exise
-
బెల్టు దుకాణాలపై దాడులు
– 172 మద్యం బాటిళ్ల పట్టివేత – నలుగురి అరెస్ట్ ఆలూరు రూరల్ : ఆలూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, జిల్లా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు ప్రత్యేక సిబ్బంది ఆధ్వర్యంలో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు నియోజకవర్గంలోని గ్రామాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆలూరులోని వరలక్ష్మి అనే మహిళ ఇంటిలో ఉన్న 78 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆస్పరి మండలం బిల్లేకల్లోని రాజశేఖర్ ఇంటిలో 22, కైరుప్పల నాగరాజు ఇంటిలో 24, ఆస్పరి వెంకటరాముడు ఇంటిలో 48 మద్యం బాటిళ్లను పట్టకున్నారు. వారందరిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. గ్రామాల్లో బెల్టు దుకాణాలు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ సీఐ మాధవస్వామి, జిల్లా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు సీఐ గోవిందనాయక్, ఆలూరు ఎక్సైజ్ ఎస్ఐ రామాంజనేయులు హెచ్చరించారు. దాడుల్లో ఆలూరు ఎక్సైజ్ సిబ్బంది రామసుబ్బయ్య, ఈశ్వరయ్య, మాళవ్య, పుల్లయ్య పాల్గొన్నారు. -
నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు
కర్నూలు : ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీరాములు ఆదేశాల మేరకు కర్నూలు ఎక్సైజ్ సీఐ పద్మావతి సిబ్బందితో కర్నూలు బంగారుపేట, ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడలో దాడులు నిర్వహించారు. బంగారుపేటకు చెందిన నీలిషికారి సన్ను దగ్గర 1.65 కేజీల ఎండిన గంజాయి, ఉయ్యాలవాడకు చెందిన రంగమ్మ నుంచి 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు. దాడుల్లో ఎస్ఐ దుర్గా నవీన్‌బాబు, హరికృష్ణ, హెడ్ కానిస్టేబుల్ మల్లికార్జున, మాదన్న, లీలా మోహన్,రంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
లక్కు.. కిక్కు!
మద్యం దుకాణాలకు నేడు లక్కీ డిప్ – చివరి రోజు భారీగా టెండర్ల దాఖలు - రియల్టర్లు, ఫైనాన్స్ వ్యాపారుల దృష్టి – లైసెన్స్ కాల పరిమితి రెండేళ్లు – మధ్యాహ్నం 2 నుంచి లక్కీడిప్ ప్రారంభం – జెడ్పీ సమావేశ భవనంలో ఏర్పాట్లు కర్నూలు: మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు ఆశావహులు పోటాపోటీగా దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలోని 204 మద్యం దుకాణాలకు చివరి రోజు గురువారం నాటికి సుమారు 4,850 పైగా దరఖాస్తులు అందినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారం దరఖాస్తుల స్వీకరణ గడువు సాయంత్రం 5 గంటలకు ముగిసింది. అయితే ఈసారి మరో మూడు గంటలు పెంచి రాత్రి 8 గంటల వరకు టెండర్ల దాఖలుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. రాత్రివేళ అసౌకర్యానికి లోనుకాకుండా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి దరఖాస్తులను పరిశీలించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన వ్యాపారులతో ఎక్సైజ్ కార్యాలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా సందడి కనిపించింది. జిల్లాలో 14 ఎక్సైజ్ పోలీస్స్టేషన్లు ఉండగా.. స్టేషన్ల వారీగా టెండర్ బాక్సులు ఏర్పాటు చేయడంతో ప్రక్రియ సజావుగా సాగింది. మహిళలు కూడా నేరుగా కార్యాలయానికి వచ్చి దరఖాస్తులు సమర్పించారు. గత ఏడాది పదుల సంఖ్యలో దుకాణాలకు 100 నుంచి 150 దాకా దరఖాస్తులు దాఖలు కాగా.. ఈ ఏడాది వ్యాపారులు సిండికేట్ కావడంతో కొన్ని ప్రాంతాల దుకాణాలకు దరఖాస్తులు తగ్గాయి. గత ఏడాది 175 దుకాణాలకు టెండర్లు ఆహ్వానించి 19 దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించింది. కొంతకాలం తర్వాత వాటికి కూడా టెండర్లను ఆహ్వానించి వ్యాపారులకు అప్పగించారు. మద్యం వ్యాపారంలోకి కొత్త వ్యక్తులు గత ఏడాది మద్యం వ్యాపారులు భారీగా లాభాలు గడించారనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో మద్యం వ్యాపారంపై కొత్త వ్యక్తులు కూడా దృష్టి సారించారు. జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం స్తబ్దుగా ఉండటంతో గతంలో ఆ వ్యాపారంలో స్థిరపడిన వారు, ఫైనాన్స్ వ్యాపారులు నువ్వా.. నేనా అన్నట్లుగా ఎక్సైజ్ టెండర్లలో పాల్గొని దరఖాస్తులు అందజేశారు. రెండేళ్ల కాల పరిమితితో లైసెన్స్ ఇస్తుండటంతో కలసివచ్చే అవకాశంగా భావించి మద్యం వ్యాపారంతో సంబంధం లేని వాళ్లు కూడా ఈసారి లాటరీల కోసం ప్రయత్నిస్తున్నారు. రాబోవు రెండేళ్ల కాలంలో సాధారణ ఎన్నికలతో పాటు ఇతర ఎన్నికలు కూడా ఉండే అవకాశం ఉండటంతో వ్యాపారం పెద్ద ఎత్తున సాగే అవకాశముందని భావించి ఫైనాన్స్ వ్యాపారులు పెట్టుబడులకు ముందుకొచ్చారు. ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ శ్రీరాములు, కర్నూలు, నంద్యాల ఏఈఎస్‌లు మహేష్‌కుమార్, ఆదినారాయణ మూర్తి పర్యవేక్షణలో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు టెండర్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. గతంలో దుకాణాలు పొందిన వాళ్లు ఈసారి కూడా తమ చేయి దాటకూడదని భావించి అనుచరులు, కుటుంబ సభ్యులతో పదుల సంఖ్యలో దరఖాస్తులు చేయించారు. గత ఏడాది 5,781 మంది దరఖాస్తు చేసుకోగా, ఈసారి 204 దుకాణాలకు 4,850 దరఖాస్తులు దాఖలయ్యాయి. అయితే అధికారులు 3,292 దరఖాస్తులను పరిశీలించి స్వీకరించారు. 1558 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. రాత్రి పొద్దుపోయే వరకు వాటిని పరిశీలించి ఆమోదించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వానికి రూ.20 కోట్లకు పైగా ఆదాయం దరఖాస్తు ఫీజుగా రూ.5 వేలు, రిజిస్ట్రేషన్ ఫీజు మండల కేంద్రాల్లో రూ.50 వేలు, నగర పంచాయతీలో రూ.75 వేలు, నగరపాలక సంస్థ పరిధిలో రూ.లక్ష చెల్లించాలి. దరఖాస్తు ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు తిరిగి ఇవ్వరు. ఈ లెక్కన దరఖాస్తు, రిజిస్ట్రేషన్ ఫీజుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఈ ఏడాది సుమారు రూ.20 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. నేడు అదృష్ట పరీక్ష లక్కీడిప్ ద్వారా మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. ఇందుకోసం జిల్లా పరిషత్ సమావేశ భవనంలో ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ హాజరై లక్కీడిప్‌ను ప్రారంభించనున్నారు. కర్నూలు డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఎక్సైజ్ కార్యాలయంతో పాటు లక్కీడిప్ జరగనున్న జిల్లా పరిషత్ ఆవరణం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం దుకాణాలు : 204 దాఖలైన దరఖాస్తులు : మున్సిపల్ ప్రాంతాలు : 309 కర్నూలు కార్పొరేషన్ : 144 నగర పంచాయతీలు : 99 మండల కేంద్రాలు : 2,740 -
రాష్ట్ర సరిహద్దుల్లో ఎక్సైజ్ అధికారుల దాడులు
వేలేరుపాడు : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో రెండు రాష్ట్రాల ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. సరిహద్దుల్లో ఉన్న వేలేరుపాడు మండలం మేడేపల్లి గ్రామంలో అక్రమంగా ఓ ఇంట్లో నిల్వఉంచిన 14 క్వింటాళ్ల బెల్లాన్ని పట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అశ్వారావుపేట మండలం గాండ్లగుడెం, అనంతారం, ఆసుపాక, దమ్మపేట మండలం వడ్లగుడెం, రంగువారిగుడెం, మందలపల్లి గ్రామాల్లో తొమ్మిది వందల లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. మూడు కేసులు నమోదు చేశారు. దాడుల్లో ఏలూరు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ నాగేంద్రరావు, తెలంగాణ రాష్ట్రం కొత్తగుడెం అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎస్.మధు, ఇరు రాష్ట్రాల సీఐలు అజయ్‌కుమార్‌సింగ్, రాజశేఖర్, రామ్మూర్తి, సిబ్బంది పాల్గొన్నారు. ææ సరిహద్దు గ్రామాల్లో సారా తయారీ ఏలూరు అర్బన్ : రాష్ట్ర సరిహద్దుల్లో సారా తయారీ యథేచ్ఛగా జరుగుతోందని ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ (డీసీ) వై.బి.భాస్కరరావు తెలిపారు. శుక్రవారం రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో సారా తయారీ కేంద్రాలపై జిల్లా ఎౖMð్సజ్ పోలీసులు దాడులు చేశారు. డీసీ భాస్కరరావు మాట్లాడుతూ దాడుల్లో సారా బట్టీ నిర్వహిస్తున్న ఒగెళ్ళ బుడ్డిరెడ్డిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి సారా తయారీకి ఉపయోగించే 10 కేజీల అమ్మోనియా, 350 కేజీల తెల్లబెల్లం, 966 కేజీల నల్లబెల్లం, రెండు కేజీల ఆలం స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఇదే క్రమంలో జిల్లాలో అనధికారికంగా మద్యం విక్రయిస్తున్న దుకాణాలపై దాడి చేసిన తమ సిబ్బంది రెండు షాపులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 19 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. దాడుల్లో ఏలూరు యూనిట్ సూపరింటెండెంట్ వై.శ్రీనివాసచౌదరి, ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ పి. సురేష్‌బాబు, సిబ్బంది పాల్గొన్నారని డీసీ తెలిపారు. -
అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ దాడులు
ఏలూరు అర్బన్ : జిల్లాలో సారాతో పాటు అక్రమ మద్యం అమ్మకం దార్లపై నిరంతరంగా తమ సిబ్బంది దాడులు నిర్వహిస్తుందని ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ (డీసీ) వైబీ భాస్కరరావు స్పష్టం చే శారు. శనివారం జిల్లావ్యాప్తంగా చింతలపూడి, కొవ్వూరు. పోలవరం, నరసాపురం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో ఎక్సైజ్ అ«ధికారులు సారా తయారీ కేంద్రాలు, అక్రమ మద్యం విక్రయాలు, సమయ వేళలు పాటించని దుకాణాలపై దాడులు నిర ్వహించారు. ఈ సందర్భంగా నిర్ణీత వేళలు పాటించని రెండు దుకాణాలపై కేసులు నమోదు చేశారు. అదే క్రమంలో సారా తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 100 లీటర్ల సారా, 18 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని డీసీ భాస్కరరావు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరిచామన్నారు. -
అక్రమార్కులపై చర్యలేవీ ?
గిరిజనులు, సాధారణ వ్యక్తులపై ప్రతాపం బడా శాల్తీలపై నామమాత్రపు కేసులు మొక్కుబడిగా పనిచేస్తున్న గుడుంబా నియంత్రణ కమిటీ జిల్లాలో కనుమరుగు కాని గుడుంబా సాక్షి, హన్మకొండ : పటిక, బెల్లం అమ్మకాలు, గుడుంబా తయారీ పేరు తో మహబూబాబాద్ ఎక్సైజ్ జిల్లా పరిధిలో ప్రతి ఏటా వేలాది కేసులు నమోదవుతున్నా గుడుంబా తయారీ ఆగడం లేదు. గుడుంబా వ్యాపారాన్ని శాసిస్తున్న బడా వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడంలో చూపిస్తున్న ఉదాసీనత కారణంగా ఈ పరిస్థితి తలెత్తుతోంది. మరోవైపు గుడుంబా తయారీనే జీవనోపాధిగా ఉన్న పేదలపై వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. మహబూబాబాద్ ఎక్సైజ్ పోలీసులు 2013–14 సంవత్సరంలో 1119 కేసులు నమో దు చేసి 420 మందిని అరెస్టు చేశారు. 2014–15 సంవత్సరంలో 1139 కేసులు నమోదు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ కేసుల సంఖ్య మరింతగా పెరిగింది. ఈ దశాబ్ధకాలంలో గుడుంబా అమ్మకాలు, తయారీ పేరుతో 25 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో వందల సంఖ్యలో యువకులు, మహిళలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. లోపాయికారి ఒప్పందం.. గుడుంబా నిర్మూలన చర్యలు కఠినతరం అవుతున్న కొద్దీ ఈ వ్యాపారంలో లాభాలు పెరుగుతున్నాయి. గుడుంబా తయారీకి ఉపయోగించే బెల్లాన్ని మార్కెట్ ధర కంటే రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు. ధర ఎంత పెంచినా డిమాండ్ తగ్గకపోవడంతో కొందరు ‘పెద్దలు’ ఈ బెల్లం అక్రమ వ్యాపారంలోకి అడుగుపెట్టాయి. తమ వ్యాపారానికి అడ్డురాకుండా ఉండేందుకు వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి ఇబ్బంది రాకుండాæ వీరు మేనేజ్ చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే దాడుల్లో పట్టుబడిన సందర్భాల్లో బడా శాల్తీలపై తేలికరకం కేసులు పెట్టడం, అదుపులోకి తీసుకోకుండా పరారీలో ఉన్నాడని పేర్కొంటూ ఎక్సైజ్, పోలీసుశాఖ నుంచి లోపాయికారీగా సహాయ సహకారాలు అందుతాయని ఈ వ్యాపారంలో ఆరితేరిన వ్యక్తులు చెబుతున్నారు. రెండు నెలల క్రితం బెల్లం అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అరగంట వ్యవధిలో ఆ వ్యక్తి పారిపోయినట్లు పేర్కొన్న ఉదం తం చర్చనీయాంశమైంది. గుడుంబా తయారీ, బెల్లం అక్రమ రవాణాలో భారీ లాభాలు చూసి సాధారణ వ్యక్తులు ఈ ఊబిలోకి వచ్చి కేసులతో విలవిలలాడుతున్నారు. మొక్కుబడి కమిటీ.. గుడుంబా నిర్మూలించేందుకు ఎక్సైజ్, పోలీసుశాఖలతో పాటు డీఆర్డీఏ పీడీ ఆధ్వర్యంలో ఎనిమిది నెలల కిందట ఏర్పాౖటెన గుడుంబా నియంత్రణ కమిటీ పనితీరు మొక్కుబడిగా మారింది. గుడుంబా ప్రభావిత ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, వాట్సప్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించడం ఈ కమిటీ విధులు. తమకు అందిన ఫిర్యాదులను ఎక్సైజ్, పోలీసు, రెవిన్యూ తదితర శాఖలకు అందించి తగు చర్యలు తీసుకునేలా పర్యవేక్షణ చేయాల్సి ఉంది. గుడుంబా నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లో గుడుంబాను అరికట్టకలిగాయి. అయితే మన జిల్లా కమిటీ పనితీరు మొక్కుబడి కార్యక్రమాలకే పరిమితం కావడంతో గుడుంబా వ్యాపారం యదేచ్ఛగా కొనసాగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. -
రేపు ఎక్సైజ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు
పాత శ్రీకాకుళం : జిల్లా అబ్కారీ శాఖ (ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్)లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లకు సంబంధించి వెల్ఫేర్ అసోషియేషన్ ఎన్నికలు ఈ నెల 21న పట్టణంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. సుమారు 253 మంది కానిస్టేబుళ్లు ఎన్నికల్లో పాల్గొంటారు. అందులో 18 మందిని కార్యవర్గంగా ఎంపిక చేస్తారు. ఎన్నికల అధికారులుగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్.శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఎస్వి రమణమూర్తి వ్యవహరిస్తారు.