిక తీయునున్నట్లు చెప్పా రు. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి మాట్లాడుతూ బతుకుదెరువు కోసం తీరం వెంట పోరాడే మ త్స్యకారుల సంక్షేమానికి కృషిచేయాలని మంత్రిని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, రూరల్ అధ్యక్షుడు కిలారి వెంకటస్వామినాయుడు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, మత్స్యకార సంఘం జిల్లా అధ్యక్షుడు పొలిశెట్టి వెంకటరమణ, నూనె మలికార్జునయాదవ్, కొండూరు వెంకటరమణ, కొండూరు అనిల్, శివాజీ, యశోధ, పోలయ్య, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
బెల్టు షాపులపై చర్యలేవీ..?
మద్యంపై ఎంఆర్పీ విధానం పాటించాలి ఎక్సైజ్ అధికారులకు వైఎస్సార్సీపీ వినతి చిత్తూరు(అర్బన్) : రాష్ట్రంలో ఒక్క బెల్టు షాపు కూడా లేకుండా చేస్తానంటూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబునాయుడు నెల రోజులవుతున్నా జిల్లాలో ఒక్క బెల్టుషాపు కూడా మూయించకపోవడం శోచనీయమని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు దుయ్యబట్టారు. సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త జంగాలపల్లె శ్రీనివాసులు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పీవీ గాయత్రీదేవీ ఆధ్వర్యంలో పార్టీ నేతలు ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు, గాయత్రీ దేవీ మాట్లాడుతూ జిల్లాలో బెల్టు షాపులను అరికట్టడంలో ప్రభుత్వం చొరవ చూపడంలేదన్నారు. రుణమాఫీకి కూడా సీఎం సంతకం పెట్టి ఇప్పుడు డబ్బుల్లేవంటూ కమిటీలు వేసి కాలయాపన చేస్తున్నారన్నారు. బెల్టు షాపులను అరికట్టడానికి ఎలాంటి నిధులు అవసరం లేదని, ఉన్న అధికారులను సద్వినియోగం చేసుకుంటే చాలని సూచించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో మద్యం ఉత్పత్తి కూడా తగ్గిందని, అయితే కొన్ని కంపెనీలు ప్రభుత్వ అనుమతులు లేకుండానే వారికి నిర్ణయించిన లక్ష్యం కంటే అక్రమంగా మద్యం ఉత్పత్తి చేస్తూ ఆదాయాలను సమకూర్చుకుంటున్నాయని ఆరోపించారు. జిల్లాలో ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. బెల్టు షాపులను తొలగించాలని, మద్యం ఎంఆర్పీకే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇవే డిమాండ్లపై జిల్లా ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ మధుసూదన్‌కు వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు రూరల్ మండల కన్వీనర్ రాజా, నేతలు బాలాజీ, శీన, శివ, బాబు పాల్గొన్నారు. -
భద్రాచలం ఏజెన్సీలో మద్యం బంద్
భద్రాచలం: భద్రాచలం ఏజెన్సీలో మద్యం బాబులకు నేటి నుంచి కష్టాలు వచ్చిపడినట్లే. అందుకు కారణం సోమవారం రాత్రి 11గం.లకు భద్రాచలం, వెంకటాపురం ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో గల మద్యం దుకాణాలకు ప్రస్తుత లెసైన్స్‌ల గడువు ముగిసింది. దీంతో మంగళవారం నుంచి ఈ దుకాణాలు తెరిచే పరిస్థితి లేదు. మద్యం దుకాణాల ఏర్పాటుకు ఆయా పంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభల్లో ప్రజల నుంచి వ్యతిరేకత రాగా మరి కొని చోట్ల కోరం లేక సభలు వాయిదా పడ్డాయి. ఫలితంగా భద్రాచలం ఏజెన్సీలో మద్యం దుకాణాలకు తాళాలు పడనున్నాయి. భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 11, వెంకటాపురం పరిధిలో 5 దుకాణాలకు కొత్తగా గ్రామసభల ఆమోదం లభించే వరకూ తాళాలు వేయనున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. బెల్టుషాపులకు మద్యం తరలింపు..? అధికారికంగా మద్యం దుకాణాలు మూతవేయాల్సి రావడంతో సిండికేట్‌గా ఏర్పడిన కొంతమంది మద్యం వ్యాపారులు మిగిలిన సరుకును గ్రామాల్లోని బెల్ట్ షాపులకు తరలిస్తున్నారు. భద్రాచలం పట్టణంలో ఉన్న ప్రతీ మద్యం దుకణానికి అనుబంధంగా గ్రామాల్లో బెల్ట్‌షాపులు ఉన్నట్లుగా సమాచారం. ప్రస్తుతం దుకాణాల కాలపరిమితి ముగియడంతో మిగిలిన మద్యాన్ని అక్కడికి తరలించి విక్రయించేందుకు సిండికేట్‌దారులు వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. దీనికి అడ్డకట్ట వేసేందుకు ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని స్థానిక మహిళా సంఘాల వారు కోరుతున్నారు. భద్రాద్రిలో బెడిసికొట్టిన వ్యూహం : భద్రాచలంలో ఉన్న తొమ్మిది మద్యం దుకాణాలకు ఇప్పటికే టెండర్లు పూర్తి కాగా, వీటిని లాటరీ ద్వారా కేటాయించడం కూడా పూర్తయింది. తొమ్మిది దుకాణాలు కూడా ఇతర మండలాలకు చెందిన గిరిజనులకే దక్కాయి. కానీ ఇప్పటి వరకు బినామీలుగా వ్యవహరించిన సిండికేట్ దారులు ఈ ఏడాది కూడా దుకాణాలు దక్కించుకున్న గిరిజనులకు భారీ నజరానా(గుడ్ విల్) ముట్టజెప్పి షాపులను కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలోనే మద్యం షాపుల ఏర్పాటుకు సంబంధించి రెండు రోజుల క్రితం భద్రాచలం పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామసభలో ఎలాగైనా ఆమోదింపజేసుకునేందుకు వ్యూహం పన్నారు. కానీ చివరకు వారి వ్యూహం బెడిసి కొట్టింది. డబ్బులు ఇచ్చి మరీ ప్రజలను గ్రామసభకు రప్పించారనే ఆరోపణలు వచ్చాయి. కానీ వచ్చిన వారిలో తగినంతమంది గిరిజనులు లేకపోవడంతో గిరిజన చట్టాల మేరకు గ్రామసభను రద్దు చేశారు. మరోమారు నిర్వహించే గ్రామసభలో వీటిని ఆమోదింపజేసుకునేందుకు భద్రాద్రి సిండికేట్ దారులు మళ్లీ పావులు కదుపుతున్నారు. ఆంధ్రాకు పరుగు తీయాల్సిందే... ఏజెన్సీలోని మద్యం ప్రియులు ఆంధ్రప్రదేశ్‌లోని చింతూరుకు పరుగులు తీయాల్సిందే. అందుకు కారణం చింతూరు మండలంలో రెండు మద్యం దుకాణాలకు గ్రామసభ ఆమోదం లభించింది. దీంతో నూతనంగా దుకాణాలను లాటరీలో దక్కించుకున్న వారికి మంచి వ్యాపారమే సాగనుంది. మరోపక్క ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించిన కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో దుకాణాల ఏర్పాటుకు గ్రామసభ ఆమోదం లేదు. అదే విధంగా చింతూరు మండలం మోతుగూడెంలో గ్రామసభకు కోరం లేక వాయిదా పడింది. దీంతో చింతూరు మండల కేంద్రంలో ఉన్న దుకాణంతో పాటు, ఇదే మండలంలోని ఎర్రంపేట దుకాణాల్లో మాత్రం అధికారికంగా మద్యం లభించనుంది. ఈ పరిణామాలు మద్యం ప్రియులకు కష్టాలు తెచ్చిపెట్టనుండగా, మహిళా సంఘాలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నాయి. భద్రాచలం ఏజెన్సీలో పూర్తిగా మద్యం లేకుండా చేయాలని వారు కోరుతున్నారు. అదే విధంగా బెల్ట్ షాపులు కూడా లేకుండా ఎక్సైజ్ అధికారులు నిఘా ఏర్పాటు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
‘బెల్ట్’ తీస్తున్నారు!
బెల్ట్‌షాపుల వేటలో ఎక్సైజ్ అధికారులు వాటికి మద్యం సరఫరా చేస్తే క్రిమినల్ కేసులు ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపుల వేటలో పడ్డారు. బెల్ట్ షాపులను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు గ్రామాల్లో పాగా వేశారు. ఒక్క షాపు కూడా ఉండకూడదంటూ జిల్లా అధికారులు స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రొద్దుటూరు పట్టణంలో 15 మద్యం షాపులు, 8 బార్లు ఉన్నాయి. రాజుపాళెం, చాపాడు, ప్రొద్దుటూరు రూరల్ గ్రామాలలో నాలుగు మద్యం షాపులున్నాయి. నాలుగు రోజుల క్రితం వరకూ రాజుపాళెం మండలంలో 20, ప్రొద్దుటూరు రూరల్ మండలంలో 26, చాపాడు మండలంలో 30 దాకా బెల్ట్ షాపులుండేవి. ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల్లో కూడా 20కి పైగా అనధికార మద్యం షాపులు నడిచేవి. మండలాల్లో అయితే ప్రధాన షాపులకు అనుబంధంగానే బెల్ట్ షాపులు నడిచేవి. పట్టణాల్లో కూడా ఆయా మద్యం షాపుల ఆధ్వర్యంలోనే అధికంగా అనధికార విక్రయాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల అయితే రూ. లక్షలు వెచ్చించి బెల్ట్ షాపులను ఏర్పాటు చేసుకున్నారు. మద్యం షాపులకు నోటీసులు జారీ బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఇన్ని రోజుల నుంచి కుర్చీలకే పరిమితమైన అధికారులు పరుగులు తీస్తున్నారు. బెల్ట్ షాపుల తొలగింపుపై ప్రభుత్వం ఈ నెల 8న 263 జీఓను జారీ చేసింది. రెండు రోజుల క్రితం వరకూ ముందస్తుగా మద్యం షాపుల యజమానులతో పాటు బెల్ట్ షాపు నిర్వాహకులకు ఎక్సైజ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అనధికార విక్రయాలు ఎక్కడా జరగరాదని తెలిపారు. అయినప్పటికీ చాలా చోట్ల బెల్ట్ షాపులుండటంతో దాడులు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే మద్యం షాపు, బార్ల యజమానులకు నోటీసులు జారీ చేశారు. తమ షాపుల నుంచి బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేయరాదని, 1-2 కంటే ఎక్కువగా మద్యం సీసాలను బయటికి ఇవ్వరాదని నోటీసులో పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే షాపు లెసైన్స్‌ను రద్దు చేయడమే గాక క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు నోటీసులో తెలిపారు. ఈ మేరకు మద్యం షాపుల నిర్వాహకుల నుంచి హామీ పత్రం కూడా అధికారులు తీసుకున్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపుల నియంత్రణకు పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్ అధికారులతో పాటు స్వయం సహాయక సంఘాలతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు అంటున్నారు. -
బెల్ట్ షాప్‌లు బంద్.. ఎక్కడా ?!
-
బెల్టు షాపులపై దాడులు
అనంతగిరి, న్యూస్‌లైన్: బెల్టు దుకాణాల్లో దాడులు నిర్వహించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రాజేంద్రనగర్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయభాస్కర్ పేర్కొన్నారు. శనివారం ఆయన వికారాబాద్‌లోని సర్కిల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పూడూరు మండలం గట్టుపల్లిలో ఓ మహిళ ఇంట్లో దాడులు చేసి 480 సారా ప్యాకెట్లు, 44 నాకౌట్ బీర్లు, 28 క్వార్టర్ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. దీంతో పాటు మంచన్‌పల్లి గ్రామంలో రాంచంద్రయ్య ఇంట్లో తనిఖీలు చేసి 12 క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈమేరకు నిందితులను రిమాండుకు తరలించినట్లు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ తెలిపారు. సారా బట్టీలపై దాడులు మర్పల్లి: పలు తండాల్లో ఎక్సైజ్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. రాజేంద్రనగర్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయభాస్కర్ ఆధ్వర్యంలో షాపూర్ తండా, దామస్తాపూర్ తండా, బంట్వారం మండలం నాగారం తండాలో తనిఖీలు చేశారు. 4,050 లీటర్ల ఊట బెల్లంతో పాటు 110 లీటర్ల సారాను ధ్వంసం చేశారు. మరో ఘటనలో.. శనివారం సాయంత్రం ఓ ఆటో(ఏపీ 28 వీ 0052)లో మర్పల్లి నుంచి కోటమర్పల్లికి తరలిస్తున్న 192 క్వార్టర్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆటోను సీజ్ చేసి డ్రైవర్ మహ్మద్జలీల్ను రిమాండుకు తరలించినట్లు సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ సీఐ సుధాకర్‌వర్మ, ఎస్సైలు శ్రీనివాస్, రఘురాంరెడ్డి, సిబ్బంది ఉన్నారు. వేర్వేరు ఘటనల్లో మద్యం పట్టివేత తాండూరు టౌన్: వేర్వేరు ఘటనల్లో పోలీసులు మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టణ సీఐ వెంకట్రామయ్య కథనం ప్రకారం.. పెద్దేముల్ మండలం తట్టేపల్లి గ్రామానికి చెందిన కోట్ల మల్లికార్జున్ ఓ ఆటోలో 239 క్వార్టర్ బాటిళ్లను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. తాండూరు మండలం నారాయణపూర్‌కు చెందిన సురేష్ నుంచి 25 క్వార్టర్ బాటిళ్లు, యాలాల మండలం ఎన్కేపల్లి గ్రామస్తుడు బీటీ గోవింద్ వద్ద 45 క్వార్టర్ బాటిళ్లు, పెద్దేముల్ మండలం కోటపల్లికి చెందిన కోమలి శ్రీనివాస్ క్వాలిస్‌లో తరలిస్తున్న 90 బీర్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చెప్పారు. నిందితులు మల్లికార్జున్, సురేష్, బీటీ గోవింద్, శ్రీనివాస్‌లతో పాటు క్వాలిస్ డ్రైవర్ జైపాల్‌రెడ్డి, ఆటో డ్రైవర్ ఇస్మాయిల్‌లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. క్వాలిస్‌ను సీజ్ చేసినట్లు సీఐ చెప్పారు. -
బెల్ట్ షాపులను రద్దు చేయాలి
వైఎస్సార్సీపీకి మద్య నియంత్రణ కమిటీ వినతి హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం బెల్ట్‌షాపులను రద్దు చేస్తామనే హామీని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని రాష్ట్ర మద్య నియంత్రణ కమిటీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేసింది. కమిటీ రాష్ట్ర కన్వీనర్ వి.లక్ష్మణ్‌రెడ్డి, అప్సా డెరైక్టర్ ఎం.శ్రీనివాసరెడ్డి, ఎం.వి.ఫౌండేషన్ కోఆర్డినేటర్ డి.యాదయ్యలతో కూడిన ప్రతినిధి బృందం ఆదివారం వైఎస్సార్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మేనిఫెస్టో కమిటీ సభ్యులతో సమావేశమై ఈ మేరకు వినతిపత్రాన్ని సమర్పించింది. అనంతరం లక్ష్మణ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్టీఆర్ సంపూర్ణ మద్య నిషేధం తీసుకొస్తే.. తరువాత వచ్చిన ప్రభుత్వాలు దానిని నీరుగార్చాయన్నారు. మద్యం అమ్మకాల్లో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. దీనివల్ల ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయని తెలిపారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా మద్యంపై నియంత్రణ ఉండాలని కోరామన్నారు. బెల్ట్‌షాపులను నిర్మూలిస్తామని, ప్రతిగ్రామానికీ పది మంది మహిళా కానిస్టేబుళ్లను నియమించి మద్యం అమ్మకాల్లేకుండా చేస్తామని మేనిఫెస్టో కమిటీ సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి తమకు హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. -
ఎక్సైజ్ దూకుడు
34 బెల్ట్ షాపులు సీజ్ వేళలు పాటించని 18 షాపులపై కేసులు 46 మందిపై బైండోవర్ కేసులు 15 చోట్ల కొత్త చెక్‌పోస్టులు విశాఖపట్నం, న్యూస్‌లైన్: ఎన్నికల వేళ ఎక్సైజ్ శాఖ దూకుడు పెంచింది. జిల్లాలోని గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో అక్రమంగా మద్యం నిల్వ చేసేందుకు రాజకీయ వర్గాలు వ్యూహాలు పన్నుతున్న నేపథ్యంలో ఈ దాడులకు ప్రాధాన్యత పెరిగింది. నేతల ముఖ్య అనుచరులు మద్యం నిల్వ చేసే పనుల్లో బిజీగా వుండడంతో జిల్లా యంత్రాగం ఎక్సై జ్ శాఖను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా ఒడిశా, చత్తీస్‌గఢ్ సరిహద్దుల నుంచి మద్యం, నాటుసారా గిరిజన తండాలకు రవాణా కాకుండా చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీ బృందాలను, కొత్తగా నియామకమైన సిబ్బందిని మరో 15 చోట్ల చెక్‌పోస్టుల్లో నియమించింది. కొత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లను పల్లెలకు తరలించి అక్రమ మద్యం దుకాణాలపై సర్వే చేయిస్తున్నారు. అనధికారిక దుకాణాలు, సిండికేట్లు, బెల్ట్ షాపుల గుట్టును వీరితో అధికారులు సేకరిస్తున్నారని తెలిసింది. ఇటీవల 124 అక్రమ సారా కేసులు నమోదు చేసి 59 మందిని అరెస్టు చేశారు. పాడేరు, చింతపల్లి, అరుకు, నర్సీపట్నం వంటి ప్రాంతాలతో బాటు విశాఖ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోనూ దాడులను ముమ్మరం చేశారు. అక్రమంగా తరలిస్తున్న 1720 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు. 18 మద్యం దుకాణాలపై కేసులు నమోదు చేసి రూ. లక్షల్లో అపరాధ రుసుం వసూలు చేశారు. అక్రమంగా మద్యాన్ని తరలించేవారు, గొడౌన్లలో భద్రపరిచేవారు, అక్రమంగా మద్యం అమ్మే అవకాశం ఉందనుకున్న పాత ముద్దాయిలందరిపై బైండోవర్ కేసులు నమోదు చేసేందుకు కూడా ఎక్సైజ్ శాఖ వెనకాడడం లేదు. పొరుగు రాష్ట్రాల నుంచి నకిలీ మద్యం తీసుకొచ్చి ఎన్నికల వేళ సొమ్ము చేసుకుంటారన్న అనుమానంతో 46 మందిపై బైండోవర్ కేసులు పెట్టారు. గ్రామాల్లో అనధికారిక మద్యం దుకాణాలుగా చెలామణి అవుతోన్న 34 బెల్ట్ దుకాణాలపై దాడులు చేసి వాటిని సీజ్ చేయడంతో బాటు వాటిని నిర్వహించే 34 మంది చోటా నేతలను అరెస్టు చేశామని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ టి. శ్రీనివాసరావు ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా నిఘా బృందాలను నియమించామని దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు. మద్యం దుకాణాలన్నీ ఉదయం 11 గంటలకు తెరచి రాత్రి 10 గంటలకల్లా మూసివేయకపోతే కేసులు బుక్ చేస్తామని తెలిపారు. -
మత్తులో చిత్తు... కిక్కే కిక్కు
అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : ‘అనంత’లో విచ్చలవిడి మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. కర్ణాటక నుంచి తక్కువ ధరకు దొరికే మద్యం తెప్పించి అధిక ధరలకు విక్రయిస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్న కొందరు మద్యం కల్తీ చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. లెసైన్‌స దుకాణాల సంఖ్య వందల్లో ఉంటే బెల్టుషాపులు వేలల్లో ఉన్నాయి. పేద, మధ్యతరగతి వర్గాల వారు మద్యం మత్తులో పడి కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. యువత సైతం పెడదోవపడుతోంది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా అధికారికంగా 234 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటికి తోడుగా 6300 బెల్ట్‌షాపులు ఉన్నట్లు ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ వర్గాలు గుర్తించాయి. ప్రతి పల్లెకూ నాలుగు బెల్ట్‌షాపులున్నట్లు తెలుస్తోంది. మేజర్ పంచాయతీ పరిధిలోని ఒక్కో బెల్ట్‌షాపులో రోజుకు రూ.70 వేల నుంచి రూ.80 వేల మద్యం వ్యాపారం జరుగుతోంది. నూతన ఎక్సైజ్ పాలసీ ప్రకారం లెసైన్‌స దుకాణానికి అనుబంధంగా రూ.2 లక్షలు ఎక్సైజ్ శాఖకు చెల్లించి షెడ్ ఏర్పాటు చేసుకుని.. అక్కడ నిల్చొని మద్యం తాగి వెళ్లేందుకు అవకాశం కల్పించారు. అయితే సదరు దుకాణాదారులు నిబంధనలకు విరుద్ధంగా సిట్టింగ్ ఏర్పాట్లు చేసి.. మంచింగ్‌కు సంబంధించిన తినుబండారాలు, శీతల పానీయాలను అందుబాటులో ఉంచి.. బార్లను మరిపిస్తున్నారు. అనంతపురంలో అయితే కొంతమంది వ్యాపారులు మద్యం దుకాణాలకు అనుబంధంగా ఏకంగా హోటళ్లనే నడుపుతున్నారు. అయినా ఎక్సైజ్ అధికారులు ఇవేవీ పట్టించుకోవడం లేదు. భారీగా కర్ణాటక మద్యం దిగుమతి కర్ణాటక మద్యం జిల్లాకు భారీగా దిగుమతి అవుతోంది. నెలలో రెండు మూడు సార్లు తెప్పిస్తున్నట్లు తెలిసింది. సగటున నెలకు రూ.30 కోట్ల మేర కర్ణాటక మద్యం దిగుమతి అవుతోంది. సర్కారీ మద్యం రోజుకు రూ.2 కోట్ల అమ్మకాలు జరుగుతుండగా.. కర్ణాటక మద్యం రూ.కోటి వరకు విక్రయిస్తున్నారు. గార్లదిన్నెలో ఇద్దరు లెసైన్సీదారులే తమ దుకాణాల్లో కర్ణాటక మద్యం అమ్ముతూ పట్టుబడ్డారు. ఎక్సైజ్ శాఖలోని కొందరు అధికారుల అండదండలతోనే కర్ణాటక మద్యాన్ని యథేచ్ఛగా దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిసింది. -
నాడు రోశమ్మ.. నేడు పోశమ్మ
హుస్నాబాద్, న్యూస్‌లైన్ : హుస్నాబాద్ మండలం జనగామకు చెందిన అబ్బరబోయిన పోశమ్మ భర్త మొగిలి నాలుగు నెలలుగా సారాకు పూర్తిగా బానిసయ్యాడు. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్న కుటుంబంలో పెద్దకొడుకు, కూతురుకు పెళ్లి చేసింది. భర్తను, చిన్నకొడుకును పోషించే భారమంతా పోశవ్వదే. ఆమె కూలీ పని చేసి సంపాదించిందంతా భర్త తాగుడుకే తగలేసేవాడు. ఎన్నిసార్లు చెప్పిచూసినా అతడిలో మార్పు రాలేదు. భర్త తీరుతో ఆమె విసిగి వేసారింది. కన్నీళ్లను దిగమింగుకుంటూ కాలం గడిపేకన్నా ఎదురొడ్డి పోరాడడమే మేలని భావించింది. ఈ కష్టాలన్నింటికీ ఊళ్లో సారా అమ్మకాలే కారణమని భావించింది. సారానే లేకపోతే అందరి కుటుంబాలు బాగుపడతాయని తలచింది. తాను ఒక్కతే పోరాడితే కష్టమని భావించిన పోవమ్మ మద్యంతో కలుగుతున్న అనర్థాలను ఊళ్లో మహిళలకు వివరించింది. మెల్లగా ఒక్కొక్కరి మద్దతు కూడగట్టింది. క్రమంగా ఊరి ప్రజలంతా ఏకమయ్యారు. పోశమ్మ పడుతున్న కష్టాలు మరెవరికీ రావొద్దనుకున్నారు. సర్పంచ్ బొడ్డు ఈశ్వర్ నేతృత్వంలో యువకులు, అధికారులు సైతం వీరికి మద్దతుగా నిలిచారు. సోమవారం గ్రామంలో మద్యం అమ్ముతున్న ఏడు బెల్ట్‌షాపులతోపాటు గుడుంబా అమ్ముతున్న ఎనిమిది కేంద్రాలను మూసివేయించారు. గ్రామంలో మద్యం, గుడుంబా విక్రయిస్తే ఊరుకునేది లేని హెచ్చరించారు. మద్యానికి దూరంగా ఉంటామంటూ ప్రతిజ్ఞ చేయించారు. పోశమ్మ కష్టాలు ఊరిని ఏకం చేసి మద్యం అమ్మకాలను నిలిపివేయించాయి. ఇప్పుడు కావలసిందల్లా ఆమెకు అధికారులు అండగా నిలవడమే. విచ్చలవిడి మద్యం అమ్మకాలను నియంత్రించడమే. -
మందుచూపు
మిర్యాలగూడ, న్యూస్‌లైన్: జిల్లాలో మద్యం దందా జోరుగా సాగుతోంది. ఇతర రాష్ట్రాల డిస్టిలరీల నుంచి వచ్చే మద్యం మిర్యాలగూడలో లభిస్తుంది. కర్ణాటక రాష్ట్రంలో తయారైన మద్యం యానాం నుంచి భారీగా దిగుమతి అవుతోంది. లారీల ద్వారానే దిగుమతి చేసుకుంటున్న మద్యం దళారులు నేరుగా బెల్ట్‌షాపులకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఈ మద్యం రాకెట్ ఎంతోకాలంగా సాగుతోంది. నూతన సంవత్సరం సందర్భంగా భారీగా మద్యం విక్రయాలు జరిగే అవకాశం ఉన్నందున యానాం నుంచి ఎన్డీపీ (నాన్ డ్యూటీ పెయిడ్) మద్యం భారీగా దిగుమతి చేసుకున్నట్లు సమాచారం. ఒక్కొక్క ఫుల్ బాటిల్ మద్యానికి ఇక్కడి కంటే అక్కడ 200 రూపాయలు తక్కువకు లభించడం వల్ల ఈ దందా జోరుగా సాగుతుంది. ఎక్కువగా ఏసీ ప్రీమియం, రాయల్‌స్టాగ్ మద్యం బాటిళ్లు దిగుమతి అవుతున్నట్లు తెలిసింది. మిర్యాలగూడ నుంచి కాకినాడకు బియ్యం రవాణా చేస్తున్న లారీల్లో కూడా ఎన్డీపీ మద్యం దిగుమతి చేసుకుంటున్నట్లు సమాచారం. దిగుమతి అయిన మద్యాన్ని ఇళ్లలోనే నిల్వ చేసుకుంటున్నారు. అయితే, రెండు రోజుల క్రితం మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్‌పేటలో సుమారు *1.20 లక్షల విలువైన్ మద్యం బాటిళ్లను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకొని ఒకరిపై కేసు నమోదు చేశారు. ఇంకా, మిర్యాలగూడ పట్టణంలోనే మరో ముగ్గురు ఎన్డీపీ మద్యం దందా చేస్తున్నట్లు సమాచారం. నకిలీ మద్యం దిగుమతి మిర్యాలగూడ పట్టణానికి హైదరాబాద్‌లోని ఉప్పల్, విజయపురి, ఘట్కేసర్ ప్రాంతాల నుంచి నకిలీ మద్యం దిగుమతి అవుతోంది. ఈ మద్యం కూడా నేరుగా బెల్ట్‌షాపులకు సరఫరా కావడం వలన దందా జోరుగా సాగుతుంది. ఆరు మాసాల క్రితం త్రిపురారం, మిర్యాలగూడ, నిడమనూరు మండలాల్లో నకిలీ మద్యం బాటిళ్లు తరలిస్తున్న, విక్రయిస్తున్న ముఠాలను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. త్రిపురారం మండలం గజలాపురం ఎక్స్‌రోడ్ సమీపంలో, నిడమనూరు మండలంలో బెల్ట్ షాపుల వద్ద విక్రయించేందుకు తీసుకెళ్తున్న నకిలీ మద్యంతో పాటు మిర్యాలగూడలో సహకరిస్తున్న వారిని మొత్తం 16మందిని అరెస్టు చేశారు. ఇప్పుడు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా భారీగా నకిలీ మద్యాన్ని కూడా దిగుమతి చేసుకున్నట్లు సమాచారం. సమాచారం వస్తే దాడులు చేస్తాం : కృష్ణాగౌడ్, ఎక్సైజ్ సీఐ మిర్యాలగూడ నకిలీ మద్యం, ఎన్డీపీ మద్యం మిర్యాలగూడలో ఉన్నట్లు తమకు సమాచారం వస్తే దాడులు నిర్వహిస్తాం. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా ఎన్డీపీ మద్యం, నకిలీ మద్యం వచ్చే అవకాశాలున్నాయని తెలిసి నిఘా ఏర్పాటు చేశాం. వినియోగదారులు స్థానిక దుకాణాల్లోనే మద్యం కొనుగోలు చేయాలి. బయట లభించే మద్యం కొనుగోలు చేయవద్దు. -
తాగు.. ఊగు
తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరకని గ్రామా ల్లోనూ మద్యం ఏరులై పారుతోంది. అధికా రులు లేదులేదంటూనే.. బెల్ట్‌కు ఊతమిస్తున్నారు. తమకు ముట్టాల్సినది ముడితే.. ఏమి చేసుకున్నా ఫర్వాలేదనే భరోసానిస్తున్నారు. ఆదాయం బాగానే ఉండటంతో వీటికీ అన ధికార వేలం పాట తప్పనిసరి చేశారు. అధికార పార్టీ కనుస న్నల్లో సాగుతున్న ఈ బాగోతం పల్లె ప్రజలకు ‘మత్తెక్కిస్తోంది’. కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: మద్యం దుకాణాన్ని దక్కించుకోవాలంటే కోట్ల రూపాయలతో పని. అయితే ఆదాయం ఆ స్థాయిలో ఉంటుందో.. లేదోననే బెంగ. ఏమి చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానమే బెల్ట్ షాపులు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వైన్స్ షాపులను టెండర్లలో దక్కించుకున్న నిర్వాహకులే అధికారులను మచ్చిక చేసుకొని అనధికార దుకాణాలకు తెరతీశారు. వీరికి రాజకీయ నాయకులు అండగా నిలుస్తున్నారు. కోడుమూరు నియోజకవర్గంలోని ఓ గ్రామంలో బెల్ట్ షాపు నిర్వహణకు గ్రామ కమిటీ నిర్వహించిన వేలంలో కాంగ్రెస్ నేత ఒకరు రూ.9 లక్షలతో దక్కించుకున్నారంటే గ్రామాలను మద్యం ఏ స్థాయిలో ముంచెత్తుతుందో తెలియజేస్తోంది. ఇక కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో నాటుసారా పుష్కలంగా దొరుకుతుండడంతో ప్రజలు మత్తులో జోగుతున్నారు. వీటిని నియంత్రించాల్సిన పోలీస్, ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో మిన్నకుండిపోతున్నారు. జిల్లాలోని అధికారికంగా 188 మద్యం దుకాణాలు ఉండగా.. బెల్ట్ షాపులు దాదాపు 3వేల పైమాటే. ప్రతి గ్రామంలో మూడుకు మించి బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నారు. వీటి నిర్వాహకులు ఆయా మండల కేంద్రాల్లో అధికారికంగా నిర్వహిస్తున్న మద్యం షాపుల నుంచే తరలిస్తున్నా అడిగే నాథుడు కరువయ్యాడు. ఇదే అదనుగా బెల్ట్ షాపుల్లో ఒక్కో బాటిల్‌పై రూ.10 నుంచి రూ.20లు అధికంగా వసూలు చేస్తున్నారు. చాలా గ్రామాల్లో కిరాణా సరుకులు అప్పుగా ఇస్తున్నట్లే మద్యం కూడా అరువిస్తూ ప్రజలను మత్తులో ముంచెత్తుతున్నారు. లెసైన్స్డ్ మద్యం దుకాణాల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో స్థానిక రాజకీయ నేతలకు భాగస్వామ్యం ఉంటోంది. దీంతో బెల్ట్ షాపుల నిర్వహణకు ఆయా ప్రాంతాల్లోని అధికార పార్టీ నేతల అండదండలు తప్పనిసరి. వీరి అండ ఉండటంతో అధికారులు కూడా అందిన దాంతో సంతృప్తి చెందుతున్నారు. కుప్పలు తెప్పలుగా బెల్ట్‌షాపులు ఆదోని నియోజకవర్గంలోని పెద్దహరివాణం, నాగనాథనహళ్లి, బసాపురం, దొడ్డనగేరితో పాటు శివారు ప్రాంతాల్లో బెల్ట్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఆలూరు మండలంలో 22, దేవనకొండలో 42, ఆస్పరిలో 20, హోళగుంద మండలంలోని అన్ని గ్రామాల్లో, చిప్పగిరి మండంలో 11 గ్రామాల్లో బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నారు. శ్రీశైలం నియోజకవర్గంలోని కరివేన, కొట్టాలచెరువు, అమలాపురం, బండి ఆత్మకూరు, సోమయాజుల పల్లె, భోదనం, పెద్ద, చిన్న దేవాళాపురం, మహానంది, గాజులపల్లె, అబ్దుల్లాపురం, రేగడగూడురు, గుంతకందాల, బోయరేవుల గ్రామాల్లో ‘బెల్ట్’ వ్యాపారం లక్షల్లో సాగుతోంది. పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో దాదాపు 260 బెల్ట్ షాపులు ఉన్నట్లు సమాచారం. నంద్యాల పరిధిలోని కానాల, పోలూరులో మద్యం దుకాణాలకు లెసైన్స్ ఉండగా.. పక్కనే ఉన్న బాపూజీనగర్, బిల్లలాపురం, మిట్నాల, చాబోలు, పుసులూరు తదితర గ్రామాల్లో మందు బాబులకు కావాల్సినంత మద్యం బెల్ట్ షాపుల్లో దొరుకుతోంది. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో ఇదే తంతు కొనసాగుతోంది. ఫ్యాక్షన్ గ్రామాల్లో భయం.. భయం మద్యం విచ్చలవిడిగా లభిస్తుండటంతో ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో ప్రజలు దినదిన గండంగా జీవనం సాగిస్తున్నారు. జిల్లాలోని చాలా గ్రామాల్లో ఫ్యాక్షన్, వర్గ వైశమ్యాలు ఉండటంతో మద్యం మత్తులో ఎప్పుడు ఎలాంటి గొడవలు చోటు చేసుకుంటాయో తెలియని పరిస్థితి నెలకొంది. తమ గ్రామాల్లోని బెల్ట్ దుకాణాలను ఎత్తేయాలని పలుమార్లు స్థానికులు పోలీసులను వేడుకుంటున్నా ఫలితం లేకపోతోంది.