రాష్ట్ర సరిహద్దుల్లో ఎక్సైజ్ అధికారుల దాడులు
Published Sat, Dec 24 2016 1:39 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 PM
వేలేరుపాడు : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో రెండు రాష్ట్రాల ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. సరిహద్దుల్లో ఉన్న వేలేరుపాడు మండలం మేడేపల్లి గ్రామంలో అక్రమంగా ఓ ఇంట్లో నిల్వఉంచిన 14 క్వింటాళ్ల బెల్లాన్ని పట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అశ్వారావుపేట మండలం గాండ్లగుడెం, అనంతారం, ఆసుపాక, దమ్మపేట మండలం వడ్లగుడెం, రంగువారిగుడెం, మందలపల్లి గ్రామాల్లో తొమ్మిది వందల లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. మూడు కేసులు నమోదు చేశారు. దాడుల్లో ఏలూరు ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ నాగేంద్రరావు, తెలంగాణ రాష్ట్రం కొత్తగుడెం అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎస్.మధు, ఇరు రాష్ట్రాల సీఐలు అజయ్‌కుమార్‌సింగ్, రాజశేఖర్, రామ్మూర్తి, సిబ్బంది పాల్గొన్నారు. ææ
సరిహద్దు గ్రామాల్లో సారా తయారీ
ఏలూరు అర్బన్ : రాష్ట్ర సరిహద్దుల్లో సారా తయారీ యథేచ్ఛగా జరుగుతోందని ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ (డీసీ) వై.బి.భాస్కరరావు తెలిపారు. శుక్రవారం రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో సారా తయారీ కేంద్రాలపై జిల్లా ఎౖMð్సజ్ పోలీసులు దాడులు చేశారు. డీసీ భాస్కరరావు మాట్లాడుతూ దాడుల్లో సారా బట్టీ నిర్వహిస్తున్న ఒగెళ్ళ బుడ్డిరెడ్డిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి సారా తయారీకి ఉపయోగించే 10 కేజీల అమ్మోనియా, 350 కేజీల తెల్లబెల్లం, 966 కేజీల నల్లబెల్లం, రెండు కేజీల ఆలం స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఇదే క్రమంలో జిల్లాలో అనధికారికంగా మద్యం విక్రయిస్తున్న దుకాణాలపై దాడి చేసిన తమ సిబ్బంది రెండు షాపులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 19 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. దాడుల్లో ఏలూరు యూనిట్ సూపరింటెండెంట్ వై.శ్రీనివాసచౌదరి, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఈఎస్ పి. సురేష్‌బాబు, సిబ్బంది పాల్గొన్నారని డీసీ తెలిపారు.
Advertisement