ప్రేతాత్మలున్నాయంటూ.. తల్లీకూతుళ్ల నిర్వాకం | mother and daughter hulchul in srikakulam over Spirit | Sakshi
Sakshi News home page

ప్రేతాత్మలున్నాయంటూ.. తల్లీకూతుళ్ల నిర్వాకం

Published Sun, May 15 2016 1:32 PM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

ప్రేతాత్మలున్నాయంటూ.. తల్లీకూతుళ్ల నిర్వాకం - Sakshi

ప్రేతాత్మలున్నాయంటూ.. తల్లీకూతుళ్ల నిర్వాకం

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా బలగలో ఓ తల్లీకూతుళ్ల నిర్వాకానికి స్థానికులు విస్తుపోయారు. ప్రేతాత్మలున్నాయంటూ ఇంట్లో గొయ్యిను తీసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సుమారు 20 అడుగుల గొయ్యిను తీసి అందులో తల్లీకూతుళ్లు నివాసముంటున్నారు. స్థానికులెవ్వరినీ ఆ ఇంటిలోనికి రాకుండా ఎప్పుటికప్పుడూ అడ్డుకుంటూ వచ్చారు. వీరి కదలికలపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగారు. చాలా సేపటి వరకు పోలీసులను కూడా లోపలికి అనుమతించలేదు.

ఇంటిలో ప్రేతాత్మలున్నాయని రావద్దని వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు ఇంటిలోనికి ప్రవేశించిన పోలీసులు ఆశ్యర్యపోయారు. ఇంటి కింద భాగంలో తీసిన పెద్ద గొయ్యిను పోలీసులు గుర్తించారు. వారి మానసిక స్థితి సరిగ్గా లేక ఆ విధంగా ప్రవర్తిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement