Rich List
-
అంబానీను దాటేసిన అదానీ.. హురున్ రిచ్ లిస్ట్ విడుదల
దేశంలో అత్యంత సంపన్నుల జాబితాను హురున్ ఇండియా విడుదల చేసింది. అందులో గౌతమ్ అదానీ(62) మొదటి స్థానంలో నిలిచారు. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న ముఖేశ్ అంబానీ రెండో స్థానానికి చేరారు. ఆ లిస్ట్‌లో బాలివుడ్ స్టార్ షారుఖ్‌ఖాన్‌కు తొలిసారి చోటు దక్కింది.ఈ సందర్భంగా హురున్ ఇండియా వ్యవస్థాపకులు అనస్ రెహమాన్ జునైద్ మాట్లాడుతూ..‘రూ.11.6 లక్షల కోట్ల సంపదతో గౌతమ్ అదానీ(62) తన కుటుంబం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024లో టాప్‌లో నిలిచింది. గత ఏడాది భారత్‌లో ప్రతి ఐదు రోజులకు ఒక కొత్త బిలియనీర్ తయారయ్యాడు. చైనా బిలియనీర్ల సంఖ్య 25 శాతం పడిపోయింది. భారత్‌లో వీరి సంఖ్య 29% పెరిగింది. దాంతో దేశంలో రికార్డు స్థాయిలో బిలియనీర్ల సంఖ్య 334కు చేరింది. ఆసియా సంపద సృష్టిలో భారత వాటా అధికమవుతోంది’ అని తెలిపారు.హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 నివేదిక ప్రకారం..1. గౌతమ్ అదానీ, కుటుంబం: రూ.11.6 లక్షల కోట్లు2. ముఖేష్ అంబానీ, కుటుంబం: రూ.10.1 లక్షల కోట్లు 3. శివ్ నాడార్, కుటుంబం: రూ.3.1 లక్షల కోట్లు4. సైరస్ పునావాలా, కుటుంబం: రూ.2.89 లక్షల కోట్లు5. దిలిప్ సింఘ్వీ: రూ.2.49 లక్షల కోట్లు.6. కుమార్ మంగళం బిర్లా: రూ.2.35 లక్షల కోట్లు.7. గోపిచంద్ హిందుజా, కుటుంబం: రూ.1.92 లక్షల కోట్లు.8. రాధాకృష్ణ దమాని, కుటుంబం: రూ.1.90,900 కోట్లు.9. అజిమ్ ప్రేమ్‌జీ, కుటుంబం: రూ.1.90,700 కోట్లు.10. నిరజ్ బజాజ్, కుటుంబం: రూ.1.62 లక్షల కోట్లు2024 హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో తక్కువ వయసు ఉన్న వారిగా జెప్టో క్విక్ కామర్స్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు కైవల్య వోహ్రా(21) నిలిచారు.షారుఖ్ ఖాన్‌కు చోటుమొదటిసారిగా బాలివుడ్ నటుడు షారుఖ్ ఖాన్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో చోటు సంపాదించారు. ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌లో తాను వాటాలు కలిగి ఉండడంతో వాటి విలువ పెరిగింది. దాంతో మొత్తంగా రూ.7,300 కోట్లతో ఈ లిస్ట్‌లో స్థానం సంపాదించారు. -
లోక్‌సభ అభ్యర్థుల్లో31% సంపన్నులు... 20% నేరచరితులు
సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 30.8 శాతం మంది కోటీశ్వరులే. అలాగే 20 శాతం (1,643) మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. వారిలో 1,190 మందిపై అత్యాచారం, హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై నేరాల వంటి తీవ్రమైన కేసులున్నాయి. మొత్తం 8,360 మంది అభ్యర్థుల్లో 8,337 మంది అఫిడవిట్లను విశ్లేíÙంచిన మీదట అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు బుధవారం నివేదిక విడుదల చేశాయి. మొత్తం అభ్యర్థుల్లో 1,333 మంది జాతీయ పారీ్టల తరఫున, 532 మంది రాష్ట్ర పారీ్టల నుంచి, 2,580 మంది రిజిస్టర్డ్ పారీ్టల నుంచి బరిలో ఉన్నారు. 3,915 మంది స్వతంత్ర అభ్యర్థులు. మొత్తం 751 పారీ్టలు పోటీలో ఉన్నాయి. 2019లో 677 పార్టీలు, 2014లో 464, 2009 ఎన్నికల్లో 368 పారీ్టలు పోటీ చేశాయి. 2009 నుంచి∙2024 వరకు ఎన్నికల బరిలో నిలిచిన రాజకీయ పారీ్టల సంఖ్య 104% పెరిగింది. కాగా మరోసారి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన 324 మంది సిట్టింగ్ ఎంపీల సంపద గత ఐదేళ్లలో సగటున 43% పెరిగింది. పెరుగుతున్న మహిళాæ అభ్యర్థులు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళల సంఖ్య ఈసారీ స్వల్పంగానే ఉంది. కేవలం 797 మంది మాత్రమే బరిలో ఉన్నారు. అయితే గత మూడు లోక్‌సభ ఎన్నికల నుంచి వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2009లో 7 శాతం, 2014లో 8 శాతం, 2019లో 9 శాతం మహిళలు లోక్‌సభ బరిలో నిలవగా ఈసారి 10 శాతానికి చేరారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 69 మంది మహిళలకు, కాంగ్రెస్ 41 మందికి టికెట్లిచ్చాయి.సగానికి పైగా రెడ్ అలర్ట్ స్థానాలే...క్రిమినల్ కేసులున్న అభ్యర్థుల సంఖ్య 2019 లోక్‌సభ ఎన్నికల్లో 1,500 కాగా ఈసారి 1,643కు పెరిగింది. మొత్తం 440 మంది అభ్యర్థులలో 191 మంది నేర చరితులతో ఈ జాబితాలో బీజేపీ టాప్‌లో ఉంది. తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ (327 మందిలో 143), బీఎస్పీ (487 మందిలో 63), సీపీఎం (52 మందిలో 33) ఉన్నాయి. 3903 మంది స్వతంత్ర అభ్యర్థులలో 550 (14%) మంది నేర చరితులు. ఈ జాబితాలో టాప్ 5లో కేరళ నుంచి ముగ్గురు, తెలంగాణ, పశి్చమ బెంగాల్ నుంచి ఒక్కొక్కరున్నారు. ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది నేర చరితులున్న (రెడ్ అలర్ట్) స్థానాలు 2019లో 36 శాతం కాగా ఈసారి ఏకంగా 53 శాతానికి పెరిగాయి. ఈ జాబితాలో 288 నియోజకవర్గాలు చేరాయి. అంటే దేశవ్యాప్తంగా ప్రతి రెండు లోక్‌సభ సీట్లలో ఒకటి రెడ్ అలర్ట్ స్థానమే!సంపన్నుల్లో తెలుగు అభ్యర్థులే టాప్–2అభ్యర్థుల్లో కోటీశ్వరులు 2019లో 16 శాతం కాగా ఈసారి 27 శాతానికి పెరిగారు. మొత్తం అభ్యర్థులలో 2,572 మంది కోటీశ్వరులే! ఈ జాబితాలో కూడా బీజేపీయే టాప్‌లో నిలిచింది. 440 మంది బీజేపీ అభ్యర్థుల్లో 403 కోటీశ్వరులే. అంటే 91.6 శాతం! 2019లో ఇది 41.8 శాతమే. 327 మంది కాంగ్రెస్ అభ్యర్థులలో 292 మంది (89%), 487 మంది బీఎస్పీ అభ్యర్థులలో 163 మంది (33%), 52 మంది సీపీఎం అభ్యర్థులలో 27 మంది (52%) ), 3,903 మంది ఇండిపెండెంట్లలో 673 మంది (17%) మంది కోటీశ్వరులు. ఈ జాబితాలో తొలి, రెండో స్థానంలో తెలుగు అభ్యర్థులే ఉండటం విశేషం. ఏపీలోని గుంటూరు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఏకంగా రూ.5,705 కోట్లతో దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచారు. తెలంగాణలోని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి రూ.4568.22 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. – సాక్షి, న్యూఢిల్లీ -
అంతకంతకూ పెరిగిపోతున్న ఆస్తులు.. రిచ్‌లిస్ట్‌లో రిషి సునాక్ దంపతులు
ఇంతింతై.. వటుడింతై అన్న చందంగా యూకే ప్రధాని రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి వ్యక్తిగత సందప అంతకంతకూ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. రిషిసునాక్ దంపతుల వ్యక్తిగత ఆస్తి 120 మిలియన్ యూరోలకు పెరిగింది. ‘సండే టైమ్స్ రిచ్ లిస్ట్’ వార్షిక నివేదికను విడుదల చేసింది. ఆ వార్షిక నివేదికలో రిషి సునాక్ దంపతుల ఆస్తుల వివరాల్ని వెల్లడించింది. అయితే యూకేలో ఆర్ధిక అనిశ్చితి నెలకొన్న వారి ఆస్తులు పెరిగిపోతుండడం గమనార్హం.ఇన్ఫోసిస్‌లో2023లో రిషి సునాక్ దంపతుల సంపద 529 యూరోల నుంచి 651 మిలియన్ యూరోలకు చేరింది. ఈ మొత్తం సంపద పెరుగుదల ఇన్ఫోసిస్‌లోని వాటానే కారణమని సమాచారం. ఇన్ఫోసిస్‌లో అక్షతా మూర్తి వాటా విలువ 55.3 బిలియన్ యూరోలు. ఆమె షేర్ల విలువ 108.8 మిలియన్ యూరోలకు పెరగ్గా.. ఏడాది కాలానికి ఆ విలువ 590 యూరోలకు చేరింది. కింగ్ చార్లెస్ సంపదఇదిలా ఉండగా, కింగ్ చార్లెస్ సంపద ఏడాది కాలంలో పెరిగిందని, 600 మిలియన్ యూరోల నుండి 610 మిలియన్ యూరోలకు పెరిగినట్లు సండే టైమ్స్ రిచ్ లిస్ట్ నివేదించింది. అదే సమయంలో బ్రిటీష్ బిలియనీర్ల సంఖ్య తగ్గిపోయిందని ఈ నివేదిక హైలెట్ చేసింది. తగ్గిపోతున్న బిలియనీర్లు2022లో బిలియనీర్ల గరిష్ట సంఖ్య 177 కాగా.. ఈ ఏడాది 165కి పడిపోయింది. ఈ క్షీణతకు కారణం కొంతమంది బిలియనీర్లు అధిక రుణ రేట్లు కారణంగా వారి సంపద మంచులా కరిగిపోగా.. మరికొందరు దేశం విడిచిపెట్టారని బ్రిస్టల్ లైవ్ నివేదించింది .యూకేలోనూ భారతీయుల హవాబ్రిటన్లోని 350 మంది కుబేరులు ఉండగా.. ఆ కుటుంబాల మొత్తం సంపద 795.36 బిలియన్లుగా ఉందని తాజా గణాంకాలు చూపిస్తున్నాయి. ఈ సంవత్సరం యూకే బిలియనీర్ల జాబితాలో హిందుజా గ్రూప్ అధినేత గోపీచంద్ హిందూజా, అతని కుటుంబం నిలిచింది. హిందూజా కుటుంబం సంపద ఈ ఏడాది 35 బిలియన్ యూరోల నుండి 37.2 బిలియన్ యూరోలకు పెరిగింది. -
బ్లూం బెర్గ్ గ్లోబల్ సూపర్ రిచ్ క్లబ్లో భారతీయ కుబేరులు
ప్రపంచ దేశాల్లోని ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా 15 మంది కుభేరులు 100 బిలియన్ డాలర్ల సందపతో వరల్డ్ సూపర్ రిచ్ క్లబ్లో చేరినట్లు తెలుస్తోంది. బ్లూంబెర్గ్ నివేదిక ప్రకారం..ద్రవ్యోల్బణం, స్టాక్ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితిని అధిగమించి ఈ ఏడాది 15 మంది ఉన్న నికర విలువ 13 శాతం పెరిగి 2.2 ట్రిలియన్ డాలర్లకు చేరింది. వెరసి ప్రపంచంలోనే 500 మంది వద్ద ఉన్న సంపదలో దాదాపు నాలుగింట ఒకవంతు వీరివద్దే ఉంది. 15 మంది ఇంతకు ముందు 100 బిలియన్ డాలర్లు దాటినప్పటికీ, వారందరూ ఒకే సమయంలో ఆమొత్తానికి చేరుకోవడం ఇదే మొదటి సారి. ఇక వారిలో కాస్మోటిక్స్ దిగ్గజం ‘లో రియాల్’ సామ్రాజ్య వారసురాలు ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్, డెల్ టెక్నాలజీస్ ఫౌండర్ మైఖేల్ డెల్, మెక్సికన్ బిలియనీర్ కార్లోస్ స్లిమ్లు మొదటి ఐదునెలల్లో ఈ అరుదైన ఘనతను సాధించారు. 1998 నుంచి తమ కంపెనీ గత ఏడాది డిసెంబర్లో అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచిందంటూ బెటెన్‌కోర్ట్ మేయర్స్ తెలిపింది. ఆ తర్వాతే 100 బిలియన్ల సంపదను దాటారు. దీంతో బ్లూంబెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ జాబితాలో 100 బిలియన్ల నికర సంపదను దాటిన 15 మందిలో ఒకరుగా నిలిచారు. 14 స్థానంలో కొనసాగుతున్నారు.ఆ తర్వాత టెక్నాలజీ,ఏఐ విభాగాల్లో అనూహ్యమైన డిమాండ్ కారణంగా డెట్ టెక్నాలజీస్ షేర్లు లాభాలతో పరుగులు తీశాయి. ఫలితంగా డెల్ సంపద 100 బిలియన్ల మార్కును ఇటీవలే దాటింది. ఇప్పుడు 113 బిలియన్ల సంపదతో బ్లూమ్‌బెర్గ్ సంపద సూచికలో 11వ స్థానంలో ఉన్నారు.లాటిన్ అమెరికాలో అత్యంత ధనవంతుడు కార్లోస్ స్లిమ్ 13వ స్థానం, ఎల్వీఎంహెచ్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బెర్నార్డ్ ఆర్నాల్ట్‌కు తొలి స్థానం, అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ రెండవ స్థానం, ఎలాన్ మస్క్ 3వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఎలైట్ గ్రూప్‌లోకి భారత్ నుంచి ముఖేష్ అంబానీ గౌతమ్ అదానీ సైతం చోటు దక్కించుకోవడం గమనార్హం. -
సెల్ఫ్‌మేడ్ ఎంట్రప్రెన్యూర్స్ 2023 లిస్ట్ విడుదల.. ఆయనే టాప్..
ధనవంతులుగా ఎదగాలంటే తాతలు, తండ్రులు సంపాదించిన ఆస్తులు ఉండాలనేది ఒకప్పటి విధానం. కానీ ప్రస్తుతం ప్రజలకు ఉపయోగపడే ఆలోచన ఉండి దాన్ని కార్యరూపం దాల్చేలా చేసి వారి మన్ననలు పొందితే అదే డబ్బు సంపాదిస్తోందని చాలా మంది నిరూపిస్తున్నారు. తామకు తాము ఎలాంటి ‘గాడ్‌ఫాదర్’ లేకుండా కుబేరులుగా ఎదుగుతున్నారు. తాజాగా దేశంలో ధనవంతులైన ‘సెల్ఫ్‌మేడ్ ఎంట్రప్రెన్యూర్స్’ లిస్ట్ విడుదలైంది. అందులో డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ అగ్రస్థానంలో నిలిచారు. పేటీఎం, బొమాటో, క్రెడ్, జెరోధా, స్విగ్గీ, ఫ్లిప్‌కార్ట్, రాజొర్పే వంటి స్టార్ట్అప్లు స్థాపించిన యువ వ్యాపారవేత్తలు ఈ జాబితాలో చోటు సంపాదించారు. ఐడీఎఫ్సీ ఫస్ట్ సంస్థ ‘ఐడీఎఫ్సీ ఫస్ట్ ప్రైవేట్ హురున్ ఇండియా టాప్ 200 సెల్ఫ్-మేడ్ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ది మిలీనియం 2023' లిస్ట్‌ను విడుదల చేసింది. అందులో డీమార్ట్ కంపెనీ అవెన్యూ సూపర్మార్ట్స్తో కలిసి రూ.2,38,188 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో దమానీ మొదటిస్థానంలో నిలిచారు. ఫ్లిప్‌కార్ట్(రూ.1,19,472 కోట్లు)కు చెందిన బిన్నీ-సచిన్ బన్సాల్, జొమాటో(రూ.86,835 కోట్లు) దీపిందర్ గోయల్, డ్రీమ్ 11(రూ. 66,542 కోట్లు)కు చెందిన భవిత్ షేత్ వరుసగా తరువాతి స్థానాల్లో ఉన్నారు. రోజర్‌పే వ్యవస్థాపకులు హర్షిల్ మాథుర్ & శశాంక్ కుమార్, మాక్స్ హెల్త్‌కేర్ ఇన్స్టిట్యూట్-అభయ్ సోయి, పేటీఎం-విజయ్ శేఖర్ శర్మ, క్రెడ్-కునాల్ షా, జెరోధా-నితిన్ కామత్ & నిఖిల్ కామత్‌లు ఈ లిస్ట్‌లో చోటు సంపాదించారు. ఈ లిస్ట్‌లో వయసు పైబడినవారిలో వరుసగా అశోక్ సూత(80)-హ్యాపీయెస్ట్ మైండ్స్, నరేష్ ట్రెహాన్-మెదంటా(77), అశ్విన్ దేశాయ్ (72)-ఏథర్స్, జైతీర్థరావు (71)-హోమ్‌ఫస్ట్ ఉన్నారు. ఇదీ చదవండి: ‘చైనాను చూసి నేర్చుకోండి’.. మరోసారి ఇన్ఫోసిస్ మూర్తి షాకింగ్ కామెంట్స్ మరోవైపు ధనవంతుల జాబితాలో అత్యంత పిన్న వయసు కలిగినవారిలో జెప్టోకు చెందిన కైవల్య వోహ్రా(21), భారత్‌పే-నక్రానీ (25), జు పీ-దిల్షేర్ మల్హి(27), సిద్ధాంత్ సౌరభ్(28), ఓయో-రితేష్ అగర్వాల్(29) ఉన్నారు. ఈ జాబితాలో చోటుసాధించిన మహిళల్లో అతి పిన్న వయస్కుల జాబితాలో మామఎర్త్కు చెందిన గజల్ అలఘ్ (35), విన్జో-సౌమ్య సింగ్ రాథోడ్ (36), ప్రిస్టిన్ కేర్-గరిమా సాహ్నీ(37) మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. -
ధనవంతుల జాబితాలో రైతు బిడ్డ - సంపద తెలిస్తే అవాక్కవుతారు!
ఇటీవల ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన 100 మంది అత్యంత సంపన్నుల జాబితాలో రిలయన్స్ ఛైర్మన్ 'ముకేశ్ అంబానీ' (Mukesh Ambani) అగ్రస్థానం పొందగా.. ఆఖరి (100వ) స్థానంలో కేపీఆర్ మిల్ ఛైర్మన్ 'రామసామి' (Ramasamy) నిలిచినారు. ఈ కథనంలో రామసామి ఎవరు? ఆయన సంపద ఎంత? అనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఆర్ధిక పరిస్థితుల కారణంగా కాలేజీ చదువును మధ్యలో ఆపేసిన ఒక రైతు కొడుకు నేడు భారతదేశంలోని 100 మంచి ధనవంతులలో ఒకడుగా నిలిచాడంటే చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఫోర్బ్స్ ఇండియా ప్రకారం, రామసామి మొత్తం ఆస్తుల విలువ 2.3 బిలియన్ డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 19133.7 కోట్లు). వస్త్రాలు (టెక్స్టైల్స్), చక్కెర తయారీదారులో తమదైన రీతిలో ముందుకు సాగుతున్న KPR మిల్ ఫౌండర్ అండ్ ఛైర్మన్ 'రామసామి' ఫోర్బ్స్ జాబితాలో చేరిన కొత్త వ్యక్తి కావడం హర్షించదగ్గ విషయం. ప్రస్తుతం ఈయన కంపెనీలలో సుమారు 25,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు, అందులో 90శాతం మంది మహిళా ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. వీరందరికి కరోనా మహమ్మారి సమయంలో కూడా పూర్తి జీతాలిచ్చి ఆదరించిన ఘనత రామసామి సొంతం. ఇదీ చదవండి: రూ.5 వేలతో మొదలైన రూ.14000 కోట్ల కంపెనీ.. సామాన్యుడి సక్సెస్ స్టోరీ! నేడు వందమంది ధనవంతుల జాబితాలో ఒకరుగా నిలిచిన రామసామి ప్రయాణం కేవలం రూ. 8,000 అప్పుతో మొదలైంది. ప్రతి ఏటా దాదాపు 128 మిలియన్ల వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్న కేపీఆర్ కంపెనీ సంవత్సరానికి వేలకోట్లు ఆర్జిస్తోంది. సంస్థ ఉత్పత్తి చేసే వస్త్రాలలో స్పోర్ట్స్‌వేర్ నుంచి స్లీప్వేర్ వరకు దాదాపు అన్ని లభిస్తాయి. -
‘ఫోర్బ్స్’ కుబేరుల్లోనూ అంబానీకే పట్టం
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ దేశీ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో నిల్చారు. 2023 సంవత్సరానికి గాను భారత్‌లోని 100 మంది సంపన్నులతో ఫోర్బ్స్ రూపొందించిన జాబితాలో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. ఆయన సంపద 92 బిలియన్ డాలర్లుగా ఉంది. మరోవైపు గతేడాది అంబానీని కూడా దాటేసిన అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ ఈసారి 68 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిల్చారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల దెబ్బతో అదానీ గ్రూప్ సంస్థల షేర్లు కుదేలవడంతో ఆయన సంపద 82 బిలియన్ డాలర్ల మేర కరిగిపోవడం ఇందుకు కారణం. ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చీఫ్ శివ నాడార్ 29.3 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను విడగొట్టి, లిస్టింగ్ చేయడంతో పాటు తన ముగ్గురు సంతానానికి రిలయన్స్ బోర్డులో చోటు కల్పించడం ద్వారా ముకేశ్ అంబానీ వారసత్వ ప్రణాళికను పటిష్టంగా అమలు చేసినట్లు ఫోర్బ్స్ పేర్కొంది. అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లకు భారత్ ఒక హాట్‌స్పాట్‌గా ఉంటోందని తెలిపింది. కుబేరుల సంపద మరింతగా పెరగడంతో, టాప్ 100 లిస్టులోకి చేరాలంటే కటాఫ్ మార్కు 2.3 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఆసియా వెల్త్ ఎడిటర్ నాజ్నీన్ కర్మాలీ వివరించారు. భారత్‌లోని 100 మంది కుబేరుల మొత్తం సంపద ఈ ఏడాది 799 బిలియన్ డాలర్లుగా ఉంది. వ్యక్తి ర్యాంకు సంపద (బి.డాలర్లలో) ముకేశ్ అంబానీ 1 92 గౌతమ్ అదానీ 2 68 శివ నాడార్ 3 29.3 సావిత్రి జిందాల్ 4 24 రాధాకిషన్ దమానీ 5 23 సైరస్ పూనావాలా 6 20.7 హిందుజా కుటుంబం 7 20 దిలీప్ సంఘ్వి 8 19 కుమార బిర్లా 9 17.5 షాపూర్ మిస్త్రీ, కుటుంబం 10 16.9 తెలుగువారిలో మురళి దివి 33 6.3 పి.పి. రెడ్డి, పీవీ కృష్ణారెడ్డి 54 4.05 ‘డాక్టర్ రెడ్డీస్’ కుటుంబం 75 3 ప్రతాప్ రెడ్డి 94 2.48 పీవీ రామ్‌ప్రసాద్‌రెడ్డి 98 2.35 -
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతులు ఎవరంటే..
Hurun India Rich List: దేశవ్యాప్తంగా ఉన్న ధనవంతుల జాబితాను 360 వన్ వెల్త్ అండ్ హురూన్ ఇండియా విడుదల చేసింది. దేశంలో అత్యంత ధనవంతుడిగా ముకేశ్ అంబానీ నిలిచారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి 105 మంది ఇందులో చోటు సంపాదించారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గతేడాది టాప్‌లో నిలిచిన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ రెండో స్థానంలోకి చేరారు. ఆగస్టు చివరి నాటికి ఆయా వ్యక్తుల సంపద ఆధారంగా భారత్‌లోని 138 నగరాల నుంచి మొత్తం 1319 మంది హురూన్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు. వీటిల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 105 మంది ఉన్నారు. వీరిలో అయిదుగురు మహిళలకు స్థానం దక్కింది. మొత్తం అందరి సంపద విలువ ఏకంగా రూ.5.25 లక్షల కోట్లు. గతేడాదితో పోలిస్తే వీరి సంపద ఏకంగా 33 శాతం పెరగడం విశేషం. ఈ 105 మందిలో 87 మంది హైదరాబాద్ వారే కావడం గమనార్హం. కొత్తగా 33 మంది ఇందులో చోటు సంపాదించారు. వీరి ద్వారానే మొత్తం రూ.76 వేల కోట్లు జమైనట్లు తెలిసింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 12 మంది బిలియనీర్లు ఉన్నారు. దివీస్ మురళి రూ. 55,700 కోట్ల సంపదతో అగ్రస్థానంలో నిలిచారు. మేఘా ఇంజినీరింగ్‌కు చెందిన పిచ్చి రెడ్డి రూ.37,300 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. మేధా సర్వో డ్రైవ్స్ నుంచి అయిదుగురు ఈ లిస్ట్‌లో ఉన్నారు. హెటెరో ల్యాబ్స్ జి.పార్థసారధి రెడ్డి కుటుంబం రూ.21,900 కోట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. అరబిందో ఫార్మా నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీవీ రామ్‌ప్రసాద్ రెడ్డి రూ. 21,000 కోట్ల సంపద, అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ రెడ్డి కుటుంబం రూ.20,900 కోట్లు, మైహోం ఇండస్ట్రీస్ జూపల్లి రామేశ్వరరావు సంపద రూ.17,500 కోట్లుతో తరువాత స్థానాల్లో నిలిచారు. మహిళల్లో మహిమా దాట్ల మొదటి స్థానంలో నిలిచారు. ఈమె సంపద రూ.5700 కోట్లు. -
బిలియనీర్లు C/O బుల్లి పట్టణాలు
సాక్షి, అమరావతి: సంపద సృష్టిలో చిన్న పట్టణాలు పెద్ద నగరాలతో పోటీపడుతూ తగ్గేదేలేదంటున్నాయి. దేశవ్యాప్తంగా రూ.వెయ్యి కోట్లకు పైగా సంపద కలిగిన వారిలో 178 మంది చిన్న పట్టణాల్లోనే నివసిస్తున్నట్టు ఐఐఎఫ్ఎల్ హూరన్ ఇండియా రిచ్ లిస్ట్–2022 నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా రూ.వెయ్యి కోట్లపైగా సంపద కలిగిన వారు 1,103 మంది ఉండగా.. అందులో 178 మంది చిన్న పట్టణాలకు చెందిన వారేనని వెల్లడించింది. ఈ 178 మంది కలిసి రూ.6,37,800 కోట్ల సంపదను సృష్టించారు. అత్యధికంగా గుజరాత్లో 38 మంది బిలియనీర్లు చిన్న పట్టణాల్లో ఉంటే.. తమిళనాడులో 29 మంది బిలియనీర్లు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు పట్టణాల్లో ఆరుగురు బిలియనీర్లు ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. చిన్న పట్టణాల్లో అత్యధికంగా గుజరాత్‌లోని సూరత్‌లో 19 మంది బిలియనీర్లు నివసిస్తున్నారు. ఈ 19 మంది కలిసి రూ.51 వేల కోట్ల సంపద సృష్టించారు. ఆ తర్వాత తమిళనాడులోని కోయంబత్తూర్‌లో 14మంది కలిసి రూ.38,200 కోట్ల సంపద కలిగి ఉన్నారు. రాజస్థాన్‌లోని రాజ్‌కోట్‌లో ఏడుగురు, పంజాబ్‌లోని లుథియానాలో ఏడుగురు బిలియనీర్లు ఉన్నారు. నగరాల్లో చూస్తే ఒక్క ముంబైలోనే అత్యధికంగా 283 మంది బిలియనీర్లు నివసిస్తున్నారు. ఆ తర్వాత స్థానంలో ఢిల్లీలో 185 మంది, బెంగళూరులో 89 మంది బిలియనీర్లు నివసిస్తున్నారు. హైదరాబాద్‌లో 64 మంది, చెన్నైలో 51 మంది బిలియనీర్లు నివసిస్తున్నారు. పట్టణాల్లో సూరత్.. త్రిసూర్ సంపద విలువ పరంగా చూస్తూ సూరత్, త్రిస్సూర్, కోయంబత్తూర్ పట్టణాలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. సూరత్‌లో 19 మంది బిలియనీర్లు రూ.51 వేల కోట్ల సంపదను కలిగి ఉంటే త్రిస్సూర్‌లో నలుగురు బిలియనీర్లు రూ.40 వేల కోట్ల సంపద కలిగి ఉన్నారు. కోయంబత్తూర్‌లో 14 మంది రూ.38,200 కోట్ల సంపదను, హరిద్వార్‌లో ఒకరే రూ.32,400 కోట్ల సంపదను కలిగి ఉన్నారు. కేరళలోని పట్టణాల్లో బిలియనీర్ల సగటు సంపద విలువ ఇతర రాష్ట్రాల కంటే అత్యధికంగా ఉంది. ఎర్నాకుళంలో నలుగురు కలిసి రూ.18,800 కోట్లు, కొట్టాయంలో ఒకరే రూ.8,600 కోట్లు, తిరువనంతపురంలో ముగ్గురు కలిసి రూ.10,800 కోట్ల సంపద కలిగి ఉన్నారు. మన రాష్ట్రంలో ఆరుగురు మన రాష్ట్రం విషయానికి వస్తే.. విశాఖలో అత్యధికంగా ముగ్గురు బిలియనీర్లు ఉన్నారు. ఆ ముగ్గురి సంపద విలువ రూ.7,100 కోట్లు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రూ.వెయ్యి కోట్ల సంపదతో ఒకరు, విజయవాడలో రూ.3,600 కోట్ల సంపద కలిగిన ఒకరు, తిరుపతిలో రూ.2,800 కోట్ల సంపదతో ఒకరు ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. -
కుబేరుల్లో ఒకే ఒక్కడు అంబానీ! 23వ స్థానానికి అదానీ
న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వ్యవహారంతో పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ సంపద భారీగా కరిగిపోవడంతో.. అంతర్జాతీయంగా టాప్ 10 కుబేరుల్లో భారత్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఒక్కరే చోటు దక్కించుకున్నారు. 82 బిలియన్ డాలర్ల సంపదతో ఆయన తొమ్మిదో స్థానంలో నిలవగా 53 బిలియన్ డాలర్ల సంపదతో అదానీ 23వ స్థానానికి పరిమితమయ్యారు. డాలర్ల మారకంలో సంపదను లెక్కిస్తూ రీసెర్చ్ సంస్థ హురున్, రియల్ ఎస్టేట్ గ్రూప్ ఎం3ఎం కలిసి రూపొందించిన ’2023 గ్లోబల్ రిచ్ లిస్ట్’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అంబానీ మూడోసారి టైటిల్ నిలబెట్టుకున్నారు. వ్యాపారవేత్తల దృష్టికోణం నుంచి ప్రస్తుత ప్రపంచ ఎకానమీ పరిస్థితులను ఆవిష్కరించేలా ఈ జాబితా ఉందని హురున్ ఇండియా ఎండీ అనాస్ రెహ్మాన్ జునైద్ తెలిపారు. క్షీణతలో బెజోస్ టాప్.. ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్.. అత్యధికంగా సంపద పోగొట్టుకున్న వారి లిస్టులో టాప్‌లో నిల్చారు. ఆయన సంపద 70 బిలియన్ డాలర్లు పడిపోయి 118 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అంబానీ, అదానీ కలిసి పోగొట్టుకున్న సంపద కన్నా ఇది ఎక్కువ కావడం గమనార్హం. హురున్ రిపోర్ట్ ప్రకారం ఇలా భారీగా పోగొట్టుకున్న వారి లిస్టులో బెజోస్ అగ్రస్థానంలో ఉండగా.. అదానీ 6, అంబానీ 7వ ర్యాంకుల్లో నిల్చారు. 2022–23లో అదానీ సంపద 35 శాతం పడిపోయింది. 28 బిలియన్ డాలర్ల మేర (రోజుకు రూ. 3,000 కోట్లు చొప్పున) క్షీణించి మార్చి మధ్య నాటికి 53 బిలియన్ డాలర్లకు తగ్గింది. అంబానీ సంపద కూడా క్షీణించినప్పటికీ తగ్గుదల 20 శాతానికే పరిమితమైంది. అదానీ గ్రూప్ సంస్థల ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికాకు చెందిన షార్ట్‌సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల తదనంతర పరిణామాలతో గౌతమ్ అదానీ సంపద భారీగా కరిగిపోయిన సంగతి తెలిసిందే. మరిన్ని విశేషాలు.. ► 2023 గ్లోబల్ రిచ్ లిస్ట్‌లో సంపన్నుల సంఖ్య 3,112కు తగ్గింది. గతేడాది ఇది 3,384గా ఉంది. వారి మొత్తం సంపద 10 శాతం తగ్గి 13.7 లక్షల కోట్ల డాలర్లకు పరిమితమైంది. ► గతేడాదితో పోలిస్తే భారత్‌లో బిలియనీర్ల సంఖ్య 28 తగ్గి 187కి చేరింది. ముంబైలో అత్యధికంగా 66 మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను పరిగణనలోకి తీసుకుంటే బిలియనీర్ల సంఖ్య 217గా ఉంది. మొత్తం కుబేరుల సంపదలో భారత్ వాటా 5 శాతంగా ఉంది. కాగా, అమెరికా వాటా అత్యధికంగా 32 శాతంగా ఉంది. భారత్‌తో పోలిస్తే చైనాలో బిలియనీర్ల సంఖ్య అయిదు రెట్లు అధికంగా ఉండటం గమనార్హం. ► భారత్‌లో 10 మంది మహిళా బిలియనీర్లు ఉన్నారు. సాఫ్ట్వేర్, సర్వీసుల విభాగంలో స్వయంకృషితో బిలియనీరుగా ఎదిగిన వారిలో 4 బిలియన్ డాలర్ల సంపదతో రాధా వెంబు రెండో స్థానంలో నిల్చారు. దివంగత ఇన్వెస్ట్మెంట్ గురు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా సతీమణి రేఖా ఈసారి కుబేరుల లిస్టులో స్థానం దక్కించుకున్నారు. -
భారత్‌లో అత్యంత సంపన్న మహిళ.. 'రోష్ని నాడార్' ఆస్తి ఎంతో తెలుసా?
ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం కొటక్ మహీంద్రా - హురున్ ఇండియా సంస్థలు సంయుక్తంగా భారత్‌లోనే అత్యంత సంపన్నులైన 100 మంది మహిళల జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో రోష్ని నాడార్, ఫల్గుణి నాయర్లు వరుస స్థానాల్ని దక్కించుకున్నారు. ♦ సంపన్నుల జాబితాలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్ పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా నికర సంపద 54 శాతం పెరిగి రూ.84,330కోట్లతో తొలిస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ♦ బ్యాంకింగ్ రంగం నుంచి అనూహ్యంగా నైకా పేరుతో కాస్మోటిక్స్ రంగంలో రాణిస్తున్న ఫల్గుణి నాయర్ రూ.57,520 కోట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఏడాదిలో ఆమె వెల్త్ 963 శాతం పెరిగినట్లు విడుదలైన నివేదిక పేర్కొంది. ♦ బయోకాన్ ఛైర్ పర్సన్ కిరణ్ మంజుదార్ షా వెల్త్ 21శాతం తగ్గి రూ.29,030 కోట్లతో మూడవ స్థానంలో నిలిచారు. హైదరాబాద్‌లో 12మంది మహిళలు మహిళా సంపన్నుల జాబితాలో అత్యధికంగా ఢిల్లీ నుంచి 25 మంది, ముంబై నుంచి 21మంది ,హైదరాబాద్ నుంచి 12 మంది ఉన్నారు. భారతదేశంలోని టాప్ - 100 మంది ధనవంతులైన మహిళలలో ఫార్మాస్యూటికల్స్ రంగం నుంచి 12 మంది, హెల్త్‌కేర్ నుంచి 11 మంది, కన్స్యూమర్ గూడ్స్ రంగం నుంచి 9 మంది మహిళలున్నారు. హైదరాబాద్‌లో దివీస్ లాబోరేటరీస్ డైరక్టర్ నీలిమా రూ.28,180కోట్లతో తొలిస్థానంలో నిలిచారు. ఆ తర్వాత రూ.5,530కోట్లతో బయోలాజికల్ ఇ.లిమిటెడ్ ఎండీ మహిమా దాట్ల, రూ.2,740కోట్లతో శోభన కామినేని తర్వాతి స్థానాల్లో ఉన్నారు. చివరిగా భోపాల్ జెట్‌సెట్‌గోకు చెందిన 33ఏళ్ల కనికా తెక్రివాల్ 50 శాతం సంపదతో రూ.420 కోట్లతో జాబితాలో అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచారు. సంస్థల్లో ఉన్నత స్థాయిలో.. సంపన్నుల జాబితాలో ఆయా సంస్థల్లో ఉన్నత స్థానాల్లో విధులు నిర్వహించిన మహిళలు సైతం ఉన్నారు. వారిలో మాజీ పెప్సికో సీఈవో ఇంద్రా నూయి రూ. 5,040 కోట్లు, హెచ్డీఎఫ్సీ మేనేజింగ్ డైరెక్టర్‌గా రేణు సుద్ కర్నాడ్ రూ. 870 కోట్లు, కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రెసిడెంట్ శాంతి ఏకాంబరం రూ.320 కోట్లతో వరుస స్థానాల్ని కైవసం చేసుకున్నారు. -
ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో ఇండో-అమెరికన్ మహిళలు!
ఫోర్బ్స్ అమెరికా రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమెన్స్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఐదుగురు ఇండో- అమెరికన్ మహిళలు చోటు దక్కించుకున్నారు. భారతీయ మూలాలున్న మహిళలు ఆయా రంగాల్లో రాణించడమే కాదు.. దిగ్గజ సంస్థల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. ఫోర్బ్స్ అమెరికా రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమన్ జాబితాలో నిలిచిన వారిలో జయశ్రీ ఉల్లాల్,నీర్జా సేథి,నేహా నార్ఖడే,ఇంద్ర నూయి,రేష్మా శెట్టిలు ఉన్నారు. జయశ్రీ ఉల్లాల్ అమెరికా రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమన్ జాబితాలో 15వ స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆమె అరిస్టా నెట్వర్క్స్ సీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత అరిస్టా నెట్వర్క్స్ కోఫౌండర్‌గా నీర్జా సేథి 24 ర్యాంకు దక్కించుకున్నారు. ఇక మాజీ పెప్సికో సీఈవోగా ఇంద్రా నూయి ఫోర్బ్స్ జాబితాలో 85వ స్థానం దక్కింది. జింగో బయోవర్క్స్ కో-ఫౌండర్‌గా ఉన్న రేష్మా శెట్టి ఫోర్బ్స్ విడుదల చేసిన అమెరికా రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమెన్ జాబితాలో 97వ స్థానంలో నిలిచారు. వారి ఆస్తులు ఎంతంటే ♦జయశ్రీ ఉల్లాల్ పోర్బ్స్ విడుదల చేసిన అమెరికాలో సెల్ఫ్ మేడ్ బిలియనిర్ల జాబితాలో 15వ స్థానం దక్కించుకున్న ఆమె..1.9 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో నిలిచారు. 2018 నుంచి అరిస్టా నెట్వర్క్స్ సీఈవోగా పనిచేస్తున్న జయశ్రీ ఆ సంస్థలో 5శాతం వాటా ఉన్నారు. ♦ఫోర్బ్స్ విడుదల చేసిన మహిళా ధనవంతుల జాబితాలో 24వ స్థానాన్ని కైవసం చేసుకున్న నీర్జా సేథి టోటల్ నెట్ వర్త్ 1 బిలియన్ డాలర్లగా ఉంది.1980లలో అమెరికా మిచిగాన్ నగరం ట్రాయ్‌లో సొంత అపార్ట్ మెంట్లో భర్త భరత్ దేశాయ్‌తో కలిసి ప్రారంభ పెట్టుబడి 2వేల డాలర్లతో ఐటీ కన్సల్టింగ్, ఔట్ సోర్సింగ్ సంస్థ సింటెల్‌ను ప్రారంభించారని ఫోర్బ్స్ తన నివేదికలో పేర్కొంది. ♦సంస్థ కో-ఫౌండర్‌గా, మాజీ సీటీవోగా పనిచేస్తున్న నేహా నార్ఖడే 490 బిలియన్ డాలర్లతో ఫోర్బ్స్ జాబితాలో 57వ స్థానాన్ని దక్కించుకున్నారు. పూణేకి చెందిన నేహా జార్జీయా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ చదివారు. ఆమె విద్యాభ్యాసం తర్వాత లింక్డిన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేశారు. ♦మాజీ పెప్సికో సీఈవోగా ఉన్న ఇంద్రా నూయి 320 మిలియన్ల డాలర్లతో ఫోర్బ్స్ బిలియనిర్ల జాబితాలో 85వ స్థానం దక్కించుకున్నారు. ♦చివరిగా 220 మిలియన్ డాలర్లతో జింగో బయోవర్క్స్ కో-ఫౌండర్‌గా ఉన్న రేష్మా శెట్టి.. ఫోర్బ్స్ విడుదల చేసిన అమెరికా రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమెన్ జాబితాలో 97వ స్థానంలో నిలిచారు. 2009లో రేష్మా శెట్టి భర్త బ్యారీ కాంన్టాన్తో పాటు మరో నలుగురు భాగస్వాములతో కలిసి సింతటిక్ బయో టెక్నాలజీ కంపెనీ జింగో బయోవర్క్స్ను నెలకొల్పారు. -
వారెన్ బఫెట్‌కు భారీ షాక్! రికార్డులన్నీ తొక్కుకుంటూ పోతున్న అదానీ!
వెలుగులు నింపే విద్యుత్ నుంచి వంటనూనె దాకా. పోర్ట్‌ల నుంచి వంట గ్యాస్ వరకు ఇలా ప్రతిరంగంలో తనదైన ముద్రవేస్తూ దూసుకెళ్తున్నారు. పట్టిందల్లా బంగారమే అన్నట్లు.. ప్రతి రంగంలోనూ అదానీకి విజయమే వరిస్తుంది. ఎక్కడైనా అవకాశం ఉంటే..అడ్రస్ కనుక్కొని వెళ్లి మరీ దాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.అందుకే తనని అందుకోవాలనే ఆలోచన కూడా ప్రత్యర్ధులకు రానంతగా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ధనవంతుల జాబితాల్లో ఒక్కొక్కరిని వెనక్కి నెట్టేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచంలోనే ఆసియా రిచెస్ట్ పర్సన్ జాబితాలో 6వ స్థానాన్ని దక్కించుకున్న ఆయన..తాజాగా మరో మైలురాయిని చేరుకున్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ కథనం ప్రకారం.. గత శుక్రవారం స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి అదానీ షేర్ వ్యాల్యూ పెరిగింది. అదే సమయంలో అదానీ ఆస్థుల విలువ 123.7 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో 121.7 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే ధనవంతుల జాబితాలో 5వ స్థానంలో ఉన్న ఇన్వెస్ట్ మెంట్ మాంత్రికుడు వారెన్ బఫెట్‌ను వెనక్కి నెట్టారు. 5వ స్థానాన్ని రెండేళ్ల క్రితం అదానీ ఆస్థుల విలువ 8.9 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే ఇంతింతై వటుడింతయై అన్న చందంగా అదానీ షేర్ వ్యాల్యూ దేశీయ స్టాక్ మార్కెట్ లో రాకెట్ వేగంతో దూసుకెళ్లాయి. అలా మార్చి 2021 నుంచి మార్చి 2022 నాటికి అదానీ గ్రూప్ స్టాక్స్ 90 బిలియన్ డాలర్లకు చేరింది. అంచనా ప్రకారం..భారత్‌లో అదానీ ఆస్థుల నికర విలువ 123.7 బిలియన్ డాలర్లతో దేశంలో అత్యంత ధనవంతుడిగా నిలబెట్టింది. ముఖేష్ అంబానీ నికర ఆస్థుల విలువ 104.7 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు. అదానీని క్రాస్ చేసేందుకు ముఖేష్ అంబానీకి 19 బిలియన్ డాలర్లకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇక యూఎస్ మార్కెట్లో వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్ షైర్ హాత్వే షేర్లు శుక్రవారం రోజు 2శాతం పడిపోవడంతో.. ప్రపంచంలో ధనవంతుల జాబితాలో 6వ స్థానానికి దిగజారినట్లు ఫోర్బ్స్ పేర్కొంది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ ట్రాకర్ ప్రకారం..ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా అదానీ కంటే నలుగురు మాత్రమే ధనవంతులు ఉన్నారు. మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్ 130.2 బిలియన్ డాలర్లు, ఫ్రెంచ్ లగ్జరీ గూడ్స్ కింగ్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ 167.9 బిలియన్ డాలర్లు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 170.2 బిలియన్ డాలర్లు..స్పేస్ఎక్స్ అధినేత ఎలన్ మస్క్' లు 269.7 బిలియన్ డాలర్లతో కొనసాగుతున్నారు. చదవండి👉 అదానీనా మజాకానా.. ముఖేష్ అంబానీకి భారీ షాక్..! -
ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ,అదానీ స్థానమేంటో తెలుసా ??
-
అదానీ జోరు.. ఎలన్‌మస్క్, జెఫ్‌బేజోస్ బేజారు !
న్యూఢిల్లీ: అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ సంపద సృష్టిలో ప్రపంచ దిగ్గజ వ్యాపారవేత్తలను మించిపోయారు. 2021లో ఏకంగా 49 బిలియన్ డాలర్లు (రూ.3.67 లక్షల కోట్లు) మేర తన సంపద విలువను పెంచుకున్నారు. ప్రపంచంలో టాప్–3 బిలియనీర్లు అయిన ఎలాన్ మస్క్ (టెస్లా), జెఫ్ బెజోస్ (అమెజాన్), బెర్నార్డ్ ఆర్నాల్ట్ (ఎల్వీఎంహెచ్) పెంచుకున్న సంపదతో పోలిస్తే.. అదానీ నెట్‌వర్త్ వృద్ధి గతేడాది ఎక్కువగా ఉందని ‘ఎం3ఎం హరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2022’ ప్రకటించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రమోటర్ ముకేశ్ అంబానీ మొత్తం 103 బిలియన్ డాలర్ల సంపదతో అత్యంత సంపన్న భారతీయునిగా ఈ జాబితాలో కొనసాగారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే జాబితాలో అంబానీకి 9వ స్థానం దక్కింది. వార్షికంగా చూస్తే 2021లో ఆయన సంపద 24 శాతం పెరిగింది. అంబానీ తర్వాత అదానీయే ఐశ్వర్యవంతుడిగా ఉన్నారు. ఆయన సంపద 2021లో 153 శాతం పెరిగి 81 బిలియన్ డాలర్లకు చేరింది. గత పదేళ్లలో అంబానీ నికర విలువ 400 శాతం పెరగ్గా.. ఇదే కాలంలో అదానీ సంపద 1,830 శాతం ఎగసింది. ప్రపంచ బిలియనీర్లలో అదానీకి 12వ ర్యాంకు లభించింది. హెచ్‌సీఎల్ కంపెనీ ప్రమోటర్ శివ్‌నాడార్ 28 బిలియన్ డాలర్ల సంపదతో మూడో స్థానంలో (ప్రపంచవ్యాప్తంగా 46వ ర్యాంకు) ఉంటే.. 26 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో సిరమ్ ఇనిస్టిట్యూట్ సైరస్ పూనవాలా, 25 బిలియన్ డాలర్ల విలువతో లక్ష్మీ నివాస్ మిట్టల్ నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు. ఐశ్వర్యం గణాంకాలు.. ► గౌతమ్ అదానీ సంపద 2020లో 17 బిలియన్ డాలర్లు ఉంటే.. రెన్యువబుల్ ఎనర్జీ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీని లిస్ట్ చేసిన తర్వాత ఆయన సంపద ఐదు రెట్లు పెరిగి 81 బిలియన్ డాలర్లకు చేరుకోవడం గమనార్హం. ► 2021లో ముకేశ్ అంబానీ సంపద 20 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. సంపదను పెంచుకునే విషయంలో ప్రపంచవ్యాప్తంగా 8వ స్థానంలో ముకేశ్ ఉన్నారు. ► నైకా ప్రమోటర్ ఫాల్గుణి నాయర్ 7.6 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో హరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2022లోకి కొత్తగా అడుగు పెట్టారు. ► గౌతమ్ అదానీ తర్వాత గతేడాది అత్యధికంగా సంపదను పెంచుకున్న వారిలో గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గే బ్రిన్, లగ్జరీ ఉత్పత్తుల సంస్థ ఎల్వీఎంహెచ్ వ్యవస్థాపకుడు, సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఉన్నారు. ► హెచ్‌సీఎల్ శివ్‌నాడార్ నెట్‌వర్త్ గత పదేళ్లలో 400 శాతం వృద్ధి చెందింది. ► 23 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో డీమార్ట్ అధిపతి రాధాకిషన్ దమానీ, ఇంతే నెట్‌వర్త్‌తో హిందుజా గ్రూపు ప్రమోటర్ ఎస్పీ హిందుజా జాబితాలో టాప్ 100లో నిలిచారు. ► చైనాలో 1,133 బిలియనీర్లు, అమెరికాలో 716 మంది, భారత్‌లో 215 మంది ఉన్నారు. ► ప్రపంచ జనాభాలో 18 శాతం భారత్‌లో ఉండగా, ప్రపంచ బిలియనీర్లలో 8 శాతం మందికి భారత్ కేంద్రంగా ఉంది. ► గత పదేళ్లలో భారత బిలియనీర్లు 700 బిలియన్ డాలర్ల మేర ఉమ్మడిగా సంపదను పెంచుకున్నారు. ఇది స్విట్జర్లాండ్ జీడీపీకి సమానం కాగా, యూఏఈ జీడీపీకి రెండింతలు. ► బిలియనీర్లకు ముంబై నివాస కేంద్రంగా ఉంది. ఇక్కడ 72 మంది ఉంటే, ఢిల్లీలో 51 మంది, బెంగళూరులో 28 మంది ఉన్నారు. ► గత రెండేళ్లలో బైజూ రవీంద్రన్, ఆయన కుటుంబం సంపద పరంగా 916 ర్యాంకులు మెరుగుపరుచుకుని జాబితాలో ప్రపంచవ్యాప్తంగా 1083వ ర్యాంకు సొంతం చేసుకుంది. వీరి సంపద 3.3 బిలియన్ డాలర్లు. ► భారత్‌లో 40 మంది గతేడాది బిలియన్ డాల ర్లు అంతకుమించి సంపద పెంచుకున్నారు. ► ఎం3ఎం హరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2022లో మొత్తం 69 దేశాల నుంచి 3,381 బిలియనీర్లకు చోటు లభించింది. అంతక్రితం జాబితా నుంచి చూస్తే 153 మంది కొత్తగా వచ్చి చేరారు. -
కరోనా షాక్, ఫోర్బ్స్ రిచ్ లిస్ట్ నుంచి డొనాల్డ్ ట్రంప్ ఔట్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ తగిలింది. అధ్యక్ష పదవిని కోల్పోయిన తర్వాత రియల్ ఎస్టేట్ దిగ్గజానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. 25 సంవత్సరాలలో తొలిసారిగా అమెరికాలోని అత్యంత ధనవంతుల ఫోర్బ్స్ 400 జాబితాలో స్థానాన్ని కోల్పోయాడు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం కోవిడ్-19 మహమ్మారి సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి అతను 600 మిలియన్ డాలర్లు సంపదను కోల్పోయాడు. ట్రంప్ సంపద విలువ 2.5 బిలియన్ డాలర్లు. ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకోవాలంటే మరో 400 మిలియన్ డాలర్లు అవసరమని ఫోర్బ్స్ వ్యాఖ్యానించింది. (Yesudasan: ప్రముఖ కార్టూనిస్ట్ కన్నుమూత, సీఎం సంతాపం) గత ఏడాది చివర్లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోబైడెన్ చేతిలో ఓటమి పాలైన ట్రంప్ ఆస్తుల విలువ ఏమాత్రం పెరగలేదు. ఫలితంగా అమెరికాలోని 400 మంది అత్యంత సంపన్నుల జాబితాలో డొనాల్డ్ ట్రంప్‌కు చోటు దక్కలేదు. తాజాగా ‘ఫోర్బ్స్ 400’ జాబితాలో ట్రంప్ చోటు కోల్పోవడం గత 25 ఏళ్లలో ఇదే తొలిసారని ఫోర్బ్స్ వెల్లడించింది. గత ఏడాదికాలంలో ట్రంప్ మొత్తం ఆస్తుల విలువ 2.5 బిల్లియన్ డాలర్లుగా ఉండగా, ప్రస్తుత గణాంకాల ప్రకారం నికర విలువ యధాతథంగా ఉన్నట్లు తెలిపింది. -
ఒక్క ఇన్‌స్టా పోస్ట్‌కు ప్రియాంక, కోహ్లి ఎంత తీసుకుంటున్నారో తెలుసా?
సెలబ్రిటీలకు ఆదాయ మార్గాలు అనేకం.. సినిమా స్టార్లు, క్రీడా ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్ అందరూ తమ వృత్తులతో సమానంగా ఇతర మార్గాల ద్వారా లెక్కలేనంత సంపాదనను ఆర్జిస్తుంటారు. యాడ్స్, బిజినెస్, ప్రయోషన్స్తో కోట్లలో డబ్బులు కూడగట్టుకుంటారు. సెలబ్రిటీల ఫాలోవర్స్‌ను బట్టి వాళ్ల స్టేటస్ అంతకంతకూ పెరుగుతుంటుంది. అయితే సెలబ్రిటీలు ఇన్‌స్టాగ్రామ్‌లాంటి సోషల్ మీడియా వేదికలపై చేసే పోస్ట్‌లతో కూడా భారీగా సంపాదిస్తారని మీకు తెలుసా? అవును తాజాగా హాపర్‌హెచ్‌క్యూ 2021 ఇన్స్టాగ్రామ్ సంపన్నుల జాబితాను విడుదల చేసింది. ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్లో అత్యధిక సంపాదన అందుకునే సెలబ్రిటీలెవరో ఇక్కడ తెలుసుకుందాం. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రోనాల్డో ఈ జాబితాలో టాప్‌లో నిలిచారు. ప్రపంచంలోనే అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న పోర్చుగల్ ఆటగాడు ఒక్కో ప్రమోషనల్ పోస్ట్‌కు 1,604,000 డాలర్లు (దాదాపు 11.9 కోట్లు) వసూలు చేస్తున్నాడు. గత సంవత్సరం తొలి స్థానంలో ఉన్న డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ స్టార్ డ్వేన్ జాన్సన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇతని తర్వాత డ్వేన్ అరియానా గ్రాండే, కైలీ జెన్నర్, సెలెనా గోమెజ్ 3,4,5 స్థానంలో ఉన్నారు. చదవండి: రాజమౌళికి చేదు అనుభవం.. ట్వీట్ వైరల్ విరాట్‌కోహ్లి ఇక ఈ లిస్ట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్‌కోహ్లి19 స్థానంలో నిలిచాడు. ఇండియాలోనే అత్యధిక మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్న విరాట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్టు ద్వారా 6,80.000 డాలర్లు(దాదాపు5.08 కోట్లు) అందుకుంటున్నాడు. టాప్ 20లో ఉన్న ఏకైక ఇండియన్ సెలబ్రిటీ కూడా కోహ్లినే. ప్రియాంకా చోప్రా ఇక విరాట్ తర్వాత గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా 27వ స్థానంలో నిలిచింది. ఆమె ఇన్‌స్టాలో ఒక్కో పోస్ట్ ద్వారా 4,03,000 డాలర్లు(దాదాపు మూడు కోట్లు) సంపాదిస్తోంది. కాగా గతేడాది 19వ స్థానంలో ఉన్న ప్రియాంక ఈ ఏడాది 27 వ స్థానానికి పడిపోయారు. అయితే ప్రియాంక ఆదాయం గతేడాదితో పోలీస్తే పెరిగింది. మొత్తం 395 మంది సెలబ్రిటీలు ఉన్న లిస్ట్‌లో భారత్ నుంచి చోటు దక్కించుకున్న వారు వీరిద్దరే. -
కోవిడ్-19 వెంటాడినా తరగని కుబేరుల సంపద
ముంబై : భారత్‌లో వందమందితో కూడిన అత్యంత సంపన్నల జాబితాలో రిలయన్స్ ఇండస్ర్టీస్ అధిపతి, కార్పొరేట్ దిగ్గజం ముఖేష్ అంబానీ మరోసారి అగ్రస్ధానంలో నిలిచారు. 8,800 కోట్ల డాలర్ల సంపదతో ముఖేష్ 2020 సంవత్సరానికి ఫోర్బ్స్ ఇండియా జాబితాలో నెంబర్ వన్ ర్యాంక్‌ను మళ్లీ నిలుపుకున్నారు. ఈ జాబితాలో ముఖేష్ అంబానీ గత 13 సంవత్సరాలుగా మొదటి ర్యాంక్‌లో కొనసాగడం గమనార్హం. ఇక అదానీ గ్రూపు అధినేత గౌతం అదానీ 2500 కోట్ల డాలర్ల సంపదతో ఫోర్భ్స్ ఇండియా జాబితాలో ముఖేష్ తర్వాతి స్ధానంలో నిలిచారు. ఈ ఏడాది ముఖేష్ అంబానీ సంపదకు తాజాగా 375 కోట్ల ఆస్తులు అదనంగా తోడయ్యాయని ఫోర్బ్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. కోవిడ్-19 నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది కుదేలైనా భారత్‌లో అత్యంత కుబేరులు తమ సంపదను కాపాడుకున్నారని ఫోర్భ్స్ వ్యాఖ్యానించింది. ముఖేష్ అంబానీ వరుసగా 13వ సారి భారత్‌లో అత్యంత సంపన్నుడిగా నిలిచారని, వ్యాక్సిన్ తయారీదారు సైరస్ పూనావాలా ఆరో ర్యాంక్‌ను సాధించి టాప్ 10లో చోటు సంపాదించారని నివేదిక వెల్లడించింది. కరోనా వైరస్ కట్టడికి కీలకమైన మందులు, వ్యాక్సిన్ల తయారీలో నిమగ్నమైన ఫార్మా దిగ్గజాల సంపద అనూహ్యంగా పెరిగింది. బయోకాన్ కిరణ్ మజుందార్ షా సంపద శాతాల ప్రాతిపదికన అత్యధికంగా ఎగిసిందని, కొద్దిమంది బిలియనీర్ల సంపద మాత్రం గత ఏడాదితో పోలిస్తే 2020లో తగ్గిందని ఈ నివేదిక పేర్కొంది. చదవండి : ముకేశ్ అంబానీ ఖాతాలో మరో రికార్డు -
మళ్లీ ము‘క్యాష్’ కింగ్..!
ముంబై: భారత్‌లో అత్యంత సంపన్నునిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ కొనసాగుతున్నారు. ఆయన సంపద రూ.3,80,700 కోట్లు. తాజా ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా 2019 రిచ్ లిస్ట్ ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ జాబితాలో వరుసగా ఎనిమిదేళ్ల నుంచీ ఆయనదే అగ్రస్థానం. ఇక ఈ జాబితాలో రెండవ స్థానంలో లండన్ కేంద్రంగా ఉంటున్న ఎస్పీ హిందూజా అండ్ ఫ్యామిలీ నిలిచింది. వీరి సంపద రూ.1,86,500 కోట్లు. రూ.1,17,100 కోట్ల విలువతో విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ మూడవ స్థానంలో ఉన్నారు. తాజా ఆవిష్కృత జాబితాలో ముఖ్యాంశాలు చూస్తే... ► రూ.1,000 కోట్లు పైబడిన సంపద ఉన్న భారతీయుల సంఖ్య 2019లో 953కు పెరిగింది. 2018లో ఈ సంఖ్య 831 మాత్రమే. ► అమెరికా డాలర్ల రూపంలో చూస్తే, బిలియనీర్ల సంఖ్య 141 నుంచి 138కి పడింది. డాలరుతో రూపాయి విలువ లెక్కన రూ.7,000 కోట్ల సంపద పైబడిన వారిని బిలియనీర్లుగా పరిగణిస్తారు. ► రూ.1,000 కోట్లు పైబడిన మొత్తం 953 మందిని తీసుకుంటే, వీరిలో మొదటి 25 మంది మొత్తం సంపద స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 10 శాతం. మొత్తం అందరినీ పరిగణనలోకి తీసుకుంటే మాత్రం జీడీపీలో ఈ విలువ 27 శాతం. ► సంపన్నుల సంపద 2018తో పోల్చితే 2% పెరిగింది. 344 మంది వ్యక్తుల సంపద తగ్గింది. ► మొత్తం సంపన్నుల్లో 246 మందితో (జాబితాలో 26%) ముంబై టాప్‌లో ఉంది. 2, 3 స్థానాల్లో న్యూఢిల్లీ(175), బెంగళూరు(77) ఉన్నాయి. ► సంపన్నులకు సంబంధించి 82 మంది ప్రవాస భారతీయులను తీసుకుంటే, వారిలో 76 మంది స్వశక్తితో పైకి వచ్చినవారు ఉన్నారు. ఎన్ఆర్ఐలకు ఈ విషయంలో అత్యంత ప్రాధాన్యతా దేశంగా అమెరికా ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, బ్రిటన్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ► స్వశక్తితో సంపన్నులైన వారిలో అత్యంత యువకుడు రితేష్ అగర్వాల్ (25). ఓయో అధిపతి∙అగర్వాల్ సంపద రూ.7,500 కోట్లు. ► జాబితాలో 152 మంది మహిళలు కూడా ఉన్నారు. వీరి సగటు వయసు 56 సంవత్సరాలు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రోష్నీ నాడార్ (37) మొదటి స్థానంలో నిలిచారు. భారత్‌లో స్వయం శక్తిగా సంపన్నురాలిగా ఎదిగిన మహిళల జాబితాలో బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా ఉన్నారు. ఆమె సంపద రూ.18,500 కోట్లు. వృద్ధిలో వీరి పాత్ర కీలకం... ప్రపంచ వృద్ధిలో సంపద సృష్టికర్తలు కీలకపాత్ర పోషిస్తున్నారు. భారత్ ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి కేంద్రం వృద్ధి వ్యూహాలు రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఐదేళ్లలో భారత్ సంపన్నుల జాబితా మూడింతలు పెరుగుతుందని భావిస్తున్నాం. –అనాన్ రెహ్మాన్ జునైడ్, హురున్ రిపోర్ట్ ఇండియా ఎండీ, చీఫ్ రెసెర్చర్ వేగం పుంజుకుంటున్న భారత్ భారత్ వృద్ధి వేగం పుంజుకుంటోంది. దీనికి యువ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల మద్దతు ఎంతో ఉంది. దేశంలో సంపద నిర్వహణ సామర్థ్యం ఎంతో మెరుగుపడుతోంది. – యతిన్ షా, ఐఐఎఫ్ఎల్ వెల్త్ మేనేజ్మెంట్ కో–ఫౌండర్ తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు బిలియనీర్లు హురున్ భారతీయ కుబేరుల జాబితా (బిలియనీర్లు)లో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు చోటు దక్కించుకున్నారు. అరబిందో ఫార్మా చైర్మన్ పీవీ రాంప్రసాద్ రెడ్డి రూ.14,800 కోట్ల సంపదతో దేశంలోని 100 మంది కుబేరుల్లో 51వ స్థానంలో నిలిచారు. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(ఎంఈఐఎల్) చైర్మన్ పి.పిచ్చిరెడ్డి 57వ స్థానంలో, ఎంఈఐఎల్ ఎండీ పీవీ కృష్ణారెడ్డి 63వ ర్యాంకును చేజిక్కించుకున్నారు. జాబితాలో దివి సత్చంద్ర కిరణ్ 83వ స్థానం, నీలిమ మోటపర్తి 89వ స్థానాన్ని దక్కించుకున్నారు. పి.పిచ్చిరెడ్డి, పీవీ కృష్ణారెడ్డి కాగా, దేశంలోని టాప్–10 మహిళా కుబేరుల జాబితాలో దివీస్ ల్యాబ్స్‌కు చెందిన నీలిమ 8వ ర్యాంకులో నిలిచారు. ఇక స్వశక్తితో వ్యాపారవేత్తలుగా ఎదిగిన అత్యంత పిన్న వయస్కుల్లో(40 ఏళ్ల లోపు) విజయవాడకు చెందిన 33 ఏళ్ల శ్రీహర్ష మాజేటి చోటు సంపాదించారు. స్విగ్గీ సహ ప్రమోటర్ శ్రీహర్ష సంపద విలువను హురున్ రూ.1,400 కోట్లుగా లెక్కగట్టింది. మొత్తం సంపన్నుల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు 68 మంది,(గతేడాది 49), ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు 9 మంది(గతేడాది 6) ఉన్నట్లు హురున్ వెల్లడించింది. గోపిచంద్ హిందూజా, శ్రీచంద్ హిందూజా, అజీం ప్రేమ్‌జీ రాంప్రసాద్‌రెడ్డి, దివి సత్చంద్ర కిరణ్, నీలిమ, శ్రీహర్ష మాజేటి -
వందలో ఒక్కరు!
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ హీరోయిన్లలో ప్రియాంకా చోప్రా ఒకరు. ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు దాదాపు 4 కోట్ల 30 లక్షల ఫాలోయర్స్ ఉన్నారు. ట్విటర్లో దాదాపు 2 కోట్ల 50 లక్షల ఫాలోయర్స్ ఉన్నారు. ఇప్పుడీ సంగతి ఎందుకంటే.. సెలబ్రీటీలు తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వాటికి ఎంత చార్జ్ చేస్తారనే అంశం ఆధారంగా యూఎస్‌కు చెందిన ఓ కంపెనీ విడుదల చేసిన ‘ఇన్స్టాగ్రామ్ రిచ్ లిస్ట్’లో ప్రియాంకా చోప్రా 19వ స్థానంలో నిలిచారు. ఏదైనా ప్రొడక్ట్‌ను తన ఇన్‌స్టా ఖాతా ద్వారా ప్రమోట్ చేయడానికి ప్రియాంకా చోప్రా దాదాపు కోటీ 86 లక్షల 80 వేల రూపాయలు తీసుకుంటారట. ఆ కంపెనీ విడుదల చేసిన వందమంది జాబితాలో ఉన్న ప్రముఖుల్లో అమెరికన్ మోడల్ కైలీ జెన్నర్ తొలి స్థానంలో నిలిచారు. అలాగే ఈ జాబితాలో చోటు సంపాదించిన ఒకేఒక్క బాలీవుడ్ నటి కూడా ప్రియాంకే కావడం విశేషం. అలాగే ఇండియా తరఫున విరాట్ కోహ్లీ 23వ స్థానంలో నిలవడం విశేషం. -
యుకెలో అత్యంత సంపన్నుల జాబితాలో హిందుజా సోదరులు
-
ఫోర్బ్స్ కుబేరుల్లో మళ్లీ ముకేశ్ టాప్
సంపన్న భారతీయుల్లో వరుసగా తొమ్మిదోసారి నంబర్‌వన్ - టాప్ 100లో నలుగురే మహిళలు - మొత్తం సంపన్నుల సంపద - 345 బిలియన్ డాలర్లు సింగపూర్: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వరుసగా తొమ్మిదోసారి భారత్‌లోనే అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నారు. 18.9 బిలియన్ డాలర్ల సంపదతో నంబర్‌వన్‌గా నిల్చారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన 100 మంది భారత కుబేరుల జాబితాలో 18 బిలియన్ డాలర్ల సంపదతో సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వీ రెండో స్థానంలో, 15.9 బిలియన్ డాలర్లతో విప్రో చైర్మన్ అజీం ప్రేమ్‌జీ మూడో స్థానంలో నిల్చారు. ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ 2.9 బిలియన్ డాలర్లతో 29వ స్థానంలో ఉన్నారు. జాబితాలోని 10 మంది సంపన్నుల సంపద ఒక్కొక్కరిది ఏడాది వ్యవధిలో బిలియన్ డాలర్ల మేర కరిగిపోయింది. భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 7 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసిన ఫోర్బ్స్.. స్టాక్ మార్కెట్లు గతేడాదితో పోలిస్తే 5 శాతం క్షీణించాయని, రూపాయి 9 శాతం మేర పతనమైందని పేర్కొంది. ఇలాంటి పరిణామాల నడుమ సంపన్నుల సంపద పెద్దగా పెరగలేదని తెలిపింది. టాప్ 100 కుబేరుల సంపద ఈసారి కూడా దాదాపు గతేడాది స్థాయిలోనే 345 బిలియన్ డాలర్ల మేర ఉందని ఫోర్బ్స్ వివరించింది. మహిళల్లో సావిత్రి జిందాల్ టాప్ .. టాప్ 100 సంపన్నుల్లో కేవలం నలుగురు మహిళలే ఉన్నారు. ఓపీ జిందాల్ గ్రూప్ చైర్పర్సన్ సావిత్రి జిందాల్ (23వ ర్యాంకు)లో నిలిచారు. యూఎస్వీ ఫార్మా చైర్పర్సన్ లీనా తివారీ (54 ర్యాంకు) , హావెల్స్ వ్యవస్థాపకుడు కీమత్ రాయ్ గుప్తా సతీమణి వినోద్ గుప్తా (74వ ర్యాంకు), బెనెట్..కోల్మన్కి చెందిన ఇందు జైన్ (57వ ర్యాంకు) ఈ జాబితాలో ఉన్నారు. వీరందరి సంపద 9.2 బిలియన్ డాలర్లు. మహిళల్లో 3.8 బిలియన్ డాలర్ల సంపదతో సావిత్రి జిందాల్ టాప్‌లో ఉన్నారు. లిస్టులో 12 కొత్త ముఖాలు.. ఈసారి జాబితాలో ఆన్లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు, ఇండిగో ఎయిర్‌లైన్ సహ వ్యవస్థాపకుడు రాకేశ్ గంగ్వాల్ సహా 12 మంది సంపన్నులు కొత్తగా చేరారు. టీకాల తయారీ సంస్థ సీరమ్ అధినేత సైరస్ పూనావాలా సంపద అందరికన్నా అత్యధికంగా పెరిగింది. 6.2 బిలియన్ డాలర్ల నుంచి 7.9 బిలియన్ డాలర్లకు చేరింది. కనీసం 1.1 బిలియన్ డాలర్ల సంపద ఉన్న వారు ఈ ఏడాది జాబితాలో చోటు దక్కించుకున్నారు. జాబితాలో తెలుగు దిగ్గజాలు.. తెలుగువారిలో అరబిందో ఫార్మా సహ వ్యవస్థాపకుడు పీవీ రామ్‌ప్రసాద్ రెడ్డి 2.8 బిలియన్ డాలర్ల సంపదతో 30వ స్థానంలోఉండగా, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ వ్యవస్థాపకుల కుటుంబం 2.6 బిలియన్ డాలర్లతో 33వ స్థానంలో నిల్చింది. దివీస్ ల్యాబ్స్ చైర్మన్ మురళీ దివి 2.3 బిలియన్ డాలర్లతో 42వ స్థానంలో ఉన్నారు.