Bottles of alcohol
-
సుప్రీంకోర్టులో రెండు మద్యం సీసాలు
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఓ కేసు విచారణ సందర్భంగా రెండు మద్యం సీసాలు కోర్టు గదిలో ప్రత్యక్షమయ్యాయి. ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనపై రెండు మద్యం కంపెనీల మధ్య నెలకొన్న వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. పిటిషనర్ల వాదించిన సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ ఈ మద్యం సీసాలను కోర్టులోకి తీసుకొచ్చారు. ధర్మాసనం ఎదుట ప్రదర్శించారు. వాటిని చూసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆశ్చర్యపోయారు. బిగ్గరగా నవ్వారు. అసలు ఏం జరిగిందంటే.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన జేకే ఎంటర్ప్రైజెస్ అనే లిక్కర్ కంపెనీ ‘లండన్ ప్రైడ్’ పేరుతో మద్యం తయారు చేస్తోంది. ఈ పేరు తాము తయారుచేస్తున్న ‘బ్లెండర్స్ ప్రైడ్’ మద్యం పేరును పోలి ఉందని పెర్నాడ్ రికార్డ్స్ అనే మరో లిక్కర్ కంపెనీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాకుండా లండన్ ప్రైడ్ లిక్కర్ బాటిల్ ‘ఇంపీరియల్ బ్లూ’ లిక్కర్ బాటిల్ మాదిరిగానే ఉందని ఆరోపించింది. లండన్ ప్రైడ్ పేరుతో లిక్కర్ తయారు చేయకుండా దాన్ని నిషేధించాలంటూ పెట్టుకున్న పిటిషన్‌ను మధ్యప్రదేశ్ హైకోర్టు గతేడాది తిరస్కరించింది. దీన్ని సవాలు చేస్తూ పెర్నాడ్ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున రోహత్గీ వాదనలు వినిపించారు. ధర్మాసనం అనుమతితో లండన్ ప్రైడ్, ఇంపీరియల్ బ్లూ లిక్కర్ సీసాలను తీసుకొచ్చి తన టేబుల్‌పై ఉంచారు. వాటిని చూసి సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నవ్వు ఆపుకోలేకపోయారు. ‘వాటిని మీతోపాటే తీసుకొచ్చారా?’ అని రోహత్గీని ప్రశ్నించారు. రెండు సీసాల మధ్య సారూప్యతను స్వయంగా చూపించడానికే తీసుకొచ్చానని ఆయన బదులిచ్చారు. ఈ కేసులో ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన జరిగిందని చెప్పారు. జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ.. గతంలో బాంబే హైకోర్టులో ఇలాంటి కేసులో తాను తీర్పు ఇచ్చానని గుర్తుచేసుకున్నారు. మధ్యప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వుపై స్టే విధిస్తున్నట్లు చెప్పారు. జేకే ఎంటర్‌ప్రైజెస్‌కు నోటీసు జారీ చేశారు. -
బిహార్‌లో పోలీసు స్టేషన్లో దొంగతనం
పట్నా: దొంగలు ఏకంగా పోలీసు స్టేషన్‌ను టార్గెట్ చేశారు. రాత్రిపూట లోపలికి ప్రవేశించి, మద్యం సీసాలు ఎత్తుకెళ్లారు. బిహార్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ పోలీసు స్టేషన్లో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. బిహార్‌లో మద్యంపై నిషేధం అమల్లో ఉంది. అక్రమ రవాణా జరుగుతున్న మద్యం సీసాలను పోలీసులు స్వా«దీనం చేసుకొని ఈ స్టేషన్‌లోని స్టోర్‌రూమ్‌లో భద్రపర్చారు. శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. చిమ్మచీకట్లో దొంగలు చాకచక్యంగా గోడదూకి లోపలికి అడుగుపెట్టారు. స్టోర్‌రూమ్‌లో ఐదు పెట్టెలు, ఒక సంచిలో ఉన్న మద్యం బాటిళ్లను చోరీ చేశారు. విచిత్రం ఏమిటంటే ఈ సంఘటన జరుగుతున్నప్పుడు పోలీసు సిబ్బంది స్టేషన్లోనే ఉన్నారు. అసలు విషయం మరుసటి రోజు బయటపడింది. దొంగతనం దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసుల నిర్లక్ష్యంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. -
కర్ణాటక మద్యం స్వాధీనం
అన్నానగర్: వాణియంబాడి సమీపంలో మంగళ వారం రాత్రి కారుతో పాటు కర్నాటక రాష్ట్ర మద్య బాటిళ్లును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. తిరుపత్తూరు జిల్లా వాణియంబాడి లిక్కర్ ఎన్ఫోర్స్మెంట్ డివిజన్ పోలీసు ఇన్స్పెక్టర్ జయలక్ష్మి ఆధ్వర్యంలో చెట్టియప్పనూర్ జంక్షన్ రోడ్డులో మంగళవారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో ఓ కారును పోలీసులు ఆపేందుకు యత్నించారు. అప్పుడు డ్రైవర్ కారును ఆపి అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం పోలీసులు కారును సోదా చేయగా అందులోని 1,248 కర్ణాటక రాష్ట్ర మద్యం బాటిళ్లు ఉన్నట్లు గుర్తించి సీజ్ చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గేమ్‌లో ఓడిపోయాడని ముందు మందు బాటిళ్లు.. మితిమీరి తాగడంతో..
సోషల్ మీడియా ద్వారా క్రేజ్ తెచ్చుకోవడానికి యువత పోటీపడుతుంటారు. రకరకాల వీడియోలతో ఫాలోవర్స్‌ను ఆకర్షిస్తుంటారు. వివిధ స్టంట్స్ చేస్తూ కొన్నిసార్లు ప్రాణాలమీదికి తెచ్చుకుంటారు. అలాంటి ఘటనే చైనాలో జరిగింది. లైవ్ స్ట్రీమింగ్‌లో పోటీపడి పరిమితికి మించి మద్యంతాగి ప్రాణాలను కోల్పోయాడో వ్యక్తి. ఇంతకూ ఎంత తాగాడో తెలిస్తే షాకవుతారు! చైనా షార్టు వీడియో ప్లాట్‌ఫామ్ 'డౌయిన్'(చైనా టిక్‌టాక్)లో ఆన్లైన్ స్ట్రీమింగ్ గేమ్స్ నడుస్తుంటాయి. మధ్యరాత్రి ఒంటిగంటకు మొదలై మధ్యాహ్నం ఒంటిగంటకు ముగుస్తాయి. ఇందులో లైవ్‌లో రకరకాల స్టంట్స్ చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తారు. ఈ క్రమంలో ఇద్దరు కంటెండర్లు 'పీకే'అనే పేరుతో ఓ క్రేజీ గేమ్ ఆడారు. ఆడియన్స్ నుంచి ఎక్కువ గిఫ్ట్స్ సంపాదించాలని గేమ్‌లో పోటీపడ్డారు. ఓడిన వ్యక్తి క్రేజీ శిక్షను అనుభవించాలని నిబంధన విధించుకున్నారు. వీడియోలో పేర్కొన్న ప్రకారం.. ఈ గేమ్‌లో ఓడిన వ్యక్తే జియాంగ్సు ప్రావిన్స్‌కు చెందిన జూవా. గెలిచిన వ్యక్తి సాంక్యూజ్. గేమ్‌లో భాగంగా లైవ్‌లో జువా ముందు ఏడుబాటిళ్ల'బైజు'(చైనా ఓడ్కా)ను పెట్టాడు సాంక్యూజ్. గేమ్‌లో ఓడినందుకు ఆ రోజురాత్రి లైవ్‌లోనే ఏడుబాటిళ్ల 'బైజు'ను తాగాడు జువా. మద్యం మత్తులోనే అస్వస్థతకు గురైన జువా.. నిద్రలోనే ప్రాణాలు విడిచాడు. మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు చూస్తే అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జువా ఎంత వైన్ తాగాడో సరిగ్గా తెలియదు.. కానీ రాత్రి లైవ్‌లో నాలుగో బాటిల్ తాగడం వరకు తనకు జ్ఞాపకం ఉందని తన స్నేహితుడు వెల్లడించాడు. జువా ఈ మధ్యే లైవ్‌స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో చేరాడని తెలిపాడు. 'బైజు' మద్యంలో సాధారణంగా 30 నుంచి 60 శాతం ఆల్కహాల్ ఉంటుంది. ఒకబాటిల్ పూర్తిగా తాగితేనే ప్రాణాలకు ప్రమాదం అని వైద్యులు తెలిపారు. డౌయిన్ ప్లాట్ఫామ్లో 10లక్షల వ్యూయర్స్ ఉన్నారు. దాదాపు రూ.28బిలియన్ల ఆదాయాన్ని కలిగి ఉంది. ఇదీ చదవండి:మీరు లావుగా ఉన్నారా.. అయితే ఆ రెస్టారెంట్లో పుడ్ ఫ్రీ, ఫ్రీ! -
వెలుగులోకి సీఐ అవినీతి బాగోతాలు..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: బాధ్యత గల పోలీసు ఉద్యోగంలో ఉంటూ బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి అధికార దుర్వినియోగానికి పాల్పడిన సీఐ నాగేశ్వరనాయక్ అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సీఐ నాయక్ తమకు అన్యాయం చేశారంటూ ఆయన బాధితులు జిల్లా పోలీసు అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. మరోవైపు గురువారం జంగారెడ్డిగూడెం పోలీసుస్టేషన్లో ఎస్ఈబీ అదనపు ఎస్పీ కరీముల్లా షరీఫ్ నేతృత్యంలోని అధికారుల బృందం తనిఖీ నిర్వహించింది. జంగారెడ్డిగూడెం పోలీసుస్టేషన్ పరిధిలోని ఇసుక అక్రమార్కులకు పెద్దఎత్తున లంచాలు తీసుకుని సహకరించారనే ఆరోపణల నేపథ్యంలో ఎస్ఈబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరిగిన విచారణపై ‘సాక్షి’ రాసిన కథనాలతో ఉన్నతాధికారులు తప్పనిసరి పరిస్థితిలో జంగారెడ్డిగూడెం సీఐ నాగేశ్వర్ నాయక్, ఎస్సై గంగాధర్‌ను వీఆర్‌లో పెట్టారు. ఈ మేరకు ఏలూరు రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే విచారణ చేస్తున్న సందర్భంలో సీఐ అవినీతి బాగోతాలు వెలుగుచూస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాలో నిందితుడిగా ఉన్న వ్యక్తి కారును ఇప్పటికీ సీఐ వినియోగిస్తున్నట్లుగా విచారణాధికారులు గుర్తించారు. సీఐపై మరికొన్ని ఆరోపణలు ఇవీ.. ఉన్నతాధికారుల అనుమతులు ఏమాత్రం లేకుండా జంగారెడ్డిగూడెం సర్కిల్ కార్యాలయంలో ఒక షెడ్ నిర్మాణంతోపాటు అనధికారికంగా సీఐ కార్యాలయంలో ఏసీలు పెట్టించడం వంటి నిబంధనలకు విరుద్ధమైన చర్యలు చేపట్టినట్లు సీఐపై ఫిర్యాదులు వచ్చాయి. ►భీమడోలు సీఐగా పనిచేసే సమయంలో సీఐ నాయక్ తనను అక్రమంగా నిర్బంధించి, చేపల వ్యాపారస్తులకు చెందిన కేసులో ఇరికిస్తానంటూ బెదిరించి తన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.40 లక్షలను అప్పటి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరుల ఖాతాల్లోకి బదిలీ చేయించారని, సీఐ నాయక్‌పై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలంటూ ఏలూరుకు చెందిన చేపల వ్యాపారి మామిడి వెంకట కృష్ణ అనే వ్యక్తి గురువారం ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ►సీఐ నాయక్ చింతలపూడి ఇన్చార్జ్ సీఐగా ఉంటూ చింతలపూడి ప్రాంతంలో మద్యం దుకాణంలో జరిగిన దొంగతనం కేసులో నిందితులను అరెస్ట్ చేసి, వారినే ద్వారకాతిరుమలలో జరిగిన మద్యం దొంగతనం కేసులో కూడా నిందితులుగా పెట్టి, అసలైన నిందితులను వదిలేశారనే విషయం తాజాగా వెలుగులోకి రావడంతో అధికారులు ఆ దిశగా విచారణ ప్రారంభించారు. ►జిల్లాలోని చింతలపూడి పోలీసుస్టేషన్లో నమోదైన ఓ కేసులో నిందితురాలిగా ఉన్న జిల్లా అధికారిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు సదరు ఉద్యోగి నుంచి సీఐ పెద్దఎత్తున వసూళ్లు చేశారని గుర్తించి ఆ దిశగానూ విచారణ మొదలుపెట్టారు. మద్యం బాటిళ్ల మాయంపై క్రిమినల్ చర్యలు : ఎస్ఈబీ ఏఎస్పీ కరీముల్లా షరీఫ్ జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌లో పలు కేసుల్లో సీజ్చేసిన మద్యం బాటిళ్లు దురి్వనియోగం జరిగినట్లు గుర్తించామని దీనిపై సంబంధిత ఎస్హెచ్ఓపై క్రిమినల్ చర్యలు తీసుకోనున్నట్లు ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ వెల్లడించారు. గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. నాలుగు ఎన్డీపీ మద్యం కేసుల్లో బాటిళ్లను తారుమారు చేశారని పేర్కొన్నారు. మొత్తం 24 బాటిళ్లు తారుమారయ్యాయని వెల్లడించారు. అంతేగాక కేసులకు సంబంధం లేని అనధికార మద్యం బాటిళ్లు 51 క్వార్టర్ బాటిళ్లను పోలీస్‌స్టేషన్‌లో గుర్తించామన్నారు. జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌లో తనిఖీలు నిర్వహించి మద్యం బాటిళ్లను తారుమారు చేసినట్లు, అక్రమాలు జరిగినట్లు నిర్ధారించినట్లు చెప్పారు. ఈ మద్యం కేసులు నమోదు జరిగిన సమయంలో ఉన్న ఎస్హెచ్ఓపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రస్తుత ఎస్హెచ్ఓను షరీఫ్ ఆదేశించారు. అంతేగాక అప్పటి ఎస్హెచ్ఓపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులను నివేదించినట్లు కరీముల్లా షరీఫ్ చెప్పారు. -
దొంగల చేతివాటం.. మద్యం మాయం
సాక్షి, చిత్తూరు: చిత్తూరులోని ప్రముఖ డిస్టల్లరీస్ కంపెనీలో దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ డిస్టల్లరీఎస్ కంపెనీలో 100 కేసుల మద్యం బాటిళ్లు మాయం అయ్యాయి. మాజీ ఎంపీ ఆదికేశవులు నాయుడు కుటుంబానికి చెందిన ఈ కంపెనీలో గత వారం రోజులుగా దొంగలు సరుకు మాయం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంటి దొంగల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే కేసును ఛేదిస్తామని డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి తెలిపారు. -
తాగుడు ‘మూత’లు!
అనకాపల్లి: మద్యంలో కల్తీ జరుగుతోందా...? బ్రాండెడ్ మద్యంలో చీప్‌లిక్కర్‌ను కల్తీ చేస్తున్నారా ? ఆఫ్ బాటిల్ తాగిన తర్వాత ఏది తాగినా కిక్కు ఎక్కుతుంది కాబట్టి మందుబాబులు పట్టించుకోవడం లేదా ...? మందుబాబులు జేబులు గుళ్ల చేస్తున్న వారి వెనుక పెద్ద ముఠాయే ఉందా అంటే ఔననే సమా«ధానాలు వినిపిస్తున్నాయి. గత రెండేళ్లలో అనకాపల్లి ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దొరికిన రెండు కేసులను పరిశీలిస్తే మద్యం కల్తీ జోరుగా సాగుతోందని స్పష్టమవుతోం ది. ఎక్సైజ్ పోలీసులకు ఈ అంశాలపై సమాచారం ఉన్నప్పటికీ కొన్ని ఒత్తిళ్ల నేపథ్యంలో చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నారని తేలుతోంది. డీఎస్పీ, ఓసీ బ్రాండ్ మూతలతో పనేంటి ? అనకాపల్లి ఎక్సైజ్ పోలీసులు ఉన్నతాధికారులు ఇచ్చిన సమాచారం మేరకు మంగళవారం 60 వేల డైరెక్టర్ స్పెషల్(డీఎస్పీ), ఆఫీసర్ చాయస్(ఓసీ) బ్రాండ్‌కు సంబంధించిన మూతలను స్వా ధీనం చేసుకున్న విషయంతెలిసిందే. వీటిలో 46 వేల డీఎస్పీ బ్రాండ్‌కు సంబంధించిన కప్పులు, 14వేల ఓసీ బ్రాండెకు సంబంధించిన మూతలు న్నాయి. ఈ మూతలను హైదరాబాద్ నుంచి అచ్యుతాపురం మండలంలోని ఒక మద్యం షాపునకు తరలిస్తున్నట్టుగా ఎక్సైజ్ అధికారులు గుర్తించి, వాహన డ్రైవర్, మద్యం షాపుల నిర్వాహకులపైన కేసు నమోదు చేశారు. అయితే ఈ మూతలతో కల్తీ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఎౖMð్సజ్ పోలీసులు, మద్యం షాపుల గురించి తెలి సిన వారు ఇస్తున్న సమాచారం ఆసక్తికరంగా ఉం ది. మార్కెట్లో దొరికే చీప్‌లిక్కర్ బాటిల్ ధర రూ.50. దీనిని చాలా చోట్ల బ్లాక్ చేశారు. మద్యం మత్తులోనూ, సరదాలోనూ షాపుకొచ్చే మందుబాబులు డీఎస్పీ,ఓసీ బ్రాండ్లను ఎక్కువగా అడుగుతారు. చీప్‌లిక్కర్‌ను డీఎస్పీ, ఓసీ ఖాళీ బాటిళ్లలో వేసి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన మూతలను బిగిస్తారు. కొన్ని షాపుల్లో వందశాతం, మరికొన్ని షాపుల్లో 50 శాతం చీప్‌లిక్కర్‌ను కలిపి విక్రయిస్తున్నారు. రూ.100కు ఆఫీసర్ చాయస్, రూ. 95కు డైరెక్టర్ స్పెషల్‌ను విక్రయిస్తున్నారు. ఇలా చాలా ప్రాంతాల్లో కల్తీ జరుగుతున్నప్పటికీ పెద్దగా ఎవరూ దృష్టి సారించడంలేదు. గతంలో కూడా ఒడిశా నుంచి వచ్చిన పేరు లేని స్పిరిట్‌ను అనకాపల్లి ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా వచ్చే స్పిరిట్‌ను బ్రాండెడ్ బాటిల్ మద్యంలో కలిపి, సీలు వేసి అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఈ కల్తీ మద్యాన్ని తాగిన మందుబాబులు అనారోగ్యం పాలవుతున్నారు. గతంలో ఎక్సైజ్ పోలీసులు ఒడిశాలోని డిస్టలరీ యూనిట్‌పై దాడులు జరిపినప్పటికీ ఆ కేసును ముగించేశారు. తాజాగా డీఎస్పీ, ఓసీ మూతలను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకోడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. అనకాపల్లి, అచ్యుతాపురం, యలమంచిలి మండలాల్లో మద్యం కల్తీ జోరుగా జరుగుతున్నట్టు సమాచారం. ఇప్పటికైనా మద్యం కల్తీకి చేసేవారిపై, దానికి ఉపయోగించే మూతలు, స్పిరిట్‌ను సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. బెల్టుషాపులను నియంత్రించామని, మద్యాన్ని ఎమ్మార్పీ ధరకే విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రకటనలు ఇస్తున్న ఎక్సైజ్ సిబ్బందికి బ్రాండెడ్ మద్యం బాటిళ్ల మూతల కేసు కొత్త తలనొప్పిని తెచ్చి పెట్టింది. -
హార్సిలీ కొండకు ఏదీ అండ?
► సమస్యలు పట్టించుకునే దిక్కులేదు ► 11ఏళ్లలో టౌన్షిప్ కమిటీ భేటీ నాలుగుసార్లే ► నేడు కలెక్టర్, టూరిజం, శాఖల అధికారుల సమావేశం బి.కొత్తకోట: రాష్ర్టంలో ఏకైక వేసవి విడది కేంద్రం బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్. ఇది రాష్ట్రంలోనే ఏకైక పర్వత నివాస ప్రాంతం. ప్రస్తుతం టౌన్షిప్ కమిటీగా కొనసాగుతోంది. డివిజన్ స్థాయి అధికారులు సభ్యులుగా, మదనపల్లె సబ్ కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించే కమిటీ సమావేశాలు నామమాత్రంగా మారిపోయాయి. తీసుకొన్న నిర్ణయాలు అమలు గాలికి వదిలేస్తున్నారు. కొన్ని సమస్యలు కనీసం పట్టించుకోవడం లేదు. గ్రామ పంచాయతీ, మండల పరిషత్ పరిధిలోని కొండను 2000లో ప్రభుత్వం తొలగించింది. ప్రత్యేకంగా టౌన్షిప్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా కమిటీయే తీర్చాల్సి ఉంటుంది. దీనికోసం తరచూ సమావేశాలు నిర్వహించి సమస్యలను సమీక్షించి చర్యలు తీసుకోవాలి. అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. గడచిన 11 ఏళ్లలో కేవలం నాలుగుసార్లు మాత్రమే కమిటీ సమావేశాలు నిర్వహించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సోమవారం హార్సిలీహిల్స్‌లో పర్యటించనున్న కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాల్సిన అవసరముంది. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలివీ.. ►పొరుగు రాష్ట్రాల పర్యాటకుల కోసం ఏటీఎం ఏర్పాటు చేయాలి. ►ఎంతో విలువైన భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. ►రెవెన్యూ అతిథిగృహాన్ని కలెక్టర్ క్యాంపు కార్యాలయంగా మార్చాలన్న ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. ►చెట్టుపై అతిథిగృహ నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. ►కొండపైనున్న బండరాళ్లు ఘాట్ రోడ్డుపై పడుతున్నాయి. ►రోప్‌వే మార్గంపై రీసర్వే అటకెక్కింది. ►రాత్రివేళ ఆరోగ్య సమస్య ఎదురైతే తలనొప్పికీ మాత్ర దొరకదు. విషసర్పాలు కాటేస్తే చావాల్సిందే. ►స్థానికంగా ఒక ఏఎన్ఎంను నియమించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. ►పర్యాటకుల కోసం మంచినీటి కొళాయిలు ఏర్పాటు చేయాలి. ►మురికినీరు, వాడేసిన వ్యర్థాలు రోడ్లపై వేయకుండా తొట్టెలు, కాలువలు నిర్మించాలి. ►గాలిబండపై మందుబాబుల వీరంగాలు తగ్గడం లేదు. ►మద్యం సీసాలను పగులగొట్టడంతో గాజు పెంకులతో గాలిబండ భయానకంగా తయారైంది. ►వీధిలైట్లు పూర్తిగా వేయకపోవడంతో రాత్రివేళల్లో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు.