Sieze
-
హైదరాబాద్‌లో ‘డేట్ డ్రగ్’
సాక్షి, హైదరాబాద్ : డేట్ డ్రగ్ ఎంఫెటమైన్ (8.5 కేజీలు) భారీస్థాయిలో పట్టుబడింది. దీనిని రేప్ డ్రగ్ అని కూడా అంటారు. డేటింగ్ పేరుతో యువతులను తీసుకెళ్లి వారికి తెలియకుండా వారు తాగే నీరు, కూల్‌డ్రింక్స్‌లో కలిపి ఇచ్చేసి అప స్మారక స్థితిలోకి చేరాక అఘాయిత్యాలకు పాల్పడటానికి కొందరు ఈ డ్రగ్‌ను వినియోగిస్తారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ రూ.8.5 కోట్లు ఉంటుందని నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. డీసీపీలు సాధన రష్మి పెరుమాళ్, వైవీఎస్.సుధీంద్రలతో కలిసి సోమవారం ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో హైదరాబాద్ సీపీ ఆ వివరాలు వెల్లడించారు. బౌరంపేటకు చెందిన గోసుకొండ అంజిరెడ్డి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో చంద్రారెడ్డి గార్డెన్స్ పేరుతో ఫంక్షన్‌హాల్, స్విమ్మింగ్ పూల్ నిర్వహించేవాడు. సాయికుమార్‌గౌడ్, రాకే‹శ్ కొన్నాళ్ల క్రితం ఫార్మా కంపెనీల్లో పనిచేశారు. వీరికి కెమికల్ ప్రాసెసింగ్‌పై పట్టు ఉంది. వీరితో కలిసి అల్ప్రాజోలం తయారు చేయాలని అంజిరెడ్డి పథకం వేశాడు. కొత్తపల్లికి చెందిన ప్రభాకర్‌గౌడ్ సహకారంతో అదే గ్రామంలో ఓ కోళ్ల ఫారం అద్దెకు తీసుకున్నారు. అందులో ఓ గదిలో డ్రగ్స్ ప్రాసెసింగ్‌కు అవసరమైన రియాక్టర్ ఏర్పాటు చేశారు. అంజిరెడ్డి బాలానగర్ నుంచి ముడి సరుకులు ఖరీదు చేసి ఇచ్చేవాడు. వీటిని వినియోగించి సాయి, రాకేశ్‌లు అల్ప్రాజోలం, ఎంఫిటమైన్ తయారు చేసేవారు. డిప్రెషన్ వంటి రుగ్మతలకు వైద్యుల చీటీ ఆధారంగా విక్రయించే ఔషధాలను తయారు చేయడానికి ఈ రెండింటినీ వాడతారు. వీటిని దుర్వినియోగం చేస్తూ మాదకద్రవ్యాలుగా వీరు విక్రయించడం మొదలు పెట్టారు. టీజీ ఏఎన్‌బీకి ఫిర్యాదుతో....ల్యాబ్‌లో మిగిలిన రసాయన వ్యర్థాలను కొత్తపల్లి శివార్లలో పడేసేవారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అక్కడ వస్తున్న వాసనలతో స్థానికులు దీనిపై టీజీ ఏఎన్‌బీకి ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు జూన్ 18న దాడి చేసి అంజిరెడ్డి తదితరులను అరెస్టు చేసి 2.6 కేజీల అల్ప్రాజోలం స్వాధీనం చేసుకున్నారు. ఇదే ల్యాబ్‌లో అంజిరెడ్డి ఎంఫిటమైన్ తయారు చేయించాడు. అరెస్టు కావడానికి పదిరోజుల ముందు తన అనుచరుడైన కుంచల నాగరాజును పిలిచాడు.తన వద్ద ఉన్న 8.5 కేజీల ఎంఫిటమైన్‌ను అప్పగించి భద్రపర చాలన్నాడు. అంజిరెడ్డి అరెస్టు కావడం.. జైలుకు వెళ్లి రెండు నెలలు దాటినా అతడు బయటకు రాకపోవడంతో నాగరాజు ఆ సరుకును ముందు గ్రామం నుంచి నగరానికి చేరుద్దామని, ఆపై ఖరీదు చేయ డానికి ఆసక్తి చూపిన వారికి విక్రయిద్దామని భావించాడు. దీనికోసం వినోద్‌కుమార్‌గౌడ్, శ్రీశైలంలను సంప్రదించాడు. ఈ ముగ్గురూ కలిసి వాహనంలో ఎంఫిటమైన్ పెట్టుకొని బయలుదేరారు. దీనిపై హెచ్–న్యూకు సమాచారం అందింది. బోయిన్పల్లి చౌరస్తా వద్ద కాపుకాసి...ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, డానియేల్, బోయిన్ పల్లి ఇన్ స్పెక్టర్ బి.లక్ష్మీనారాయణరెడ్డి బోయిన్పల్లి చౌరస్తా వద్ద కాపుకాశారు. అటుగా వస్తున్న వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా ఎంఫిటమైన్ దొరికింది. దీంతో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి డ్రగ్‌తో పాటు వాహనం స్వాధీనం చేసుకున్నారు. ‘అత్యంత తీవ్ర ప్రభావం చూపే ఈ డ్రగ్‌ను ముక్కు ద్వారా పీల్చడం, నీరు/కూల్‌డ్రింక్స్‌లో కలిపి తాగడం, నీళ్లల్లో కలిపి ఇంజెక్షన్లా చేసుకోవడం ద్వారా సేవిస్తుంటారు.అనేక మందికి తెలియకుండానే దీనిని కూల్‌డ్రింక్‌లో కలిపి ఇచ్చి వారినీ బానిసలుగా మారు స్తారు. ఈ నేపథ్యంలోనే అపరిచితులు, డ్రగ్స్ అలవాటు ఉన్నవారు ఇచ్చే పార్టీలకు యువత వెళ్లకూడదు. ఈ కేసులో అంజిరెడ్డి కూడా నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం జైల్లో ఉన్న అతడిని పీటీ వారెంట్‌పై అరెస్టు చేస్తాం’ అని కొత్వాల్ శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. -
64 బస్సులను సీజ్ చేసిన అధికారులు
-
నయీమ్ ఆస్తుల జప్తు
సాక్షి, హైదరాబాద్ : పోలీసుల ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఆస్తుల జప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సిద్ధమవుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు నమోదైన కేసులు, సెటిల్మెంట్ల విషయాల్లో లభించిన ఆధారాలను దృష్టిలో పెట్టుకొని ఆస్తుల స్వాధీనం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గోవా, ముంబైలలో ఉన్న ఇళ్లు, స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు అనుసరించాల్సిన మార్గంపై సిట్ అధికారులు న్యాయశాఖ నుంచి ఇప్పటికే సలహా కూడా తీసుకున్నట్లు తెలియవచ్చింది. ఈ అంశంపై ప్రభుత్వానికి లేఖ రాసి ఉత్తర్వులు పొందేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మొదటి దఫాలో రూ. 140 కోట్ల ఆస్తి... నయీమ్ తన భార్య, సోదరి, అత్త, అనుచరుల పేర్లపైనే ఆస్తులు కూడబెట్టగా అతని భార్యతోపాటు సోదరి, అతడి దగ్గరి బంధువుల పేర్లపై ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకునేలా సిట్ అధారాలు సేకరించింది. వాటి ప్రస్తుత మార్కెట్ విలువను పరిశీలిస్తే... హైదరాబాద్‌లోని అల్కపురి కాలనీలో రెండు ఇళ్ల విలువ రూ. 6 కోట్లు. మణికొండలోని పంచవటి కాలనీలో 8 ప్లాట్ల విలువ సుమారు రూ. 4–5 కోట్లుగా అంచనా. పుప్పాలగూడలో 300 గజాల చొప్పున 12 ఓపెన్ ప్లాట్ల విలువ సుమారు రూ. 6 కోట్లు. షాద్‌నగర్‌లోని 12 ఎకరాల మామిడి తోట, ఫాంహౌస్‌ల విలువ సుమారు రూ. 25 కోట్లు. తుక్కుగూడలోని 10 ఎకరాల తోట, ఫాంహౌస్ విలువ సుమారు రూ. 35 కోట్లు. కరీంనగర్ శివారులోని నగునూర్‌లో రూ. 5 కోట్ల విలువైన వెంచర్. నల్లగొండలో నయీమ్ అనుచరుల పేరిట ఉన్న రెండు ఇళ్లు, 18 ఎకరాల భూమి విలువ రూ. 3.5 కోట్లు. మిర్యాలగూడలో నయీమ్ అత్త పేరిట ఉన్న ఇంటితోపాటు 4 ఎకరాల భూమి విలువ సుమారు రూ. 65 లక్షలు. భువనగిరి, యాదగిరిగుట్టలోని 16 వెంచర్లలో 180పైగా ఓపెన్ ప్లాట్ల (ఒక్కొక్కటి 250 గజాల నుంచి 300 గజాలు) విలువ సుమారు రూ. 12 కోట్ల నుంచి రూ. 18 కోట్లు. గోవాలోని కోకనట్ హౌస్‌తోపాటు మరో ఇల్లు గుర్తింపు. ఒక్కో ఇంటిని రూ. 2.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు నయీమ్ భార్య, సోదరి వాంగ్మూలంలో స్పష్టం చేశారు. వాటిని కూడా జప్తు జాబితాలో పెట్టారు. నాగోల్, సరూర్‌నగర్‌లో ఓ సెటిల్మెంట్లో నయీమ్ అనుచరులు శేషన్న, శ్రీధర్ల పేరిట ఉన్న రెండు ఫంక్షన్ హాళ్ల విలువ సుమారు రూ. 6 కోట్లు. నార్సింగిలో రూ. 2 కోట్ల విలువైన ఇల్లు, శంషాబాద్‌లోని పోలీస్‌హౌస్ విలువ రూ. 2 కోట్లు. కల్వకుర్తిలో 8 ఎకరాల భూమి విలువ రూ. 3.5 కోట్లు. మేడ్చల్‌లో 3 ఎకరాలు, శామీర్‌పేట్‌లో ప్రముఖ రిసార్ట్ సమీపంలో మరో 3 ఎకరాల భూమి గుర్తింపు. ఓ ప్రజాప్రతినిధితో చేసిన సెటిల్మెంట్లో పొందిన ఈ భూమి విలువ సుమారు రూ. 20 కోట్లు. మొయినాబాద్‌లో ఒక్కోటి రూ. 45 లక్షల విలువైన రెండు విల్లాలు. ఇందుకు అవసరమైన డబ్బు మొయినాబాద్‌లోని అజీజ్‌నగర్ ల్యాండ్ సెటిల్మెంట్తో వచ్చాయని నయీమ్ అనుచరుల వాంగ్మూలంలో సిట్ గుర్తించింది. ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో సుమారు రూ. 2 కోట్ల విలువైన రెండు ఇళ్లు. మొత్తం 1,130 ఎకరాలు... నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత సిట్ విచారణలో 210 మంది బాధితులు తమ భూములపై ఫిర్యాదు చేయగా వాటిలో ఆధారాలు గుర్తించింది మాత్రం కేవలం 46 కేసుల్లోనే. ప్రస్తుతం ఆ ఆస్తుల జప్తు కోసం సిట్ సమాయత్తమవుతోంది. నయీమ్ మొత్తం 1,130 ఎకరాల భూమి సంపాదించినట్లు గుర్తించినా ఈ కేసుల్లో ఆధారాలు దొరక్క అధికారులు తంటాలు పడుతున్నారు. 15 ఏళ్ల క్రితం జరిగిన ఈ సెటిల్మెంట్ల విషయంలో కొందరు బాధితులు ఫిర్యాదు చేసినా ఆ భూములు అనేక మంది చేతులు మారాయి. ప్రస్తుతం పొజిషన్లో ఉన్న వారి ఆదాయ వ్యవహారాలు, డాక్యుమెంట్లు, తదితరాలన్నీ పక్కాగా ఉండటంతో వాటిని స్వాధీనం చేసుకోవడం అంత సులభం కాదని తెలిసింది. అలాగే అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్ అయిన కొన్ని భూముల్లోనూ స్వాధీనం అంత సులభం కాదని సమాచారం. ఆదాయ మార్గాలు చూపించడంతోపాటు ఆస్తులను సీజర్ ప్రాపర్టీ నుంచి తొలగించుకునేందుకు ఏకంగా హైకోర్టుకు వెళ్లారని తెలిసింది. దీంతో సిట్ ఆ ఆస్తులను గుర్తించినా స్వాధీనానికి తగ్గ ఆధారాలు సంపాదించలేకపోయినట్లు తెలుస్తోంది. -
తిరుమలలో ఐదు హోటళ్లు సీజ్
తిరుమల: తిరుమలలో హోటళ్లపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అధికారులు కొరడా ఝుళిపించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఐదు హోళ్లను సీజ్ చేశారు. పలు హోటళ్లకు నోటీసులు జారీ చేశారు. తిరుమలలో హోటళ్లలో అధిక ధరలకు ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారని దాఖలైన పిటిషన్‌పై విచారించిన హైకోర్టు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో టీటీడీ అధికారుల్లో కదలిక వచ్చింది. -
విశాఖ మన్యం టు హైదరాబాద్
జీలుగుమిల్లి : ఎవరికీ అనుమానం రీతిలో గుట్టు చప్పుడు కాకుండా విశాఖ మన్యం నుంచి హైదరాబాద్‌కు తరలిపోతున్న గంజాయిని పక్కా సమాచారంతో జీలుగుమిల్లి పోలీసులు మంగళవారం రాత్రి పట్టుకున్నారు. మినీ బస్సులోని సీలింగ్‌లో దాచి తరలిస్తున్న సుమారు 400 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ మన్యం నుంచి హైదరాబాద్ తదితర ప్రాంతాలకు గంజాయి భారీగా రవాణా అవుతున్నట్టు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పోలవరం డీఎస్పీ ఏటీవీ రవికుమార్ బుధవారం విలేకరులకు వివరాలు తెలిపారు. గంజాయి తరలింపుపై పక్కా సమాచారం అందడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమై మంగళవారం రాత్రి జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టారు. మినీ బస్సు కొవ్వూరు, దేవరపల్లి, కొయ్యలగూడెం మూడు పోలీస్ స్టేషన్లను దాటుకుని జీలుగుమిల్లి సమీపంలో పోలీసులకు చిక్కింది. అయితే మూడు గంటల పాటు ఎంత తనిఖీ చేసినా గంజాయి ఆచూకీ లభ్యం కాలేదు. చివరకు మెకానిక్‌ను రప్పించి బస్సులోని సీలింగ్ రేకు బోల్టులు ఇప్పించి చూడగా అందులో గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. డీఎస్పీ, తహసీల్దార్ రాజశేఖరరావు సమక్షంలో గంజాయిని స్వా«ధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.40 లక్షలు ఉంటుందని డీఎస్పీ చెప్పారు. మినీ బస్సును సీజ్ చేసి విశాఖ జిల్లాకు చెందిన డ్రైవర్ ఈగల రమణ, హైదరాబాద్‌కు చెందిన లతీఫ్ వజీర్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్టు డీఎస్పీ చెప్పారు. కాగా లతీఫ్ వజీర్ విశాఖ మన్యంలో గంజాయి కొనుగోలు చేసి హైదబాద్‌కు తరలిస్తున్నట్టు సమాచారం. పోలవరం సీఐ బాలరాజు, ఎస్సై కాళీ చరణ్, ఏఎస్సై భాస్కర్, ఉమ ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. -
టన్నుకుపైగా గంజాయి స్వాధీనం
దేవరపల్లి: జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో వెయ్యి కిలోలకు పైగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.కోటి పైనే ఉం టుందని అంచనా. విశాఖ జిల్లాలోని అటవీ గ్రామాల నుంచి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల మీదుగా హైదరాబాద్‌కు పెద్దఎత్తున గంజాయి అక్రమ రవాణా అవుతోంది. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు దేవరపల్లి వద్ద విశాఖ జిల్లా రోలుగుంట గ్రామం నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న ఐషర్ వ్యాన్‌ను తనిఖీ చేయగా గంజాయి ఉన్నట్టు గుర్తించారు. కూరగాయల ప్లాస్టిక్ ట్రేల మధ్యన 32 బస్తాల గంజాయి మూటలను గుర్తించారు. వ్యాన్‌లో ఉన్న విశాఖకు చెందిన పిల్లా శ్రీను, అనకాపల్లి సమీపంలోని శకరం గ్రామానికి చెందిన వ్యాన్ డ్రైవర్లు చెరగడం సాయి, రోలుగుంటకు చెందిన మరో డ్రైవర్ కోనాల నూకరాజును అరెస్ట్ చేశారు. సాయంత్రం పోలీస్‌స్టేషన్ వద్ద జంగారెడ్డిగూడెం డీఎస్పీ వి. వెంకట్రావు వివరాలు వెల్లడించారు. విశాఖ జిల్లా రోలుగుంట గ్రామం నుంచి ఐషర్ వ్యాన్‌లో 32 బస్తాల్లో సుమారు 308 గంజాయి ప్యాకెట్లు హైదరాబాద్‌కు రవాణా అవుతున్నట్టు సమాచారం అందిందన్నారు. దేవరపల్లి వద్ద ఎస్సై పి.వాసు వ్యాన్‌ను పరి శీలించగా సుమారు 800 కిలోల గం జాయి ఉందన్నారు. వ్యాన్‌లో ఉన్న పిల్లా శ్రీను. శరగడం సాయి, కోనాల నూకరాజును అరెస్ట్ చేశామన్నారు. గంజాయి విలువ సుమారు రూ.80 లక్షల వరకు ఉంటుందని చె ప్పారు. గంజాయి రవాణాకు ప్రధాన సూత్రధారి అనకాపలి్లకి చెందిన శివ అని, ఆయన పేరునే వ్యాన్ ఉందన్నారు. శివపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. కొ వ్వూరు సీఐ శరత్‌రాజ్‌కుమార్, ఎస్సై పి.వాసు, సిబ్బందిని ఆయన అభినందించారు. లారీని ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి జగన్నాథపురం (గోపాలపురం) : గంజాయిని కారులో తరలిస్తుండగా లారీని ఢీకొట్టడంతో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందిన ఘటన గోపాలపురం మండలం జగన్నాథపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి హైదరాబాద్‌కు ఏపీ 37 ఏపీ 666 నంబర్ కారులో సుమారు 200 కిలోల గంజాయిను రవాణా చేస్తున్నారు. ఈ కారు గోపాలపురం మండలం జగన్నాథపురం వచ్చేసరికి జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రి వైపు వెళుతున్న లారీని ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా డ్రైవర్ మృతిచెందాడు. కారులో రెండు కిలోల చొప్పున 94 గంజాయి ప్యాకెట్లు ఉన్నాయని తహసీల్దార్ ఎన్.నరసింహమూర్తి తెలిపారు. వీటి విలువ రూ.20 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఎస్సై యు.లక్ష్మీనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ రాజమండ్రి సీటీఆర్ఐ ప్రాంతానికి చెందిన కె.వెంకటేశ్వరరావుగా భావిస్తున్నారు. కారులో డ్రైవర్‌తోపాటు మరో వ్యక్తి ఉన్నాడు. అతడి కాళ్లు, తలకు బలమైన గాయాలు కావడంతో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కారులో ఉన్న వివిధ నంబర్ ప్లేట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
టన్నుకుపైగా గంజాయి స్వాధీనం
దేవరపల్లి: జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో వెయ్యి కిలోలకు పైగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.కోటి పైనే ఉం టుందని అంచనా. విశాఖ జిల్లాలోని అటవీ గ్రామాల నుంచి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల మీదుగా హైదరాబాద్‌కు పెద్దఎత్తున గంజాయి అక్రమ రవాణా అవుతోంది. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు దేవరపల్లి వద్ద విశాఖ జిల్లా రోలుగుంట గ్రామం నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న ఐ షర్ వ్యాన్‌ను తనిఖీ చేయగా గంజాయి ఉన్నట్టు గుర్తించారు. కూరగాయల ప్లాస్టిక్ ట్రేల మధ్యన 32 బస్తాల గంజాయి మూటలను గుర్తించారు. వ్యాన్‌లో ఉన్న విశాఖకు చెందిన పిల్లా శ్రీను, అనకాపల్లి సమీపంలోని శకరం గ్రామానికి చెందిన వ్యాన్ డ్రైవర్లు చెరగడం సాయి, రోలుగుంటకు చెందిన మరో డ్రైవర్ కోనాల నూకరాజును అరెస్ట్ చేశారు. సాయంత్రం పోలీస్‌స్టేషన్ వద్ద జంగారెడ్డిగూడెం డీఎస్పీ వి. వెంకట్రావు వివరాలు వెల్లడించారు. విశాఖ జిల్లా రోలుగుంట గ్రామం నుంచి ఐషర్ వ్యాన్‌లో 32 బస్తాల్లో సుమారు 308 గంజాయి ప్యాకెట్లు హైదరాబాద్‌కు రవాణా అవుతున్నట్టు సమాచారం అందిందన్నారు. దేవరపల్లి వద్ద ఎస్సై పి.వాసు వ్యాన్‌ను పరి శీలించగా సుమారు 800 కిలోల గం జాయి ఉందన్నారు. వ్యాన్‌లో ఉన్న పిల్లా శ్రీను. శరగడం సాయి, కోనాల నూకరాజును అరెస్ట్ చేశామన్నారు. గంజాయి విలువ సుమారు రూ.80 లక్షల వరకు ఉంటుందని చె ప్పారు. గంజాయి రవాణాకు ప్రధాన సూత్రధారి అనకాపలి్లకి చెందిన శివ అని, ఆయన పేరునే వ్యాన్ ఉందన్నారు. శివపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. కొ వ్వూరు సీఐ శరత్‌రాజ్‌కుమార్, ఎస్సై పి.వాసు, సిబ్బందిని ఆయన అభినందించారు. లారీని ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి జగన్నాథపురం (గోపాలపురం) : గంజాయిని కారులో తరలిస్తుండగా లారీని ఢీకొట్టడంతో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందిన ఘటన గోపాలపురం మండలం జగన్నాథపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి హైదరాబాద్‌కు ఏపీ 37 ఏపీ 666 నంబర్ కారులో సుమారు 200 కిలోల గంజాయిను రవాణా చేస్తున్నారు. ఈ కారు గోపాలపురం మండలం జగన్నాథపురం వచ్చేసరికి జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రి వైపు వెళుతున్న లారీని ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా డ్రైవర్ మృతిచెందాడు. కారులో రెండు కిలోల చొప్పున 94 గంజాయి ప్యాకెట్లు ఉన్నాయని తహసీల్దార్ ఎన్.నరసింహమూర్తి తెలిపారు. వీటి విలువ రూ.20 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఎస్సై యు.లక్ష్మీనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ రాజమండ్రి సీటీఆర్ఐ ప్రాంతానికి చెందిన కె.వెంకటేశ్వరరావుగా భావిస్తున్నారు. కారులో డ్రైవర్‌తోపాటు మరో వ్యక్తి ఉన్నాడు. అతడి కాళ్లు, తలకు బలమైన గాయాలు కావడంతో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కారులో ఉన్న వివిధ నంబర్ ప్లేట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
రాష్ట్ర సరిహద్దుల్లో ఎక్సైజ్ అధికారుల దాడులు
వేలేరుపాడు : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో రెండు రాష్ట్రాల ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. సరిహద్దుల్లో ఉన్న వేలేరుపాడు మండలం మేడేపల్లి గ్రామంలో అక్రమంగా ఓ ఇంట్లో నిల్వఉంచిన 14 క్వింటాళ్ల బెల్లాన్ని పట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అశ్వారావుపేట మండలం గాండ్లగుడెం, అనంతారం, ఆసుపాక, దమ్మపేట మండలం వడ్లగుడెం, రంగువారిగుడెం, మందలపల్లి గ్రామాల్లో తొమ్మిది వందల లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. మూడు కేసులు నమోదు చేశారు. దాడుల్లో ఏలూరు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ నాగేంద్రరావు, తెలంగాణ రాష్ట్రం కొత్తగుడెం అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎస్.మధు, ఇరు రాష్ట్రాల సీఐలు అజయ్‌కుమార్‌సింగ్, రాజశేఖర్, రామ్మూర్తి, సిబ్బంది పాల్గొన్నారు. ææ సరిహద్దు గ్రామాల్లో సారా తయారీ ఏలూరు అర్బన్ : రాష్ట్ర సరిహద్దుల్లో సారా తయారీ యథేచ్ఛగా జరుగుతోందని ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ (డీసీ) వై.బి.భాస్కరరావు తెలిపారు. శుక్రవారం రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో సారా తయారీ కేంద్రాలపై జిల్లా ఎౖMð్సజ్ పోలీసులు దాడులు చేశారు. డీసీ భాస్కరరావు మాట్లాడుతూ దాడుల్లో సారా బట్టీ నిర్వహిస్తున్న ఒగెళ్ళ బుడ్డిరెడ్డిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి సారా తయారీకి ఉపయోగించే 10 కేజీల అమ్మోనియా, 350 కేజీల తెల్లబెల్లం, 966 కేజీల నల్లబెల్లం, రెండు కేజీల ఆలం స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఇదే క్రమంలో జిల్లాలో అనధికారికంగా మద్యం విక్రయిస్తున్న దుకాణాలపై దాడి చేసిన తమ సిబ్బంది రెండు షాపులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 19 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. దాడుల్లో ఏలూరు యూనిట్ సూపరింటెండెంట్ వై.శ్రీనివాసచౌదరి, ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ పి. సురేష్‌బాబు, సిబ్బంది పాల్గొన్నారని డీసీ తెలిపారు. -
పర్సు దొంగ అరెస్ట్
జంగారెడ్డిగూడెం : స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో కొంతకాలంగా పర్సు దొంగతనాలకు పాల్పడుతున్న ఓ బాలికను (15) అరెస్టు చేసి రూ.7 లక్షల విలువైన 30 కాసుల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ జె.వెంకటరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట బీసీ కాలనీకి చెందిన బాలిక కొంతకాలంగా ఆర్టీసీ బస్టాండ్‌లో మహిళల పర్సుల దొంగతనాలకు పాల్పడుతోంది. గతంలో బాలిక ఏలూరు సంతలో పర్సు దొంగతనాలకు పాల్పడి పోలీసులకు పట్టుబడి జువైనల్ హోమ్‌కు తరలించారు. హోమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా బాలిక చోరీలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్‌లో పట్టణానికి చెందిన షేక్ సమీలా, పోతవరానికి చెందిన నున్న లక్ష్మి, దమ్మపేట మండలం నారావారిగూడానికి చెందిన తెల్లమేకల లక్షి్మకి చెందిన పర్సులను దొంగిలించింది. పర్సుల్లోని బంగారాన్ని జంగారెడ్డిగూడెంలో విక్రయించేందుకు స్థానిక మునిసబుగారి వీధిలో సంచరిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక నుంచి 30 కాసుల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన సీఐ జి.శ్రీనివాసయాదవ్, ఎస్సై ఎం.కేశవరావు, ఐడీ పార్టీ హెడ్‌కానిస్టేబుళ్లు ఎ¯ŒSవీ సంపత్‌కుమార్, ఎ¯ŒS.రాజేంద్రప్రసాద్, కానిస్టేబుళ్లు రాజశేఖర్, కిరణ్‌కుమార్, మహిళా కానిస్టేబుళ్లు సునీతను అభినందించారు. వీరికి రివార్డు కోసం జిల్లా ఎస్పీకి సిఫార్సు చేస్తామని చెప్పారు. -
25 ప్రైవేట్ వాహనాలు సీజ్
హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 25 ప్రైవేట్ వాహనాలను ఆర్టీఏ అధికారులు శనివారం ఉదయం సీజ్ చేశారు. నగరంలోని హయత్‌నగర్ సమీపంలోని విజయవాడ జాతీయ రహదారిపై ఆర్టీఏ అధికారులు శనివారం ఉదయం వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ప్రయాణికులను చేరవేస్తున్న 25 వాహనాలను సీజ్‌చేశారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. -
రెంజల్లో కార్డన్ సెర్చ్
రెంజల్(నిజామాబాద్): రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట గ్రామంలో గురువారం ఉదయం (నిర్బంధ తనిఖీ) కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. బోధన్ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కోటగిరి, బోధన్, ఎడపల్లి, రెంజల్ ఎస్సైలతో పాటు పలువురు ప్రత్యేక సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఎలాంటి లెసైన్స్‌లు లేని 12 బైక్‌లను, ఓ ట్రాక్టర్‌ను ఇప్పటి వరకూ సీజ్ చేశారు. తనిఖీలు కొనసాగుతున్నాయి. -
75 బస్తాల యూరియా సీజ్
► లక్ష్మీఎంటర్ ప్రైజెస్ ఎరువుల దుకాణంపై కేసు నమోదు ► అధిక ధరలకు ఎరువులు అమ్మితే చర్యలు చల్లవానిపేట(జలుమూరు): ఎరువులు అధిక ధరలకు అమ్మితే వారిపై కేసులు నమోదుచేసి శాఖపరంగా చర్యలు తీసుకుంటామని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు వ్యవసాయాశాఖ సహాయ సంచాలకులు ఎస్‌జేవీ రామ్మోహనరావు అన్నారు. చల్లవానిపేటలో లక్ష్మీఎంటర్ ప్రైజెస్ ఎరువుల దుకాణాన్ని ఆయన సోమవారం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి అక్రమంగా నిల్వ ఉన్న 75 బస్తాల యూరియాను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ప్రధానంగా ఎరువులు అమ్మకాలకు తగిన లైసెన్స్‌లు, అనుమతులు ఉన్నాయా లేదా అన్నది పరిశీలించారు. అమ్మే ఎరువులు అనుమతి ఉన్న డీలర్లు వద్ద నుంచి తెస్తున్నారా లేదా సరిచూశారు. పురుగు మందులను నిశితంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొందరు ఎరువుల వ్యాపారులు వ్యాపారం లేదని రికార్డులు చూపడంలేదని, అలాంటి వాటిని పరిశీలించి సంబంధిత లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశాలు మేరకు ఇలా జిల్లాలో రెండు బృందాలతో ముమ్మర తనిఖీలు చేసి, తుది నివేదిక ఉన్నతాధికారులకు పంపనున్నామన్నారు. ఆయనతో పాటు పెనుగొండ ఏవో వై.రాఘవేంద్రరావు, ఏవో విజయభాస్కరరావు, ఎంపీఈవో పి.రాజశేఖర్ తదితరులు ఉన్నారు. -
కారులో కోటి రూపాయలు లభ్యం
గుంటూరు: కారులో అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయలను గుంటూరు జిల్లా పోలీసులు గురువారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. జిల్లాల్లో రోజువారి తనిఖీల్లో భాగంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం వెలటూరులో చేపట్టిన తనిఖీల్లో కారులో అక్రమంగా తరలిస్తున్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదు గురించి పోలీసులు ప్రశ్నించగా ఖచ్చితమైన సమాధానం లభించకపోవడంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ప్రయాణిస్తున్న కారును సీజ్ చేసి కేసు నమోదు చేశారు.