- భారీగా మద్యం సీసాలు స్వాధీనం
- ఒకరి అరెస్టు
కోటవురట్ల : అక్రమంగా మద్యం అమ్మకాలు సాగిస్తున్న వారిపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. సోమవారం రాత్రి ఎస్‌ఐ శ్రీనివాసరావు, సిబ్బంది బెల్ట్ షాపులపై ఆకస్మిక దాడులు జరిపారు. ఈ దాడిలో భారీగా మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని, ఒకరిని అరెస్టు చేశారు. కొడవటిపూడి, టి.జగ్గంపేట శివారు తిమ్మాపురం గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఆకస్మిక దాడులు చేశారు.
కొడవటిపూడిలో కోసూరి చిన్నమ్మలు ఇంట్లో నిర్వహిస్తున్న బెల్ట్ షాపుపై దాడి చేసి 509 మద్యం సీసాలు, తిమ్మాపురంలో మద్యం అమ్మకాలు సాగిస్తున్న లాలం వెంకట రమణను అదుపులోకి తీసుకుని 14 మద్యం సీసాలను స్వాధీన పరుచుకున్నారు. రెండు చోట్ల పట్టుబడిన మద్యం సీసాల విలువ రూ.38,760 ఉంటుందని ఎస్‌ఐ తెలిపారు. పరారైన కోసూరి చిన్నమ్మలును అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. వీరిపై 34ఏ యాక్టు ప్రకారం కేసు నమోదు చేసి ఎక్సైజ్ శాఖాధికారులకు అప్పగిస్తామన్నారు.
బెల్ట్ షాపులపై పోలీసుల దాడి
Published Wed, May 6 2015 4:03 AM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM
Advertisement
Advertisement