File photo
కారులో కోటి రూపాయలు లభ్యం
Published Thu, Jul 31 2014 6:22 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
గుంటూరు: కారులో అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయలను గుంటూరు జిల్లా పోలీసులు గురువారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. జిల్లాల్లో రోజువారి తనిఖీల్లో భాగంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు.
గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం వెలటూరులో చేపట్టిన తనిఖీల్లో కారులో అక్రమంగా తరలిస్తున్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న నగదు గురించి పోలీసులు ప్రశ్నించగా ఖచ్చితమైన సమాధానం లభించకపోవడంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ప్రయాణిస్తున్న కారును సీజ్ చేసి కేసు నమోదు చేశారు.
Advertisement
Advertisement