Forbes India
-
రెండొంతుల డిజిటల్ స్టార్లు.. ఉల్లంఘనులే
ముంబై: ‘డిజిటల్ స్టార్లు’గా వెలుగొందుతున్న చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు వాస్తవానికి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అడ్వరై్టజింగ్ ప్రమాణాల మండలి ఏఎస్సీఐ ఆందోళన వ్యక్తం చేసింది. మూడింట రెండొంతుల మంది (69 శాతం) యధేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని వ్యాఖ్యానించింది. ‘ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 డిజిటల్ స్టార్స్ 2024’ జాబితాలో పేర్కొన్న ఇన్ఫ్లుయెన్సర్ల తీరుతెన్నులను పరిశీలించి రూపొందించిన నివేదికలో ఏఎస్సీఐ ఈ విషయాలు వెల్లడించింది. ఇందుకోసం 2024 సెప్టెంబర్–నవంబర్ మధ్యకాలంలో వారు ఇన్‌స్ట్రాగాం, యూట్యూబ్‌లో ప్రమోట్ చేసిన పోస్టులను విశ్లేషించింది. దీని ప్రకారం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు నిర్దేశించిన డిస్క్లోజర్ (కీలక వివరాలను ఫాలోయర్లకు వెల్లడించడం) మార్గదర్శకాలను పాటించడంలో 69 శాతం మంది విఫలమైనట్లు ఏఎస్సీఐ పేర్కొంది. పరిశీలించిన 100 పోస్టుల్లో 29 పోస్టుల్లో మాత్రమే తగినన్ని డిస్క్లోజర్స్ ఉన్నాయని, 69 కేసుల్లో ఉల్లంఘనలు రుజువయ్యాయని వివరించింది. ఫ్యాషన్–లైఫ్‌స్టయిల్, టెలికం ఉత్పత్తులు, పర్సనల్ కేర్ విభాగాల్లో ఈ ధోరణి అత్యధికంగా కనిపించింది. నిర్దిష్ట మార్గదర్శకాల ప్రకారం ఇన్ఫ్లుయెన్సర్లు తాము ప్రమోట్ చేసే కంపెనీలు లేదా ఉత్పత్తులతో తమకున్న సంబంధాన్ని స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. దీనితో వారి ఫాలోయర్లు పూర్తి సమాచారం ఆధారంగా సముచిత నిర్ణయం తీసుకునే వీలుంటుంది. ఇన్ఫ్లుయెన్సర్లతో ప్రకటనల్లో పారదర్శకత లోపించడం, నిబంధనలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తుండటం ఆందోళనకరమైన విషయమని నివేదిక పేర్కొంది. నియంత్రణ సంస్థపరమైన చర్యలకు గురికాకుండా ప్రకటనకర్తలు, ఏజెన్సీలు, ఇన్ఫ్లుయెన్సర్లు సమష్టిగా నిబంధనలకు అనుగుణంగా పని చేయడంపై దృష్టి పెట్టాలని సూచించింది. -
ఆసియా.. ఇండియాలోని ధనవంతుల జాబితా
పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఆసియా, దేశీ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. 2025 జనవరి ప్రారంభం నాటికి పోర్బ్స్ ఆసియా(Forbes Asia) కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ(Ambani) మొదటిస్థానంలో నిలువగా, గౌతమ్ అదానీ(Adani) రెండో స్థానంలో ఉన్నారు. ముఖేశ్ అంబానీ మొత్తం సంపద 96.6 బిలియన్ డాలర్లు ఉండగా, గౌతమ్ అదానీ సంపద 62.1 బిలియన్ డాలర్లుగా ఉంది.ఫోర్బ్స్ ప్రకారం 2025 ప్రారంభం నాటికి ఆసియాలోని టాప్ 10 ధనవంతులుముఖేష్ అంబానీ - 96.6 బిలియన్ డాలర్లు (ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్)గౌతమ్ అదానీ - 62.1 బిలియన్ డాలర్లు (ఇండియా, అదానీ గ్రూప్)జోంగ్ షాన్షాన్ - 53.6 బిలియన్ డాలర్లు (చైనా, నోంగ్ఫు స్ప్రింగ్)ప్రజోగో పంగేస్తు - 55.9 బిలియన్ డాలర్లు (ఇండోనేషియా, బారిటో పసిఫిక్ గ్రూప్)తడాషి యానై అండ్ ఫ్యామిలీ - 47.2 బిలియన్ డాలర్లు (జపాన్, ఫాస్ట్ రిటైలింగ్)జాంగ్ యిమింగ్ - 45.6 బిలియన్ డాలర్లు (చైనా, బైడ్‌డ్యాన్స్, టాక్‌టాక్)సావిత్రి జిందాల్ అండ్ ఫ్యామిలీ - 44.3 బిలియన్ డాలర్లు (ఇండియా, జిందాల్ గ్రూప్)మా హువాటెంగ్ - 43.3 బిలియన్ డాలర్లు (చైనా, టెన్సెంట్ హోల్డింగ్స్)శివ్ నాడార్ - 40 బిలియన్ డాలర్లు (ఇండియా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్)రాబిన్ జెంగ్ - 37.2 బిలియన్ డాలర్లు (హాంకాంగ్, కాంటెంపరరీ ఆంపరెక్స్ టెక్నాలజీ-సీఏటీఎల్)ఇదీ చదవండి: వడ్డీరేట్ల కోత పక్కా..?ఫోర్బ్స్ ప్రకారం 2025 ప్రారంభం నాటికి ఇండియాలోని టాప్ 10 ధనవంతులుముఖేష్ అంబానీ - 96.6 బిలియన్ డాలర్లు (రిలయన్స్ ఇండస్ట్రీస్)గౌతమ్ అదానీ - 62.1 బిలియన్ డాలర్లు (అదానీ గ్రూప్)సావిత్రి జిందాల్ అండ్ ఫ్యామిలీ - 44.3 బిలియన్ డాలర్లు (ఓపీ జిందాల్ గ్రూప్)శివ్ నాడార్ - 40 బిలియన్ డాలర్లు (హెచ్‌సీఎల్ టెక్నాలజీస్)రాధాకిషన్ దమానీ - 31.5 బిలియన్ డాలర్లు (డీమార్ట్)ఉదయ్ కోటక్ - 28 బిలియన్ డాలర్లు (కోటక్ మహీంద్రా బ్యాంక్)సునీల్ మిట్టల్ - 27 బిలియన్ డాలర్లు (భారతీ ఎంటర్ప్రైజెస్)లక్ష్మీ మిట్టల్ - 26 బిలియన్ డాలర్లు (ఆర్సెలర్ మిట్టల్)కుమార మంగళం బిర్లా - 25 బిలియన్ డాలర్లు (ఆదిత్య బిర్లా గ్రూప్)అనిల్ అగర్వాల్ - 24 బిలియన్ డాలర్లు (వేదాంత రిసోర్సెస్) -
ప్రపంచ కుబేరుల జాబితాలో తెలుగువారు ఎక్కడంటే..
ప్రపంచంలోనే అత్యధిక సంపన్నుల్లో మొదటి పది మందిలో రిలయన్స్ అధిపతి ముకేశ్ అంబానీ చోటు దక్కించుకున్నారు. మరోసారి భారత్‌లో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఫోర్బ్స్ 2024 ప్రపంచ బిలియనీర్ల జాబితా ప్రకారం.. 116 బిలియన్ డాలర్ల నికర సంపదతో ముకేశ్ అంబానీ ప్రపంచంలో 9వ స్థానంలో నిలిచారు. 2023లో ఆయన సంపద 83.4 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక భారత్‌లో రెండో సంపన్నుడైన గౌతమ్ అదానీ 17వ స్థానంలో ఉన్నారు. ఆయన సంపద 47.2 బిలియన్ డాలర్ల నుంచి 84 బిలియన్ డాలర్లకు పెరిగింది. హెచ్‌సీఎల్ టెక్ సహవ్యవస్థాపకుడు శివ్ నాడార్ 36.9 బిలియన్ డాలర్లతో 39వ స్థానంలో ఉన్నారు. జిందాల్ గ్రూప్ సావిత్రి జిందాల్-కుటుంబం (33.5 బి.డాలర్లు) 46వ స్థానంలో, సన్‌ఫార్మా దిలీప్ సంఘ్వి (26.7 బి.డాలర్లు) 69వ స్థానంలో నిలిచారు. సైరస్ పూనావాలా (21.3 బి.డాలర్లు) 90వ స్థానం, కుషాల్ పాల్ సింగ్ (20.9 బి.డాలర్లు) 92వ స్థానం, కుమార్ బిర్లా (19.7 బి.డాలర్లు) 98వ స్థానం దక్కించుకున్నారు. ఇదీ చదవండి: గూగుల్ రహస్య బ్రౌజర్.. రూ.41,000 కోట్ల దావా! తెలుగు రాష్ట్రాల నుంచి ఫోర్బ్స్‌లో చోటు సంపాదించిన వారి వివరాలు కింది విధంగా ఉన్నాయి. మురళి దివి, కుంటుబం 6.2 బిలియన్ డాలర్ల సంపదతో(రూ.51వేలకోట్లు) 469 ర్యాంకులో నిలిచారు. ప్రతాప్ సి రెడ్డి 3 బిలియన్ డాలర్లతో(రూ.26వేలకోట్లు) 1104 ర్యాంకు జీఎం రావు 2.9 బిలియన్ డాలర్లతో(రూ.25వేలకోట్లు) 1143 ర్యాంకు పీవీ రామ్ ప్రసాద్‌రెడ్డి 2.9 బిలియన్ డాలర్లతో(రూ.25వేలకోట్లు) 1143 ర్యాంకు జూపల్లి రామేశ్వర్రావు 2.3 బిలియన్ డాలర్లతో(రూ.19వేలకోట్లు) 1438 ర్యాంకు పీపీ రెడ్డి 2.3 బిలియన్ డాలర్లతో(రూ.19వేలకోట్లు) 1438 ర్యాంకు పీవీ కృష్ణారెడ్డి 2.2 బిలియన్ డాలర్లతో(రూ.18వేలకోట్లు) 1496 ర్యాంకు ఎం.సత్యనారాయణ రెడ్డి 2 బిలియన్ డాలర్లతో(రూ.16వేలకోట్లు) 1623 ర్యాంకు కె.సతీశ్‌రెడ్డి 1.8 బిలియన్ డాలర్లతో(రూ.15వేలకోట్లు) 1764 ర్యాంకు జి.వి.ప్రసాద్ 1.5 బిలియన్ డాలర్లతో(రూ.12వేలకోట్లు) 2046 ర్యాంకు -
శ్రామికలోక శక్తిమంతులు
‘చీకటిని చూసి విచారించవద్దు. అదిగో చిరుదీపం’ అంటుంది ఆశావాదం. ‘ఏమీ లేదని బాధ పడవద్దు. నేనే నీ ఆయుధం, బలం’ అంటుంది ఆత్మవిశ్వాసం. ఆశావాదం వెల్లివిరిసే చోట ఆత్మవిశ్వాసం ఉంటుంది. జయంతి బురడ, రాణిమా దాస్, మలీషా ఖర్వాలకు ఘనమైన కుటుంబ నేపథ్యం లేదు. ‘జీరో’ నుంచి ప్రయాణం ప్రారంభించిన వీరు తమను తాము తీర్చిదిద్దుకుంటూ ‘హీరో’లుగా పేరు తెచ్చుకున్నారు. ఫోర్బ్స్ ఇండియా టాప్ సెల్ఫ్–మేడ్ ఉమెన్ 2024 (డబ్ల్యూ–పవర్ లీస్ట్)లో చోటు సాధించారు... గిరిజన గొంతుక గిరిజన మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసురావడానికి జర్నలిస్ట్ కావాలనుకుంది అడవి బిడ్డ జయంతి బురుడ. అయితే ఇంట్లో మాత్రం ‘చదివింది చాలు’ అనే మాట ఎప్పడూ వినిపించేది. దీంతో ఇంటిని విడిచిపెట్టి స్నేహితుల సహాయంతో ఒడిషా సెంట్రల్ యూనివర్శిటీలో జర్నలిజంలో డిగ్రీ చేసింది. ఒడిషాలోని మల్కన్‌గిరి జిల్లాలోని సెర్పల్లి ఆమె స్వగ్రామం. 2015లో భువనేశ్వర్‌లోని కళింగ టీవీ న్యూస్ చానల్ రిపోర్టర్‌గా చేరిన జయంతి బురుడ జర్నలిస్ట్‌గా పెద్ద పేరు తెచ్చుకుంది. తన రిపోర్టింగ్ టూర్లలో గిరిజనులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, మౌలిక సదుపాయాల లేమిపై దృష్టి పెట్టడమే కాదు వాటి పరిష్కారానికి కూడా కృషి చేసింది. ఆడపిల్లల చదువు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని 2018లో ‘బడా దీదీ యూనియన్’ అనే స్వచ్ఛంద సంస్థను మొదలుపెట్టింది. ‘బడా దీదీ యూనియన్’ ద్వారా గిరిజన మహిళల కోసం ఎన్నో అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహించింది. తమను వేధిస్తున్న సమస్యలపై గిరిజన మహిళలు ధైర్యంగా గొంతు విప్పలేకపోవడాన్ని జయంతి గ్రహించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి, ధైర్యంగా గొంతు విప్పడానికి 2022లో ‘జంగిల్ రాణి’ పేరుతో వేదిక ప్రారంభించింది. ‘మన కథ– మన కోసం’ అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇది. మల్కన్‌గిరిలోని ఏడు బ్లాక్‌లకు చెందిన యాభై మంది గిరిజన మహిళలు ఈ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహిస్తున్నారు. స్క్రిప్ట్‌లు రాయడం, వీడియోలు చిత్రీకరించడం, ఎడిటింగ్....మొదలైవాటిని వీరికి నేర్పించింది బురుడ. సంస్కృతి నుంచి తాము ఎదుర్కోంటున్న సమస్యల వరకు చేతిలోని సెల్‌ఫోన్‌తో వీడియో స్టోరీలు చేస్తున్నారు గిరిజన మహిళలు. ఈ స్టోరీలను ‘జంగిల్ రాణి’ ఫేస్బుక్ పేజీలో అప్లోడ్ చేస్తారు. గిరిజన సమాజానికి, అడవులు, జీవనవైవిధ్యానికి ఉన్న సంబంధానికి అద్దం పట్టే సహజ కథనాలు ఇవి. ఎంతోమంది సాధారణ మహిళలలో అసాధారణ ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో ఎంతో కృషి చేసింది జయంతి బురుడ. ప్రిన్సెస్ ఆఫ్ స్లమ్ ‘ప్రిన్సెస్ ఆఫ్ స్లమ్’గా పేరు సంపాదించిన మలీషా ఖర్వా ఫోర్బ్స్ ఇండియా ఉమెన్–పవర్ 2024 జాబితాలో చోటు సాధించిన అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది. హాలీవుడ్ యాక్టర్ రాబర్ట్ హాఫ్మన్తో కలిసి నటించిన తరువాత మలీషా జీవితం మారిపోయింది. ముంబైలోని ధారవి మురికివాడలో ఒక గుడిసెలో నివసిస్తున్న మలీషా రాబర్ట్ హాఫ్మన్ దృష్టిలో పడింది. ఆ అమ్మాయిలోని వెలుగేదో రాబర్ట్‌ను ఆకట్టుకుంది. ‘ఈ మట్టిలో మాణిక్యాన్ని వెలుగులోకి తీసుకురావాలి’ అనుకున్నాడు. మోడల్, డ్యాన్సర్ కావాలన్న మలీషా కలను సాకారం చేసేందుకు తన వంతు సాయం అందించాడు. మలీషాకు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో 4,50,000 మంది ఫాలోవర్లు, 88,700 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. పీకాక్ మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిసిన మలీషా లగ్జరీ ఇండియన్ కాస్మోటిక్స్ బ్రాండ్ ఫారెస్ట్ ఎసెన్షియల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. పదహారు సంవత్సరాల మలీషా ఖర్వా మోడల్, కంటెట్ క్రియేటర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ‘కల నిజం చేసుకోవడానికి పేదరికం ఎంతమాత్రం అడ్డు కాదు’ అని నిరూపించిన మలీషా ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. అంగన్వాడీ అక్క దేశంలోని 23 లక్షల అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల ప్రతినిధిగా రాణిమా దాస్‌ను ఫోర్బ్స్ ఇండియా ‘ఉమెన్ పవర్ లిస్ట్ 2024’లో చోటు కోసం ఆల్ ఇండియా అంగన్ వాడీ వర్కర్ ఫెడరేషన్ నామినేట్ చేసింది. అస్సాంలో పరఖోవా గ్రామానికి చెందిన రాణిమా దాస్ ఎవరికి ఏ సమస్య వచ్చినా ‘నేను ఉన్నాను’ అంటూ ముందుకు వచ్చేది. సమస్యల పరిష్కారంతో పాటు మహిళలకు ఆరోగ్యానికి సంబంధించిన నలహాలు ఇవ్వడంలో మంచి పేరు తెచ్చుకుంది. అంకితభావం, నిబద్ధతతో వ్యవహరించే రాణిమాను ‘అక్కా’ అని అందరూ ఆప్యాయంగా పిలుచుకుంటారు. గత పదిహేడేళ్లుగా పిల్లలను బడిలో చేర్పించడం, గర్భిణి స్త్రీలకు సూచనలు...మొదలైన ఎన్నో విషయాల్లో కృషి చేస్తోంది రాణిమా దాస్. సలహాలు, సహాయం విషయంలో ముందు ఉన్నట్లే పోరాట విషయంలో ముందుంటుంది. అస్సాం అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెండ్ అయిన రాణిమా దాస్ అంగన్వాడీ వర్కర్ల వేతన పెంపుదల కోసం పోరాటం చేసింది. అంగన్వాడీ కేంద్రాలను ప్రైవేటుపరం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ‘ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎప్పుడూ పోరాడతాం’ అంటున్న రాణిమా దాస్‌కు పోరాటం కొత్త కాదు. -
Forbes India 30 Under 30 2024: నెక్ట్స్ వేవ్ వ్యవస్థాపకులకు ఫోర్బ్స్ ఇండియా గుర్తింపు
హైదరాబాద్: హైదరాబాద్ కి చెందిన అంకుర సంస్థ నెక్ట్స్ వేవ్ వ్యవస్థాపకులు శశాంక్ రెడ్డి గుజ్జుల, అనుపమ్ పెదర్లకు 2024 సంవత్సరానికి ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ‘ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30’ జాబితాలో చోటు దక్కింది. విద్యారంగంలో విశేష మార్పులు తీసుకువచి్చనందుకు ఈ జాబితాలో చోటు దక్కించుకున్న వీరు ఇద్దరూ తెలుగు వారే కావడం విశేషం. సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్‌కు చెందిన శశాంక్ గుజ్జుల ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదవగా.. ఏలూరుకు చెందిన అనుపమ్ పెదర్ల ఐఐటీ ఖరగపూర్లో బీటెక్ పూర్తి చేశాడు. పరిశ్రమకు కావలసిన నైపుణ్యాలు ఇంజనీరింగ్ విద్యార్థుల్లో లేకపోవడంతో వారు ఉద్యోగాలు పొందలేకపోతున్నట్టు గుర్తించిన వీరు, సమస్య పరిష్కారానికి నడుం బిగించారు. గొప్ప ఉద్యోగావకాశాలను కాదనుకొని గోదావరిఖనికి చెందిన రాహుల్ అత్తులూరితో కలిసి నెక్ట్స్వేవ్ను స్థాపించారు. యువతలో ఆధునిక 4.0 టెక్నాలజీలలో నైపుణ్యాలు పెంపొందిస్తూ ఐటీ ఉద్యోగాలు సొంతం చేసుకునే దిశగా వారికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. మూడేళ్లలోనే దేశ విద్యా రంగంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న అంకుర సంస్థల్లో ఒకటిగా నెక్సŠట్ వేవ్ నిలిచింది. గత సంవత్సరం గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్ నుంచి 275 కోట్ల రూపాయల నిధులను సొంతం చేసుకుంది. బహుళజాతి సంస్థలు సహా 1700 లకు పైగా కంపెనీలు వేలాది నెక్ట్స్ వేవ్ విద్యార్థులను ఇప్పటికే ఉద్యోగాలలో నియమించుకున్నాయి. ఈ సందర్భంగా నెక్సŠట్ వేవ్ సహ వ్యవస్థాపకుడు శశాంక్ గుజ్జుల మాట్లాడుతూ ‘‘నెక్ట్స్ వేవ్ మొదలైనప్పటి నుంచి మా దృష్టి అంతా కూడా టెక్నాలజీ రంగంలోని గొప్ప అవకాశాలకు సొంతం చేసుకునేలా యువతని సిద్ధం చేయడంపైనే ఉండేది. ఇలాంటి గుర్తింపులు మరింత ఉత్సాహంగా మా లక్ష్యం వైపు అడుగు వేయడానికి తోడ్పడుతాయి’’అని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి టెక్నాలజీ విద్యను దేశంలోని నలుమూలలకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని నెక్ట్స్ వేవ్ మరో సహ వ్యవస్థాపకుడైన అనుపమ్ పెదర్ల చెప్పారు. -
2024 ఫోర్బ్స్ జాబితాలో ఇద్దరు తెలుగు వారికి చోటు
2024వ సంవత్సరానికి ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ప్రచురించిన ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితాలో హైదరాబాద్‌కు చెందిన అంకుర సంస్థ 'నెక్స్ట్ వేవ్' స్థాపించిన శశాంక్ గుజ్జుల, అనుపమ్ పెదర్లకు చోటు దక్కింది. విద్యారంగంలో విశేష మార్పులు తీసుకువచ్చినందుకు ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఇద్దరూ తెలుగు వారే కావడం విశేషం. సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్‌కి చెందిన 'శశాంక్ గుజ్జుల' ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదివాడు. ఏలూరికి చెందిన 'అనుపమ్ పెదర్ల' ఐఐటీ ఖరగపూర్లో బి.టెక్ పూర్తి చేశాడు. ప్రఖ్యాత మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ ప్రకారం భారత దేశ ఐటీ ఇండస్ట్రీ ఈ దశాబ్దంలో మూడు రేట్లు పెరగనుంది. ఎన్నో అద్భుతమైన అవకాశాలు ఉన్నపటికీ విద్యార్థులలో పరిశ్రమకు కావలసిన నైపుణ్యాలు లేకపోవడం వలన ఉద్యోగాలు పొందడంలో ఇబ్బంది పడుతున్నారని వీరు గమనించి వీరిరువురు ఎన్నో గొప్ప ఉద్యోగావకాశాలను వదులుకుని 'రాహుల్ అత్తులూరి'తో కలిసి 'నెక్స్ట్ వేవ్' స్థాపించారు. నెక్స్ట్ వేవ్ ద్వారా యువతలో ఆధునిక 4.0 టెక్నాలజీల నైపుణ్యాలను పెంపొందిస్తూ వారికి చక్కటి ఐటీ ఉద్యోగాలు అందేలా ప్లేసెమెంట్ సపోర్ట్ కూడా అందిస్తున్నారు. కేవలం మూడు సంవత్సరాలలోనే భారత దేశ విద్య రంగంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న అంకుర సంస్థల్లో ఒకటిగా నెక్స్ట్ వేవ్ నిలిచింది. గత సంవత్సరం గ్రేటర్ పసిఫిక్ కాపిటల్ నుంచి 275 కోట్ల రూపాయల ఫండింగ్ కూడా పొందారు. అంకుర సంస్థలు మొదలుకొని అమెజాన్, గూగుల్, బ్యాంకు అఫ్ అమెరికా వంటి మల్టీ నేషనల్ కంపెనీలు వరకు 1700లకు పైగా కంపెనీలు వేలాది నెక్స్ట్ వేవ్ విద్యార్థులను ఇప్పటికే ఉద్యోగాలలో నియమించుకున్నాయి. రాబోయే రెండు సంవత్సరాలలో 10,000లకు పైగా కంపెనీలతో జత కట్టి అనేక ఉద్యోగావకాశాలు సృష్టించే లక్ష్యంతో నెక్స్ట్ వేవ్ ముందుకు సాగుతుంది. దేశం నలుమూలల నుంచి విద్యార్థులు నెక్స్ట్ వేవ్‌లో నేర్చుకుంటున్నారు. ఈ సందర్బంగా నెక్స్ట్ వేవ్ కో-ఫౌండర్ శశాంక్ గుజ్జుల మాట్లాడుతూ.. ఇది మేము వ్యక్తిగతంగా సాధించిన గుర్తింపు కాదు. గొప్ప కలలు కని వాటి కోసం స్థిరంగా ప్రతి రోజు నేర్చుకుంటున్న నెక్స్ట్ వేవ్ విద్యార్థులకు, ఎంతో మంది యువతను చక్కటి ఉద్యోగాలు సాధించేలా నిరంతరం కృషి చేస్తున్న నెక్స్ట్ వేవ్ బృందానికి దక్కిన గుర్తింపు. నెక్స్ట్ వేవ్ మొదలైనప్పటి నుంచి మా దృష్టి అంతా కూడా టెక్నాలజీ రంగంలోని ఎన్నో గొప్ప అవకాశాలకు మన యువతని సిద్ధం చేయడమే.. ఇలాంటి గుర్తింపులు మరింత ఉత్సాహాన్ని నింపుతూ, మా లక్ష్యం వైపు అడుగు మరింత వేగంగా వేయడానికి తోడ్పడుతాయని అన్నారు. నెక్స్ట్ వేవ్ కో-ఫౌండర్ మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనుపమ్ పెదర్ల మాట్లాడుతూ.. యువత మన దేశ బలం. వారందరు చక్కటి నైపుణ్యాలతో ఉంటే మన దేశం ఒక అగ్రగామిగా మారడం ఖాయం. ప్రపంచ స్థాయి టెక్నాలజీ విద్యను భారత దేశ ప్రతి మూలకు తీసుకెళ్లడమే మా లక్ష్యం. ప్రతి విద్యార్ధి ఒక వజ్రం లాంటి వారు అని మేము గట్టిగా నమ్ముతాము. వారికి సరైన మార్గదర్శనంతో తోడ్పాటు అందిస్తే అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఇది మా నెక్స్ట్ వేవ్ విద్యార్థులు అనేక సార్లు నిరూపించారు. ఫోర్బ్స్ నుంచి ఈ గుర్తింపు అనేది వేలాది యువత జీవితాల్లో నెక్స్ట్ వేవ్ తీసుకొస్తున్న మార్పుకి నిదర్శనం. -
బిలినీయర్స్ జాబితాలో కొత్త వ్యక్తి.. మద్యం అమ్ముతూ అరుదైన ఘనత
భారతదేశంలో కుబేరుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఫోర్బ్స్ జాబితాలో మరో ఇండియన్ పేరు నమోదైంది. ఎనిమిది పదుల వయసులో కుబేరుల జాబితాలోకి చేరిన వ్యక్తి ఎవరు.. అయన సంపద ఎంత.. ఏ కంపెనీ నడిపిస్తున్నారు.. ఎలాంటి ఉత్పత్తులు తయారు చేస్తున్నారనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మద్యం వ్యాపారంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఇండియా ఒకటి. మద్యం వ్యాపారం చేస్తూ ధనవంతుల జాబితాలో చేరిన 'లలిత్ ఖైతాన్' (Lalit Khaitan) 1972-73లలో కంపెనీ స్వాధీనం చేసుకున్న తరువాత దానిని ఉన్నత శిఖరాలకు చేర్చడానికి ఈయన అనుదినం కృషి చేసేవారు. అనుకున్న విధంగానే సక్సెస్ సాధించి ఎంతోమందికి ఆదర్శమయ్యాడు. లలిత్ ఖైతాన్ సారథ్యంలో ముందుకు సాగుతున్న 'రాడికో ఖైతాన్' (Radico Khaitan) ఇప్పుడు మ్యాజిక్ మూమెంట్స్ వోడ్కా, 8 పీఎం విస్కీ, ఓల్డ్ అడ్మిరల్ బ్రాండీ, రాంపూర్ సింగిల్ మాల్ట్ లాంటి బ్రాండ్లను ఉత్పత్తి చేస్తోంది. ఈ ఏడాది కంపెనీ షేర్లు 50 శాతం పెరిగి సంస్థ విలువ బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో లలిత్ ఖైతాన్ బిలియనీర్ల జాబితాలోకి చేరిపోయారు. ఖైతాన్.. అజ్మీర్ మాయో కాలేజ్, కోల్‌కతాలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో చదువు పూర్తి చేసుకుని, బెంగుళూరులోని BMS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి మేనేజిరియల్ ఫైనాన్స్ & అకౌంటింగ్ కోర్సును అభ్యసించారు. రాడికో ఖైతాన్‌గా పిలువబడుతున్న కంపెనీని గతంలో రాంపూర్ డిస్టిలరీ అండ్ కెమికల్ కంపెనీ లిమిటెడ్‌గా పిలిచేవారు. ఆ సంస్థను ఖైతాన్ తండ్రి జీఎన్ ఖైతాన్ 1970 ప్రారంభంలో నష్టాల్లో నడుస్తున్న సమయంలో సొంతం చేసుకున్నారు. ఆ తరువాత ఈ కంపెనీ క్రమంగా వృద్ధి చెందుతూ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన సంస్థల జాబితాలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం కంపెనీ బ్రాండ్లను సుమారు 85 దేశాలలో విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఏం ప్లానింగయ్యా.. ఏమీ చేయకపోయినా నెలకు రూ.9 లక్షలు సంపాదన మద్యం రంగంలో అతి తక్కువ కాలంలోనే గొప్ప పురోగతి కనపరిచిన లలిత్ ఖైతాన్ 2008లో 'ఇన్స్పిరేషనల్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు', 2017లో ఉత్తర ప్రదేశ్ డిస్టిల్లర్స్ అసోసియేషన్ ద్వారా 'లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు' వంటి వాటిని సొంతం చేసుకుని.. ఇప్పడూ ఫోర్బ్స్ జాబితాలో ఒకరుగా స్థానం సంపాదించారు. -
ధనవంతుల జాబితాలో రైతు బిడ్డ - సంపద తెలిస్తే అవాక్కవుతారు!
ఇటీవల ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన 100 మంది అత్యంత సంపన్నుల జాబితాలో రిలయన్స్ ఛైర్మన్ 'ముకేశ్ అంబానీ' (Mukesh Ambani) అగ్రస్థానం పొందగా.. ఆఖరి (100వ) స్థానంలో కేపీఆర్ మిల్ ఛైర్మన్ 'రామసామి' (Ramasamy) నిలిచినారు. ఈ కథనంలో రామసామి ఎవరు? ఆయన సంపద ఎంత? అనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఆర్ధిక పరిస్థితుల కారణంగా కాలేజీ చదువును మధ్యలో ఆపేసిన ఒక రైతు కొడుకు నేడు భారతదేశంలోని 100 మంచి ధనవంతులలో ఒకడుగా నిలిచాడంటే చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఫోర్బ్స్ ఇండియా ప్రకారం, రామసామి మొత్తం ఆస్తుల విలువ 2.3 బిలియన్ డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 19133.7 కోట్లు). వస్త్రాలు (టెక్స్టైల్స్), చక్కెర తయారీదారులో తమదైన రీతిలో ముందుకు సాగుతున్న KPR మిల్ ఫౌండర్ అండ్ ఛైర్మన్ 'రామసామి' ఫోర్బ్స్ జాబితాలో చేరిన కొత్త వ్యక్తి కావడం హర్షించదగ్గ విషయం. ప్రస్తుతం ఈయన కంపెనీలలో సుమారు 25,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు, అందులో 90శాతం మంది మహిళా ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. వీరందరికి కరోనా మహమ్మారి సమయంలో కూడా పూర్తి జీతాలిచ్చి ఆదరించిన ఘనత రామసామి సొంతం. ఇదీ చదవండి: రూ.5 వేలతో మొదలైన రూ.14000 కోట్ల కంపెనీ.. సామాన్యుడి సక్సెస్ స్టోరీ! నేడు వందమంది ధనవంతుల జాబితాలో ఒకరుగా నిలిచిన రామసామి ప్రయాణం కేవలం రూ. 8,000 అప్పుతో మొదలైంది. ప్రతి ఏటా దాదాపు 128 మిలియన్ల వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్న కేపీఆర్ కంపెనీ సంవత్సరానికి వేలకోట్లు ఆర్జిస్తోంది. సంస్థ ఉత్పత్తి చేసే వస్త్రాలలో స్పోర్ట్స్‌వేర్ నుంచి స్లీప్వేర్ వరకు దాదాపు అన్ని లభిస్తాయి. -
‘ఫోర్బ్స్’ కుబేరుల్లోనూ అంబానీకే పట్టం
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ దేశీ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో నిల్చారు. 2023 సంవత్సరానికి గాను భారత్‌లోని 100 మంది సంపన్నులతో ఫోర్బ్స్ రూపొందించిన జాబితాలో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. ఆయన సంపద 92 బిలియన్ డాలర్లుగా ఉంది. మరోవైపు గతేడాది అంబానీని కూడా దాటేసిన అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ ఈసారి 68 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిల్చారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల దెబ్బతో అదానీ గ్రూప్ సంస్థల షేర్లు కుదేలవడంతో ఆయన సంపద 82 బిలియన్ డాలర్ల మేర కరిగిపోవడం ఇందుకు కారణం. ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చీఫ్ శివ నాడార్ 29.3 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను విడగొట్టి, లిస్టింగ్ చేయడంతో పాటు తన ముగ్గురు సంతానానికి రిలయన్స్ బోర్డులో చోటు కల్పించడం ద్వారా ముకేశ్ అంబానీ వారసత్వ ప్రణాళికను పటిష్టంగా అమలు చేసినట్లు ఫోర్బ్స్ పేర్కొంది. అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లకు భారత్ ఒక హాట్‌స్పాట్‌గా ఉంటోందని తెలిపింది. కుబేరుల సంపద మరింతగా పెరగడంతో, టాప్ 100 లిస్టులోకి చేరాలంటే కటాఫ్ మార్కు 2.3 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఆసియా వెల్త్ ఎడిటర్ నాజ్నీన్ కర్మాలీ వివరించారు. భారత్‌లోని 100 మంది కుబేరుల మొత్తం సంపద ఈ ఏడాది 799 బిలియన్ డాలర్లుగా ఉంది. వ్యక్తి ర్యాంకు సంపద (బి.డాలర్లలో) ముకేశ్ అంబానీ 1 92 గౌతమ్ అదానీ 2 68 శివ నాడార్ 3 29.3 సావిత్రి జిందాల్ 4 24 రాధాకిషన్ దమానీ 5 23 సైరస్ పూనావాలా 6 20.7 హిందుజా కుటుంబం 7 20 దిలీప్ సంఘ్వి 8 19 కుమార బిర్లా 9 17.5 షాపూర్ మిస్త్రీ, కుటుంబం 10 16.9 తెలుగువారిలో మురళి దివి 33 6.3 పి.పి. రెడ్డి, పీవీ కృష్ణారెడ్డి 54 4.05 ‘డాక్టర్ రెడ్డీస్’ కుటుంబం 75 3 ప్రతాప్ రెడ్డి 94 2.48 పీవీ రామ్‌ప్రసాద్‌రెడ్డి 98 2.35 -
అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన టాప్ 10 దేశాల్లో 'భారత్' ఎక్కడుందంటే?
భారతదేశం అన్ని రంగాల్లోనూ వేగంగా అభివృద్ధి చెందుతోంది. గతంతో పోలిస్తే టెక్నాలజీ ఇప్పుడు మరింత ఊపందుకుంటోంది. ఈ కారణంగా 2023లో ప్రపంచంలోని అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థలుగా వృద్ధి చెందిన దేశాల జాబితాలో ఇండియా 5 వ స్థానంలో చేరింది. ఒక దేశం GDPని అంచనా వేయడానికి మొత్తం వినియోగ వస్తువులు, కొత్త పెట్టుబడులు, ప్రభుత్వ వ్యయాలు, ఎగుమతుల నికర విలువ ఉపయోగపడుతుంది. అయితే 2023లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం ఏది? ఇతర వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. ఫోర్బ్స్ ఇండియా నివేదిక ప్రకారం.. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల జాబితాలో అమెరికా మొదటి జాబితాలో ఉంది. ఐదవ స్థానంలో భారత్ చేరగా.. 10వ స్థానంలో బ్రెజిల్ ఉంది. 2023లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన 10 దేశాలు & జీడీపీ.. అమెరికా - 26854 బిలియన్ డాలర్లు చైనా - 19374 బిలియన్ డాలర్లు జపాన్ - 4410 బిలియన్ డాలర్లు జర్మనీ - 4309 బిలియన్ డాలర్లు ఇండియా - 3750 బిలియన్ డాలర్లు యూకే - 3159 బిలియన్ డాలర్లు ఫ్రాన్స్ - 2924 బిలియన్ డాలర్లు ఇటలీ - 2170 బిలియన్ డాలర్లు కెనడా - 2090 బిలియన్ డాలర్లు బ్రెజిల్ - 2080 బిలియన్ డాలర్లు ప్రపంచంలోని టాప్ 10 దేశాల వారీగా జీడీపీ.. 👉అమెరికా జీడీపీ: 26854 బిలియన్ తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 80,030 డాలర్లు వార్షిక జీడీపీ వృద్ధి రేటు: 1.6 శాతం 👉చైనా జీడీపీ: 19374 బిలియన్ డాలర్లు తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 13,720 డాలర్లు వార్షిక జీడీపీ వృద్ధి రేటు: 5.2 శాతం 👉జపాన్ జీడీపీ: 4,410 బిలియన్ డాలర్లు తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 35,390 డాలర్లు వార్షిక జీడీపీ వృద్ధి రేటు: 1.3 శాతం 👉జర్మనీ జీడీపీ: 4,309 బిలియన్ డాలర్లు తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 51,380 డాలర్లు వార్షిక జీడీపీ వృద్ధి రేటు: -0.1 శాతం 👉ఇండియా జీడీపీ: 3,750 బిలియన్ డాలర్లు తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 2,601 డాలర్లు వార్షిక జీడీపీ వృద్ధి రేటు: 5.9 శాతం 👉యూకే (యునైటెడ్ కింగ్డమ్) జీడీపీ: 3,159 బిలియన్ డాలర్లు తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 46,370 డాలర్లు వార్షిక జీడీపీ వృద్ధి రేటు: -0.3 శాతం 👉ఫ్రాన్స్ జీడీపీ: 2,924 బిలియన్ డాలర్లు తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 44,410 డాలర్లు వార్షిక జీడీపీ వృద్ధి రేటు: 0.7 శాతం 👉ఇటలీ జీడీపీ: 2,170 బిలియన్ డాలర్లు తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 36,810 డాలర్లు వార్షిక జీడీపీ వృద్ధి రేటు: 0.7 శాతం 👉కెనడా జీడీపీ: 2,090 బిలియన్ డాలర్లు తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 52,720 డాలర్లు వార్షిక జీడీపీ వృద్ధి రేటు: 1.5 శాతం 👉బ్రెజిల్ జీడీపీ: 2,080 బిలియన్ డాలర్లు తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 9,670 డాలర్లు వార్షిక జీడీపీ వృద్ధి రేటు: 0.9 శాతం -
రిలయన్స్ సత్తా.. ప్రపంచ దేశాల్లోని దిగ్గజ కంపెనీలను సైతం వెనక్కి నెట్టి..
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా భారీ అంతర్జాతీయ సంస్థల జాబితాలో మరింత పై స్థానానికి చేరింది. 2023 సంవత్సరానికి గాను ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన గ్లోబల్ 2000 కంపెనీల లిస్టులో 8 స్థానాలు ఎగబాకి 45వ ర్యాంకు దక్కించుకుంది. జర్మనీకి చెందిన బీఎండబ్ల్యూ గ్రూప్, స్విట్జర్లాండ్ దిగ్గజం నెస్లే, చైనా సంస్థ ఆలీబాబా గ్రూప్ మొదలైన వాటిని కూడా అధిగమించింది. 109.43 బిలియన్ డాలర్ల ఆదాయం, 8.3 బిలియన్ డాలర్ల లాభాలు నమోదు చేయడంతో రిలయన్స్ ర్యాంకు మెరుగుపడింది. టాప్ 100 జాబితాలో రిలయన్స్‌తో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 77వ స్థానంలో నిల్చింది. 2000 కంపెనీల లిస్టులో మొత్తం మీద 55 భారతీయ సంస్థలు.. ర్యాంకులను దక్కించుకున్నాయి. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలతో దెబ్బతిన్నప్పటికీ అదానీ గ్రూప్‌నకు చెందిన 3 సంస్థలు లిస్టులో నిల్చాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ (1,062), అదానీ పవర్ (1,488), అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్స్ (1,598 ర్యాంకు) వీటిలో ఉన్నాయి. అమ్మకాలు, లాభాలు, అసెట్లు, మార్కెట్ విలువ అంశాల ప్రాతిపదికన ఫోర్బ్స్ ఈ ర్యాంకులు ఇచ్చింది. జేపీమోర్గాన్ టాప్.. ఫోర్బ్స్ లిస్టులో 3.7 లక్షల కోట్ల డాలర్ల అసెట్స్‌తో జేపీమోర్గాన్ అగ్రస్థానం దక్కించుకుంది. సౌదీ చమురు సంస్థ ఆరామ్కో 2వ స్థానంలో, చైనాకు చెందిన మూడు భారీ ప్రభుత్వ రంగ బ్యాంకులు వరుసగా తర్వాత స్థానాల్లో ఉన్నాయి. గతేడాది టాప్ ర్యాంకులో ఉన్న బెర్క్‌షైర్ హాథ్‌వే ఈసారి 338వ స్థానానికి పడిపోయింది. పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో నష్టా ల్లో ఉండటమే ఇందుకు కారణం. ఈ ఏడాది మే 5 నాటికి అందుబాటులో ఉన్న గత 12 నెలల గణాంకాల ప్రకారం ఫోర్బ్స్ ఈ లిస్టును రూపొందించింది. జాబితాలోని కంపెనీల మొత్తం విక్రయాలు 50.8 లక్షల కోట్ల డాలర్లుగా, లాభాలు 4.4 లక్షల కోట్ల డాలర్లుగా, అసెట్స్ 231 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్నాయి. 58 దేశాలకు చెందిన లిస్టెడ్ కంపెనీలకు చోటు దక్కింది. 611 కంపెనీలతో అమెరి కా అగ్రస్థానంలో ఉండగా 346 సంస్థలతో చైనా రెండో స్థానంలో ఉంది. -
ఈషా అంబానీకి ఫోర్బ్స్ అవార్డు
న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్ చైర్పర్సన్ ఈషా అంబానీ తాజాగా జెన్నెక్ట్స్ ఎంట్రప్రెన్యూర్ పురస్కారాన్ని దక్కించుకున్నారు. శుక్రవారం జరిగిన ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డులు 2023 కార్యక్రమంలో దీన్ని ప్రదానం చేశారు. ఆమెతో పాటు పలువురు పరిశ్రమ ప్రముఖులు కూడా పురస్కారాలు అందుకున్నారు. వీరిలో టైటాన్ ఎండీ సీకే వెంకటరామన్ ’సీఈవో ఆఫ్ ది ఇయర్’, మ్యాక్స్ హెల్త్‌కేర్ సీఎండీ అభయ్ సోయి ’ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డులను దక్కించుకున్నారు. ఈషా అంబానీ 2008లో ఫోర్బ్స్ రూపొందించిన యువ బిలియనీర్ వారసురాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిల్చారు. యేల్ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదివారు. -
రా RAW రాజు
‘కాలం కలిసి రావాలి’ అంటూ కాలాన్ని మాత్రమే నమ్ముకునే వారు ఒక రకం.‘కాలం కలిసి రావాలి అంటే కష్ట పడాలి’ అనుకునే వారు రెండో రకం. ‘రైతుబిడ్డ’ విక్రమ్‌సింగ్ రెండో రకానికి చెందిన కుర్రాడు.తన నాయకత్వ లక్షణాలతో ‘ఆఫ్‌బిజినెస్’కు కొత్త వెలుగు తీసుకువచ్చాడు... హరియాణా మహేంద్రగఢ్ జిల్లాలోని మల్రా గ్రామంలో రైతు కుటుంబానికి చెందిన విక్రమ్‌సింగ్ ఖరీదైన స్కూళ్లలో ఎప్పుడూ చదువుకోలేదు. ఆరవతరగతిలో మాత్రమే ఇంగ్లీష్ చదువుకునే అవకాశం వచ్చింది. స్కూల్ పూర్తయిన తరువాత పొలానికి వెళ్లి తండ్రికి సహాయం చేసేవాడు.‘ఏ పనైనా ఇష్టంగా చేయాలి. నాకు వ్యవసాయం అంటే ఇష్టం. నువ్వు కూడా చదువును ఇష్టంగా చదువుకోవాలి. చదువుకోవడం నా వల్ల కాదు అనిపిస్తే నాతో పా టు పనిచెయ్యి’ అనే వాడు నాన్న. మరోవైపు స్నేహితులు...‘నువ్వు రెజ్లర్ కాకపో తే జీవితంలో ఏది సాధించలేవు’ అనేవారు. ఆప్రాం తంలో రెజ్లింగ్ బాగా పాపులర్. ప్రైజ్‌మనీ కూడా భారీగా ఉండేది. స్నేహితుల మాటలతో రెజ్లర్ కావాలనే ఆశ విక్రమ్‌లో మొలకెత్తింది. ఎక్కడ రెజ్లింగ్ పొటీలు జరిగినా వెళ్లేవాడు. ఇది గమనించిన టీచర్ ‘నువ్వు చదువులో ముందున్నావు. నీకు మంచి భవిష్యత్ ఉంది. ఇలా రెజ్లింగ్ అంటూ ఊళ్లు తిరిగితే చదువు దెబ్బతింటుంది’ అని హెచ్చరించాడు. ఇక అప్పటి నుంచి తన మనసులో నుంచి ‘రెజ్లింగ్’ను డిలిట్ చేశాడు విక్రమ్.ఇంజినీరింగ్ పూర్తి చేసిన తరువాత దిల్లీలో ఎంబీఏ చేశాడు. ఆ తరువాత కామర్స్ అండ్ ఫిన్‌టెక్ స్టార్టప్ ‘ఆఫ్‌బిజినెస్’లో చేరాడు. మూడు సంవత్సరాల తరువాత విక్రమ్ దశ తిరిగింది. ‘ఆఫ్‌బిజినెస్’కు ఉన్న మూడు యూనిట్లలో ఒకటైన ‘రా మెటీరియల్ బిజినెస్ యూనిట్’కు నాయకత్వ బాధ్యతలు అప్పగించడానికి సరిౖయెన వ్యక్తుల కోసం కంపెనీ పెద్దలు చూస్తున్న సమయంలో వారికి విక్రమ్ పేరు తట్టింది. అలా విక్రమ్ ‘రా మెటీరియల్ బిజినెస్ యూనిట్’కు హెడ్ అయ్యాడు. ‘రా మెటీరియల్స్ ఎట్ లోయెస్ట్ ప్రైసెస్–గ్యారెంటీడ్’ అనే మాటలో మాంత్రికశక్తి లేకపో వచ్చు. అయితే దీన్ని కస్టమర్లలోకి బలంగా తీసుకెళ్లడంలో విక్రమ్ విజయం సాధించాడు. ఫ్రెషర్స్‌తో తనదైన ఒక టీమ్‌ను ఏర్పాటు చేసుకోని, అడుగులో అడుగు వేస్తూ మెల్లగా నడుస్తున్న యూనిట్‌ను పరుగెత్తేలా చేశాడు. కోట్ల టర్నోవర్‌కు చేర్చాడు. ‘విక్రమ్‌లో నాయకత్వ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. మా నమ్మకాన్ని నిలబెట్టాడు’ అంటున్నాడు ‘ఆఫ్‌బిజినెస్’ సీయీవో ఆశీష్ మహాపా త్రో. ‘అదృష్టం కష్టం వైపు మొగ్గు చూపుతుంది అంటారు. నేను కష్టాన్నే నమ్ముకున్నాను. రైట్ ప్లేస్‌లో రైట్పర్సన్గా గుర్తింపు తెచ్చుకున్నప్పుడే విజయం సాధించగలం’ అంటున్న 29 సంవత్సరాల విక్రమ్‌సింగ్ ‘ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30’ జాబితాలో చోటు సంపాదించాడు. -
22 ఏళ్ల కిషన్ పన్‌పాలియా.. 24 ఏళ్ల రితికా పాండే! వీళ్లిద్దరూ అద్భుతం..
ఇరవై రెండు సంవత్సరాల వయసులో... ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కంటెంట్ క్రియేషన్ ప్లాట్‌ఫామ్‌కు బిజినెస్ హెడ్‌గా పనిచేస్తున్నాడు కిషన్ పన్‌పాలియా. ఇరవై నాలుగు సంవత్సరాల వయసులోనే ఆర్టిస్ట్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది రితిక పాండే. ఈ ఇద్దరు తాజాగా... ‘ఫోర్బ్స్ 30 అండర్ 30’ 2023 జాబితాలో చోటు సంపాదించారు... చిన్న వయసులోనే మోస్ట్ పాపులర్ కంటెంట్ క్రియేషన్ ప్లాట్‌ఫామ్ ‘పెప్పర్ కంటెంట్’కు బిజినెస్ హెడ్‌గా పెద్ద బాధ్యతలు నిర్వహిస్తున్నాడు కిషన్ పన్‌పాలియా ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే... ‘ఇండియా కాటన్ సిటీ’గా పేరుగాంచిన మహారాష్ట్రలోని అకోల. కిషన్ ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. ‘పాకెట్ మనీ కోసం తల్లిదండ్రుల మీద ఆధారపడడం ఎందుకు? నేను సంపాదించలేనా!’ అని ఆలోచించి రంగంలోకి దిగాడు. తన ఐడియా చెప్పి స్నేహితులు బంధువులను ఒప్పించాడు. అందరూ కలిసి స్క్రాప్ కొని అమ్మడం మొదలు పెట్టారు. పాకెట్ చాలనంత మనీ వచ్చి చేరింది! కట్ చేస్తే... బిట్స్ పిలానిలో చదువుకునే రోజుల్లో కిషన్‌కు మంచి గుర్తింపు ఉండేది. దీనికి కారణం కాలేజీ ఈవెంట్ కోసం లక్షా పాతికవేల స్పాన్సర్‌షిప్‌ను సంపాదించడం. నిజానికి కాలేజి ఈవెంట్‌కు పాతికవేలకు మించి స్పాన్సర్షిప్ వచ్చేది కాదు. మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు తన సీనియర్స్ అనిరుద్ సింగ్లా, రిషబ్ శేఖర్లు ‘పెప్పర్ కంటెంట్’ పేరుతో కంటెంట్ క్రియేషన్ ప్లాట్‌ఫామ్ స్టార్ట్ చేశారు. కిషన్‌ను కూడా తమతో కలుపుకున్నారు. మొదటిసారిగా ఆటోమోటివ్ పార్ట్స్ డీలర్ నుంచి ‘కూల్ కంటెంట్’ ఆఫర్ వచ్చింది. రాసే వారి కోసం చూశారు. పదానికి పదిహేను పైసలు అంటే ఎవరు మాత్రం వస్తారు! దీంతో తప్పనిసరి పరిస్థితులలో తామే కంటెంట్ పనిలోకి దిగారు. పదిరోజుల్లో 300 పీస్‌లు రాశారు. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం ‘పెప్పర్ కంటెంట్’ 2,500 మంది కస్టమర్లతో, 1.2 లక్షల మంది కంటెంట్ క్రియేటర్స్‌తో పనిచేసింది. మన దేశంలో లార్జెస్ట్ ఫ్రీలాన్స్ క్రియేటర్స్ ప్లాట్‌ఫామ్‌గా ఎదిగింది. బిజినెస్ సెన్స్, రెవెన్యూ మేనేజ్మెంట్లో తనదైన ప్రత్యేకతను సృష్టించుకున్న కిషన్‌ను తన ‘సక్సెస్ మంత్రా’ గురించి అడిగితే– ‘నిరంతర సాధన’ అంటాడు. వారణాసిలో పుట్టి.. ఆఫ్రికాలో పెరిగి వారణాసిలో పుట్టిన రితిక పాండే ముంబై రావడానికి ముందు ఆఫ్రికాలోని వివిధ ప్రాంతాలలో పెరిగింది. శ్రిష్టి మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్, డిజైన్ అండ్ టెక్నాలజీలో చదువుకుంది. వేల్స్ (యూకే)లోని ఒక సిటీలో కొంతకాలం పురాణాలు, సైన్స్–ఫిక్షన్ ఆధారంగా కళాసాధన ప్రారంభించింది. అక్కడి నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన తరువాత హిమాచల్‌ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాలకు ప్రయాణించింది. ప్రకృతి ప్రపంచంతో స్నేహం చేసింది. తనలో సృజనాత్మకమైన కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించుకుంది. థీమ్ ఏమిటంటే ‘విశ్వవిద్యాలయాలు, గొప్ప పుస్తకాల నుంచి మాత్రమే కాదు ప్రకృతి ప్రపంచం నుంచి కూడా ఎంతో నేర్చుకోవచ్చు. అందుకే ఎన్నో మారుమూల ప్రాంతాలకు వెళ్లాను. ఇది నిరంతరమైన ప్రయాణం. నిరంతర సాధన. ఆర్టిస్ట్‌లు నేర్చుకోవడానికి ప్రకృతిలోనే ఎన్నో పాఠాలు ఉన్నాయి’ అంటుంది రితిక. రితిక వర్ణచిత్రాలలో మనుషులు కనిపిస్తారు. మొక్కలు, జంతువులు కనిపిస్తాయి. స్థూలంగా చెప్పాలంటే హ్యూమన్, నాన్–హ్యూమన్‌కు సంబంధించి రిలేషన్ అనే థీమ్ కనిపిస్తుంది. ‘గ్రోస్వెనర్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన రితిక ఆర్ట్‌వర్క్ సోలో షోకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఎంతోమంది ప్రైవేట్ ఆర్ట్ కలెక్టర్స్ ఆసక్తి ప్రదర్శించారు’ అంటున్నారు లండన్‌లోని గ్రోస్వెనర్ గ్యాలరీ డైరెక్టర్ చార్లెస్ మూర్. చదవండి: తీరిన కోరిక: ప్రతి పైసా కూడగట్టి విమానం ఎక్కారు -
ఎంపీ సంతోష్‌పై ‘ఇండియా ఫోర్బ్స్’ కథనం
సాక్షి, హైదరాబాద్: తాను మొక్కలు నాటడంతోపాటు ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ద్వారా లక్షలాది మందిని హరిత ఉద్యమంలో భాగస్వాములను చేసిన రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌పై ‘ఇండియా ఫోర్బ్స్’తాజా సంచికలో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. రాష్ట్రంలో అమలవుతున్న హరితహారం కార్యక్రమం స్ఫూర్తితో ‘పచ్చదనంతోనే పరిపూర్ణత’నినాదంతో 2018 జూలై 17న సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను ప్రారంభించారు. రాజకీయ నాయకులు, సినీ నటులు, క్రీడా ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులతోపాటు సామాన్యులను కూడా మొక్కలు నాటడంలో భాగస్వాములను చేశారు. మొక్కల ఔషధ గుణాలను తెలుపుతూ వృక్షవేదం అనే పుస్తకాన్ని ప్రచురించడంతోపాటు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా 2021 ఫిబ్రవరి 17న ‘కోటి వృక్షార్చన’పేరిట ఒకే రోజు కోటి మొక్కలు నాటారు. ఈ నేపథ్యంలో సంతోష్ కృషిపై ఇండియా ఫోర్బ్స్ ప్రత్యేక కథనం ప్రచురించింది. -
'తెలుగు టెక్ ట్యూట్స్' సయ్యద్ హఫీజ్ నెల సంపాదన ఎంతో తెలుసా!
ప్రముఖ తెలుగు టెక్ కంటెంట్ క్రియేటర్ సయ్యద్ హఫీజ్‌కు అరుదైన గుర్తింపు లభించింది. ప్రముఖ బిజినెస్ పత్రిక ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసిన ‘టాప్ 100 డిజిటల్ స్టార్స్’ జాబితాలో చోటు దక్కింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని యైంటిక్లైన్ కాలనీకి చెందిన సయ్యద్ హఫీజ్ తెలుగు ప్రజలకు సుపరిచితుడే. ఉన్నత విద్యను చదవకపోయినా టెక్నాలజీపై తనకున్న మక్కువతో 2011 నుంచి హఫీజ్ 'తెలుగు టెక్‌ట్యూట్స్' పేరుతో వీడియో కంటెంట్‌ను అందిస్తున్నాడు. ముఖ్యంగా అటు సోషల్ మీడియాను.. ఇటు టెక్నాలజీని ఉపయోగించి డబ్బులు ఎలా సంపాదించాలి. మితిమీరిన టెక్నాలజీ వినియోగంతో రోజు రోజుకి పెరిగిపోతున్న ప్రమాదాల గురించి యూజర్లకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో పాటు మార్కెట్లో విడుదలైన లేటెస్ట్ గాడ్జెట్స్, స్మార్ట్ ఫోన్ రివ్వ్యూ వీడియోలు చేస్తున్నారు. ఆ వీడియోలు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని ఆకట్టుకోవడాన్ని ఫోర్బ్స్ ఇండియా గుర్తించింది. 8.89 క్రియేట్ స్కోర్‌తో టాప్ 100 డిజిటల్ స్టార్ట్స్‌లో చోటు కల్పిచ్చింది. సయ్యద్ హఫీజ్ ఆదాయం ఎంతంటే టెక్ కంటెంట్‌తో యూజర్లకు ఆకట్టుకుంటున్న సయ్యద్ హఫీజ్ యూట్యూబ్ ఛానల్‌కు ప్రస్తుతం 16లక్షల మంది సబ్ స్క్రైబర్లతో నెలకు రూ.2 లక్షల ఆదాయం అర్జిస్తున్నారు. ర్యాంకులు ఎలా ఇచ్చింది ఫోర్బ్స్ ఇండియా, ఐఎన్సీఏ, గ్రూప్ ఎం సంస్థలు సంయుక్తంగా డిజటల్ స్టార్ట్స్ ఎంపిక చేసింది. దేశ వ్యాప్తంగా కామెడీ, బ్యూటీ, ఫ్యాషన్, బిజినెస్, ఫిట్నెస్, ఫుడ్,టెక్, ట్రావెల్, సోషల్ వర్క్ ఇలా తొమ్మిది రకాల కంటెంట్‌తో యూజర్లను ఆకట్టుకుంటున్న 100కి ర్యాంకులు విధించింది. ఆ 100మందిని ఎలా సెలక్ట్ చేసిందంటే టాప్ 100 డిజిటల్ స్టార్స్‌లో స్థానం సంపాదించిన కంటెంంట్ క్రియేటర్లు నెటిజన్లు ఆకట్టుకోవడంతో పాటు క్రియేట్ చేసే కంటెంట్ ఎంతమందికి రీచ్ అవుతుంది. ఎంత మంది ఆ కంటెంట్‌తో ఎంగేజ్ అవుతున్నారు. ఆ కంటెంట్ జెన్యూన్‌గా ఉందా? లేదా? ఇలా అన్నీ రకాలు పరిశీలించిన తర్వాతే ఈ జాబితాను విడుదల చేసినట్లు ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. ఈ లిస్ట్‌లో సయ్యద్ హఫీజ్ 32వ స్థానం దక్కడం గమనార్హం. చదవండి: ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో ఇండో-అమెరికన్ మహిళలు! -
ఎవరి పేరు చెబితే... పొట్టలు చెక్కలవుతాయో.... వాళ్లే వీళ్లు!
నవ్వడానికి... బడా బ్యాంకు బ్యాలెన్స్ అక్కర్లేదు. ఆధార్ కార్డ్ అంతకంటే అక్కర్లేదు. ఫ్రీగా నవ్వండి టెన్షన్ల నుంచి ఫ్రీ అవ్వండి’ అంటున్నారు ఈ రాజులు. నవ్వులరాజ్యం రారాజులు.. వార్తల నుంచి వంటల వీడియోల వరకు మనం రోజూ సోషల్‌మీడియా ప్లాట్ఫామ్లో గడుపుతుంటాం. ‘స్టాటిస్టా’ లెక్కల ప్రకారం భారతీయులు రోజుకు సుమారు 2 గంటల 36 నిమిషాల సమయాన్ని సోషల్‌మీడియా కోసం వెచ్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, కంటెంట్ క్రియేటర్స్‌కు ప్రాధాన్యత పెరిగింది. ‘కంటెంట్ క్రియేటర్’గా మారడం అనేది ట్రెండీయెస్ట్ కెరీర్‌గా మారింది. అనుకున్నంత మాత్రాన ‘కంటెంట్ క్రియేటర్’ అయిపోతారా? అనే ప్రశ్నకు ‘అదేం కాదు’ అని రెండు ముక్కల్లో జవాబు చెప్పవచ్చు. కంటెంట్ క్రియేటర్స్‌గా రాణించడానికి తారకమంత్రాలు...కష్టపడేతత్వం, సృజనాత్మకత, స్థిరత్వం. ఫోర్బ్స్ ఇండియా, ఐన్సిఏ (గ్రూప్ఎం–సెల్ఫ్ ఇన్ఫ్లూయెన్సర్ అండ్ కంటెంట్ మార్కెటింగ్ సొల్యూషన్స్) తాజాగా కామెడీ, బ్యూటీ, ఫ్యాషన్, బిజినెస్ అండ్ ఫైనాన్స్, ఫిట్నెస్, ఫుడ్, టెక్, ట్రావెల్, సోషల్‌వర్క్...ఇలా తొమ్మిది విభాగాల్లో నుంచి ‘టాప్ 100 డిజిటల్ స్టార్స్’ జాబితాను రూపొందించింది. ఈ తొమ్మిది విభాగాల్లో కామెడీ అగ్రస్థానంలో ఉంది. కామెడీ విభాగంలో స్టార్స్‌గా మెరుస్తున్న కొందరు యువకులు... ఇరవైనాలుగు సంవత్సరాల నిర్మల్ పిళ్లై కామెడీ కెరీర్‌ను సీరియస్ బిజినెస్‌గా చూస్తాడు. చెన్నైకి చెందిన ఈ మలయాళీ కుర్రాడు కాలేజీ రోజుల్లో కలం పట్టుకున్నాడు. కామెడీ ప్లేలు రాశాడు. అయితే అవి కాలేజీ ఆడిటోరియంకే పరిమితం. కరోనా కాలంలో, లాక్డౌన్ రోజుల్లో అతడి కామెడీ స్కిట్లకు సోషల్ మీడియా వేదిక అయింది. ఫస్ట్ వీడియోనే వైరల్ అయింది. ‘ఎవరీ పిళ్లై?’ అనే ఆసక్తిని పెంచింది. ప్రసిద్ధ ‘హ్యారీపోటర్’ను హాస్యరీతిలో అనుకరిస్తూ తాను సృష్టించిన కామెడీకి ఎంతో పేరు వచ్చింది. ప్రయాణంలో ఉన్నప్పుడు చుట్టు జరిగే సంభాషణలను వినడం, హావభావాలను గమనించడం పిళ్లై అలవాటు. వాటిలో నుంచే కామెడినీ సృష్టించడానికి అవసరమైన అంశాలను ఎంచుకుంటాడు. భోపాల్‌లో ఏప్రిల్ 1 సాయంత్రం.. ‘ఏప్రిల్‌ఫూల్ డే’ సందర్భంగా కామెడీ షో ఏర్పాటు చేశారు. ఇలాంటి షో ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. దిల్లీ నుంచి ఎవరో కుర్రాడు వస్తున్నాడట...అనుకున్నారు జనాలు. దిల్లీ కుర్రాడు వచ్చేశాడు. ఆ ఉక్కపోతల ఎండాకాలపు సాయంత్రం ఊహించని భారీవర్షం మొదలైంది. అది మామూలు వర్షం కాదు. నవ్వుల వర్షం! ‘తోడా సాప్ బోలో’ షోతో దేశ, విదేశాల్లో స్టాండ్–అప్ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు అభిషేక్. అభిషేక్‌ను చూసీ చూడగానే... ‘ఈ కుర్రాడా! కమెడియన్ పోలికలు బొత్తిగా లేవు. ఏం నవ్విస్తాడో ఏమో’ అనుకుంటారట ప్రేక్షకులు. ఎప్పుడైతే అతడు మైక్ అందుకుంటాడో వారు మైమరిచి నవ్వుతారు. పాత నవ్వులను గుర్తు తెచ్చుకొని మళ్లీ నవ్వుతారు. ‘అబ్బ! ఏం నవ్వించాడ్రా కుర్రాడు’ అని అభిషేక్‌కు మౌఖిక సర్టిఫికెట్ ఇస్తారు. గుర్‌గ్రామ్‌కు చెందిన విష్ణు కౌశల్ కామెడీ కంటెంట్ క్రియేటర్. నిత్యజీవిత వ్యవహారాలు, సంఘటనల్లో నుంచి కంటెంట్‌ను తీసుకొని కామిక్ వీడియోలను రూపొందిస్తుంటాడు. ఆ వీడియోల్లో మనల్ని మనం చూసుకోవచ్చు. ‘అరే! నాకు కూడా అచ్చం ఇలా జరిగిందే’ అనుకోవచ్చు. యూట్యూబ్ కామిక్ వీడియోల నుంచి మొదలైన విష్ణు ప్రస్థానం ఇప్పుడు వోటీటీ కామెడీ సిరీస్, అడ్వర్టైజ్మెంట్ల వరకు వచ్చింది. ‘హాబీగా మొదలు పెట్టాను. ఇప్పుడు నవ్వించడమే నా వృత్తి అయింది’ నవ్వుతూ అంటున్నాడు విష్ణు కౌశల్. ‘ఈయన పరమ సీరియస్ మనిషి. నవ్వించండి చూద్దాం’ అని థానే (మహారాష్ట్ర)కు చెందిన ధృవ్ షా, శ్యామ్ శర్మలతో ఎప్పుడూ పందెం కాయవద్దు. ఈ హాస్యద్వయం గాలి తగిలితే ఆ సీరియన్ మనిషి నవ్వడమే కాదు, నవ్వు......తూనే ఉంటాడు! ఫోర్బ్స్ ‘టాప్ 100 డిజిటల్ స్టార్స్’ జాబితాలో చోటుచేసుకున్న కామెడిస్టార్స్లో వీరు కొందరు మాత్రమే. మరొక సందర్భంలో మరి కొందరు స్టార్స్ గురించి తెలుసుకుందాం. చదవండి: ఆ భార్యాభర్తలు దేశం మొత్తం నడిచేశారు -
India: అత్యధిక బిలియనీర్లు ఏ రంగం నుంచి ఉన్నారో తెలుసా?
దేశంలో లేదా ప్రపంచంలో సంపన్నుల లెక్క ఎప్పుడూ ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేస్తూ ఉంటుంది. అయితే.. మన దేశంలో ఏ రంగం నుంచి ఎక్కువ మంది బిలియనీర్లు వస్తున్నారన్న విషయం మీకు తెలుసా? అందుకే ఈసారి కొంచెం కొత్తగా.. ఈ ఏడాది అత్యధిక సంపన్నులు ఉన్న టాప్–10 వ్యాపార రంగాల గురించి తెలుసుకుందాం.. అది కూడా ఫోర్బ్స్ జాబితా ప్రకారమే.. వీటిని చూశాక.. హెల్త్ ఈజ్ వెల్త్‌కి.. మరో అర్థమూ మనకు దొరుకుతుందేమో.. ఎందుకంటే.. అత్యధిక బిలియనీర్లు ఆరోగ్య రంగం నుంచే ఉన్నారు మరి.. 1. వైద్య రంగం బిలియనీర్ల సంఖ్య: 29 అత్యంత ధనికుడు:సైరస్ పూనావాలా కంపెనీ: సైరస్ పూనావాలా గ్రూప్ వ్యవస్థాపకుడు, సీఎండీ. కోవిడ్ టీకాలు తయారు చేసిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ గ్రూప్ కంపెనీల్లో ఒకటి. ఆస్తుల నికర విలువ: సుమారు రూ.1.61 లక్షల కోట్లు 2. తయారీ రంగం బిలియనీర్ల సంఖ్య: 29 అత్యంత ధనికుడు: అశ్వన్ దనీ, కుటుంబం కంపెనీ: ఏసియన్ పెయింట్స్ లిమిటెడ్, నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆస్తుల నికర విలువ: సుమారు రూ. 58 వేల కోట్లు 3. ఫ్యాషన్ అండ్ రిటైల్ బిలియనీర్ల సంఖ్య: 16 అత్యంత ధనికుడు: రాధాకిషన్ దమానీ, కంపెనీ: డీమార్ట్ వ్యవస్థాపకుడు ఆస్తుల నికర విలువ: సుమారు రూ. 1.43 లక్షల కోట్లు 4. సాంకేతిక రంగం బిలియనీర్ల సంఖ్య: 13 అత్యంత ధనికుడు: శివ్ నాడర్ కంపెనీ: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, గౌరవ చైర్మన్ ఆస్తుల నికర విలువ: సుమారు రూ. 1.78 లక్షల కోట్లు 5. ఆర్థిక, బ్యాంకింగ్ బిలియనీర్ల సంఖ్య: 11 అత్యంత ధనికుడు: ఉదయ్ కోటక్, కంపెనీ: కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు, ఎండీ–సీఈవో ఆస్తుల నికర విలువ: సుమారు రూ. 1.08 లక్షల కోట్లు 6. ఆహారం– పానీయాలు బిలియనీర్ల సంఖ్య: 10 అత్యంత ధనికుడు: రవి జైపురియా కంపెనీ: ఆర్జే కార్ప్ లిమిటెడ్ చైర్మన్. పెప్సీకి సీసాలు తయారు చేసే సంస్థ. కేఎఫ్‌సీ, పిజ్జా హట్, కోస్టా కాఫీ వంటి సంస్థలకు ఫ్రాంచైజీ) ఆస్తుల నికర విలువ: సుమారు రూ. 52 వేల కోట్లు 7. వాహన తయారీ రంగం బిలియనీర్ల సంఖ్య: 9 అత్యంత ధనికులు: బజాజ్ సోదరులు (నీరజ్, మధూర్, శేఖర్), కంపెనీ: బజాజ్ గ్రూప్ ఆస్తుల నికర విలువ: సుమారు రూ. 54 వేల కోట్లు 8. స్థిరాస్తి రంగం బిలియనీర్ల సంఖ్య: 9 అత్యంత ధనికుడు: కుషల్పాల్ సింగ్ ఆస్తుల నికర విలువ: సుమారు రూ. 66 వేల కోట్లు 9. నిర్మాణ, ఇంజనీరింగ్ రంగం బిలియనీర్ల సంఖ్య: 5 అత్యంత ధనికుడు: రవి పిళ్లై కంపెనీ: ఆర్పీ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ ఆస్తుల నికర విలువ: సుమారు రూ.20 వేల కోట్లు 10. సేవా రంగం బిలియనీర్ల సంఖ్య: 4 అత్యంత ధనికులు: కపిల్, రాహుల్ భాటియా (తండ్రీకొడుకులు) కంపెనీ: ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు కపిల్ భాటియా, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ఎండీ రాహుల్ భాటియా. ఇండిగో సంస్థ సహవ్యవస్థాపకుడు ఆస్తుల నికర విలువ: సుమారు రూ. 35 వేల కోట్లు బిజినెస్ టైకూన్లు దేశంలో వివిధ రంగాలకు తమ వ్యాపారాలను విస్తరించిన దిగ్గజ వ్యాపారవేత్తల సంఖ్య 17కు చేరుకుంది. సుమారు రూ. 9.1 లక్షల కోట్ల సంపదతో గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. సుమారు రూ. 7 లక్షల కోట్లు సంపదతో ముకేశ్ అంబానీ రెండో స్థానంలో ఉండగా సుమారు రూ. 1.04 లక్షల కోట్లుతో కుమార్ మంగళం బిర్లా ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు. -
పురస్కారం: అమ్మా ఎలా ఉన్నారు!
కులదీప్ దంతెవాడియాకు ఆ జ్ఞాపకం ఇంకా తాజాగానే ఉంది. ఆయన బెంగళూరులోని ఒక స్వచ్ఛందసంస్థ నిర్వాహకుడు. ఆరోజు ఒక డోనర్‌తో ఆయన సమావేశం ఏర్పాటయింది. ముందు అనుకున్నదాని ప్రకారం 45 నిమిషాల సమావేశం అది. కానీ ఈ సమావేశం పూర్తికావడానికి రెండు గంటల సమయం పట్టింది. దీనికి కారణం ఆ డోనర్. సంస్థ పని తీరు గురించి ఆమె ఎన్నో విషయాలు అడిగారు. కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఆమెలో ఎంతో కనిపించింది. వెళుతున్నప్పుడు... ‘మీరు బాగా అలసిపోయినట్లు కనిపిస్తున్నారు. రాత్రి నిద్ర లేదా?’ అని దంతెవాడియాను అడిగి తెలుసుకున్నారు. ఎంతోమంది తో, ఎన్నో సమావేశాల్లో పాల్గొన్న తనకు ఇలాంటి ఆత్మీయ ప్రశ్న ఎదురు కావడం తొలిసారి! ఆ డోనర్ పేరు రోహిణి నిలేకని. దంతెవాడియా తన స్వచ్ఛంద సంస్థ ద్వారా చేపట్టిన వివిధ రకాల కార్యక్రమాలకు మూడు సంవత్సరాల కాలంలో అయిదుకోట్ల ఆర్థిక సహాయాన్ని అందించారు రోహిణి. ‘రోహిణి నిలేకని ఎవరు?’ అనే ప్రశ్నకు జవాబుగా ఆమె భర్త నందన్ నిలేకని (ఇన్ఫోసిస్ సహ–వ్యవస్థాపకుడు) పేరు వినిపించవచ్చు. అంతకంటే ఎక్కువగా ‘ఆమె మంచి రచయిత్రి’ అనే మాట ఎక్కువగా వినిపించవచ్చు. ముంబైలోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రోహిణి ఒక పత్రికలో రిపోర్టర్‌గా పనిచేశారు. ‘స్టిల్‌బార్న్’ నవల ద్వారా ఆమె సృజనాత్మక ప్రపంచంలోకి వచ్చారు. ఈ నవలను పెంగ్విన్ ప్రచురించింది. ‘అన్ కామన్‌గ్రౌండ్’ పేరుతో పాత్రికేయురాలిగా తన అనుభవాలకు అక్షర రూపం ఇచ్చారు. ‘ఆర్ఘ్యం’ ఫౌండేషన్ ద్వారా సామాజికసేవా రంగంలోకి ప్రవేశించారు. ‘యాదృచ్ఛికంగా ఈ రంగంలోకి వచ్చాను’ అని ఆమె చెబుతున్నప్పటికీ, సామాజిక విషయాలపై ఆమె చూపే ఆసక్తి అపురూపం అనిపిస్తుంది! పట్టణం నుంచి మారుమూల పల్లె వరకు రోహిణి ఎన్నో ప్రయాణాలు చేస్తుంటారు. ఆ ప్రయాణంలో తనకు ఎదురైన అందరి క్షేమసమాచారం కనుక్కుంటారు. ‘ఎలా ఉన్నారు?’ అని పలకరించడానికి చుట్టరికం అక్కరలేదు కదా! ‘ప్రాజెక్ట్‌లపై కాదు ప్రజాసమూహాల సంక్షేమంపై రోహిణి పెట్టుబడి పెడతారు. అదే ఆమె బలం’ అంటుంటారు. అది లాభం ఆశించి పెట్టే పెట్టుబడి కాదు. వారి అభివృద్ధిని ఆశించి చేసే పెట్టుబడి. ఎప్పటికప్పుడూ క్షేత్రస్థాయిలో కొత్త కొత్త రంగాలను ఎంచుకోవడం ఆమె విధానం. ఈ సంవత్సరం కొత్తగా మెంటల్ హెల్త్, సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్...మొదలైన రంగాలను ఎంపిక చేసుకున్నారు. ‘పోయేటప్పుడు ఏం పట్టుకెళతాం!’ అనేది తత్వం. ‘బతికి ఉన్నప్పుడు ఏం చేశాం?’ అనేది వాస్తవం. ‘యాదృచ్ఛికంగానే సంపన్నురాలయ్యాను’ అంటున్న రోహిణి తన సంపాదనను సామాజిక సంక్షేమంపై అధికం గా కేటాయిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే రోహిణి నిలేకని తాజాగా ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డ్–2022 విజేత(గ్రాస్రూట్స్ ఫిలాంత్రపిస్ట్ విన్నర్) అయ్యారు. -
ప్రతి నెల 50 మిలియన్ల వ్యూయర్షిప్ వచ్చింది!
నిజం చెప్పాలంటే, శ్లోక్ శ్రీవాస్తవ ఇంతలా ఎప్పుడూ కృంగిపోలేదు. దిల్లీలోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన శ్రీవాస్తవకు ఐఐటీ,దిల్లీలో సీటు రాకపోవడం శరాఘాతంలా పరిణమించింది. తల్లిదండ్రులు ఏమీ అనకపోయినా, ధైర్యం చెప్పినా తనలో అంతులేని బాధ. అలా రెండు నెలలు...దుఃఖమయ సమయం. Forbes India 30 Under 30 in 2022: తనను తాను చీకటిగుహలో నుంచి వెలుగు వాకిట్లోకి తీసుకురావడానికి విజేతల ఆత్మకథలు చదవడం మొదలు పెట్టాడు. వాళ్లెవరూ పుట్టు విజేతలు కాదు. జీవితంలో ఎన్నో ఢక్కామొక్కీలు తిన్నవాళ్లు. విజేతలకు సంబంధించి రకరకాల పుస్తకాలు తిరగేస్తున్నప్పుడు... ‘నీ లక్ష్యం మీద నీకు స్పష్టత ఉంటే నీ దగ్గరకు విజయం...నడిచిరావడం కాదు పరుగెత్తుకు వస్తుంది’ అనే వాక్యం తనకు బాగా నచ్చింది. ఆ సమయంలో ఆలోచించాడు ‘అసలు నా లక్ష్యం ఏమిటీ?’ అని. ఆ విషయంపై తాను ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. అభిరుచి నుంచి లక్ష్యం పుడుతుంది...అంటారు. తన అభిరుచి విషయంలో మాత్రం స్పష్టత ఉంది. తనకు గ్యాడ్జెట్స్ అంటే ఇష్టం. యూట్యూబ్ వీడియోలు రూపొందించడం అంటే ఇష్టం. వీటిలో ఏముంది ప్రత్యేకత? ప్రత్యేకత ఆవిష్కరించడమే కదా విజేత పని! ∙∙ చెన్నైలోని ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో శ్లోక్కు అడ్మిషన్ దొరికింది. యూనివర్శిటీలో ఉన్న కాలంలో...ఒకవైపు చదువుపై శ్రద్ధ పెడుతూనే మరోవైపు డిజైన్, థియేటర్, కోర్స్ మేకింగ్ యూట్యూబ్ వీడియోలను చేయడం మొదలుపెట్టాడు. గ్యాడ్జెట్లను పరిచయం చేయడానికి ‘టెక్ బర్నర్’ పేరుతో యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. గ్యాడ్జెట్ల పరిచయం వ్యాపార ప్రకటనల్లా కాకుండా...ఎంటర్టైనింగ్, స్టోరీ టెల్లింగ్ పద్ధతుల్లో పరిచయం చేసేవాడు. తన గ్రాడ్యుయేషన్ పూర్తయింది. అప్పుడప్పుడే ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఉద్యోగం చేయకుండా పూర్తిస్థాయిలో సమయాన్ని చానల్‌కు కేటాయించాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇది వారి కుటుంబసభ్యులకు నచ్చలేదు. సర్దిచెప్పాడు. కెమెరా ముందు ఆకట్టుకునేలా ఎలా మాట్లాడాలి? నాణ్యమైన వీడియోలు ఎలా రూపొందించాలి....మొదలైన విషయాలపై మరింత శ్రద్ధ పెట్టాడు. చానల్ సూపర్‌డూపర్ హిట్ అయింది! ప్రతి నెల 50 మిలియన్ల వ్యూయర్షిప్ వచ్చింది. ఈ ఉత్సాహంలో రెండు వెబ్సైట్లు, బర్నర్ మీడియా బ్యానర్‌పై ఆన్లైన్ అప్లికేషన్లు లాంచ్ చేశాడు. ‘టెక్ బర్నర్’ అనేది అతడి పేరుకు ప్రత్యామ్నాయం అయింది. ఈ పేరుతోనే అతడిని పిలుస్తుంటారు. ‘ఉద్యోగం వద్దు అనుకున్నప్పుడు...రిస్క్ చేస్తున్నావు అని ఎంతోమంది హెచ్చరించారు. రిస్క్ అని వెనక్కి తగ్గితే ఏమీ చేయలేము అనే విషయం తెలుసు. దీనికి కారణం నేను చేస్తున్న పనిపై నాకు ఉన్న సంపూర్ణ నమ్మకం. బరిలో మంచి టాలెంట్ ఉన్న ఎంతోమంది యూట్యూబర్స్ ఉన్నారు. అయితే నాకు ఒక నమ్మకం... నాకంటూ ఎక్కడో ఒకచోట స్థానం ఉంటుందని. దానికోసం వెదికాను. విజయం సాధించాను’ అంటున్న శ్లోక్ శ్రీవాస్తవ ‘ఫోర్బ్స్’ ఇండియన్ ‘ఫోర్బ్స్ 30 అండర్ 30’ జాబితాలో చోటు సంపాదించాడు. -
రూ. 8లక్షల ఉద్యోగం కాదని చిత్తూరు కుర్రోడి సరికొత్త ఆలోచన.. ఫోర్బ్స్ జాబితాలో చోటు
డొనేట్‌కార్ట్. స్వచ్ఛంద సంస్థలకు, దాతలకు మధ్య వారధి. ఏ ప్రాంతానికి చెందిన స్వచ్ఛంద సంస్థ అయినా వెబ్సైట్లో వారి సేవలకు అవసరమైన వస్తు, సామగ్రి, పరిమాణాన్ని నమోదు చేసుకోవచ్చు. ఈ వివరాల ఆధారంగా దాతలు అందుకు అవసరమైన మొత్తాన్ని డొనేట్‌కార్ట్‌కు సమకూరుస్తారు. ఆ నగదుతో సంబంధిత స్వచ్ఛంద సంస్థ వెబ్సైట్లో నమోదు చేసిన అవసరాలను సమకూరుస్తుంది. వెబ్సైట్ వేదికగా పని చేస్తున్న ఈ సంస్థ సహ వ్యవస్థాపకుడు బి.అనిల్‌కుమార్‌రెడ్డి. 26 ఏళ్ల ఈ యువకుని స్వగ్రామం జిల్లాలోని బి.కొత్తకోట మండలంలోని అటవీ సరిహద్దు గ్రామం చలిమామిడి. ఫోర్బ్స్ జాబితాలో ఈ సంస్థ చోటు దక్కించుకోవడంతో ఈ యువకుడి సేవాగుణం వెలుగులోకి వచ్చింది. సాక్షి, చిత్తూరు: కష్టాలను కళ్లారా చూసి.. సావాసం చేసి.. పోరాడి నిలిస్తే ఆ నీడ ఎంతో మందికి సేదతీరుస్తుంది. ఓ నిరుపేద కుటుంబం.. అందునా వ్యవసాయమే ఆధారం.. చదువును పెట్టుబడిగా మలుచుకుని రాణించాడు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని అంచెలంచెలుగా ఎదిగి పది మందికి సహాయపడే స్థాయికి చేరుకున్నాడు. లక్ష్యం బలంగా ఉంటే ఎంతటి కష్టమైనా తలవంచుతుందని నిరూపించాడు ఓ మారుమూల అటవీ సరిహద్దు గ్రామ యువకుడు. ఇప్పుడు అతని పేరు ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకోవడంతో ఊరంతా గర్వపడుతోంది. బి.కొత్తకోట మండలంలోని అటవీ సరిహద్దు గ్రామం చలిమామిడికి చెందిన రైతు దంపతులు సుశీలమ్మ, గోవిందరెడ్డి దంపతులకు ఇద్దరు సంతానం. రెండో కుమారుడు బి.అనిల్‌కుమార్‌రెడ్డి బి.కొత్తకోటలో ప్రాథమిక విద్య, తిరుపతిలో 9, 10.. నెల్లూరులో ఇంటర్, నాగ్‌పూర్‌లో ఎన్ఐటీలో బీటెక్ పూర్తి చేశారు. ఆ తర్వాత గ్రోఫోర్స్ సంస్థలో ఏడాదికి రూ.8 లక్షల వేతనంతో ఉద్యోగం వచ్చినా చేరలేదు. సొంతంగా ఓ సంస్థను స్థాపించాలనే లక్ష్యంతో ఎన్ఐటీ నాగ్‌పూర్‌లో చదివిన తెలంగాణలోని కోదాడకు చెందిన సందీప్ శర్మతో కలిసి డొనేట్‌కార్ట్‌ను 2016 అక్టోబర్ 11 ప్రారంభించగా ఇందులో మహారాష్ట్రకు చెందిన సారంగ్ బోబాడే సహా వ్యవస్థాపకులుగా సంస్థను నడిపిస్తున్నారు. చదవండి: ఫోర్బ్స్ ఇండియా అండర్ 30 జాబితాలో ముగ్గురు తెలుగు కుర్రాళ్లకు చోటు! వినూత్న ఆలోచన హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న డొనేట్‌కార్ట్ సంస్థ ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 గ్రూపు ఎన్జీఓలు–సోషల్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ విభాగంలో స్థానం దక్కించుకుంది. 30 ఏళ్లలోపు వయసు కలిగిన వారు నిర్వహిస్తున్న 30 సంస్థలను ఫోర్బ్స్ ఇండియా ఎంపిక చేయగా అందులో డొనేట్‌కార్ట్ ఒకటి. సాధారణ రైతు కుటుంబానికి చెందిన అనిల్‌కుమార్‌రెడ్డి అందరిలా ఉద్యోగం చేసి జీవితంలో స్థిరపడితే చాలనుకోలేదు. తనవంతుగా సమాజానికి ఏదో ఒకటి చేయాలనుకుని బలంగా సంకల్పించాడు. ఆ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన ‘సేవల వారధి’తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. రూ.5వేల కోట్ల విరాళాలు లక్ష్యం 2016 ఆగస్టులో మా సంస్థను స్థాపించగా ఇప్పటి వరకు 10లక్షలకు పైగా దాతల నుంచి రూ.150 కోట్ల విరాళాలు సేకరించాం. భవిష్యత్తులో విరాళాలను రూ.5వేల కోట్లకు పెంచాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం. విరాళాలు అత్యధికంగా ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్‌ల నుంచే అందుతున్నాయి. – బి.అనిల్‌కుమార్‌రెడ్డి, ఫోర్బ్స్ సహ వ్యవస్థాపకుడు వెబ్సైట్ వేదికగా.. మొదట నాగ్‌పూర్‌లో వెబ్సైట్ వేదికగా ప్రారంభమైన డొనేట్‌కార్ట్ ఆ ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చింది. ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్ రెండుచోట్లా పనిచేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డొనేట్‌కార్ట్ రూ.90 కోట్ల టర్నోవర్ సాధించింది. స్వచ్ఛంద సంస్థలకు సమకూర్చాల్సిన వస్తు సామగ్రిని బల్క్‌గా కొనుగోలు చేయడం ద్వారా డబ్బు ఆదా అవుతుంది. ఆ మొత్తమే రూ.90కోట్లు. ఈ నిధుల నుంచే సంస్థలో పనిచేస్తున్న 75 మంది ఉద్యోగులకు వేతనాలు, ఖర్చులు వెచ్చిస్తున్నారు. ఉద్యోగులకు నెలసరి వేతనం రూ.25వేల నుంచి రూ.4లక్షల వరకు చెల్లిస్తుండటం విశేషం. -
ఫోర్బ్స్ ఇండియా అండర్ 30 జాబితాలో ముగ్గురు తెలుగు కుర్రాళ్లకు చోటు!
ఫోర్బ్స్ ఇండియా అండర్ 30 జాబితాలో ముగ్గురు తెలుగు కుర్రాళ్లు చోటు సంపాదించారు. ఈ విషయాన్ని టీ-హబ్ తన ట్విటర్ వేదికగా పోస్టు చేసింది. టీ-హబ్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ కేటీఆర్ ఆ ముగ్గురికి అభినందనలు తెలిపారు. టీ-హబ్ తన ట్విటర్ వేదికగా ఇలా పోస్టు చేసింది.. "ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 #ForbesIndia30U30 జాబితాలో చోటు సంపాదించిన అనిల్ కుమార్ రెడ్డి(26), సందీప్ శర్మ(26), సారంగ్ బోబాడే(26)లకు అభినందనలు. నేడు, సామాజిక కారణాలకు మేము ఎలా మద్దతు ఇస్తున్నామో పునర్నిర్వచించడం మా #Lab32 ఉద్దేశ్యం" అని పేర్కొంది. డొనేట్ కార్ట్ దాతలు చేస్తున్న సాయం.. భాదితులకు సక్రమంగా అందుతుందా అన్న అనుమానాలు తలెత్తకుండా హైదరాబాద్‌కు చెందిన అనిల్ కుమార్ రెడ్డి(26), సందీప్ శర్మ(26), సారంగ్ బోబాడే(26) డొనేట్ కార్ట్ పేరిట ఈ ఆన్లైన్ వేదికను ప్రారంభించారు. నాగ్‌పూర్ ఐఐటీలో చదివిన వీరు పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేశారు. ఆ సమయంలో పలువురు దాతల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అంతేగాకుండా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ముందుకు వచ్చే దాతలు.. వారిచ్చే సామగ్రిపై ఆరా తీశారు. స్వచ్ఛందంగా పని చేసేందుకు అనేక ఎన్జీవోలు ఉన్నాయని గుర్తించిన వారు ఓ ఆలోచన చేశారు. గచ్చిబౌలిలోని కార్యాలయం తెరిచి https://www.donatekart.com వెబ్‌సైట్‌ను రూపొందించారు. దేశవ్యాప్తంగా ఉన్న 1500 స్వచ్ఛంద సంస్థలను ఇందులో చేర్చి వాటికి వారథిగా మారారు. 👏👏👏 https://t.co/u53d8z1iib — KTR (@KTRTRS) February 7, 2022 ఇన్నోవేషన్ అవార్డు ఎంపిక ఎవరైనా దాతల సాయం కావాలనుకుంటే ఈ వెబ్సైట్లో నమోదు చేసుకొని వారికి కావాల్సిన అవసరాన్ని వివరించాలి. అప్పుడు వారి విజ్ఞప్తిని ఎన్జీవోలు, దాతలు పరిశీలించి నేరుగా వెళ్లి సాయం చేస్తారు. ఇలా నాలుగేండ్లలో దాదాపు రూ.70 కోట్ల క్రౌడ్ ఫండింగ్ సమకూర్చి నిస్సాహాయులు, పేదలు, నిరాశ్రయులకు లబ్ధి చేకూర్చారు. కేవలం కొవిడ్ పంజా విసిరిన కాలంలోనే రూ.55 కోట్ల క్రౌడ్ ఫండింగ్‌తో అనేక వర్గాలకు సాయం చేశారు. దీంతో డొనేట్ కార్ట్ వ్యవస్థాపకుల కృషిని గుర్తించిన నాస్కామ్ 2018లో ఇన్నోవేషన్ అవార్డుకు ఎంపిక చేయగా.. మంత్రి కేటీఆర్ వారికి అందజేశారు. ఇప్పటి వరకు పది లక్షల మంది దాతలు 1,000 ఎన్జీవోలకు రూ.150 కోట్లకు పైగా విరాళాలు అందించారు. (చదవండి: చదువు కోసం ఎన్ని కష్టాలో ? పేటీఎం విజయ్ శేఖర్ శర్మ!) -
Mallika Srinivasan: ట్రాక్టర్ మహారాణి
విజయానికి వయసు అడ్డు పడుతుందా? వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే అని చెబుతూ తమను తాము నెంబర్ వన్‌గా నిరూపించుకున్న మహిళలు ఉన్నారు. ‘మహిళలకు పరిమితులు ఉన్నాయి’ అంటూ ఎక్కడైనా అడ్డుగోడలు ఎదురొచ్చాయా? ఆ అడ్డుగోడలను బ్రేక్ చేసి, కొత్త మార్గం వేసి దూసుకుపోయి తమను తాము నిరూపించుకున్న మహిళలు ఉన్నారు. తమ శక్తియుక్తులతో భవిష్యత్‌ను ప్రభావితం చేసే ఎంతోమంది మహిళలు ఉన్నారు. ఫోర్బ్స్ ‘50 వోవర్ 50: ఆసియా 2022’లో మెరిసిన మహిళా మణులలో మన మల్లికా శ్రీనివాసన్ ఉన్నారు. మల్లికా శ్రీనివాసన్... అనే పేరుతో పాటు కొన్ని విశేషణాలు కూడా సమాంతరంగా ధ్వనిస్తాయి. అందులో ముఖ్యమైనవి... ‘ట్రాక్టర్ క్వీన్’ ‘మోస్ట్ పవర్ఫుల్ సీయివో’ ట్రాక్టర్ ఇండస్ట్రీని మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీగా చెబుతారు. అలాంటి ఇండస్ట్రీలో విజయధ్వజాన్ని ఎగరేఓఆరు. కంపెనీని ప్రపంచంలో మూడో స్థానంలో, దేశంలో రెండో స్థానంలో నిలిపారు. ‘ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది’ అంటారుగానీ అది అన్ని సమయాల్లో నిజం కాకపోవచ్చు. పెద్ద వ్యాపార కుటుంబానికి చెందిన మల్లికకు చిన్న వయసు నుంచే వ్యాపార విషయాలపై ఆసక్తి. తనకు సంగీతం అంటే కూడా చాలా ఇష్టం. ‘ఇది ఏ రాగం?’ అని కమనీయమైన రాగాల గురించి తెలుసుకోవడంలో ఎంత ఆసక్తో, జటిలమైన వ్యాపార సూత్రాల గురించి తెలుసుకోవడంపై కూడా అంతే ఆసక్తి ఉండేది. ‘యూనివర్శిటీ ఆఫ్ మద్రాస్’ నుంచి ‘ఎకనామెట్రిక్స్’లో గోల్డ్‌మెడల్ అందుకున్న మల్లిక ప్రతి విజయం వెనుక కొన్ని ‘గోల్డెన్ రూల్స్’ ఉంటాయని బలంగా నమ్ముతారు. ఆ సూత్రాలు పుస్తకాల్లో తక్కువగా కనిపించవచ్చు. సమాజం నుంచే ఎక్కువగా తీసుకోవాల్సి రావచ్చు. చదువుల్లో ఎప్పుడూ ముందుండే మల్లిక పుస్తకాల్లో నుంచి ఎంత నేర్చుకున్నారో, సమాజం నుంచి అంతకంటే ఎక్కువ నేర్చుకున్నారు. వాటిని ఆచరణలో పెట్టారు. ట్రాక్టర్స్ అండ్ ఫామ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ (టఫే–(చెన్నై) లో జనరల్ మేనేజర్‌గా మొదలయ్యారు మల్లిక. ఆ తరువాత చైర్పర్సన్ అయ్యారు. జనరల్ మేనేజర్ నుంచి చైర్పర్సన్ వరకు ఆమె ప్రస్థానంలో ప్రతికూల పరిస్థితులు ఎదురై ఉండవచ్చు. అయితే జటిలమైన సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు కనుక్కోవడంలో ఆమె ఎప్పుడూ చురుగ్గా ఉంటారు. ‘మీ లక్ష్యం ఏమిటి?’ అని అడిగితే ఆమె చెప్పే సమాధానం... ‘నాకో మంచి ట్రాక్టర్ కావాలి...అనుకునే ప్రతి రైతు మొదట మా ట్రాక్టర్ వైపే చూడాలి’ కేవలం వ్యాపార విషయాల గురించి మాత్రమే కాకుండా సమాజసేవపై కూడా దృష్టి పెడుతుంటారు మల్లిక. పేదలకు వైద్యం అందించే వైద్యసంస్థలు, విద్యాసంస్థలకు ఆర్థికసహాయాన్ని అందిస్తున్నారు. సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యతను నెరవేరుస్తున్నారు. -
Matilda Kullu: ‘ఫోర్బ్స్’ లిస్ట్‌లో ఆశా వర్కర్.. ఎందుకంటే..?
Who Is Matilda Kullu: శక్తిమంతమైన మహిళ అంటే కార్పొరేట్ సి.ఇ.ఓ... పెద్ద రాజకీయ నాయకురాలు.. గొప్ప కళాకారిణి... లేదా ఏ ఒలింపిక్స్ క్రీడాకారిణో అయి ఉండవచ్చు. కాని ఫోర్బ్స్ పత్రిక తాజా భారతీయ శక్తిమంతమైన మహిళల్లో ఒక ఆశా వర్కర్ చేరింది. అదీ వెనుకబడిన ఒడిస్సా రాష్ట్రం నుంచి. ఆమె పేరు మెటిల్డా కుల్లు. హేమాహేమీల మధ్య ఇలా ఆశావర్కర్కు చోటు దొరకడం ఇదే ప్రథమం. ఏమిటి ఆమె ఘనత? కోవిడ్ వాక్సినేషన్ కోసం ఆమె ఏమి చేసింది? సూదిమందుకు కులం ఉంటుందా? ఉంటుంది... కొన్నిచోట్ల... ఆ సూది వేసే చేతులు బహుశా షెడ్యూల్డ్ తెగవి అయితే. అందునా చిన్న ఉద్యోగంలో ఉంటే. ఆశా వర్కర్ అంటే నెలకు 4,500 రూపాయల జీతం. గడప గడపకు తిరిగే ఉద్యోగం. అంత చిన్న ఉద్యోగి, స్త్రీ, పైగా షెడ్యూల్డ్ తెగ... తరతరాలుగా వెనుగబడిన ఆలోచనలు ఉన్న ఊళ్లలో, అంటరానితనం పాటించడం వదులుకోని ఇళ్లల్లో ఎంత కష్టం. పైగా ఆ ఊళ్లో చాలామంది మూఢ విశ్వాసాలతో, జబ్బు చేస్తే బాణామతిని నమ్ముకునే అంధకారంలో ఉంటే వారిని ఆస్పత్రి వరకూ నడిపించడం ఎంత కష్టం. ఈ కష్టం అంతా పడింది మెటిల్డా కుల్లు. అందుకే ఫోర్బ్స్ పత్రిక ‘ఫోర్బ్స్ ఇండియా విమెన్ పవర్ 2021’ పట్టికలోని మొత్తం 20 మంది భారతీయ మహిళలలో కుల్లుకు 3వ స్థానం ఇచ్చింది. ఆమెకు ముందు బ్యాంకర్ అరుంధతి భట్టాచార్య ఉంది. ఆమె తర్వాత క్రీడాకారిణి అవని లేఖరా, నటి సాన్యా మల్హోత్రా, కాస్మోటిక్స్ దిగ్గజం వినీతా సింగ్ తదితరులు ఉన్నారు. వీరందరి మధ్య ఒక చిరు ఉద్యోగి చేరడం సామాన్య ఘనత కాదు. ఇలా ఒక ఆశా వర్కర్ కనిపించడం ఇదే ప్రథమం. ఆ మేరకు భారతదేశంలో ఉన్న ఆశా వర్కర్లందరికీ గౌరవం దక్కిందని భావించాలి. ఎవరు మెటిల్డా కుల్లు? 45 ఏళ్ల మెటిల్డా కుల్లు ఒడిసాలోని సుందర్ఘర్ జిల్లాలో గార్దభహల్ అనే పల్లెకు ఏకైక ఆశా వర్కర్. గార్దభహల్లోని 964 మంది గ్రామీణులకు ఆమె ఆరోగ్య కార్యకర్త. 15 ఏళ్ల క్రితం ఆమె ఈ ఉద్యోగంలో చేరింది. అయితే ఒడిసా పల్లెల్లో ఆశా వర్కర్‌గా పని చేయడం సులభం కాదు. ‘జ్వరం వస్తే ఆస్పత్రికి వెళ్లాలి అని నేను చెప్తే నన్ను చూసి గ్రామీణులు నవ్వే వారు. ఏదైనా గట్టి రోగం వస్తే బాణామతికి ఆశ్రయించడం వారికి అలవాటు. కాన్పులు ఇళ్లల్లోనే జరిగిపోవాలని కోరుకుంటారు. పైగా నేను షెడ్యూల్డ్ తెగకు చెందిన మహిళను కావడం వల్ల ఇళ్లల్లోకి రాకపోకలకు కొందరు అంగీకరించే వారు కాదు. నన్ను ఏమన్నా ఎంత అవమానించినా వారి ఆరోగ్యం నాకు ముఖ్యం. నేను వారికి చెప్పీ చెప్పీ మార్పు తేవడానికి ప్రయత్నించేదాన్ని’ అంటుంది మెటిల్డా కుల్లు. ఉదయం 5 గంటల నుంచి మెటిల్డా దినచర్య రోజూ ఉదయం ఐదు గంటల నుంచి మొదలవుతుంది. ఇల్లు చిమ్ముకుని, పశువులకు గడ్డి వేసి, భర్త.. ఇద్దరు పిల్లలకు వంట చేసి సైకిల్ మీద ఊళ్లోకి బయలుదేరుతుందామె. గర్భిణులను, బాలింతలను, పసికందుల ఆరోగ్యాన్ని ఆమె ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వారికి సూచనలు, సలహాలు మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈడేరిన అమ్మాయిలు ఎటువంటి శుభ్రత పాటించాలో చెప్పడం మరో ముఖ్యమైన పని. ఇక ఆ పల్లెల్లో చాలామందికి గర్భకుహర ఇన్ఫెక్షన్లు సహజం. దానికి తోడు లైంగిక వ్యాధుల బెడద కూడా. వీటన్నింటినీ ఆమె ఓపికగా చూస్తూ గ్రామీణులను ఆస్పత్రులకు చేర్చి వారికి నయమయ్యేలా చూసేది. కోవిడ్ టైమ్‌లో వారియర్ కోవిడ్ మొదటి వేవ్ కంటే రెండో వేవ్‌లో దేశంలో అన్ని చోట్లకు మల్లే ఒడిసాలో కూడా విజృంభించాయి. ఆ రాష్ట్రంలో ఉన్న దాదాపు 47 వేల మంది ఆశా వర్కర్ల మీద ఒత్తిడి పడ్డట్టే మెటిల్డా మీద కూడా పడింది. ‘కోవిడ్ సమయంలో నా దినచర్య ఇంకా కష్టమైంది. రోజుకు 40, 50 ఇళ్లు తిరుగుతూ కోవిడ్ సింప్టమ్స్ ఎవరికైనా ఉన్నాయా లేవా అని చూడటం నా పని. ఊళ్లో కోవిడ్ వ్యాపించకుండా నేను ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాను. ఆశా వర్కర్లకు పిపిఇ కిట్లు అందింది లేదు. అయినా సరే ఇళ్లల్లోకి వెళ్లి సింప్టమ్స్ ఉన్నవారికి బిళ్లలు ఇచ్చేదాన్ని. గ్రామీణులతో సమస్య ఏమిటంటే వారు టెస్ట్‌లకు రారు. హాస్పిటల్‌కు వెళ్లరు. కాని ఇన్నేళ్లుగా నేను సంపాదించుకున్న నమ్మకం వల్ల వారు తొందరగా స్పందించారు. వాక్సినేషన్‌కు అంగీకరించారు. అందరికీ దాదాపుగా వాక్సిన్ నేనే వేశాను. ఆ విధంగా ఊళ్లో కోవిడ్‌ను అదుపు చేయగలిగాం’ అంటుంది మెటిల్డా కుల్లు. అయితే ఇంత ప్రాణాలకు తెగించి పని చేసినా ఒక్కసారి ప్రభుత్వం అదనంగా వేసిన 2000 రూపాయల ఇంటెన్సివ్ తప్ప వేరే మేలు ఏమీ జరగలేదు. ఇప్పటికీ ఆమె పాత జీతానికే పని చేస్తోంది. ఆ కొద్దిపాటి డబ్బు కోసం అంత పని చేయడానికి ఎంత శక్తి కావాలి, ధైర్యం కావాలి, అంకితభావం కావాలి. అందుకే ఫోర్బ్స్ ఆమె శక్తివంతమైన మహిళ అంది. సమాజం కోసం పని చేసే శక్తిని అందరూ ప్రదర్శించరు. ప్రదర్శించిన వారు ఇలా ప్రశంసను పొందుతారు. ప్రశంసకు యోగ్యమైన జీవితం కదా అందరూ కొద్దో గొప్పో గడపాలి. -
14 ఏళ్లుగా ఆ జాబితాలో అగ్రస్థానంలో ముఖేష్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఫోర్బ్స్ ఇండియా జాబితా ప్రకారం 14వ సంవత్సరాల(2008) నుంచి భారతదేశంలో అత్యంత ధనవంతుడుగా కొనసాగుతున్నారు. గత ఏడాది కాలంలో ముకేష్ అంబానీ సంపద 4 బిలియన్ డాలర్లు పెరిగింది, 92.7 బిలియన్ డాలర్ల నికర విలువతో ముఖేష్ అంబానీ ఫోర్బ్స్ ఇండియా జాబితాలో తన అగ్రస్థానాన్ని మరోసారి నిలబెట్టుకున్నారు. 100 మంది ధనవంతులైన భారతీయుల జాబితాను ఫోర్బ్స్ నేడు(అక్టోబర్ 7) విడుదల చేసింది. ఈ 100 మంది ధనవంతులైన భారతీయుల మొత్తం సంపద ఏడాది కాలంలో 775 బిలియన్ డాలర్లు పెరిగింది. గౌతమ్ అదానీ ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నారు. 2020లో 25.2 బిలియన్ డాలర్ల నుంచి తన సంపద దాదాపు మూడు రెట్లు పెరిగింది. అతని కంపెనీల షేర్లు ఏడాది కాలంలో భారీగా పెరిగాయి. 2020లో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీల సంపద మధ్య అంతరం 63.5 బిలియన్ డాలర్లుగా ఉంటే.. అది ఇప్పుడు 17.9 బిలియన్ డాలర్లకు తగ్గింది. గౌతమ్ అదానీ సంపద 2021లో ఏకంగా 49.5 బిలియన్ డాలర్లు పెరిగింది. ఇక మూడో స్థానంలో హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ శివ్ నాడార్ 31 బిలియన్ డాలర్ల సంపదతో నిలిచారు. డి'మార్ట్ రిటైల్ చైన్ వ్యవస్థాపకుడు రాధాకృష్ణ దమాని ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నారు. అతని నికర విలువ 29.4 బిలియన్ డాలర్లు. 2020లో15.4 బిలియన్ డాలర్లుగా ఉన్న దమానీ సంపద ఏడాది కాలంలో దాదాపు రెట్టింపు అయ్యింది. (చదవండి: మెర్సిడెజ్ బెంజ్.. మేడిన్ ఇండియా.. ధర ఎంతంటే?) సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు సైరస్ పూనావాలా ఈ ఏడాది 5వ స్థానంలో ఉన్నారు. అతని మొత్తం నికర విలువ 11.5 బిలియన్ డాలర్ల నుంచి 2021లో 19 బిలియన్ డాలర్లకు పెరిగింది.ఇక ఈ జాబితాలో ఆరో స్థానంలో ఆర్సెలర్ మిట్టల్ కు చెందిన లక్ష్మీ మిట్టల్ 18.8 బిలియన్ డాలర్ల సంపదతో ఉన్నారు; 7వ స్థానంలో 18 బిలియన్ డాలర్ల సంపదతో సావిత్రి జిందాల్; 8వ స్థానంలో 16.5 బిలియన్ డాలర్ల నికర విలువతో ఉదయ్ కోటక్; 9వ స్థానంలో $16.4 బిలియన్ల నికర విలువతో షాపూర్జీ పల్లోంజీ & పల్లోంజీ మిస్త్రీ; 10వ స్థానంలో 15.8 బిలియన్ డాలర్ల నికర విలువతో కుమార్ మంగళం బిర్లా ఉన్నారు. గత ఏడాది కంటే 7.3 బిలియన్ డాలర్ల సంపద ఎక్కువ. (చదవండి: బుకింగ్‌లో మహీంద్రా ఎక్స్యువి 700 ఎస్యూవి సరికొత్త రికార్డు) ఈ జాబితాలో 6 కొత్త వారు అశోక్ బూబ్ (స్థానం - 93, ఆస్తులు - 2.3 బిలియన్ డాలర్లు) దీపక్ నైట్రైట్ దీపక్ మెహతా (స్థానం- 97, ఆస్తులు- 2.05 బిలియన్ డాలర్లు) ఆల్కైల్ అమైన్ కెమికల్స్ యోగేష్ కొఠారి (స్థానం - 100, ఆస్తులు - 1.94 బిలియన్ డాలర్లు) డాక్టర్ లాల్ పాత్లాబ్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అరవింద్ లాల్ (స్థానం- 87, ఆస్తులు- 2.55 బిలియన్ డాలర్లు) రాజకీయవేత్త మంగళ్ ప్రభాత్ లోధా (స్థానం- 42, ఆస్తులు- 4.5 బిలియన్ డాలర్లు) హాస్పిటల్ చైన్ అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ ప్రతాప్ రెడ్డి (స్థానం- 88, ఆస్తులు- 2.53 బిలియన్లు డాలర్లు) -
ఫోర్బ్స్ జాబితాలో ఇద్దరు హైదరాబాదీలు
హైదరాబాద్: "ఫోర్బ్స్ 30 అండర్ 30" ఆసియా జాబితాలో ఇద్దరు యువ హైదరాబాదీలు స్థానం సంపాదించారు. హైదరాబాద్ నగరానికి చెందిన మేకర్స్ హైవ్ ఇన్నోవేషన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రణవ్ వెంపతి, డీజీ-ప్రిక్స్ వ్యవస్థాపకుడు సమర్థ్ సింధీ ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అతని మేకర్స్ హైవ్ సంస్థ కృత్రిమ అవయవాలను తయారు చేస్తుంది. ఈ అంకుర సంస్థ ‘కల్ఆర్మ్’ అనే పేరుతో బయోనిక్ హ్యాండ్ తయారు చేసి, చాలా తక్కువ ధరకు అందిస్తోంది. ఈ కృత్రిమ చేత్తో టైపింగ్ సహా అన్ని రకాల పనులు చేయొచ్చు. డీజీ-ప్రిక్స్ ఆన్లైన్ ఫార్మసీ సేవల సంస్థ. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులను మందులను హోమ్ డెలివరీ చేస్తారు. వాట్సాప్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా తమ ప్రిస్క్రిప్షన్లను అప్లోడ్ చేసిన రోగులకు నెలవారీ మందులను డెలివరీ చేయడానికి హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ పనిచేస్తుంది. డెలివరీ ఉచితం, ఔషధ ధరలు స్థానిక ఫార్మసీల కంటే 15 శాతం వరకు చౌకగా ఉంటాయి. ఎందుకంటే డిజి-ప్రీక్స్ ఆర్డర్లు ఇవ్వడానికి పంపిణీదారులతో నేరుగా కలిసి పనిచేస్తుంది. ఈ సంస్థ రెండేళ్ల క్రితం ఖోస్లా వెంచర్స్, వై కాంబినేటర్, జస్టిన్ మతీన్ నుంచి 5.5 (దాదాపు రూ.40 కోట్లు) బిలియన్ డాలర్ల నిధులు సమీకరించింది. సమర్థ్ సింధీ బ్రౌన్ విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. భారతదేశానికి తిరిగి రాకముందు అమెరికాకు చెందిన హెల్త్‌కేర్ కంపెనీలో పనిచేశాడు. చదవండి: ఈ 8 యాప్స్ వెంటనే డిలిట్ చేయండి! -
10 నిముషాలు చార్జ్ చేస్తే.. 450 కి.మీ. ప్రయాణం!
బయో ఆగ్రానిక్, బయో డీగ్రేడబుల్ బ్యాటరీల తయారీ కోసం ‘నెక్సెస్ పవర్’ అనే కంపెనీ స్థాపించి మన దేశంలో ఎలక్ట్రానిక్ వెహికిల్(ఈవీ) మార్కెట్‌కు భవిష్యత్ ఆశాకిరణాలుగా నిలుస్తున్న ట్విన్ సిస్టర్స్ నిషిత బాలియర్ సింగ్ (23), నికిత బాలియర్ సింగ్ (23) పరిచయం... భువనేశ్వర్ (ఒడిశా)కు చెందిన ట్విన్ సిస్టర్స్ నిషిత, నికితలు ‘నలుగురిలాగే నా ఆలోచన కూడా’ అనుకోకుండా కొత్తగా ఆలోచించడం అలవాటు. ఆ అలవాటే వారిని తాజాగా ‘ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30’ యువప్రతిభావంతుల జాబితాలో చోటుదక్కేలా చేసింది. 2015లోనే ‘ఫెలిస్ లియో వెంచర్స్’ యాప్ అండ్ వెబ్ డెవలప్మెంట్ సర్వీస్‌ను ప్రారంభించి విజయకేతనం ఎగరేశారు. ఇరవై రెండేళ్ల వయసులో పర్యావరణానికి హాని కలిగించని ‘హీటింగ్’ ‘కూలింగ్’ విధానాన్ని అభివృద్ధి పరిచారు. పరిశ్రమలలో సంప్రదాయమైన బాయిలర్లు, ఏసీల స్థానంలో వీటిని ఉపయోగించడం ద్వారా పర్యావరణానికి నష్టం జరగకపోవడమే కాకుండా ఏటా 25 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందంటారు. అదేమిటోగానీ ఒక పుస్తకం మాత్రం ఎలక్ట్రానిక్ వెహికిల్(ఇవీ) మార్కెట్‌కు ఊతం ఇచ్చే ‘నెక్సెస్ పవర్’ పుట్టుకకు కారణం అయింది. ఆ రాత్రి... ఆమాట ఈమాట మాట్లాడుకుంటున్న క్రమంలో వారి దృష్టిలో ఒక పాత బయోకెమిస్ట్రీ పుస్తకం పడింది. దాన్ని పూర్తిగా తిరిగేసి చర్చించడం మొదలు పెట్టారు. ఆ చర్చ ఎలక్ట్రానిక్ వెహికిల్స్ వైపు వెళ్లింది. ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ స్థాపించాలనుకున్నారు. అయితే మార్కెట్ స్టడీలో వారికి తెలిసిన విషయం ఏమిటంటే పాశ్చాత్యదేశాలతో పోల్చితే మన దేశంలో ‘ఇవీ మార్కెట్’ వేగం చాలా తక్కువని. కారణాలు ఏమిటి? అనే విశ్లేషణలో వారికి ప్రధానంగా కనిపించిన కారణం: బ్యాటరీ. రెండు, మూడు గంటలు రీచార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటివి మరికొన్ని సమస్యలు ఉన్నాయి. ముందు బ్యాటరీ సమస్యకు పరిష్కారం వెదికితే ఇక్కడ ఎలక్ట్రానిక్ వెహికిల్ మార్కెట్ వేగం పెంచడం పెద్ద కష్టం కాదనే నిర్ణయానికి వచ్చారు. బ్యాటరీ టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణల గురించి ఆలోచించారు. ఈ క్రమంలోనే ప్రోటిన్ బేస్డ్ బ్యాటరీలు తయారుచేయడానికి 2019లో ‘నెక్సెస్ పవర్’ కంపెనీ స్థాపించారు. వ్యవసాయ వ్యర్థాలతో ఇక్కడ తయారయ్యే ప్రొటీన్ బేస్డ్ బ్యాటరీలను పది నిమిషాల వ్యవధిలోనే రీచార్జ్ చేయవచ్చు. 450 కి.మీ దూరం ప్రయాణించవచ్చు. మరో విషయం ఏమిటంటే తమ వ్యవసాయ వ్యర్థాలను అమ్ముకోవడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం చేతికి అందుతుంది. ఇద్దరితో మొదలైన ‘నెక్సెస్ పవర్’ ఇప్పుడు 11 మంది సభ్యుల కంపెనీగా మారింది. ఈ కంపెనీ రూపొందించే వేగవంతమైన చార్జింగ్, పర్యావరణ హితమైన బ్యాటరీలు వచ్చే సంవత్సరం వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. ‘ఎప్పుడూ ఒకేరకమైన విషయాల గురించి కాకుండా కొత్త విషయాల గురించి ఆలోచించడం ఇష్టం’ అని చెబుతున్న ఈ సోదరీమణులు ‘యంగ్ గ్లోబల్ అంబసిడర్’ ‘ఇనవెటివ్ ఎంటర్ప్రైజేస్ ఆఫ్ ది ఇయర్’ టైటిల్స్‌తో పాటు ఎన్నో అవార్డ్లు సొంతం చేసుకున్నారు. స్కూలు, కాలేజీ పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి, విజయం వైపు నడిపించడానికి వ్యక్తిత్వ వికాస తరగతులు కూడా నిర్వహిస్తుంటారు. సెంటర్ ఫర్ ఎనర్జీ ఫైనాన్స్ స్టడీ ప్రకారం మన దేశంలో ఎలక్ట్రానిక్స్ వెహికిల్స్ మార్కెట్‌కు ఉజ్వలభవిష్యత్ ఉంది. ‘నెక్సెస్ పవర్’ వినూత్న ఆవిష్కణలతో ఆ మార్కెట్ వేగం పెరుగుతుందనడంలో సందేహం లేదు. చదవండి: ఒక్కో డ్రెస్ ధర లక్షల్లో: నువ్వు కూడా మాట్లాడుతున్నావా? జీన్స్ వేసుకుని అలా వద్దు.. ఎందుకో తెలుసా? -
కోవిడ్-19 వెంటాడినా తరగని కుబేరుల సంపద
ముంబై : భారత్‌లో వందమందితో కూడిన అత్యంత సంపన్నల జాబితాలో రిలయన్స్ ఇండస్ర్టీస్ అధిపతి, కార్పొరేట్ దిగ్గజం ముఖేష్ అంబానీ మరోసారి అగ్రస్ధానంలో నిలిచారు. 8,800 కోట్ల డాలర్ల సంపదతో ముఖేష్ 2020 సంవత్సరానికి ఫోర్బ్స్ ఇండియా జాబితాలో నెంబర్ వన్ ర్యాంక్‌ను మళ్లీ నిలుపుకున్నారు. ఈ జాబితాలో ముఖేష్ అంబానీ గత 13 సంవత్సరాలుగా మొదటి ర్యాంక్‌లో కొనసాగడం గమనార్హం. ఇక అదానీ గ్రూపు అధినేత గౌతం అదానీ 2500 కోట్ల డాలర్ల సంపదతో ఫోర్భ్స్ ఇండియా జాబితాలో ముఖేష్ తర్వాతి స్ధానంలో నిలిచారు. ఈ ఏడాది ముఖేష్ అంబానీ సంపదకు తాజాగా 375 కోట్ల ఆస్తులు అదనంగా తోడయ్యాయని ఫోర్బ్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. కోవిడ్-19 నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది కుదేలైనా భారత్‌లో అత్యంత కుబేరులు తమ సంపదను కాపాడుకున్నారని ఫోర్భ్స్ వ్యాఖ్యానించింది. ముఖేష్ అంబానీ వరుసగా 13వ సారి భారత్‌లో అత్యంత సంపన్నుడిగా నిలిచారని, వ్యాక్సిన్ తయారీదారు సైరస్ పూనావాలా ఆరో ర్యాంక్‌ను సాధించి టాప్ 10లో చోటు సంపాదించారని నివేదిక వెల్లడించింది. కరోనా వైరస్ కట్టడికి కీలకమైన మందులు, వ్యాక్సిన్ల తయారీలో నిమగ్నమైన ఫార్మా దిగ్గజాల సంపద అనూహ్యంగా పెరిగింది. బయోకాన్ కిరణ్ మజుందార్ షా సంపద శాతాల ప్రాతిపదికన అత్యధికంగా ఎగిసిందని, కొద్దిమంది బిలియనీర్ల సంపద మాత్రం గత ఏడాదితో పోలిస్తే 2020లో తగ్గిందని ఈ నివేదిక పేర్కొంది. చదవండి : ముకేశ్ అంబానీ ఖాతాలో మరో రికార్డు -
కోహ్లికి ‘టాప్’ ర్యాంక్
ముంబై: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి కేవలం క్రికెట్లోనే కాదు ఇదివరకే సామాజిక మాధ్యమాల్లోనూ ఫాలోవర్ల పరంగా దూసుకెళ్లాడు. ఇప్పుడు ‘ఫోర్బ్స్ ఇండియా’ సెలబ్రిటీల జాబితాలోనూ ‘టాప్’ లేపాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న ఈ ‘రన్ మెషిన్’ తాజాగా భారత టాప్–100 సెలబ్రిటీల్లోనూ నంబర్‌వన్‌గా నిలిచాడు. మొత్తం రూ. 252.72 కోట్ల ఆర్జనతో అతనికి మొదటి స్థానం దక్కింది. అయితే బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్ రూ. 293.25 కోట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక్కడ ఫోర్బ్స్ జాబితా ర్యాంకుల్ని కేవలం ఆదాయంతోనే గణించరు. ఆ లెక్కన చూస్తే అక్షయ్ ‘టాప్’లేపేవాడు. కానీ ఫోర్బ్స్ లెక్కకు ఇతర కోణాలు ప్రాతిపదిక అవుతాయి. ఆదాయంతో పాటు, పేరు ప్రఖ్యాతులు, ప్రసార మాధ్యమాల్లోని క్రేజ్, సామాజిక సైట్లలో అనుసరిస్తున్న వారి సంఖ్య (ఫాలోవర్స్)లాంటి అంశాలను బట్టి ర్యాంకింగ్‌ను కేటాయిస్తారు. గతేడాది అక్టోబర్ 1 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఈ అంశాలను లెక్కలోకి తీసుకున్న ఫోర్బ్స్ మేగజైన్ తాజా సంపన్న సెలబ్రిటీల జాబితాలో కోహ్లికి అగ్రతాంబూలమిచి్చంది. టాప్–100లో క్రీడాకారుల సంఖ్య పెరిగింది. 21 మంది క్రీడాకారులకు చోటు దక్కింది. క్రికెటర్లు కాకుండా బ్యాడ్మింటన్ స్టార్స్ సింధు, సైనా, సునీల్ ఛెత్రి (ఫుట్‌బాల్), మేరీకోమ్ (బాక్సింగ్), బజరంగ్ (రెజ్లింగ్), అనిర్బన్ (గోల్ఫ్), బోపన్న (టెన్నిస్) కూడా ఈ జాబితాలో ఉన్నారు. -
ఫోర్బ్స్‘కలెక్టర్స్ ఎడిషన్’లో... ‘మేఘా’కు ప్రత్యేక స్థానం!
హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ ఇండియా మేగజీన్.. ‘కలెక్టర్స్ ఎడిషన్ 2019’లో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) చైర్మన్ పీపీ రెడ్డికి విశిష్ట గౌరవం లభించింది. ఈ ఎడిషన్‌లో ఆయనకు సంబంధించి ఒక ప్రత్యేక కథనాన్ని ఫోర్బ్స్ ఇండియా ప్రచురించింది. దేశంలోని అత్యంత సంపన్నులకు సంబంధించి ఇటీవల ఫోర్బ్స్ విడుదల చేసిన 2019 జాబితాలో పీపీ రెడ్డి 3.3 బిలియన్ డాలర్ల సంపదతో 39వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘మేఘా బిల్డర్’ పేరుతో ఫోర్బ్స్ ప్రత్యేక వ్యాసాన్ని ప్రచురించింది. పీపీ రెడ్డితో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణా రెడ్డి కలిసి ఉన్న ఫొటోతో ప్రచురించిన ఈ వ్యాసంలో, 1987లో పైపుల తయారీ సంస్థగా చిన్నగా ప్రారంభమయిన మేఘా ఇంజనీరింగ్, అటు తర్వాత సాగించిన అప్రతిహత పురోగమనాన్ని ప్రస్తావించింది. 14 బిలియన్ డాలర్ల భారీ మొత్తంతో దేశంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు– కాళేశ్వరంను సంస్థ విజయవంతంగా పూర్తిచేసిన విషయాన్ని ఇందులో ప్రస్తావించింది. అలాగే జోర్డాన్, కువైట్, టాంజానియా, జాంబియా వంటి పలు దేశాల్లోని పలు ప్రాజెక్టుల్లో సంస్థ క్రియాశీలంగా వ్యవహరిస్తున్న విషయాన్ని ఉటంకించింది. భారత్ అత్యుత్తమ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ కంపెనీల్లో ఒకటిగా ఎంఈఐఎల్ నిలుస్తోందని పేర్కొంది. రుణ రహిత కంపెనీగా ఎంఈఐఎల్ కొనసాగుతున్న విషయాన్ని ఫోర్బ్స్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. -
‘ఫోర్బ్స్ ఇండియా’లో మనోడు
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారత వ్యాపారవేత్తల వివరాలను తెలియజేసేందుకు ’ఫోర్బ్స్’ పత్రిక రూపొందించిన తాజా ప్రత్యేక సంచికలో నగరవాసికి చోటు లభించింది. నగరానికి చెందిన యానిమేషన్, వీఎఫ్ఎక్స్ సంస్థ ‘క్రియేటివ్ మెంటర్స్’ వ్యవస్థాపకుడు కొవ్వూరి సురేశ్‌రెడ్డికి జాబితాలో చోటు లభించడంపై ‘క్రియేటివ్’ సంస్థ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... చిన్న వయసులోనే యానిమేషన్ సంస్థని స్థాపించి, 13 ఏళ్ల వ్యవధిలోనే ’ఫోర్బ్స్’ జాబితాలో చేరిన తొలి తెలుగు వ్యాపారవేత్తగా కొవ్వూరి సురేశ్‌రెడ్డి ఈ ఘనత సాధించారన్నారు. ఈ నెలాఖరులో విశ్వవ్యాప్తంగా విడుదల కానున్న ఫోర్బ్స్ ఇండియా పత్రికలో డాక్టర్ పి.శ్యామరాజు, రతన్ టాటా, రాహుల్ బజాజ్, హెచ్‌సీఎల్ శివ నాడార్, యదుపాటి సింఘానియా, కుమార మంగళం బిర్లా, హావెల్స్ అనిల్‌రాయ్ గుప్తా, మహేంద్ర గ్రూప్స్ ఆనంద్ జి.మహేంద్ర... ఇలా 51 మంది అగ్రగామి వ్యాపారవేత్తల సరసన నగరానికి చెందిన యువ వ్యాపారవేత్త చోటు దక్కించుకోవడం గర్వకారణమన్నారు. 30 ఏళ్ల వయసులోనే అనూహ్య విజయాలు సాధిస్తున్న 30 మంది జాబితాను ఫోర్బ్స్ పత్రిక ఇటీవల ప్రకటించింది. అందులో మన తెలుగు నటుడు విజయ్ దేవరకొండకు స్థానం లభించగా... తాజా సంచికలో సురేశ్‌రెడ్డికి చోటు దక్కడం విశేషం. ‘హౌస్ ఆఫ్ కామన్స్’ అవార్డుకు అర్హత... ఆసియాలోనే తొలిసారిగా కేబుల్స్ లేకుండా మోషన్ కాప్చర్ యానిమేషన్ ప్రక్రియ ప్రవేశపెట్టడం, వేలాది మంది విద్యార్థులను యానిమేషన్ సంబంధిత రంగాల్లో తీర్చిదిద్దడం, ఇటీవల ప్రసాద్స్ ల్యాబ్స్‌తో కలసి సినీరంగంలో విభిన్న శాఖల్లో ప్రవేశించాలనుకునే ఔత్సాహికులకు శిక్షణనివ్వడం... ద్వారా క్రియేటివ్ మెంటర్స్ సంస్థ నగరంలో యువతకు కెరీర్ పరంగా విభిన్న సేవలు అందిస్తోంది. మే 30న లండన్‌లో బీబీసీ సౌజన్యంతో నిర్వహించనున్న ‘గ్లోబల్ బిజినెస్ కాన్క్లేవ్–2019’ కార్యక్రమంలో భాగంగా ‘హౌస్ ఆఫ్ కామన్స్’ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ సంచికలో చోటు సంపాదించిన 51 మందిని నామినేటెడ్ పర్సన్స్‌గా పరిగణించి, వారిలో 25 మందికి అవార్డులను ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో సురేశ్‌రెడ్డికి ఆ పురస్కారం కూడా దక్కితే అది మన నగరానికి మరింత గర్వకారణం అవుతుందని క్రియేటివ్ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ... ఇది తన జీవితంలో ఊహించని, మరిచిపోలేని పరిణామం అన్నారు. చిన్న వయసులోనే సినీ రంగంలోని అన్ని విభాగాలలో పనిచేసి జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందిన లెజెండరీ సినీ డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్ ఎల్వీ ప్రసాద్ తనకు స్ఫూర్తి అని చెప్పారు. -
ఫోర్బ్స్ ఇండియా జాబితాలో ‘అర్జున్‌రెడ్డి’
2019 సంవత్సరానికి వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన 30 ఏళ్ల లోపు వారి జాబితాను ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసింది. ‘ఫోర్బ్స్ ఇండియా థర్టీ అండర్ థర్టీ' పేరుతో ఆరవ జాబితాను సంస్థ విడుదల చేసింది. ఇందులో టాలీవుడ్ రైజింగ్ స్టార్ విజయ్ దేవరకొండ స్థానం సంపాదించుకున్నాడని తెలిపింది. ముఖ్యంగా 2017లో అర్జున్‌రెడ్డి ద్వారా సంచలనం సృష్టించారని ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. వయస్సు 25 అయినా 52 ఏళ్లు అయినా సక్సెస్‌లను అభినందించడంతోపాటు, తక్కువ వయస్సులోనే విజయాలను అందుకున్నవారి ప్రతిభ, ధైర్యాన్ని గుర్తించడమే తమ లక్ష్యమని ఫోర్బ్స్ ఇండియా వెల్లడించింది. విజయాలు, కెరీర్లో దూసుకెళ్లే తత్వం, తమ వ్యాపారాన్ని నిర్వహించే సత్తా, దీర్ఘకాలం ప్రతిభను కొనసాగించే సామర్థ్యం ఆధారంగా ఈ జాబితాను రూపొందించామనీ, దీనికి సంబంధించిన కథనాన్ని ఫిబ్రవరి 15, ఫోర్బ్స్ ఇండియా మ్యాగజీన్లో చూడొచ్చని తెలిపింది. 16 కేటగిరీల్లో 300 పేర్లను పరిశీలించిన అనంతరం ఈ జాబితాను రూపొంచింది. మీడియా, క్రీడలు, మార్కెటింగ్, పరిశ్రమ, ఎంటర్టైన్మెంట్, హాస్పిటాలిటీ, టెక్నాలజీ రంగాల్లోని వారిని ఎంపిక చేసింది. మహిళా క్రికెట్ సంచలనం స్మృతి మంధాన, ప్రముఖ అథ్లెట్ హిమాదాస్ ఈ జాబితాలో చోటు దక్కించుకోగా, వీరితోపాటు యూట్యూబ్ పర్సనాలిటీ ప్రజక్త కోలీ, సింగర్ మేఘన మిశ్రా, ఆయుష్ అగర్వాల్ లాంటివారి పేర్లున్నాయి. ఇంకా పైనాన్స్ సంస్థను నడుపుతున్న ఐఐటీయన్లు వసంత్ కాంత్, అనురాగ్ శ్రీవాస్తవ, రోహన్‌గుప్త, ఇంకా నింజా కార్ట్ ద్వారా రైతులకు నేరుగా తమ ఉత్పత్తులను విక్రయించుకునే అవకాశం కల్పిస్తున్న కార్తీశ్వరన్, శరత్ లోగనాథన్, అశుతోష్ విక్రం తదితరులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. -
‘భారత కుబేరుడు’.. టీ కొట్టు యజమాని
కొచ్చి : కలలను సాకారం చేసుకోవాలని అందరూ అనుకుంటారు. కానీ, ఆ దిశగా నిర్విరామంగా కృషి చేసి విజయం సాధించేది కొందరే. కేరళకు చెందిన విజయన్ దంపతులు ఈ కోవకు చెందినవారే. తమ చిన్ననాటి కలలను సాకారం చేసుకోవడానికి వీరు చేస్తున్న కృషిని మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్రా కొనియాడారు. ప్రపంచ పర్యటనే లక్ష్యంగా గత 55 ఏళ్లుగా టీ కొట్టు నిర్వహిస్తూ.. విదేశాలు చుట్టివచ్చిన ఈ 70 ఏళ్ల వృద్ధ దంపతులు నిజమైన ‘భారత కుబేరులు’ అంటూ కితాబిచ్చారు. ఈ ఆదర్శ దంపతుల విదేశీ యాత్రలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆనంద్ వారిపై ప్రశంసలు కురిపించారు. రోజూ రూ.300 పొదుపుతో.. కొచ్చిలో ఉన్న విజయన్ దంపతుల టీ స్టాల్ ఫేమస్. రోజూ 350 మందికి క్యాటరింగ్ చేస్తారు. తమ కలలను నెరవేర్చుకునే క్రమంలో వీరు రోజూ రూ.300 పొదుపు చేస్తారు. తక్కువ మొత్తంలో ఖర్చులు పెడుతూ విదేశాల్లో పర్యటిస్తారు. ఇప్పటికే సింగపూర్, అర్జెంటీనా, పెరు, స్విట్జర్లాండ్, బ్రెజిల్ లాంటి 23 దేశాలను చుట్టివచ్చిన విజయన్ దంపతులు మరిన్ని దేశాల్లో పర్యటించడానికి ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నారు. ‘దేశదేశాలు చుట్టి రావాలన్నది నా చిన్ననాటి కల. అందుకోసం సొమ్ము కావాలి. దానికోసమే నిలకడగా ఆదాయాన్నిచ్చే టీ వ్యాపారాన్ని ఎంచుకున్నాను’ అని చెప్పుకొచ్చారు విజయన్. 1963 లో ప్రారంభమైన విజయన్ టీ స్టాల్‌కు విదేశీ యాత్రికుల తాకిడీ ఎక్కువే. ఇతర దేశాలు తిరిగిన అనుభవాల్లోంచి ఏం నేర్చుకున్నారన్న ప్రశ్నకు ‘మన దృక్పథం, మైండ్, మన సంస్కృతిలో మార్పులు చోటుచేసుకుంటాయి’ అని బదులిచ్చాడు. జీవితంలో జీవించేందుకు డబ్బు ఒక్కటే కాదు.. గొప్ప సంకల్పం కూడా ఉండాలని చాటిచెప్తున్న ఈ వృద్ధ దంపతులు నిజంగా గ్రేట్ కదా.. ఏమంటారు..!! ఈసారి తప్పకుండా వెళ్తా.. సంపద విషయంలో ఈ దంపతులు ఫోర్బ్స్ లిస్టులో లేకపోవచ్చు. కానీ, నా ఉద్దేశంలో విజయన్ దంపతులు భారతదేశంలోనే అత్యంత సంపన్నులు అని ఆనంద్ మహింద్రా పేర్కొన్నారు. ఈసారి కొచ్చి వెళ్లినప్పుడు అక్కడ టీ తీసుకుని, వారి పర్యటనల విశేషాలు తెలుసుకుంటానని ట్వీట్ చేశారు. They may not figure in the Forbes Rich list but in my view, they are amongst the richest people in our country.Their wealth is their attitude to life. The next time I’m in their town I am definitely dropping by for tea & a tour of their exhibits.. pic.twitter.com/PPePvwtRQs — anand mahindra (@anandmahindra) January 9, 2019 -
ఎవరి సంపాదన ఎక్కువ?
‘షారుక్‌ఖాన్ సినిమాకు ఇన్ని కోట్లు తీసుకుంటారట, సల్మాన్ అయితే ‘బిగ్ బాస్’ ఒక్క ఎపిసోడ్‌కే అన్ని కోట్లు పుచ్చుకుంటారట!’ అని మాట్లాడుకుంటూనే ఉంటాం. సామాన్యుల్లో స్టార్స్ సంపాదన ఎప్పుడూ ఓ హాట్ టాపిక్కే. ఇదే సంభాషణలకు సర్వే రూపం ఇచ్చి ఓ జాబితాను ప్రతి ఏడాదీ రిలీజ్ చేస్తుంటుంది ఫోర్బ్స్ మేగజైన్. సినిమా తారలు, క్రికెటర్స్ ఆ ఏడాది (సర్వే నిర్వహించే కాలం)లో ఎంత సంపాదిస్తున్నారో లెక్క కట్టి ఏడాది చివర్లో ఓ లిస్ట్‌ను రిలీజ్ చేస్తుంది. ఈ ఏడాది కూడా తన టాప్ 100 జాబితాను విడుదల చేసింది. 2017 అక్టోబర్ 1 నుంచి సెప్టెబర్ 30, 2018 వరకూ తారల సినిమాల రిలీజ్లు, చేసిన బ్రాండ్ ప్రమోషన్స్ అన్నింటినీ లెక్కకట్టి ఎక్కువగా సంపాదించే వంద మంది ఇండియన్ సెలబ్రిటీల లిస్ట్ ఇచ్చింది. ఈ ఏడాది అత్యంత సంపాదించిన వాళ్లలో సల్మాన్ ఖాన్ నిలిచారు. వరుసగా మూడోసారి ఈ లిస్ట్‌లో టాప్‌లో నిలిచారు సల్మాన్ ఖాన్. ఈ కండలవీరుడు సుమారు 253 కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నట్టు పేర్కొంది ఫోర్బ్స్. మూడో స్థానంలో అక్షయ్ కుమార్ (185 కోట్లు) ఉన్నారు. ఈ జాబితాలో సౌత్ హీరోల్లో రజనీకాంత్ టాప్‌లో ఉన్నారు. 50 కోట్లు సంపాదిస్తూ 14వ పొజిషన్లో నిలిచారు రజనీ. ఆ తర్వాత 31కోట్ల సంపాదనతో పవన్ కల్యాణ్ 24వ పొజిషన్లో నిలిచారు. 28 కోట్లు సంపాదిస్తూ ఎన్టీఆర్ 28వ స్థానంలో నిలిచారు. 33, 34, 36 స్థానాల్లో మహేశ్‌బాబు (24.33 కోట్లు), సూర్య (23. 67 కోట్లు), నాగార్జున (22.25 కోట్లు) నిలిచారు. బ్లాక్‌బస్టర్ సినిమాల దర్శకుడు కొరటాల శివ కూడా ఈ లిస్ట్‌లో చోటు సంపాదించుకున్నారు.20 కోట్ల సంపాదనతో 39వ స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్ (15.67 కోట్లు), రామ్‌చరణ్ (14 కోట్లు), లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ (14 కోట్లు) 64,72, 72 స్థానాల్లో ఉన్నారు. గతేడాది రెండో స్థానంలో నిలిచిన షారుక్ ఈ ఏడాది 13వ స్థానంలోకి వెళ్లారు. ఈ ఏడాది ఒక్క సినిమా రిలీజ్ కూడా లేకపోవడమే దానికి కారణం. అలాగే గతేడాది 7వ స్థానంలో నిలిచిన ప్రియాంక ఈ సంవత్సరం 49వ స్థానానికి చేరుకున్నారు. దీపికా రికార్డ్.. నయన కూడా! 112.8 కోట్లతో దీపికా పదుకోన్ నాలుగో స్థానంలో నిలిచారు. 2012 నుంచి ఫోర్బ్స్ విడుదల చేస్తున్న ఈ జాబితాలో టాప్ 5లో చోటు సంపాదించుకున్న తొలి మహిళగా దీపికా పదుకోన్ రికార్డ్ సృష్టించారు. ‘పద్మావత్’ లో హీరోల కంటే కూడా ఎక్కువ రెమ్యునరేషన్ అందుకోవడం, అలాగే తను చేసే బ్రాండ్ ప్రమోషన్స్ కూడా ఆమెను టాప్ 5లో నిలిచేలా చేశాయని ఊహించవచ్చు. సౌత్ నుంచి హీరోయిన్స్‌లో నయనతార మాత్రమే ఈ లిస్ట్‌లో నిలవడం విశేషం. 15.17 కోట్లు సంపాదించి 69వ స్థానంలో నిలిచారు నయన్. -
అభివృద్ధి ఆర్థిక అసమానతలు
ఫోర్బ్స్ పత్రిక వారు ప్రతి ఏటా భారతదేశంలో అత్య ధిక సంపన్న వంతుల జాబితాను ఒక దానిని ప్రక టిస్తూ ఉంటారు. అందులో ప్రథమ స్థానంలో చాలా ఏళ్లుగా ముఖేష్ అంబానీ పేరు ఉంటున్నది. మొదటి వందమంది ప్రపంచ స్థాయి సంపన్నులలో ముఖేష్ అంబానీతోపాటు అజిత్ ప్రేమ్ జీ, శివ నాడార్ వంటి కొందరి పేర్లుఉంటాయి. భారతీయులుగా మనమంతా వారు సాధించిన విజయాలకు ప్రపంచస్థాయిలో వారి సంపద స్థాయికి గర్వపడుతుంటాము. అంత గర్వ పడవలసిన అంశం దీనిలో ఏమైనా ఉన్నదా? 2000–2014 మధ్య భారతదేశంలో పెరిగిన ఆదాయం ఎక్కువ భాగం అత్యున్నతంగా 10 శాతా నికి వెళ్లిందని మధ్యతరగతిగా పరిగణించబడే తరు వాతి 40 శాతం ఆదాయం 2000–2014 మధ్య గణ నీయంగా తగ్గిందని కాబట్టి మధ్యతరగతి వారి నుంచి బహుళజాతి సంస్థల వస్తువులకు భారతదే శంలో చైనాలోలాగా డిమాండ్ ఉండే అవకాశం లేదని అందువలన బహుళజాతి సంస్థలు వాటి కార్యక్రమాలు దేశంలో విస్తరించుకోవడం లాభదా యకం కాకపోవచ్చునని ఎకానమిస్ట్ పత్రికలోని వ్యాసం సారాంశం. ఆ విషయ వివరణకు వారు ఆధారపడిన గణాంకాలను చూస్తే మనకు ఇంకొక కోణం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అది దేశంలో 2000–2014 మధ్య వివిధ తరగతుల మధ్య ఆర్థిక అసమానతలు విస్తృతంగా పెరిగాయన్న విషయం. 2000 సంవత్సరంలో అత్యధిక సంపద కలిగిన 10 శాతం జనాభా చేతుల్లో దేశ ఆదాయం 40 శాతం ఉంది. వారి తరువాత ఉన్న 40 శాతం జనాభాకు కూడా దేశ ఆదాయంలో 40 శాతం వాటా కలిగి ఉన్నారు. ఇక మిగిలిన 50 శాతం జనాభాకు దేశ ఆదాయంలో 20 శాతం వాటా ఉంది. 2014 సంవత్సరానికి అత్యధిక 10 శాతం జనాభా వాటా దేశ ఆదాయంలో 40 శాతం నుంచి దాదాపు 60 శాతం దాకా పెరిగింది. మిగిలిన 40 శాతం మధ్య తరగతి వాట 40 శాతం నుంచి 30 శాతానికి తగ్గింది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎకానమిస్ట్ పత్రిక లోని వ్యాసంలో మధ్యతరగతి వారి జాతీయ ఆదా యంలో వాటా పెరుగుదల బదులు తరుగుదల ఉన్నది కాబట్టి భారత్‌లో భవిష్యత్తులో బహుళజాతి సంస్థల ఉత్పత్తులకు తగిన గిరాకీ ఉండకపోవచ్చు ననే నిర్ధారణకు ఆ వ్యాసకర్త వచ్చాడు. కేవలం భారత్‌ను అంతర్జాతీయ సంస్థల ఉత్పత్తులకు ఒక మార్కెట్ దృష్టితో చూశారు కాబట్టి ఆ వ్యాసకర్త దృష్టంతా మధ్యతరగతి వారి జాతీయ ఆదాయంలో వాటా తరుగుదల మీదనే ఉంది. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో జాతీయ ఆదాయ అభివృద్ధి పంపిణీలో మనదేశంలో ఉన్నంత అసమతౌల్యం కనిపించటం లేదని ఆ పత్రిక వారి అభిప్రాయం. కానీ ఆపై గణాంకాలు ఇంకొక ప్రమాదకరమైన ఆర్థిక అసమానతలను సూచిస్తున్నాయి. దేశ భవి ష్యత్తు దృష్ట్యా ఆ అంశంపై మనం ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అదేమిటంటే 50 శాతం జనాభాకు జాతీయ ఆదాయంలో భాగం 2000 సంవత్సరంలో 20 శాతం ఉంటే 2014 సంవత్సరా నికి అది 15 శాతానికన్నా తగ్గింది. అంటే ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరుగుతున్నాయి అని తెలుస్తూ ఉంది. జాతీయాదాయంలో మధ్యతరగతి, చివరి తరగతి ప్రజల వాటా తగ్గి 10% సంపన్న వర్గం వాటా గణనీయంగా పెరిగింది. దీని ప్రభా వమే భారతదేశం అతి విలాసవంతమైన వస్తువుల డిమాండ్ కొనుగోలు కేంద్రంగా ఏర్పడింది. మధ్య తరగతి ఆదాయం గణనీయంగా పెరిగితే బహుళ జాతి సంస్థల ఉత్పత్తులకు గిరాకీ పెరిగే అవకాశ ముంది. కానీ క్రింది 50 శాతం జనాభా ఆదాయం గణనీయంగా పెరిగితే దేశీయ సంస్థల ఉత్పత్తులకు గణనీయంగా గిరాకీ పెరిగే అవకాశం ఉంది. పైగా, 10 శాతం అత్యున్నత జనాభా సంపద పెరిగితే వారు విహారయాత్రకు స్కాట్లాండ్ దేశానికి పోయే అవకాశం ఉంది. మధ్యతరగతి వారి ఆదాయాలు పెరిగితే శ్రీలంక లాంటి దేశాలకు వెళతారు. కానీ చివరి 50 శాతం వారి ఆదాయాలు పెరిగితే వారు సందర్శించే స్థలాలు భారతదేశంలోనే ఉంటాయి. వారు చేసే ఖర్చు దేశ సంపదను పెంచుతుంది. భారత్ వస్తువుల తయారీపై దృష్టి కేంద్రీకరించాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ వస్తువులకు తగిన గిరాకీ ఏర్పడాలంటే 50 శాతం చివరి తరగతి జనాభా ఆదా యాలు గణనీయంగా పెరిగే విధానాలపై దృష్టి సారించాలి. అలా చేయనప్పుడు జాతీయ ఉత్పత్తి పెరుగుదల పేదరిక నిర్మూలనకు తోడ్పడకపోవచ్చు. అంతేకాకుండా ఆర్థిక అసమానతలు సామాజిక ఉద్రి క్తతలకు దారి తీయవచ్చు. పై పది శాతం ఆదాయా భివృద్ధి విదేశీ వస్తువుల గిరాకీ పెంచడం ద్వారా మేక్ ఇన్ ఇండియా విధానానికి తోడు పడకపోవచ్చు. ఐవైఆర్ కృష్ణారావు, వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి iyrk45@gmail.com -
పెళ్లి చేసుకోవాలని ఉంది: టాప్ హీరోయిన్
ప్రియాంక చోప్రా.. బాలీవుడ్ నటీమణుల్లో ఎక్కువగా విజయం సాధించిన వారిలో ఈమె ఒకరు. ఇటీవల ఆమె బాలీవుడ్ హీరోలకు దీటుగా సంపాదన ఆర్జిస్తున్నారు. 2017 ఫోర్బ్స్ ఇండియా టాప్ 10 సెలబ్రిటీల్లో ఉన్న ఒకే ఒక్క నటి ప్రియాంక మాత్రమే. అంతేకాక భారత్‌లో మాత్రమే కాక, అమెరికాలోనూ ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఈమె అమెరికన్ టెలివిజన్ సిరీస్ క్వాంటికో మూడో పార్ట్‌లో నటిస్తోంది. త్వరలోనే హాలీవుడ్ ప్రాజెక్ట్‌లోనూ ప్రియాంక షూటింగ్‌ను ప్రారంభించబోతుంది. ఇటు బాలీవుడ్‌లోనూ.. అటు హాలీవుడ్‌లోనూ దూసుకుపోతున్న ఈ భామ పెళ్లెప్పుడు చేసుకుంటుందా? అని ఆలోచించని వారుండరు. ఇంతకీ ఈ భామకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని ఉందా? లేదా? అంటూ ఇటీవల ఢిల్లీ ఈవెంట్‌కు వచ్చిన ప్రియాంకకు పెళ్లి ముచ్చట్లు ఎదురయ్యాయి. ''కచ్చితంగా నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఉంది. ఇప్పటివరకు నేను చేసిన హార్డ్ వర్క్‌ను అభినందించే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అమ్మ చెప్పింద’ని ప్రియాంక పేర్కొంది. కానీ తగిన అబ్బాయి దొరకడమే కష్టమైన పని అనిపిస్తుందంటూ నవ్వేసింది. -
ఫోర్బ్స్ జాబితాలో బ్యాడ్మింటన్ స్టార్లు
న్యూఢిల్లీ: ప్రముఖ పత్రిక ‘ఫోర్బ్స్ ఇండియా’ తాజాగా విడుదల చేసిన 100 మంది సెలబ్రిటీల జాబితాలో హైదరాబాద్ షట్లర్లు ముగ్గురికి చోటు దక్కింది. ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధు (13వ ర్యాంక్), కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ (29వ ర్యాంక్) ఈ జాబితాలో ఉన్నారు. 2017లో నాలుగు సూపర్ సిరీస్ టోర్నీ విజయాలతో పాటు వరల్డ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరిన మరో షట్లర్ కిడాంబి శ్రీకాంత్ (83)కు కూడా టాప్–100లో స్థానం లభించింది. -
అగాథంలో భారత ఆర్థిక వ్యవస్థ
సాక్షి, ముంబై : భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు తీవ్రంగా మందగించినా... దేశంలోని 100 మంది ధనికులు ఆస్తులలో మాత్రం నాలుగో వంతు అభివృద్ధి కనిపించినట్లు ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. దేశంలోని 100 మంది ధనికుల జాబితాను ఇటీవల ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసిన విషయం తెలిసిందే. అనంతరం ‘మందగించిన ఆర్థిక వ్యవస్థలో కూడా మరింత సంపన్నులవుతున్న భారత సంపన్న దిగ్గజాలు’ అంటూ ఓ పరిశోధనాత్మక కథనాన్ని కూడా ఫోర్బ్స్ ప్రచురించింది. నోట్ల రద్దు, జీఎస్టీలే కారణం పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను వంటి చర్యలు భారత ఆర్థిక వ్యవస్థ మందగించడానికి కారణమని తెలిపింది. ఈ రెండింటి వల్ల ఏర్పడిన అనిశ్చితి కారణంగానే గత మూడేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయి(5.7 శాతానికి) వృద్ధి రేటు దిగజారింది. దీంతో సంబంధం లేకుండా దేశంలోని సంపన్నుల ఆస్తులు 25 శాతం కన్నా ఎక్కువ వృద్ధిని చూశాయి. ఒక్క ఏడాది.. రూ. లక్ష కోట్లు.. దేశ ధనవంతుల్లో ముకేశ్ అంబానీ కొద్ది సంవత్సరాలుగా తొలిస్థానాన్ని కైవసం చేసుకుంటూ వస్తున్నారు. 2017లోనూ ఆయన కుబేరుడిగానే నిలిచారు. చమురు, గ్యాస్ వ్యాపారాల్లో ఈ ఏడాది ముకేశ్ లాభపడినట్లు ఏ ఇతర భారతీయ కంపెనీ లాభాలను ఆర్జించలేదు. దాదాపు రూ. లక్ష కోట్లకు పడగలెత్తి భారతీయుల్లో అత్యంత ధనవంతుడి స్థానాన్ని దక్కించుకున్నారు ముకేశ్. లాభాలతో కలిపి ముకేశ్ ఆస్తుల విలువ దాదాపు రూ. 2.47 లక్షల కోట్లకు చేరినట్లు ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. అంతా జియో మహిమ..! ముకేశ్ ఆస్తులు ఒక్కసారిగా లక్ష కోట్లు పెరగడానికి 'రిలయన్స్ జియో' ఓ కారణమని కూడా తన పరిశోధనాత్మక కథనంలో పేర్కొంది ఫోర్బ్స్. రిలయన్స్ షేర్లు భారీగా పెరగడానికి జియోను కారణమని తేల్చిచెప్పింది. -
ఫోర్బ్స్ ‘సూపర్-50’లో టీసీఎస్, ఇన్ఫోసిస్
ముంబై: ఫోర్బ్స్ ఇండియా తాజా ‘సూపర్-50’ జాబితాలో పలు సాఫ్ట్వేర్, ఫార్మా, బ్యాంకింగ్ దిగ్గజాలు స్థానం పొందాయి. ఐటీ కంపెనీల్లో టీసీఎస్, ఇన్ఫోసిస్.. ఫార్మా సంస్థల్లో సన్ ఫార్మా, లుపిన్.. ప్రైవేట్ బ్యాంకుల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు జాబితాలో ఉన్నాయి. తాజా జాబితాలో టాటా మోటార్స్, హెచ్‌యూఎల్, ఎంఆర్ఎఫ్, గ్లాక్సోస్మిత్‌క్లిన్ న్సూమర్ హెల్త్‌కేర్, ఫైజర్, డా.రెడ్డీస్ ల్యాబ్స్, గ్లెన్‌మార్క్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి సంస్థలు స్థానం కోల్పోయాయి. ఇక ఇన్ఫోసిస్, మారుతీ సుజుకీ, భారత్ ఫోర్జ్, అలెంబిక్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ వంటి తదితర 14 కంపెనీలు కొత్తగా స్థానం దక్కించుకున్నాయి. అమ్మకాల వృద్ధి, మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరుగుదల వంటి తదితర అంశాల ప్రాతిపదికన పీడబ్ల్యూసీ ఇండియా భాగస్వామ్యంతో జాబితాను రూపొందించామని ఫోర్బ్స్ వివరించింది. -
ఫోర్బ్స్ నవకల్పన జాబితాలో 9 దేశీ కంపెనీలు
న్యూయార్క్: ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన వంద నవకల్పన వృద్ధి కంపెనీల జాబితాలో తొమ్మిది భారత కంపెనీలకు చోటు లభించింది. ఈ జాబితాలో న్యూజిలాండ్‌కు చెందిన సాఫ్ట్వేర్ అకౌంటింగ్ సంస్థ గ్జెరో మొదటి స్థానంలో నిలిచింది. కంపెనీ భవిష్యత్తులో అందించే కొత్త ఉత్పత్తులు, సేవలు, మార్కెట్లపై ఇన్వెస్టర్ల అంచనాలు, ఆ అంచనాల ఆధారంగా ఆయా కంపెనీల షేర్లను కొనుగోలు చేయడం వంటి అంశాల ఆధారంగా ఈ జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించింది. ఈ జాబితాలో గోద్రేజ్ కన్సూమర్ ప్రోడక్ట్స్ 425 కోట్ల డాలర్లతో 31వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో చోటు సాధించిన ఇతర భారత కంపెనీల వివరాలిలా ఉన్నాయి. ఏబీబీ ఇండియా(37వ స్థానం), మ్యారికో(53), యునెటైడ్ బ్రూవరీస్(60), సీమెన్స్ ఇండియా(63), ఏషియన్ పెయింట్స్(78), నెస్లే ఇండియా(78), కోల్గేట్ పామోలివ్ ఇండియా(87), దివీస్ ల్యాబ్స్(99).