బెల్టు దుకాణాలపై దాడులు
Published Thu, Jul 6 2017 11:07 PM | Last Updated on Tue, Sep 5 2017 3:22 PM
– 172 మద్యం బాటిళ్ల పట్టివేత
– నలుగురి అరెస్ట్
ఆలూరు రూరల్ : ఆలూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, జిల్లా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు ప్రత్యేక సిబ్బంది ఆధ్వర్యంలో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు నియోజకవర్గంలోని గ్రామాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆలూరులోని వరలక్ష్మి అనే మహిళ ఇంటిలో ఉన్న 78 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆస్పరి మండలం బిల్లేకల్‌లోని రాజశేఖర్ ఇంటిలో 22, కైరుప్పల నాగరాజు ఇంటిలో 24, ఆస్పరి వెంకటరాముడు ఇంటిలో 48 మద్యం బాటిళ్లను పట్టకున్నారు. వారందరిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. గ్రామాల్లో బెల్టు దుకాణాలు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ సీఐ మాధవస్వామి, జిల్లా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు సీఐ గోవిందనాయక్, ఆలూరు ఎక్సైజ్ ఎస్‌ఐ రామాంజనేయులు హెచ్చరించారు. దాడుల్లో ఆలూరు ఎక్సైజ్ సిబ్బంది రామసుబ్బయ్య, ఈశ్వరయ్య, మాళవ్య, పుల్లయ్య పాల్గొన్నారు.
Advertisement
Advertisement