కోవిడ్-19 కట్టడికి విధించిన లాక్‌డవున్‌ను క్రమంగా ఎత్తివేస్తున్న నేపథ్యంలో ఆర్థిక రికవరీ కనిపిస్తోంది. ఆగస్ట్‌లో వాహన విక్రయాలు పుంజుకోగా.. పలు రంగాలకు డిమాండ్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హోటళ్లు, తదితర ఆతిథ్య రంగాలు సైతం తిరిగి గాడిన పడే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా లిక్కర్ తయారీ కంపెనీలకు డిమాండ్ పెరిగింది. వెరసి పలు కౌంటర్లు ఆటుపోట్ల మార్కెట్లోనూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..
హుషారుగా
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో యునైటెడ్ బ్రూవరీస్ 6.2 శాతం జంప్‌చేసి రూ. 1,152 వద్ద ట్రేడవుతోంది. రెండు రోజుల్లో ఈ షేరు 14 శాతం ర్యాలీ చేయగా గ్లోబస్ స్పిరిట్స్ 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 197 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. సోమ్ డిస్టిల్లరీస్ 3.5 శాతం ఎగసి రూ. 58కు చేరింది. ఈ బాటలో యునైటెడ్ స్పిరిట్స్ 2 శాతం బలపడి రూ. 580 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 588 వరకూ పెరిగింది. ఇక జీఎం బ్రూవరీస్ 2 శాతం లాభపడి రూ. 404ను తాకగా.. ఇంట్రాడేలో రూ. 412ను అధిగమించింది. ఇతర కౌంటర్లలో పయనీర్ డిస్టిల్లరీస్ 2 శాతం పుంజుకుని రూ. 113 వద్ద, అసోసియేటెడ్ ఆల్కహాల్స్ 2 శాతం లాభంతో రూ. 268 వద్ద, రాడికో ఖైతాన్ 1.5 శాతం బలపడి రూ. 408 వద్ద ట్రేడవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment