Forbes India Billionaires
-
ఆసియా.. ఇండియాలోని ధనవంతుల జాబితా
పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఆసియా, దేశీ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. 2025 జనవరి ప్రారంభం నాటికి పోర్బ్స్ ఆసియా(Forbes Asia) కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ(Ambani) మొదటిస్థానంలో నిలువగా, గౌతమ్ అదానీ(Adani) రెండో స్థానంలో ఉన్నారు. ముఖేశ్ అంబానీ మొత్తం సంపద 96.6 బిలియన్ డాలర్లు ఉండగా, గౌతమ్ అదానీ సంపద 62.1 బిలియన్ డాలర్లుగా ఉంది.ఫోర్బ్స్ ప్రకారం 2025 ప్రారంభం నాటికి ఆసియాలోని టాప్ 10 ధనవంతులుముఖేష్ అంబానీ - 96.6 బిలియన్ డాలర్లు (ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్)గౌతమ్ అదానీ - 62.1 బిలియన్ డాలర్లు (ఇండియా, అదానీ గ్రూప్)జోంగ్ షాన్షాన్ - 53.6 బిలియన్ డాలర్లు (చైనా, నోంగ్ఫు స్ప్రింగ్)ప్రజోగో పంగేస్తు - 55.9 బిలియన్ డాలర్లు (ఇండోనేషియా, బారిటో పసిఫిక్ గ్రూప్)తడాషి యానై అండ్ ఫ్యామిలీ - 47.2 బిలియన్ డాలర్లు (జపాన్, ఫాస్ట్ రిటైలింగ్)జాంగ్ యిమింగ్ - 45.6 బిలియన్ డాలర్లు (చైనా, బైడ్‌డ్యాన్స్, టాక్‌టాక్)సావిత్రి జిందాల్ అండ్ ఫ్యామిలీ - 44.3 బిలియన్ డాలర్లు (ఇండియా, జిందాల్ గ్రూప్)మా హువాటెంగ్ - 43.3 బిలియన్ డాలర్లు (చైనా, టెన్సెంట్ హోల్డింగ్స్)శివ్ నాడార్ - 40 బిలియన్ డాలర్లు (ఇండియా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్)రాబిన్ జెంగ్ - 37.2 బిలియన్ డాలర్లు (హాంకాంగ్, కాంటెంపరరీ ఆంపరెక్స్ టెక్నాలజీ-సీఏటీఎల్)ఇదీ చదవండి: వడ్డీరేట్ల కోత పక్కా..?ఫోర్బ్స్ ప్రకారం 2025 ప్రారంభం నాటికి ఇండియాలోని టాప్ 10 ధనవంతులుముఖేష్ అంబానీ - 96.6 బిలియన్ డాలర్లు (రిలయన్స్ ఇండస్ట్రీస్)గౌతమ్ అదానీ - 62.1 బిలియన్ డాలర్లు (అదానీ గ్రూప్)సావిత్రి జిందాల్ అండ్ ఫ్యామిలీ - 44.3 బిలియన్ డాలర్లు (ఓపీ జిందాల్ గ్రూప్)శివ్ నాడార్ - 40 బిలియన్ డాలర్లు (హెచ్‌సీఎల్ టెక్నాలజీస్)రాధాకిషన్ దమానీ - 31.5 బిలియన్ డాలర్లు (డీమార్ట్)ఉదయ్ కోటక్ - 28 బిలియన్ డాలర్లు (కోటక్ మహీంద్రా బ్యాంక్)సునీల్ మిట్టల్ - 27 బిలియన్ డాలర్లు (భారతీ ఎంటర్ప్రైజెస్)లక్ష్మీ మిట్టల్ - 26 బిలియన్ డాలర్లు (ఆర్సెలర్ మిట్టల్)కుమార మంగళం బిర్లా - 25 బిలియన్ డాలర్లు (ఆదిత్య బిర్లా గ్రూప్)అనిల్ అగర్వాల్ - 24 బిలియన్ డాలర్లు (వేదాంత రిసోర్సెస్) -
ధనవంతుల జాబితాలో రైతు బిడ్డ - సంపద తెలిస్తే అవాక్కవుతారు!
ఇటీవల ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన 100 మంది అత్యంత సంపన్నుల జాబితాలో రిలయన్స్ ఛైర్మన్ 'ముకేశ్ అంబానీ' (Mukesh Ambani) అగ్రస్థానం పొందగా.. ఆఖరి (100వ) స్థానంలో కేపీఆర్ మిల్ ఛైర్మన్ 'రామసామి' (Ramasamy) నిలిచినారు. ఈ కథనంలో రామసామి ఎవరు? ఆయన సంపద ఎంత? అనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఆర్ధిక పరిస్థితుల కారణంగా కాలేజీ చదువును మధ్యలో ఆపేసిన ఒక రైతు కొడుకు నేడు భారతదేశంలోని 100 మంచి ధనవంతులలో ఒకడుగా నిలిచాడంటే చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఫోర్బ్స్ ఇండియా ప్రకారం, రామసామి మొత్తం ఆస్తుల విలువ 2.3 బిలియన్ డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 19133.7 కోట్లు). వస్త్రాలు (టెక్స్టైల్స్), చక్కెర తయారీదారులో తమదైన రీతిలో ముందుకు సాగుతున్న KPR మిల్ ఫౌండర్ అండ్ ఛైర్మన్ 'రామసామి' ఫోర్బ్స్ జాబితాలో చేరిన కొత్త వ్యక్తి కావడం హర్షించదగ్గ విషయం. ప్రస్తుతం ఈయన కంపెనీలలో సుమారు 25,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు, అందులో 90శాతం మంది మహిళా ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. వీరందరికి కరోనా మహమ్మారి సమయంలో కూడా పూర్తి జీతాలిచ్చి ఆదరించిన ఘనత రామసామి సొంతం. ఇదీ చదవండి: రూ.5 వేలతో మొదలైన రూ.14000 కోట్ల కంపెనీ.. సామాన్యుడి సక్సెస్ స్టోరీ! నేడు వందమంది ధనవంతుల జాబితాలో ఒకరుగా నిలిచిన రామసామి ప్రయాణం కేవలం రూ. 8,000 అప్పుతో మొదలైంది. ప్రతి ఏటా దాదాపు 128 మిలియన్ల వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్న కేపీఆర్ కంపెనీ సంవత్సరానికి వేలకోట్లు ఆర్జిస్తోంది. సంస్థ ఉత్పత్తి చేసే వస్త్రాలలో స్పోర్ట్స్‌వేర్ నుంచి స్లీప్వేర్ వరకు దాదాపు అన్ని లభిస్తాయి. -
ఫోర్బ్స్ కుబేరుల జాబితా: అంబానీ, అదానీ ర్యాంకు ఎంతో తెలుసా?
అమెరికన్ బిజినెస్ మేగజీన్ ఫోర్బ్స్ (Forbes) 2023 సంవత్సరానికి గానూ ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాను విడుదల చేసింది. ఫోర్బ్స్ విడుదల చేసిన 37వ ఎడిషన్‌లో ఆసియా కుబేరుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తిరిగి టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకున్నారు. 90.8 బిలియన్ల నికర విలువతో దేశంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. దేశంలోని 167 మంది బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. అమెరికా, చైనా తర్వాత ప్రపంచంలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. (కళ్లద్దాల్నే నమ్ముకున్నాడు: కట్ చేస్తే..వేల కోట్ల వ్యాపారం, లగ్జరీ లైఫ్!) 2023 ఏడాది ఫోర్బ్స్ ప్రపంచ సంపన్నుల జాబితాలో 240.7 బిలయన్ డాలర్లతో ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా నిలిచాడు. అలాగే ఫ్రాన్స్ కు చెందిన లూయీస్ వీటన్ (Louis Vuitton) బ్రాండ్ ఫౌండర్ ప్రముఖ వ్యాపారవేత్త బెర్నార్డ్ జీన్ అర్నాల్ట్ ప్రంపంచలో టాప్ 2 ప్లేస్ కొట్టేశారు సంపద 231.4 బిలియన్ డాలర్లు. 154.9 బిలియన్ డాలర్లతో అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ మూడో స్థానంలో ఉన్నారు. ఇండియాలో టాప్-10 లో ఉన్నది వీరే భారత్‌లో దాదాపు 167 మంది బిలియనీర్లలో, ముఖేష్ అంబానీ వరుసగా 14 సంవత్సరాలుగా భారతదేశంలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. గౌతమ్ అదానీ, సైరస్ పూనావల్లా, శివనాదా తర్వాతి స్థానాల్లో ఉన్నారు ఐదో స్థానంలో సావిత్రి జిందాల్ నిలిచారు. ♦ గౌతమ్ అదానీ 54.9 బిలియన్ డాలర్లు ♦ సైరస్ పూనావాలా 29.1 బిలియన్ డాలర్లు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ♦ శివ్ నాడార్ 25.6బిలియన్ డాలర్లు HCL టెక్నాలజీస్ ♦ సావిత్రి జిందాల్ & కుటుంబం 20.3 బిలియన్ డాలర్లు JSW గ్రూప్ ♦ దిలీప్ షాంఘ్వీ 18.2 బిలియన్ డాలర్లుసన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ♦ లక్ష్మి మిట్టల్ 16.9 బిలియన్ డాలర్లుఆర్సెలర్ మిట్టల్ ♦ రాధాక్రిషన్ దమానీ 16.7 బిలియన్ డాలర్లు DMart, అవెన్యూ సూపర్ మార్కెట్లు ♦ కుమార్ బిర్లా 15.8 బిలియన్ డాలర్లు ఆదిత్య బిర్లా గ్రూప్ ♦ ఉదయ్ కోటక్ 14.2బిలియన్ డాలర్లు బి కోటక్ మహీంద్రా బ్యాంక్ -
గెలుపు దారి: దుఃఖనది దాటి గెలిచారు
రోహిక మిస్త్రీ, రేఖా ఝున్ఝున్వాలాల మధ్య ఉన్న ప్రధాన సారూప్యత ఏమిటంటే... ఇద్దరూ పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని నిలబడ్డారు. తడబడకుండా ధైర్యంగా అడుగు ముందుకు వేశారు. తమ తెలివితేటలు, కార్యదక్షతతో విజయపరంపరను ముందుకు తీసుకు వెళుతున్నారు. తాజాగా ఫోర్బ్స్ వరల్డ్స్ బిలియనీర్స్ జాబితాలో మన దేశం నుంచి చోటు సంపాదించిన న్యూకమర్స్లో ఈ ఇద్దరూ ఉన్నారు... సైరస్ మిస్త్రీ పరిచయం అక్కరలేని పేరు. లండన్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ చేసిన మిస్త్రీ ఆతరువాత కుటుంబవ్యాపారంలోకి వచ్చాడు. 2012లో టాటా గ్రూప్ ఛైర్మన్ అయ్యాడు. మిస్త్రీ జీవితంలో జయాపజయాలు ఉన్నాయి. ‘నిర్దేశిత లక్ష్యాల విషయంలో మిస్త్రీ విఫలమయ్యాడు’ అంటూ కొద్దికాలానికి ఛైర్మన్ పదవి నుంచి మిస్త్రీకి ఉద్వాసన పలికింది టాటా గ్రూప్. న్యాయపోరాటం సంగతి ఎలా ఉన్నా మిస్త్రీ ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో భర్తకు అండగా నిలబడి ఎంతో శక్తిని ఇచ్చింది రోహిక. ప్రచారానికి దూరంగా ఉండే రోహిక గురించి బయట పెద్దగా ఎవరికి తెలియదు. అయితే భర్త నోటి నుంచి ‘రోహిక’ పేరు వినిపించేది. దిగ్గజ న్యాయవాది ఇక్బాల్ చాగ్లా కుమార్తె అయిన రోహిక కొన్ని ప్రైవెట్, పబ్లిక్ కంపెనీలలో డైరెక్టర్‌గా పనిచేసింది. ఒకసారి రోహికను క్లెమెన్టైన్ స్పెన్సర్ చర్చిల్తో పోల్చాడు సైరస్ మిస్త్రీ. చర్చిల్ భార్య అయిన క్లెమెన్టైన్ ధైర్యశాలి. ముందుచూపు ఉన్న వ్యక్తి. భర్తకు ఎన్నో సందర్భాలలో అండగా నిలబడి ధైర్యాన్ని ఇచ్చింది. తప్పులను సున్నితంగా ఎత్తి చూపింది. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం తన నైజం. వర్క్–ఫ్యామిలీ లైఫ్‌లో సమన్వయాన్ని కోల్పోతున్న మిస్త్రీని దారిలోకి తెచ్చింది రోహిక. ‘సమస్యలు ఉన్నాయని సరదాలు వద్దనుకుంటే ఎలా!’ అంటూ భర్తను విహారయాత్రలకు తీసుకెళ్లేది. ఆ యాత్రలలో వ్యాపార విషయాలు అనేవి చివరి పంక్తిలో మాత్రమే ఉండేవి. 54 ఏళ్ల వయసులో సైరస్ మిస్త్రీ ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు. రోహికకు ఊహించిన షాక్! దుఃఖసముద్రంలో మునిగిపోయిన రోహిక తనకు తాను ధైర్యం చెప్పుకొని ఒడ్డుకు వచ్చింది. మైదానంలో అడుగు పెట్టి ఆట మొదలు పెట్టింది. ‘నువ్వే నా ధైర్యం’ అనేవాడు రోహికను ఉద్దేశించి మిస్త్రీ. భర్త జ్ఞాపకాలనే ధైర్యం చేసుకొని, శక్తిగా మలచుకొని ముందుకు కదిలింది రోహిక. ‘మిస్త్రీల శకం ముగిసింది’ అనుకునే సందర్భంలో ‘నేనున్నాను’ అంటూ వచ్చి గెలుపు జెండా ఎగరేసింది రోహిక మిస్త్రీ. స్టాక్ మార్కెట్ చరిత్రలో ‘స్టార్’గా మెరిశాడు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా. పెట్టుబడి పాఠాల ఘనాపాఠీ రాకేష్‌కు భార్య ఎన్నో పాఠాలు చెప్పింది. అవి ఆరోగ్య పాఠాలు కావచ్చు. ఆత్మీయ పాఠాలు కావచ్చు. రేసులకు వెళ్లి ఏ అర్ధరాత్రో ఇంటికి వచ్చే భర్తను ఆ అలవాటు మానిపించింది. సిగరెటు అలవాటును దూరం చేసింది. ఆరోగ్యకరమైన జీవనశైలి దిశగా భర్తను అడుగులు వేయించింది. తన పేరు, భార్య పేరులోని కొన్ని ఆంగ్ల అక్షరాలతో తన స్టాక్ బ్రోకింగ్ కంపెనీకి ‘రేర్’ అని పేరు పెట్టాడు రాకేశ్. భర్త హఠాన్మరణం రేఖను కుంగదీసింది. చుట్టూ అలముకున్న దట్టమైన చీకట్లో వెలుగు రేఖ కరువైంది. అలాంటి దురదృష్టపు రోజుల్లో వేధించే జ్ఞాపకాలను పక్కనపెట్టి వెలుగు దారిలోకి వచ్చింది రేఖ. ‘ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు’ అనే సామెత ఉంది. అది నిజమో కాదో తెలియదుగానీ ‘యూనివర్శిటీ ఆఫ్ ముంబై’లో చదువుకున్న రేఖ భర్త రాకేశ్‌లో ఒక విశ్వవిద్యాలయాన్ని దర్శించింది. అక్కడ ఎన్నో పాఠాలు నేర్చుకుంది. భర్త బాటలోనే ఇన్వెస్టర్‌గా, ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఘనమైన విజయాలు సాధిస్తోంది రేఖ ఝున్‌ఝున్‌వాలా. -
నైకా ఫల్గుణి సంచలనం: తగ్గేదేలే అంటున్న బిజినెస్ విమెన్
సాక్షి, ముంబై: ఫోర్బ్స్ 2022 భారతదేశపు 100 మంది సంపన్నుల జాబితాలో ఈ ఏడాది అనేక మంది కొత్త బిలియనీర్లు చోటు సంపాదించడం విశేషం. రూపాయి విలువ క్షీణత, ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఆందోళనలున్నప్పటికీ దేశం లోని టాప్-100 కుబేరుల సంపద అసాధారణంగా పెరిగిందని ఫోర్బ్స్ డేటా ద్వారా తెలుస్తోంది. ఫల్గుణి నాయర్: ముఖ్యంగా ఇటీవల ఐపీవోతోపాటు పలు సంచనాలకు మారు పేరు నైకా ఫౌండర్ ఫల్గుణి నాయర్ టాప్-50లో చోటు సంపాదించు కున్నారు. రూ. 32,951.71 కోట్లతో దేశంలోని అత్యంత ధనవంతుల స్వీయ-నిర్మిత బిలియనీర్‌గా ప్రశంస లందుకున్నారు. ఫోర్బ్స్ డేటా ప్రకారం 4.8 బిలియన్ల డాలర్ల నికర విలువతో ఫల్గుణి నాయర్ జాబితాలో 44వ స్థానంలో నిలిచారు. ఐఐఎం అహ్మదాబాద్ గ్రాడ్యుయేట్ నాయర్ 2012లో "మల్టీ-బ్రాండ్ ఓమ్నిచానెల్ బ్యూటీ-ఫోకస్డ్ రిటైల్ వ్యాపారాన్ని నిర్మించాలనే లక్క్ష్యంతో నైకాను స్థాపించారు. సావిత్రి జిందాల్: ఫోర్బ్స్ ప్రకారం ఓపీ జిందాల్ గ్రూప్ చైర్పర్సన్, సావిత్రి జిందాల్ టాప్-10లో ఉన్న ఏకైక మహిళా బిలియనీర్. 17.4 బిలియన్ డాలర్ల నికర విలువతో 72 ఏళ్ల సావిత్రి జిందాల్ ఈ సంవత్సరం జాబితాలో మొదటి పది మంది ధనవంతుల జాబితాలో ఉన్నారు. ఆమె భర్త ఓం ప్రకాష్ జిందాల్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత, గ్రూప్ బాధ్యతలను చేపట్టారు. ఈ దంపతుల నలుగురు కుమారుల స్వతంత్రంగా కంపెనీలను నిర్వహిస్తున్నారు. రేఖా ఝున్‌ఝున్‌వాలా: దివంగత పెట్టుబడిదారుడు రాకేష్ ఝన్‌ఝున్‌వాలా భార్య రేఖాఈ లిస్ట్‌లో 30వ స్థానంలో నిలిచి తన భర్తన స్థానాన్ని భర్తీ చేశారు. ఆమె నికర సంపద 5.9 బిలియన్ డాలర్లు. (ఫోర్బ్స్ టాప్ -10 లిస్ట్: బిలియనీర్లు అదానీ, అంబానీ ఎక్కడ?) నెహాల్ వకీల్: ఏసియన్ పెయింట్స్‌కు చెందిన నెహాల్ వకీల్ 0.52 బిలియన్ డాలర్లతో 46వ స్థానంలో నిలిచారు. తొలిసారి 2022 ఫోర్బ్స్ జాబితాలో ఎంట్రీ ఇచ్చారు. 1942లో స్థాపించిన ఏషియన్ పెయింట్స్ కంపెనీని నడుపుతున్న కుటుంబంలోని థర్డ్ జెనరేషన్ ప్రతినిధి నెహాల్. అంతేకాదు బోర్డులో ఉన్న ముఖ్య కుటుంబ సభ్యులలో నేహా ఒకరు. కిరణ్ మజుందార్-షా: బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్-షా 2.7 బిలియన్ డాలర్ల నికర సంపదతో భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల్లో 76వ స్థానంలో నిలిచారు. 1978లో ఆదాయం ద్వారా భారతదేశంలో అతిపెద్ద లిస్టెడ్ బయోఫార్మాస్యూటికల్ సంస్థగా బయోకాన్ అవతరించింది. లీనా తివారీ: 3.7 బిలియన్ డాలర్ల నికర విలువతో, లీనా తివారీ ఈ సంవత్సరం అత్యంత సంపన్న భారతీయుల జాబితాలో 51వ ప్లేస్‌లో నిలిచారు. ఫార్మాస్యూటికల్ దిగ్గజం యూఎస్వీ ఇండియా ఛైర్‌పర్సన్‌గా, తివారీ 2018లో జర్మన్ జెనరిక్స్ సంస్థ జూటా ఫార్మాను కొనుగోలు చేశారు. అను అగా: 80 ఏళ్ల అను అగా తిరిగి మళ్లీ రిచెస్ట్ ఇండియన్స్ జాబితాలో చోటు సంపాదించారు. 1.9 బిలియన్ డాలర్ల నికర సంపదతో 88వ స్థానంలో నిలిచారు. థర్మాక్స్ అనే లిస్టెడ్ ఇంజనీరింగ్ సంస్థలో అగా మెజారిటీ వాటాను కలిగి ఉంది. అగా 1985లో తన జీవిత భాగస్వామి కంపెనీలో పని చేయడం ప్రారంభించారు. సుదీర్ఘం అనారోగ్యంతో భర్త మరణించడంతో 1996లో ఆమె కంపెనీ బాధ్యతలు చేపట్టారు. తరువాత కెమికల్ ఇంజనీర్ అయి అను కుమార్తె మెహెర్ బాధ్యతలు చేపట్టడంతో 2004లో అగా ఛైర్పర్సన్ పదవికి రాజీనామా చేసి సామాజిక కార్యకలాపాల్లో బిజీగా ఉన్నారు. అలాగే ఇండియన్ ఎత్నిక్ వేర్ తయారీదారు, మన్యవార్ బ్రాండ్‌కు ప్రసిద్ధి చెందిన వేదాంత్ ఫ్యాషన్స్ ఓనర్ రవి మోడీ 3.6 బిలియన్ డాలర్లతో ఫోర్బ్స్ లో చోటు సాధించారు. ఇంకా యూఎన్వో మిండా (గతంలో మిండా ఇండస్ట్రీస్) సీఎండీ నిర్మల్ మిండా మెట్రో బ్రాండ్లకు చెందిన రఫీక్ మాలిక్ జాబితాలో కొత్తగా ప్రవేశించిన వారిలో ఉన్నారు. -
ఫోర్బ్స్ టాప్ -10 లిస్ట్: బిలియనీర్లు అదానీ, అంబానీ ఎక్కడ?
న్యూఢిల్లీ: ఫోర్బ్స్ 2022 భారతదేశపు 100 మంది సంపన్నుల జాబితా విడుదలైంది.దీని ప్రకారం భారతదేశంలోని 100 మంది సంపన్నుల సంపద 25 బిలియన్ డాలర్లు పెరిగి 800 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గత ఏడాదితోపోలిస్తే స్టాక్ మార్కెట్ స్వల్పంగా తగ్గినప్పటికీ బిలియనీర్ల సంపద మాత్రం మరింత వృద్ధి చెందింది. ఈజాబితాలో అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ టాప్ ప్లేస్‌ను కైవసం చేసుకోగా, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ 2వ స్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన ఫోర్బ్స్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ప్రకారం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ టైకూన్ గౌతమ్ అదానీ రికార్డ్-బ్రేకింగ్ ఫీట్‌తో 2008 తర్వాత మొదటిసారిగా అగ్రస్థానంలో ఉన్న క్రమాన్ని మార్చింది. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ ఆదానీ 150 బిలియన్ డాలర్ల (రూ. 1,211,460.11 కోట్లు) ఆదాయంతో టాప్‌లో, 88 బిలియన్ డాలర్ల (రూ.710,723.26 కోట్లు)తో ముఖేశ్ అంబానీ రెండో స్థానంలో ఉన్నారు. టాప్ -10 జాబితా: ఈ పది మంది సంపాదన 350 బిలియన్ డాలర్లు ఉంటుందని ఫోర్బ్స్ తెలిపింది. రాధాకిషన్ దమానీ:డీమార్ట్ రిటైల్ సూపర్‌మార్కెట్ డీమార్ట్ యజమాని రాధాకిషన్ దమనీ రూ. 222,908.66 కోట్ల సంపాదనతో మూడోస్థానంలో ఉన్నారు. సైరస్ పూనావాలా: ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ సైరస్ పూనావాలా (రూ.173, 642.62 కోట్లు) నాలుగో ప్లేస్ సాధించారు. శివ్ నాడార్: టెక్దిగ్గజం హెచ్‌సీఎల్ సంస్థ యజమాని శివ్ నాడార్ (రూ. 172,834.97కోట్లు) ఐదో ప్లేస్‌లో ఉన్నారు. ఈ సంవత్సరం విద్య సంబంధిత అవసరాల నిమిత్తం 662 మిలియన్ డాలర్లు విరాళంగా అందించడంతో ఆయన నికర విలువ భారీగా తగ్గింది. కానీ టాప్ 10లో తన ప్లేస్‌ను నిలుపుకోవడం విశేషం. సావిత్రి జిందాల్: ఓపీ జిందాల్ ఛైర్ పర్సన్ సావిత్రి జిందాల్ రూ. 132, 452.97 కోట్ల ఆదాయంతో ఆరో ప్లేస్ దక్కించుకున్నారు. దిలీప్ షాంఘ్వీ: సన్‌ఫార్మాసూటికల్స్ స్థాపకుడు దిలీప్ సంఘ్వీ రూ.125,184.21కోట్లుతో ఏడో స్థానాన్ని ఆక్రమించారు. హిందూజా బ్రదర్స్: హిందూజ బ్రదర్స్ (రూ.122,761.29కోట్లు) ఎనిమిదో ప్లేస్‌లో నిలిచారు. 1914లో పరమానంద్ దీప్‌చంద్ హిందూజా ప్రారంభించారు. నలుగురు బ్రదర్స్, శ్రీచంద్, గోపీచంద్, ప్రకాష్ , అశోక్ బహుళజాతి సమ్మేళనాన్ని నియంత్రిస్తున్నారు. కుమార్ బిర్లా: టెక్స్టైల్స్-టు-సిమెంట్ సమ్మేళనం ఛైర్మన్ ఆదిత్య బిర్లా గ్రూప్ నికర విలువ రూ.121,146.01 కోట్లు. బజాజ్ కుటుంబం: 40 కంపెనీల నెట్వర్క్ తో ఉన్న బజాజ్ గ్రూప్. రూ.117,915.45 కోట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. .1926లో ముంబయిలో జమ్నాలాల్ బజాజ్ వ్యాపారాన్ని ప్రారంభించారు. బజాజ్ ఆటో ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ద్విచక్ర, మూడు చక్రాల తయారీదారులుగా పాపులర్ అయింది. -
‘అదిరిందయ్యా అదానీ’..ప్రపంచ కుబేరుల జాబితాలో దూసుకెళ్తున్న గౌతమ్ అదానీ
ప్రముఖ బిలియనీర్ గౌతమ్ అదానీ మరో సరికొత్త రికార్డు సృష్టించారు. ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్‌ను అధిగమించారు. మూడు స్థానాన్ని కైవసం చేసుకున్నారు. గత రెండు వారాలుగా అమెరికన్ స్టాక్ మార్కెట్ వాల్ స్ట్రీట్‌లో నమోదైన కంపెనీల షేర్ల కంటే..అదానీ కంపెనీల షేర్లు లాభాల పంట పండించాయి. వెరసీ సోమవారం నాటికి అదానీ సంపదలోకి మరో 314 మిలియన్ డాలర్లు వచ్చి చేరగా..ఆయన మొత్తం సంపద 131.9 బిలియన్ డాలర్లకు చేరింది. ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో ప్రముఖ ఫ్యాషన్ సంస్థ లూయిస్ విట్టన్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ 156.5 బిలియన్ డాలర్ల నికర సంపదతో రెండో స్థానంలో ఉన్నారు. బెర్నార్డ్ ఆర్నాల్ట్ తర్వాతి స్థానంలో అదానీ నిలిచారు. అదానీకి కలిసొచ్చింది ఆర్ధిక పరమైన అంశాల్లో ఆర్బీఐ ఆచితూచి అడుగులు వేయడం, చమురు ధరలు తగ్గే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో మూడో వారంలో దేశీయ స్టాక్ సూచిలకు పై అంశాలు కలిసొచ్చాయి. సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లో షేర్లు భారీ లాభాలతో పరుగులు తీస్తున్నాయి. అదే సమయంలో అదానీ షేర్లు పుంజుకోవడం, ప్రపంచంలో ధనవంతుల జాబితాలో జెఫ్బెజోస్ను వెనక్కి నెట్టడం వెనువెంటనే జరిగిపోయాయి. బెజోస్ షాక్.. అదానీ రాక్ గత గురువారం అమెజాన్ చరిత్రలో అత్యంత దారుణమైన రికార్డులు నమోదయ్యాయి. సెలవులు, షాపింగ్ సీజన్ ఉన్నప్పటికీ అమెజాన్. కామ్ సేల్స్ తగ్గిపోయాయి. దీంతో ఆ ఒక్కరోజే మార్కెట్ ముగిసే సమయానికి అమెజాన్ షేర్లు 21 శాతానికి క్షీణించడంతో ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితాలో జెఫ్ బెజోస్ తన ఉనికిని కోల్పోతుండగా అదానీ ఒక్కొక్కరిని దాటుకుంటూ వెళుతున్నారు. స్టాక్ మార్కెట్లో గందర గోళం 126.9 బిలియన్ డాలర్ల సంపదతో ధనవంతుల జాబితాలో జెఫ్ బెజోస్‌ను అదానీ అధిగమించినప్పటికీ..ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న గందర గోళంతో ఫోర్బ్స్ జాబితాలోని ర్యాంకింగ్‌లు మారుతున్నాయి. బిలియనీర్ల మ్యూజికల్ చైర్ గేమ్ స్టాక్ మార్కెట్ల పనితీరుతో బెర్నార్డ్ ఆర్నాల్ట్, జెఫ్ బెజోస్ సంపదలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాటి ఆధారంగా ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో గౌతమ్ అదానీ మారుతోంది. అయినప్పటికీ ఈ ముగ్గురు బిలయనీర్ల మధ్య వ్యత్యాసం సుమారు 30 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇటీవలి వారాల్లో గౌతమ్ అదానీ, బెర్నార్డ్ ఆర్నాల్ట్, జెఫ్ బెజోస్ మధ్య మ్యూజికల్ చైర్ గేమ్ నడుస్తోంది. 2,3,4 ఇలా ధనవంతుల జాబితాల్లో వారి స్థానం కోసం పోటీపడుతున్నప్పటికీ ఎలాన్ మస్క్ మాత్రం 223.8 నికర సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ప్రథమ స్థానంలో దూసుకెళ్తున్నారు. -
India: అత్యధిక బిలియనీర్లు ఏ రంగం నుంచి ఉన్నారో తెలుసా?
దేశంలో లేదా ప్రపంచంలో సంపన్నుల లెక్క ఎప్పుడూ ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేస్తూ ఉంటుంది. అయితే.. మన దేశంలో ఏ రంగం నుంచి ఎక్కువ మంది బిలియనీర్లు వస్తున్నారన్న విషయం మీకు తెలుసా? అందుకే ఈసారి కొంచెం కొత్తగా.. ఈ ఏడాది అత్యధిక సంపన్నులు ఉన్న టాప్–10 వ్యాపార రంగాల గురించి తెలుసుకుందాం.. అది కూడా ఫోర్బ్స్ జాబితా ప్రకారమే.. వీటిని చూశాక.. హెల్త్ ఈజ్ వెల్త్‌కి.. మరో అర్థమూ మనకు దొరుకుతుందేమో.. ఎందుకంటే.. అత్యధిక బిలియనీర్లు ఆరోగ్య రంగం నుంచే ఉన్నారు మరి.. 1. వైద్య రంగం బిలియనీర్ల సంఖ్య: 29 అత్యంత ధనికుడు:సైరస్ పూనావాలా కంపెనీ: సైరస్ పూనావాలా గ్రూప్ వ్యవస్థాపకుడు, సీఎండీ. కోవిడ్ టీకాలు తయారు చేసిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ గ్రూప్ కంపెనీల్లో ఒకటి. ఆస్తుల నికర విలువ: సుమారు రూ.1.61 లక్షల కోట్లు 2. తయారీ రంగం బిలియనీర్ల సంఖ్య: 29 అత్యంత ధనికుడు: అశ్వన్ దనీ, కుటుంబం కంపెనీ: ఏసియన్ పెయింట్స్ లిమిటెడ్, నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆస్తుల నికర విలువ: సుమారు రూ. 58 వేల కోట్లు 3. ఫ్యాషన్ అండ్ రిటైల్ బిలియనీర్ల సంఖ్య: 16 అత్యంత ధనికుడు: రాధాకిషన్ దమానీ, కంపెనీ: డీమార్ట్ వ్యవస్థాపకుడు ఆస్తుల నికర విలువ: సుమారు రూ. 1.43 లక్షల కోట్లు 4. సాంకేతిక రంగం బిలియనీర్ల సంఖ్య: 13 అత్యంత ధనికుడు: శివ్ నాడర్ కంపెనీ: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, గౌరవ చైర్మన్ ఆస్తుల నికర విలువ: సుమారు రూ. 1.78 లక్షల కోట్లు 5. ఆర్థిక, బ్యాంకింగ్ బిలియనీర్ల సంఖ్య: 11 అత్యంత ధనికుడు: ఉదయ్ కోటక్, కంపెనీ: కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు, ఎండీ–సీఈవో ఆస్తుల నికర విలువ: సుమారు రూ. 1.08 లక్షల కోట్లు 6. ఆహారం– పానీయాలు బిలియనీర్ల సంఖ్య: 10 అత్యంత ధనికుడు: రవి జైపురియా కంపెనీ: ఆర్జే కార్ప్ లిమిటెడ్ చైర్మన్. పెప్సీకి సీసాలు తయారు చేసే సంస్థ. కేఎఫ్‌సీ, పిజ్జా హట్, కోస్టా కాఫీ వంటి సంస్థలకు ఫ్రాంచైజీ) ఆస్తుల నికర విలువ: సుమారు రూ. 52 వేల కోట్లు 7. వాహన తయారీ రంగం బిలియనీర్ల సంఖ్య: 9 అత్యంత ధనికులు: బజాజ్ సోదరులు (నీరజ్, మధూర్, శేఖర్), కంపెనీ: బజాజ్ గ్రూప్ ఆస్తుల నికర విలువ: సుమారు రూ. 54 వేల కోట్లు 8. స్థిరాస్తి రంగం బిలియనీర్ల సంఖ్య: 9 అత్యంత ధనికుడు: కుషల్పాల్ సింగ్ ఆస్తుల నికర విలువ: సుమారు రూ. 66 వేల కోట్లు 9. నిర్మాణ, ఇంజనీరింగ్ రంగం బిలియనీర్ల సంఖ్య: 5 అత్యంత ధనికుడు: రవి పిళ్లై కంపెనీ: ఆర్పీ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ ఆస్తుల నికర విలువ: సుమారు రూ.20 వేల కోట్లు 10. సేవా రంగం బిలియనీర్ల సంఖ్య: 4 అత్యంత ధనికులు: కపిల్, రాహుల్ భాటియా (తండ్రీకొడుకులు) కంపెనీ: ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు కపిల్ భాటియా, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ఎండీ రాహుల్ భాటియా. ఇండిగో సంస్థ సహవ్యవస్థాపకుడు ఆస్తుల నికర విలువ: సుమారు రూ. 35 వేల కోట్లు బిజినెస్ టైకూన్లు దేశంలో వివిధ రంగాలకు తమ వ్యాపారాలను విస్తరించిన దిగ్గజ వ్యాపారవేత్తల సంఖ్య 17కు చేరుకుంది. సుమారు రూ. 9.1 లక్షల కోట్ల సంపదతో గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. సుమారు రూ. 7 లక్షల కోట్లు సంపదతో ముకేశ్ అంబానీ రెండో స్థానంలో ఉండగా సుమారు రూ. 1.04 లక్షల కోట్లుతో కుమార్ మంగళం బిర్లా ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు. -
సంపన్నుల జాబితాలో కొత్త రికార్డులు..భారత్‌లోని టాప్-10 బిలియనీర్లు వీరే..!
భారత్‌లోని అత్యంత సంపన్నుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఫోర్బ్స్ విడుదల చేసిన బిలియనీర్ల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తర్వాతి స్థానంలో ఉండగా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్మన్ శివ నాడార్ మూడో స్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ 2022 జాబితాలో మొదటి మూడు ర్యాంకింగ్‌లు గత ఏడాదితో పోలిస్తే ఎలాంటి మార్పులేదు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం... ముకేష్ అంబానీ మొత్తం సంపద గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 7 శాతం పెరిగి 90.7 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత్‌లో అత్యధిక నికర విలువ కలిగిన వ్యక్తిగా కాకుండా ప్రపంచంలోని పదవ సంపన్నుడిగా ముకేష్ అంబానీ రికార్డు సృష్టించారు. ఫోర్బ్స్ జాబితాలో అంబానీ తర్వాతి స్థానంలో గౌతమ్ అదానీ, మొత్తం 90 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియాలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. కోవిడ్-19 వ్యాక్సినేషన్స్ ఉత్పత్తి చేస్తోన్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు సైరస్ పూనావాలా 24.3 బిలియన్ల డాలర్ల నికర విలువతో నాల్గవ స్థానంలో నిలిచారు. డీమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ 20 బిలియన్ డాలర్ల నికర విలువతో ఐదో స్థానంలో నిలిచారు. కాగా గత ఏడాది ప్రపంచంలోని 100 మంది సంపన్నుల జాబితాలోకి రాధాకిషన్ ప్రవేశించారు. స్టీల్ కంపెనీ ఆర్సెలర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ నికర విలువ 17.9 బిలియన్ డాలర్లతో ఆరో స్థానంలో... జిందాల్ గ్రూప్ మాతృక సావిత్రి జిందాల్ 17.7 బిలియన్ డాలర్ల నికర విలువతో ఏడో స్థానంలో, ఆదిత్య బిర్లా గ్రూప్ చీఫ్ కుమార్ బిర్లా 16.5 బిలియన్ డాలర్ల నికర విలువతో ఎనిమిదో స్థానంలో, సన్ ఫార్మాస్యూటికల్స్ హెడ్ దిలీప్ షాంఘ్వీ 15.6 బిలియన్ డాలర్ల నికర విలువతో తొమ్మిదో స్థానంలో, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కోటక్ 14 బిలియన్ డాలర్ల నికర విలువతో పదో స్థానంలో నిలిచారు. ఇక భారత్‌లో బిలియనీర్ల సంఖ్య గతేడాది 140గా ఉండగా ఇప్పుడు రికార్డు స్థాయిలో 166కు చేరుకుందని ఫోర్బ్స్ నివేదిక పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో 60కి పైగా కంపెనీలు దాదాపు 15.6 బిలియన్ డాలర్లను సమీకరించాయని ఫోర్బ్స్ వెల్లడించింది. చదవండి: ఐవోసి మాస్టర్ ప్లాన్.. అంబానీ, అదానీలే కాదు మేము వస్తున్నాం.. -
మళ్లీ ముకేశ్ టాప్
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి దేశీయంగా అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నారు. సుమారు 8,870 కోట్ల డాలర్ల (దాదాపు రూ. 6,56,000 కోట్లు) సంపదతో ఫోర్బ్స్ ఇండియా 2020 కుబేరుల లిస్టులో వరుసగా పదమూడోసారీ నంబర్ వన్‌గా నిల్చారు. గౌతమ్ అదానీ, శివ్ నాడార్ ఆ తర్వాత స్థానాలు దక్కించుకున్నారు. వంద మంది సంపన్నుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిలో దివీస్ ల్యాబ్స్ ఎండీ మురళి దివి, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ప్రమోటర్ల కుటుంబం, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ చైర్మన్ పీపీ రెడ్డి , అరబిందో ఫార్మా సహ వ్యవస్థాపకుడు పీవీ రామ్‌ప్రసాద్ రెడ్డి ఉన్నారు. కరోనా వైరస్ మహమ్మారి భారత్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ టాప్ 100 సంపన్నుల్లో సగం మంది సంపద గణనీయంగానే పెరిగిందని ఫోర్బ్స్ వెల్లడించింది. ‘వీరందరి సంపద గతేడాదితో పోలిస్తే 14 శాతం పెరిగి 51,700 కోట్ల డాలర్లకు చేరింది‘ అని పేర్కొంది. ముకేశ్ అంబానీ సంపద మరో 3,730 కోట్ల డాలర్లు పెరిగిందని వివరించింది. -
ఫోర్బ్స్ జాబితాలో మళ్లీ ముఖేష్..
సాక్షి, న్యూఢిల్లీ : ఫోర్బ్స్ 2020 భారత బిలియనీర్ల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ రూ 2.7 లక్షల కోట్ల సంపదతో అగ్ర స్ధానాన్ని నిలుపుకున్నారు. ఏడాది కిందటితో పోలిస్తే రూ 99,000 కోట్ల మేర ఆయన సంపద తరిగిపోయినా నెంబర్ వన్ స్ధానాన్ని ముఖేష్ నిలబెట్టుకున్నారు. ఇక స్టాక్‌మార్కెట్ కుదేలవుతున్నా రిటైల్ దిగ్గజం డీ మార్ట్ అధిపతి రాధాకృష్ణన్ దామాని రూ 1.3 లక్షల కోట్ల సంపదతో భారత్‌లో అత్యంత సంపన్నుల్లో రెండవ స్ధానంలో నిలిచారు. దామాని సంపద 25 శాతం పెరగడంతో ఈ జాబితాలో తొలిసారిగా ఆయన రెండో స్ధానానికి ఎగబాకారు. కోవిడ్-19 ప్రభావం వెంటాడినా దామాని సంపద ఎగబాకడం గమనార్హం. ఓవైపు స్లోడౌన్ సెగలు ఆపై కోవిడ్-19 లాక్డౌన్లతో 2020లో భారత సంపన్నుల రాబడి గణనీయంగా తగ్గిందని ఫోర్బ్స్ వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే భారత బిలియనీర్ల సంఖ్య 106 నుంచి 102కు తగ్గగా బిలియనీర్ల మొత్తం సంపద ఏకంగా 23 శాతం పడిపోయింది. చదవండి : ముఖేష్‌ను వెనక్కినెట్టిన జాక్‌మా ఇక హెచ్‌సీఎల్ వ్యవస్ధాపకుడు శివ్‌నాడార్ రూ 89,250 కోట్ల సంపదతో భారత బిలియనీర్ల జాబితాలో మూడవ స్ధానం దక్కించుకున్నారు. ఇక ఫోర్బ్స్ జాబితాలో నాలుగో అత్యంత భారత సంపన్నుడిగా రూ 78,000 కోట్ల సంపదతో ఉదయ్ కొటక్ నిలవగా, గౌతం ఆదాని రూ 66,700 కోట్లతో ఐదవ స్ధానంలో ఉండగా, టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ వ్యవస్ధాపకుడు సునీల్ మిట్టల్ రూ 67,000 కోట్ల సంపదతో ఆరో స్ధానంలో నిలిచారు. ఇక సైరస్ పూనావాలా, కుమార్ బిర్లా, ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్, అజీం ప్రేమ్‌జీ-దిలీప్ సంఘ్వీలు టాప్ 10 బిలియనీర్ల జాబితాలో చోటుదక్కించుకున్నారు. -
అక్షయ్ 2 రజనీ 13 ప్రభాస్ 44
ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజీన్ ప్రతి ఏడాది టాప్ 100 సెలబ్రిటీల జాబితాను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది విడుదల చేసిన ‘ఇండియన్ టాప్ 100’ సెలబ్రిటీల జాబితాలో సినీ రంగం నుంచి 293.25 కోట్ల ఆర్జనతో రెండో స్థానంలో నిలిచారు బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్. 2017లో నాలుగు, 2018లో మూడు స్థానాలను కైవసం చేసుకున్న అక్షయ్ ఈసారి మరో మెట్టు పైకి ఎక్కి రెండో స్థానం సంపాదించడం విశేషం. ఇక 2017, 2018 సంవత్సరాల్లో ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్న బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ 229.25 కోట్ల ఆర్జనతో ఈ ఏడాది మూడో స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఇంకా హిందీ పరిశ్రమ నుంచి అమితాబ్ బచ్చన్ (4,) షారుఖ్ ఖాన్ (6), రణ్వీర్ సింగ్ (7), ఆలియా భట్ (8), దీపికా పదుకోన్ (10) టాప్ టెన్ లిస్ట్‌లో చోటు సంపాదించుకున్నారు. ఇక వందకోట్ల సంపాదనతో ఈ జాబితాలో 13వ స్థానంలో నిలిచి దక్షిణాది స్టార్స్‌లో అందరికంటే ముందు ఉన్నారు రజనీకాంత్. గత ఏడాది ఫోర్బ్ జాబితాలో రజనీది 14వ స్థానం. ఈ ఏడాది ఏఆర్ రెహమాన్ 16, మోహన్‌లాల్ 27వ స్థానాల్లో నిలిచారు. మరోవైపు మన తెలుగు పరిశ్రమ నుంచి ఫోర్బ్స్ టాప్ 100 సెలబ్రిటీల జాబితాలో నిలిచిన వారిలో ప్రభాస్ ముందు వరుసలో ఉన్నారు. 2017లో 22వ స్థానం, గత ఏడాది అసలు ఈ లిస్ట్‌లోనే లేని ప్రభాస్ 2019 లిస్ట్‌లో 44వ ర్యాంక్‌లో నిలిచి టాలీవుడ్ హీరోల తరఫున ఈ లిస్ట్‌లో బోణీ కొట్టారు. ఇక 2017లో 37, 2018లో 33 ర్యాంకర్‌గా నిలిచిన మహేశ్‌బాబు ఈ ఏడాది 54వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇంకా 68వ స్థానంలో తాప్సీ, 77వ స్థానంలో త్రివిక్రమ్ నిలిచారు. ఇక క్రీడా రంగంలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నంబర్ వన్ స్థానంలో నిలిచారు. ఇతర స్టార్ క్రికెటర్స్ ఎమ్ఎస్. ధోనీ (05), సచిన్ టెండూల్కర్ (09) టాప్‌టెన్ జాబితాలో ఉన్నారు. మరో క్రికెటర్ రోహిత్ శర్మ 11వ స్థానంలో నిలిచారు. బ్యాడ్మింటన్ ప్లేయర్స్ పీవీ సింధు (63), సైనా నెహ్వాల్ (81) కూడా లిస్ట్‌లో ఉన్నారు. క్రికెటర్ మిథాలీ రాజ్ 88వ స్థానం దక్కించుకున్నారు. సెలబ్రిటీల క్రేజ్, ప్రింట్, సోషల్ మీడియాలో ఉన్న పాపులారిటీ వంటి కొన్ని అంశాల ఆధారంగా ఈ ర్యాంక్‌లు నిర్ణయించినట్లు ఫోర్బ్స్ ప్రతినిధులు తమ వెబ్సైట్లో పేర్కొన్నారు. అలాగే కొంతమంది సంపాదన అధికంగా ఉన్నప్పటికీ వారి ఫేమ్‌ని దృష్టిలో ఉంచుకుని ర్యాంక్‌లను కేటాయించినట్లు ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. ఆలియా భట్, దీపికా పదుకోన్, తాప్సీ -
ఫోర్బ్స్ కుబేరుడు మళ్లీ అంబానీయే
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత సంపన్నుడిగా వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వరుసగా 12వ ఏడాదీ అగ్రస్థానంలో నిల్చారు. టెలికం వెంచర్ జియో కార్యకలాపాలు గణనీయంగా విస్తరించిన నేపథ్యంలో ఆయన సంపద మరో 4.1 బిలియన్ డాలర్లు పెరిగి 51.4 బిలియన్ డాలర్లకు చేరింది. 2019కి సంబంధించి ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ ఈ మేరకు భారత్‌లో సంపన్నుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ .. ఎనిమిదో స్థానం నుంచి ఏకంగా రెండో స్థానానికి చేరారు. ఆయన సంపద విలువ 15.7 బిలియన్ డాలర్లుగా ఉంటుందని ఫోర్బ్స్ లెక్కగట్టింది. అదానీ గ్రూప్.. ఎయిర్‌పోర్టులు మొదలుకుని డేటా సెంటర్ల దాకా వివిధ వ్యాపార విభాగాల్లోకి కార్యకలాపాలు విస్తరించడం ఆయనకు కలిసివచ్చింది. 15.6 బిలియన్ డాలర్ల సంపదతో హిందుజా సోదరులు మూడో స్థానంలో ఉన్నారు. ఎకానమీ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఫోర్బ్స్ ఇండియా కుబేరుల మొత్తం సంపద గతేడాదితో పోలిస్తే 2019లో 8 శాతం క్షీణించి 452 బిలియన్ డాలర్లకు తగ్గింది. టాప్ 100 సంపన్నుల్లో సగం మంది నికర సంపద గణనీయంగా తగ్గింది. ► ఈసారి కనీసం 1.4 బిలియన్ డాలర్ల సంపద ఉన్న వారిని ఫోర్బ్స్ సంపన్నుల లిస్టులో చేర్చింది. గతేడాది ఇది 1.48 బిలియన్ డాలర్లు. ►2019 జాబితాలో ఆరుగురు కొత్తగా చోటు సాధించారు. అల్కెమ్ ల్యాబరేటరీస్‌కి చెందిన సింగ్ కుటుంబం, బైజు రవీంద్రన్ (బైజూస్), మహేంద్ర ప్రసాద్ (అరిస్టో ఫార్మా), మనోహర్ లాల్.. మధుసూదన్ అగర్వాల్ (హల్దీరామ్ స్నాక్స్), రాజేష్ మెహ్రా (జాక్వార్), సందీప్ ఇంజినీర్ (ఆస్ట్రల్ పాలీ టెక్నిక్) వీరిలో ఉన్నారు. పన్ను చెల్లించే కోటీశ్వరుల్లో 20 శాతం పెరుగుదల న్యూఢిల్లీ: పన్ను చెల్లించే ఆదాయం రూ.కోటికిపైగా కలిగి ఉన్న వ్యక్తుల సంఖ్య 2018–19లో 20 శాతం పెరిగి 97,689కు చేరుకుంది. 2017–18లో వీరి సంఖ్య 81,344గానే ఉండేది. కార్పొరేట్, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్), వ్యక్తుల గణాంకాలనూ కూడా కలిపి చూస్తే పన్ను వర్తించే ఆదాయం రూ.కోటిపైన ఉన్న రిటర్నుల సంఖ్య 2018–19లో 1.67 లక్షలకు చేరింది. 19 శాతం పెరిగింది. -
ఫోర్బ్స్ సంపన్నుల జాబితా : మళ్లీ ముఖేషే..
ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధినేత ముఖేష్ అంబానీ 2019 ఏడాదికిగాను ఫోర్బ్స్ ప్రకటించిన భారత్‌లో అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్ధానంలో నిలిచారు. 51.4 బిలియన్ డాలర్ల (రూ 3.85 లక్షల కోట్ల) విలువైన నికర ఆస్తులతో ముఖేష్ అంబానీ వరుసగా 12వ సారి భారత సంపన్నుల్లో టాప్ ప్లేస్‌ను దక్కించుకున్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఈ ఏడాది సంక్లిష్ట సంవత్సరమైనా ఆర్ఐఎల్ టెలికాం విభాగం జియో సత్తా చాటడంతో ముఖేష్ అంబానీ సంపదకు 400 కోట్ల డాలర్లు పైగా తోడయ్యాయని ఫోర్బ్స్ పేర్కొంది. ఇక ముఖేష్ తర్వాత బిజినెస్ దిగ్గజాలు గౌతం ఆదాని, హిందుజా బ్రదర్స్, పలోంజి మిస్త్రీ, బ్యాంకర్ ఉదయ్ కొటక్‌ల సంపద కూడా ఈ ఏడాది గణనీయంగా వృద్ధి చెంది వరుసగా రెండు నుంచి ఐదు స్ధానాల్లో నిలిచారని తెలిపింది. ఇంకా ఈ జాబితాలో టాప్ 10 స్ధానాల్లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధినేత శివ్‌నాడార్, అవెన్యూ సూపర్‌మార్ట్స్ అధినేత దమాని, గోద్రెజ్ కుటుంబం, పారిశ్రామిక దిగ్గజాలు కుమార మంగళం, బిర్లా ఫ్యామిలీలు నిలిచాయి. విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ టాప్ 17వ స్ధానం దక్కించుకున్నారు. -
మళ్లీ ముకేశ్ అంబానీ టాప్...
- ‘ఫోర్బ్స్’ భారతీయ బిలియనీర్లలో అగ్రస్థానం; సంపద 21 బిలియన్ డాలర్లు - ప్రపంచ జాబితాలో 39వ ర్యాంక్ వాషింగ్టన్: భారత బిలియనీర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మళ్లీ 8వ సారి అగ్రస్థానంలో నిలిచారు. 21 బిలియన్ డాలర్ల సంపదతో ఫోర్బ్స్ ప్రపంచ జాబితాలో ముకేశ్ 39వ స్థానంలో ఉన్నారు. సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ శాంఘ్వీ 20 బిలియన్ డాలర్లతో 44వ స్థానంలో ఉన్నారు. విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ 19 బిలియన్ డాలర్లతో 48వ స్థానంలో ఉన్నారు. ⇒ ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 79.2 బిలియన్ డాలర్ల సంపదతో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 16వ సారి అగ్ర స్థానంలో కొనసాగుతున్నారు. ఈయన తర్వాతి స్థానంలో 77.1 బిలియన్ డాలర్లతో మెక్సికన్ వ్యాపారవేత్త కార్లోస్ స్లిమ్ రెండో స్థానంలో, 72.7 బిలియన్ డాలర్లతో ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ మూడో స్థానంలో ఉన్నారు. ⇒ గతేడాది 1,645గా ఉన్న బిలియనీర్ల సంఖ్య ఈ ఏడాది 1.826కి పెరిగింది. ⇒ వీరి ఆస్తి విలువ మొత్తంగా 7.05 ట్రిలియన్ డాలర్లుకాగా, సగటు 3.86 బిలియన్ డాలర్లు. ⇒ ఆసియా-ఫసిఫిక్‌లో 562, యూఎస్‌లో 536, యూరప్‌లో 482 బిలియనీర్లు ఉన్నారు. ⇒ గతేడాది 172గా ఉన్న మహిళ బిలియనీర్ల సంఖ్య ఈ ఏడాది 197కు చేరింది. ⇒ అతి చిన్న వయసులో బిలియనీర్ల జాబి తాకెక్కిన వ్యక్తి స్నాప్‌చాట్ సీఈఓ ఈవన్ స్పీగెల్ (24). సంపద విలువ 1.5 బిలియన్ డాలర్లు.