వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య
ఆత్మస్థైర్యం పెంచుకోవాలి యువత ఆత్మస్థైర్యం పెంపొందించుకోవాలి. ఏదైనా సాధించగలమనే విశ్వాసంతో ముందుకు సాగితే లక్ష్య సాధన కష్టం కాదు. ప్రణాళికాబద్ధంగా ఇష్టపడి చదవాలి. పాఠ్యాంశాలతో పాటు సమాజానికి ఉపయోగపడే ఇతర పుస్తకాలను కూడా అధ్యయనం చేయూలి. ఇతరులకు మేలు చేస్తూ, అందరికీ మార్గదర్శకంగా ఉండాలి.
- సర్పరాజ్ అహ్మద్, గ్రేటర్ వరంగల్ కమిషనర్
కాజీపేట రూరల్ : ముఖ్యమంత్రి కే సీఆర్ ఇచ్చిన పాత హమీలకే దిక్కులేదని.. వాటిని అమలు చేయకుండానే మళ్లీ వాగ్దానాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య విమర్శించారు. హన్మకొండలోని రాయల్ గార్డెన్‌లో సోమవారం జరిగిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ అధికారంలోకి రాకముందు, ఆ తర్వాత అనేక హామీలు ఇచ్చారని, అందులో ఏవీ అమలు చేయలేదని ఆరోపించారు. దీనిపై జిల్లా ప్రజలకు టీఆర్‌ఎస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోయూయని, పండిన వాటికీ గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని, వారికి భరోసా కల్పించడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని అన్నారు. రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేయూలని, పంటలకు గిట్టుబాటు ధరతో పాటు రూ.500 నుంచి రూ.1000 వరకు బోనస్ ప్రకటించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా.. 11 మండలాలనే కరువుగా ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు. సంపూర్ణ కరువు జిల్లాగా ప్రకటించి సహాయ చర్యలు చేపట్టాలన్నారు. మూడుచెక్కలపల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్థినుల మృతిపై సీబీఐతో విచారణ చేరుుంచాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
సమావేశానికి హాజరైన నాయకులు మొదట దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెన్నారెడ్డి మహేందర్ రెడ్డి, సంగాల ఈర్మియా, పూజారి సాంబయ్య, రాష్ట్ర కార్యదర్శి మునిగాల విలియం, సంయుక్త కార్యదర్శి నాడెం శాంతికుమార్, గ్రేటర్ అధ్యక్షుడు కాయిత రాజ్‌కుమార్ యాదవ్, ఎండి.బద్రుద్దిన్‌ఖాన్, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు దుప్పటి ప్రకాష్, గౌని సాంబయ్య గౌడ్, మునిగాల క ళ్యాణ్‌రాజ్, మంచె అశోక్, అప్పం కిషన్, మేకల కేదారి యాదవ్, కోగిల చంద్రమౌళి, వీరగోని రాజ్‌కుమార్ గౌడ్, అచ్చిరెడ్డి, గుండా రాజేష్‌రెడ్డి, నర్సయ్య, మేకల రవీందర్, ధర్మరాజు, దొంతి కమలాకర్‌రెడ్డి, సుధాకర్, బొడ్డు శ్రావణ్, దయాకర్ పాల్గొన్నారు.
హామీల అమలులో సీఎం విఫలం
Published Tue, Jan 12 2016 1:26 AM | Last Updated on Sun, Sep 3 2017 3:29 PM
Advertisement
Advertisement