దేశంలో లేదా ప్రపంచంలో సంపన్నుల లెక్క ఎప్పుడూ ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేస్తూ ఉంటుంది. అయితే.. మన దేశంలో ఏ రంగం నుంచి ఎక్కువ మంది బిలియనీర్లు వస్తున్నారన్న విషయం మీకు తెలుసా? అందుకే ఈసారి కొంచెం కొత్తగా.. ఈ ఏడాది అత్యధిక సంపన్నులు ఉన్న టాప్–10 వ్యాపార రంగాల గురించి తెలుసుకుందాం.. అది కూడా ఫోర్బ్స్ జాబితా ప్రకారమే.. వీటిని చూశాక.. హెల్త్ ఈజ్ వెల్త్‌కి.. మరో అర్థమూ మనకు దొరుకుతుందేమో.. ఎందుకంటే.. అత్యధిక బిలియనీర్లు ఆరోగ్య రంగం నుంచే ఉన్నారు మరి..
1. వైద్య రంగం
బిలియనీర్ల సంఖ్య: 29
అత్యంత ధనికుడు:సైరస్ పూనావాలా
కంపెనీ: సైరస్ పూనావాలా గ్రూప్ వ్యవస్థాపకుడు, సీఎండీ. కోవిడ్ టీకాలు తయారు చేసిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ గ్రూప్ కంపెనీల్లో ఒకటి.
ఆస్తుల నికర విలువ: సుమారు రూ.1.61 లక్షల కోట్లు
2. తయారీ రంగం
బిలియనీర్ల సంఖ్య: 29
అత్యంత ధనికుడు: అశ్వన్ దనీ, కుటుంబం కంపెనీ: ఏసియన్ పెయింట్స్ లిమిటెడ్, నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్
ఆస్తుల నికర విలువ: సుమారు రూ. 58 వేల కోట్లు
3. ఫ్యాషన్ అండ్ రిటైల్
బిలియనీర్ల సంఖ్య: 16
అత్యంత ధనికుడు: రాధాకిషన్ దమానీ, కంపెనీ: డీమార్ట్ వ్యవస్థాపకుడు
ఆస్తుల నికర విలువ: సుమారు రూ. 1.43 లక్షల కోట్లు
4. సాంకేతిక రంగం
బిలియనీర్ల సంఖ్య: 13
అత్యంత ధనికుడు: శివ్ నాడర్
కంపెనీ: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, గౌరవ చైర్మన్
ఆస్తుల నికర విలువ: సుమారు రూ. 1.78 లక్షల కోట్లు
5. ఆర్థిక, బ్యాంకింగ్
బిలియనీర్ల సంఖ్య: 11
అత్యంత ధనికుడు: ఉదయ్ కోటక్, కంపెనీ: కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు, ఎండీ–సీఈవో
ఆస్తుల నికర విలువ: సుమారు రూ. 1.08 లక్షల కోట్లు
6. ఆహారం– పానీయాలు
బిలియనీర్ల సంఖ్య: 10
అత్యంత ధనికుడు: రవి జైపురియా
కంపెనీ: ఆర్‌జే కార్ప్ లిమిటెడ్ చైర్మన్. పెప్సీకి సీసాలు తయారు చేసే సంస్థ. కేఎఫ్‌సీ, పిజ్జా హట్, కోస్టా కాఫీ వంటి సంస్థలకు ఫ్రాంచైజీ)
ఆస్తుల నికర విలువ: సుమారు రూ. 52 వేల కోట్లు
7. వాహన తయారీ రంగం
బిలియనీర్ల సంఖ్య: 9
అత్యంత ధనికులు: బజాజ్ సోదరులు (నీరజ్, మధూర్, శేఖర్), కంపెనీ: బజాజ్ గ్రూప్
ఆస్తుల నికర విలువ: సుమారు రూ. 54 వేల కోట్లు
8. స్థిరాస్తి రంగం
బిలియనీర్ల సంఖ్య: 9
అత్యంత ధనికుడు: కుషల్‌పాల్ సింగ్
ఆస్తుల నికర విలువ: సుమారు రూ. 66 వేల కోట్లు
9. నిర్మాణ, ఇంజనీరింగ్ రంగం
బిలియనీర్ల సంఖ్య: 5
అత్యంత ధనికుడు: రవి పిళ్లై
కంపెనీ: ఆర్పీ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్
ఆస్తుల నికర విలువ: సుమారు రూ.20 వేల కోట్లు
10. సేవా రంగం
బిలియనీర్ల సంఖ్య: 4
అత్యంత ధనికులు: కపిల్, రాహుల్ భాటియా (తండ్రీకొడుకులు)
కంపెనీ: ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకుడు కపిల్ భాటియా, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ఎండీ రాహుల్ భాటియా. ఇండిగో సంస్థ సహవ్యవస్థాపకుడు
ఆస్తుల నికర విలువ: సుమారు రూ. 35 వేల కోట్లు
బిజినెస్ టైకూన్లు
దేశంలో వివిధ రంగాలకు తమ వ్యాపారాలను విస్తరించిన దిగ్గజ వ్యాపారవేత్తల సంఖ్య 17కు చేరుకుంది. సుమారు రూ. 9.1 లక్షల కోట్ల సంపదతో గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. సుమారు రూ. 7 లక్షల కోట్లు సంపదతో ముకేశ్ అంబానీ రెండో స్థానంలో ఉండగా సుమారు రూ. 1.04 లక్షల కోట్లుతో కుమార్ మంగళం బిర్లా ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment