ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్న డీఎస్పీ, ఓసీ బ్రాండెడ్ మద్యం బాటిళ్ల మూతలు
అనకాపల్లి: మద్యంలో కల్తీ జరుగుతోందా...? బ్రాండెడ్ మద్యంలో చీప్‌లిక్కర్‌ను కల్తీ చేస్తున్నారా ? ఆఫ్ బాటిల్ తాగిన తర్వాత ఏది తాగినా కిక్కు ఎక్కుతుంది కాబట్టి మందుబాబులు పట్టించుకోవడం లేదా ...? మందుబాబులు జేబులు గుళ్ల చేస్తున్న వారి వెనుక పెద్ద ముఠాయే ఉందా అంటే ఔననే సమా«ధానాలు వినిపిస్తున్నాయి. గత రెండేళ్లలో అనకాపల్లి ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దొరికిన రెండు కేసులను పరిశీలిస్తే మద్యం కల్తీ జోరుగా సాగుతోందని స్పష్టమవుతోం ది. ఎక్సైజ్ పోలీసులకు ఈ అంశాలపై సమాచారం ఉన్నప్పటికీ కొన్ని ఒత్తిళ్ల నేపథ్యంలో చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నారని తేలుతోంది.
డీఎస్పీ, ఓసీ బ్రాండ్ మూతలతో పనేంటి ?
అనకాపల్లి ఎక్సైజ్ పోలీసులు ఉన్నతాధికారులు ఇచ్చిన సమాచారం మేరకు మంగళవారం 60 వేల డైరెక్టర్ స్పెషల్(డీఎస్పీ), ఆఫీసర్ చాయస్(ఓసీ) బ్రాండ్‌కు సంబంధించిన మూతలను స్వా ధీనం చేసుకున్న విషయంతెలిసిందే. వీటిలో 46 వేల డీఎస్పీ బ్రాండ్‌కు సంబంధించిన కప్పులు, 14వేల ఓసీ బ్రాండెకు సంబంధించిన మూతలు న్నాయి. ఈ మూతలను హైదరాబాద్ నుంచి అచ్యుతాపురం మండలంలోని ఒక మద్యం షాపునకు తరలిస్తున్నట్టుగా ఎక్సైజ్ అధికారులు గుర్తించి, వాహన డ్రైవర్, మద్యం షాపుల నిర్వాహకులపైన కేసు నమోదు చేశారు. అయితే ఈ మూతలతో కల్తీ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఎౖMð్సజ్ పోలీసులు, మద్యం షాపుల గురించి తెలి సిన వారు ఇస్తున్న సమాచారం ఆసక్తికరంగా ఉం ది. మార్కెట్లో దొరికే చీప్‌లిక్కర్ బాటిల్ ధర రూ.50. దీనిని చాలా చోట్ల బ్లాక్ చేశారు. మద్యం మత్తులోనూ, సరదాలోనూ షాపుకొచ్చే మందుబాబులు డీఎస్పీ,ఓసీ బ్రాండ్‌లను ఎక్కువగా అడుగుతారు. చీప్‌లిక్కర్‌ను డీఎస్పీ, ఓసీ ఖాళీ బాటిళ్లలో వేసి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన మూతలను బిగిస్తారు. కొన్ని షాపుల్లో వందశాతం, మరికొన్ని షాపుల్లో 50 శాతం చీప్‌లిక్కర్‌ను కలిపి విక్రయిస్తున్నారు.
రూ.100కు ఆఫీసర్ చాయస్, రూ. 95కు డైరెక్టర్ స్పెషల్‌ను విక్రయిస్తున్నారు. ఇలా చాలా ప్రాంతాల్లో కల్తీ జరుగుతున్నప్పటికీ పెద్దగా ఎవరూ దృష్టి సారించడంలేదు. గతంలో కూడా ఒడిశా నుంచి వచ్చిన పేరు లేని స్పిరిట్‌ను అనకాపల్లి ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా వచ్చే స్పిరిట్‌ను బ్రాండెడ్ బాటిల్ మద్యంలో కలిపి, సీలు వేసి అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఈ కల్తీ మద్యాన్ని తాగిన మందుబాబులు అనారోగ్యం పాలవుతున్నారు. గతంలో ఎక్సైజ్ పోలీసులు ఒడిశాలోని డిస్టలరీ యూనిట్‌పై దాడులు జరిపినప్పటికీ ఆ కేసును ముగించేశారు. తాజాగా డీఎస్పీ, ఓసీ మూతలను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకోడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. అనకాపల్లి, అచ్యుతాపురం, యలమంచిలి మండలాల్లో మద్యం కల్తీ జోరుగా జరుగుతున్నట్టు సమాచారం. ఇప్పటికైనా మద్యం కల్తీకి చేసేవారిపై, దానికి ఉపయోగించే మూతలు, స్పిరిట్‌ను సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. బెల్టుషాపులను నియంత్రించామని, మద్యాన్ని ఎమ్మార్పీ ధరకే విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రకటనలు ఇస్తున్న ఎక్సైజ్ సిబ్బందికి బ్రాండెడ్ మద్యం బాటిళ్ల మూతల కేసు కొత్త తలనొప్పిని తెచ్చి పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment