
సాక్షి, చిత్తూరు: చిత్తూరులోని ప్రముఖ డిస్టల్లరీస్ కంపెనీలో దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. శ్రీకృష్ణ ఎంటర్‌ప్రైజెస్ డిస్టల్లరీఎస్ కంపెనీలో 100 కేసుల మద్యం బాటిళ్లు మాయం అయ్యాయి. మాజీ ఎంపీ ఆదికేశవులు నాయుడు కుటుంబానికి చెందిన ఈ కంపెనీలో గత వారం రోజులుగా దొంగలు సరుకు మాయం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంటి దొంగల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే కేసును ఛేదిస్తామని డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment