Spirits
-
టెకీలా తయారీ కంపెనీ స్థాపించిన యువరాజ్ సింగ్
భారత మాజీ క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ అల్ట్రా ప్రీమియం బ్రాండ్ ఫినో టెకీలాను ప్రారంభించారు. దాంతో లగ్జరీ స్పిరిట్స్ మార్కెట్లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం అమెరికాలో ఈ బ్రాండ్‌ను ఆవిష్కరించారు. 2025 ఏప్రిల్ మధ్య నాటికి భారత మార్కెట్లోకి ప్రవేశించే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.ఫినో టెకీలాఫినో టెకీలా బ్రాండ్ ఉత్పత్తులను మెక్సికోలోని జాలిస్కోలో తయారు చేస్తున్నట్లు చెప్పారు. చికాగోలో బ్రాండ్ ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫినో టెకీలా ప్రపంచంలోని అత్యుత్తమ టెకీలాలను ఉత్పత్తి చేస్తుందని నిర్వాహకులు ధీమా వ్యక్తం చేశారు. యువరాజ్ సింగ్ కెరీర్ వ్యక్తిగత జీవితాన్ని ఆధారంగా చేసుకొని ‘ఫెయిల్యూర్ ఈజ్ నాట్ యాన్ ఆప్షన్’ అనే క్యాప్షన్‌తో బ్రాండ్ ఏర్పడినట్లు పేర్కొన్నారు. ఖనిజాలు అధికంగా ఉండే మట్టిలోని 100% ‘బ్లూ అగావ్(టెకీలా ముడి పదార్థం)’ నుంచి ఫినో టెకీలా తయారవుతుందని చెప్పారు. ఫినోలోని నాయకత్వ బృందంలో చీఫ్ ప్రొడక్ట్ ఎక్సలెన్స్ ఆఫీసర్‌గా జానా అయ్యర్, చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్‌గా సోనాలి పటేల్ ఉన్నారు. హెల్త్‌కేర్, వ్యాపార రంగంలో తమ నైపుణ్యాలతో బ్రాండ్‌ను మరో స్థాయికి తీసుకెళ్తారని కంపెనీ అధికారులు చెప్పారు.ఇదీ చదవండి: భానుడి ప్రతాపం.. జనవరి 2025లో రికార్డు ఉష్ణోగ్రతలుయూఎస్లో బ్రాండ్ ఉత్పత్తులను విజయవంతంగా లాంచ్ చేయడంతోపాటు ఫినో టెకీలా ప్రత్యేక అవుట్ లెట్ల ద్వారా భారత మార్కెట్లోకి ప్రవేశించాలని యోచిస్తోంది. ప్రీమియం స్పిరిట్లను కోరుకునే వినియోగదారులకు కంపెనీ ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలని నిర్ణయించుకున్నారు. అయితే భారత్‌లో ఏప్రిల్ 2025 నాటికి కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించాలని అనుకుంటున్నారు. కానీ దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. -
పుష్ప 2 వసూళ్లే స్పిరిట్ టార్గెట్..!
-
ఆ పేరు వినబడితే చాలు.. వెన్నులోంచి వణుకొస్తుందట!!
గోవా అనగానే గుర్తొచ్చేది అందమైన సముద్ర తీరాలు.. అంతులేని సరదాలే! అయితే వాటితోపాటు హారర్ దృశ్యాలూ అక్కడ కామనే! వాటిల్లో ‘సాలిగావ్ మర్రిచెట్టు’ ఒకటి. సాలిగావ్ పేరు వినబడితే చాలు గోవన్లకు వెన్నులోంచి వణుకొస్తుందట. పనాజీ నుంచి 15 కి.మీ దూరంలో ఉన్న సాలిగావ్.. హడలెత్తించే దయ్యం కథలకు ప్రసిద్ధి.‘మే డి డ్యూస్’ క్యాథలిక్ చర్చ్‌కి సమీపంలోని ఓ పెద్ద మర్రిచెట్టు వెనుక.. సుమారు 72 ఏళ్లనాటి బెదరగొట్టే హారర్ స్టోరీ ఉంది. అందుకే రాత్రి పూట ఆ చెట్టు వైపు చూడాలన్నా ఆ ఊరివారు భయపడుతుంటారు. దడపుట్టించే ఈ కథ 1952లో వినపడటం మొదలైంది.ఆ ఏడాది చివరిలో సాలిగావ్కి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిలెర్నేలో క్రిస్టియన్ సెమినరీ (క్రైస్తవ మతబోధనలు జరిగే విద్యాలయం) నిర్మాణం మొదలైంది. దానికి ఇనాషియో లారెంకో పెరీరా అనే పోర్చుగీస్ ఫాదర్.. మేనేజర్‌గా నియమితుడయ్యాడు. అతను సాలిగావ్లో నివాసం ఉంటూ.. సెమినరీ పనులను పర్యవేక్షిస్తూ ఉండేవాడు.ఒక ఆదివారం ఉదయాన్నే సెమినరీకి వెళ్లి తిరిగి రాలేదు. మరునాడు కూడా అతని జాడ లేకపోవడంతో.. అతని కోసం స్థానికులు, చర్చ్ ఫాదర్స్ ఊరంతా వెతకడం మొదలుపెట్టారు. ఆ గాలింపులో పెరీరా సాలిగావ్‌లోని మర్రిచెట్టు పక్కనే బురదలో అపస్మారకస్థితిలో కనిపించాడు. అతనిని ఆసుపత్రిలో చేర్చారు. ఆ రాత్రే అతను సృహలోకి వచ్చినా 4 రోజుల పాటు మౌనంగానే ఉండిపోయాడు. ఐదోరోజు ఉదయాన్నే అతను ఆడ గొంతుతో కొంకణీ భాషలో మాట్లాడటం మొదలుపెట్టాడు.పెరీరాకు దయ్యం పట్టిందని గుర్తించిన క్రైస్తవ గురువులు.. ఆ మర్రిచెట్టుకు.. జీసస్ శిలువను రక్షణగా కట్టారు. వైద్యం అందిస్తున్నా పెరీరా ఆరోగ్యస్థితి మెరుగుపడలేదు. మరింత క్షీణించసాగింది. మధ్యమధ్యలో అతను ‘క్రిస్టలీనా’ అని అరవసాగాడు. దాంతో పెరీరాకు పట్టిన దయ్యం పేరు ‘క్రిస్టలీనా’ అని అక్కడివారు నిశ్చయించుకున్నారు.ఆధునిక వైద్యం కోసం అతనిని స్వదేశమైన పోర్చుగల్‌కు పంపించేశారు. ఇక పెరీరా తిరిగి రాలేదు. సరిగ్గా ఐదేళ్లకు అంటే 1957లో ఆ మర్రిచెట్టుకు కట్టిన శిలువ సగభాగం మాయమైపోయింది. దాంతో క్రిస్టలీనా దయ్యం తిరిగి ఆ మర్రిచెట్టును చేరుకుందని ఆ ఊరి వారు నమ్మడం మొదలుపెట్టారు. ఇప్పటికీ ఆ దయ్యం అక్కడే ఉందని విశ్వసిస్తారు. దాంతో అటు హిందువులు.. ఇటు క్రైస్తవులు కూడా క్రిస్టలీనాను శాంతపరచే పూజలు చేస్తూ.. రాత్రిపూట ఆ మర్రిచెట్టు దరిదాపుల్లోకి పోకుండా జాగ్రత్తపడుతున్నారు.ఆ చెట్టు గోవా మొత్తానికీ ఆత్మలు గుమిగూడే ప్రదేశమని.. అక్కడ దయ్యాలు, అతీంద్రియశక్తులు కొలువుంటాయని స్థానికుల గట్టి నమ్మకం. అందుకే అటువైపు ఎవ్వరూ పోయే సాహసం చెయ్యరు. మరి ఆ మర్రిచెట్టులో క్రిస్టలీనా ఆత్మ ఉందా? అసలు ఆమె ఎవరు? ఎందుకు పెరీరాను పీడించింది? అసలు పెరీరా ఏమయ్యాడు? ఇలాంటి సందేహాలకు నేటికీ సమాధానం లేదు. అందుకే ఇది మిస్టరీగానే మిగిలిపోయింది. – సంహిత నిమ్మన -
ప్రేతాత్మకు ఆవాసం
చూడటానికి రాచప్రాసాదంలా కనిపించే ఈ పురాతన హోటల్ భయానకమైన కట్టడంగా పేరుమోసింది. మామూలుగా చూస్తే ఇందులో భయపెట్టే వస్తువులేవీ కనిపించవు గాని, ఇది ప్రేతాత్మకు ఆవాసంగా మారిందని జనాలు చెప్పుకుంటారు. స్టీమ్ ఇంజిన్‌తో నడిచే కారును కనుగొన్న ఫ్రీలాన్ ఆస్కార్ స్టాన్లీ క్షయవ్యాధికి లోనైనప్పుడు కొలరాడోలోని రాకీ పర్వత ప్రాంతంలో ఇల్లు నిర్మించుకున్నాడు. స్వచ్ఛమైన గాలి, ధారాళంగా ఎండ తగిలే ప్రదేశాల్లో ఉంటూ మంచి ఆహారం తీసుకోవడం తప్ప అప్పట్లో క్షయవ్యాధికి పెద్దగా మందులు లేవు. ఇక్కడ ఉంటూ స్టాన్లీ వ్యాధి నుంచి కోలుకున్నాడు. తర్వాత క్షయ రోగులకు ఆవాసంగా ఉపయోగపడేలా ఇక్కడ 1907లో 48 గదుల హోటల్ నిర్మించాడు. తర్వాత హోటల్‌ను 140 గదులకు విస్తరించాడు. ఈ హోటల్లోనే స్టాన్లీ భార్య మరణించింది. అప్పటి నుంచి ఆమె ఆత్మ ఇందులోనే సంచరిస్తోందని, రాత్రివేళ హోటల్ హాలులో ఉన్న పియానోను వాయిస్తోందని ప్రచారం మొదలైంది. ఈ హోటల్లో దిగిన కొందరు అతిథులు కూడా ఇక్కడ ఆత్మను తాము స్పష్టంగా చూసినట్లు చెప్పడంతో ఇది హాంటింగ్ హోటల్‌గా పేరుమోసింది. -
లిక్కర్ షేర్లకు కొనుగోళ్ల కిక్
కోవిడ్-19 కట్టడికి విధించిన లాక్‌డవున్‌ను క్రమంగా ఎత్తివేస్తున్న నేపథ్యంలో ఆర్థిక రికవరీ కనిపిస్తోంది. ఆగస్ట్‌లో వాహన విక్రయాలు పుంజుకోగా.. పలు రంగాలకు డిమాండ్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హోటళ్లు, తదితర ఆతిథ్య రంగాలు సైతం తిరిగి గాడిన పడే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా లిక్కర్ తయారీ కంపెనీలకు డిమాండ్ పెరిగింది. వెరసి పలు కౌంటర్లు ఆటుపోట్ల మార్కెట్లోనూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. హుషారుగా ప్రస్తుతం ఎన్ఎస్ఈలో యునైటెడ్ బ్రూవరీస్ 6.2 శాతం జంప్‌చేసి రూ. 1,152 వద్ద ట్రేడవుతోంది. రెండు రోజుల్లో ఈ షేరు 14 శాతం ర్యాలీ చేయగా గ్లోబస్ స్పిరిట్స్ 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 197 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. సోమ్ డిస్టిల్లరీస్ 3.5 శాతం ఎగసి రూ. 58కు చేరింది. ఈ బాటలో యునైటెడ్ స్పిరిట్స్ 2 శాతం బలపడి రూ. 580 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 588 వరకూ పెరిగింది. ఇక జీఎం బ్రూవరీస్ 2 శాతం లాభపడి రూ. 404ను తాకగా.. ఇంట్రాడేలో రూ. 412ను అధిగమించింది. ఇతర కౌంటర్లలో పయనీర్ డిస్టిల్లరీస్ 2 శాతం పుంజుకుని రూ. 113 వద్ద, అసోసియేటెడ్ ఆల్కహాల్స్ 2 శాతం లాభంతో రూ. 268 వద్ద, రాడికో ఖైతాన్ 1.5 శాతం బలపడి రూ. 408 వద్ద ట్రేడవుతున్నాయి. -
నేనూ మరచిపోతానా?
నా ఫ్రెండ్ ఒకరికి మంచి జ్ఞాపకశక్తి ఉండేది. అలాంటి వ్యక్తి ప్రెగ్నెన్సీ తరువాత చిన్న చిన్న విషయాలను సైతం మరిచిపోతోంది. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. నాకు కూడా మా ఫ్రెండ్‌లాగే అవుతుందా? గర్భిణి స్త్రీలకు డెమన్షియ రిస్క్ ఎక్కువగా ఉంటుందని విన్నాను. ఇది ఎంత వరకు నిజం? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో దయచేసి తెలియజేయగలరు. – పి.సుమ, సికింద్రాబాద్ గర్భం దాల్చిన తర్వాత శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. మానసిక మార్పులు, హార్మోన్స్‌లో మార్పులు కూడా దానికి తోడవుతాయి. ప్రెగ్నెన్సీ సమయంలో కొంతమంది మానసికంగా ఒత్తిడికి గురవుతారు. వారిలో ప్రెగ్నెన్సీకి సంబంధించి ఆలోచనలు, సందేహాలు, పని ఒత్తిడి, తమ జీవితంలోకి కొత్తగా వచ్చే బిడ్డ గురించిన ఆలోచనలతో సతమతమవుతుంటారు. ఈ మార్పుల వల్ల కొందరిలో ఏకాగ్రత కోల్పోవటం, కొద్దిగా మతిమరుపు రావడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీనినే డెమన్షియ అంటారు. ఇది అందరి గర్భవతులలోను ఉండాలని లేదు. అది ఒక్కొక్కరి జీవనశైలిని బట్టి, వారి మనస్తత్వాన్ని బట్టి, కుటుంబ సభ్యులను బట్టి కొందరిలో ఉండవచ్చు. ముఖ్యంగా గర్భం దాల్చిన వారికి కుటుంబ సభ్యుల అండ చాలా అవసరం. వారిచ్చే ధైర్యం, తోడ్పాటు వల్లనే ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అలాగే, ఈ సమయంలో జరిగే మార్పులు, ఇబ్బందులకు వీరు ఆందోళన చెందకుండా సంతోషంగా ఉండగలుగుతారు. దానివల్ల డెమన్షియ లక్షణాలు పెద్దగా ఉండవు. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో కొద్దిగా వాకింగ్, ధ్యానం, ప్రాణాయామం వంటి చిన్న చిన్న వ్యాయామాలు చెయ్యడం వల్ల కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. నేను చేపలు తింటానుగానీ, మరీ ఎక్కువగా తినను. అయితే... ఎర్లీ స్టేజీలో తగినంత పరిమాణంలో చేపలను ఆహారంగా తీసుకోకపోవడం వల్ల నెలలు నిండక ముందే డెలివరీ అయ్యే అవకాశాలు ఉన్నాయని విన్నాను. ఇది ఎంతవరకు నిజం? చేపల్లో కూడా రసాయనాలు వాడుతున్నారనే వార్తలు చదివాక...తినాలంటే భయమేస్తోంది. దీనికి ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా? – ఆర్.నీరజ, జంగారెడ్డిగూడెం చేపలు తినకపోవటం వల్ల నెలలు నిండకుండా డెలివరీలు అవుతాయని ఎక్కడా లేదు. నెలలు నిండకుండా పుట్టడానికి గర్భాశయంలో సమస్యలు, కొన్నిరకాల ఇన్ఫెక్షన్స్, బీపీ, సుగర్ వంటివి ఎన్నో కారణాలు కావచ్చు. కాకపోతే చేపలలో ఈఏఅ, ఉ్కఅ∙అనే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అలాగే కొద్దిగా ప్రొటీన్స్, విటమిన్ డి ఉంటాయి. ఈ ఒమేగ ఫ్యాటీ యాసిడ్స్ మిగతా ఆహారంలో పెద్దగా లభించదు. ఇవి బిడ్డ మెదడు, కళ్లు ఎదుగుదలకు చాలా ఉపయోగపడతాయి. అలా అని బాగా ఎక్కువగా చేపలు తినాలని ఏం లేదు. వారానికి రెండు సార్లు తీసుకోవచ్చు. కొన్ని పరిశోధనలలో చేపలు తినటం వల్ల కొందరిలో నెలలు నిండకుండా జరిగే కాన్పులను తగ్గించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేయడం జరిగింది. అలాగే పిల్లల బరువు కూడా మరీ తక్కువగా లేకుండా ఉంటారని అంచనా వేయడం జరిగింది. చేపలు నీటిలో ఉండే మెర్క్యురీని పీల్చుకుంటాయి. కొన్నింటిలో ఇది తక్కువగా, మరికొన్నింటిలో ఎక్కువగా ఉంటుంది. అది ఆ నీటిలో విడుదలయ్యే పదార్థాలు, విషవాయువులను బట్టి ఉంటుంది. సముద్రపు చేపలలో మెర్క్యురీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. బయట మంచినీటిలో పెంచే చేపలలో పెద్దగా మెర్క్యురీఉండదు. కొద్దిగా మెర్క్యురీ ఉండటం వల్ల బిడ్డకు ఇబ్బంది ఉండదు. మెర్కురి అధిక శాతం ఉన్న చేపలు ఎక్కువగా తీసుకోవడం వల్ల, బిడ్డలో నరాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇవి రోజుకొకటి చొప్పున తీసుకోవచ్చు. బాలింతలు ఎలాంటి ఆహారం తీసుకోవాలనే విషయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతున్నారు. బాలింతలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి ఆహారం తీసుకోకూడదు? అనేదాని గురించి వివరంగా తెలియజేయగలరు. – కె.రూప, పార్వతీపురం గర్భంతో ఉన్నప్పటి కంటే కాన్పు తరవాత బాలింతకు ఆహారం ఎక్కువ అవసరం. గర్భంతో ఉన్నప్పుడు, తల్లి కడుపులో పెరిగే బిడ్డకు మామూలుగా కంటే ఆహారంలో 300 కేలరీల శక్తి అవసరం ఉంటుంది. అదే బాలింతకు 600 కేలరీల శక్తి అవసరం ఉంటుంది. ఈ కేలరీల బలం, తల్లిలో తొమ్మిది నెలల తర్వాత వచ్చిన శరీర మార్పులను, బలహీనతల నుండి తేరుకోవడానికి అలాగే తల్లి పాల ద్వారా బిడ్డ మానసిక, శారీరక ఎదుగుదలకు అవసరం. ఇది తల్లి తీసుకునే పౌష్టికాహారం ద్వారా లభిస్తుంది. మన దేశంలో బాలింత అది తినకూడదు, ఇది తినకూడదు, వాటి వల్ల చీము పడుతుంది, పప్పు తింటే కుట్లు మానవు, నీళ్లు ఎక్కువగా తాగితే పొట్ట వస్తుంది, పెరుగు, పండ్లు తింటే బిడ్డకు జలుబు చేసే అవకాశం ఉంటుంది అనే ఎన్నో అపోహలు, మూఢనమ్మకాలతో చాలా మంది పెద్దవాళ్లు.. బాలింతకు ఆహారం సరిగా ఇవ్వకుండా కారంపొడులు వంటి వాటితో సరిపెడుతుంటారు. నిజానికి ఇది ఎంత మాత్రం సరికాదు. ఆహారంలో అన్నం, పప్పులు, అన్ని రకాల కూరగాయలు, మాంసాహారులైతే మాంసం తీసుకోవడం వల్ల, వాటిలో ఉండే కార్బోహైడ్రేౖట్స్, ప్రొటీన్స్ కుట్లను తొందరగా మానిపోయేటట్లు చేస్తాయి. తల్లిలో అలసటను దూరం చేస్తుంది. బిడ్డకు సరిపడా పాలు పడతాయి. నీళ్లు బాగా తాగడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ లేకుండా ఉంటుంది. మలబద్ధక సమస్య పూర్తిగా తగ్గుతుంది. పాలు బాగా వస్తాయి. బిడ్డ తల్లి పాలు తాగడం వల్ల, తల్లిలోని పోషకాలు తీసేసుకోవడం వల్ల తల్లి బలహీనంగా తయారవుతుంది. అందుకే బాలింతల ఆహారంలో తప్పనిసరిగా రెండు గ్లాసుల పాలు, రెండు లీటర్ల నీళ్లు, అన్నం, చపాతీ, ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, పండ్లతో పాటూ పెరుగు, రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా మెంతులు లేదా మెంతికూర వంటివి తీసుకోవడం వల్ల పాలు బాగా పడతాయి. అలాగే తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. ఆహారంలో నూనె, కారం, మసాలా వంటివి తగ్గించుకోవాలి. జంక్ ఫుడ్ వంటివి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో ,హైదర్‌నగర్ హైదరాబాద్ -
'ఆత్మలను తరిమికొడితే సెక్రటేరియట్‌కు వస్తాం'
సాక్షి, జైపూర్ : దెయ్యాలు, ఆత్మలు రాజస్థాన్ సెక్రటేరియట్లో హల్ చల్ చేస్తున్నాయట. ఇవి వదంతులు కాదు. ఈ మాటలు చెబుతున్నది స్వయంగా రాజస్థాన్ ప్రభుత్వ ఎమ్మెల్యేలే. ఇటీవల కాలంలో చనిపోయిన ఇద్దరు రాజస్థాన్ ఎమ్మెల్యేలు చనిపోవడంతో వారు చనిపోయి దెయ్యాలుగా మారి తిరుగుతున్నారంటూ వారే స్వయంగా చెబుతున్నారు. వెంటనే భూత వైద్యులు, వివిధ మతాల ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించకపోతే తాము సెక్రటేరియట్లో అడుగు కూడా పెట్టబోమంటూ వారు కుండబద్ధలు కొట్టినట్లు చెబుతున్నారు. తాను ముఖ్యమంత్రి వసుంధర రాజేకు సెక్రటేరియట్ భవనంలో ప్రత్యేక పూజలు జరిపించాలని, చుట్టుపక్కల ఏమీ రాకుండా చూడాలని ప్రత్యేకంగా చెప్పినట్లు బీజేపీ ఎమ్మెల్యే హబీబుర్ రహ్మాన్ తెలిపారు. ఒకప్పుడు శ్మశానంగా ఉన్న ప్రాంతంలో సెక్రటేరియట్ నిర్మించారని, దాంతో అందులో దెయ్యాలు తిరుగుతూ ఎమ్మెల్యేలను భయపెడుతున్నాయని ఆయన అన్నారు. 2001లో ఈ భవనం నిర్మించారు. -
టైమొచ్చింది!
ఓ కిటికీ లేని గది శతాబ్దాల నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టింది దశాబ్దాలుగా గుండెల్లో గూడుకట్టుకున్న భయాన్ని జయించిన మహిళలే ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకొని తమ గుండె గాయాలకు స్వాంతన చేకూర్చుకున్నారు. అక్కడకు చేరినవారంతా స్త్రీలు. బతుకు బండిని లాగేందుకో, కన్నబిడ్డల కడుపు నింపేందుకో, తల్లిదండ్రుల బాధ్యతను భుజానికెత్తుకున్నందుకో, భర్త చేతిలో మోసపోయినందుకో తోటి ఉద్యోగులైన పురుషుల నుంచీ, ఇతరుల నుంచీ తామెదుర్కొన్న అనేకానేక అవమానాలను, అవహేళనలను, వేధింపులను, చివరకు అత్యాచార యత్నాల చేదు అనుభవాలను సైతం గుండె గొంతుకలోంచి దిగమింగిన వైనాన్ని తొట్టతొలిసారిగా మనసు విప్పి మాట్లాడారు. ఆర్థిక స్వావలంబనే ఆకాశంలో సగభాగాన్ని ఆత్మస్థైర్యంతో నిలబెడుతుందన్న ఒకే ఒక్క కారణం మహిళలను భద్రత లేకున్నా పని ప్రదేశాల్లో కొనసాగేలా చేస్తుంది. స్త్రీ పురుష సమ్మతితో జరగాల్సిన రెండు మనసుల శారీరక కలయికని జుగుప్సాకరమైన లైంగిక హింసాప్రయోగంతో స్త్రీలను వారి పని ప్రదేశాల నుంచి తరిమికొడుతోన్న విషయం చాలా కాలంగా దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ చర్చనీయాంశమైంది. ఇదే నేప«థ్యంలో ఇటీవల లైంగిక హింసపై నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టిన స్త్రీలను 2017వ సంవత్సరానికిగాను ‘టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్’గా టైమ్ మేగజైన్ ప్రకటించింది. అమెరికాతో పాటు అభివృద్ధి చెందిన దేశాల్లో లైంగిక వేధింపులకు గురైన మహిళలందరినీ టైమ్ మేగజైన్ శాన్ ఫ్రాన్సిస్కోలోని మిషన్ yì స్ట్రిక్ లోని ఓ గదిలో సమావేశపరిచింది. దశాబ్దాలుగా వారిని వెంటాడుతోన్న కన్నీటి గాథలు బద్దలైన అగ్నిపర్వతాలయ్యి, ఆ గదిని మరింత వేడెక్కించాయి. ఉన్నతోద్యోగాలు మొదలుకొని, కార్యాలయాలను శుభ్రపరిచే పారిశుద్ధ్య కార్మికురాలి వరకు పురుషుల వెకిలి చేష్టలకు, లైంగిక వేధింపులకు, అత్యాచార యత్నాలకూ గురైనవారున్నారక్కడ. విభిన్న వర్గాలు, వైవిధ్యభరితమైన ఉద్యోగాలు, భిన్నమైన ఆర్థిక పరిస్థితులు, హోదాలు, జీతాల్లో అంతరాలూ. అయినా వారందరినీ అక్కడకు చేర్చింది మాత్రం ఒక్కటే.. దివారాత్రులు తమను వెంటాడి వేటాడుతోన్న పురుష దేహాల పీడకలలు. అప్పటివరకూ అణచిపెట్టుకున్న వేనవేల చేదు అనుభవాలను చెప్పడం ప్రారంభించారు ఒక్కొక్కరుగా.. గాయాన్ని చూపిన గాయని టేలర్ స్విఫ్ట్ ... పాప్ సింగర్... ఓ సంగీత ఝరి. అదే ఆమెను డెన్వర్ రేడియో స్టేషన్లో డీజేగా పనిచేస్తోన్న ముల్లర్ ఆహ్వనాన్ని మన్నించేలా చేసింది. స్విఫ్ట్‌ని ఇంటర్వ్యూ చేయాల్సిన ముల్లర్ హఠాత్తుగా, అందరూ చూస్తూ ఉండగా ఆమె లోదుస్తుల్లోకి చేతులు పెట్టాడు! ఈ హఠాత్పరిణామానికి బిత్తరపోయిన టేలర్ స్విఫ్ట్ అతనికి దూరంగా జరిగేందుకు ప్రయత్నించింది. కానీ అతడి ఉక్కు పిడికిల్లోంచి బయటపడేందుకు గిజగిజలాడాల్సి వచ్చింది. గుండెల్ని పిండేసే ఈ ఘటనపై ఆమె రేడియో స్టేషన్ వారికి ఫిర్యాదు చేసింది. టేలర్ స్విఫ్ట్, ఆమె తల్లి విచారణ సమయంలో కూడా అనేక అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాల చీకటి చరిత్రను బహిరంగంగా చర్చించాలని టేలర్ స్విఫ్ట్ తొలిసారిగా అక్కడే నిర్ణయించుకున్నారు. ఆమెతో పాటు ఆమెలాంటి బాధితులు. అన్ని రంగాల్లోని వాళ్లు. ఒక్కో ‘మీ టూ’.. ఒక్కో కడలి టేలర్ స్విఫ్ట్ అయినా, కాలిఫోర్నియా పొలాల్లో పనిచేస్తోన్న శ్రామికురాలైనా, న్యూయార్క్ సిటీలోని రీగల్ ప్లాజా హోటల్లో పనిచేసే హౌస్ కీపర్ అయినా అందరూ తమపై జరిగిన అఘాయిత్యాలను గొంతెత్తి ప్రతిఘటించడమొక్కటే పరిష్కారంగా భావించారు. అందుకు ‘మీ టూ’ నినాదమే నాదమైంది. లైంగిక వేధింపులకు గురైన యువతులకు సంఘీభావం ప్రకటించే పనిలో భాగంగా ఒక దశాబ్దం క్రితం తరానా బర్క్ అనే సామాజిక కార్యకర్త ‘మీ టూ’ అనే నినాదాన్నిచ్చారు. తరానా స్ఫూర్తితో ‘మీరు ఏదైనా లైంగిక వేధింపులకు గురైతే ఈ ట్వీట్‌కి ‘మీ టూ’ అని రిప్లై యివ్వండంటూ అలీస్సా మిలానో అనే హాలీవుడ్ నటి ఓ రోజు రాత్రి ఓ స్క్రీన్ షాట్‌ని పోస్ట్ చేశారు. మిలన్ నిద్రలేచి చూసేసరికి 30 వేల మంది ‘మీ టూ’ అని దానికి రిప్లై యివ్వడం చూసి ఆమె కళ్లు నీటితో నిండిపోయాయి. జీతం రాళ్ల కోసమే ఈ మౌనం ‘‘నన్ను వెంటాడుతోన్న చూపుల తాకిడిని నేను గ్రహించాను. హోటల్ గదిని శుభ్రం చేసి తిరిగి చూసేసరికి గది తలుపుకి అడ్డంగా ఆ వ్యక్తి ఆబగా నాపై దాడికి సిద్ధంగా నగ్నంగా ఉన్నాడు’’ అంటూ జరిగిన దారుణ దృశ్యాన్ని వివరిస్తోంది జూవానా మెలారా. ఈ హోటల్లో బసచేసేవారి వే«ధింపులపై ఫిర్యాదు చేయకపోవడానికి తమకు రావాల్సిన జీతం రాళ్లే కారణమంటారు గత దశాబ్ద కాలంగా హోటల్ లో హౌస్ కీపర్‌గా పనిచేస్తోన్న జువానా మెలారా. మరోసారి ఆలోచించమన్నారు ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేస్తుండే ‘ఐవూ’దీ ఇదే అనుభవం. తన సహోద్యోగు లందరి ఎదుటా తన శరీరాన్ని తడిమి లైంగిక దాడికి పాల్పడ్డ వ్యక్తిని గురించి ఫిర్యాదు చేయడానికి ఒక్కరూ ముందుకు రాకపోవడంపై ఐవూని కలచివేస్తుంది. తన సహ మహిళా ఉద్యోగులు దాదాపు 150 మంది సంతకాలతో తనపై జరిగిన లైంగిక దాడిపై కాలిఫోర్నియా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు వెళ్లినప్పుడు ‘ఇది నిజమేనా? నిజంగా నువ్వు ఫిర్యాదు చేయబోతున్నావా? మరోమారు ఆలోచించుకొమ్మని హెచ్చరించడం మనలో పాతుకుపోయిన ఉదాసీన ధోరణికి చిహ్నమేనంటారామె. ఎలుగెత్తితేనే వెలుగొస్తుంది లైంగిక వేధింపులకు గురైన సూజెన్ ఫౌలర్ బ్లాగ్‌లో చేసిన ఒక పోస్ట్ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఉబర్ చీఫ్ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్ ట్రావిస్ కెలానిక్ రాజీనామాకి దారితీసిన ఘటన.. ప్రతిఘటన ప్రభావాన్ని ఎలుగెత్తి చాటింది. ట్రావిస్ సహా మరో 20 మందికి ఉబర్ ఉద్వాసన పలికింది. ఇరవై ఏళ్లుగా బతుకు భయం జేమ్స్ టోబాక్ అనే ఇండిపెండెంట్ ఫిల్మ్‌మేకర్‌తో సమావేశమవడానికి సెల్మా బ్లెయర్ 1999లో ఓ రెస్టారెంట్‌కి వచ్చారు. కానీ జేమ్స్ టోబాక్ హోటల్ గది తలుపులు మూసి తన కోర్కె తీర్చాలంటూ ఒత్తిడి చేసిన విషయాన్ని చెపుతూ ‘‘నేను తనని ఎదిరించి ఉంటే అతను నన్ను కిడ్నాప్ చేసేవాడనీ, తన దగ్గరున్న పెన్నుతో నా కళ్లు పెరికి హడ్సన్ నదిలో తోసేస్తాననీ బెదిరించాడు. దాదాపు 20 ఏళ్ల పాటు తాను నన్ను చంపుతాడనే భయంతోనే బతికాను’’ అని వెల్లడించి, సినీప్రపంచపు లైంగిక వేధింపుల పరంపరను మరోమారు తెరపైకి తెచ్చారు సెల్మా బ్లెయర్. నా బిడ్డలనూ వదలనన్నాడు ‘‘నాపై లైంగిక హింసకు పాల్పడిన వ్యక్తి ఇంటి వరకూ వచ్చాడు. ఇంటి లోనికి కూడా. ఈ విషయం ఎవరితోనైనా చెబితే తాను ఇకపై నా కోసమే కాదు, నా పిల్లలకోసం కూడా వస్తానని బెదిరించాడు.. అతనికి లొంగకపోతే’’ అని చెప్పారు పాస్క్యుయల్ ఫెల్ట్.ఇలా మౌనాన్ని ఛేదించి.. తమపై జరిగిన లైంగిక వేధింపులు, దాడులు, అత్యాచారాలపై ధైర్యంగా మాట్లాడిన ఎందరో మహిళల మనోబలానికి సంకేతంగా ప్రఖ్యాత ‘టైమ్’ మేగజైన్.. స్త్రీ ఉద్యమ శక్తిని ఈ ఏడాది ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ప్రకటించింది. – అత్తలూరి అరుణ, సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
అవి ఆత్మల కదలికలేనా?!
-
అవి ఆత్మల కదలికలేనా?!
ఆత్మలు, దయ్యాలు, భూతాలు ఉన్నాయా? లేవా? ఈ ప్రశ్నలకు సమాధానాలు మాత్రం ఎరికి తోచినట్టు వాళ్లు చెబుతారు. కానీ ఖచ్చితమైన జవాబులు మాత్రం ఎవరి వద్దనుంచి రావు. అయితే అప్పుడప్పుడూ.. మేం మీకు కనిపించకపోయినా ఉన్నాం.. అందుకు ఇదిగో నిదర్శనం అంటూ ఆత్మలు చెబుతాయి. ఇంగ్లడ్‌లోని ప్రఖ్యాత కాంటెర్బరీ నగరం. అందులో టేలర్స్ క్లిన్ అనే పబ్ తెలియని వారుండరు. పగలు.. రాత్రి అన్న తేడా లేకుండా.. జనాలు అక్కడ సమయాన్ని గడిపేస్తారు. ఎప్పటిలానే రాత్రి బాగా పొద్దుపోయాక పబ్‌నుంచి జనాలు వెళ్లిపోయాక.. అక్కడి సబ్బంది కూడా తాళాలు వేసి ఇంటికెళ్లారు. పబ్ సిబ్బంది ఇంటికెళ్లే సమయంలో కిటికీలు, లైట్లు, ఫ్యాన్లు, ఇలా అన్నింటిని జాగ్రత్తగా ఆఫ్ చేసి వెళ్లారు. అయితే ఉదయాన్నే మళ్లీ పబ్ తెరిచేసరికి కిటికీలు తెరిచిఉండడం, కొన్ని గదుల్లో ఫ్యాన్లు, లైట్లు వేసి ఉండడాన్ని పబ్ యజమాని ఆలిస్టర్ కొలిన్స్ గుర్తించారు. కరెంట్ వృధా అవుతుండడంతో సిబ్బందిపై ఆయన కేకలేశారు. ఉద్యోగులు మేము చాలా జాగ్రత్తగా అన్ని ఆఫ్ చేశామని.. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదని చెప్పారు. ఆగస్టు 4 నుంచి దాదాపు ప్రతి రోజూ ఇలాగే జరుగుతోందని సిబ్బంది యజమానికి చెప్పారు. విషయం ఏమిటో తెలుసుకుందామని.. ఆయన సీసీటీవీ ఫుటేజ్ తెప్పించారు. ఫుటేజ్ చూడగానే ఆలిస్టర్తో పాటు సిబ్బందికి కాళ్లు, చేతులు వణికిపోయాయి. సిబ్బంది అంతా రాత్రి ఇంటికి వెళ్లిపోయాక.. కుర్చీలు వాటంతట అవే కదిలేవి. కిటికీలు, లైట్లు, ఫ్యాన్లు ఇలా అన్నింటికీ ఎవరో తెరిచేవారు. సోపాల్లో విలాసవంతంగా కూర్చున్న ఆనవాళ్లు.. మద్యం తాగుతున్నట్లుగా కనిపించే దృశ్యాలు అందరినీ విస్మయానికి గురిచేశాయి. ఆత్మలు.. దయ్యాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ.. కంటికి కనిపించని శక్తులు ఏవో నా పబ్‌లో ఉన్నాయని ఆలిస్టర్ భయపడ్డారు. అంతేగాక ఆ వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడాయో ఇప్పుడు ఫేస్బుక్లో వైరల్‌గా మారింది. -
ఆ బీచ్‌లో ఆత్మలు ఉన్నాయా..?
అనగనగా ఓ బీచ్.. చుట్టూ చిమ్మచీకట్లు.. హోరున శబ్దం చేసే అలలు.. చీకటికే భీతి గొలిపించే నల్లని సముద్రపు ఇసుక.. చిత్రవిచిత్రంగా వీచే పిల్లగాలులు.. చెవి దగ్గరకొచ్చి ఎవరో ఏదో చెబుతున్నట్టుగా వినీవినిపించని మాటలు.. అంతలోనే ఒళ్లు గగుర్పొడిచేలా బిగ్గరగా ఓ నవ్వు.. దూరంగా ఎవరితోనో కొట్లాటకు దిగినట్టుగా కుక్కల అరుపులు.. చుట్టూ చూస్తే ఎవరూ కనిపించని మాయాజాలం.. ఇవి చాలవూ ఓ మనిషి బిక్కచచ్చిపోవడానికి..? గుజరాత్‌లోని సూరత్‌కు 19 కిలోమీటర్ల దూరాన ఉన్న డ్యూమస్ బీచ్ గురించి కథలు కథలుగా చెప్పుకొంటారు పర్యాటకులు. ఇక్కడ ఆత్మలు ఉన్నాయని, అవి రాత్రి పూట బీచ్ ఒడ్డున సంచరించే వారికి హాని తలపెడతాయనేది ప్రధానంగా వినిపించే మాట. సాయంత్రం అయితే చాలు. స్థానికులు ఈ బీచ్ వైపు రావడానికి అస్సలు ఇష్టపడరు. పైగా ఎవరైనా డ్యూమస్ వైపు వెళ్తామనగానే అడ్డుపడతారు. అటువైపు వెళ్లొద్దంటూ సలహాలిస్తారు. నిజంగా ఈ బీచ్‌లో అంతగా భయపెట్టే అంశమేంటి..? నల్లని ఇసుక.. నిజానికి డ్యూమస్ బీచ్ ఒకటి కాదు.. నాలుగు బీచ్‌లను కలిపి డ్యూమస్ బీచ్‌గా పిలుస్తారు. వీటిలో రెండు పర్యాటకులకు బాగా తెలిసినవే. మూడో బీచ్‌ను కొద్దిమంది మాత్రమే సందర్శిస్తారు. ఇక, నాలుగో బీచ్‌లో జనసంచారం గురించి మాట్లాడుకోకపోవడమే మేలు. దేశంలోని ఏ బీచ్లోనూ కనిపించని విధంగా ఈ బీచ్‌లో నల్లని ఇసుక దర్శనమిస్తుంది. దీనికి స్థానికులు చెప్పే వివరణ.. స్మశానం! అవును, ఒకప్పుడు డ్యూమస్ బీచ్‌లో ఓ హిందూ స్మశానం ఉండేది. వేలాది హిందువులను అక్కడే ఖననం చేసేవారు. అలా ఏర్పడిన బూడిద.. సముద్రపు ఇసుకతో కలిసి నల్లగా తయారైందని చెబుతారు స్థానికులు. ఆత్మల సంచారం.. హిందూ మత విశ్వాసాల ప్రకారం మరణించినవారు సంతృప్తి చెందకపోతే వారి ఆత్మ అక్కడే సంచరిస్తూ ఉంటుంది. అలా వేలాది ఆత్మలు ఈ బీచ్‌లో సంచరిస్తున్నాయని చాలామంది నమ్మకం. రాత్రి వేళల్లో బీచ్ ఒడ్డున తిరిగేవారికి ఈ ఆత్మల గొంతు వినిపిస్తుందని, కొన్ని ఆత్మలు అక్కడి నుంచి వెళ్లిపొమ్మన్నట్టుగా చిత్రవిచిత్రంగా అరుస్తాయని గ్రామస్థులు చెబుతారు. కొన్నిసార్లు ఉన్నట్టుండి బిగ్గరగా ఎవరో నవ్వుతున్నట్టుగా అనిపిస్తుందని, కానీ చుట్టూ చూస్తే ఎవ్వరూ కనిపించరని కొందరు పర్యాటకులు చెబుతారు. సాధారణంగానే అత్యంత నల్లని డ్యూమస్ బీచ్.. చీకటి పడుతున్న కొద్దీ జడల మర్రిలా మరింత భయంకర రూపాన్ని సంతరించుకుంటుంది. పర్యాటకులు, స్థానికులు భయపడేందుకు ఇదీ ఓ కారణం కావొచ్చు. విచిత్ర ప్రవర్తన.. డ్యూమస్ బీచ్ గురించి చాలామంది పర్యాటకులు చెప్పేది ఇక్కడి విచిత్రమైన వాతావరణమే. సాధారణంగా కుక్కలు ఈ బీచ్‌కు రాగానే అదే పనిగా అరుస్తూ ఉంటాయట. ఎవరినో చూస్తున్నట్టు, వారితో గొడవ పడుతున్నట్టు కుక్కలు విచిత్రంగా ప్రవర్తిస్తాయట. పెంపుడు కుక్కలదీ ఇదే పరిస్థితి. ఈ కుక్కల యజమానులు వాటిని నియంత్రించడానికి నానా తంటాలూ పడతారట ఈ బీచ్‌లో. ఇవి కాకుండా.. పర్యాటకుల శరీరాలను ఏవో గాలులు తాకుతున్నట్టూ, వారిని ముందుకు వెళ్లవద్దనట్టుగా అడ్డుకుంటున్నట్టూ అనుభూతి కలుగుతుందట. మిస్సింగ్...? స్థానికుల మాటలు పెడచెవిన పెట్టి, రాత్రి పూట బీచ్‌ను సందర్శించిన కొందరు పర్యాటకులు ఇప్పటికీ కనిపించకుండా పోయారనే ఓ పుకారు సమీప గ్రామాల్లో వినిపిస్తూ ఉంటుంది. గతంలో కొందరు స్థానికులు కూడా బీచ్‌కు వెళ్లి తిరిగిరాలేదట. భయపెట్టే హవేలి.. ఈ బీచ్‌లో మరింత భయపెట్టే కథలు హవేలి విషయంలో వినిపిస్తాయి. నవాబు సిది ఇబ్రహీం ఖాన్ కట్టించిన ఈ ప్యాలెస్‌లో ప్రస్తుతం మనుషులెవరూ నివసించడం లేదు. ఈ హవేలీ బాల్కనీలో ఎవరో నిల్చున్నట్టుగా కనిపిస్తుందట. దగ్గరగా వెళ్లి చూస్తే ఆ ఆకారం మాయమవుతుందట. అందుకే స్థానికులు సైతం హవేలిలోకి వెళ్లేందుకు సాహసించడం లేదు. ఇక, పర్యాటకులను ఇందులోకి చాలా ఏళ్ల కిందటి నుంచే అనుమతించడం లేదు. అంతా భూటకం.. ఈ మొత్తం కథనాన్ని భూటకమని కొట్టి పారేసేవారూ ఉన్నారు. చాలామంది మొండిగా ఈ బీచ్‌లో రాత్రిపూట బస చేశారు. కానీ, వారు ఇక్కడ ప్రచారంలో ఉన్నట్టుగా.. తమకు ఎలాంటి అసహజ అనుభవాలూ ఎదురుకాలేదని చెబుతున్నారు. కొంతమంది వ్యక్తులు కావాలనే దుష్ప్రచారం మొదలుపెట్టారని, నిజానికి డ్యూమస్లో అంతటి భయానక వాతావరణం ఏమీ ఉండదని చెబుతున్నారు. అయితే, కొంతమంది తమ కెమెరాల్లో బంధించిన కొన్ని దృశ్యాలు ఆత్మలు ఉన్నాయనడానికి బలం చేకూర్చుతున్నాయి. అదే సమయంలో అవి ఫ్లాష్ లోపాల వల్ల ఏర్పడిన ఇల్యూజన్ అనేవారూ లేకపోలేదు. మొత్తానికి ఇక్కడ ఆత్మలు ఉన్నాయా.. లేదా అన్నది పక్కన బెడితే, ప్రస్తుతం దేశంలోని డిమాండ్ ఉన్న బీచ్‌ల్లో ఇదీ ఒకటిగా మారిపోయింది. ఆత్మలా మజాకానా..! - (సాక్షి స్కూల్ ఎడిషన్) -
ఆత్మస్థైర్యం కోల్పోవద్దు
బెంగళూరు: ‘పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు, మీ సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ఏ అధికారి కూడా ఆత్మహత్యకు పాల్పడవద్దు’ అని రాష్ట్ర హోం శాఖ మంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ పోలీసులను కోరారు. బుధవారమిక్కడ తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎస్ఐ రూపా తంబద ఆత్మహత్యా యత్నంపై ఈ సందర్భంగా పరమేశ్వర్ స్పందించారు. ‘పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరుతున్నాను. మీకు ఏవైనా సమస్యలు ఉంటే ధైర్యంగా మా దృష్టికి తీసుకురావచ్చు. వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం కచ్చితంగా ప్రయత్నిస్తుందని హామీ ఇస్తున్నాను. మీకు ఏదైనా శాఖాపరమైన సమస్యలు ఉంటే చట్టపరంగా పోరాడండి, లేదంటే ఆంతరంగిక ఫిర్యాదు సమితిలో ఫిర్యాదు చేయండి, అంతేకానీ ఆత్మహత్య వంటి నిర్ణయాలు తీసుకొని మీ కుటుంబాలను అనాధలను చేయకండి’ అని సూచించారు. నివేదిక కోరాం... ఇక ఎస్ఐ రూపా తంబద ఆత్మహత్యా యత్నం అంశానికి సంబంధించి విజయనగర ఇన్స్పెక్టర్ సంజీవ్గౌడ, రూపా మధ్య మనస్పర్థలు ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదికను అందజేయాల్సిందిగా ఇప్పటికే ఉన్నతస్థాయి అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. నివేదిక అందిన అనంతరం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. -
ప్రేతాత్మలున్నాయంటూ.. తల్లీకూతుళ్ల నిర్వాకం
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా బలగలో ఓ తల్లీకూతుళ్ల నిర్వాకానికి స్థానికులు విస్తుపోయారు. ప్రేతాత్మలున్నాయంటూ ఇంట్లో గొయ్యిను తీసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సుమారు 20 అడుగుల గొయ్యిను తీసి అందులో తల్లీకూతుళ్లు నివాసముంటున్నారు. స్థానికులెవ్వరినీ ఆ ఇంటిలోనికి రాకుండా ఎప్పుటికప్పుడూ అడ్డుకుంటూ వచ్చారు. వీరి కదలికలపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగారు. చాలా సేపటి వరకు పోలీసులను కూడా లోపలికి అనుమతించలేదు. ఇంటిలో ప్రేతాత్మలున్నాయని రావద్దని వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు ఇంటిలోనికి ప్రవేశించిన పోలీసులు ఆశ్యర్యపోయారు. ఇంటి కింద భాగంలో తీసిన పెద్ద గొయ్యిను పోలీసులు గుర్తించారు. వారి మానసిక స్థితి సరిగ్గా లేక ఆ విధంగా ప్రవర్తిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. -
హామీల అమలులో సీఎం విఫలం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య ఆత్మస్థైర్యం పెంచుకోవాలి యువత ఆత్మస్థైర్యం పెంపొందించుకోవాలి. ఏదైనా సాధించగలమనే విశ్వాసంతో ముందుకు సాగితే లక్ష్య సాధన కష్టం కాదు. ప్రణాళికాబద్ధంగా ఇష్టపడి చదవాలి. పాఠ్యాంశాలతో పాటు సమాజానికి ఉపయోగపడే ఇతర పుస్తకాలను కూడా అధ్యయనం చేయూలి. ఇతరులకు మేలు చేస్తూ, అందరికీ మార్గదర్శకంగా ఉండాలి. - సర్పరాజ్ అహ్మద్, గ్రేటర్ వరంగల్ కమిషనర్ కాజీపేట రూరల్ : ముఖ్యమంత్రి కే సీఆర్ ఇచ్చిన పాత హమీలకే దిక్కులేదని.. వాటిని అమలు చేయకుండానే మళ్లీ వాగ్దానాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య విమర్శించారు. హన్మకొండలోని రాయల్ గార్డెన్లో సోమవారం జరిగిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ అధికారంలోకి రాకముందు, ఆ తర్వాత అనేక హామీలు ఇచ్చారని, అందులో ఏవీ అమలు చేయలేదని ఆరోపించారు. దీనిపై జిల్లా ప్రజలకు టీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోయూయని, పండిన వాటికీ గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని, వారికి భరోసా కల్పించడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని అన్నారు. రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేయూలని, పంటలకు గిట్టుబాటు ధరతో పాటు రూ.500 నుంచి రూ.1000 వరకు బోనస్ ప్రకటించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా.. 11 మండలాలనే కరువుగా ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు. సంపూర్ణ కరువు జిల్లాగా ప్రకటించి సహాయ చర్యలు చేపట్టాలన్నారు. మూడుచెక్కలపల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్థినుల మృతిపై సీబీఐతో విచారణ చేరుుంచాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సమావేశానికి హాజరైన నాయకులు మొదట దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెన్నారెడ్డి మహేందర్ రెడ్డి, సంగాల ఈర్మియా, పూజారి సాంబయ్య, రాష్ట్ర కార్యదర్శి మునిగాల విలియం, సంయుక్త కార్యదర్శి నాడెం శాంతికుమార్, గ్రేటర్ అధ్యక్షుడు కాయిత రాజ్‌కుమార్ యాదవ్, ఎండి.బద్రుద్దిన్ఖాన్, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు దుప్పటి ప్రకాష్, గౌని సాంబయ్య గౌడ్, మునిగాల క ళ్యాణ్రాజ్, మంచె అశోక్, అప్పం కిషన్, మేకల కేదారి యాదవ్, కోగిల చంద్రమౌళి, వీరగోని రాజ్‌కుమార్ గౌడ్, అచ్చిరెడ్డి, గుండా రాజేష్‌రెడ్డి, నర్సయ్య, మేకల రవీందర్, ధర్మరాజు, దొంతి కమలాకర్‌రెడ్డి, సుధాకర్, బొడ్డు శ్రావణ్, దయాకర్ పాల్గొన్నారు. -
మరణించిన తర్వాత మనిషి ఏమవుతాడు?
మృత్యువు అనంతరం ఆత్మ ఏం చేస్తుంది? మరణించిన ప్రతి జీవీ తప్పనిసరిగా తిరిగి జన్మ ఎత్తుతుందా? మానవ జన్మకు రాని అంటే పునర్జన్మ లేని ఆత్మలు ఎక్కడ ఉంటాయి? ఎలా ఉంటాయి? ఇటువంటి సందేహాలు చాలామందిలో మెదళ్లను తొలిచేస్తూనే ఉంటాయి. ఈ సందేహాలు ఇప్పటి తరానివి కావు... కొన్ని వేల ఏళ్ల క్రితమే సత్యకామ జాబాలి అనే బాలకుడికి వచ్చాయట. కాదు కాదు... తెగ పీడించుకు తినడంతో అనుభవంతో, జ్ఞానంతో తలపండిన పెద్దల ముందుంచాడట తన సందేహాలను. అయితే ఎవరి నుంచీ సంతృప్తికరమైన సమాధానం లభించలేదట. దాంతో సత్యకామ జాబాలి ఈ సంగతేదో మృత్యువునే అడిగి తేల్చుకుందామని కఠోర తపస్సు చేసి మృత్యువును ప్రత్యక్షం చేసుకుని ఆత్రంగా అడిగాడట. అయితే మృత్యువు కూడా మౌనమే వహించిందట. అంటే మృత్యువు కూడా తన పరిధి దాటి తెలుసుకోలేదన్నమాట. ఎందుకంటే దానికే జీవం లేదు కాబట్టి, దానిగుండా ప్రయాణించాల్సిన జీవుడే అంటే మానవుడే దానికి సమాధానం తెలిసినవాడు. అయితే పునర్జన్మ సిద్ధాంతాన్ని అందరూ నమ్మరు కదా మరి! ఇప్పటి రోజులలో అయితే ఈ ప్రశ్న ఎవరినడిగినా ‘‘అదేం ప్రశ్న? మరణించిన తర్వాత ఇక జీవితమేంటి?’’ అంటూ ఆ ప్రశ్న వేసిన వారిని అమాయకులుగా జమకట్టేస్తారు చాలామంది. స్వర్గనరకాలు మన సంగతెలా ఉన్నా, మృత్యువు తర్వాత ఆత్మ భౌతికంగా తాను చేసుకున్న పాపపుణ్యాలను అనుసరించి స్వర్గం లేదా నరకాన్ని చేరుకుంటుందని ఇంచుమించు అన్ని మతాలూ చెబుతాయి. స్వర్గమనేది మరణం తర్వాత కూడా సుఖాలను అనుభవింపజేసేదని, అందుకే బతికినంతకాలం దానధర్మాలూ, పరోపకారాలూ చేసి, బోలెడంత పుణ్యం మూటక ట్టేసుకుని, ఆనక ఇంచక్కా స్వర్గసుఖాలను అనుభవించండని పెద్దలు చెబుతుంటారు. వాళ్లు చెప్పిన నాలుగు మంచిముక్కలూ చెవినేసుకోకుండా విచ్చలవిడిగా పాపాలు చేసేస్తే, నరకానికి పోతారు. అక్కడ వేడి వేడి నూనెలో వేగుతూ, చీమూ నెత్తురూతో నిండి, కుళ్లుకంపు కొట్టే వైతవరణీనదిలో పడి, ఉక్కిరిబిక్కిరవుతూ, ఇనుపశూలాలతో ఒళ్లంతా చిల్లులు పడేలా పొడిపించుకోవలసిందే... అని ఆస్తికులు చెబుతారు. మరణానంతర జీవితం గురించి తెలుసుకునేముందు అసలు మృత్యువంటే ఏమిటో చూద్దాం... ‘‘మృత్యువంటే జీవితానికి క్రీనీడ... జీవితం బొమ్మయితే మృత్యువు బొరుసు. ఈ జీవితాన్ని అనుక్షణం వెన్నంటి ఉండేది మృత్యువు. ఈ జీవితాన్ని కాపాడుకుంటూ పోయేదీ మృత్యువే. మృత్యువు జీవిత ద్వారబంధం దగ్గర కాపలా లేకపోతే రక్షణ ఎక్కడిది? అందుకే మృత్యువును కాదని జీవితాన్ని ప్రత్యేకంగా చూడలేం’’ అంటారు సికిందరాబాద్ తిరుమలగిరిలోని మాస్టర్ యోగాశ్రమ సంచాలకులు, యోగాపై అనేక గ్రంథాలను రాసిన డాక్టర్ వాసిలి వసంత కుమార్. ‘జీవితంలో పోరాడగలవారికే మృత్యుస్పర్శ తెలుస్తుంది. మనల్ని అతలాకుతలం చేసే పరిస్థితుల్లో సైతం మనం జీవితం నుంచి పారిపోకూడదు. పైగా ఎదురొడ్డి నిలవాలి. ఆ నిబ్బరం, ఆ నిలువరింపు ఉంటే మృత్యువు సైతం మనల్ని భయపెట్టలేదు. ఆ మృత్యుదర్శనం సైతం విశ్వరూప సందర్శనంలా మనల్ని అనందపరుస్తుంది’ అని ఆయన తన తాజా పుస్తకం ‘యోగానంద లహరి’లో చెబుతారు. అసలు మృత్యువంటే ఏమిటి? ఈ శరీరాన్ని కాదని అంతరాత్మ స్వేచ్ఛను పొందడమే మృత్యువు కదా! అంతరాత్మ స్వేచ్ఛగా ఏం చేస్తుంది? బాధ్యతగా మరో శరీరంలోకి ప్రవేశిస్తుంది. అంటే మరో రూపంలోకి పరిణమిస్తుందన్నమాట. మృత్యువు గురించి ఇంకాస్త లోతుగా చెప్పుకోవాలంటే.. మృత్యువు అనేది ఈ శరీరం నుంచి మరో శరీరంలోకి మార్పే. అంటే ఆత్మ అదే. అంతరాత్మ స్పందనలలో మార్పుండదు. అంతెందుకు.. మృత్యువుతో మనం ఈ శరీరాన్ని త్యజిస్తాం కాబట్టి ఆ తర్వాతి జీవితం అంటే పరజన్మ ఎలా ఉంటుందన్న భయం ఉండదు. ఆత్మ- మృత్యువులలో జీవితం బొమ్మ అయితే మృత్యువు బొరుసు. మృత్యువు బొమ్మ అయితే జీవితం బొరుసు. ఈ రెంటిలో ఒకదాని ఉనికి సాధ్యమైనప్పుడు రెండవదాని ఉనికి సాధ్యం కాదు. అంటే రెండవది అగోచరంగా ఉంటుంది. ప్రాణం ఎక్కడి నుండి, ఎలా అందుతుందో తెలుసుకుంటే మృత్యువుపై విజయం సాధించవచ్చని, దానికి ఏమాత్రం భయపడనవసరం లేదని ‘మృత్యువు తర్వాత జీవితం’ ‘యోగానంద లహరి’, ‘యోగసాధన’, ‘భానుమతి’ వంటి పుస్తకాలను రాసిన శ్రీ శార్వరి వంటి సీనియర్ రచయితలు చెబుతారు. మన కంటికి కమ్మిన పొర తొలగిపోతేనే జ్ఞానదృష్టి అలవడుతుందని, అందుకు యోగసాధన అవసరమంటారాయన. ప్రేతాత్మలు... పునర్జన్మలూ... కోరికలు తీరిన ఆత్మ వెంటనే పునర్జన్మ తీసుకుంటుందని, కోరికలు తీరకపోతే ప్రేతాత్మగా మారి, తన కోరికలను తీర్చుకోవడం కోసం ఇతరులను ఆశ్రయించి, వారి ద్వారా తీర్చుకుంటూ ఉంటుందని చాలా కథలలో, సీరియల్స్‌లో చదివే ఉంటాం, సినిమాలలో చూసే ఉంటాం. అప్పుడెప్పుడో అంటే ఏఎన్నారూ, ఎన్టీయారూ, శోభన్‌బాబుల కాలంలో వచ్చిన ‘దేవుడే గెలిచాడు’, ‘శ్రీ రామ రక్ష‘, ‘విశ్వరూపం’, సుమన్, చిరంజీవిల హయాంలోని ‘ఆత్మబంధం’, ‘యముడికి మొగుడు’ ఆ తర్వాతి కాలంలోని ‘ఆ నలుగురు’, రజనీకాంత్ ‘చంద్రముఖి’, దానికి సీక్వెల్‌గా వెంకటేష్‌తో తీసిన ‘నాగవలి’్ల, లారెన్స్ రాఘవేంద్ర తన నటనతో ఒక ఊపు ఊపేసిన ‘కాంచన’, నిన్నమొన్నల్లో వచ్చిన ‘గంగ’, ‘త్రిపుర’ వంటి సినిమాలన్నీ ‘ఆత్మీయై’మెనవే! విఠలాచార్య సినిమాలు, హారర్ చిత్రాలు సరేసరి. శరీరం రోమాంచితమయ్యే అలాంటి సినిమాలు అందులోనూ సెకండ్ షోలు చూసి ఒంటరిగా ఇంటికి రావాలన్నా... వచ్చాక ఒంటరిగా ఇంట్లో ఉండాలన్నా భయంతో వ ణుకు పుట్టి మెడలో ఆంజనేయస్వామి లాకెట్టో, నుదుటిపై సింధూరమో పెట్టుకుంటే కానీ ఉలికిపాటు తగ్గనివారెందరో! ఇక ‘కథలు, నవలల సంగతి చెప్పనే అక్కరలేదు (ఆత్మకథలు కాదు సుమీ!) క్రైమ్ స్టోరీల్లోకి కూడా ఆత్మలు చొచ్చుకొచ్చేసి, అద్భుతాలు, అంతకుమించి అరాచకాలెన్నో చేసి చూపిస్తుంటాయి. చదివినంతసేపూ థ్రిల్లింగానే ఉంటాయి కానీ.. ఆ తర్వాతే... వీటికన్నా దయ్యం సినిమాలే కాస్తంత బెటరనిపిస్తుంది! అసలీ చర్చంతా ఎందుకు, మృత్యువు తర్వాత జీవితం ఉందా లేదా, ఉంటే ఎలాంటి జీవితాన్ననుభవిస్తారనేదే కదా సందేహం..? అది తెలుసుకునేందుకు ఇంకా చా...లా సమయం ఉంది! అనుభవించడానికి బోలెడంత జీవితమూ ఉంది. సఫలం చేసుకోగలిగితే ఇప్పుడే స్వర్గం... లేకపోతే ఇక్కడే నరకం... కాదంటారా? - డి.వి.ఆర్.భాస్కర్ మనిషికి ప్రధానంగా మూడు శరీరాలుంటాయి. అవి 1. ఆత్మ తత్వం గల స్పిరిచ్యువల్ బాడీ, 2. భావోద్వేగాలకు నెలవైన సూక్ష్మశరీరం, 3. కంటికి కనిపించే స్థూల శరీరం లేదా భౌతిక శరీరం. భూలోకంలోని ప్రతి జీవీ మరణించిన తర్వాత ఏదో ఒక సూక్ష్మలోకం చేరుకుంటుంది. కొద్ది ప్రయత్నం, మరికొద్దిగా సాధనతో ఈ లోకాల్ని దర్శించగలం. అనుభవించగలం. పరలోకాలను సందర్శించడం కోసం మరణించనే అవసరం లేదు. ఆత్మ సంస్కారం గల వ్యక్తి కేవలం సంకల్పమాత్రాన భౌతిక శరీరాన్ని వదలకుండానే సూక్ష్మలోకాల్ని అంతకంటే సూక్ష్మాతి సూక్ష్మ శరీరంతో దర్శించి రావచ్చు అంటారు యోగ సాధకులు. -
ఓ ఆత్మకథ...
మిస్టరీ ‘‘అబ్బ... ఎంత అందంగా ఉన్నావే. నాకే ముద్దొచ్చేస్తున్నావ్’’... సుగంధ బుగ్గలు పట్టి లాగింది మైత్రి. ‘‘ఛీ ఊరుకోవే’’ అంది సుగంధ స్నేహితురాలి చేతుల్ని తోసేస్తూ. ‘‘ఏం సిగ్గుపడుతున్నావే. మా దగ్గరే ఇలా ఉంటే, ఇక మీ ఆయన వచ్చాక ఎన్ని సిగ్గులొలకబోస్తావో’’ అంది మరో స్నేహితురాలు రాగిణి కన్నుగీటుతూ. నిజంగానే సిగ్గు ముంచుకు వచ్చింది సుగంధకి. రెండు చేతులతో ముఖాన్ని మూసుకుంది. ‘‘ఏడిపించింది చాలు వెళ్లండి’’ అంది తెచ్చిపెట్టుకున్న కోపంతో. ‘‘వెళ్లిపోతాంలేవే. మీ ఆయన వచ్చే టైమయ్యిందని మాక్కూడా తెలుసులే’’ పకపకా నవ్వుతూ వెళ్లిపోయారందరూ. గోడకున్న గడియారం వైపు చూసింది సుగంధ. తొమ్మిదీ పది అయ్యింది. ఇంకో పది నిమిషాల్లో భర్త వస్తాడు. ఓసారి గదంతా పరికించి చూసింది సుగంధ. అందంగా అలంకరించి ఉంది. మంచం నిండా పూలు పరిచి ఉన్నాయి. వాటి గుబాళింపులు గదంతా వ్యాపించాయి. మంచం దిగి అద్దం దగ్గరకు వెళ్లింది సుగంధ. మైత్రి చెప్పింది నిజమే. తను ఈ దుస్తుల్లో ఎంతో అందంగా ఉంది. ఓసారి తన రూపాన్ని సాంతం చూసుకుంది. పక్కకు జరిగిన పాపిట బిళ్లను సరి చేసు కుంది. బొట్టు కాస్త పెద్దదైనట్టుగా అని పించడంతో తీసేసి చిన్న స్టిక్కర్ పెట్టు కుంది. తృప్తిగా నవ్వుకుని వెళ్లి మంచంపై కూర్చుంది. అంతలో తలుపు తీసిన చప్పుడయ్యింది. సుగంధ గబగబా దుపట్టాను ముఖం కనిపించకుండా తల మీదుగా కప్పుకుంది. తలుపు మూసి వచ్చాడు విమలేష్. ‘‘సారీ... లేటయ్యింది. ఫ్రెండ్స్ వదిలి పెడితేగా. ఒకటే ఏడిపించారు’’ అన్నాడు సుగంధ పక్కనే కూర్చుంటూ. ‘‘ఫరవాలేదు’’... సుగంధ స్వరం మంద్రంగా పలికింది. ఆమెకు దగ్గరగా జరిగాడు విమలేష్. మెల్లగా దుపట్టాను పైకి లేపాడు. గడ్డం పుచ్చుకుని సుగంధ ముఖాన్ని పైకి లేపాడు. అంతే... ఉలిక్కిపడి లేచాడు. ‘‘నువ్వా?’’ అన్నాడు కంగారుగా. ‘‘అవును... నేనే’’ అంది సుగంధ. ఈసారి ఆమె స్వరం మంద్రంగా లేదు. మొరటుగా ఉంది. కంచు మోగినట్టుగా ఉంది. ఆ స్వరానికి గది దద్దరిల్లింది. ‘‘నువ్వు... నువ్వు..’’... మాట రావడం లేదు విమలేష్కి. నిలువెల్లా వణికిపోతున్నాడు. చెమటతో తడిసి ముద్దవుతున్నాడు. సుగంధ అతడివైపే చూస్తోంది. కోపంగా... కసిగా... అసహ్యంగా. ‘‘ఎందుకలా దూరంగా వెళ్లిపోతున్నావ్. రా... దగ్గరకు రా’’ అంది. తల అడ్డంగా ఊపాడు విమలేష్. అక్కడ్నుంచి పారిపోవాలని ఉంది. కానీ కాళ్లు కదలడం లేదు. ఒళ్లంతా గడ్డకట్టేసి నట్టుగా అనిపిస్తోంది. కానీ కదలాలి. అక్కడ్నుంచి పారిపోవాలి. ఎలాగో శక్తిని కూడదీసుకున్నాడు. ఒక్క అంగలో గదిలోంచి బయటకు పరుగుదీశాడు. ఇల్లంతా గోలగోలగా ఉంది. సుగంధ ఏడుస్తోంది. అందరూ ఆమెను ఓదారుస్తున్నారు. పెద్దలంతా విమలేష్ని నిలబెట్టి నిలదీస్తున్నారు. విమలేష్ మాట్లాడటం లేదు. భయంభయంగా సుగంధ వైపే చూస్తున్నాడు. ‘‘నేనంటే ఆయనకు ఇష్టం లేదను కుంటా. అందుకే నన్ను వదిలేసి బయటకు వచ్చేశారు. వద్దంటే చెప్పమనండి. వెళ్లిపోతాను’’ అంది సుగంధ ఏడుస్తూ. ‘‘చెప్పరా... అమ్మాయి అడుగుతోంది కదా! తనంటే ఇష్టం లేదా. మరెందుకు పెళ్లి చేసుకున్నావ్. ముందే చెప్పి చావొచ్చు కదా’’... అరుస్తున్నాడు విమలేష్ తండ్రి. ‘‘తను... తను సుగంధ కాదు నాన్నా. దెయ్యం. నన్ను చంపడానికి వచ్చింది. నన్ను కచ్చితంగా చంపేస్తుంది.’’ విమలేష్ మాటలకు విస్తుపోయా రంతా. బంగారు బొమ్మలాంటి పిల్లని పట్టుకుని దెయ్యమంటాడేంటి అంటూ అమ్మలక్కలు బుగ్గలు నొక్కుకున్నారు. ఏదో గాలి సోకినట్టుంది, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు అన్నారు తలపండిన వాళ్లు కొందరు. ‘‘నాకే గాలీ సోకలేదు. నేను చెప్పేది నిజం. అది సుగంధ కాదు. పుర్వి. నన్ను చంపడానికొచ్చింది. దాన్ని నేను మోసం చేశానని నా మీద పగబట్టింది. దెయ్యమై వచ్చింది నన్ను చంపడానికి. దాన్ని పంపెయ్యండి. వెంటనే పంపెయ్యండి.’’ పిచ్చి పట్టినట్టు అరుస్తున్నాడు విమలేష్. అందరూ అతని మాటలకు అవాక్కయిపోయారు. పుర్వి ఎవరు? ఆమెను విమలేష్ మోసం చేయడమేంటి? ఆమె దెయ్యమై రావడమేంటి? ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. అందరూ అయోమయంగా చూడసాగారు. అప్పుడు పెదవి విప్పింది సుగంధ. ‘‘మీ అందరి మనసుల్లో ఉన్న ప్రశ్నలు నాకు తెలుసు. వాటికి సమాధా నాలు నా దగ్గరున్నాయి’’ అంటూ చెప్పడం మొదలుపెట్టింది. మూడు నెలల క్రితం ఓ మధ్యాహ్నం... తన గదిలో పడుకుని పుస్తకం చదువు కుంటోంది సుగంధ. అంతలో ఫోన్ మోగింది. స్క్రీన్ మీద నంబర్ చూడగానే సంతోషంగా లేచి కూర్చుంది. పుస్తకం పక్కన పడేసి, ఫోన్ చేతిలోకి తీసుకుంది. ‘‘ఏయ్ పుర్వీ.. ఎలా ఉన్నావే? ఎన్నాళ్లయ్యింది నీతో మాట్లాడి... ఏంటే విశేషాలు?’’.. ప్రశ్నల వర్షం కురిపించింది. ‘‘ఏం లేదు సుగంధా... నీతో మాట్లాడాలనిపించింది. అందుకే చేశాను.’’ పుర్వి గొంతు మెల్లగా ఉంది. ఏదో బాధ బరువును మోస్తున్నట్టుగా ఉంది. ‘‘ఏంటే? ఎందుకలా ఉన్నావ్? ఏమైంది?’’ ఆతృతగా అడిగింది సుగంధ. అలా అడగడంతోనే బావురుమంది పుర్వి. వెక్కి వెక్కి ఏడవసాగింది. ‘‘నేను మోసపోయాను సుగంధా. దారుణంగా మోసపోయాను. ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అంటే గుడ్డిగా నమ్మాను. ఎంతో దగ్గరైపోయాను. ఇప్పుడేమో తను నన్ను మానేసి వేరే అమ్మాయిని చేసు కుంటానంటున్నాడు. ఇంట్లోవాళ్లు ఒప్పు కోరు అంటూ వంకలు చెబుతున్నాడు. నేను తట్టుకోలేకపోతున్నానే. ఈ ద్రోహాన్ని నేను భరించలేకపోతున్నాను.’’ మ్రాన్పడిపోయింది సుగంధ. ‘‘అతను చాలా మంచివాడన్నావ్ కదే. అలా ఎందుకు చేస్తున్నాడు?’’ ‘‘మోసగాడు అలా కాకపోతే ఎలా చేస్తాడు సుగంధా. తప్పు నాదే. నేనే తనని నమ్మకుండా ఉండాల్సింది. నీకో విషయం తెలుసా? నేను తల్లిని కాబోతున్నాను. అందుకే పెళ్లి చేసుకొమ్మని అడిగాను. కుదరదన్నాడు. తనకి ఆల్రెడీ పెళ్లి కుదిరి పోయిందట. మరో మూడు నెలల్లో పెళ్లి అట. చూశావా ఎంత మోసం చేశాడో? నా జీవితం ముగిసిపోయింది సుగంధా. ఇక నేను బతికి లాభం లేదు.’’ ‘‘అయ్యో పుర్వీ... అలా అనకు. అలా ఏం జరగదు. నేనున్నాను కదా. నేను చూసుకుంటాను. నువ్వు...’’ సుగంధ మాట పూర్తి కాకముందే ఫోన్ కట్ అయిపోయింది. గుండె జారి పోయింది సుగంధకి. పుర్వి చాలా బాధలో ఉంది. తొందరపడి ఏమీ చేసుకోదు కదా! అలా అనుకోగానే మనసు రెపరెప లాడింది. వెంటనే పుర్వి దగ్గరకు వెళ్లాలి అనుకుంటూ మంచం దిగింది. అంతలో ఆమె తల్లి లోనికి వచ్చింది. ‘‘అమ్మా... నేను పుర్వి వాళ్లింటికి వెళ్తున్నాను’’ అంది సుగంధ హ్యాండ్‌బ్యాగ్ చేతిలోకి తీసుకుంటూ. నిట్టూర్చింది తల్లి. ‘‘నేనూ వస్తాన్రా. పాపం పుర్వి.’’ అయోమయంగా చూసింది సుగంధ. ‘‘ఏంటమ్మా... ఎందుకలా అన్నావ్’’ అంది తల్లి ముఖంలోకి చూస్తూ. ‘‘నాకు విషయం తెలిసింది. నీ ఫ్రెండ్ రూప ఇప్పుడే చెప్పింది. నీ సెల్‌కి చేస్తే ఎంగేజ్ వస్తోందట. అందుకే ల్యాండ్‌లైన్‌కి చేసింది. పాపం పుర్వి ఈ రోజు ఉదయం ఆత్మహత్య చేసుకుందట కదా!’’ హడలిపోయింది సుగంధ. ఏమంటోంది అమ్మ? పుర్వి ఆత్మహత్య చేసుకుందా? అది కూడా ఈ రోజు ఉదయమా? అదెలా? మరి ఇంతవరకూ తనతో మాట్లాడింది ఎవరు? పుర్వి కాదా? మాట్లాడింది తనే. కచ్చితంగా తనే. మరి పొద్దున్నే చనిపోవడమేంటి? వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చింది సుగంధకి. జరిగినదాన్ని జీర్ణించుకోలేక ఉన్నచోటే కూలబడిపోయింది. ‘‘ప్రేమలో మోసపోయిన పుర్వి చని పోయింది. తన ప్రాణాలు తనే తీసుకుంది. కానీ తన మరణం వెనుక ఉన్న నిజం మరుగున పడిపోకూడదని అనుకుంది. అందుకే ఆ నిజాన్ని నాకు చేరవేసింది. ఆ రోజు నాకు ఫోన్ చేసింది... పుర్వి ఆత్మ.’’ వింటున్నవాళ్లంతా ఉలిక్కిపడ్డారు. ఏం చెబుతోంది సుగంధ? ఆత్మా? ‘‘మీరు నమ్మరని నాకు తెలుసు. మొదట నేనూ నమ్మలేదు. కానీ నమ్మక తప్పని పరిస్థితి. ఆ రోజు మా అమ్మ, నేను పుర్వి వాళ్లింటికి వెళ్లాం. తను ఉరి వేసుకుని చనిపోయిందని తెలిసింది. పోస్ట్‌మార్టమ్ చేసిన డాక్టర్‌తో మాట్లాడితే తను గర్భవతి అని తేలింది. తర్వాత పుర్వి గదంతా వెతికాను. తన పుస్తకాల్లో ఒకచోట ఆమె ప్రియుడి ఫొటో దొరికింది. అది చూసి నేను షాక్ తిన్నాను. ఎందుకంటే ఆ ఫొటో ఎవరిదో కాదు... నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తిది. ఆ వ్యక్తి ఎవరో కాదు... విమలేష్.’’ ఈసారి అదిరి పడ్డారంతా. సుగంధ చెప్పే కఠోర వాస్తవాల్ని జీర్ణించుకోలేక పోయారు వాళ్లు. అయితే ఆమె చెప్పిన ప్రతి మాటా ముమ్మాటికీ నిజం. సుగంధ, పుర్వి డిగ్రీ వరకూ కలిసే చదువుకున్నారు. పీజీకి మాత్రం వేర్వేరు కాలేజీల్లో చేరారు. కానీ అన్ని విషయాలనూ ఫోన్‌కాల్స్ ద్వారా పంచుకునేవారు. అలానే తన ప్రేమ విషయం కూడా సుగంధకు చెప్పింది పుర్వి. అయితే ఆమె ఎవరిని ప్రేమించింది అన్నది మాత్రం సుగంధకు తెలియదు. దాంతో విమలేష్తో తనకు పెళ్లి కుదుర్చుతామంటే ఓకే చెప్పింది. అయితే అంత తెలివిగా ఓ ఆడపిల్లను మోసం చేసినవాడు నిలదీసి అడిగితే నిజం చెప్పడు. అతడి నిజస్వరూపాన్ని బయట పెట్టేందుకు తన దగ్గర సాక్ష్యాలూ లేవు. అందుకే స్నేహితురాలికి న్యాయం చేయడం కోసం మౌనంగా అతణ్ని పెళ్లి చేసుకుంది సుగంధ. మొదటిరాత్రి పుర్విలా మాస్క్ వేసుకుని, ఆమెలా నటించి అతడితోనే నిజాన్ని చెప్పించింది. పుర్విని మోసగించి, ఆమె మరణానికి కారణమైన విమలేష్ని జైలుకు పంపించింది. ఇది మధ్యప్రదేశ్‌లో జరిగిన వాస్తవ గాథ. మరి ఇది విన్నాక కూడా దెయ్యాలు, ఆత్మలు అంతా ట్రాష్ అనాలా? లేక వాటిని ఉనికిని అంగీకరించాలా? -
వెయ్యి బారల లోతు రచయిత
ఒక యువపాత్రికేయుడిగా రుడ్యార్డ్ కిప్లింగ్ తనను ఇంటర్వ్యూ చేసిన కొన్నాళ్ల తర్వాత, మార్క్ ట్వేన్ ఇలా వ్యాఖ్యానించాడు: ‘నేను అంతకుముందు కలిసిన వారందరికంటే ఆయనకు ఎక్కువ తెలుసు; అలాగే, ఆయన గతంలో కలిసిన వారందరిలోకీ నేను తక్కువ తెలిసినవాడినని ఆయనకు తెలుసని నాకు తెలుసు’. మార్క్ ట్వేన్ అంటేనే ఒక చమత్కారం, ఒక నవ్వు, ఒక సరదా. ‘తల్లిదండ్రులకు విధేయంగా ఉండు, వాళ్లు ఉన్నప్పుడు’ అని పిల్లలకు సలహా ఇస్తాడు. ‘మనం తప్పులు చేయకూడదు, ఎవరైనా చూస్తున్నప్పుడు’ అని వ్యంగ్యం విసురుతాడు. ‘మంచిగా ఉండు; త్వరలోనే ఒంటరివాడవవుతావు’ అని సమాజతీరును పట్టిస్తాడు. 1876లో వచ్చిన ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్’ ఆయన్ని రచయితగా నిలబెట్టింది. ప్రతి ఇంటి గోడకూ సాయర్ రంగులు పూశాడు. ప్రతి ఇంటి పిల్లాడికీ సాయర్‌తో దోస్తీ కుదిరింది. ప్రధానంగా బాలల వినోదం కోసం రాసినదైనా, పెద్దవాళ్లూ దాన్ని చదవడం మానలేదు. ‘పెద్దవాళ్లు తమ చిన్నతనంలో తాము ఎలా ఉండేవారో, తమ ఆలోచనలు ఎలా ఉండేవో, తాము ఎలా మాట్లాడేవారో, చిత్రమైన సన్నివేశాల్లో ఎలా చిక్కుకునేవారో ఆహ్లాదకరంగా వారికి జ్ఞాపకం’ చేసిందా నవల. శామ్యూల్ లాంగ్‌హార్న్ క్లెమెన్స్‌గా అమెరికాలో జన్మించిన మార్క్ ట్వేన్ తన కలంపేరును స్వీకరించిన తీరు కూడా విచిత్రంగా ఉంటుంది. ఆయన స్టీమ్బోట్లో కొంతకాలం పనిచేశాడు. నీటిలోతు గురించి చెప్పవలసి వచ్చినప్పుడు, అందులోని సిబ్బంది, గట్టిగా, ‘మార్క్ ట్వేన్’ అని అరిచేవాళ్లు. మార్క్=గురుతు; ట్వేన్=రెండు; రెండు బారలు అని చెప్పడం వాళ్ల ఉద్దేశం! తన పదకొండో ఏట తండ్రిని కోల్పోయిన ట్వేన్- ఏడుగురిలో ఒకడిగా పుట్టాడు. వాళ్ల నాన్న దగ్గర ఒక బానిస పనిచేసేవాడు. వాళ్ల చిన్నాన్న దగ్గర ఎక్కువమంది ఉండేవారు. ఆ బానిసలతో ట్వేన్ పొలంలో గడిపేవాడు. వాళ్ల ఇళ్లల్లోకి వెళ్లి కూర్చునేవాడు. వాళ్లు చెప్పే కథల్ని వినేవాడు. ఆ బాల్యమే ఆయన్ని తర్వాత్తర్వాత మహోదాత్తమైన ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ హకల్‌బెరీ ఫిన్’ రాయించింది. ట్వేన్ మామూలుగా కుడిచేత్తోనే రాసేవాడు. ఒక దశలో ఆ చేయి నొప్పితో బాధించినప్పుడు ఎడమ చేత్తో కూడా సాధన చేశాడు. ఏ చేత్తో రాసినా హాస్యం చిప్పిల్లేది. అయితే, మార్క్ ట్వేన్ హాస్యం ఉత్తి నవ్వులాట హాస్యం కాదు. హాస్యం ఎప్పుడూ దుఃఖంలోంచి, ఆ దుఃఖం ఉపశమనం కోసమే పుడుతుంది. ఆయనే అన్నట్టు, ‘నిజమైన హాస్యం కరుణరసానికి దారి తీస్తుంది’. ‘పుస్తకాలు, స్వేచ్ఛ పొందిన మనుషుల ఆత్మలు’ అంటాడు ట్వేన్. ఆ పుస్తకాల్లో హాస్యం సాకుగా ఆయన ఎంత లోతైన ఆలోచనలు వెల్లడించాడో ‘ద మిస్టీరియస్ స్ట్రేంజర్’ (విచిత్రవ్యక్తి)లోని ఈ వాక్యాలు చెబుతాయి: ‘అయితే ప్రతి మనిషికీ ఇన్ని లక్షల గమ్యస్థానాలున్నప్పుడు తనకు ఇష్టమైనది ఎంచుకోవచ్చుగదా అని నువ్వంటావు. కాని అతడు చేరవలసిన గమ్యస్థానం నిర్ణయించేది అతడు కాదు; అతడు జీవితంలో మొట్టమొదట చేసిన పనే దాన్ని నిర్ణయిస్తుంది. ఒకవేళ ఫలానా పని చెయ్యగూడదని అనుకుంటాడనుకో. ఆ అనుకోవడాన్ని నిర్ణయించేది కూడా అతని మొదటి పనే. ఫలానా పని చెయ్యడనుకో. ఆ చెయ్యకపోవడాన్ని నిర్ణయించేది కూడా మొదటి పనే’. లోతైన, గాఢమైన, ఛిద్రమైన జీవితాన్ని అనుభవించాడాయన. ప్రచురణ సంస్థ పెట్టాడు. మొదట్లో డబ్బులు కళ్లజూసినా అది క్రమంగా ఆయన్ని అప్పులపాలు చేసింది. లెక్చర్లు ఇస్తూ డబ్బులు సంపాదించాడు. వాటికిగానూ ఎన్నో దేశాలు పర్యటించాడు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉపన్యసించేవాడు కాబట్టి, ఆయన రచనల్ని ప్రచురించడానికి సంస్థలు ముందుకొచ్చేవి కాదు. ఈ నష్టం ఇలావుంటే, కుటుంబనష్టం మరీ కుంగదీసింది! డిఫ్తీరియాతో రెండేళ్ల కొడుకు లాంగ్డన్ చనిపోయాడు. 24 ఏళ్ల వయసులో కూతురు సుసీ స్పైనల్ మెనింజైటిస్‌తో మరణించింది. మూర్ఛరోగమున్న కూతురు జీన్ 29 ఏళ్ల వయసులో చనిపోయింది. క్లారా ఒక్కతే తల్లిదండ్రులకు చివరిదాకా మిగిలిన బిడ్డ! ‘తన స్వీయ సమ్మతి లేకుండా ఏ మనిషి కూడా సౌకర్యంగా ఉండలేడు’ అనేవాడు ట్వేన్. తన సమ్మతి లేకుండా ఏ మనిషైనా బాధ కూడా ఎలా పడగలడు! ట్వేన్ కూడా ఈ కష్టాల్ని ఇలాగే దాటాడేమో! మతగ్రంథాల్ని, ఆధ్యాత్మిక రచనల్ని ఎంతగా చదివినప్పటికీ దేవుడి ఉనికి మీద విశ్వాసంగానీ, అవిశ్వాసంగానీ ప్రకటించని అజ్ఞేయవాదిగానే జీవితాంతం మిగిలిపోయిన ట్వేన్... 75 ఏళ్లకు ఒకసారి కనిపించే హేలీ తోకచుక్క కనబడిన 1835(నవంబర్ 30)లో జన్మించాడు. తిరిగి మళ్లీ కనబడిన 1910లో తన ఏడుపదుల వయసులో అస్తమించాడు. చావుపుట్టుకల్ని కూడా చమత్కారంతో మేళవించడం ఎలా సాధ్యమైందో ఆయన్ని ఎలా అడగటం! - ఆర్.ఆర్. ‘తల్లిదండ్రులకు విధేయంగా ఉండు, వాళ్లు ఉన్నప్పుడు’. ‘మనం తప్పులు చేయకూడదు, ఎవరైనా చూస్తున్నప్పుడు’. - మార్క్ ట్వేన్ -
తమ్ముడి చేతికి బ్యాట్
పోటీ నుంచి తప్పుకున్న కిరణ్‌కుమార్‌రెడ్డి పీలేరు బరి నుంచి సోదరుడు కిషోర్ నామినేషన్ నామినేషన్ వేసే వరకు గోప్యం ఓటమి భయంతోనే కిషోర్‌ని బరిలోకి తెచ్చారని ప్రచారం కిరణ్ నిర్ణయంతో జేఎస్పీ అభ్యర్థుల్లో సడలిన ఆత్మస్థైర్యం మ్యాచ్ ప్రారంభానికి ముందే జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత కిరణ్‌కుమార్‌రెడ్డి చేతులెత్తేశారు. తమ్ముడి చేతికి బ్యాట్ ఇచ్చి తాను ప్రేక్షకుడి పాత్రకే పరిమితమయ్యారు. చెలరేగి ఆడతాడనుకున్న తమ నాయకుడు ముందే అస్త్రసన్యాసం చేయడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఖంగుతిన్నారు. రాజకీయ భవిష్యత్తుపై పెట్టుకున్న అంతోఇంతో ఆశను వారు వదిలేసుకున్నారు. సాక్షి, తిరుపతి: జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు నేలవిడిచి సాముచేస్తున్నారు. నామినేషన్ల ఘట్టం చివరి రోజున మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత నియోజకవర్గం పీలేరులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. జేఎస్పీ తరపున కిరణ్ సోదరుడు కిషన్‌కుమార్‌రెడ్డి అలియూస్ కిషోర్‌కుమార్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయడం రా జకీయవర్గాలను విస్తుపోయేలా చేసింది. నామినేషన్ పత్రాలు దాఖలుచేసే వరకు కిరణ్‌కుమార్‌రెడ్డినే అభ్యర్థిగా భావించారు. చివరకు కిషోర్ పేరుతో నామినేషన్ వేయడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. పార్టీ అధ్యక్షులు ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో ఆ పార్టీ అభ్యర్థులు షాక్‌కు గురయ్యారు. కిరణ్ వ్యూహం ఏమైనప్పటికీ అభ్యర్థులు మాత్రం ఆత్మస్థైర్యం కోల్పోయారు. ముందుండి నడిపించాల్సిన నాయకుడు యుద్దం లోకి వెళ్లకముందే అస్త్రసన్యాసం చేసినట్లు ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తం గా ప్రచారం చేయాల్సి ఉన్నందున కిషోర్‌ను పోటీకి దింపినట్లు కిరణ్ చెప్పడం సాకు మాత్రమేనని అంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ అధ్యక్షులు ఎన్నికల బరిలో ఉంటూనే ఆ పార్టీల అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్న వైనం గుర్తుచేస్తున్నారు. అంతా హైడ్రామా నామినేషన్ దాఖలుకు ముందు కిరణ్‌కుమార్‌రెడ్డి స్వగ్రామమైన నగిరిపల్లెలో అనుయాయులతో సమావేశమయ్యారు. ఆయన ఎక్కడా తాను పోటీ చేయనన్న విషయాన్ని బయటపెట్టలేదు. అందరితోనూ కలివిడిగా ఉన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి పోటీ చేస్తున్నారనే ఆయన వర్గీయులు భావించారు. కిందటి వారం నగిరిపల్లెకు వచ్చిన ఆయన పీలేరు నుంచి తానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఈలోగా మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ముందు రోజు రాత్రి తన మనసులోని మాటను కిషోర్‌కుమార్‌రెడ్డికి తెలియజేసి ఆ మేరకు నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకున్నారు. నామినేషన్ దాఖలుకు ముందు ర్యాలీ లో సోదరులు ఇద్దరూ జనానికి అభివాదం చేస్తూ రిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు వెళ్లారు. అక్కడికి వెళ్లిన తరువాత నామినేషన్ పత్రాలను అందజేశారు. అభ్యర్థి చేత ప్రమాణం చేయించే వర కు కిషోర్ అభ్యర్థి అన్న విషయం మాజీ సీఎం సొంత మనుషులకూ తెలియలేదు. కిరణ్ వర్గీయుల అసంతృప్తి ఎన్నో ఏళ్లుగా నల్లారి కుటుంబాన్ని నమ్ముకుని సొంత మనుషులకూ తెలియకుండా కిషోర్‌కుమార్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని చివరి నిమిషం వరకు దాచి పెట్టడం అసంతృప్తికి దారితీసింది. బయటకు చెప్పుకోలేనప్పటికీ నల్లారి ముఖ్య అనుచరులు లోలోన కుతకుతలాడుతున్నారు. రాష్ట్ర విభజన ద్రోహిగా ముద్రవేసుకున్న కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడు సొంత మనుషుల నుంచి కూడా అదే ముద్ర వేసుకున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సయయంలో రాష్ట్ర విభజన జరగడం, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజ ల్లో వ్యతిరేకత వ్యక్తం కావడం తెలిసిందే. ఈ ప్రభా వం సొంత నియోజకవర్గంలోనూ ఉంటుందనే భావనతో ముందుగానే పోటీ నుంచి వైదొలిగినట్లు చెబుతున్నారు. మాజీ సీఎంగా ఎన్నికల్లో ఓటమి భారం భరించడం కన్నా తప్పుకోవడమే ఉత్తమమని అభిప్రాయానికి వచ్చిన తర్వాతే సోదరుడు కిషోర్‌ని బరిలోకి దించారని అంటున్నారు. మొత్తానికి కిరణ్ అనుసరిస్తున్న వ్యూహం నేలవిడిచి సాముచేయడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఔను..! వారి ఆత్మలు క్షోభిస్తున్నాయి
సాక్షి, తిరుపతి: ఔను.. అడవికి ప్రాణాలు బలిదానం ఇచ్చిన ఉద్యోగుల ఆత్మలు ఇంకా క్షోభిస్తున్నాయి. కాలం తెచ్చిన మార్పులతో పెరిగిన నేరప్రవృత్తిని నిరోధించడానికి ప్రభుత్వాలు స్పందించకపోవడం, కనీసం అధికారులు కూడా ఆలోచించని తీరుతో అటవీ ఉద్యోగుల ప్రాణాలకు రక్షణ లేకుండాపోయింది. బ్రిటీష్ పాలకుల హయాంలో కూడా అడవి దొంగలు ఉద్యోగుల ప్రాణాలు బలిగొన్నారు. అటవీశాఖకు రాయలసీమ చరిత్రలో అదో దుర్ధినం. వారికి నివాళులు అర్పించడం అటుంచి కనీసం ఆ తరువాత కూడా పాల కులు కళ్లు తెరిచినట్టు కనిపించడం లేదు. అం దుకు సాక్షీభూతమే తిరుపతి అడవుల్లో జరిగి న ఘోర కలిగా చెప్పవచ్చు. అది 1939 సంవత్సరం మార్చి 17వ తేదీ. కడప జిల్లా చిట్వేలి మండలం హరిజనవాడ (మాలపల్లె)కు చెందిన శిగికేశవులు ఫారెస్టు గార్డు, కోడూరు పెంచలయ్య సహాయకుడు (వీరిద్దరూ బావాబామర్దులు), చిట్వేలి వడ్డిపల్లెకు చెందిన సోమయ్య ఫారెస్టు వాచర్. ఇప్పుడు ఎర్రచందనంగా పిలుస్తున్న చెట్లను అప్పట్లో బొమ్మకొయ్యగా పిలిచేవారు. చిట్వేలి అటవీ రే ంజ్ పరిధిలోని తిమ్మాయగారిపల్లె బీట్ పరిధిలో అడవిని కొల్లగొడుతున్నట్టు సమాచారం అందింది. అడవి దొం గలను కట్టడి చేసేందుకు ముగ్గురూ బయలుదేరారు. అడవిలోకి వెళ్లిన వారిని అడవి దొంగలు బంధించి సమీప గ్రామానికి తీసుకువచ్చారు. విచక్షణా రహితంగా నరికి అడవిలో పడేశారు. మృతదేహాలను పశువుల కాపరులు గమనించి కేశవులు భార్య అచ్చమ్మ, కుమారుడు ఎస్వీ.సుబ్బరాయన్, పెంచలయ్య భార్య నర్సమ్మ (పొట్టెమ్మ)కు తెలిపారు. వారి ఆర్తనాదాలు ఇంకా ఆ అడవిలోని స్మారక స్థూపం వద్ద ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. అందుకు ఆనవాళ్లు కోల్పోతున్న స్థూపం నాటి చరిత్రను చెబుతోంది. ఆనాటి ఘటనను వివరించే వారే కాదు. ప్రాణాలు కోల్పోయిన వారి వారసులూ ఇంకా ఉన్నారు. ఆ నాటి నుంచి కూడా అటవీశాఖ యంత్రాంగం పాఠాలు నేర్చుకోలేదు. ఎందుకంటే అడవి రక్షణకు నియమిస్తున్న సిబ్బందికే ఎలాంటి రక్షణ లేదు. రేంజర్, లేదా ఫారెస్టర్ వద్ద రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి 404 మస్కట్స్, ఆ తరువాత 303 రైఫిల్స్ రేంజ్ పరిధిలో ఒకటి లేదా రెండు మాత్రమే ఉండేవి. మిగతా వారికి శరీరంపై ఖాకీ దుస్తులు, కాళ్లకు బూట్లు, చేతిలో కర్ర మినహా ఎలాంటి ఆయుధాలు ఇచ్చేవారు కాదు. వీటితో అడవిని రక్షించడం సాధ్యమా? ప్రపంచ మార్కెట్‌ను శాసించే అత్యంత విలువైన ఎర్రచందనం వనాలకు శేషాచలం అటవీ ప్రాంతం నెలవు. నాలుగు దశాబ్దాల క్రితం బొమ్మకొయ్య (నేటి ఎర్రచందనం) వేళ్లమీద లెక్కించే స్థాయిలో అక్రమ రవాణా జరిగేది. ప్రస్తుతం ఆ దుంగలకు ఉన్న విలువ టన్ను రూ. లక్షల్లో ఉంది. విస్తారంగా పెరిగి ఉన్న వృక్షాలను కొల్లగొట్టడానికి వన సేద్యానికి వెళ్లినట్లు అడవి దొంగలు వందల సంఖ్యలో అడవుల్లోకి తెగబడుతున్నారు. నిరాయుధులైన అటవీ సిబ్బంది అడవులను కాదు. కనీసం వారిని వారు రక్షించుకోలేని స్థితిలో ఉండక ఏమి చేయగలరు?