
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ తగిలింది. అధ్యక్ష పదవిని కోల్పోయిన తర్వాత రియల్ ఎస్టేట్ దిగ్గజానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. 25 సంవత్సరాలలో తొలిసారిగా అమెరికాలోని అత్యంత ధనవంతుల ఫోర్బ్స్ 400 జాబితాలో స్థానాన్ని కోల్పోయాడు.
ఫోర్బ్స్ నివేదిక ప్రకారం కోవిడ్-19 మహమ్మారి సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి అతను 600 మిలియన్ డాలర్లు సంపదను కోల్పోయాడు. ట్రంప్ సంపద విలువ 2.5 బిలియన్ డాలర్లు. ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకోవాలంటే మరో 400 మిలియన్ డాలర్లు అవసరమని ఫోర్బ్స్ వ్యాఖ్యానించింది. (Yesudasan: ప్రముఖ కార్టూనిస్ట్ కన్నుమూత, సీఎం సంతాపం)
గత ఏడాది చివర్లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోబైడెన్ చేతిలో ఓటమి పాలైన ట్రంప్ ఆస్తుల విలువ ఏమాత్రం పెరగలేదు. ఫలితంగా అమెరికాలోని 400 మంది అత్యంత సంపన్నుల జాబితాలో డొనాల్డ్ ట్రంప్‌కు చోటు దక్కలేదు. తాజాగా ‘ఫోర్బ్స్ 400’ జాబితాలో ట్రంప్ చోటు కోల్పోవడం గత 25 ఏళ్లలో ఇదే తొలిసారని ఫోర్బ్స్ వెల్లడించింది. గత ఏడాదికాలంలో ట్రంప్ మొత్తం ఆస్తుల విలువ 2.5 బిల్లియన్ డాలర్లుగా ఉండగా, ప్రస్తుత గణాంకాల ప్రకారం నికర విలువ యధాతథంగా ఉన్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment