Illegal cash
-
భారీగా నగదు, బంగారం, మద్యం పట్టివేత
దాదర్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అక్రమ డబ్బు రవాణాపై వివిధ శాఖల అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించాయి. అందులో భాగంగా అక్టోబరు 20వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ముంబై, ఉప నగరాలు సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర పోలీసులు, ఎక్సైజ్ శాఖ, ఆదాయ పన్ను శాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు సంయుక్తంగా తనిఖీలు, నాకా బందీలు నిర్వహించారు. ఇందులో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అక్రమంగా తరలిస్తున్న భారీ నగదు, విదేశీ డాలర్లు, బంగారు, వెండి ఆభరణాలు, మద్యం పట్టుకున్నారు. అయితే ఈ సొత్తు ఎవరిది..? ఎవరికి అందజేయడానికి వెళుతున్నారనే సమాచారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. రూ.187 కోట్ల విలువైన నగదు స్వాధీనం ఎన్నికలు సమీపించడంతో వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి అక్రమంగా డబ్బు, మద్యం రవాణా కావడం పరిపాటిగా మారింది. నాకాబందీలు, తనిఖీలు నిర్వహించినప్పటికీ పోలీసుల కళ్లు గప్పి అక్రమంగా డబ్బు, మద్యం రవాణా అవుతూనే ఉంది. అయినప్పటికీ పోలీసులు, వివిధ శాఖల అధికారులు డేగ కళ్లతో కాపుకాస్తూ కోట్లలో అక్రమ డబ్బు, డ్రగ్స్, మద్యాన్ని పట్టుకుంటున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచి్చన తరువాత వివిధ శాఖల పోలీసులు, అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఇప్పటి వరకు ఏకంగా రూ.187.88 కోట్లు విలువచేసే సొత్తు హస్తగతం చేసుకున్నారు. ఇందులో రాష్ట్ర పోలీసు శాఖ ద్వారా రూ.75 కోట్లు, ఎక్సైజ్ శాఖ ద్వారా రూ.60 కోట్లు, ఆదాయ పన్ను శాఖ ద్వారా రూ.11 కోట్లు, మిగతా ఎన్నికల అధికారుల ద్వారా పట్టుకున్న సొత్తు ఉంది. అలాగే అక్రమంగా మద్యం తరలిస్తున్న, విక్రయిస్తున్న వారిపై 2,637 కేసులు నమోదు చేశారు. అందుకు బాధ్యులైన 2,460 నిందితులపై చర్యలు తీసుకున్నారు.అలాగే రూ.9.61 కోట్లు విలువచేసే మద్యం నిల్వలను జప్తు చేశారు. జప్తు చేసిన మద్యంలో విదేశీ, దేశీ, నాటుసారా, తెల్లకల్లు ఉన్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు తాము ప్రయతిస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అప్పర్ కమిషనర్ ప్రసాద్ సుర్వే అన్నారు. ఎన్నికల సమయంలో పార్టీ కార్యకర్తలను, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు భారీగా మద్యం వినియోగించే అవకాశాలుంటాయి. దీంతో అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు దాడులు, తనఖీలు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రహస్య పార్టీలపై నిఘా.. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అన్ని పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పరితపిస్తున్నారు. అందుకు ఎంతైనా ఖర్చు చేయడానికి వెనకాడటం లేదు. కార్యకర్తలు సహా ఓటర్లను సంతోష పెట్టేందుకు రహస్యంగా మద్యం పారీ్టలు ఇస్తున్నారు. అంతేగాకుండా ఇంటింటికి వెళ్లి మద్యం బాటిళ్లు, డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు పంచుతుంటారు. దీంతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు ఇలాంటి రహస్య పారీ్టలపై నిఘా వేస్తున్నారు. అందుకు 56 ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు. కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న 164 మంది కార్యకర్తలను అదపపులోకి తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణాకు చెక్ పేట్టేందుకు సరిహద్దు ప్రాంతాల్లో 25 పరి్మనెంట్ చెక్ పోస్టులు, 26 తాత్కాలిక చెక్ పోçస్టులను ఏర్పాటు చేశారు. టోల్ నాకాల వద్ద కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అహిల్యనగర్–పుణే జాతీయ రహదారిపై పార్నెర్ తాలూకా హద్దులో ఎన్నికల అధికారులు, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలో ఓ వాహనంలో సుమారు రూ.25 కోట్లు విలువచేసే బంగారం పట్టుకున్నారు. అయితే కార్టన్ బాక్స్‌లో ప్యాకింగ్ చేసిన ఈ బంగారం ఎవరిచ్చారు..? ఎవరికిచ్చేందుకు తీసుకెళుతున్నారనే వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. వాహనంలో డ్రైవర్, మరో ఇద్దరు వ్యక్తులున్నారు. అనుమానం వచ్చి వాహనాన్ని మరోసారి క్షుణ్ణంగా తనిఖీ చేయగా 45 కేజీల వెండి కడ్డీలు లభించాయి. దర్యాప్తు పూర్తయితే తప్ప పూర్తి వివరాలు బయటపడవని పోలీసులు చెబుతున్నారు. రాష్ట్రంలో 160 చెరుకు క్రషింగ్ ఫ్యాక్టరీలు, 36 దేశీ మద్యం తయారీ ఫ్యాక్టరీలు, 45 బీరు తయారుచేసే ఫ్యాక్టరీలు, 65 వైనరీ, 48 విదేశీ మద్యం తయారీ ఫ్యాక్టరీలు అలాగే 216 నాటుసారా విక్రయించే షాపులు, 262 విదేశీ మద్యం విక్రయించే షాపులు, 1,734 వైన్ షాపులు, 4,155 దేశీ మద్యం విక్రయించే షాపులున్నాయి. దీంతో ఓటింగ్, కౌంటింగ్ తంతు పూర్తయ్యేంత వరకు హోల్‌సెల్, రిటైల్ మద్యం షాపులపై సీసీ టీవీ కెమరాల ద్వారా నిఘా వేయనున్నారు. ప్రభుత్వ వాహనాలనూ వదిలిపెట్టొద్దు.. ఎన్నికలకు ముందు విచ్చల విడిగా అక్రమంగా డబ్బు రవాణా జరుగుతుంది. అందుకు సొంత, అద్దె వాహనాలతోపాటు పోలీసు వ్యాన్లను కూడా వినియోగించే ప్రమాదం లేకపోలేదు. అధికార దురి్వనియోగానికి పాల్పడుతూ కొందరు నేతలు పోలీసు జీపులు, వ్యాన్లలో డబ్బు రవాణా చేసే ఆస్కారముంది. దీంతో రాష్ట్ర సరిహద్దుల్లో, నగరాలు, పట్టణాల్లో నాకాబందీలు, తనిఖీలు చేసే సమయంలో పోలీసు వాహనాలతోపాటు ప్రభుత్వ వాహనాలను కూడా తనిఖీ చేయకుండా వదిలిపెట్టవద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. -
ఒడిశాలో ఐటీ దాడులు..156 సంచుల్లో డబ్బు
భువనేశ్వర్/రాంచీ: ఒడిశాకు చెందిన డిస్టిలరీ గ్రూప్‌పై ఆదాయ పన్ను శాఖ అధికారులు కొనసాగిస్తున్న సోదాల్లో కళ్లు చెదిరే రీతిలో కట్టల కొద్దీ అక్రమ నగదు బయటపడుతోంది. గురువారం బొలంగీర్‌లోని బల్దేవ్ సాహు అండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో జరిపిన తనిఖీల్లో రూ.200 కోట్ల నగదు బయటపడింది. శుక్రవారం బొలంగీర్ జిల్లా సుదపడలో జరిపిన సోదాల్లో నిండా కరెన్సీ నోట్లున్న 156 సంచులను గుర్తించారు. వీటిలో ఏడు బ్యాగుల్లో నగదును లెక్కించగా రూ.20 కోట్లుగా తేలిందని అధికారులు తెలిపారు. దీంతో, ఇప్పటి వరకు లభ్యమైన డబ్బు రూ.220 కోట్లకు చేరుకుందన్నారు. లిక్కర్ కంపెనీతో సంబంధాలున్నట్లు అనుమానాలున్న జార్ఖండ్ ఎంపీ సెల్‌ఫోన్ స్విచ్ఛాప్ వస్తోందని పీటీఐ తెలిపింది. రాంచీలోని ఆయన కార్యాలయం సిబ్బంది కూడా ఎంపీ అందుబాటులో లేరని చెబుతున్నారు. పన్ను ఎగవేత ఆరోపణలపై ఐటీ అధికారులు మూడు రోజులుగా డిస్టిలరీ గ్రూప్ సంస్థలకు చెందిన సంబల్పూర్, బొలంగీర్, తితిలాగఢ్, సుందర్‌గఢ్, రూర్కెలా, భువనేశ్వర్లలో తనిఖీలు సాగిస్తున్నారు. -
1.86 కోట్ల నగదు పట్టివేత
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా పోలీసులు జరుపుతున్న తనిఖీల్లో బుధవారం ఒక్కరోజే రూ.1,86,44,340 డబ్బు పట్టుబడింది. దీంతో ఇప్పటివరకు పట్టుబడ్డ నగదు రూ.9,66,26,006కు చేరింది. డిపాజిట్ చేసిన లైసెన్స్డ్ ఆయుధాల సంఖ్య 8,463కు చేరుకోగా, 39 ఆయుధాల లైసెన్స్‌లను రద్దు చేశారు. స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం విలువ రూ.53 లక్షలకు, ఆభరణాల విలువ రూ.2.66 కోట్లకు చేరింది. -
ఇసుక తోడేళ్లు
- చిన్న హగిరిలో యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్న అక్రమార్కులు - ప్రతిరోజుకు 40 ట్రాక్టర్ల ఇసుక దోపిడీ - చోద్యం చూస్తున్న అధికారులు డి.హీరేహాళ్ : చిన్న హగిరి ఒకప్పుడు ప్రతి ఒక్కరికి సెలయేరు. మూడు అడుగులు తవ్వితే నీళ్లు ఉబికేవి. అయితే ప్రస్తుతం ఇసుక తవ్వకాలు చేపడుతుండటంతో ఉన్న నీరు కూడా ఆవిరైంది. చిన్న హగిరికి ఇరువైపున ఉన్న పొలాల్లో 100 అడుగుల లోపే నీరు సమృద్ధిగా ఉండటంతో పచ్చని పొలాలతో కళకళలాడుతూ ఉండేవి. గొర్రెలు, పశువుల కాపరిలకు కూడా ఇబ్బందులు ఉండేవి కావు. కాని నేడు ఇక్కడున్న ఇసుక కర్ణాటకకు తరలిస్తుండటంతో కనుచూపు మేరలో పచ్చని పొలాలు కనిపించవు. పల్లెల్లో పది మందికి అన్నం పెట్టె రైతులు నేడు బోరు బావుల్లో నీరు లేకపోవడంతో పంట పొలాలను బీళ్లుగా వదిలేసి ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లిపోయారు. కాసులు కురిపిస్తున్న ఇసుక ఇసుక... కాసుల వర్షం కురుపిస్తుండటంతో తెలుగు తమ్ముళ్ళు రెచ్చిపోతున్నారు. అడ్డదిడ్డంగా ఇసుకను తోడేస్తున్నారు. రోజుకు 30 నుండి 40 ట్రాక్టర్లు ఇసుకను ఇక్కడి నుంచి అక్రమంగా తరలిపోతోంది. ప్రస్తుతం బాదనహాళ్, చెర్లోపల్లి, మైలాపురం నుండి ఇసుకను దర్జాగా ట్రాక్టర్లలో తరలిస్తూ కర్ణాటక సరిహద్దుల్లో నిలువ చేసి రాత్రికి రాత్రి బెంగళూరుకు తీసుకెళ్తున్నా అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కర్ణాటకలోనే డంప్ ఓబుళాపురం సరిహద్దు ప్రాంతాల్లో నిలువ చేసేందుకు కూడా ఒక రెవెన్యూ అధికారికి కర్ణాటకలోని ఒక ఇసుక మాఫీయా లీడర్ లక్షల్లో ముట్టచెప్పారన్న ఆరోపణలున్నాయి. ఓబుళాపురం సమీపంలోని కర్ణాటక సరిహద్దున, సోమలాపురం సమీపంలో ఉన్న కరిడిపల్లి వద్ద ఇసుకను డంప్ చేస్తున్నారు. ప్రస్తుతం ఒక ట్రాక్టర్ ఇసుక కర్ణాటక సరిహద్దుల్లో చేరవేస్తే రూ.5 వేలు ఇస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌తో రోజుకు 6 నుండి 8 ట్రిప్పుల ఇసుకను తీసుకెళ్తున్నారు. అన్నీ గుంతలే.. ఓబుళాపురం, డి.హీరేహాళ్, గ్రామాల వారే ఈ ఇసుకను రవాణా చేస్తున్నారు. మా గ్రామ సమీపంలో ఇసుక ఉన్నా మేముందుకు ఇసుక రవాణా చేయకూడదంటూ కొంతమంది అధికారులతో మంతనాలు జరుపుతున్నారు. ప్రస్తుతం చిన్న హగరిలో 30 నుండి 40 గోతులు తవ్వడంతో హగరి పక్కన ఉన్న పంట పొలాలు బీళ్లుగా మారాయి. అధికారులు కఠిన చర్యలు తీసుకొంటే తప్ప ఇసుక తరలింపు ఆగని పరిస్థితి ఉంది. పట్టించుకునేవాళ్లు లేరు – పరమేశ్వరప్ప, బాదనహాళ్ నాకు 16 ఎకరాలు భూమి ఉంది. ఒకప్పుడు నీరు సమృద్ధిగా ఉండేది. ప్రస్తుతం బోర్లలో నీరు రాకపోవడంతో రెండు ఎకరాలకు కూడా నీరు చాలడం లేదు. చిన్న హగరిలో ఇసుక తరలిపోతుండటంతో బోర్లలో రోజురోజుకు నీళ్లు తగ్గిపోతున్నాయి. అధికారులు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. అభివృద్ధి పనులకు మాత్రమే అనుమతి – ఖతిజిన్ ఖుప్రా, తహసీల్దార్ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకు మాత్రమే ఇసుక తరలింపునకు అనుమతిస్తున్నాం. కర్ణాటకకు ఇసుకను తరలిస్తూ పట్టుబడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ప్రస్తుతం గత వారం రోజులుగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల వివరాలు, నెంబర్లు నోట్ చేసుకున్నాం. రాత్రి వేళలో సిబ్బందితో నిఘా ఉంచుతున్నాం. -
రూ. 60 కోట్ల డబ్బు సీజ్
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఐదు రాష్ట్రాల్లో అక్రమంగా తరలిస్తున్న, దాచిన డబ్బును 60 కోట్ల రూపాయలకుపైగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అసోంలో ఎన్నికలు పూర్తికాగా, పశ్చిమబెంగాల్లో రెండో విడత పోలింగ్ ముగిసింది. పశ్చిమబెంగాల్లో మరో నాలుగు విడతలతో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఎన్నికలు జరగాల్సివుంది. ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో తమిళనాడులో ఎక్కువ డబ్బును అధికారులు సీజ్ చేశారు. తమిళనాడులో 24.55 కోట్లు, అసోంలో 12.33 కోట్లు, పశ్చిమబెంగాల్లో 12.14 కోట్లు, కేరళలో 10.41 కోట్లు, పుదుచ్చేరిలో 60.88 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్లు తనిఖీలు చేపడుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే మార్చి 4 నుంచి కోడ్ అమల్లోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్లో మరో నాలుగు విడతల్లో పోలింగ్ జరగాల్సివుండగా, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలలో ఒకే విడతో మే 16న ఎన్నికలు నిర్వహించనున్నారు. -
కారులో కోటి రూపాయలు లభ్యం
గుంటూరు: కారులో అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయలను గుంటూరు జిల్లా పోలీసులు గురువారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. జిల్లాల్లో రోజువారి తనిఖీల్లో భాగంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం వెలటూరులో చేపట్టిన తనిఖీల్లో కారులో అక్రమంగా తరలిస్తున్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదు గురించి పోలీసులు ప్రశ్నించగా ఖచ్చితమైన సమాధానం లభించకపోవడంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ప్రయాణిస్తున్న కారును సీజ్ చేసి కేసు నమోదు చేశారు. -
ధన ప్రవాహం
బయటపడుతున్న అక్రమ నగదు, మద్యం పోలీసుల తనిఖీల్లో రూ.1.32 కోట్లు స్వాధీనం 43,919 మద్యం బాటిళ్లు సీజ్ 26 కిలోల వెండి, 901 చీరలు కూడా తనిఖీలో భారీగా పేలుడు పదార్థాలు లభ్యం ఎన్నికల్లో ధన ప్రవాహం విపరీతంగా ఉంది. కోట్లకు కోట్లు చేతులు మారుతున్నాయి. మద్యం పారుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు నిర్వహించిన త నిఖీల్లో రూ.1.32 కోట్లకు పైగా నగ దును అక్రమంగా తరలిస్తుం డగా పోలీసు, ఇతర తనిఖీ బృందాలు పట్టుకున్నాయి. 43,919 మద్యం బాటిళ్లను సీజ్ చేశాయి. ఇంత భారీ స్థాయి లో డబ్బు, మద్యం దొరకడం.. అధికారులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విశాఖ రూరల్, న్యూస్‌లైన్: సాధారణ ఎన్నికల్లో విజయం కోసం అభ్యర్థులు కోట్లకు కోట్లు కుమ్మరిస్తున్నారు. ధన ప్రవాహాన్ని అడ్డుకొనేందుకు జిల్లా యంత్రాంగం 52 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది. ఒక్కో నియోజకవర్గంలో మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు, మూడు స్టాటిక్ ఫోర్స్‌లను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ కొంత మంది డబ్బు, మద్యం తరలిస్తూ పట్టుబడుతూనే ఉన్నారు. భీమిలిలో అధికం : నగరంలోనే కాకుండా గ్రామాల్లో కూడా భారీగా డబ్బు, మద్యం పంపిణీ జరుగుతోంది. అందుకు తనిఖీ బృందాలకు దొరికిన డబ్బు, మద్యంమే నిదర్శనం. ప్రధానంగా భీమిలి నియోజకవర్గం పరిధిలో అత్యధికంగా రూ.31,90,355, 1245 మద్యం బాటిళ్లు దొరికాయి. ఇక్కడ ఊడు కార్డు, 13 ఆటోలు, 2 వ్యాన్లు, ఒక మోటర్ సైకిల్, ఒక టాటా ఏస్‌లను స్వాధీనం చేసుకొని 21 మందిపై కేసులు పెట్టారు. అలాగే యలమంచిలిలో రూ.25,58,990 నగదు, 2072 మద్యం బాటిళ్లతో పాటు 109 చీరలను అధికారులు స్వాధీనం చేసుకొని 49 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అనకాపల్లిలో రూ.25,27,950 నగదు, 2029 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకోగా ఒక బొలెరో, 3 స్కార్పియోలు, 5 కార్లు, ఒక ఆటో, ఒక మోటర్ సైకిల్‌ను సీజ్ చేశారు. నర్సీపట్నంలో రూ.15,31,790 నగదు, 5804 మద్యం బాటిళ్లు పట్టుకున్నారు. పెందుర్తిలో నిర్వహించిన తనిఖీల్లో డబ్బు దొరకకపోయినప్పటికీ 26 కేజీల వెండిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో భారీగా డబ్బు, మద్యం, చీరలు, జాకెట్లు, బయటపడింది. మొత్తంగా రూ.కోటి 32 లక్షల 20 వేల 4 వందలు నగదు, 43,919 మద్యం బాటిళ్లు, 26 కిలోల వెండి, 901 చీరలు, 110 జాకెట్లు, 20 టవళ్లు, 30 స్టీల్ బేసిన్లు, 6 సెల్ఫోన్లు, 86 మోడల్ బ్యాలెట్ పేపర్లు పట్టుకోగా 15 కార్లు, 14 జీపులు, 1 బొలెరో, 40 ఆటోలు, 22 మోటర్ సైకిళ్లు, ఒక మోపెడ్, ఒక బార్వెల్ లారీ, ఒక లారీ, 5 వ్యాన్లు, 2 టాటా ఏస్‌లు, 3 స్కార్పియోలను అధికారులు సీజ్ చేశారు. 382 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. తనిఖీల్లో భారీగా పేలుడు పదార్థాలు భారీగా పేలుడు పదార్థాలు లభ్యమవుతున్నాయి. ఏజెన్సీలోనే కాకుండా మైదాన ప్రాంతాల్లో కూడా పేలుగు పదార్థాలు దొరుకుతుండడం అధికారులను కలవరపెడుతోంది. అరకులో నిర్వహించిన తనిఖీల్లో 60 కేజీల అమ్మోనియం సల్ఫేట్‌ను అధికారులు గుర్తించారు. అలాగే అనకాపల్లిలో తరలిస్తున్న 447 జిలటిన్ స్టిక్స్, ఒక ఎలక్ట్రికల్ డిటోనేటర్, ఒక బ్యాటరీ, 2 వైర్ బండిల్స్‌ను అధికారులు పట్టుకున్నారు. యలమంచిలిలో నిర్వహించిన తనిఖీల్లో 5 కిలోల సూరేకారం, కేజీ బొగ్గు, 30 రాకెట్లు దొరికాయి. దీంతో తనిఖీ బృందాలను మరింత విస్తరించి నిశితంగా ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయిస్తున్నారు.