
చూడటానికి రాచప్రాసాదంలా కనిపించే ఈ పురాతన హోటల్ భయానకమైన కట్టడంగా పేరుమోసింది. మామూలుగా చూస్తే ఇందులో భయపెట్టే వస్తువులేవీ కనిపించవు గాని, ఇది ప్రేతాత్మకు ఆవాసంగా మారిందని జనాలు చెప్పుకుంటారు. స్టీమ్ ఇంజిన్‌తో నడిచే కారును కనుగొన్న ఫ్రీలాన్ ఆస్కార్ స్టాన్లీ క్షయవ్యాధికి లోనైనప్పుడు కొలరాడోలోని రాకీ పర్వత ప్రాంతంలో ఇల్లు నిర్మించుకున్నాడు.
స్వచ్ఛమైన గాలి, ధారాళంగా ఎండ తగిలే ప్రదేశాల్లో ఉంటూ మంచి ఆహారం తీసుకోవడం తప్ప అప్పట్లో క్షయవ్యాధికి పెద్దగా మందులు లేవు. ఇక్కడ ఉంటూ స్టాన్లీ వ్యాధి నుంచి కోలుకున్నాడు. తర్వాత క్షయ రోగులకు ఆవాసంగా ఉపయోగపడేలా ఇక్కడ 1907లో 48 గదుల హోటల్ నిర్మించాడు. తర్వాత హోటల్‌ను 140 గదులకు విస్తరించాడు. ఈ హోటల్‌లోనే స్టాన్లీ భార్య మరణించింది.
అప్పటి నుంచి ఆమె ఆత్మ ఇందులోనే సంచరిస్తోందని, రాత్రివేళ హోటల్ హాలులో ఉన్న పియానోను వాయిస్తోందని ప్రచారం మొదలైంది. ఈ హోటల్‌లో దిగిన కొందరు అతిథులు కూడా ఇక్కడ ఆత్మను తాము స్పష్టంగా చూసినట్లు చెప్పడంతో ఇది హాంటింగ్ హోటల్‌గా పేరుమోసింది.
Comments
Please login to add a commentAdd a comment