ఇటీవల ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన 100 మంది అత్యంత సంపన్నుల జాబితాలో రిలయన్స్ ఛైర్మన్ 'ముకేశ్ అంబానీ' (Mukesh Ambani) అగ్రస్థానం పొందగా.. ఆఖరి (100వ) స్థానంలో కేపీఆర్ మిల్ ఛైర్మన్ 'రామసామి' (Ramasamy) నిలిచినారు. ఈ కథనంలో రామసామి ఎవరు? ఆయన సంపద ఎంత? అనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
ఆర్ధిక పరిస్థితుల కారణంగా కాలేజీ చదువును మధ్యలో ఆపేసిన ఒక రైతు కొడుకు నేడు భారతదేశంలోని 100 మంచి ధనవంతులలో ఒకడుగా నిలిచాడంటే చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఫోర్బ్స్ ఇండియా ప్రకారం, రామసామి మొత్తం ఆస్తుల విలువ 2.3 బిలియన్ డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 19133.7 కోట్లు).
వస్త్రాలు (టెక్స్‌టైల్స్), చక్కెర తయారీదారులో తమదైన రీతిలో ముందుకు సాగుతున్న KPR మిల్ ఫౌండర్ అండ్ ఛైర్మన్ 'రామసామి' ఫోర్బ్స్ జాబితాలో చేరిన కొత్త వ్యక్తి కావడం హర్షించదగ్గ విషయం.
ప్రస్తుతం ఈయన కంపెనీలలో సుమారు 25,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు, అందులో 90శాతం మంది మహిళా ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. వీరందరికి కరోనా మహమ్మారి సమయంలో కూడా పూర్తి జీతాలిచ్చి ఆదరించిన ఘనత రామసామి సొంతం.
ఇదీ చదవండి: రూ.5 వేలతో మొదలైన రూ.14000 కోట్ల కంపెనీ.. సామాన్యుడి సక్సెస్ స్టోరీ!
నేడు వందమంది ధనవంతుల జాబితాలో ఒకరుగా నిలిచిన రామసామి ప్రయాణం కేవలం రూ. 8,000 అప్పుతో మొదలైంది. ప్రతి ఏటా దాదాపు 128 మిలియన్ల వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్న కేపీఆర్ కంపెనీ సంవత్సరానికి వేలకోట్లు ఆర్జిస్తోంది. సంస్థ ఉత్పత్తి చేసే వస్త్రాలలో స్పోర్ట్స్‌వేర్ నుంచి స్లీప్‌వేర్ వరకు దాదాపు అన్ని లభిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment