United Breweries
-
కేఎఫ్ బీర్లు బంద్
సాక్షి, హైదరాబాద్: ఎ క్సైజ్ శాఖకు యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) కంపెనీ ఝలక్ ఇచ్చింది. తాము తయారు చేసే బీర్లను ఇక నుంచి తెలంగాణలో సరఫరా చేయబోమని ఆ కంపెనీ ప్రకటించింది. బేసిక్ ధరలు పెంచలేదని, బిల్లులు పెండింగ్‌లో ఉన్నందున బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్టు కంపెనీ నిబంధనల ప్రకారం...ఎన్ఎస్ఈ(నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్), బీఎస్ఈ (బాంబే స్టాక్ ఎక్స్చేంజ్)లకు సమాచారం ఇచ్చింది. రాష్ట్రంలో నాలుగైదు బ్రాండ్ల బీర్లకు మంచి మార్కెట్ ఉంది. అందులో యూబీ తయారు చేసే కింగ్‌ఫిషర్ బీర్లదే సింహభాగం. మొత్తం తెలంగాణ మార్కెట్లో 72 శాతం వరకు ఈ బ్రాండ్‌దే ఉంటుందని అంచనా. ఈ బీర్లు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్)కు సరఫరా చేసినందుకుగాను కేస్‌కు రూ.289 చొప్పున తయారీదారులకు చెల్లిస్తారు. ఈ బేసిక్ ధర పెంచాలన్న డిమాండ్ ఎక్సైజ్ శాఖలో చాలా కాలంగా వినిపిస్తున్నా, అమల్లోకి రాకపోవడంతో తాజా సమస్య ఏర్పడింది. తక్షణమే నిలిపివేస్తున్నాం...యూబీ కంపెనీ సెక్రటరీ నిఖిల్ మల్పానీ పేరుతో బుధవారం స్టాక్ ఎక్సే్చంజ్‌లకు ఇచ్చిన సమాచారాన్ని జాతీయ మీడియా బహిర్గతం చేసింది. ఈ లేఖలో పేర్కొన్న ప్రకారం యూబీ తయారు చేసే బీర్ల సరఫరాను తెలంగాణలో తక్షణమే నిలిపివేయనుంది. 2019–20 నుంచి కంపెనీకి చెల్లించే బేసిక్ ధరలను తెలంగాణ ప్రభుత్వం సవరించలేదని, దీని కారణంగా భారీ నష్టాలు వస్తున్నాయని ఆ లేఖలో వెల్లడించారు. టీజీబీసీఎల్ చెల్లించాల్సిన పెద్ద మొత్తం పెండింగ్‌లో ఉందని, ఈ కారణంగానే తాము బీర్లు సరఫరా చేయడం లేదని స్పష్టం చేసింది.పలుమార్లు విజ్ఞప్తులుఐదేళ్లుగా బీర్, లిక్కర్ తయారీదారులకు బేసిక్ ధరలను రాష్ట్ర ప్రభుత్వం సవరించలేదు. ముఖ్యంగా బీర్ తయారీదారులకు ఎప్పటి నుంచో కేస్‌కు రూ.289 మాత్రమే చెల్లిస్తున్నారు. బీర్ల తయారీకి ఉపయోగించేముడి పదార్థాల ధరలు పెరిగినందున బేసిక్ ధరలు పెంచాలని యూబీతోపాటు అనేక కంపెనీలు కూడా ప్రభుత్వాన్ని కోరాయి. కొద్ది రోజుల క్రితం ఆలిండియా బీర్ అసోసియేషన్ ప్రతినిధులతో ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ శ్రీధర్ చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. సీఎంతోపాటు ఎక్సైజ్ మంత్రి వద్ద జరిగిన అంతర్గత చర్చల్లోనూ లిక్కర్ కంపెనీల బేసిక్ ధరలు పెంచేది లేదని కరాఖండిగా తేల్చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే యూబీ కంపెనీ తమ ఉత్పత్తులను రాష్ట్రంలో సరఫరా చేయరాదని నిర్ణయించింది. వారం రోజులు ఓకే..బీర్ల సరఫరా తక్షణమే నిలిపివేసినా, మార్కెట్లో బీర్ల కొరత ఇప్పటికిప్పుడే రాదని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే యూబీ కంపెనీ నుంచి టీజీబీసీఎల్‌కు అందిన బీర్లు మరో ఆరేడురోజుల పాటు మార్కెట్లో అందుబాటులో ఉంటాయని, అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతేనే ఫలానా బ్రాండ్ బీర్ల కొరత ఏర్పడుతుందని చెబుతున్నాయి. అయితే వైన్‌షాపుల యజమానులు అప్రమత్తమయ్యారు. వీలున్నంత ఎక్కువగా కింగ్‌ఫిషర్ బీర్లకు ఇండెంట్ పెట్టినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో డిపోల వద్ద రేషన్ విధించే యోచనలో ఎక్సైజ్ శాఖ ఉన్నట్టు తెలుస్తోంది. చర్చలకు సిద్ధంగా ఉన్నాం : టీజీబీసీఎల్ ఎండీకి యూబీ కంపెనీ లేఖధరల పెంపు, బకాయిల విషయంలో నిర్ణయం తీసుకోనందునే తాము బీర్ల సరఫరాను బుధవారం నుంచి నిలిపివేసినట్టు, ఈ ప్రతిష్టంభనను తొలగించకుకోవడానికి టీజీపీసీఎల్తో చర్చలకు సిద్ధమని యూబీ కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు టీజీ బీసీఎల్ ఎండీ, ఎక్సైజ్ డైరెక్టర్ చెవ్వూరి హరికృష్ణకు యూబీ కంపెనీ చీఫ్ కార్పొరేట్ ఎఫైర్స్ ఆఫీసర్ గరీమాసింగ్ లేఖ రాశారు. ఏప్రిల్ 1, 2024 నాటికి తమకు రూ.702 కోట్లు బకాయిలు రావాల్సి ఉందని, గత ఏడాది అక్టోబర్ నుంచి ఎలాంటి చెల్లింపులు జరగలేదని ఆ లేఖలో తెలిపారు. బేసిక్ ధర పెంపు నిర్ణయం జరిగిన వెంటనే బీర్ల సరఫరాను యథాతథంగా కొనసాగిస్తామని వెల్లడించారు. తమ బకాయిలు సెప్టెంబర్ 2025 లోపు దశలవారీగా చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని టీజీ బీసీఎల్‌కు రాసిన లేఖలో గరీమాసింగ్ స్పష్టం చేశారు.ధరలు పెంచడమే న్యాయం ముడిసరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో బీర్ తయారీ కంపెనీలకు బేసిక్ ధర పెంచడమే న్యాయం. ఈ క్రమంలో స్థానిక అసోసియేషన్లతో సంప్రదింపులు జరిపి పెంచితే మంచిది. ప్రభుత్వం రమ్మంటే వెళ్లి చర్చిస్తాం. యూబీ కంపెనీ ప్రతినిధులతో కూడా మాట్లాడతాం. కానీ, న్యాయమైన ధర మాత్రం ఇవ్వాల్సిందే. – ఎం.కామేశ్వరరావు, అసోసియేషన్ ఆఫ్ లిక్కర్ అండ్ బీర్ సప్లయర్స్» స్టాక్ ఎక్స్చేంజ్లకు ఇచ్చిన సమాచారంతో ఎక్సైజ్ వర్గాల్లో అలజడి» మార్కెట్లో 72 శాతానికి పైగా వాటా ఉన్న కింగ్‌ఫిషర్ బ్రాండ్ తయారు చేసేది యూబీనేధరల పెంపుపై ఒత్తిడి తేవడం పద్ధతి కాదు: జూపల్లిబీర్ల ధరల పెంపు అంశంపై రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని కమిటీ నిర్ణయం తీసుకోకముందే యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) కంపెనీ తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్‌పై ఒత్తిడి తేవడం పద్ధతి కాదని ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. గుత్తాధిపత్యంతో బీర్ల ధరలు పెంచాలని యూబీ కంపెనీ చూస్తోందని విమర్శించారు. ఒత్తిళ్లకు తమ ప్రభుత్వం తలొగ్గే ప్రశ్నే లేదన్నారు. బుధవారం సచివాలయ మీడియా పాయింట్లో మంత్రి మాట్లాడారు. ఒక్కో బీరుపై దాదాపు 33.1 శాతం పెంచాలని కంపెనీ అడుగుతోందని, అలా చేస్తే బీరు ధర రూ.150 నుంచి రూ.250 వరకు పెరుగుతుందన్నారు. బీర్ల ధరల పెంపుపై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో గతంలోనే కమిటీ వేశామని, కమిటీ నివేదికను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. యూబీ కంపెనీ మార్కెట్ షేర్ 72 శాతం ఉంది కదాని.. ప్రజలు డిమాండ్ చేస్తారు కదాని ఇష్టానుసారంగా ధరలు పెంచాలని కోరడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.1,130 కోట్లు చెల్లించామని, ఇంకా రూ. 658 కోట్లు చెల్లించాల్సి ఉందని, కానీ కంపెనీ రూ.702 కోట్లు అని తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. బీఆర్ఎస్ హయాంలోని బకాయిలే రూ.407 కోట్లు ఉన్నాయన్నారు. పక్క రాష్ట్రాల కంటే తెలంగాణలో తక్కువ రేట్లు ఉన్న విషయం వాస్తవమేనని, కర్ణాటకలో రూ.190, ఏపీలో రూ.180 ఒక్కో బీరు ధర ఉంటే, తెలంగాణలో రూ.150 ఉందన్నారు. 14 లక్షల కేసుల స్టాక్ ప్రస్తుతం ఉందని, సంక్రాంతి పండుగకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పైసా కూడా ట్యాక్స్ పెంచలేదని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. -
కప్పం కడితేనే ‘కింగ్ ఫిషర్’!
సాక్షి, అమరావతి: ‘మాకు లాభం ఉంటేనే లారీలు కదులుతాయి’.. ‘మాకు కప్పం కడితేనే కింగ్ ఫిషర్ బీరు మార్కెట్లోకి వస్తుంది.. లేదంటే అంతే సంగతులు’ అని పారిశ్రామికవేత్తలకు హెచ్చరికలు జారీ చేస్తోంది.. టీడీపీ కూటమి ముఠా. డీల్ సెట్ కాకపోతే కంపెనీలోకి ఒక్క లారీని రానివ్వం.. పోనివ్వం అని తెగేసి చెబుతోంది. దీంతో కింగ్ ఫిషర్ బీరును ఉత్పత్తి చేసే యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) కంపెనీ అధికార పార్టీ దాష్టీకానికి బెంబేలెత్తుతోంది. శ్రీకాకుళం జిల్లాలో పారిశ్రామికవేత్తలను హడలెత్తిస్తున్న ఈ సిండికేట్‌ను ఎచ్చెర్ల బీజేపీ ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు వర్గం తెరముందు నడుపుతుంటే.. తెర వెనుక వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వర్గం చక్రం తిప్పుతోంది. నెలకు రూ.1.50 కోట్లు చొప్పున ఏడాదికి రూ.18 కోట్లు తమకు కప్పం కింద కట్టాలని కంపెనీకి కూటమి ప్రజాప్రతినిధులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇందుకు యునైటెడ్ బ్రూవరీస్ సిద్ధంగా లేకపోవడంతో కింగ్ ఫిషర్ బీరు ఉత్పత్తి మొదలుకావడం లేదు.అడుగడుగునా అడ్డుపడుతున్న టీడీపీ కూటమి ముఠా..శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం బంటుపల్లిలో ఉన్న యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) బీర్ కంపెనీ ఉంది. తమ ఫ్యాక్టరీలో కింగ్ ఫిషర్ బీరు ఉత్పత్తిని ప్రారంభించేందుకు ఆ కంపెనీ చేస్తున్న యత్నాలకు అడుగడుగునా టీడీపీ కూటమి ముఠా అడ్డు పడుతోంది. ముడి సరుకును ఫ్యాక్టరీకి తీసుకువచ్చి, ఉత్పత్తి చేసిన సరుకును ఫ్యాక్టరీ నుంచి బయటకు తీసుకువెళ్లే ఒక్కో లారీకి రూ.వేయి చొప్పున కప్పం చెల్లించాలని ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గం కరాఖండీగా తేల్చిచెప్పిందనే విషయం సంచలనం సృష్టించింది. ఎందుకంటే లోడింగ్, అన్ లోడింగ్ కోసం రోజుకు సగటున 500 లారీలు వస్తాయి.. ఆ లెక్కన రోజుకు రూ.5 లక్షల చొప్పున నెలకు రూ.1.50 కోట్ల వరకు కప్పంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి ఈ మొత్తం 18 కోట్లు. అంత భారీ మొత్తం కప్పంగా చెల్లించలేమని కంపెనీ ప్రతినిధులు చెప్పడంతో ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గీయులు ఏకంగా ఆ ఫ్యాక్టరీపై దాడి చేసి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. కంపెనీ ఆస్తులను ధ్వంసం చేయడమేకాకుండా కంపెనీలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందిపై దాడి చేసి భయోత్పాతం సృష్టించారు.దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు మొదట పట్టించుకోలేదు. కేంద్ర హోం శాఖకు నివేదించడంతో ఢిల్లీ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో పోలీసులు ఒక రోజు తరువాత కేసు నమోదు చేశారు. మరోవైపు కంపెనీ ఉద్యోగులపై ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయించడం గమనార్హం. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాకే చెందిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని కప్పం కట్టేలా డీల్ సెట్ చేసినట్టు సమాచారం. ఆయన ఆదేశాలతో కంపెనీ ప్రతినిధులు ఎమ్మెల్యే ఈశ్వరరావుతో రాజీ చర్చలు కూడా జరిపారు. తాము అడిగినట్టుగా నెలకు రూ.1.50 కోట్లు కప్పం కడితేనే బీర్ ఉత్పత్తి ప్రారంభించకోవచ్చని ఎమ్మెల్యే వర్గం కంపెనీకి తేల్చిచెప్పింది. కంపెనీ యాజమాన్యం ససేమిరా.. ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గం డిమాండ్ చేసినట్టుగా నెలకు రూ.1.50 కోట్లు వరకు కప్పంగా చెల్లించేందుకు యూబీ కంపెనీ యాజమాన్యం ససేమిరా అన్నట్టు సమాచారం. బంటుమల్లిలోని ఒక్క యూనిట్‌కే ఏడాదికి ఏకంగా రూ.18 కోట్లు అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు మామూళ్లుగా ఇవ్వడం తలకుమించిన భారంగా ఆ కంపెనీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరో రూపంలో కొంత మొత్తం అయితేనే ఇవ్వగలమని చెప్పినట్టు సమాచారం. దీంతో ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గం భగ్గుమంది. ఫ్యాక్టరీలోని బీరు ఉత్పత్తికి అడ్డుపడుతోంది. రెండు రోజులుగా ఫ్యాక్టరీకి లారీలు వస్తున్నా అందులోని ముడి సరుకును అన్లోడింగ్ చేయనీయడం లేదు. అంతేకాకుండా ఇప్పటికే ఉత్పత్తి చేసిన బీరును మార్కెట్లోకి పంపేందుకు లారీల్లోకి లోడింగ్ చేయనీయడం లేదు. అంతేకాకుండా కళాసీలెవరూ పనిలోకి రావడానికి వీల్లేదని ఎమ్మెల్యే వర్గం ఆల్టిమేటం జారీ చేసింది. ఎమ్మెల్యే వర్గం గుప్పిట్లోనే కళాసీల సంఘం ప్రతినిధులు ఉండటం గమనార్హం. ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గీయుల దాష్టీకంతోయూబీ ఫ్యాక్టరీ ముందు భారీ సంఖ్యలో లారీలు బారులు తీరి ఉన్నాయి. ఎమ్మెల్యే వర్గం హెచ్చరికలకు భయపడి ఎవరూ ముడి సరుకును అన్లోడింగ్ చేయడం లేదు. దాంతో యూబీ ఫ్యాక్టరీలో బీరు ఉత్పత్తి నిలిచిపోయింది. మరోవైపు ఉత్పత్తి కోసం తెప్పించిన ముడి సరుకు సైతం లారీల్లోనే మగ్గిపోతోంది. ముడి సరుకు పాడైపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని కంపెనీ ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు.డ్రామాను అదరగొడుతున్న అచ్చెన్నఈ వ్యవహారంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు డబుల్ గేమ్ ఆడుతుండటం గమనార్హం. కంపెనీ ప్రతినిధులు తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఎమ్మెల్యే ఈశ్వరరావుతో మాట్లాడినట్టు అచ్చెన్నాయుడు కథ నడిపించారు. తాను చెబుతున్నా కళాసీలు వినడం లేదని చెప్పి ఎమ్మెల్యే ఈశ్వరరావు తప్పించుకున్నారు. అయితే మంత్రి అచ్చెన్న, ఎమ్మెల్యే ఈశ్వరావు పక్కా పన్నాగంతోనే ఈ వ్యవహారాన్ని ఉద్దేశపూర్వకంగా సాగదీస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాక్టరీలో బీరు ఉత్పత్తి కొన్ని రోజుల పాటు నిలిచిపోతే యాజమాన్యం తప్పనిసరిగా తమ కాళ్లబేరానికి వస్తుందనేదే ఇద్దరు నేతల ఉద్దేశమని అంటున్నారు. అదే అదనుగా భారీగా కప్పం డిమాండ్ చేసి సాధించుకోవచ్చని కుట్రపన్నారు. పారిశ్రామికవేత్తల ఆందోళన..అధికారంలోకి వచ్చీ రావడంతోనే కూటమి నేతల బెదిరింపులతో పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. పారిశ్రామికవేత్తల పట్ల ప్రభుత్వ వైఖరిపై వారిలో ఆవేదన వ్యక్తమవుతోంది. కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం తమ పంతం వీడటం లేదు. యూబీ కంపెనీ ఉదంతం ద్వారా రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలకు స్పష్టమైన సందేశం ఇవ్వాలన్నదే కూటమి ప్రభుత్వ ఉద్దేశంగా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాము డిమాండ్ చేసినంత కప్పం కడితేనే రాష్ట్రంలో ఏ కంపెనీ అయినా మనుగుడ సాగిస్తుంది.. లేదంటే ఆ కంపెనీ మూత పడాల్సిందేనని స్పష్టం చేస్తోంది. -
కప్పం కడతారా.. కంపెనీ మూసేస్తారా
సాక్షి, అమరావతి: పరిశ్రమలకు రెడ్ కార్పెట్ పరుస్తాం అని చెబుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఆచరణలో మాత్రం పారిశ్రామికవేత్తలకు ‘రెడ్ బుక్ రాజ్యాంగం’తో తడాఖా చూపిస్తోంది. కొత్త పరిశ్రమల స్థాపన సంగతి తరువాత.. ముందు దశాబ్దాలుగా ఉన్న పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాలంటే కప్పం కట్టాల్సిందేనని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పెద్దలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఎన్నికై నెల రోజులు కూడా కాకుండానే స్వయంగా ఎమ్మెల్యేలే రంగంలోకి దిగిపోయారు.కంపెనీలకు కళ్లు బైర్లు కమ్మేలా కప్పం రేట్లు నిర్ణయిస్తున్నారు. అందుకు కాదంటే ఫ్యాక్టరీలపై దాడులకు తెగబడతామని, అక్రమ కేసులతో వేధిస్తామని బెదిరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) కంపెనీ ఉత్పత్తి ప్రారంభించాలంటే నెలకు రూ.1.50 కోట్లు మామూళ్లివ్వాలని జారీ చేసిన అల్టిమేటం.., అందుకు కాదన్నందుకు ఆ కంపెనీపై కూటమి మూకలు విధ్వంసానికి పాల్పడటం ద్వారా వారి ఉద్దేశాన్ని తేటతెల్లం చేశారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యూబీ కంపెనీ కూడా గత్యంతరం లేక కూటమి ఎమ్మెల్యే ఈశ్వరరావుతో సంప్రదింపుల పేరుతో శరణుజొ చ్చి , కప్పం కట్టేందుకు సమ్మతించడం రాష్ట్రంలో ఇకముందు జరగబోయే అరాచకాలకు సూచికగా నిలుస్తోంది. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు ముందున్నది ముసళ్ల పండుగేనన్నది సుస్పష్టమవుతోంది. ప్రతి లారీకీ డబ్బు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం బంటుపల్లిలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) బీర్ కంపెనీ ఎన్నో ఏళ్లుగా ఉంది. ఇక్కడ కింగ్ ఫిషర్ బీరు ఉత్పత్తి అవుతుంది. ఆ కంపెనీ బీరు యూనిట్‌ను పునఃప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. బంటుపల్లి కేంద్రంగా ఉన్న టీడీపీ ముఠాలు గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ ఫ్యాక్టరీకి వచ్చి వెళ్లే లారీల నుంచి మామూళ్లు వసూలు చేసి హడలెత్తించేవి. ఇటీవల ఎన్నికల్లో ఎచ్చెర్ల నుంచి గెలుపొందిన బీజేపీ అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు ఇప్పుడు మామూళ్ల వసూలుకు రంగంలోకి దిగారు. బంటుపల్లికి చెందిన ఆయన వర్గీయులు ఫ్యాక్టరీకి వచ్చే లారీలను అడ్డుకుని హల్చల్ చేశారు. అనంతరం యూబీ కంపెనీ ప్రతినిధులను కలిసి రోజూ లోడింగ్, అన్లోడింగ్ వచ్చే లారీకి రూ.వేయి చొప్పున మామూళ్లు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. బీరు ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకుతో రోజుకు 300 లారీలు వస్తాయి. ఉత్పత్తి అయిన బీరు రవాణాకు రోజుకు 200 లారీలు వస్తాయి. అంటే రోజుకు సగటున 500 లారీలు వచ్చి వెళ్తాయి. ఎమ్మెల్యే ఈశ్వరరావు ముఠా చెప్పిన దాని ప్రకారం రోజుకు రూ.5 లక్షలు మామూళ్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ లెక్కన నెలకు రూ.1.50 కోటి.. ఏడాదికి రూ.18 కోట్లు యూబీ కంపెనీ ఎమ్మెల్యే వర్గానికి మామూళ్ల కింద సమర్పించుకోవాలి. లేకపోతే కంపెనీ ఉత్పత్తి ప్రారంభించలేదని హెచ్చరించారు. కాదన్నందుకు కంపెనీపై దాడి ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గం చెప్పిన మామూళ్ల లెక్కలకు యూబీ కంపెనీ ప్రతినిధులకు కళ్లు బైర్లు కమ్మాయి. అంత భారీ మొత్తాన్ని కేవలం ఎమ్మెల్యే వర్గానికి ఇవ్వలేమని చెప్పారు. అంతే.. ఈ నెల 15న అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఎమ్మెల్యే ముఠా యూబీ ఫ్యాక్టరీపై దాడి చేసింది. ఫ్యాక్టరీ గేట్ల వద్ద సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడి గూండాలు లోపలికి ప్రవేశించారు. కార్యాలయంలో ఫర్నిచర్, ఇతర సామగ్రిని ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. అడ్డువచ్చిన కంపెనీ ప్రతినిధులను బూతులు తిడుతూ దాడి చేశారు. ఫ్యాక్టరీ హెడ్, పర్చేజ్ మేనేజర్, అడ్మిని్రస్టేటివ్ సిబ్బందిని చితకబాదారు. దాంతో కంపెనీ ప్రతినిధులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరారయ్యారు. ఢిల్లీ నుంచి ఒత్తిడితో కేసు నమోదు ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గీయుల దాషీ్టకంపై యూబీ కంపెనీ ప్రతినిధులు జేఆర్ పురం పోలీస్ స్టేషన్లో వెంటనే ఫిర్యాదు చేశారు. కానీ ఎమ్మెల్యే వర్గీయులపై కేసు నమోదుకు పోలీసులు ససేమిరా అన్నారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన యూబీ కంపెనీ ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువెళ్లింది. దాంతో తప్పనిసరై జేఆర్ పురం పోలీసులు ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గీయులపై ఈ నెల 16వ తేదీ రాత్రి కేసు నమోదు చేశారు.తమ వారిపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని ఎమ్మెల్యే ఈశ్వరరావు తీవ్రంగా పరిగణించారు. యూబీ కంపెనీ ప్రతినిధులపై ఆయన వర్గీయులతో ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద ఫిర్యాదు చేయించారు. పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి యూబీ కంపెనీ ప్రతినిధులపై కేసు పెట్టించి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయించారు. కంపెనీ ప్రతినిధులను వెంటనే అరెస్ట్ చేయాలని కూడా పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. డీల్ సెట్ చేసిన మంత్రి అచ్చెన్నాయుడుఈ వ్యవహారంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జోక్యం చేసుకున్నారు. ఆయన కంపెనీ ప్రతినిధులు, ఎమ్మెల్యే ఈశ్వరరావుతో మాట్లాడారు. కంపెనీ ఉత్పత్తి ప్రారంభించాలంటే ‘ఏం చేయాలో ’ చెప్పారు. అచ్చెన్న ‘మంత్రం’ పని చేసింది. ఎమ్మెల్యే ఈశ్వరరావు వెనుక మంత్రి అచ్చెన్న ఉన్నారన్నది యూబీ కంపెనీ ప్రతినిధులకు అర్థమైంది. టీడీపీ, బీజేపీ కూటమి నేతలు డిమాండ్ చేసిన మామూళ్లు సమర్పించుకుంటే తప్ప ఉత్పత్తి ప్రారంభించలేమని స్పష్టంగా తెలిసిపోయింది. దాంతో అనివార్యంగా యూబీ కంపెనీ ప్రతినిధులు ఎమ్మెల్యే ఈశ్వరరావు నివాసానికి వెళ్లి సంప్రదింపులు జరిపారు. వారిపై ఎమ్మెల్యే ఈశ్వరరావు తీవ్ర ఆగ్రహావేశాలతో చిందులు తొక్కారు. తమను కాదని ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ ఎలా నడుపుతారంటూ మండిపడినట్టు సమాచారం. ఢిల్లీ నుంచైనా, ఎక్కడి నుంచి చెప్పించినా సరే.. ఇక్కడ తాము పచ్చజెండా ఊపితేనే ఫ్యాక్టరీ గేట్లు తెరుచుకుంటాయని, లేకపోతే లేదని కూడా కరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో యూబీ కంపెనీ ప్రతినిధులు బంటుపల్లి ముఠా డిమాండ్ చేసిన మేరకు మామూళ్లు ఇచ్చేందుకు సమ్మతించి తిరిగి వచ్చినట్లు ఆ కంపెనీ వర్గాలే చెబుతున్నాయి. కప్పం కడితేనే కంపెనీలు యూబీ కంపెనీ వ్యవహారం ద్వారా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. తమకు కప్పం కడితేనే కంపెనీలు కార్యకలాపాలు చేపడతాయని స్పష్టం చేశారు. అందుకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే కంపెనీలపై దాడులు, దండయాత్రలు తప్పవని తేల్చిచెప్పారు. ఈ పరిణామాలతో రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు హడలిపోతున్నారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యూబీ కంపెనీకే అటువంటి దుస్థితి ఏర్పడితే ఇక తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. -
ఏబీసీ చైర్మన్‌గా దేబబ్రత ముఖర్జీ
న్యూఢిల్లీ: 2021–2022 ఏడాదికిగాను ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్యులేషన్స్(ఏబీసీ) చైర్మన్‌గా దేబబ్రత ముఖర్జీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్‌కు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జనరల్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, సేల్స్ ఆపరేషన్స్, బిజినెస్ స్ట్రాటజీ, ఇన్నోవేషన్ ఇలా పలు విభాగాల్లో ఆయనకు 27 ఏళ్లకుపైగా సుదీర్ఘ అనుభవం ఉంది. ఏబీసీ కౌన్సిల్ పబ్లిషర్ సభ్యులైన ప్రతాప్ జి. పవార్.. ఏబీసీ డెప్యూటీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అడ్వటైజర్స్ రిప్రజెంటేటివ్స్‌గా ఐటీసీ సంస్థ తరఫున కరుణేశ్ బజాజ్, టీవీఎస్ మోటార్ కంపనీ తరఫున అనిరుద్ధ హల్దార్, మారుతి సుజుకీ ఇండియా తరఫున శశాంక్ శ్రీవాస్తవ ఉన్నారు. చదవండి: తల్లికి మధురమైన గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ పబ్లిషర్స్ రిప్రజెంటేటివ్స్‌గా సకల్ పేపర్స్ సంస్థ తరఫున ప్రతాప్ పవార్, మలయాళ మనోరమ తరఫున రిషద్ మాథ్యూ, లోక్మత్ మీడియా తరఫున దేవేంద్ర వి. దర్దా, ది బాంబే సమాచార్ తరఫున హర్ముస్జీ ఎన్. కామా, జాగరణ్ ప్రకాశన్ తరఫున శైలేశ్ గుప్తా, హెచ్‌టీ మీడియా తరఫున ప్రవీణ్ సోమేశ్వర్, బెన్నెట్,కోల్మన్ అండ్ కో తరఫున మోహిత్ జైన్, ఏబీపీ తరఫున ధ్రువ ముఖర్జీ ఉన్నారు. అడ్వటైజింగ్ ఏజెన్సీల రిప్రజెంటేటివ్స్‌గా మ్యాడిసన్ కమ్యూనికేషన్స్ తరఫున విక్రమ్ సఖూజా, ఐపీజీ మీడియాబ్రాండ్స్ తరఫున శశిధర్ సిన్హా, ఆర్కే స్వామి బీబీడీవో తరఫున శ్రీనివాసన్ కె. స్వామి, డెంట్సు ఏగిస్ నెట్వర్క్ కమ్యూనికేషన్స్ ఇండియా సంస్థ తరఫున ఆశిశ్ భాసిన్ ఉన్నారు. సెక్రటరీ జనరల్‌గా హార్ముజ్ మాసాని కొనసాగనున్నారు. చదవండి: మృతదేహాన్ని అడ్డగింత.. చితి పైకెక్కి ఆందోళన -
రూ. 9 వేల కోట్ల రికవరీ..ఇలా రాబట్టారు!
న్యూఢిల్లీ: రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాకి యునైటెడ్ బ్రూవరీస్ (యూబీఎల్)లో ఉన్న షేర్లలో కొంత భాగాన్ని బ్యాంకుల తరఫున రుణాల రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) బుధవారం విక్రయించింది. వీటి విలువ సుమారు రూ. 5,824 కోట్లు. దీనితో భారీగా రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా కేసుల్లో బ్యాంకులు ఇప్పటిదాకా సుమారు రూ. 9,041 కోట్లు దాకా రికవర్ చేసుకున్నట్లయింది. వారు ముగ్గురూ ఎగవేసిన మొత్తంలో (దాదాపు రూ. 22,000 కోట్లు) ఇది సుమారు 40 శాతం. ఈ కేసుల్లో వారి ఆస్తులను జప్తు చేసుకుని, దర్యాప్తు జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 25న మాల్యా షేర్లు మరిన్ని.. ‘మాల్యా, చోక్సీ, మోదీల వల్ల బ్యాంకులకు సుమారు రూ. 22,585 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఈ కేసులకు సంబంధించి అటాచ్ చేసిన ఆస్తుల విలువ.. బ్యాంకులకు వాటిల్లిన నష్టంలో దాదాపు 80 శాతం (రూ. 18,170 కోట్లు) ఉంటుంది‘ అని ఈడీ పేర్కొంది. మాల్యా కేసుల విచారణ సందర్భంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రత్యేక కోర్టు (పీఎంఎల్ఏ) ఆదేశాల మేరకు తాము జప్తు చేసిన సుమారు రూ. 6,624 కోట్ల విలువ చేసే యూబీఎల్ షేర్లను ఎస్బీఐ కన్సార్షియంకు ఈడీ బదలాయించింది. ఇందులో నుంచి రూ. 5,824 కోట్ల విలువ చేసే షేర్లను బ్యాంకుల తరఫున బుధవారం డీఆర్టీ విక్రయించింది. జూన్ 25న మరో రూ. 800 కోట్ల షేర్లను విక్రయించే అవకాశం ఉందని ఈడీ తెలిపింది. ఇక పరారైనవారు, ఆర్థిక నేరస్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారి ఆస్తులను జప్తు చేసుకుని, బాకీలన్నీ రాబడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్లో ఈ మేరకు ట్వీట్ చేశారు. మరోవైపు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకటనపై స్పందిస్తూ, ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల విలువ.. బ్యాంకులకు రావాల్సిన బాకీలకన్నా ఎక్కువే ఉంటుందని చోక్సీ తరఫు న్యాయవాది విజయ్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. ఇలా రాబట్టారు.. ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంకును (పీఎన్బీ) రూ. 13,000 కోట్లు మేర మోసగించారని వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, ఆయన మేనమామ మెహుల్ చోక్సీ, బ్యాంకుల కన్సార్షియంకు సుమారు రూ. 9,000 కోట్లు ఎగవేశారని మాల్యా విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులకు సంబంధించి.. మాల్యాకి చెందిన షేర్లను గతంలో కూడా విక్రయించిన బ్యాంకులు సుమారు రూ. 1,357 కోట్లు రాబట్టుకోగలిగాయి. నీరవ్ మోదీ కేసులో రూ. 1,060 కోట్ల విలువ చేసే అసెట్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా మాల్యాకు చెందిన మరిన్ని షేర్లను విక్రయించడంతో బ్యాంకులు మొత్తం ఈ మూడు కేసులకు సంబంధించి రూ. 9,000 కోట్ల పైగా రాబట్టుకోగలిగినట్లయింది. ఈ ముగ్గురు బోగస్ సంస్థలను ఉపయోగించి, బ్యాంకుల నుంచి తీసుకున్న నిధులను మళ్లించారని తమ విచారణతో స్పష్టంగా రుజువు చేయగలిగినట్లు ఈడీ తెలిపింది. వీరిని స్వదేశం రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు పేర్కొంది. -
లిక్కర్ షేర్లకు కొనుగోళ్ల కిక్
కోవిడ్-19 కట్టడికి విధించిన లాక్‌డవున్‌ను క్రమంగా ఎత్తివేస్తున్న నేపథ్యంలో ఆర్థిక రికవరీ కనిపిస్తోంది. ఆగస్ట్‌లో వాహన విక్రయాలు పుంజుకోగా.. పలు రంగాలకు డిమాండ్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హోటళ్లు, తదితర ఆతిథ్య రంగాలు సైతం తిరిగి గాడిన పడే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా లిక్కర్ తయారీ కంపెనీలకు డిమాండ్ పెరిగింది. వెరసి పలు కౌంటర్లు ఆటుపోట్ల మార్కెట్లోనూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. హుషారుగా ప్రస్తుతం ఎన్ఎస్ఈలో యునైటెడ్ బ్రూవరీస్ 6.2 శాతం జంప్‌చేసి రూ. 1,152 వద్ద ట్రేడవుతోంది. రెండు రోజుల్లో ఈ షేరు 14 శాతం ర్యాలీ చేయగా గ్లోబస్ స్పిరిట్స్ 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 197 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. సోమ్ డిస్టిల్లరీస్ 3.5 శాతం ఎగసి రూ. 58కు చేరింది. ఈ బాటలో యునైటెడ్ స్పిరిట్స్ 2 శాతం బలపడి రూ. 580 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 588 వరకూ పెరిగింది. ఇక జీఎం బ్రూవరీస్ 2 శాతం లాభపడి రూ. 404ను తాకగా.. ఇంట్రాడేలో రూ. 412ను అధిగమించింది. ఇతర కౌంటర్లలో పయనీర్ డిస్టిల్లరీస్ 2 శాతం పుంజుకుని రూ. 113 వద్ద, అసోసియేటెడ్ ఆల్కహాల్స్ 2 శాతం లాభంతో రూ. 268 వద్ద, రాడికో ఖైతాన్ 1.5 శాతం బలపడి రూ. 408 వద్ద ట్రేడవుతున్నాయి. -
ఆ పదం తొలగించాలని సుప్రీం ముందుకు మాల్యా
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకులకు రూ 9000 కోట్ల రుణాల ఎగవేత కేసులో నిందితుడైన లిక్కర్ కింగ్, పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా తనను పరారీలో ఉన్నట్టు ఈడీ పేర్కొనడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన పేరుకు ముందు పరారీ పదాన్ని తొలగించాలని ఆయన కోరారు. బ్యాంకులకు వేల కోట్ల రుణ బకాయిల ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యా 2016, మార్చి 2న భారత్‌ను విడిచివెళ్లి బ్రిటన్‌లో తలదాచుకున్న సంగతి తెలిసిందే. దర్యాప్తు సంస్థల చార్జ్షీట్ల ఆధారంగా న్యాయస్ధానం ఆయనను ఉద్దేశపూరిత ఎగవేతదారుగా ప్రకటించగా, పరారీలో ఉన్న ఎగవేతదారుగా ఈడీ నిర్ధారించింది. కాగా, మాల్యాను భారత్‌కు అప్పగించాలని కోరుతూ భారత్ దాఖలు చేసిన పిటిషన్ వచ్చే వారం వెస్ట్‌మినిస్టర్ కోర్టులో విచారణకు రానున్న క్రమంలో తాను గతంలో కర్నాటక హైకోర్టు ముందుంచిన సెటిల్మెంట్ ప్రతిపాదనకు అంగీకరించాలని బ్యాంకులను కోరారు. రుణంలో అసలు మొత్తం చెల్లించేందుకు ఇటీవల మాల్యా సంసిద్ధత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాను తీసుకున్న రుణాల్లో అత్యధిక మొత్తం నష్టాల్లో కూరుకుపోయిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు మళ్లించామని, యునైటెడ్ బ్రూవరీస్ వంటి లిక్కర్ వ్యాపారం ద్వారా ప్రభుత్వ ఖజానాకు తమ సంస్ధలు అత్యధిక రాబడిని సమకూర్చాయని మాల్యా గుర్తు చేశారు. -
మాల్యా వాటాలను హీనెకెన్ కొనేస్తోందా?
న్యూఢిల్లీ: లిక్కర్‌కింగ్, రుణ ఎగవేతదారుడు విజయ్ మాల్యాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త మార్కెట్ వర్గాల్లో హల్ చల్ చేస్తోంది. బీరు తయారీ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ లిమెటెడ్ లో విజయ్ మాల్యాకుచెందిన మొత్తం వాటాను కొనుగోలు చేసేందుకు డచ్ బ్రూవర్ హైనెకెన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. యునైటెడ్ బ్రూవరీస్లో విజయ్ మాల్య వాటాలను కొనుగోలు చేయాలనే ప్రతిపాదనతొ రుణదాతలతో హీన్కెన్ సంప్రదించినట్టు సమాచారం. బ్యాంకులకు వేలకోట్ల రుణాలను ఎగవేసి విదేశాలకు చెక్కేసిన మాల్యానుంచి రుణాలను రాబట్టేందుకు బ్యాంకులు విశ్వ ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇది కీలక పరిణామమని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. హీనెకెన్ నిర్ణయం చాలా ముఖ్యమైనది, ఇది బ్యాంకులపై ఒత్తిడిని రేకెత్తిస్తుందని వ్యాఖ్యానించింది. హీనెకెన్, విజయ్ మాల్యా యూబిఎల్ కంపెనీలో ఉమ్మడి యజమానులుగా ఉన్నారు. మాల్యాకు 30శాతం వాటా వుండగా, హెన్‌కెన్ 43.4 శాతం వాటాకలిగి ఉంది. దీంతో మార్కెట్లో యూబీఎల్ షేర్లకు డిమాండ్ పుట్టింది. దాదాపు 6.23 శాతానికిపైగా లాభపడ్డాయి. మరోవైపు ఈ వార్తలతో స్టాక్ ఎక్సేంజ్ లు హెన్‌కెన్ సంస్థను వివరణ కోరింది. కాగా గత ఏడాది మార్చిలో ఇండియా నుంచి పారిపోయని మాల్యాను గత నెల ఏప్రిల్ 18న లండన్ లో స్కాట్లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన బెయిల్ పై ఉన్నారు అటు ఆయన్ను భారత్‌కు రప్పించే ప్రయత్నాల్లో భాగంగా భారత ఈడీ, సీఐడి అధికారులు ప్రత్యేక బృందం ఇప్పటికే లండన్ చేరుకుంది. అక్కడి న్యాయవాదులతో చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. -
మాల్యాకు ఝలకిచ్చిన యూబీఎల్
న్యూఢిల్లీ: వేలకోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన లిక్కర్ కింగ్, యూబీఎల్ ఛైర్మన్ విజయ్ మాల్యాకు యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ ఝలకిచ్చింది. మాల్యా పేరును స్పష్టంగా పేర్కొనని కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో రూ.1.64 కోట్ల రూపాయల చెల్లింపులను నిలిపివేసినట్టు తెలిపింది. టీడీఎస్ శాఖ ఆదేశాల కనుగుణంగా చెల్లింపులను నిలిపి వేసినట్టు పేర్కొంది. మాల్యాపై కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కేసు విచారణ నడుస్తున్న కారణంగా రూ.1.64 కోట్ల రూపాయల చెల్లింపును నిలిపివేసినట్టు చెప్పింది. ఈ మేరకు ఆదాయ పన్ను శాఖ కమిషనర్ నుంచి తమకు లేఖ అందిందని కంపెనీ తెలిపింది. జీతం, వేతనం, భత్యాలు తదితర చెల్లింపులను నిషేధిస్తూ జారీ చేసిన ఆర్డర్ జూన్ 28, 2016 న తమకు అందిందని కంపెనీ తెలిపింది. అయితే దీనిపై స్పందించడానికి కంపెనీ ప్రతినిధి తిరస్కరించారు. -
మాల్యాకి మరో ఎదురు దెబ్బ
బెంగళూరు: మద్యం వ్యాపారి విజయ్ మాల్యా మరో భారీ షాక్ తగిలింది. బ్యాంకుల కన్సార్టియానికి వేలకోట్ల రుణాలు బాకీ పడ్డ ఈ లిక్కర్ టైకూన్ కి చెక్ పెట్టే క్రమంలో రుణ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) మరో అడుగు ముందు కేసింది. దీంతో యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యుబిఎల్) కంపెనీ నుంచి లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు రావలసిన రూ.9.33 కోట్ల డివిడెండ్ ఆదాయానికి గండి పడింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికిగాను మద్యం సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ ...మాల్యాకు చెల్లించాల్సిన డివిడెండ్ నిలుపుదల చేసేలా ఆదేశాలు జారీ చేసింది. తన అనుమతి లేకుండా మాల్యాకు ఈ డివిడెండ్ చెల్లించొద్దని డెట్ రికవరీ ట్రిబ్యునల్ కర్ణాటక ఆదేశించింది. దీంతో కంపెనీ..ఆయన చెల్లింపులను నిలిపి వేసింది. అయితే కంపెనీల చట్టానికి లోబడి అన్ని వివరాలను బహిరంగ పరుస్తాం...ఇంతకుమించి తానేమీ వ్యాఖ్యానించలేనని కంపెనీ సీఈవో శేఖర్ రామమూర్తి వ్యాఖ్యానించగా అతని డివిడెండ్ చెల్లింపును వాయిదా వేసినట్టు మరో ప్రతినిధి ధృవీకరించారు. మరోవైపు యునైటెడ్ స్పిరిట్స్ (యుఎస్ఎల్) చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నందుకు డియాజియో కంపెనీ నుంచి అప్పనంగా వచ్చిన (75 మిలియన్ డాలర్లు) సుమారు రూ 515 కోట్ల రూపాయలకు ఇపుడు ముప్పు ఏర్పడింది. ఈ మొత్తాన్ని మాల్యా చేతికివ్వొద్దని డిఆర్టి ఆ బ్యాంక్‌ను కోరింది. మాల్యా ఖాతాలకు సంబంధించిన వివరాలన్నిటిని కూడా తనకు సమర్పించాలని జెపి మోర్గాన్ బ్యాంక్‌ను డీఆర్టీ ఆదేశించింది. కాగా మార్చి 31 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి మే 13 న జరిగిన భేటీలో వాటాదార్లకు ఒక్కో షేరుపై రూ.1.15 చొప్పున డివిడెండ్ చెల్లించాలని యుబిఎల్ కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఇటీవల సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. దీంతో తదుపరి ఆదేశాలు వెలువడే వరకు మాల్యాకు చెల్లించాల్సిన డివిడెండ్ నిలిపి వేయాలని యుబిఎల్ బోర్డు నిర్ణయం తీసుకుంది. యుబిఎల్‌లో మాల్యాతో పాటు అతడి నిర్వహణలోని తొమ్మిది కంపెనీలకు 8,11,88,930 షేర్లున్నాయి. -
డెరైక్టర్ పదవి నుంచి వైదొలగిన మాల్యా తనయుడు
న్యూఢిల్లీ: విజయ్ మాల్యాకు చెందిన యునెటైడ్ బ్రూవరీస్(హోల్డింగ్స్) డెరైక్టర్ పదవి నుంచి ఆయన కుమారుడు సిద్ధార్థ మాల్య వైదొలిగారు. 2013 నాటి కంపెనీల చట్టం సెక్షన్ 167(బి) ప్రకారం నాన్-ఎగ్జిక్యూటివ్, నాన్-ఇండిపెండెంట్ డెరైక్టర్ పదవి నుంచి సిద్ధార్థ వి. మాల్య గత నెల31 నుంచి వైదొలిగారని యునెటైడ్ బ్రూవరీస్(హోల్డింగ్స్) తెలిపింది. తన వ్యాపారాలకు, తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని, తన చర్యలకు తన కొడుకుని బలి చేయవద్దని ట్విటర్ ద్వారా విజయ్ మాల్యా కోరారు. -
యునెటైడ్ స్పిరిట్స్ తనఖా షేర్లు విక్రయం
న్యూఢిల్లీ: యునెటైడ్ బ్రూవరీస్ (హోల్డింగ్)లిమిటెడ్(యూబీహెచ్ఎల్) తనఖా పెట్టిన యునెటైడ్ స్పిరిట్స్ షేర్లను ఈసీఎల్ ఫైనాన్స్ సంస్థ విక్రయించింది. తాము తనఖాగా పెట్టిన 72,250 యునెటైడ్ స్పిరిట్స్ షేర్లను ఈసీఎస్ ఫైనాన్స్ గురువారం విక్రయించిందని బీఎస్ఈకి యూబీహెచ్ఎల్ నివేదించింది. గురువారం నాటి యునెటైడ్ స్పిరిట్స్ ముగింపు ధర రూ.2,526 ధర ప్రకారం చూస్తే ఈ షేర్ల విక్రయ విలువ రూ.18.25 కోట్లుగా ఉంటుంది. విజయ మాల్యా ఆధ్వర్యంలోని యూబీహెచ్ఎల్కు 41,88,556 (2.88 శాతం వాటా) యునెటైడ్ స్పిరిట్స్ షేర్లు ఉన్నాయి.వీటిల్లో 17,13,820(1.8 శాతం వాటా) షేర్లను యూబీహెచ్ఎల్ తనఖా పెట్టింది. బ్యాంకులకు రూ.9,000 కోట్లు చెల్లించాల్సి ఉండగా విజయ్ మాల్యా ఈ నెల 2న భారత్ నుంచి వెళ్లిపోవడం, ఆ తర్వాత ఆయనపై పలు కేసులు నమోదవుత్ను నేపథ్యంలో ఈసీఎల్ ఫైనాన్స్ ఈ తనఖా షేర్లను విక్రయించింది. కాగా బీఎస్ఈలో యునెటైడ్ స్పిరిట్స్ షేర్ ధర 2.3 శాతం లాభపడి రూ.2,586 వద్ద ముగిసింది. -
ఫోర్బ్స్ నవకల్పన జాబితాలో 9 దేశీ కంపెనీలు
న్యూయార్క్: ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన వంద నవకల్పన వృద్ధి కంపెనీల జాబితాలో తొమ్మిది భారత కంపెనీలకు చోటు లభించింది. ఈ జాబితాలో న్యూజిలాండ్‌కు చెందిన సాఫ్ట్వేర్ అకౌంటింగ్ సంస్థ గ్జెరో మొదటి స్థానంలో నిలిచింది. కంపెనీ భవిష్యత్తులో అందించే కొత్త ఉత్పత్తులు, సేవలు, మార్కెట్లపై ఇన్వెస్టర్ల అంచనాలు, ఆ అంచనాల ఆధారంగా ఆయా కంపెనీల షేర్లను కొనుగోలు చేయడం వంటి అంశాల ఆధారంగా ఈ జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించింది. ఈ జాబితాలో గోద్రేజ్ కన్సూమర్ ప్రోడక్ట్స్ 425 కోట్ల డాలర్లతో 31వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో చోటు సాధించిన ఇతర భారత కంపెనీల వివరాలిలా ఉన్నాయి. ఏబీబీ ఇండియా(37వ స్థానం), మ్యారికో(53), యునెటైడ్ బ్రూవరీస్(60), సీమెన్స్ ఇండియా(63), ఏషియన్ పెయింట్స్(78), నెస్లే ఇండియా(78), కోల్గేట్ పామోలివ్ ఇండియా(87), దివీస్ ల్యాబ్స్(99). -
యునెటైడ్ బ్రూవరీస్ జీఎంపై దాడి
తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు అధికార పార్టీ నేత అనుచరుల పనే ? కలెక్టరేట్ ఎదుట కార్మికుల నిరసన సాక్షి, హైదరాబాద్ : మెదక్ జిల్లా కొండాపూర్ మండలం మల్లేపల్లి శివారులోని యునెటైడ్ బ్రూవరీస్ (గోల్కొండ) యూనిట్ జనరల్ మేనేజర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేశారు. జీఎం సతీష్ భట్ సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఫ్యాక్టరీకి వెళ్తుండగా కొండాపూర్ మండలం మల్కాపూర్ శివారులో ఆయన వెళ్తున్న కారును గుర్తుతెలియని వ్యక్తులు అటకాయించారు. అందులో ఉన్న జీఎంను బయటకు లాగి కొట్టారు. ఈలోగా స్థానికులు గుమికూడటంతో గుర్తు తెలియని వ్యక్తులు తాము వచ్చిన కారు (ఏపీ 29ఎ 8923)ను వదిలి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన సతీష్‌ను హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి నిందితుల కారును స్వాధీనం చేసుకోవడంతోపాటు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రిలో జీఎం నుంచి వివరాలు సేకరించారు. జీఎం డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు నిరసనగా యూబీ గ్రూపు కంపెనీల సిబ్బంది కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. మాట వినడం లేదనే? సీఎం కిరణ్‌కు అత్యంత సన్నిహితంగా ఉంటున్న అధికార పార్టీ నేత ఈ ఘటనకు కారకుడని ఆరోపణలు వస్తున్నాయి. సదరు నేత ముఖ్య అనుచరుడు దాడి ఘటనను ప్రత్యక్షంగా పర్యవేక్షించినట్లు సమాచారం. అధికార పార్టీ ముఖ్య నేత ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన బీరు కంపెనీల ప్రతినిధుల సమావేశానికి యూబీ జీఎం వెళ్లకపోవడమే దాడికి కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫ్యాక్టరీ వ్యవహారాల్లో తన మాట చెల్లుబాటు కావడంలేదనే ఆక్కసుతోనే దాడికి పురమాయించినట్లు సమాచారం. ఈ ఘటనపై స్థానికుల నుంచి ఆగ్రహం వ్యక్తం కావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అధికార పార్టీ నేత ముఖ్య అనుచరుడికి క్లీన్చిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. డ్రైవర్‌తో సహా పట్టుబడిన కారు ఎవరిదనే కోణంలో సమాచారం సేకరిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇలాంటి ఘటనలతో స్థానికులకు ఉపాధి దక్కకుండా పోతుందని యూబీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు మల్లేశం ఆందోళన వ్యక్తం చేశారు. -
'అంతా మీరే చేశారు'
ముంబై: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కష్టాలకు ఉద్యోగులు, బ్యాంకులు తదితరులందరూ కారణమని ఆ సంస్థ చైర్మన్ విజయ్ మాల్యా ఆరోపించారు. ఇంజిన్ సప్లయర్స్ నుంచి ఉద్యోగులు, బ్యాంకులు, పన్ను అధికారులు... ప్రతీ ఒక్కరూ కింగ్ ఫిషర్ సంస్థ కష్టాల పాలవ్వడానికి కారకులయ్యారని ఆయన విమర్శించారు. కంపెనీ వార్షిక నివేదిక(2012-13)లో మాల్యా ఈ వివరాలు పేర్కొన్నారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కార్యకలాపాల పునరుద్ధరణ కోసం తగిన భాగస్వామిని ఎంచుకునే ప్రక్రియ కొనసాగుతోందని, ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నామని కూడా ఈ నివేదికలో ఆయన వెల్లడించారు. ఈ నెల 24న జరగునున్న ఏజీఎం కోసం ఇన్వెస్టర్లకు ఈ వార్షిక నివేదికను పంపించారు. సమ్మెలతో షెడ్యూల్ అస్తవ్యస్తం ఇంటర్నేషనల్ ఏరో ఇంజిన్స్ ఏజీకి వ్యతిరేకంగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ హోల్డింగ్ కంపెనీ యునెటైడ్ బ్రూవరీస్(హోల్డింగ్స్) బెంగళూరు కోర్టులో కేసు వేసిందని ఈ నివేదిక తెలిపింది. లోపాలున్న ఇంజిన్లను తమకు అంటగట్టారని, రూ.1,477 కోట్ల నష్టపరిహారం కావాలంటూ ఈ కేసు దాఖలు చేశామని వివరించింది. ఇంధనం ధరలు అధికంగా ఉండడం, తదితర క్లిష్ట పరిస్థితులకు తోడు ఇంజిన్ సమస్యలు కూడా జతవడంతో కంపెనీ కార్యకలాపాలు, ఆర్థిక వనరులు కుదేలయ్యాయని వివరించింది. పులి మీద పుట్రలా పన్ను అధికారులు కర్కశంగా వ్యవహరించారని, ఆదాయ మార్గాలను, అకౌంట్లను అటాచ్ చేశారని ఈ నివేదిక పేర్కొంది.