ఫోర్బ్స్ నవకల్పన జాబితాలో 9 దేశీ కంపెనీలు
న్యూయార్క్: ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన వంద నవకల్పన వృద్ధి కంపెనీల జాబితాలో తొమ్మిది భారత కంపెనీలకు చోటు లభించింది. ఈ జాబితాలో న్యూజిలాండ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ అకౌంటింగ్ సంస్థ గ్జెరో మొదటి స్థానంలో నిలిచింది. కంపెనీ భవిష్యత్తులో అందించే కొత్త ఉత్పత్తులు, సేవలు, మార్కెట్లపై ఇన్వెస్టర్ల అంచనాలు, ఆ అంచనాల ఆధారంగా ఆయా కంపెనీల షేర్లను కొనుగోలు చేయడం వంటి అంశాల ఆధారంగా ఈ జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించింది.
ఈ జాబితాలో గోద్రేజ్ కన్సూమర్ ప్రోడక్ట్స్ 425 కోట్ల డాలర్లతో 31వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో చోటు సాధించిన ఇతర భారత కంపెనీల వివరాలిలా ఉన్నాయి. ఏబీబీ ఇండియా(37వ స్థానం), మ్యారికో(53), యునెటైడ్ బ్రూవరీస్(60), సీమెన్స్ ఇండియా(63), ఏషియన్ పెయింట్స్(78), నెస్లే ఇండియా(78), కోల్గేట్ పామోలివ్ ఇండియా(87), దివీస్ ల్యాబ్స్(99).