distilleries
-
మద్యం మాఫియా మూలవిరాట్టు బాబే
సాక్షి, అమరావతి: మద్యం విధానంపై కూటమి సర్కారు సారథి, సీఎం చంద్రబాబు శ్రీరంగ నీతులు చెబుతుండడం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నంత విడ్డూరంగా ఉంది. ఎందుకంటే.. రాష్ట్రంలో మద్యం మాఫియా సృష్టికర్త చంద్రబాబే. మద్యం మాటున మహా దోపిడికీ బ్రాండ్ అంబాసిడర్ ఈ 40 ఇయర్స్ ఇండస్ట్రీనే అన్నది బహిరంగ రహస్యం. అయినప్పటికీ.. రెడ్‌బుక్ కుట్రలో భాగంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాం నాటి మద్య విధానంపై అక్రమ కేసు నమోదు చేసింది. ఐదేళ్ల పాటు పాదర్శకంగా అమలు చేసిన విధానంపై టీడీపీ వీరవిధేయ పోలీసు అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. దర్యాప్తు పేరుతో అబద్ధపు వాంగ్మూలాల నమోదు, తప్పుడు సాక్ష్యాల సృష్టికి కూటమి ప్రభుత్వం కుతంత్రాలు పన్నుతోంది. ఈ హడావుడి అంతా.. అసలు మద్యం దందా ఘనాపాఠి చంద్రబాబే అన్నది మరుగునపరచాలన్నది పన్నాగం. కానీ, టీడీపీ మద్యం సిండికేట్ మహా దోపిడీ దాచేస్తే దాగేది కాదు. తన బినామీలు, సన్నిహితులకు డిస్టిలరీల లైసెన్సులు ఇచ్చి.. టీడీపీ ప్రజాప్రతినిధులతో మద్యం సిండికేట్ ఏర్పాటు చేసి.. ఊరూరా బెల్ట్ దుకాణాలు తెరిచి.. ఊరూపేరు లేని బ్రాండ్లను ప్రవేశపెట్టి.. మూడు బార్లు ఆరు దుకాణాలుగా రాష్ట్రమంతా మద్యం ఏరులై పారించిన ఘనత చంద్రబాబుదే. ఈ క్రమంలో చీకటి జీవోలతో కనికట్టు చేశారు.. 2014–19 మధ్య ప్రభుత్వ ఖజానాకు రూ.5 వేల కోట్ల పన్ను రాబడికి గండికొట్టారు. సిండికేట్ ద్వారా రూ.20 వేల కోట్లు కొల్లగొట్టారు. చంద్రబాబు పాలనకు పూర్తి విరుద్ధంగా మద్యం విధానంపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం వినూత్న సంస్కరణలు తీసుకువచ్చింది. ప్రైవేటు దుకాణాలను రద్దు చేసి సిండికేట్‌ను రూపుమాపింది. దశలవారీ మద్య నియంత్రణను సమర్థంగా అమలు చేసింది. కొత్తగా ఒక్క డిస్టిలరీకీ అనుమతినివ్వ లేదు. దీంతో టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే వైఎస్సార్సీపీ పాలనలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మద్యం అమ్మకాలు పెరిగితే డిస్టిలరీలు కమీషన్లు ఇస్తాయి. కానీ, తగ్గితే కమీషన్లు ఇవ్వవన్నది ఎవరైనా ఠక్కున చెప్పే వాస్తవం. కానీ, కుట్రపూరితంగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కమీషన్లు తీసుకున్నారని కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాతిపెట్టిన ప్రైవేట్ మద్యం సిండికేట్ భూతాన్ని చంద్రబాబు ప్రభుత్వం తవ్వి తీసి ప్రజలపైకి వదిలింది. యథేచ్ఛగా దోపిడీకి బరితెగిస్తోంది. అందుకే.. ప్రజలకు వాస్తవాలను వివరించేందుకు.. చంద్రబాబు మద్యం దోపిడీ సమగ్ర కుట్రను చాటేందుకు.. మద్యం మాఫియాను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థంగా కట్టడి చేసిన విధానాన్ని చెప్పేందుకు.. ప్రస్తుతం మళ్లీ పేట్రేగుతున్న మద్యం దందాను తెలియజేస్తోంది ‘సాక్షి’. » 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు తన బినామీలు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో ఖజానాకు భారీగా గండికొట్టారు. నిబంధనలకు విరుద్ధంగా.. వారి కంపెనీలకు అడ్డగోలు లబ్ధి కలిగించారు. సీఎం హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి మరీ కుంభకోణానికి పాల్పడ్డారు. తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల మేర గండి కొట్టారు. ఈ విషయమై.. రాజ్యాంగబద్ధ సంస్థ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆధ్వర్యంలో స్వతంత్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తన అభ్యంతరాలను స్పష్టంగా నివేదించారు కూడా. » చంద్రబాబు ముఠా బాగోతం ఆధారాలతో సహా బయటపడటంతో 2023లోనే సీఐడీ కేసు నమోదు చేసింది. 2014–19 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు, ఎక్సైజ్ కమిషనర్‌గా వ్యవహరించిన ఐఎస్ నరేష్, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, తదితరులపై ఐపీసీ సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 5 డిస్టిలరీల నుంచే.. ముసుగులో చంద్రబాబు దందా డిస్టిలరీలతో కుమ్మక్కయి కొన్ని ఉత్పత్తులకు కృత్రిమ డిమాండ్‌ను సృష్టించి దోపిడీకి తెరతీసింది చంద్రబాబు ప్రభుత్వం. 2015–19 మధ్య ఇలా కేవలం ఐదు డిస్టిలరీలకే లబ్ధి చేకూరింది. వీరి నుంచే 50 శాతానికిపైగా కొనుగోళ్లు చేశారు. అందుకు కొన్ని తార్కాణాలు ఇవిగో... » 2017–18లో టీడీపీ ప్రభుత్వం మొత్తం రూ.8,106 కోట్ల మద్యం కొనుగోలు ఆర్డర్లు ఇచ్చింది. వాటిలో రూ.4,122.28 కోట్లు ఐదు డిస్టిలరీలలకే ఇవ్వడం గమనార్హం. పెర్ల్ డిస్టిలరీకే రూ.1,374.79 కోట్ల మద్యం ఆర్డర్లు ఇవ్వగా.. పెర్నోడో రిచర్డ్ ఇండియా లిమిటెడ్‌కు రూ.548.03కోట్లు, ఎస్వీఆర్ డిస్టిలరీస్‌కు రూ.395.1 కోట్లు, అలైడ్ బ్లెండర్స్–డిస్టిలరీస్‌కు రూ.457.86కోట్లు, ఎస్వీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌కు రూ.319.57కోట్ల మద్యం ఆర్డర్లు ఇచ్చారు. » 2018–19లో టీడీపీ ప్రభుత్వం మొత్తం రూ.4,765.75 కోట్ల మద్యం ఆర్డర్లు ఇచ్చింది. వాటిలో కేవలం మూడు డిస్టిలరీలకే ఏకంగా రూ.2,244.44కోట్ల మద్యం ఆర్డర్లు ఇవ్వడం గమనార్హం. » పెర్ల్ డిస్టిలరీస్‌కు అత్యధికంగా రూ.1,462.41కోట్ల మద్యం ఆర్డర్లు ఇవ్వగా.. సెంటిని బయో ప్రొడక్ట్స్‌కు రూ.638.52కోట్లు, ఎస్పీవై ఆగ్రో ప్రొడక్ట్స్ రూ.143.51 కోట్ల ఆర్డర్లు ఇచ్చారు. తద్వారా కేవలం ఈ మూడు డిస్టిలరీల నుంచే రూ.47.09 శాతం మద్యం కొనుగోలు చేశారు. బార్లలోనూ అదే బరితెగింపు.. చంద్రబాబు ఆదేశాలతో బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసేందుకు ఎక్సైజ్ చట్టం 10(ఏ) నిబంధన తొలగించాలంటూ ఎక్సైజ్ కమిషనర్ 2015 సెప్టెంబరు 1న సర్క్యులర్ ఇచ్చారు. ప్రివిలేజ్ ఫీజు రద్దుపై 2015 సెప్టెంబరు 9న బార్ల యజమానులు వినతిపత్రం సమర్పించినట్లు రికార్డుల్లో చూపారు. సెపె్టంబరు 9న వినతిపత్రం సమర్పిస్తే దానికి 9 రోజులు ముందుగానే సెపె్టంబరు 1నే ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్ సర్క్యులర్ ఎలా ఇచ్చారన్నది చంద్రబాబే చెప్పాలి. బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దుపై కూడా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదు. కేబినెట్ ఆమోదమూ పొందలేదు. ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ 2015 డిసెంబరు 11న జీవో 468 జారీ అయింది. అందుకు సంబంధించిన నోట్ ఫైళ్లపై ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర 2015 డిసెంబరు 3న సంతకం చేయగా సీఎం హోదాలో చంద్రబాబు 2015 డిసెంబరు 4న డిజిటల్ సంతకాలు చేయడం వారి పన్నాగానికి నిదర్శనం. డిస్టిలరీలన్నిటికీ అనుమతినిచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే మద్యం విధానం ముసుగులో చంద్రబాబు తన బినామీలు, సన్నిహితులకు చెందిన డిస్టిలరీలకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చారు. వారి ద్వారా ఖజానాకు గండి కొట్టి నిధులను సొంత ఖజానాకు మళ్లించుకున్నారు. రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉండగా 14 డిస్టిలరీలకు చంద్రబాబు సర్కారే అనుమతులిచ్చింది. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకుముందటి ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి.వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న 2019–24లో రాష్ట్రంలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వనేలేదు. 2014 నవంబరులో జీవో నంబర్ 993 ప్రకారం రెవెన్యూ (ఎౖక్సైజ్2) డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా, కమిటీ సూచించిన వాటి కంటే ఎక్కువ డిస్టిలరీల స్థాపనకు టీడీపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. కేబినెట్‌కు చెప్పకుండానే.. 2015లో చంద్రబాబు ప్రభుత్వం కొత్త మద్యం విధానం తెచ్చింది. నాడు కేబినెట్ సమావేశానికి ముందు ఎక్సైజ్ కమిషనర్ మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును కొనసాగించడమే కాక 10 రెట్లు పెంచాలని ఓ నోట్ ఫైల్‌ను పంపారు. ఈ ప్రతిపాదనను చంద్రబాబు కేబినెట్ అజెండాలో చేర్చలేదు. కొత్త మద్యం విధానంపై కేబినెట్ సమావేశంలో చర్చించి 2015 జూన్ 22న జీవోలు 216, 217 జారీ చేశారు. ఆ రెండు జీవోల్లోనూ మద్యం దుకాణాలకు ప్రివిలేజ్ ఫీజు తొలగిస్తున్నట్లు పేర్కొనలేదు. కానీ, అదే రోజు సాయంత్రం అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ప్రివిలేజ్ ఫీజు తొలగించాలని ప్రతిపాదిస్తూ, ఎక్సైజ్ చట్టం 16(9) నిబంధనను రద్దు చేయాలని సిఫార్సు చేశారు. ఆ నోట్ ఫైల్‌ను చంద్రబాబు కార్యాలయానికి పంపారు. ఈ మేరకు ‘కాపీ టు పీఎస్ టు సీఎం’ అని నోట్ ఫైల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ప్రివిలేజ్ ఫీజును తొలగిస్తున్న విషయం చంద్రబాబుకు స్పష్టంగా తెలుసనేది సుస్పష్టం. అదే రోజు అంటే.. 2015 జూన్ 22న సాయంత్రం గుట్టుగా జీవో 218 జారీ అయింది. దీని గురించి కేబినెట్లో చర్చించలేదు. ఖజానాకు నష్టం వాటిల్లే అంశాలపై ముందుగా ఆర్థిక శాఖ ఆమోదం తప్పనిసరి. కానీ ప్రివిలేజ్ ఫీజు రద్దు విషయాన్ని ఆర్థిక శాఖకు తెలియజేయనే లేదు. ‘పవర్ స్టార్’, ‘లెజెండ్’లను తెచ్చింది ఎవరు?పవర్ స్టార్, లెజెండ్.. ఇవేవో టీడీపీ కూటమిలోని నాయకుల పేర్ల ముందు ఉండే బిరుదులు కావు. మద్యం బ్రాండ్లు. ఈ రెండే కాదు.. ఊరూ పేరు తెలియని అనేక బ్రాండ్ల మద్యంకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులిచ్చింది. దాదాపు 200 రకాల బ్రాండ్లను మార్కెట్లో ప్రవేశపెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడింది. టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం బ్రాండ్లలో కొన్ని .. ప్రెసిడెంట్ మెడల్: ఈ బ్రాండ్‌కు 2017 నవంబరు 22న చంద్రబాబు ప్రభుత్వం అనుమతినిచ్చింది. హై వోల్టేజ్, వోల్టేజ్ గోల్డ్, ఎస్ఎన్జీ 10000, బ్రిటీష్ అంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, బ్రిటీష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్ బీర్ ఉత్పత్తులకు 2017 జూన్ 7న చంద్రబాబు ప్రభుత్వం ఓకే చెప్పింది. గవర్నర్ రిజర్వ్, లెఫైర్ నెపోలిన్, ఓక్టోన్ బారెల్ ఏజ్డ్, సెవెన్త్ హెవెన్ బ్లూ బ్రాండ్ల విస్కీలకు 2018 అక్టోబరు 26న అంగీకారం తెలిపారు. రాయల్ ప్యాలస్, న్యూ కింగ్, సైన్ అవుట్ పేర్లతో విస్కీ, బ్రాందీ బ్రాండ్లకు 2018 నవంబరు 9న అనుమతిచ్చింది. బీరా 91 పేరుతో మూడు రకాల బీర్ బ్రాండ్లకు 2019 మే 13న అప్పటి టీడీపీ ప్రభుత్వమే పచ్చజెండా ఊపింది. టీఐ మ్యాన్షన్ హౌస్, టీఐ కొరియర్ నెపోలియన్ విస్కీ, బ్రాందీ బ్రాండ్లకు 2018 మే 15న అనుమతినిచ్చింది. అసలు స్కాం ఎవరిది? లంచాలు ఎవరికి ఇస్తారు?టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైఎస్సార్సీపీ పాలనలో అమ్మకాలు తగ్గాయి.. ఈ నేపథ్యంలో లిక్కర్ వ్యవహారంలో వాస్తవంగా స్కాంలు చేసింది ఎవరు? అనేది పరిశీలిస్తే.. » మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? » మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? » విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా? » మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? »దుకాణాలకు తోడు పర్మిట్ రూమ్‌లు, బెల్టు షాప్‌లు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్ రూమ్స్‌ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? » 2014 - 19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి.. డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? లేక పాత రేట్లను కొనసాగిస్తే లంచాలు వస్తాయా? » మద్యంపై తక్కువ ట్యాక్స్‌ల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా? లేక ట్యాక్స్‌లు పెంచి, తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా? » ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? » ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా? వైఎస్సార్సీపీ హయాంలో.. » 2019-24 మధ్య ఐదేళ్లలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్యం విధానంలో అక్రమ దందా సాగించే సిండికేట్ వ్యవస్థను పూర్తిగా ఎత్తివేసింది. » లిక్కర్ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులను తొలగించింది. ప్రభుత్వ ఆధీనంలోనే అమ్మకాలు సాగించింది. » 33 శాతం మద్యం దుకాణాలను తీసివేసింది. షాపుల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించింది. » మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 43 వేల బెల్టు షాపులను, 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. » మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచింది. ఎక్సైజ్‌కు సంబంధించిన నేరాలకు పాల్పడితే శిక్షలను కఠినం చేసింది. » మద్యం విక్రయాల వేళలను కుదించింది. ప్రతి ఊరికి ఒక మహిళా పోలీసును నియమించింది. దీంతో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి. లబ్ధి పొందిన చంద్రబాబు బినామీలు, సన్నిహితులు వీరు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వియ్యంకుడు, టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్ జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. ప్రస్తుత ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌కు తండ్రి ఈయన. టీడీపీ మాజీ ఎంపీ దివంగత డీకే ఆదికేశవుల నాయుడు కుటుంబం టీడీపీ నేత, మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబం. 2014లో వైఎస్సార్సీపీ తరపున ఎంపీగా గెలిచిన ఎస్పీవై.. నిబంధనలకు విరుద్ధంగా టీడీపీలో చేరినందుకు నజరానాగా ఆయన డిస్టిలరీకి చంద్రబాబు అనుమతిచ్చారు. 2019 ఎన్నికలకు ముందు ఆగమేఘాల మీద 2019, ఫిబ్రవరి 25న అనుమతినిచ్చిన విశాఖ డిస్టిలరీస్ అప్పటి టీడీపీ సీనియర్ నేత, ప్రస్తుత స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుటుంబానికి చెందింది. -
ఒడిశా ఐటీ దాడుల మొత్తం రూ.351 కోట్లు
న్యూఢిల్లీ/భువనేశ్వర్: ఒడిశా కేంద్రంగా మద్యం వ్యాపారం చేస్తున్న సంస్థకు సంబంధించిన ప్రాంతాల్లో ఆదాయ పన్ను(ఐటీ) అధికారులు చేసిన సోదాల్లో దొరికిన నగదు మొత్తం రూ.351 కోట్లకు చేరింది. దేశంలో ఒక దర్యాప్తు సంస్థ ఒకేసారి చేసిన సోదాల్లో ఇంతటి భారీస్థాయిలో కరెన్సీ బయటపడటం ఇదే తొలిసారి! బౌద్ధ్ డిస్టిల్లరీ ప్రైవేట్ లిమిటెడ్, దాని ప్రమోటర్లు, ఇతరులకు సంబంధించిన చోట్ల ఐటీ అధికారుల సోదాలు ఐదోరోజైన ఆదివారమూ కొనసాగాయి. మద్యం వ్యాపారం ద్వారా పొందిన దాంట్లో లెక్కల్లో చూపని ఆదాయం గుట్టుమట్లను ఐటీ శాఖ రట్టుచేస్తోంది. తనిఖీల్లో భాగంగా రాంచీలోని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ ప్రసాద్ సాహూ సంబంధిత ప్రాంతాల్లోనూ ఐటీ అధికారులు చెక్‌చేశారు. ఇక్కడ ఎంత మొత్తంలో నగదు, ఇతర పత్రాలు లభించాయనేది అధికారులు వెల్లడించలేదు. ‘ఈ అంశం ధీరజ్ సాహూ కుటుంబ విషయం. దాదాపు వందేళ్లకు పైగా వారి కుటుంబం ఉమ్మడి వ్యాపారం చేస్తోంది. అందులో సాహూకు చిన్న వాటా ఉంది. ఏదేమైనా ఆయనకు సంబంధించిన చోట్ల సోదాలు జరిగాయికాబట్టి ఆయన ఈ విషయంలో వివరణ ఇవ్వాల్సిందే. అందుకే ఆయన నుంచి వివరణ తీసుకున్నాం. కాంగ్రెస్ పారీ్టకి ఈ సోదాలకు సంబంధం లేదు’’ అని జార్ఖండ్ కాంగ్రెస్ ఇన్చార్జ్ అవినాశ్ పాండే ఆదివారం స్పష్టంచేశారు. విపక్షాలపై అమిత్ విమర్శలు ఐటీ దాడులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. ‘‘ దర్యాప్తు సంస్థలను కేంద్రం దురి్వనియోగం చేస్తుందని ఇన్నాళ్లూ విపక్షాలు ఎందుకు అన్నాయో ఇప్పుడు అర్థమవుతోంది. విపక్షాలు తమ అవినీతి, అక్రమ సొమ్ము వ్యవహారం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతోనే ఇన్నాళ్లూ విషప్రచారం చేశాయి. తీరా ఇప్పుడు కరెన్సీ కట్టలు బయటపడ్డాక కాంగ్రెస్, టీఎంసీ, జేడీయూ, డీఎంకే, ఆర్జేడీలు మౌనం వహిస్తున్నాయి’’ అమిత్ వ్యాఖ్యానించారు. -
దాడుల్లో దొరికింది 290 కోట్లు
న్యూఢిల్లీ/భువనేశ్వర్: ఒడిశా కేంద్రంగా పనిచేస్తున్న డిస్టిలరీ గ్రూప్, అనుబంధ సంస్థల్లో ఆదాయ పన్ను(ఐటీ) అధికారు లు చేపట్టిన సోదాల్లో భారీ మొత్తంలో నల్లధనం వెలుగులోకి వస్తోంది. మొత్తంగా రూ. 290 కోట్ల వరకు ఇక్కడ ఉండొచ్చని చెబుతున్నారు. ఇప్పటి వరకు లెక్కించిన రూ. 250 కోట్లను అధికారులు వాహనాల ద్వారా తరలించి ఒడిశాలోని ఎస్బీఐ శాఖల్లో జమ చేశారు. ఒకే కేసులో ఒకే దర్యాప్తు సంస్థకు ఇంత భారీ మొత్తంలో లెక్కల్లో చూపని నగదు పట్టుబ డటం ఇదే మొదటిసారని అధికార వర్గాలు తెలిపాయి. మొరాయిస్తున్న కౌంటింగ్ మెషిన్లు ‘ఈనెల 6వ తేదీ నుంచి మొదలైన సోదాల్లో బౌధ్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ తదితర సంస్థల్లో దొరికిన డబ్బుల కట్టలను లెక్కించడం కష్టసాధ్యమైన విషయంగా మారింది. విరామం లేకుండా లెక్కింపు కొనసాగించడంతో కౌంటింగ్ మిషన్లు మొరాయిస్తున్నాయి. దీంతో, ఇతర బ్యాంకుల నుంచి 40 వరకు చిన్నా పెద్దా కౌంటింగ్ యంత్రాలను తీసుకువచ్చాం. నగదంతా దాదాపుగా రూ. 500 నోట్ల రూపంలోనే ఉంది. ఇప్పటి వరకు రూ. 250 కోట్లను లెక్కించి బ్యాంకుల తరలించాం. శనివారం సాయంత్రానికి లెక్క పెట్టడం పూర్తవుతుంది. మొత్తం రూ. 290 కోట్ల వరకు ఉండొచ్చని అనుకుంటున్నాం. అదేవిధంగా, ఈ డబ్బును సంభాల్పూర్, బొలంగీర్ ఎస్బీఐ ప్రధాన శాఖలకు తరలించేందుకు మరిన్ని వాహనాలను కూడా తీసుకువచ్చాం. నగదును సర్దేందుకు 200 బ్యాగులను వినియోగించాం’ అని అధికారులు వివరించారు. స్పందించని కాంగ్రెస్ ఎంపీ ఇప్పటి వరకు సోదాలు జరిపిన ప్రాంతాల్లో జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహుకు చెందింది కూడా ఉందని ఐటీ వర్గాలు తెలిపాయి. ‘మద్యం పంపిణీదారులు, విక్రేతలు, వ్యాపారుల ద్వారా భారీ మొత్తంలో నమోదు కాని విక్రయాలు, నగదు బట్వాడా జరుగుతున్నాయన్న ఐటీ నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ సోదాలు చేపట్టాం’అని ఐటీ వర్గాలు వివరించాయి. సోదాల్లో పాల్గొన్న 150 మంది అధికారులతోపాటు ఆయా ప్రాంతాల్లో లభ్యమైన డిజిటల్ డాక్యుమెంట్ల పరిశీలనకు హైదరాబాద్ నుంచి మరో 20 మంది అధికారులు కూడా వచ్చారన్నారు. దాడులు జరిగిన కంపెనీల అధికారుల వాంగ్మూలాలను సేకరిస్తున్నామన్నారు. ఐటీ దాడుల్లో భారీ మొత్తంలో నగదు వెలుగులోకి రావడంపై ఎంపీ సాహు స్పందన కోసం తమ ప్రతినిధి చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు పీటీఐ తెలిపింది. 10 అల్మారాల నిండా డబ్బుల కట్టలు ‘బొలంగీర్ జిల్లాలోని ఓ కంపెనీ ఆవరణలోని సుమారు 10 అల్మారాల్లో రూ. 230 కోట్ల నగదు దొరికింది. మిగతాది తిత్లాగఢ్, సంబల్పూర్, రాంచీల్లో లభ్యమైంది. శనివారం బొలంగీర జిల్లా సుదపారకు చెందిన దేశవాళీ మద్యం తయారీదారుకు చెందిన ఇంట్లో మరో 20 బ్యాగుల నిండా ఉన్న డబ్బు లభ్యమైంది. ఇందులో రూ. 50 కోట్ల వరకు ఉంటుందని అనుకుంటున్నాం. దీన్ని లెక్కించాల్సి ఉంది. అదేవిధంగా, శుక్రవారం వెలుగు చూసిన 156 బ్యాగుల్లోని డబ్బును బొలంగీర్ ఎస్బీఐ ప్రధాన బ్రాంచికి తరలించి, లెక్కిస్తున్నాం’అని వివరించారు. ఐటీ డీజీ సంజయ్ బహదూర్ మూడు రోజులుగా భువనేశ్వర్‌లో మకాం వేసి, పర్యవేక్షిస్తున్నారు. దాడులకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. కాంగ్రెస్ అవినీతి సంప్రదాయాన్ని పెంచి పోషిస్తోంది: బీజేపీ ఐటీ దాడుల్లో నమ్మశక్యం కాలేని రీతిలో నగదు బయటపడటంపై బీజేపీ స్పందించింది. కాంగ్రెస్ అవినీతి సంప్రదాయాన్ని తరాలుగా ఎలా సజీవంగా ఉంచిందో దీన్ని బట్టి తెలుస్తోందని వ్యాఖ్యానించింది. శనివారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేత, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి మీడియాతో మాట్లాడారు. ‘కేవలం ఒక్క కాంగ్రెస్ నేత వద్ద రూ.300 కోట్ల నగదు దొరికింది. కాంగ్రెస్ నేతలందరి దగ్గరా కలిపితే ఎంత డబ్బు దొరుకుతుందో దీన్నిబట్టి ఊహించుకోవచ్చు’అని ఆమె అన్నారు. వ్యవస్థలో లోపాలను ఆసరాగా చేసుకుని, ఎంతగా అవినీతికి పాల్పడొచ్చో కాంగ్రెస్ నేతలు నిరంతరం అన్వేషిస్తుంటారని పేర్కొన్నారు. రాజ్యసభకు కాంగ్రెస్ తరఫున మూడుసార్లు ఎంపీ అయిన సాహ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ఆ పార్టీకి ఏటీఎంలుగా మాదిరిగా పనిచేస్తున్నారని విమర్శించారు. రూ.300 కోట్లకుపైగా అవినీతికి పాల్పడిన మద్యం వ్యాపారి ధీరజ్ సాహు ఏటీఎం ఎవరిదని ఆమె ప్రశ్నించారు. -
ఒడిశాలో ఐటీ దాడులు..156 సంచుల్లో డబ్బు
భువనేశ్వర్/రాంచీ: ఒడిశాకు చెందిన డిస్టిలరీ గ్రూప్‌పై ఆదాయ పన్ను శాఖ అధికారులు కొనసాగిస్తున్న సోదాల్లో కళ్లు చెదిరే రీతిలో కట్టల కొద్దీ అక్రమ నగదు బయటపడుతోంది. గురువారం బొలంగీర్‌లోని బల్దేవ్ సాహు అండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో జరిపిన తనిఖీల్లో రూ.200 కోట్ల నగదు బయటపడింది. శుక్రవారం బొలంగీర్ జిల్లా సుదపడలో జరిపిన సోదాల్లో నిండా కరెన్సీ నోట్లున్న 156 సంచులను గుర్తించారు. వీటిలో ఏడు బ్యాగుల్లో నగదును లెక్కించగా రూ.20 కోట్లుగా తేలిందని అధికారులు తెలిపారు. దీంతో, ఇప్పటి వరకు లభ్యమైన డబ్బు రూ.220 కోట్లకు చేరుకుందన్నారు. లిక్కర్ కంపెనీతో సంబంధాలున్నట్లు అనుమానాలున్న జార్ఖండ్ ఎంపీ సెల్‌ఫోన్ స్విచ్ఛాప్ వస్తోందని పీటీఐ తెలిపింది. రాంచీలోని ఆయన కార్యాలయం సిబ్బంది కూడా ఎంపీ అందుబాటులో లేరని చెబుతున్నారు. పన్ను ఎగవేత ఆరోపణలపై ఐటీ అధికారులు మూడు రోజులుగా డిస్టిలరీ గ్రూప్ సంస్థలకు చెందిన సంబల్పూర్, బొలంగీర్, తితిలాగఢ్, సుందర్‌గఢ్, రూర్కెలా, భువనేశ్వర్లలో తనిఖీలు సాగిస్తున్నారు. -
మళ్లీ మళ్లీ అవే అబద్ధాలా?
చంద్రబాబు నాయుడి కోసం ‘ఈనాడు’ రాతలను లేఖలుగా సంధిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చిన్నచిన్న లాజిక్కులు కూడా మిస్ అవుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. స్కిల్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న తన బావ చంద్రబాబు మెప్పుకోసం కొన్ని రోజులుగా రాష్ట్రంలో ‘మద్యంపై పోరాటం’ అంటూ ఆమె చేస్తున్న హంగామా అంతా చూస్తున్నదే. తాజాగా దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ అందజేశారు. తమ పార్టీ ప్రభుత్వానికే ఇలా వినతి పత్రాలివ్వటమేంటని అంతా ఆశ్చర్యపోతున్నా... టీడీపీ సంక్షేమం కోసం పాటుపడుతున్న పురంధేశ్వరికి మాత్రం ఇవేమీ పట్టడం లేదు. లేఖలో ఆమె పేర్కొన్న కొన్ని అంశాలు ఎంత అసంబద్ధమైనవంటే... అనుమతులిచ్చిన చంద్రబాబును ప్రశ్నించరేం? రాష్ట్రంలో మద్యం నాణ్యతపై నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్న పురంధేశ్వరికి... దాన్ని తయారు చేస్తున్న డిస్టిలరీలకు అనుమతులిచ్చింది తన బావ చంద్రబాబు నాయుడేనని తెలియదా? ఒకవేళ తెలియకుంటే తెలుసుకోవాలి కదా? వాస్తవానికి రాష్ట్రంలో ప్రస్తుతం 20 మద్యం డిస్టిలరీలుండగా... వాటిలో 14 డిస్టిలరీలకు అనుమతిచ్చింది చంద్రబాబు నాయుడే. మిగిలిన 6 డిస్టిలరీలకు అంతకు ముందటి ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి. అంతే తప్ప వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్కటంటే ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతివ్వలేదు. పైపెచ్చు చంద్రబాబు నాయుడు అనుమతిచ్చిన డిస్టిలరీల్లో చాలావరకూ ఆయన హితులు, సన్నిహితులవే. వాళ్లు అప్పట్లో తయారు చేసిన మద్యాన్నే ఇప్పుడూ తయారు చేస్తున్నారు. మరి అప్పట్లో నాణ్యంగా ఉన్న మద్యం ఇప్పుడు ఎందుకు మారిపోయింది? ప్రభుత్వం మారింది కాబట్టా? ఇదెక్కడి తీరు పురంధేశ్వరి గారూ?! నాడు నాలుగు డిస్టిలరీలకే 70 శాతం ఆర్డర్లు.. పురంధేశ్వరి తన లేఖలో వాస్తవానికి సమాధి కట్టి వినిపించిన మరో అందమైన అబద్ధమేంటంటే... వైఎస్సార్ సీపీ నాయకులకు చెందిన డిస్టిలరీలకే ఎక్కువ మద్యం సరఫరా చేసే అవకాశమిస్తున్నారని. నిజం చెప్పాలంటే వైఎస్సార్సీపీ నేతలకు డిస్టిలరీలే లేవు. అన్నీ చంద్రబాబు నాయుడి హయాంలో అనుమతులిచ్చిన ఆయన సన్నిహితులు, టీడీపీ నేతలవే. పైపెచ్చు చంద్రబాబు హయాంలో డిస్టిలరీల నుంచి మద్యం కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగేది. తమ వారికి చెందిన 4 డిస్టిలరీల నుంచే ఏకంగా 70 శాతం మద్యాన్ని కొనుగోలు చేసేవారు. అంటే తనకు కావాల్సిన ఈ 4 డిస్టిలరీలకూ సగటున ఒక్కోదానికీ 17.5 శాతం ఆర్డర్లు ఇచ్చారు. మిగిలిన 16 డిస్టిలరీలకూ కలిపి 30 శాతం ఆర్డర్లు ఇచ్చారు. అంటే వీటికి సగటున 2 శాతంలోపే ఆర్డర్లు దక్కాయి. కానీ ఇంతటి అవినీతిని పురంధేశ్వరి ఎన్నడూ... ఏ పార్టీలో ఉన్నప్పుడూ ప్రశ్నించలేదు. వాస్తవానికి ఇప్పుడు ప్రతి డిస్టిలరీకీ సమానంగా అవకాశం కల్పిస్తున్నారు. దాదాపు 4 నుంచి 6 శాతం వరకు ప్రతి డిస్టిలరీకీ తయారీ ఆర్డర్లు ఇస్తున్నారు. ఇలా చేస్తున్నందుకే... ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి చెందిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రాష్ట్రంలో మద్యం కొనుగోళ్లు పూర్తి పారదర్శకంగా, నిబంధనల మేరకే జరుగుతున్నాయని ఒక నివేదిక కూడా ఇచ్చింది. కేంద్ర సంస్థే ఇలా చెప్పినపుడు... కేంద్రానికి పురంధేశ్వరి చేసిన ఫిర్యాదులో ఏ కొంచెమైనా అర్థం ఉన్నట్టా? సత్ఫలితాలనిస్తున్న దశలవారీ మద్య నియంత్రణ.. మద్యం విక్రయాలను ప్రభుత్వ అధీనంలో చేపట్టడం... షాపుల సంఖ్యను తగ్గించటం... విక్రయ వేళల్ని పరిమితం చేయటం... పర్మిట్ రూముల్ని రద్దు చేయటం... బెల్టు షాపుల్ని తొలగించటం... వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలతో రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2018–19లో మద్యం విక్రయాలు 3.84 కోట్లు కేసులు. అదే ఏడాది బీర్లు 2.77 కోట్ల కేసులు అమ్ముడు పోయాయి. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక విక్రయాలు గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి. 2022–23లో మద్యం విక్రయాలు 3.35 కోట్ల కేసులకు, బీర్లు 1.16 కోట్ల కేసులకు పరిమితమయ్యాయి. మద్యం తాగేవారు వెనుకంజ వేసేలా... రేట్లను షాక్ కొట్టేలా పెంచుతామని గత ఎన్నికల హామీల్లో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. దాన్ని అమలు చేశారు. రేట్లను పెంచటంతో పాటు అదనపు పన్నునూ విధించారు. ఇది కూడా మద్యం విక్రయాలు తగ్గటానికి కారణమే. నిధులు మళ్లించింది చంద్రబాబు కాదా? తెలుగుదేశం, ‘ఈనాడు’ బాటలోనే... రాష్ట్రంలో మద్యం విక్రయించగా వచ్చిన సొమ్ము ఖజానాకు కాకుండా ఇంకెక్కడికో తరలిపోతోందంటూ పురంధేశ్వరి సైతం గగ్గోలుపెట్టారు. రాష్ట్రంలో రోజూ 80 లక్షల మంది తలా రూ.200 విలువైన మద్యాన్ని సేవిస్తున్నారని నోటికొచ్చినట్లు చెప్పేశారు. ఇలా చూస్తే మద్యం అమ్మకాల ద్వారా సంవత్సరానికి రూ.57,600 కోట్లు రావాలని, కానీ రూ.32,600 కోట్లే చూపిస్తున్నారు కనక మిగతా రూ.25 వేల కోట్లు అక్రమంగా మళ్లించేస్తున్నారని నమ్మశక్యం కాని కూతలు కూసేశారు. నిజానికి కేంద్ర జాతీయ కుటుంబ ఆరోగ్య నివేదిక 2019–21 ప్రకారం రాష్ట్రంలో 18 ఏళ్ల పైబడ్డవారిలో మద్యం అలవాటు ఉన్నవారు 63.88 లక్షలమంది. వీరిలో రోజూ తాగేవారు సగటున 18.24 లక్షల మందే. మరి 80 లక్షల లెక్క ఎవరు చెప్పారు పురంధేశ్వరి గారూ? వాస్తవానికి ఈ ప్రభుత్వ హయాంలో తక్కువ మద్యం విక్రయిస్తున్నా ప్రభుత్వ ఖజానాకు ఎక్కువ సొమ్ము సమకూరుతోంది. కానీ చంద్రబాబు హయాంలో ఇప్పటికంటే చాలా ఎక్కువ మద్యాన్ని విక్రయించినా కూడా... ఇప్పటికన్నా తక్కువ మొత్తమే ఖజానాకు చేరేది. మరి నిధుల మళ్లింపు అప్పుడు జరిగినట్టా? ఇప్పుడు జరుగుతున్నట్టా? కాస్త ఆలోచన ఉండాలి కదా? చంద్రబాబును విమర్శించడానికి మనసు ఒప్పుకోకుంటే... ఇలాంటి పనికిమాలిన ఆరోపణలైనా చేయకుండా ఉండాలి కదా?. -
లిక్కర్ షేర్లకు కొనుగోళ్ల కిక్
కోవిడ్-19 కట్టడికి విధించిన లాక్‌డవున్‌ను క్రమంగా ఎత్తివేస్తున్న నేపథ్యంలో ఆర్థిక రికవరీ కనిపిస్తోంది. ఆగస్ట్‌లో వాహన విక్రయాలు పుంజుకోగా.. పలు రంగాలకు డిమాండ్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హోటళ్లు, తదితర ఆతిథ్య రంగాలు సైతం తిరిగి గాడిన పడే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా లిక్కర్ తయారీ కంపెనీలకు డిమాండ్ పెరిగింది. వెరసి పలు కౌంటర్లు ఆటుపోట్ల మార్కెట్లోనూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. హుషారుగా ప్రస్తుతం ఎన్ఎస్ఈలో యునైటెడ్ బ్రూవరీస్ 6.2 శాతం జంప్‌చేసి రూ. 1,152 వద్ద ట్రేడవుతోంది. రెండు రోజుల్లో ఈ షేరు 14 శాతం ర్యాలీ చేయగా గ్లోబస్ స్పిరిట్స్ 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 197 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. సోమ్ డిస్టిల్లరీస్ 3.5 శాతం ఎగసి రూ. 58కు చేరింది. ఈ బాటలో యునైటెడ్ స్పిరిట్స్ 2 శాతం బలపడి రూ. 580 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 588 వరకూ పెరిగింది. ఇక జీఎం బ్రూవరీస్ 2 శాతం లాభపడి రూ. 404ను తాకగా.. ఇంట్రాడేలో రూ. 412ను అధిగమించింది. ఇతర కౌంటర్లలో పయనీర్ డిస్టిల్లరీస్ 2 శాతం పుంజుకుని రూ. 113 వద్ద, అసోసియేటెడ్ ఆల్కహాల్స్ 2 శాతం లాభంతో రూ. 268 వద్ద, రాడికో ఖైతాన్ 1.5 శాతం బలపడి రూ. 408 వద్ద ట్రేడవుతున్నాయి. -
దొంగల చేతివాటం.. మద్యం మాయం
సాక్షి, చిత్తూరు: చిత్తూరులోని ప్రముఖ డిస్టల్లరీస్ కంపెనీలో దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ డిస్టల్లరీఎస్ కంపెనీలో 100 కేసుల మద్యం బాటిళ్లు మాయం అయ్యాయి. మాజీ ఎంపీ ఆదికేశవులు నాయుడు కుటుంబానికి చెందిన ఈ కంపెనీలో గత వారం రోజులుగా దొంగలు సరుకు మాయం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంటి దొంగల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే కేసును ఛేదిస్తామని డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి తెలిపారు. -
శానిటైజర్ల తయారీలో డిస్టిలరీలు
సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో శానిటైజర్ల కొరత లేకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వాటి తయారీ కోసం డిస్టిలరీలకూ ఎక్సైజ్ శాఖ లైసెన్సులు మంజూరు చేసింది. - రాష్ట్రంలో 17 డిస్టిలరీలున్నాయి. వీటన్నిటికీ శానిటైజర్లను తయారు చేసేందుకు లైసెన్సులు మంజూరు చేశారు. వాటిలో నాలుగు డిస్టిలరీలు ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించాయి. - శానిటైజర్ల తయారీకి దరఖాస్తు చేసుకున్న ఫార్మా కంపెనీలకూ కొత్తగా 10 లైసెన్సులిచ్చారు. - రెక్టిఫైడ్ స్పిరిట్‌ను మద్యం డిస్టిలరీలు తయారు చేస్తాయి. శానిటైజర్ తయారు చేయాలంటే ఈ రెక్టిఫైడ్ స్పిరిట్(ఆర్ఎస్)దే ప్రాధాన్యం. - రెక్టిఫైడ్ స్పిరిట్‌లో ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్, ఇథనాల్ ఉంటాయి. వీటినే శానిటైజర్‌కు వాడతారు. - రాష్ట్రంలో ఫార్మా కంపెనీలకు రెక్టిఫైడ్ స్పిరిట్ వాడేందుకు అనుమతి ఉండదు. దీన్ని వాడాలంటే ఆర్ఎస్–3 లైసెన్స్ పొందాల్సి ఉంటుంది రెండు గంటల్లోపే లైసెన్స్ ఇస్తున్నాం.. శానిటైజర్ల తయారీకి రెక్టిఫైడ్ స్పిరిట్ కావాలని ఎవరు దరఖాస్తు చేసుకున్నా రెండు గంటల్లోపే అనుమతులిస్తున్నాం. డిస్టిలరీలు శానిటైజర్లను తయారుచేసి మార్కెట్లోకి తక్కువ ధరలకే అందుబాటులోకి తెచ్చేలా ఆదేశాలిచ్చాం. – వాసుదేవరెడ్డి, కమిషనర్ ఆఫ్ డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్ -
డిస్టిలరీల సమ్మె విరమణ
సాక్షి, హైదరాబాద్: మద్యం ఉత్పత్తి చేసే డిస్టిలరీలు సమ్మె విరమించాయి. లైసెన్స్ ఫీజు పేరుతో తమ నుంచి అడ్డగోలుగా వసూలు చేస్తున్నారని, ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ మద్యం తయారీని నిలిపివేసేందుకు రాష్ట్రంలోని కొన్ని డిస్టిలరీల యాజమాన్యాలు నిర్ణయించాయి. దీనిలో భాగంగా 17 డిస్టిలరీలకుగాను 10 డిస్టిలరీలను తాత్కాలికంగా మూసివేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్సైజ్ కమిషనర్ సోమేశ్‌కుమార్.. యాజమాన్యాలతో గురువారం సచివాలయంలో చర్చలు జరిపారు. డిస్టిలరీల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు జైపాల్‌రెడ్డితోపాటు పలువురు ప్రతినిధులు తమ వాదనలను వివరించారు. యాజమాన్యాల విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన సోమేశ్‌కుమార్.. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో డిస్టిలరీల్లో మళ్లీ మద్యం ఉత్పత్తి చేసేందుకు యాజమాన్యాలు అంగీకరించాయి. శుక్రవారం నుంచి అన్ని డిస్టిలరీల్లో ఉత్పత్తిని ప్రారంభిస్తామని అనధికారికంగా వెల్లడించాయి. ఐదుగురు సభ్యులతో కమిటీ డిస్టిలరీల యాజమాన్యాలతో జరిగిన చర్చల్లో ఎక్సైజ్ శాఖ జాయింట్ కమిషనర్ ఖురేషీ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తామని సోమేశ్‌కుమార్ హామీ ఇచ్చారు. లైసెన్స్ ఫీజుతోపాటు డిస్టిలరీల సమస్యలపై కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇస్తుందని, ఈ మేరకు తాను ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపుతానన్నారు. వీలైనంత త్వరగా డిస్టిలరీల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. -
ఏపీలో చీప్ లిక్కర్ కొరత
నాటుసారా, కల్తీ మద్యం, లూజు విక్రయాలను నియంత్రించేందుకు చవక ధరలకు (చీప్ లిక్కర్) మద్యాన్ని టెట్రా ప్యాక్‌ల్లో అందిస్తామని ప్రభుత్వం చేసిన విధాన ప్రకటన అమలుకు నోచుకోవడం లేదు. అల్పాదాయ వర్గాలు ఎక్కువగా తాగే చీప్ లిక్కర్‌ను అందుబాటులో ఉంచాల్సిన ప్రభుత్వం అది చేయకపోవడంతో నాటుసారా, కల్తీ కల్లు, గుడుంబా లాంటివి తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కల్తీ మద్యం సేవించి కృష్ణా జిల్లాలో సోమవారం ఏడుగుగురు మృతి చెందగా, మరో 35 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు అనేకం జరిగినా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో చీప్ లిక్కర్‌కు గేట్లు బార్లా తెరిచినా డిస్టిలరీలు మాత్రం ఉత్పత్తికి ముందుకు రాలేదు. చౌక మద్యంపై ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ తగ్గించినా తయారీకి ఉత్పత్తి కంపెనీలు ససేమిరా అంటున్నాయి. దీంతో రాష్ట్రంలో చీప్ లిక్కర్ కొరత ఏర్పడింది. మార్కెట్లో చౌకమద్యం దొరక్క నాటుసారా, కల్తీ కల్లు విక్రయాలు బాగా పెరిగాయి. గతంలో అన్ని జిల్లాల్లో కలుపుకొని రోజుకు 30 వేల లీటర్ల నాటుసారా అమ్ముడయ్యేది. ఇప్పుడు ఏపీలో సారా విక్రయాలు రోజుకు 50 వేల లీటర్ల వరకు జరుగుతున్నట్లు అంచనా. 20 శాతం చీప్ లిక్కర్ తయారు చేయాల్సిందే.. ఏపీలో మొత్తం 14 లైసెన్స్డ్ డిస్టిలరీలున్నాయి. వీటి ఉత్పాదక సామర్ధ్యం 1,221.58 లక్షల ప్రూఫ్ లీటర్లు. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు తమ డిస్టిలరీల్లో 20 శాతం చీప్ లిక్కర్ బ్రాండ్లను ఉత్పత్తి చేస్తామని కంపెనీల నిర్వాహకులు అంగీకార పత్రం ఇస్తారు. అయితే డిస్టిలరీలు కేవలం ప్రముఖ బ్రాండ్లను తయారు చేస్తూ చౌక మద్యాన్ని తయారు చేయకపోవడం వల్ల కొరత ఏర్పడింది. హాలోగ్రామ్ అసలు సమస్యా... లూజు విక్రయాలను నిరోధించేందుకు 60 మిల్లీ లీటర్ల చీప్ లిక్కర్ బాటిల్స్ అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావించింది. 60 మిల్లీ లీటర్ల బాటిల్ రూ.20కే అందించాలని నిర్ణయించింది. అయితే నిబ్ బాటిళ్ల తయారీకి హాలోగ్రామ్‌తో కూడిన లేబుల్ వేసేందుకు అదనంగా ఖర్చు కావడంతో వీటిని తయారు చేయలేమని, లీటరు బాటిల్ తయారు చేస్తామని తెగేసి చెబుతున్నాయి. డిస్టిలరీ కంపెనీలపై ఒత్తిడి తీసుకువచ్చి చీప్ లిక్కర్‌ను ఉత్పత్తి చేయించడంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. టెట్రా ప్యాక్‌లో చీప్ లిక్కర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించినా టెట్రా ప్యాక్ తయారీకి చైనా నుంచి మిషన్లు కొనుగోలు చేయాల్సి ఉన్నందున ఉత్పత్తి కంపెనీలు వాటి జోలికెళ్లడం లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం రెండు డిస్టిలరీ కంపెనీలు మాత్రమే చౌకమద్యం ఉత్పత్తి చేయడం గమనార్హం.