భువనేశ్వర్/రాంచీ: ఒడిశాకు చెందిన డిస్టిలరీ గ్రూప్‌పై ఆదాయ పన్ను శాఖ అధికారులు కొనసాగిస్తున్న సోదాల్లో కళ్లు చెదిరే రీతిలో కట్టల కొద్దీ అక్రమ నగదు బయటపడుతోంది. గురువారం బొలంగీర్‌లోని బల్దేవ్ సాహు అండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో జరిపిన తనిఖీల్లో రూ.200 కోట్ల నగదు బయటపడింది. శుక్రవారం బొలంగీర్ జిల్లా సుదపడలో జరిపిన సోదాల్లో నిండా కరెన్సీ నోట్లున్న 156 సంచులను గుర్తించారు. వీటిలో ఏడు బ్యాగుల్లో నగదును లెక్కించగా రూ.20 కోట్లుగా తేలిందని అధికారులు తెలిపారు.
దీంతో, ఇప్పటి వరకు లభ్యమైన డబ్బు రూ.220 కోట్లకు చేరుకుందన్నారు. లిక్కర్ కంపెనీతో సంబంధాలున్నట్లు అనుమానాలున్న జార్ఖండ్ ఎంపీ సెల్‌ఫోన్ స్విచ్ఛాప్ వస్తోందని పీటీఐ తెలిపింది. రాంచీలోని ఆయన కార్యాలయం సిబ్బంది కూడా ఎంపీ అందుబాటులో లేరని చెబుతున్నారు. పన్ను ఎగవేత ఆరోపణలపై ఐటీ అధికారులు మూడు రోజులుగా డిస్టిలరీ గ్రూప్ సంస్థలకు చెందిన సంబల్‌పూర్, బొలంగీర్, తితిలాగఢ్, సుందర్‌గఢ్, రూర్కెలా, భువనేశ్వర్‌లలో తనిఖీలు సాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment